బడ్జెట్‌లో రెడ్‌మీ 5జీ మొబైల్స్ విడుదల | Redmi Note 9 5G Series Mobiles Launched in China | Sakshi
Sakshi News home page

బడ్జెట్ లో 5జీ మొబైల్స్ ను తీసుకొచ్చిన రెడ్‌మీ‌

Published Fri, Nov 27 2020 1:19 PM | Last Updated on Fri, Nov 27 2020 1:42 PM

Redmi Note 9 5G Series Mobiles Launched in China - Sakshi

మొబైల్ మార్కెట్లోకి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయ్యింది. రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 26న చైనాలో విడుదల చేసింది. చైనాలో లాంచ్ ఈవెంట్ లో భాగంగా రెడ్‌మి నోట్ 9 4జీ, రెడ్‌మి నోట్ 9 5జీ, శక్తివంతమైన రెడ్‌మి నోట్ 9 5జీ ప్రో స్మార్ట్‌ఫోన్ల‌ను విడుదల చేసింది. ఈ మూడింటిలో ప్రో మోడల్ ను రిటైల్ మార్కెట్ లో 1,600 యువాన్ల(చైనా కరెన్సీ)కు తీసుకొచ్చింది. అలాగే రెడ్‌మి నోట్ 9 5జీని 1,300 యువాన్లకు, రెడ్‌మి నోట్ 9 5జీ 1,000 యువాన్ల ధరకు చైనాలో అమ్ముతుంది. డిసెంబర్ 1 నుండి కొనుగోలుకు ఇవి అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. కానీ భారత్ లో ఎప్పుడు విడుదల చేస్తారో ఇంకా ప్రకటించలేదు. (చదవండి: ఇండియన్ పబ్జిలో 3 కొత్త ఫీచర్స్)

రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్ 

రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్ పై పని చేయనుంది. 1080p రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ తో 6.67-అంగుళాల డిస్ప్లేని కలిగిఉంది. ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఐసోసెల్ హెచ్‌ఎం 2 సెన్సార్ తో నిర్మించబడింది. ఇతర కెమెరాల విషయానికి వస్తే 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2-కెమెరా మాక్రో షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారంగా పనిచేసే MIUI 12పై నడుస్తుంది. రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4,820ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది కేవలం 58 నిమిషాల్లో 0% నుండి 100% వరకు ఛార్జ్ చేస్తుంది. రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర యువాన్ 1,599(సుమారు రూ.17,960), 8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర యువాన్ 1,799(సుమారు రూ .20,210), చివరగా, 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర యువాన్ 1,999(సుమారు రూ.22,450). 

రెడ్‌మి నోట్ 9 5 జీ స్పెసిఫికేషన్స్ 
రెడ్‌మి నోట్ 9 5 జి‌ మీడియాటెక్ డైమెన్సిటీ 800 యు ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. రెడ్‌మి నోట్ 8లో కనిపించే చిప్‌సెట్ కంటే 800యు రెండు రెట్లు వేగంగా పనిచేస్తుందని షియోమి పేర్కొంది. రెడ్‌మి నోట్ 9 5 జీలో 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఎల్‌సిడి ప్యానెల్ డిస్ ప్లేను అందించారు. ఈ ప్యానెల్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. కెమెరాల విషయానికొస్తే, 48-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంది. 8మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. దీనిలో సెల్ఫీ కోసం 13 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు. ఈ ఫోన్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది, అలాగే 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారంగా పనిచేసే MIUI 12పై నడుస్తుంది. రెడ్‌మి నోట్ 9 5 జీ  6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర యువాన్ 1,299 (సుమారు రూ.14,590), 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర యువాన్1,499 (సుమారు రూ. 16,840), 8 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర యువాన్ 1,699 (సుమారు రూ.19,000). (చదవండి: బడ్జెట్‌లో మోటో 5జీ ఫోన్)

రెడ్‌మి నోట్ 9 4 జీ స్పెసిఫికేషన్స్
రెడ్‌మి నోట్ 9 4 జీ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.53-అంగుళాల ఎల్‌సిడి డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది అడ్రినో 610 జిపియుతో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారంగా పనిచేసే MIUI 12పై నడుస్తుంది. ఇది 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇందులో 120 డిగ్రీల సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్, థర్డ్ డెప్త్ సెన్సార్‌తో కూడిన 48 ఎంపి కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. ఈ మోడల్‌లో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ మరియు స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. రెడ్‌మి నోట్ 9 4 జీ ధర 4 జీబీ ర్యామ్/128 జిబి స్టోరేజ్ వేరియంట్‌కు యువాన్ 999 (సుమారు రూ. 11,220), 6 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు యువాన్ 1,099 (సుమారు రూ.12,340),  8జీబీ RAM / 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు యువాన్ 1,299 (సుమారు రూ. 14,560), 8జీబీ ర్యామ్/ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ కోసం యువాన్ 1,499 (సుమారు రూ. 16,830) వద్ద లభిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement