జియో ఫోన్‌పై మరో అంచనా చక్కర్లు
ముంబై: రిలయన్స్ జియో మోస్ట్ ఎవైటెడ్ 4జీ ఫీచర్‌కు సంబంధించి ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ చక‍్కర్లు కొడుతోంది. సె సెప్టెంబర్ నుంచి జియో వినియోగదారుల చేతుల్లో మెరవనున్న జియో 4 ఫీచర్ ఫోన్ సెక్యూరిటీ డిపాజిట్‌లో నిర్దేశిత కాలం కంటే ముందుగానే పాక్షికంగా చెల్లించనుందట జియో. ఈ పథకం నియమ నిబంధనలను త్వరలోనే ప్రకటించనున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.
ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం జియో 4 జీ పీచర్ ఫోన్ కొనుగోలు సందర్భంగా కస్టమర్లు చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్ మూడు సంవత్సరాల కంటే ముందే చెల్లించేందుకు రిలయన్స్ జియో యోచిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయనుంది.
కాగా ఇండియాస్ స్మార్ట్‌ఫోన్‌గా పిలుస్తున్న, పూర్తిగా ఉచితమైన దీనికోసం వినియోగదారులు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 1500 చెల్లించాల్సి ఉంటుంది. మూడు సంవత్సరాల తరువాత ఈ నగదును కస్టమర్లకు పూర్తిగా వెనక్కి చెల్లించనున్నట్టు జియో ఫోన్ ఆవిష్కరణ సందర్భంగా రిలయన్స్ అధిపతి ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఈ డివైస్ ప్రీ-బుకింగ్లు ఆగస్టు 24 న ప్రారంభమవుతాయి.
మరోవైపు బహుళ-సిమ్ ఫోన్ల ప్రాబల్యం ఉన్న భారతదేశంలో ఈ ఫోన్ల అమ్మకాల్లో జియో అంచనాలను అందుకోవడం అంత ఈజీకాదని జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది. మల్టీ సిమ్, ప్రీ పెయిడ్ సిమ్‌ల వృద్ధి నెలవారీగా 5శాతంగా ఉందని వాదిస్తోంది.