నాయకుడు పనిచేయకపోతే! | voter movie released on june 21 | Sakshi
Sakshi News home page

నాయకుడు పనిచేయకపోతే!

Published Thu, Jun 13 2019 2:25 AM | Last Updated on Thu, Jun 13 2019 5:03 AM

voter movie released on june 21 - Sakshi

విష్ణు

ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ముఖ్యమైనది. అటువంటి ఓటు విలువను తెలియజేసేలా రూపొందిన చిత్రం ‘ఓటర్‌’. విష్ణు, సురభి హీరోహీరోయిన్లుగా నటించారు. రామా రీల్స్‌ పతాకంపై జాన్‌ సుధీర్‌ పూదోట నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్‌ దర్శకత్వం వహించారు. సార్థక్‌ మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేయనుంది.

‘‘పదవిలో ఉన్న నాయకుడు సరిగా పని చేయకపోతే అతనితో ఎలా పనులు చేయించుకోవాలో తెలిపే చిత్రం ఇది. ఓటు హక్కు, ఓటర్‌ విలువను తెలియజేస్తూనే, ఈ చిత్రాన్ని పొలిటికల్‌ డ్రామాగా కార్తీక్‌ బాగా తెరకెక్కించాడు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన సార్థక్‌ మూవీ సంస్థ మా సినిమాను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి ఎస్‌ఎస్‌. తమన్‌ స్వరకర్త. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిరణ్‌ తనమాల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement