
మంచు విష్ణు ప్రశ్నించడానికి రెడీ అయ్యారు. ఓటర్‌గా తనకు ఫైట్ చేసే హక్కు ఉందంటు న్నారు. విష్ణు హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘ఓటర్’. తమిళంలో ‘కురళ్ 388’ పేరుతో తెరకెక్కుతోంది. జీఎస్ కార్తీక్ దర్శకత్వంలో జాన్ సుధీర్‌కుమార్ పూదోట నిర్మిస్తున్నారు. నిన్న విష్ణు బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇటు తెలుగు అటు తమిళంలో ఫస్ట్ లుక్‌కి విశేష స్పందన లభిస్తోందని నిర్మాతలు తెలిపారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘తమిళ తెరకు విష్ణు పరిచయం కావడానికి ఇది సరైన సినిమా. ఎన్నికలప్పుడు రాజకీయ నాయకులకు ఎంతో ముఖ్యమైన ఓటర్ ఆ తర్వాత నిర్లక్ష్యానికి గురవుతున్నాడు. ఓటర్ పవర్ ఏంటో చూపించే సినిమా ఇది. యూనివర్శల్ పాయింట్ కావడంతో తమిళంలోనూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్‌లో సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.