voter
-
టోటలైజర్ విధానం తేవాలి
న్యూఢిల్లీ: ఓటరు గోప్యతను కాపాడేందుకు టోటలైజర్ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని పదవీ విరమణ చేస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ చెప్పారు. దీనివల్ల, బూత్‌ల వారీ ఓటింగ్ సరళిని బయటకు తెలియదని చెప్పారు. ప్రవాస భారతీయులు స్థానికంగానే ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎన్నికల సమయంలో కమిషన్‌పై తప్పుదోవ పట్టించే ఆరోపణల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ నెల 18వ తేదీన పదవీ విరమణ చేయనున్న సీఈసీ రాజీవ్ కుమార్ సోమవారం జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో మాట్లాడారు. ‘ప్రస్తుతం ప్రతి ఈవీఎం నుంచి పోలైన ఓట్లను సేకరిస్తున్నాం. ఇందులో ఒక్కో అభ్యర్థికీ పడిన ఓట్లను కలిపి ఫలితాలను ప్రకటిస్తున్నాం. ఇందులో లోపమేమంటే..ఏ ప్రాంతం నుంచి తమకు ఎన్ని ఓట్లు పడ్డాయనే వివరాలు అభ్యర్థులకు తెలిసిపోతాయి. ఎన్నికల అనంతర హింసకు ఇదే కారణంగా మారుతోంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓటర్లను వేధించడం, అభివృద్ధి కార్యక్రమాల నుంచి వారిని దూరంగా పెట్టడం వంటి చర్యలకు దిగుతున్నారు’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘దీనిని నివారించడానికి టోటలైజర్ విధానాన్ని తేవాలి. దీనిని ఇప్పటికే ఎన్నికల సంఘం అభివృద్ధి పరిచింది. ఇందులో భాగంగా అభ్యర్థులకు పోలింగ్ బూ త్ల వారీగా పడిన ఓట్లను వెల్లడించబోరు. రాజకీ య ఏకాభిప్రాయంతో ఈ విధానాన్ని అమ ల్లోకి తేవాలి. ఓటరు గోప్యతను కాపాడేందుకు, ఓటింగ్ ప్రక్రియ సమగ్రతను పెంచేందుకు ఇది ఎంతో అవసరమని నమ్ముతున్నా’అని ఆయన అన్నారు. రిమోట్ ఓటింగ్ విధానం రావాలికోట్లాది మంది వలస కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు రిమోట్ ఓటింగ్ విధానాన్ని తప్పనిసరిగా అందుబాటులోకి తేవాలన్నారు. దొంగ ఓట్లు, ఒకే వ్యక్తి పలుమార్లు ఓటేసే వ్యవహారాలను సమర్థంగా అడ్డుకునేందుకు పోలింగ్ బూత్‌లలో బయోమెట్రిక్ ధ్రువీకరణను ప్రవేశపెట్టాలని సూచించారు. రాజకీయ పార్టీలు నిధులు, ఖర్చు వివరాలను ఆన్లైన్లో వెల్లడించే ప్రక్రియ మొదలైందన్నారు. ఆర్థిక పారదర్శకత, విశ్లేషణల కోసం ఈ ప్రక్రియను తప్పనిసరి చేయాలని సూచించారు. ఆరోపణలు ఆందోళనకరంఓటర్లు ఉత్సాహంగా, పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న చోట కూడా ఫలితాల అనంతరం రాజకీయ పార్టీలు ఈసీ, అధికారులపై సందేహాలను వ్యక్తం చేయడం ఖండించాల్సిన అంశమని రాజీవ్ కుమార్ చెప్పారు. ‘పోలింగ్ లేదా కౌంటింగ్ ముమ్మరంగా జరుగుతున్న వేళ తప్పుడు ఆరోపణలు, వదంతులు మీడియాతోపాటు సామాజిక మాధ్యమ వేదికలపై ఒక్కసారిగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించడం, వారిని అయోమయానికి గురి చేయడమే వీటి లక్ష్యం. అయితే, ఎన్నికల సమగ్రతను కాపాడటం, ప్రశాంతంగా ఎన్నికలు జరపడాన్నే లక్ష్యంగా పెట్టుకున్న ఈసీ ఇటువంటి వాటిని పట్టించుకోలేదు’అని అన్నారు. ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేని వారు ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేసే ధోరణులు పెరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేసే వారిని ప్రజలు నమ్మబోరని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి అంశాలపై ఎన్నికల కమిషన్ సంయమనం పాటిస్తోందన్నారు. ఎన్నికల కమిషన్ అధికార బీజేపీకి కొమ్ముకాస్తోందని, ఓటింగ్‌లో అవకతవకలపై తాము చేసే ఫిర్యాదులను పట్టించుకోవడం లేదంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నియంత్రణలు లేని సోషల్ మీడియా విశ్లేషణలు, అంచనాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియకు తీవ్ర ప్రమాదకరంగా మారాయంటూ రాజీవ్‌కుమార్.. ఇవి చేసే నిరాధార, ఉద్దేశపూర్వక విమర్శలను ఎదుర్కోవడానికి ఎన్నికల సంఘం సామర్థ్యాలను పెంపొందించుకోవాలని నొక్కి చెప్పారు. -
పారదర్శకతకు పాతర
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వ్యవహారశైలిపై, దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియపై అనేక అనుమానాలు తలెత్తుతున్న వేళ... అవి మరింత పెరిగే ప్రమాదం తాజాగా తలెత్తింది. ఎన్నికల నిర్వహణ నిబంధనల్ని మారుస్తున్నట్టు కేంద్ర సర్కార్ శుక్రవారం ప్రకటించింది. నిబంధనల్లో సరికొత్త సవరణ వల్ల ఇకపై ఎన్నికలకు సంబంధించిన అన్ని పత్రాలనూ పరిశీలించే అవకాశం ప్రజలకు ఉండదు. సీసీ టీవీ, వెబ్‌కాస్టింగ్ ఫుటేజ్, అభ్యర్థుల వీడియో రికార్డింగుల లాంటి ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు ఇకపై అందుబాటులో ఉండవు. అదేమంటే, అలాంటివన్నిటినీ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచితే వాటిని దుర్వినియోగం చేస్తారనీ, అసలు ఓటరు భద్రతకే ప్రమాదకరమనీ పాలక వర్గాల వాదన. సోషల్ మీడియా యుగంలో, పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్ల దృశ్యాలు విస్తృతంగా అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో అది వట్టి డొల్ల వాదనే. ఎన్నికల నిబంధనల్లో మార్పుపై దేశ వ్యాప్తంగా అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నది అందుకే!‘‘ఎన్నికకు సంబంధించిన మిగిలిన అన్ని పత్రాలనూ ప్రజాక్షేత్రంలో పరిశీలించేందుకు వీలుండాలి’’ అని 1961 నాటి ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని రూల్ 93(2)(ఎ) చెబుతోంది. దానికే ఇప్పుడు సవరణ చేశారు. ఈసీ సిఫార్సు మేరకు, కేంద్ర న్యాయశాఖ ఈ మార్పును నోటిఫై చేసింది. దాంతో, ఇప్పుడిక నిబంధనల్లో ప్రత్యేకంగా పేర్కొన్న పత్రాలను మాత్రమే జనం పరిశీలించవచ్చన్న మాట. అంతేకాదు... ఎన్నికల పత్రాలన్నిటినీ కోరినవారికి ఇవ్వాలంటూ ఈసీని ఇక కోర్టులు ఆదేశించడానికి వీలుండదు. చిత్రమేమంటే, ఇటీవలి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పోలింగ్ కేంద్రంలో పోలైన ఓట్లకు సంబంధించిన పత్రాల కాపీలు, సెక్యూరిటీ కెమెరాలోని ఫుటేజ్, వీడియోలను ఓ పిటిషనర్‌కు అందించాల్సిందిగా పంజాబ్ – హర్యానా హైకోర్ట్ సరిగ్గా ఈ నెల 9వ తేదీనే ఆదేశా లిచ్చింది. అక్టోబర్ నాటి ఎన్నికల్లో అభ్యర్థి కాదు గనక సదరు పిటిషనర్ ఆ పత్రాలు కోరరాదని ఈసీ వాదించింది. హైకోర్ట్ మాత్రం అభ్యర్థికైతే ఉచితంగా, ఇతరులకైతే రుసుముపై పత్రాలివ్వాలన్న పిటిషనర్ వాదనతో ఏకీభవించింది. కోర్టు ఆదేశాన్ని తప్పక పాటించాల్సిన పరిస్థితి. కానీ, తద్భిన్నంగా ఎన్నికల సంఘం నిబంధనల్ని సవరించడం సహజంగానే చర్చనీయాంశమవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తున్నప్పుడే, సామాన్య ఓటర్లకున్న తిరుగులేని సమాచార హక్కును సుప్రీమ్ కోర్ట్ నొక్కి వక్కాణించింది. రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే వ్యక్తుల, సంస్థల వివరాలు తెలుసుకొనే హక్కు ప్రజలకుందని తేల్చి చెప్పింది. వివాదాస్పద బాండ్ల పథకాన్ని సమర్థించిన సర్కారుకు అది ఎదురుదెబ్బ. నిజానికి, ఎన్నికల ప్రక్రియ పారదర్శకత, నిజాయతీలో రాజీకి తావు లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం అప్పుడే స్పష్టం చేసినట్టయింది. అయినా సరే, ప్రభుత్వం చెవికెక్కించుకోకుండా ఇప్పుడు ఈసీ సిఫార్సు పేరు చెబుతూ, నిబంధనల సవరణకు దిగడం ప్రజాస్వామ్యవాదులకు దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఓటర్లే స్వయంగా తమ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా సాక్షిగా పంచుకుంటున్న రోజుల్లో సీసీ టీవీ దృశ్యాల పట్ల ఈసీ ఇంత హంగామా ఎందుకు చేస్తోందో అంతుపట్టదు. సీసీ టీవీ ఫుటేజ్ అందుబాటులో ఉంటే కృత్రిమ మేధతో దుర్వినియోగం చేసే ముప్పుందన్న ఈసీ వాదన కొంత నిజమైనా, డిజిటల్ యుగంలో అన్ని వీడియోలపై నిషేధం పెడతామా? సవాలుకు అది పరిష్కారం కాదు కదా!ఎన్నికల సంఘం సారథ్యంలో నిఖర్సుగా సాగాల్సిన ఎన్నికల ప్రక్రియ తాలూకు నైతిక నిష్ఠ శరవేగంగా హరించుకుపోతోందంటూ ప్రతిపక్షాలు అసలే గొంతు చించుకుంటున్న సమయంలో నిబంధనల్లో ఈ కొత్త సవరణలు చేయ డాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఎన్నికల రికార్డులనూ, డేటాను ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంచాలన్న జ్ఞానోదయం హఠాత్తుగా పాలకులకూ, ఈసీకీ ఎందుకు కలిగినట్టు? జనం దృష్టి నుంచి ఏం దాచాలని చూస్తున్నారు? ప్రతిపక్షాలనే కాదు... పౌరులనూ వేధిస్తున్న ప్రశ్నలివి. పైగా విస్తృత స్థాయి చర్చ జరగకుండానే చేపట్టిన ఈ తొందరపాటు చర్య ఎన్నికల ప్రక్రియపై మరిన్ని అనుమానాలు పెంచేలా పరిణమిస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో అది మరింత విషాదం. వాస్తవానికి భిన్న భౌగోళిక పరిస్థితులు, భాషలు, సంస్కృతులు, సమస్యలున్న సువిశాల దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియగా ఇన్నేళ్ళుగా విజయవంతంగా ఎన్నికలను నిర్వహిస్తూ రావడం గొప్పే. అందుకు మన రాజ్యాంగం ఏర్పరచిన సుస్థిర వ్యవస్థనూ, గత దశాబ్దాల్లో ఈసీ పాత్రనూ తప్పక ప్రశంసించాల్సిందే. కానీ ఏ ఎన్నికల ప్రక్రియకైనా పారదర్శకత ప్రాణాధారం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికీ అదే కీలకం. తీరా ఆ పారదర్శకతే ఇప్పుడు రానురానూ తగ్గుతూ పోతుంటే ఏమనాలి? ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకొనే మనం ఎటువైపు ప్రయాణిస్తున్నట్టు? అందులోనూ ఆంధ్రప్రదేశ్, హర్యానా సహా అనేక చోట్ల ఎన్నికల్లో ఈవీఎంలపై, వీవీప్యాట్లపై నీలినీడలు కమ్ముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో... ఈ తరహా కొత్త నిబంధనతో పాలకులు ఏ రకమైన సూచన ఇవ్వదలిచినట్టు? ఎన్నికల ప్రక్రియ పట్ల విశ్వాసం పాదుకొనాలంటే, ఈ సరికొత్త నిబంధనల మార్పును పునఃపరిశీలించాలి. స్వతంత్రంగా సాగాల్సిన ఈసీ పాలకుల చేతిలో మరబొమ్మగా మారిపోతున్నట్టు విమర్శలు పెల్లుబుకుతున్న సందర్భంలో అది అత్యవసరం. -
ఓటుకే భద్రత లేదు!
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తంతు ప్రహసనంలా మారింది. ఈ జాబితాలో పేరు ఉండాలంటే ప్రతిసారి ఓటు హక్కు నమోదు చేసుకోవాలని చెబుతుండడం అందరికీ ఇబ్బంది అవుతోంది. వచ్చే ఏడాది మార్చి నెలలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తాజాగా షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా, గతంలో ఓటుహక్కు వినియోగించుకున్న పట్టభద్రుల జాబితా లేదని, మళ్లీ కొత్తగా నమోదుకు చర్యలు చేపట్టింది. కొరిటెపాడు(గుంటూరు): ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని అర్హులైన పట్టభద్రులంతా సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో తమ ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ ఎన్నికలు జరిగే ప్రతిసారీ ఇలా ఓటు హక్కు నమోదు చేసుకోవాలంటే ఎలా అంటూ ఓటర్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు లేకపోయినా.. పట్టభద్రులైతే చాలు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్సీకి పోటీ చేసే అభ్యర్థికి తొలి, ద్వితీయ, తృతీయ ప్రాధాన్య ఓట్ల ద్వారా కనీసం 50 శాతంపై అనుకూలంగా పడితేనే విజయం వరిస్తుంది. 3 లక్షలు దాటే అవకాశం ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 2019 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,48,799 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో కేవలం 1,14,325 (45.79 శాతం) మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మార్చి 2025లో జరిగే పట్టభద్రుల ఎన్నికలకు సుమారు 3 లక్షల మందికిపైగా నమోదు చేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నమోదు నిబంధనలు ఇవీ.. » ఈ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు మళ్లీ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి. » ఫాం 18 వినియోగించుకుని దరఖాస్తు అందించాలి. » సెపె్టంబర్ 30 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో నమోదుకు అవకాశం ఉంది. » ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే.. అధికారులు నేరుగా ఇంటి చిరునామాకు వచ్చి ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. » ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి పరిశీలనా ఉండదు. » ఫాం 18లో వివరాలను తొలుత పూరించాలి. ఆధార్ కార్డు, డిగ్రీ సర్టిఫికెట్ నకలు, నివాస ధ్రువపత్రం సెట్‌గా చేసి మండల తహసీల్దార్, గ్రామ సచివాలయం, మీ సేవా కేంద్రాల్లో అందించవచ్చు. హక్కులను హరించినట్టే.. పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారీ ఓటు నమోదు చేయించుకోమనడం సరికాదు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వడమంటే ప్రజల హక్కులను హరించినట్లే. గతంలో పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు వేసిన వారిని కొత్తగా నమోదు నుంచి మినహాయించాలి. – తూము వెంకటేశ్వరరెడ్డి, బీకాం, గుంటూరు పునరాలోచన అవసరం పట్టభద్రుల ఓటు నమోదును గ్రామ సచివాలయాల్లో చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఓటు నమోదు పట్టభద్రులను అనుమానించడమేనని భావిస్తున్నాం. దీనిపై ఎన్నికల కమిషన్ పునరాలోచన చేయాలి.– ఎం.నరేంద్రరెడ్డి, బీఏ, గుంటూరు -
అసెంబ్లీకి భిన్నంగా లోక్‌సభ తీర్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర, జాతీయ రాజకీయ మార్పులకు అనుగుణంగా తెలంగాణ ఓటరు నాడి కనిపిస్తోంది. ఆరు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇచి్చన తీర్పుకు భిన్నంగా తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలను గెలిపించి రాష్ట్ర ఓటర్లు తమ విలక్షణమైన తీరును మరోసారి చాటుకున్నారు. 2023 నవంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం పోలయిన ఓట్లలో కాంగ్రెస్‌కు 39.40 శాతం వాటా ఇచ్చి 64 సీట్లు కట్టబెట్టి అధికారాన్ని అప్పగించిన ఓటర్లు..ఈసారి దానికి అదనంగా స్వల్ప ఆధిక్యతను కట్టబెట్టారు. మొత్తం పోలయిన ఓట్లలో అత్యధికంగా 87,41,263 ఓట్లను సాధించిన కాంగ్రెస్ పార్టీ .. 40.10 శాతం ఓట్లతో రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లకు గాను 8 చోట్ల విజయం సాధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 18 శాతం ఓట్లు మాత్రమే దక్కించుకొని మూడు సీట్లకు పరిమితమైన కాంగ్రెస్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా దాదాపు 40 శాతం ఓట్లు సాధించింది. గణనీయంగా పెరిగిన బీజేపీ ఓటు షేర్ కాంగ్రెస్‌తో సమానంగా రాష్ట్రంలో 8 లోక్‌సభ సీట్లు గెలుచుకున్నప్పటికీ బీజేపీకి కాంగ్రెస్ కన్నా సుమారు 11 లక్షల ఓట్లు తక్కువ పోలయ్యాయి. అయితే కాంగ్రెస్ తర్వాత మొత్తం 76,47,424 ఓట్లను పొందడం ద్వారా 35.08 శాతం వాటాను కైవసం చేసుకుంది. బీజేపీకి గత నవంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేవలం 14 శాతం ఓట్లు మాత్రమే రాగా, ఆరు నెలల్లో అది 35 శాతానికి పెరగడం గమనార్హం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 22 శాతం ఓట్లు సాధించింది. ఆరునెలల్లో అనూహ్యంగా.. ఈ పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో బాగా దెబ్బతిన్న పారీ్టగా బీఆర్ఎస్ నిలిచింది. ఆరునెలల క్రితం జరిగిన ఎన్నికల్లో 37.35 శాతం ఓట్లతో 39 సీట్లు సాధించి కాంగ్రెస్ తరువాత రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్.. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో బాగా వెనుకబడిపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 52 శాతం ఓట్లు సాధించి 9 సీట్లను గెలుచుకున్న ఈ పార్టీ ఈసారి ఒక్క సీటును కూడా సాధించలేదు. 16.68 శాతం ఓట్లతో (36,37,086) బీఆర్ఎస్ మూడో స్థానంలో నిలిచింది. అయితే గత లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుంటే ఏకంగా 36 శాతం ఓట్లు ఆ పార్టీ కోల్పోయింది. జాతీయ స్థాయిలో ప్రధానిని నిర్ణయించే లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి జాతీయ పారీ్టలైన బీజేపీ, కాంగ్రెస్‌ల వైపు తెలంగాణ ఓటర్లు మొగ్గు చూపినట్లు అర్థమవుతోంది. ఇక హైదరాబాద్‌లో గెలిచిన ఎంఐఎం ఎప్పటిలాగే 3 శాతం ఓట్లను సాధించింది. నోటాకు గణనీయంగా 8,50,177 (3.9 శాతం) ఓట్లు పోలయ్యాయి. -
తెనాలి ఎమ్మెల్యేపై యువకుడి దాష్టీకం
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ అభ్యర్థిపై సామాజికవర్గం ముసుగులో కూటమికి చెందిన ఓ యువకుడు ఆయన భార్య సమక్షంలోనే అవమానించి... రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. ఆగ్రహించిన ఆయన చేయి చేసుకోవడంతో సోషల్ మీడియాలో దు్రష్పచారానికి తెగబడ్డారు. అంతేగాకుండా ఈసీకి ఫిర్యాదు చేసి ఆయన్ను తిర గనీయకుండా గృహనిర్బంధం చేశారు. అయితానగర్‌లో సోమవారం ఉదయం ఓటు వేసేందుకు భార్యతో సహా వచ్చిన ఎమ్మెల్యే శివకుమార్‌ను అప్పటికే క్యూలో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి గొట్టిముక్కల సుధాకర్ అడ్డుకున్నాడు.క్యూలో వెళ్లకుండా నేరుగా లోపలకు వెళ్లడమేంటన్న మిషతో దుర్భాషలాడాడు. అయినా మౌనంగా లోపలకు వెళ్లి ఓటేసి వస్తుంటే, మళ్లీ అదే వ్యక్తి అడ్డుకున్నాడు. కులాల పేర్లు ప్రస్తావిస్తూ ‘ఆ పార్టీలో ఉండటమేమిటి’ ను వ్వు కమ్మోడివి కావా?’ అని రెచ్చగొట్టాడు. ఇంకా కవి్వంపు చర్యలకు పాల్పడటమే గాకుండా భార్య ముందే అసభ్యంగా మాట్లాడటంతో తట్టుకోలేకపోయిన శివకుమార్ అతడి చెంపపై కొట్టాడు.సుధాకర్ కూడా తిరిగి చేయి చేసుకోవడంతో ఎమ్మెల్యే పక్కనే ఉన్న కార్యకర్తలు అతడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిని ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదుచేసి, పోలింగ్ సరళిని పర్యవేక్షించే అవకాశం లేకుండా గృహనిర్బంధం విధించేలా చేశారు. ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు చేశారు. మనోహర్‌తో కలిసి చేసిన కుట్ర తనను రెచ్చగొట్టి ఏదోలా గొడవ సృష్టించి పోలింగ్ రోజున డ్యామేజ్ చేయాలని జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గొట్టిముక్కల సుధాకర్ కుట్ర పన్నారని ఎమ్మెల్యే శివకుమార్ ఆరోపించారు. -
Lok Sabha Election 2024: రెండు రాష్ట్రాల్లోనూ ఓటు!
ఒకే ఓటరుకు రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఓటు వేసే అవకాశం వస్తే? అవి కూడా రెండు రాష్ట్రాల పరిధిలోని స్థానాలైతే! అదెలా అనుకుంటున్నారా? చట్టబద్ధంగా అయితే అవకాశం లేదు. కానీ ఒకటో రెండో కాదు... ఏకంగా 14 గ్రామాల ప్రజలకు ఇలా రెండు రాష్ట్రాల పరిధిలో ఓటు హక్కుంది. ఒక్కొక్కరికి రెండు ఓటరు గుర్తింపు కార్డులున్నాయి. అంతే కాదు, రెండు రాష్ట్రాల తరఫునా సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా పొందుతున్నారు. ఈ గమ్మత్తేమిటో తెలుసుకోవాలంటే ఆదిలాబాద్ జిల్లా కెరమెరి, మహారాష్ట్రలోని జీవతి తాలూకాలకు వెళ్లాల్సిందే... 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భంగా మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో 14 గ్రామాలు ఎవరికి చెందాలన్నది ఎటూ తేలలేదు. ఇవి పరందోలి, అంతాపూర్ గ్రామ పంచాయితీల పరిధిలో 30 కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి. వాటిలో 6,000 మంది నివసిస్తున్నారు. వారికి రెండు రాష్ట్రాల తరఫున ఓటరు ఐడీ కార్డులు, ఆధార్లు, కులం సర్టిఫికెట్లు ఉన్నాయి. ఈ ఊళ్లలో స్కూళ్లు కూడా తెలుగు, మరాఠీ మాధ్యమాల్లో రెండేసి ఉంటాయి! ఈ గ్రామాలు అటు మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్‌సభ స్థానంతో పాటు ఇటు తెలంగాణలోని ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలోకి కూడా వస్తాయి! సర్పంచ్‌లూ ఇద్దరు పరందోలి, అంతాపూర్ గ్రామ పంచాయితీలకు ఇద్దరేసి సర్పంచ్‌లు ఉండటం మరో విశేషం. వీరు తెలంగాణ, మహారాష్ట్రలో వేర్వేరు పారీ్టలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 14 గ్రామాల వారికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభివృద్ధి నిధులు కూడా వస్తుంటాయి. సంక్షేమ పథకాల ప్రయోజనాలూ అందుతున్నాయి. రెండువైపులా ఓటు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తాము రెండు రాష్ట్రాల్లోనూ ఓటు వేస్తూ వస్తున్నట్టు పరందోలి సర్పంచ్ లీనాబాయ్ బిరాడే మీడియాతో చెప్పడం విశేషం. ఆయనది మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ‘‘రెండు రాష్ట్రాల్లోనూ ఒకే తేదీన పోలింగ్ ఉంటే మాకు వీలైన స్థానంలో ఓటేస్తాం. వేర్వేరు తేదీల్లో ఉంటే మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ ఓటేస్తాం. రెండు రాష్ట్రాల నుంచి మాకు సౌకర్యాలు అందుతున్నాయి’’ అని లీనాబాయ్ వివరించారు. చంద్రాపూర్ లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 19న తొలి విడతలో పోలింగ్ ముగిసింది. అందులో ఈ 14 గ్రామాల ఓటర్లు పాల్గొన్నారు. ఇప్పుడు సోమవారం నాలుగో విడతలో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి కూడా ఓటేయనున్నారు! ఒకచోట తొలగించండి...! ఇలా రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో రెండుసార్లు ఓటేయడం సరికాదని ఎన్నికల అధికారులు అంటున్నారు. దీనిపై చంద్రాపూర్, ఆదిలాబాద్ జిల్లా అధికారులు ఇటేవలే వారితో సమావేశం కూడా నిర్వహించినట్టు చంద్రాపూర్ కలెక్టర్ వినయ్ గౌడ వెల్లడించారు. రెండుసార్లు ఓటేయడం చట్ట విరుద్ధమని ఆయా గ్రామాల ప్రజలకు చెప్పామన్నారు. స్థానిక నేతలు మాత్రం రెండు చోట్ల ఓటు వేయవద్దని తమకు చెప్పేముందు తమ గ్రామాలు ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తాయో తేల్చాలని కోరుతున్నారు. ‘‘మేము రెండుసార్లు ఓటు వేస్తున్నాం. ఇది చట్టవిరుద్ధమైతే సమస్యను పరిష్కరించాల్సిందిగా రెండు రాష్ట్రాలను ఎన్నికల సంఘం కోరాలి. ఒక నియోజకవర్గ పరిధి నుంచి మా ఓట్లను తొలగించమనండి. మాకు సమస్యేమీ లేదు. కాకపోతే మేము మహారాష్ట్రకు చెందుతామా, లేక తెలంగాణకా అన్నది తేల్చాలి’’ అని పరందోలి సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు నింబదాస్ పతంగె అన్నారు. ‘‘ఈ 14 గ్రామాల వారు మహారాష్ట్ర, తెలంగాణల్లో ఏదో ఒక్క చోటే ఓటేయాలి. ఇప్పటికే చంద్రపూర్ లోక్‌సభ స్థానం పరిధిలో ఓటేసిన వారిని మళ్లీ ఓటేయడానికి అనుమతించొద్దు. తెలంగాణ ప్రభుత్వానికి ఈ మేరకు సూచించాలని ఈసీని కోరాం’’ – ఎస్.చొక్కలింగం, మహారాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి – సాక్షి, నేషనల్ డెస్క్ -
General Election 2024: మీ ఓటు ఉందా? లేదా? ఇలా చెక్ చేసుకోండి..
కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎట్టకేలకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఢిల్లీలో విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ 'రాజీవ్ కుమార్' ఎన్నికల షెడ్యూల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుందని సీఈసీ ప్రకటించారు. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్, ఏప్రిల్ 26న రెండో దశ, మే 7న మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20వ తేదీన ఐదో దశ పోలింగ్, మే 25న ఆరో దశ, జూన్1న ఏడో దశ పోలింగ్ ఉంటుందని సీఈసీ తెలిపారు. అయితే ఈ రోజు నుంచి జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండనుందని తెలిపారు. పోలింగ్ సీజన్‌కు ముందు.. ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి, ఓటర్ల జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలి, పోలింగ్ బూత్ కనుక్కోవడం ఎలా? అనే మరిన్ని వివరాలు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితాలో పేరు ఉన్న వ్యక్తి ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. అయితే ఓటు వేయడానికి వెళ్లే ముందు ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలంటే.. ఓటర్ ఐడీ డ్రైవింగ్ లైసెన్స్ పాస్‌పోర్ట్ ఆధార్ కార్డు పాన్ కార్డ్ MNREGA జాబ్ కార్డ్ NPR కింద RGI జారీ చేసిన స్మార్ట్ కార్డ్ స్టేట్ బ్యాంక్ లేదా పోస్టాఫీసు జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్‌బుక్ కేంద్ర/రాష్ట్రం ద్వారా ఉద్యోగులకు జారీ చేసిన ఐడీ కార్డు ఎలక్టోరల్ రోల్లో మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలంటే.. అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి స్టేట్ ఎంటర్ చేసి, భాషను ఎంచుకోవాలి పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు ఫిల్ చేయాలి జిల్లా & అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, సర్చ్ మీద క్లిక్ చేయాలి పోలింగ్ బూత్‌ను ఎలా కనుక్కోవాలంటే.. అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసిన తరువాత పోలింగ్ బూత్‌ని తెలుసుకోవడానికి రాష్ట్రం, భాషను ఎంచుకోవాలి. పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు ఫిల్ చేయాలి జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, సెర్చ్ మీద క్లిక్ చేయాలి EPIC/ఓటర్ ఐడీ కార్డ్ ద్వారా సెర్చ్ చేయడం భాషను ఎంచుకోవాలి EPIC నంబర్/ఓటర్ ID కార్డ్ వివరాలను ఫిల్ చేయాలి రాష్ట్రాన్ని ఎంచుకోవాలి క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి, సెర్చ్ మీద క్లిక్ చేయాలి -
దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే!
అధికారంలో ఉన్నప్పుడు కళ్లు మూసుకుని, పదవీ విరమణ తర్వాత తగుదునమ్మా అంటూ టీడీపీకి రాజకీయ ప్రయోజనం కలిగించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఊరూరా తిరుగుతున్నారు. హింసలేని ఎన్నికలు, స్వేచ్ఛ అంటూ పెద్ద మాటలు చెబుతున్నారు. కాపాడే అధికారం ఉన్నప్పుడు ఏం చేశారని పౌర సమాజం ప్రశ్నిస్తోంది.ఇటీవల కాలంలో ‘సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ’ (సీఎఫ్‌డీ) పేరుతో ఏపీ ఎన్నికల మాజీ ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు సమా వేశాలతో హడావిడి చేస్తున్నారు. సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ ప్రధాన లక్ష్యం స్వేచ్ఛగా, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్ని కల్లో ఓటు హక్కును ఉపయోగించుకోవడం అని ప్రకటించారు. ఇదే నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్న కాలంలో, స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలు ఎక్కువయ్యాయనీ, అలాగే నామినేషన్లు వేయనివ్వడం లేదనీ, దౌర్జన్యాలు నెరిగాయనీ పెద్ద ఎత్తున విపక్షాలు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్య దర్శిగా తొలగించడంతో ఆయనకు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ లాంటివి గుర్తు కొస్తున్నాయి. ఈయన అప్రజాస్వా మికంగా వ్యవహరిస్తున్నారని గతంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారనే విష యాన్ని మరిచిపోతే ఎలా? సీఈసీ విడుదల చేసిన వివరాల ప్రకారం 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో 79.74 శాతం ఓట్లు పోలయ్యాయి. నరసరావుపేట పార్లమెంటరీ నియోజక వర్గంలో అత్యధికంగా 85.53 శాతం పోలయ్యాయి. అలాగే 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో 74.64 శాతం ఓట్లు పోలయ్యాయి. బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యధికంగా 85.16 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే, రాష్ట్ర విభజన జరిగిన మొదటి ఐదేళ్లకే ఇక్కడి ప్రజల్లో కలిగిన చైతన్యం కారణంగా 2019 ఎన్నికల్లో చంద్ర బాబును ఇంటికి పంపడం కోసం, మరో ఐదు శాతం మంది కొత్తగా ఓటింగ్‌లో పాల్గొన్నారన్నమాట. ఇక్కడి గణాంకాలు ఇలా ఉన్నప్పుడు, ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో మళ్ళీ ఓటు–హక్కు అంటూ, వీరి కసరత్తు ఎందుకు? ఈ ఐఏఎస్ అధికారులతో పీవీ రమేష్ అనే మరొక ఐఏఎస్ కలిశారు. వీరు కలిగించే చైతన్యం అంతా బెజ వాడ కేంద్రంగానే సాగడం గమనార్హం. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో నిమ్మగడ్డ బృందం నిర్వహిస్తున్న సభల్లో గెస్ట్ పాత్రల్లో పాల్గొంటున్నవారి విషయమై పౌరులు బాధపడుతున్నారు. రిటైర్ అయ్యాక కూడా ౖవై సీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పబోయి క్షతగాత్రు లైన ఈ ముగ్గురు అధికారులు తమకంటూ ఇక్కడ ఒక విలువ లేక, ‘మీడియా అటెన్షన్’ కోసం, మాజీ భారత ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్, కేబినెట్ సెక్రటరీ కె. పద్మనాభయ్యలను తమ పక్కన పెట్టుకుంటున్నారు. ఎందుకు ఈ మాజీ అధికారులను క్షతగాత్రులు అనవలసివచ్చిందో తెలియాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కేడర్‌లో ఏదో ఒక ప్రధాన శాఖలో కాకుండా, చంద్రబాబు కోసం తన సర్వీస్ చివరి రోజు వరకూ రాజ్ భవన్లో గవర్నర్ సెక్రటరీగా పనిచేశారు. రాష్ట్ర విభజనకు ముందు 4 నెలల పాటు రాష్ట్రపతిపాలన ఉండడం మనకు తెలిసిందే. అప్పట్లో గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ ఆఫీస్ కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల్లో అన్ని కీలక నిర్ణయాలకు కేంద్రం అయింది. ఇలా టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడం మొదటి నుంచి నిమ్మగడ్డకు కొత్తకాదు. అందుకే 2016లో రిటైర్ అయిన మరుసటి రోజు ఇతణ్ణి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పోస్ట్‌లో చంద్రబాబు నియమించారు. అదే నెలలో ఆయన కుమార్తె నిమ్మగడ్డ లావణ్యను ఏపీ ‘ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డ్’లో సీనియర్ కన్సల్టెంట్‌గా నెలకు రూ 1.50 లక్షల జీతంతో నియమించారు. అయితే ప్రభుత్వం మారడంతో ఉపాధి కోల్పోయి, పౌర వేదిక ముసుగులో జగన్ మోహన్ రెడ్డి ప్రత్యర్థి తరహాలో ఇప్పుడు నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారితే, మళ్ళీ ‘ఫ్యామిలీ ప్యాకేజి’ ప్రయోజ నాలు పొందడం ఆయన లక్ష్యం. అందుకోసం ‘ఈ ప్రభుత్వంలో సలహాదారులు ఎంతమంది? వీరు కేబినెట్ హోదాలో ఉంటూ రాజకీయాలు ఎలా మాట్లాడతారు?’ అంటూ రమేష్ టీడీపీ తరఫున విమర్శలు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఇప్పటికంటే ఎక్కువమంది సలహా దారులు, ‘కన్సల్టెంట్లు’ ఉన్న విషయం తెలియనిది కాదు. ‘స్కిల్ స్కామ్’లో అరెస్టయిన ‘ఏ 1’ గంటా సుబ్బా రావు, ముందస్తు బెయిల్ తెచ్చుకున్న ‘ఏ 2’ ఐఏఎస్ లక్ష్మీనారాయణలు ఇద్దరూ ఇదే తరహాలో బయట నుంచి ప్రభుత్వం ‘కన్సల్టెంట్స్’గా నియమించిన వారేకదా! ప్రభుత్వంలో సలహాదారులు రాజకీయాలు మాట్లాడ్డం నేరమా? లేక నమ్మకంగా ప్రభుత్వంలో ఉంటూ, దొంగ దారుల్లో నిధులు బయటకు పంపడం నేరమా? ఈ రెండింటిలో ఏది ప్రజాస్వామ్యానికి చేటు? అని రాష్ట్ర ప్రజలు ఈ నిమ్మగడ్డ బృందాన్ని నిలదీయొద్దూ? ‘రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం...’ అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లా డుతున్న నిమ్మగడ్డ, బెజవాడలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీటులో కూర్చుని, తన తప్పుడు చర్యలకు తగిన శిక్ష నుంచి తప్పించుకోవడానికి క్రింది ఉద్యోగులతో‘కంప్యూటర్ హార్డ్ డిస్క్’లు ధ్వంసం చేయించడం ఏ స్ఫూర్తి అవుతుందో చెప్పగలరా? అసలు ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్‌గా నియమించడమే ఓ ప్రహసనం! ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ప్పుడు సీఎస్‌గా ఉన్న అనిల్ చంద్ర పునేఠా చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తూ ఉండడంతో, భారత ఎన్నికల కమిషనర్ వెంటనే అయన్ని తొలగించి, క్రీడలు యువజన సర్వీసులు సెక్రటరీగా ఉన్న సుబ్రహ్మణ్యంను సీఎస్ పోస్టులో నియమించింది. అయితే, జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, సీఎం పరిపాలనా శైలి వేగాన్ని అందుకోలేని స్థితిలో ఉన్న ఎల్వీ స్థానంలో మరొకరిని సీఎస్ పోస్టులో నియమించారు. అదీ ఎల్వీ ఆక్రోశానికి కారణం. దాంతో, నిమ్మగడ్డ వెనుక తిరుగుతూ జగన్ ప్రభుత్వం మీద ముసుగు దాడికి దిగారు. ఇందులో ముఖ్యుల ఎంపిక ఎవరిదోగానీ, ఆసక్తి కరంగా ఉంది. అంబేడ్కరిస్టుల కుటుంబం నుంచి మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ కొంచెం ఆలస్యంగా ఇందులోకి దిగారు. ‘స్కిల్ స్కామ్’ జరిగినప్పుడు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఈయన కేస్ సమయంలో ‘మీడియా’ ముందు వివాదాస్పదంగా మాట్లాడి వార్తల్లో వ్యక్తి అయ్యారు. సర్వీసులో ఎక్కువకాలం పలుదేశాల్లో ‘వరల్డ్ బ్యాంక్’లో పనిచేశానని చెప్పుకునే రమేష్, ప్రస్తుతం‘ఇండియన్ బిజినెస్ స్కూల్’లో ‘ఫ్యాకల్టీ’గా పనిచేస్తూ, మధ్యలో ప్రజాస్వామ్య పరిరక్షణకు బెజవాడ వస్తున్నారు. అయితే, ఇక్కడ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహం గురించి ఈయన ఒక్క మాటా మాట్లాడరు! వీరంతా ‘పొలిటికల్ జేఏసీ’గా ఏర్పడి, దానికి ‘సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ’ అని పేరుపెట్టి ఏపీలో తటస్థ ఓటరును ప్రభావితం చేయాలనే రహస్య ‘ఎజెండా’తో పనిచేస్తున్నారు. వీరికి ‘మీడియా’ కవరేజి కోసం ‘బాబు మీడియా ఎటూ ఉండనే ఉంది. ఏతా వాతా చెప్పొచ్చేది ఏమిటంటే... ప్రజలు అంతా గమనిస్తున్నారు. తగిన సమ యంలో తగినవిధంగా స్పందిస్తారు. - వ్యాసకర్త మాజీ ఎమ్మెల్యే ‘ 98481 28844 - అడుసుమిల్లి జయప్రకాష్ -
ఓటు వేసిన మాజీ ప్రధాని షరీఫ్
పాక్‌లో నేడు జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) (పీఎంఎల్ (ఎన్)) చీఫ్ షెహబాజ్ షరీఫ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని షరీఫ్ లాహోర్‌లోని మోడల్ టౌన్ నియోజకవర్గంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో షరీఫ్ మాట్లాడుతూ తమ దేశ భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. ఓటింగ్‌కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై షెహబాజ్ షరీఫ్ సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా తాత్కాలిక కేంద్ర సమాచార శాఖ మంత్రి ముర్తజా సోలంగి ఇస్లామాబాద్‌లోని ఎన్-46లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. కాగా బుధవారం బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని పిషిన్, ఖిలా సైఫుల్లాలో జరిగిన జంట ఉగ్రదాడుల్లో పలువురు మరణించారు. వందలమంది గాయపడ్డారు. -
ఓటు ఎవరికి అంటే.. కాకే మన ఆదర్శం!
‘‘కాకిని ఆదర్శంగా తీసుకుంటే ఓటును సరిగా వేయొచ్చు’’ అంటూ విలక్షణంగా సెలవిచ్చారు స్వామి ఎలక్షనానంద అలియాస్ స్వామి సలక్షణానంద. ‘‘అదెలా స్వామీ?’’ అయోమయంగా అడిగాడు శిష్యుడు. ‘‘కథల్లో కాకుల్నీ, కాకమ్మ కథల్నీ గుర్తు పెట్టుకుంటే ఓటు వేయడంలో పొరబాట్లు జరగవు. చెబుతా విను’’ అంటూ తన స్టేట్మెంట్ను పునరుద్ఘాటిస్తూ, దానికి తగిన దాఖలా కూడా ఇచ్చారు స్వామీజీ. ‘‘అనగనగా ఓ కాకి. అదెంతో కష్టపడి ఓ మాంసం ముక్కను సంపాయించుకుంది. పక్షి ప్రపంచంలో కాకి పిల్లే కాకుండా..కాకి తిండీ కాకికి ముద్దే. దాని భోజనం దానికి పవిత్రమే కదా..అచ్చం మనలోకంలో మన ఓటులాగే.కాకి నోటనున్న మాంసం ముక్కను చూసి, నక్కకు నోరూరింది. అది చెట్టుకిందికి వచ్చి. ‘‘కాకి బావా... కాకి బావా... గానగంధర్వులంటూ మనుషులేవో తప్పుడు కూతలు కూస్తూ ఉంటారుగానీ..పాటంటే అసలు నీదే కదా. పక్షుల్లో పి.సుశీల నువ్వే కదా’’ అని పొగుడుతుంది. ఆ పొగడ్తలకు పరవశించిన కాకి గొంతెత్తి పాడుతుంది. అంతే..కాకి నోటనున్న నల్లి బొక్క సహిత మాంసం ముక్క కాస్తా నక్కకు దక్కుతుంది. కాకి తెలివైనదే. కానీ ఎవరి తెలివితేటలైనా అవి ఒక రంగానికే పరిమితం. కాకికి కాస్త సైన్సుతోపాటు బోలెడంత యుక్తి కూడా తెలుసు. కాకి యుక్తిని తెలిపే కథ మరొకటుంది. కాకి, జింక, ఎలుక ఈ మూడూ ఫ్రెండ్సు. ‘నన్ను కూడా మీ గ్రూపులో చేర్చుకొమ్మంటుం’ది ఓ నక్క. బోలెడంత డౌటు పడుతూనే, తప్పని పరిస్థితుల్లో దాంతో ఫ్రెండ్షిప్ చేస్తాయి కాకి, జింక, ఎలుక. ఓ పక్క ఫ్రెండ్షిప్ నటిస్తూనే జింకను ఉచ్చులో చిక్కేలా చేస్తుంది నక్క. ‘నక్కబావా.. నక్కబావా ఉచ్చు కొరికి నన్ను విడిపించవా’ అని అడుగుతుంది జింక. ‘‘ఉచ్చును జంతునరంతో చేస్తారు. ఇవాళ్ల శనివారం కదా. నేను నాన్‌వెజ్ ముట్టను. కాస్త వెయిట్ చెయ్. రేపొచ్చి విడిపిస్తానం’’టూ వేటగాడొచ్చి జింకను చంపడం కోసం దూరంగా వెళ్లి వేచిచూస్తుంటుంది. సంగతంతా తెలుస్తుంది కాకికీ, ఎలుకలకు. జింక దగ్గరికెళ్లి ఓ ఐడియా చెబుతుంది కాకి. ఆ ప్రకారం... జింక తన కడుపును ఉబ్బించి, చచ్చినట్టు నటిస్తూ పడి ఉంటుంది. జింక కంటిని పొడుస్తున్నట్టు యాక్షన్ చేస్తుంది కాకి. ఈలోపు వేటగాడు దూరం నుంచే చూసి, జింక చచ్చిందనుకుని వెళ్లిపోతాడు. ఇంతలో ఉచ్చు కొరికేస్తుంది ఎలుక. జింక సేఫ్. ఇలా కాకికి కొంత సోషల్ ఎవేర్నెస్సు ఉంది. మరి కాస్త సైన్సు తెలుసంతే. అందుకే తనకు తెలిసిన సైన్స్‌తో గులకరాళ్లు కుండలో వేసి, అడుగునున్న నీళ్లను పైకి రప్పించగలిగింది. ఇలా..దానికి ఫ్లుయిడ్ మెకానిక్స్ కొంత తెలుసుగానీ మ్యాథమేటిక్స్ అస్సలు తెలియదు. అందువల్ల..కోకిల తన గుడ్లను.. కాకి గూట్లో పెట్టి, దాంతోనే పొదిగించినా దానికి తెలియరాలేదూ..ఆ ఎక్స్ట్రా గుడ్లు ఎక్కణ్ణుంచి వచ్చాయోనన్న తెలివీ లేదు. సైన్సు తెలిసిన కాకికి మ్యాథ్సూ, సాంగ్సూ తెలియాలనే రూలేమీ లేదు కదా. బల్బ్ కనిపెట్టినంత తేలిగ్గా ఎడిసన్ గారు బట్టలు నేయలేకపోవచ్చూ, బాదం హాల్వా చేయలేకపోవచ్చు కదా. కాబట్టి దీన్ని బట్టి తెలిసే నీతి ఏమిటి? కాకి మాంసం ముక్క ఎంత విలువైనదో... మన నోటికాడికి కూడూ, గూడూ, గుడ్డా వచ్చేలా చేసే ఓటూ అంతే విలువైనది. దాన్ని తమ వశం చేసుకోడానికి చాలా మంది అభ్యర్థులు...‘ఓటర్లంతా తెలివైనవాళ్లు. వాళ్లెప్పుడూ తప్పుచేయరు’ అంటూ ఉబ్బేస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఓటరూ తన బలమేమిటో తెలుసుకోవాలి. తనకు లేని బలాన్ని ఉన్నట్టుగా చూపే యుక్తుల్ని తెలుసుకుని తెలివిగా మసలాలి. అంతేకాదు... తెలివైన కాకిలా మనకు కావాల్సిన లబ్ధిని కుండలో నీళ్లలా సాధించుకోవాలి. మన సోషల్ ఎవేర్నెస్సుతో... మన ఫ్రెండ్సూ, నైబర్ల ఓట్లను కొట్టేయాలనుకునే నక్కజిత్తుల వాళ్లనూ, ముప్పు తెచ్చే వేటగాళ్లలాంటి వాళ్ల గురించి అప్రమత్తం చేయాలి. అంతేతప్ప... తెలివైన ఓటరెప్పుడూ పొగడ్తలకు పొంగిపోయి, విలువైన ఓటును కాకి నోట మాంసం ముక్కలా అర్హత లేని అభ్యర్థుల పాలు చేయకూడదు’’ అంటూ ముగించారు స్వామి ఎలక్షనానంద. ఇది చదవండి: ఓటరు దేవుడో... నీకో దండం -
పిట్ట బతుకే ఓటరుదీ... పిట్టమెదడే వాడి యుక్తి!
‘‘వాళ్లకు ఇవ్వం. మనం వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో బెటిఫిట్స్ ఇవ్వం. మన జెండా మోసినోళ్లకు, మనతోని తిరిగినోళ్లకు..వాళ్లకే మన స్కీముల ప్రయోజనాలు ఇస్తం. మనోళ్లు కానోళ్లు ఎవ్వరైనా ఇళ్లు కట్టుకుంటుంటే.. మున్సిపాలిటీ వాళ్లకు చెప్పి, నేనే దగ్గరుండి కూలగొట్టిస్త’..ఇదీ కొన్ని దశాబ్దాలుగా ఎన్నికవుతూ ఉన్న ప్రజాప్రతినిధి మాట. అదీ పబ్లిగ్గా మీటింగ్‌లో. అదీ ఆన్ రికార్డ్. ఇలా అనడం కరెక్టేనా సార్’’ అమాయకంగా అడిగాడు ఓటరు. ‘‘ఆయనంటే ఏదో మామూలు మంత్రిస్థాయి వ్యక్తి. కానీ ఆయన కంటే గొప్పగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ‘ప్రజలకు విచక్షణ ఉన్నప్పుడు ప్రభుత్వానికీ ఉంటది. కాబట్టి మేం మా ఇష్టమైనోళ్లకే ఇచ్చుకుంటం మా బెనిఫిట్లు’ అన్నాడు కదా నాయనా. ఈయనతో పోలిస్తే ఆయనెంత’’ అని చిద్విలాసంగా అన్నారు స్వామీ ఎలక్షనానంద. ‘‘కేవలం నలభై శాతం ఓట్లతోనే ఎన్నికైనా, అంటే అరవై శాతానికి ఆమోదం కాకపోయినా, దాన్నే మెజారిటీ ఓపీనియన్ అంటారు. తనకు ఓట్లు వేయనోళ్లకు కూడా గెలిచిన వ్యక్తే ప్రతినిధి అనేది మన ఎలక్షన్ సిస్టమ్. ఈ సిస్టమ్‌లో ఎన్నికై..ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగునా సార్’’ ఎలక్షనానందస్వామిని మళ్లీ అడిగాడు ఓటరు. నిజానికి ఆయన పేరు సలక్షాణానంద స్వామి. ఓ మంచి స్వామీజీగా అన్ని అంశాలతో పాటు రాజకీయాలూ, నేతల అంతర్గత భావాల మీద కూడా వ్యాఖ్యానిస్తుంటారు. ఎన్నికలతో సహా అన్ని విషయాల మీదా నిర్మొహమాటంగా అభిప్రాయాలు చెబుతుంటారు కాబట్టి ఆయన్నలా పిలుస్తారు. ‘‘పిట్టలు చాలా అమాయకంగా కనిపిస్తాయి. ‘పిట్టప్రాణం’ అనే మాట వినే ఉంటావు. ఓ సామాన్యుడి బతుకులాగే అంతటి బక్కప్రాణం దానిది. అంతటి అర్భకపు ప్రాణికీ ఎన్నో యుక్తులూ, దాని మీద మరెన్నో కథలు. ఎన్నోసార్లు విన్న అలాంటి కథే మచ్చుకు మరోసారి చెబుతా విను నాయనా’’ అంటూ ఎలక్షనానంద స్వామి ఈ కథ చెప్పారు. అనగనగనగా రాణివారి తోట. అందులో ఓ చెట్టు. ఆ చెట్టు మీద ఓ పిట్టల జంట కాపురముంటోంది. అదే చెట్టుకు కాస్త ఆవల ఓ పుట్ట. ఆ పుట్టలో ఓ పాము నివాసముంటోంది. ఎవరి బతుకు వారు బతుకుతున్నంత కాలం..ఎదుటివాడిని కూడా బతకనిస్తున్నంత కాలం... ఎవరికీ అభ్యంతరముండదు. కానీ..ఆడ పిట్ట గుడ్లు పెట్టిన ప్రతిసారీ పాము రావడం, గుడ్లు తిని వెళ్లిపోవడం..ఇది ప్రతిసారీ జరుగుతోంది. అప్పటికీ పిట్టల జంట చాలాసార్లు పామును కోరాయి..ఇక తమను వదిలేయమనీ, తమ బతుకు తమను బతకనివ్వమని. కానీ తేలిగ్గా దొరికే ఆహారాన్ని వదల్లేక పాము ప్రతిసారీ అదే పని చేస్తోంది. పిట్ట బతుకెంత? దాని ఔకాదెంత? పామునది ఏమీ చేయలేదు. అందుకే ఓరోజున రాణిగారి అంతఃపురంలోకి పోయింది పిట్ట. అక్కణ్నుంచి చాలా విలువైన, రాణిగారికి అత్యంత ప్రియమైన నగను నోటకరచుకొని వచ్చి, సరిగ్గా పుట్టలో వేసింది. నగ పుట్టలో పడిన ఆనవాలు వదులుతూ మరీ వేసింది. అంతే నాయనా..భటులు పుట్ట తవ్వేశారూ, నగను పట్టేశారు. ఇక్కడ గమనించాల్సిన ఓ విషయం ఒకటుంది. పిట్టలు తాము పెట్టిన గుడ్ల బెనిఫిట్టును తమ పిల్లల రూపంలో పొందాలి. పిట్టబిడ్డ పిట్టకు ముద్దు కాదా. అందుకే అది నగను పుట్టలో వేసింది. నగలాగే విలువైనది ఓటు కూడా. ఆ ఓటును పిట్టప్రాణమంతే ఉన్న బక్కజీవి ఓట్ల పెట్టెలో వేసేశారనుకో..మిగతా పనంతా పనంతా ప్రజాస్వామ్యం చూసుకుంటుంది నాయనా. ఇది నేను చెప్పిన నీతి కథ కాదు. అనాదిగా అందరూ చదివిందే. దీని తాలూకు నీతి ఏమిటో ఇంకా విపులంగా వివరించి చెప్పాల్సిందేమీ లేదనుకుంట..అంటూ మరోసారి చిద్విలాసంగా నవ్వేరు స్వామి ఎలక్షనానంద. -
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో విషాదం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అత్త గంగాదేవి శర్మ(106) కన్నుమూశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో ఉంటున్న ఆమె తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈరోజు (సోమవారం) ఉదయం 7 గంటలకు గంగాదేవి కన్నుమూశారు. ఈరోజు మధ్యాహ్నం వ్యాస నది ఒడ్డున ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వృద్ధురాలు గంగాదేవి శర్మ మృతితో కులులోని శాస్త్రి నగర్లో విషాదఛాయలు అలముకున్నాయి. జేపీ నడ్డా అత్త ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు. ఆమెను సంరక్షించేందుకు ఇద్దరు కేర్టేకర్లు ఉన్నారు. నడ్డా బాల్యం అంతా అతని అత్త ఇంట్లోనే గడిచింది. అందుకే నడ్డా.. కులును తన రెండవ స్వస్థలం అని చెబతుంటారు. తాను హిమాచల్‌ను సందర్శించినప్పుడల్లా తన అత్త ఇంటికి వెళ్తానని నడ్డా తెలిపారు. జేపీ నడ్డా ఛత్తీస్‌గఢ్‌లోని బిలాసర్‌పూర్ జిల్లా నివాసి. కాగా ఇటీవల జరిగిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత వయోవృద్ధ ఓటరుగా గంగాదేవి శర్మ గుర్తింపు పొందారు. నాటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో నడ్డా తన అత్తను కలుసుకున్నారు. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీలో కూలిన సొరంగం: ప్రమాదంలో 40 మంది కూలీలు? -
ఈవీఎంలోని బటన్లను రెండుసార్లు నొక్కితే ఏమవుతుంది?
మనదేశంలో ప్రతి సంవత్సరం ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. వచ్చే ఏడాది అంటే 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఓటింగ్ కోసం ఈవీఎంలను కూడా సిద్ధం చేస్తున్నారు. వీటిని ఎన్నికల సమయంలో అన్ని పోలింగ్ బూత్‌లకు పంపిణీ చేస్తారు. అయితే ఓటింగ్ సమయంలో ఎవరైనా ఈవీఎం బటన్‌ను రెండుసార్లు నొక్కితే ఏమవుతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నవంబర్ నెలలో ఐదు రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో ఓటింగ్ నిర్వహించి, ఆ తర్వాత డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఎన్నికల్లో వేలాది ఈవీఎంలను వినియోగించనున్నారు. ఇవి ముందుగానే సిద్ధం చేయనున్నారు. ఎన్నికల తేదీకి ముందు ఈ ఓటింగ్ యంత్రాలను పోలింగ్ బూత్‌కు తీసుకువచ్చే బాధ్యతను ప్రిసైడింగ్ అధికారి పర్యవేక్షిస్తారు. ఒకవేళ ఓటరు ఎవరైనా ఈవీఎంలో ఓటు వేయడానికి వెళ్లినప్పుడు ఒకేసారి అనేక బటన్లను నొక్కితే ఏమవుతుందనే ప్రశ్న మన మదిలో మెదులుతుంటుంది. రెండు వేర్వేరు గుర్తులు ఉన్న బటన్లను నొక్కి. ఆ రెండు పార్టీలకు ఓటు వేయవచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది సాధ్యం కాదు. ఒక ఓటు వేసిన తర్వాత ఏ బటన్ నొక్కినా ఆ యంత్రంలో ఎటువంటి స్పందన చోటుచేసుకోదు. ఎన్నికల సంఘం తెలిపిన సమాచారం ప్రకారం అభ్యర్థికి ఓటు వేయడానికి సంబంధిత బటన్‌ను నొక్కిన వెంటనే, ఆ ఓటు నమోదువుతుంది. దీని తర్వాత ఈవీఎం లాక్ అవుతుంది. ఎవరైనా మళ్లీ ఆ బటన్ నొక్కినా ఏమీ జరగదు. ఎవరైనా మరో బటన్ నొక్కినా ఓటు నమోదు కాదు. ఒకరికి ఒక ఓటు అనే ప్రాతిపదికన ఈవీఎంలను తయారు చేశారు. ప్రిసైడింగ్ అధికారి తిరిగి బటన్ ప్రెస్ చేసిన తరువాతనే రెండవ ఓటుకు మార్గం ఏర్పడుతుంది. అంటే ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేసేందుకు అవకాశం ఉండదు. ఇది కూడా చదవండి: బంకర్లు అంటే ఏమిటి? యుద్ధ ప్రాంతాల్లో ఎందుకు అవసరం? -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే 5.8 శాతం ఓట్లు పెరిగినట్లు పేర్కొంది. ►తెలంగాణలో 3,17,17,389 మంది ఓటర్లు ►పురుష ఓటర్ల సంఖ్య : 1,58,71,493 ►మహిళా ఓటర్ల సంఖ్య : 1,58,43,339 ►ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్య : 2,557 ►సెప్టెంబర్ 28 నాటికి కొత్త ఓటర్ల సంఖ్య 17,01,087 18-19 సంవత్సరాల మధ్య వయసు వారు 8,11,640 మంది ఓటర్లు. అంటే 5.1.2023 కంటే 5,32,990 పెరుగుదల. బోగస్, బదిలీ చేయబడిన ఓటర్లు తొలగించబడ్డారు. 6,10,694 మంది మరణించిన కారణంగా వారి పేర్లు తొలగించారు. 5,80,208 ఓటర్లకు ఇంటి నంబర్లలో సవరణలు జరిగాయి. చదవండి: TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ -
ప్రతి ఓటరూ ఆధార్‌తో లింక్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఓటరునూ ఆధార్‌తో అనుసంధానం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ముఖేష్‌కుమార్ మీనాకు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విజ్ఞప్తి చేశారు. దీనివల్ల దొంగ ఓట్లను పూర్తిగా నివారించడంతోపాటు ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓట్లు ఉండకుండా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఈవో ముఖేష్‌కుమార్ మీనాను మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, పార్టీ నేత దేవినేని అవినాశ్‌తో కూడిన వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం కలిసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేసిన అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. చాలా చోట్ల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, ఒకే ఫోటో లేదా ఒకే పేరు, ఒకే ఓటర్ ఐడీతో చాలా ఓట్లు ఉన్న విషయాన్ని సీఈవో దృష్టికి తెచ్చామన్నారు. ఒక మనిషికి ఒకే ఓటు ఉండాలని వైఎస్సార్సీపీ కోరుకుంటోందన్నారు. ప్రతి ఓటరునూ ఆధార్‌తో అనుసంధానం చేయాలన్న తమ విజ్ఞప్తిపై సీఈవో సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వినతిపత్రమిస్తున్న వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం అక్రమాలు టీడీపీ సర్కార్ నిర్వాకాలే.. ఓటర్ల జాబితాలను ప్రభుత్వం మార్చేస్తోందంటూ గత 15 రోజులుగా ఈనాడు, ఆంధ్రజ్యోతితోపాటు టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. 2017, 2018, 2019 ఓటర్ల జాబితాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు 2023లో ఓటర్ల జాబితా ఎలా ఉందనే విషయాన్ని సీఈవోకి ఉదాహరణలతో సహా తెలియచేశాం. పేరులో చిన్న మార్పు, అడ్రస్‌లో చిన్న మార్పుతో ఒకే మనిషికి రెండు, మూడు ఓట్లు ఉన్నాయి. అలా 59,18,631 ఓట్లు ఉన్నట్లు 2019 ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇవాళ 2023 జాబితాను చూస్తే పేరు, చిరునామాలో చిన్న మార్పులు, ఫోటోల మార్పుతో.. ఒకే మనిషికి రెండు మూడు చోట్ల దాదాపు 40 లక్షల ఓట్లు ఉండగా.. తెలంగాణ, ఏపీలో రెండు చోట్లా ఓట్లున్న వారు దాదాపు 16.59 లక్షల మంది ఉన్నారు. ► 9,242 ఇళ్లలో 20 నుంచి 30 ఓట్ల వరకు ఉండగా 2,643 ఇళ్లలో 31 నుంచి 40 ఓట్ల వరకు ఉన్నాయి. 1,223 ఇళ్లలో 41–50 ఓట్లున్నాయి. ఇంకా 1,614 ఇళ్లలో 51–100 వరకు ఓట్లున్నాయి. 386 ఇళ్లలో 101–200 ఓట్లున్నాయి. 96 ఇళ్లలో 201 నుంచి ఏకంగా 500 వరకు ఓట్లున్నాయి. 14 ఇళ్లలో 501 నుంచి 1,000 ఓట్ల దాకా ఉన్నాయి. ఇవన్నీ 2019 ఓటర్ల జాబితాలో కూడా ఉన్నాయి. ఇక ఏ డోర్ నెంబరూ లేకుండా ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లున్నాయో కూడా సీఈవోకు వివరించాం. 2019లో కూడా ఆ ఓట్లపై చర్యలు తీసుకోవాలని మేం కోరినా అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరిపి ఓటర్ల జాబితాను సవరించాలని సీఈవోను కోరాం. నాడు కళ్లు మూసుకున్నావా రామోజీ? ► ఒకే డోర్ నెంబరుతో 500 ఓట్లున్నాయని ఈనాడు రామోజీరావు మమ్మల్ని నిందిస్తున్నారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారం విజయవాడ సూర్యారావుపేట పోలింగ్ బూత్‌ను పరిశీలిస్తే కడియాలవారి వీధి పేరుతో ఉన్న డోర్ నెంబర్లో 2019లో కూడా 500 ఓట్లు ఉన్నాయి. మరి ఆ ఆషాఢభూతి ఇప్పుడు కొత్తగా ఓట్లు చేర్చారని మాపై ఆరోపణలు చేస్తున్నారు. పాపాలు చేసింది వారైతే నిందలు మోపేది మాపైనా? ► రేపల్లెలో ఎడాపెడా దొంగ ఓట్లున్నాయని ఒక పేపర్లో రాశారు. నిజానికి అది 2019 నాటి ఓటర్ల జాబితా. అప్పుడే అవకతవకలు చేశారు. ఒకే డోర్ నెంబర్లో 148 ఓట్లు న్నాయి. జర్నలిస్టుల ముసుగులో కుల పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయి. ఆ అవకతవకలన్నీ 2019 ఓటర్ల జాబితాలో ఉన్నాయి. మరి ఆనాడు ఎందుకు వార్తలు రాయలేదు? ► పార్వతీపురం నియోజకవర్గంలో సున్నా నెంబర్ ఇంట్లోనూ వందల సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. మరి ఆనాడు మీకు ఇవేవీ కనిపించలేదా? ధృతరాష్ట్రుడిలా రామోజీకి కళ్లు కనిపించలేదా? ► 2019లోనే ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగాయి. అప్పుడే మేం వాటిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వాటిని ఇప్పుడు మేం సవరిస్తుంటే దొంగ ఓట్లు చేరుస్తున్నామంటూ నిందిస్తున్నారు. జాబితాలో పెరిగిందెక్కడ? రాష్ట్రంలో 2019 జనవరి నాటికి 3,98,34,776 మంది ఓటర్లు ఉండగా 2023 జనవరి నాటికి 3,97,96,678 మంది ఓటర్లున్నారు. మరి అలాంటప్పుడు మేం కొత్తగా ఓటర్లను ఎక్కడ చేర్పించినట్లు? మేం నిజంగా ఆ పని చేసి ఉంటే ఓటర్ల సంఖ్య పెరగాలి కదా? గజదొంగ చంద్రబాబు దొంగతనాలు చేసి నీతికధలు చెబుతున్నాడు. ఓటమి భయంతో మాపై ఆరోపణలు చేస్తున్నాడు. ప్రజలను కాకుండా కుట్ర రాజకీయాలను నమ్ముకున్న చంద్రబాబును సమర్థిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు రాస్తున్నాయి. డూప్లికేట్లనే తొలగించామని సీఈవోనే చెప్పారు ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దొంగ ఓట్లను గుర్తించి 2020లో 1,85,193 ఓట్లను తొలగించింది. 2021లో 1,11,076 ఓట్లు, 2022లో 11.23 లక్షల ఓట్లు వెరసి మొత్తం 14 లక్షలకు పైగా దొంగ ఓట్లను తొలగించారు. డూప్లికేట్ ఓట్లు, ఒకే ఫోటో ఉన్న ఓట్లకు సంబంధించి 10,52,326 ఓట్లను తొలగించినట్లు సీఈవోనే స్వయంగా మీడియాకు చెప్పారు. ఒకవేళ మేం దొంగ ఓట్లను చేర్పిస్తే ఇలా తొలగిస్తామా? ఆ నీచ రాజకీయం బాబుదే.. రాష్ట్రంలో 2019 ఓటర్ల జాబితాలే ఇవాళ్టికి కూడా కొనసాగుతున్నాయి. ఆ లోపాలను సవరించమని మేం కోరుతున్నాం. దొంగ ఓట్లను చేర్చడం.. అవతల పార్టీ ఓట్లను తొలగించడం చంద్రబాబుకే అలవాటు. తప్పుడు మార్గాల్లో గెలవాలని ప్రయత్నించడం ఆయనకు ఆనవాయితీ. ► తెలంగాణకు చెందిన బీజేపీ నేత బండి సంజయ్ కూడా మమ్మల్ని విమర్శిస్తున్నాడు. చంద్రబాబు కోసం ఆయన పని చేస్తున్నారు. ఎందుకీ దిక్కుమాలిన రాజకీయాలు? ► నాడు టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అంటే 2015 జనవరి నాటికి 22,76,714 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. మరో ఏడాదిలో అంటే 2016లో 13,00,613 మంది ఓటర్లను తొలగించారు. 2017లో మరో 14,46,238 మందిని తొలగించారు. అలా మూడేళ్లలో టీడీపీ హయాంలో మొత్తం 50,23,565 మంది ఓటర్లను జాబితాల నుంచి తొలగించారు. ► సేవామిత్ర అనే యాప్ ద్వారా వైఎస్సార్సీపీ సానుభూతిపరులను గుర్తించి వారందరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. దానిపై మేం పోరాడాల్సి వచ్చింది. కోర్టులు, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి ఆ ఓట్లను తిరిగి చేర్పించే ప్రయత్నం చేశాం. -
స్వతంత్ర భారత్ తొలి ఓటర్ కన్నుమూత..
-
చివరి ఘట్టానికి మునుగోడు ఉప ఎన్నిక.. అంతుచిక్కని ఓటరు నాడి!
సాక్షి, యాదాద్రి: మునుగోడు ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంటోంది. అయితే ఈ ఎన్నికలో రాజకీయ పార్టీలకు ఓటరు నాడి మాత్రం అంతుచిక్కడం లేదు. ప్రధాన పార్టీలన్నింటికీ జై కొట్టిన ఓటర్లు.. ఆత్మీయ సమ్మేళనాలు, ర్యాలీలు, బహిరంగ సభలు.. ఏ పార్టీ నిర్వహించినా హాజరయ్యారు. ఓట్ల కోసం వచ్చిన వారి వద్ద గుళ్లు, సామాజిక అవసరాలకు పార్టీలతో ప్రమేయం లేకుండా హామీలు తీసుకున్నారు. కానీ ఓటు వేసే విషయంలో మాత్రం గోప్యతను పాటిస్తున్నారు. తమ అంతరంగాన్ని ఎవరికీ చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఓటరు తీరు ప్రధాన రాజకీయ పార్టీల అంతరంగంలో తుఫాన్ సృష్టిస్తోంది. అయితే ప్రధాన పార్టీల ప్రలోభాల ప్రభావం ఓటర్లపై కొంతమేర ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. ఈ పార్టీల నాయకులు గెలుపును సవాల్‌గా తీసుకుని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సీసీరోడ్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, మంచినీటి నల్లాలు ఇలా పలు సమస్యలకు సంబంధించి ఓటర్లు.. అభ్యర్థుల నుంచి కొన్నిసాధించుకోగా, మరికొన్నింటికి హామీలు పొందారు. అయితే ఓటు వేసే విషయంలో ఎవరికి స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయా పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ముందే వసూలు సంస్థాన్ నారాయణపురం మండలంలోని గ్రామస్తులు ఓ పార్టీ బహిరంగ సభ కోసం వెళ్లేందుకు ఇస్తామన్న డబ్బును ముందుగానే తీసుకున్నారు. సభ కోసం వెళ్లడానికి గ్రామంలో వాహనం ఎక్కిన వెంటనే డబ్బులు ఇవ్వాలని ఇన్చార్జి నాయకులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో గ్రామ శివారులో వాహనం ఆపి డబ్బులు ఇచ్చిన తర్వాతే సభకు బయలుదేరారు. రెండు పార్టీల సహాయం పొందారు చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో ఓటర్లు మాతమ్మ గుడి అభివృద్ధికి రెండు పార్టీల సహకారం కోరారు. దీంతో ఓ పార్టీ నాయకులు దేవాలయం చుట్టూ కాంక్రీటు, దేవాలయానికి టైల్స్, ఆలయం ముందు పైకప్పుకు రేకులు వేయించారు. మరో పార్టీ.. ఆలయం ముందు భవన నిర్మాణం చేపట్టింది. రెండు పార్టీలను వాడుకున్న ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారన్నది అంచనా వేయలేకపోతున్నారు. పలు గ్రామాల్లో ఇలాంటి పరిస్థితే ఉందని అంటున్నారు. ఇంకా నిర్ణయించుకోలేదు ఒక్కో అభ్యర్థి ఒక్కో రీతిలో ఉన్నారు. ఏ పార్టీ కూడా భవిష్యత్తుపై భరోసా ఇవ్వలేకపోతోంది. వాళ్లు చెప్పేది నమ్మబుద్ధి కావడం లేదు. ఓటు ఎవరికి వేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. – సుర్కంటి విజయ్, ఎల్లంబావి, చౌటుప్పల్ మండలం ఆలోచిస్తున్నాం ఎవరికి ఓటు వేయాలన్నది ఇంకా ఆలోచిస్తున్నాం. మాకు మంచి చేసిన వాళ్లకే ఓటు వేస్తాం. నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఇల్లు నిర్మించి ఇవ్వాలి. – దోర్నాల సత్యనారాయణ, నారాయణపురం సరైన వ్యక్తికి ఓటు వేస్తా నాకు కొత్తగా ఓటు హక్కు లభించింది. ఇంతలోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. అన్ని పార్టీల నాయకులు వస్తున్నారు. ఓటు వేయమని అభ్యర్థిస్తున్నారు. తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న క్రమంలో అన్ని రకాలుగా ఆలోచించి సరైన అభ్యర్థికి ఓటు వేస్తాను. – ఎండీ సోహెల్, చౌటుప్పల్ -
ఓటు హక్కు లేదా..? ఇలా నమోదు చేసుకోండి..
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఓటు హక్కుకు యువత దూరమైతే ప్రజాస్వామ్యానికి సరైన న్యాయం జరగదు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కల్పించాలన్న లక్ష్యంతో ఈ నెల 1 నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారభమైంది. ఈ మేరకు భారత ఎన్నికల కమిషన్ ఓటు నమోదులో మార్పులు, చేర్పులతో పాట సవరణలకు అవకాశం కల్పిస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త ఓటర్ల నమోదుకు వీలు కల్పిస్తూ ఓటర్ల జాబితా స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. 2022 జనవరి 1 వతేదీ నాటికి 18 ఏళ్ళు నిండిన యువత తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా గతంలో ఓటు హక్కు పొందలేకపోయినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. తుది ఓటర్ల జాబితా ప్రకటించే ముందు ఈ నెల 6, 7, 27, 28 వ తేదీలలో డిసెంబర్లో రెండు రోజుల పాటు అధికారులు ఓటు నమోదుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. కొత్తగా ఓటరు నమోదుతో పాటు మార్పులు, చేర్పులు, తొలగింపులు, అభ్యంతరాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రంగారెడ్డి మాడ్గుల మండలంలోని 33 గ్రామపంచాయతీలలో 35,245 మంది ప్రస్తుత ఓటర్లు ఉండగా, అందులో 18,738 మంది పురుష ఓటర్లు, 16,500 మహిళ ఓటర్లు, 7 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. మండలంలో గ్రామాల్లో 50 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి పోలింగ్ పరిధిలో బీఎల్ఓలు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరిస్తారు. చదవండి: ‘దొంగ’ తెలివి.. అమ్మవారికి మొక్కి పని కానిచ్చేశాడు.. వైరలైన దృశ్యాలు నేరుగా వెళ్లి నమోదు.. ఓటరు నమోదు, మార్పుల, చేర్పులు, అభ్యంతరాలపై పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్ఓలు, గ్రామపంచాయతీలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పంచాయతీల్లో ఓటరు జాబితా సిద్ధంగా ఉంచారు. పేర్లు ఉన్నాయో లేవో చూసుకుని వెంటనే నమోదు చేసుకోవచ్చు. జాబితాలో అభ్యంతరాలుంటే తెలపవచ్చు. మరణించిన వారి పేరు జాబితాలో ఉంటే, ఇతర ప్రాంతాల్లో నమోదై ఉన్నట్లు ఆధారాలుంటే ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. తాను కోరుకున్న చోటుకు తమ పేరు బదిలీ చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్లో దరఖాస్తు ఇలా.. డిసెంబర్ 15వ తేదీ లోపు ఓటరుగా ఆన్లైన్లో దరఖాస్తు నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోదల్చినవారు ముందుగా ఠీఠీఠీ.ఛ్ఛి్టౌ్ఛl్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్సైట్లోకి వెళ్లి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు స్కాన్ చేసి ఆప్‌లోడ్ చేయాలి. వీటిని సంబం«ధిత అధికారులు పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే 2022 జనవరి 15 న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ఈ ధ్రువపత్రాలు తప్పనిసరి పేరు నమోదు చేసుకునే వారు వయస్సు నిర్ధారణ పత్రాలు తీసుకెళ్లాలి. విద్యాసంస్థ జారీ చేసిన బోనఫైడ్ సర్టిఫికెట్ లేదా ఆధార్‌కార్డు ఉండాలి. దరఖాస్తు ఫారాలను పూరించి ధ్రువీకరణ పత్రాల నకళ్లు జతచేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. యువత సద్వినియోగం చేసుకోవాలి మండలంలోని 50 పోలింగ్ కేంద్రాలకు బీఎల్ఓలను నియమించాం. వారు ప్రతి పోలింగ్‌బూత్‌లో అందుబాటులో ఉంటారు. నూతన ఓటర్ల నమోదు, సవరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మార్పులు, చేర్పులు ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాçస్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఓటు హక్కు ప్రాముఖ్యత గుర్తించాలి. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు నమోదుకోసం తమతమ పేర్లు నమోదు చేసుకోవాలి. -
మీకు తెలుసా.. ఓట్లు ఎన్నిరకాలుగా వేయవచ్చో..?
సాక్షి, కరీంనగర్: ఓటర్లు నేరుగా ఎన్నికల కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం పరిపాటే. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓటును పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడమే కాకుండా... ఐదు రకాలుగా అవకాశాలు కల్పించింది. అంటే... ఒక్కఓటు.. ఐదు రకాలన్న మాట. సాధారణ ఓటు... 18 ఏళ్లు నిండిన పౌరులు దేశంలో ఓటు హక్కును కలిగి ఉంటారు. వీరు నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓట్లు వేస్తారు. దీనిని సాధారణ ఓటుగా పరిగణిస్తారు. ఈ పద్ధతిలోనే అత్యధిక శాతం పోలింగ్ జరుగుతుంది. టెండర్ ఓటు... ఓటరు జాబితాలో పేరుండి పోలింగ్ కేంద్రం వద్దకు పోయేసరికి తమ ఓటును ఇంకొకరు వేశారనుకోండి... ఆ తర్వాత అసలైన ఓటరు వస్తే.. టెండరు ఓటు వేసే అవకాశం ఉంది. దీనిని టెండరు ఓటు అంటారు. చదవండి: (Huzurabad Bypoll: వారిని ఖుషీ చేసేందుకు కోళ్లు, పొట్టేళ్లు డోర్ డెలివరీ) సర్వీస్ ఓటు... సరిహద్దుల్లో సైనికులు, పారా మిలటరీ దళాల ఉద్యోగులు ఈ విధానంలో ఓట్లు వేస్తారు. వీరంతా స్వగ్రామాలకు దూరంగా ఉంటారు కాబట్టి ఎన్నికల సంఘం వీరికి సర్వీస్ ఓటు వేసే అవకాశం కల్పించింది. ప్రాక్సీ ఓటు... తమకు బదులుగా ఇతరులను పంపి ఓటు వేయించే ప్రక్రియను ప్రాక్సీ ఓటు అంటారు. దీనిని ఇంటెలిజెన్స్, గూఢచారి సిబ్బంది ఇటువంటి విధానాన్ని వినియోగించుకుంటారు. ఇటువంటి ఓట్లు తక్కువగా కనిపిస్తుంటాయి. పోస్టల్ బ్యాలెట్.... ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ సిబ్బంది స్వస్థలాలకు వెళ్లి ఓటు వేసే వీలుండదు.దీంతో వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. పోస్టు ద్వారా తాము వేయదలుచుకున్న అభ్యర్థికి ఎన్నికల సిబ్బంది ఓటు వేసుకుంటారు. కాబట్టి ఈ పద్దతిలో ఓటు వినియోగించుకోవడాన్ని పోస్టల్ బ్యాలెట్ అంటారు. -
‘అతి’ విశ్వాసమే.. ముంచిందా?
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయంతో కమలనాథుల్లో కలవరం మొదలైంది. రెండు స్థానాల్లోనూ తమ అభ్యర్థుల ఓటమికి కారణాలను బీజేపీ విశ్లేషించుకుంటోంది. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సాధించిన విజయాలతో వచ్చిన ఊపును (సాను కూల వాతావరణాన్ని) చేజేతులా జారవిడుచుకు న్నామన్న అభిప్రాయం ఈ సమీక్షల్లో వ్యక్తమ వుతోంది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాల్సిన స్థానంలోనూ ఎందుకు ఓడిపోయామని పార్టీ శ్రేణుల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హైదరాబాద్–రంగారెడ్డి– మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఎలాగూ గెలుస్తామన్న అతివిశ్వాసమే తమను దెబ్బకొట్టిందని, అదే టీఆర్ఎస్ విజయానికి కారణమైందన్న విశ్లేషణలు పార్టీ వర్గాల్లో జోరందుకున్నాయి. ఈ పరిస్థితుల్లో నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో ఎలా ముందుకు సాగాలన్న విషయంలో ముఖ్యనేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఇంకొంచెం కష్టపడితే సిట్టింగ్ దక్కేది హైదరాబాద్ స్థానంలో తాము ఇంకొంచెం కష్ట పడితే బయటపడేవారమనే అభిప్రాయం పార్టీలో పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది. ప్రచారంలోనూ టీఆర్ఎస్ చేసే విమర్శలను తిప్పికొట్టడం పైనే ప్రధానంగా దృష్టి సారించిన పార్టీ నేతలు... కేంద్రంలో మోదీ ప్రభుత్వ విజయాలను, గెలిపిస్తే తామేం చేస్తామన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో విఫలమయ్యారనే చర్చ బహిరంగం గానే జరుగుతోంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలపై దృష్టి సారించినంతగా, హైదరాబాద్ ఓటర్లపై దృష్టి పెట్టలేదని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా గెలిచిన కార్పొరేటర్లను సమన్వయం చేసుకుని వారి సేవలను వినియోగిం చుకునే విషయంలో కొంత వెనుకబడ్డామన్న భావన పార్టీ వర్గాల్లో నెలకొంది. ఇక నల్లగొండ– ఖమ్మం–వరంగల్ నియోజకవర్గంలోనూ క్షేత్ర స్థాయికి వెళ్లడంలో వెనుకబడటం వల్లే నాలుగో స్థానానికి పడిపోవాల్సి వచ్చిందని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇంకొంచెం కష్టపడితే తమకు సిట్టింగ్ స్థానం దక్కేదన్న భావన కమలనాథుల్లో వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థికి, తమకు మధ్య తొలి ప్రాధాన్యత ఓట్లలో 8 శాతమే తేడా ఉండటాన్ని ఉదహరిస్తున్నారు. ఈ స్వల్ప వ్యత్యాసాన్ని భర్తీ చేసే విధంగా క్షేత్రస్థాయి కేడర్‌ను కదిలించడంలో పార్టీ నాయకత్వం విఫలమైందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఈ స్థానంలోని వేయి బూత్‌లలో ఒక్కో బూత్ నుంచి అదనంగా 10 చొప్పున ఓట్లను పొందేందుకు ఇంకొంచెం కష్టపడితే గెలుపు దక్కేదని విశ్లేషణలు చేస్తున్నారు. మరోవైపు ప్రతి 25 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించినా ప్రయోజనం చేకూరలేదని, వారు నిరంతరం ఓటర్లతో టచ్‌లో ఉండటంలో విఫలమయ్యారని అభిప్రాయపడుతున్నారు. క్రమశిక్షణగల పార్టీగా పేరున్న బీజేపీలో ఇన్చార్జుల స్థాయిలో విఫలమైతే భవిష్యత్తులో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు పునాదే లేకుండా పోతుందనే ఆందోళన బీజేపీ కీలకనేతల భేటీలో వ్యక్తమైనట్లు సమా చారం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. -
ఏమో సార్.. చూడలేదు!
ఇదేమీ హాస్యంగా స్వీకరించవలసిన సంగతి కాదు. దేవుడు ఒకరికి ఒకరు అర్థం కాకుండా టీవీ రిపోర్టర్ లను, సామాన్యులను ఒకే చోట పుట్టించి ఈ లోకాన్ని అర్ధవంతం చేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తాడో తాత్వికంగా తర్కించవలసిన బిహార్ ఎన్నికల ‘బైట్’! ఆ రాష్ట్రంలో అక్టోబర్ 8, నవంబర్ 3 తేదీలలో పోలింగ్ జరిగింది. ఈ రోజు చివరిదైన మూడో విడత పోలింగ్ జరుగుతోంది. నాయకులు కూల్‌గా ఉన్నారు. ఓటర్లను కూల్‌గా ఉంచుతున్నారు. మీడియా వాళ్లే.. తమ కర్తవ్యాన్ని నిర్వహణలో భాగంగా శీతలం నుంచి ఉష్ణాన్ని పుట్టించే పనిలో ఉన్నారు. మొన్న ఒకనాడు ’బిహార్ తక్’ అనే ఒక లోకల్ టీవీ ఛానెల్ రిపోర్టర్ ముఖానికి మాస్క్ వేసుకుని గన్ మైక్ పట్టుకుని ఓటర్ల మనోభావాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఓ పెద్దాయన దగ్గర వెళ్లి ఆయన ముఖం మీద మైక్ పెట్టాడు. ‘పెద్దాయనా పెద్దాయనా.. క్యా ఆప్ కే గావ్ మే వికాస్ పహుంచా హై’ అని అడిగాడు. ‘అభివృద్ధి మీ ఊరిదాకా వచ్చిందా?’ అని. వికాస్ అంటే అభివృద్ధి. పెద్దాయన కళ్లద్దాలలోంచి రిపోర్టర్ ప్రశ్నను విన్నాడు. ‘అభివృద్ధా! ఏమో సర్. అప్పుడు నేనిక్కడ లేను. జ్వరమొచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్లా..‘ అని చెప్పాడు. ఈ వీడియో ఇప్పుడు దేశమంతటా వైరల్ అవుతోంది. వికాస్ ఎక్కడున్నాడో తెలిసిందా? వికాస్ గురించి ఏమైనా తెలిసిందా? ఎవరు వికాస్? ఎవరి వికాస్ అని మీమ్స్ వస్తున్నాయి. పెద్దాయన అమాయకంగా చెప్పినా ఉన్న విషయమే చెప్పాడని కొందరు ట్వీట్లతో చప్పట్లు, ఈలలు కొట్టారు. దేవుడు ఒకరికొకరు అర్ధంకాకుండా రిపోర్టర్ లను, ఓటర్లను పుట్టిస్తాడని మన అజ్ఞానాంధకారం కొద్దీ అనుకున్నా ఎన్నికల టైమ్ లో అందరికీ అన్నీ అర్థం చేయిస్తాడు గావును! -
'శ్వాస ఉన్నంత వరకు ఓటు వేస్తూనే ఉంటా'
ఢిల్లీ : 'నా దృష్టిలో ఓటు అనే పదానికి చాలా విలువ ఉంది. ఈ ఆయుధంతోనే రాజకీయ పార్టీల భవితవ్యం ముడిపడి ఉంటుంది.అందుకే నా చివరి శ్వాస వరకు నేను ఓటు వేస్తూనే ఉంటానని' 110 ఏళ్ల వృద్దురాలు కలితారా మండల్ పేర్కొన్నారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కలితారా మండల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వాతంత్రానికి పూర్వం కలితారా మండల్ కుటుంబసభ్యులు బంగ్లాదేశ్‌లోని బరిసాల్ ప్రాంతంలో నివసించేవారు. అయితే బంగ్లాదేశ్ విభజన అనంతరం వీరి కుటుంబం ఢిల్లీకి వచ్చి స్థిరపడింది. ఈ నేపథ్యంలో మండల్‌ను ఒక మీడియా చానెల్ పలకరించింది. విభజన తర్వాత తొలిసారి ఓటు ఎప్పుడు వేసారని కలితారా మండల్‌ను అడగ్గా..' నాకు ఆ విషయం గుర్తు లేదు గాని కాంగ్రెస్ పార్టీకి ఎక్కవసార్లు ఓటు వేశాను. విభజన అనంతరం మా కుటుంబం చాలా కాలం శరణార్థుల శిబిరంలో జీవించాము.ఆ తర్వాత మేము అక్కడి నుంచి చత్తీస్‌ఘర్‌కు వెళ్లిపోయాము. నా పెద్దకొడుకు సుఖ్రాజన్ మండల్ ఉద్యోగ విషయమై ఢిల్లీకి బదిలీ అవ్వడంతో అప్పుడప్పుడు అక్కడికి వెళ్లేదాన్ని. తర్వాత నా చిన్నకొడుకు వ్యాపారాన్ని ఢిల్లీకి మార్చడంతో అప్పటి నుంచి మేము ఢిల్లీలోనే నివసిస్తున్నాం. అప్పటి నుంచి 2014 వరకు అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశాను. అయితే 2014 సాధారణ ఎన్నికల్లో తొలిసారి ప్రధాని మోదీ బొమ్మను చూశాను. ఆయన గురించి నా కుటుంబసభ్యులు వివరించడంతో అప్పటి ఎన్నికలలో హస్తం గుర్తుకు కాకుండా పువ్వు గుర్తుకు ఓటు వేశాను. ఇందిరాగాంధీ మరణించినప్పుడు ఢిల్లీలో తలెత్తిన భీతావహ పరిస్థితులు నాకు ఇంకా గుర్తున్నాయి' అంటూ కలితారా మండల్ చెప్పుకొచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి గ్రేటర్ కైలాష్ నియోజకవర్గంలో కలితరా మండల్ ఓటు వేయనున్నారు. కాగా ప్రస్తుతం ఢిల్లీలో కొందరు రాజకీయ నాయకుల పేర్లు చెప్పమని అడిగితే.. తనకు హస్తం, పువ్వు తప్ప ఇంక ఏం గుర్తులు తెలవదని మండల్ సమాధానమిచ్చారు. 2014లో ఢిల్లీలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కలితారా మండల్ తన మనవడిని తీసుకొని వీల్‌చైర్‌లో వెళ్లి ఓటు వేసి వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం పోస్టల్ బాలెట్ ద్వారా మండల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటివరకు ఆర్మీ కుటుంబసభ్యలకు మాత్రమే పోస్టల్ బాలెట్ వినియోగించుకునే అవకాశం ఉండేది. అయితే ఢిల్లీ ఎన్నికల సంఘం రాష్ట్రంలో 80ఏళ్లు పైబడిన వృద్దులకు పోస్టల్ బాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించింది. మండల్‌తో పాటు మొత్తం 4వేలమంది పోస్టల్ బాలెట్ ద్వారా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకోనున్నారు. -
బెదిరింపులతో ఓటర్ని ఆపలేరు
‘‘ఓటర్’ సినిమా విడుదల కాకుండా కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాని ఆపాలని బెదిరిస్తున్నారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా ఆపేది లేదు. అనుకున్న ప్రకారం నేడు విడుదల చేస్తున్నాం’’ అన్నారు ప్రశాంత్ గౌడ్. మంచు విష్ణు, సురభి జంటగా నటించిన చిత్రం ‘ఓటర్’. కార్తీక్ దర్శకత్వంలో జాన్ సుధీర్ పూదోట నిర్మించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అవుతోంది. గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో అడ్వకేట్ వేణుకుమార్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో జాన్ సుధీర్ పూదోట, కార్తీక్‌పై 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థ కోర్టులో కేసు వేసింది. సినిమాని ఆపాలంటూ వేసిన పిటిషన్‌ని కోర్టు తిరస్కరించింది. సినిమా విడుదల విషయంలో అభ్యంతరం చెప్పకుండా కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది’’ అన్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ– ‘‘12ఏళ్లుగా డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా, ఫైనాన్షియర్‌గా ఉన్నాను. నాపై ఇప్పటివరకూ ఎలాంటి వివాదాలు లేవు. ఓటర్ విలువ చెప్పే చిత్రం ఇది. ఈ పాయింట్ నచ్చి కొనుక్కున్నా. లీగల్‌గా విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కొంతమంది ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌తో ఉన్న పరిచయాలతో సినిమాని విడుదల చేస్తున్నా’’ అన్నారు. -
నాయకుడు పనిచేయకపోతే!
ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ముఖ్యమైనది. అటువంటి ఓటు విలువను తెలియజేసేలా రూపొందిన చిత్రం ‘ఓటర్’. విష్ణు, సురభి హీరోహీరోయిన్లుగా నటించారు. రామా రీల్స్ పతాకంపై జాన్ సుధీర్ పూదోట నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ దర్శకత్వం వహించారు. సార్థక్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేయనుంది. ‘‘పదవిలో ఉన్న నాయకుడు సరిగా పని చేయకపోతే అతనితో ఎలా పనులు చేయించుకోవాలో తెలిపే చిత్రం ఇది. ఓటు హక్కు, ఓటర్ విలువను తెలియజేస్తూనే, ఈ చిత్రాన్ని పొలిటికల్ డ్రామాగా కార్తీక్ బాగా తెరకెక్కించాడు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన సార్థక్ మూవీ సంస్థ మా సినిమాను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి ఎస్ఎస్. తమన్ స్వరకర్త. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ తనమాల. -
సందేశం + వినోదం
విష్ణు మంచు ఓటర్‌గా మారారు. ఓటర్‌గా ఓటు ప్రాముఖ్యతను చెప్పదలిచారు. ఇదంతా ‘ఓటర్’ సినిమా కోసమే. విష్ణు మంచు, సురభి జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఓటర్’. జి.ఎస్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధీర్ పూదోట నిర్మించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం యూ/ఎ సర్టిఫికెట్ పొందింది. ఈ సినిమాను జూన్‌లో రిలీజ్ చేయనున్నాం అని నిర్మాత తెలిపారు. ఈ సందర్బంగా నిర్మాత సుధీర్ మాట్లాడుతూ –‘‘ఓటు విలువ, ఓటర్ గురించి చెప్పే చిత్రమిది. చక్కని సందేశంతో పాటు వినోదం పంచే చిత్రం. దర్శకుడు కార్తీక్ చక్కగా తెరకెక్కించారు’’ అన్నారు. సంపత్, నాజర్, ప్రగతి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. -
చంద్రగిరిలో టీడీపీ ప్రలోభాలు
-
ఫొటో తీశాడు.. బుక్కయ్యాడు!
సాక్షి, వీపనగండ్ల: చట్టప్రకారం పోలింగ్ కేంద్రంలో ఫొటోలు తీయడం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం నేరంకాగా, పోలింగ్ కేంద్రంలో విధుల్లో ఉన్న అధికారే ఆ దృశ్యాలను చిత్రీకరించి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ సంఘటన మండలంలోని బొల్లారం గ్రామం 139వ పోలింగ్ కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామంలోని 139పోలింగ్ కేంద్రంలో లింగాల డీఆర్డీఏ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రమేష్‌నాయక్ ఓపీఓగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లను, ఈవీఎం వద్దకు వెళ్లి ఓటు వేస్తున్న దృశ్యాలను తన కెమెరాతో చిత్రీకరించారని ఈ విషయమై ఆ గ్రామానికి చెందిన ఓటర్లు ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్ ఫొటోలు చిత్రీకరించిన అధికారిపై విచారణ చేపట్టారు. తనకు వీడియోకాల్ వస్తే మాట్లాడాను తప్పా ఫొటోలు తీయలేదని సదరు ఓపీఓ సమాధానం ఇచ్చినట్లు తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశానుసారం ఫొటోలు చిత్రీకరించిన ఫోన్çను స్వాధీనం చేసుకొని పూర్తి స్థాయి విచారణ చేపట్టి అధికారులు నివేదికలు పంపనున్నట్లు తెలిపారు. -
ఓట్ల పండుగ.. జనం నిండుగ
సాక్షి,మెదక్: మెదక్ నియోజకవర్గంలో గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల సాంకేతిక లోపంతో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 273 పోలింగ్ కేంద్రాల్లో 72.84 శాతం పోలింగ్ జరిగింది. ఇందులో చిన్నశంకరంపేట మండలంలో 75 శాతం పోలింగ్ నమోదై నియోజకవర్గంలోనే ముందంజలో ఉంది. ఇక చిన్నశంకరంపేట మండలంలో 75 శాతం పోలింగ్ కాగా రామాయంపేట మండలంలో 73.76 శాతం, నిజాంపేటలో 69.49 శాతం, పాపన్నపేట మండలంలో 71.46 శాతం, రేగోడ్ మండలంలో 66 శాతం, పెద్దశంకరంపేట మండలంలో 69 శాతం, టేక్మాల్ మండలంలో 68.33 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణంలో గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టణంలోని 27 వార్డుల్లో మొత్తం 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలనుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటింగ్‌లో యువకులు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సందర్శించి ఓటింగ్ సరళిన అడిగి తెలుసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలను ఆకట్టుకునేందుకు బెలూన్ల తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు. నవాబుపేటలో మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, ఆయన సతీమణి గాయత్రి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే వైస్‌చైర్మన్ రాగి అశోక్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న యువకులు సెల్పీలు దిగుతూ సందడి చేశారు. శభాష్ పోలీస్ పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుగా నిర్వహించిన పలువురు కానిస్టేబుళ్లు తమ సేవా ధృక్పదాన్ని చూపి పలువురి చేత శభాష్ పోలీస్ అనిపించుకున్నారు. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే కేంద్రాలకు వచ్చిన వృద్ధులకు, వికలాంగులను సేవలందించారు. నడవలేని వికలాంగులు, వృద్ధులను ఎత్తుకొని పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. మహిళల కోసం వెయింటింగ్ హల్.. చిన్నశంకరంపేట(మెదక్): ఓటు వేసేందుకు గంటల తరబడి క్యూలో నిలబడాలి. అయితే ఓ గ్రామ సేవకుడి ఐడియా మహిళలకు క్యూౖలో నిలబడె శ్రమను తప్పించింది. మండలంలోని మడూర్‌లోని ఓ పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటుచేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారి కోసం వెయింట్ హాల్ ఏర్పాటుచేశారు. దీంతో ఎండలో వచ్చినవారు వెయింట్ హాల్ కూర్చొని సేదతీరారు. గ్రామ సేవకుడు యాదగిరిని పలువురు అభినందించారు. -
వలస ఓటర్లేరి?
సాక్షి,అడ్డాకుల: ఊర్లలో వరుసగా ఎన్నికలు...నాలుగు నెలల వ్యవధిలో మూడు ఎన్నికలు. నాలుగు నెలలుగా నాయకులు, కార్యకర్తలు ఎన్నికల కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఊర్లలో ఉండే ఓటర్లు ముందు జరిగిన రెండు ఎన్నికల్లో అంతా ఓట్లేశారు. పొట్టకూటి కోసం వలస వెళ్లిన ఓటర్లు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ఓటర్లు రెండు ఎన్నికల్లో ఓట్లు వేయడానికి కొంత ఉత్సాహం కనబర్చడంతో జిల్లాలో దేవరకద్ర నియోజకవర్గంలోనే అత్యధిక పోలింగ్ నమోదైంది. కానీ గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఓట్లు వేయడానికి ఓటర్లు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. వరుస ఎన్నికలకు తోడు వేసవికాలం ఎండలు తోడు కావడం లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపింది. వలస ఓటర్లే కాకుండా గ్రామాల్లో ఉన్న ఓటర్లు కూడా ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రాలను వెళ్లకపోవడంతో ఈసారి పోలింగ్ శాతం తగ్గిపోయింది. పోలింగ్ శాతం తగ్గడంతో ఏ పార్టీకి లాభం కలుగుతుంది, ఏ పార్టీకి నష్టం కలుగుతుందన్న దానిపై నేతలు లెక్కలేస్తున్నారు. తగ్గిన పోలింగ్ శాతం.. 2018 డిసెంబర్ 7న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 84.6శాతం పోలింగ్ నమోదైంది. అదే 2014 శాసనసభ ఎన్నికల్లో 71.67శాతం జరిగింది. ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 65.95శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 18శాతం తక్కువ పోలింగ్ జరిగింది. దేవరకద్ర మండలంలో 65.98శాతం, అడ్డాకుల 59.67 శాతం, కొత్తకోట 64.02శాతం, మూసాపేట 63. 23శాతం, మదనాపురంలో 67.04శాతం, భూ త్పూర్ 69.5శాతం, చిన్నచింతకుంట మండలం లో 69.14శాతం పోలింగ్ నమోదైంది. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా అడ్డాకుల మండలంలో అత్యల్పంగా 59.67శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. నియోజకవర్గ వ్యాప్తంగా 71,572 మంది పురుషులు, 71,728 మంది మహిళలు కలిపి మొత్తం 1,43,300 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వలస ఓటర్లు రాకపోవడంతోనేనా..! నియోజకవర్గంలోని గ్రామాలకు చెందిన కూలీలు ఎక్కువ మంది హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వారంతా ఎన్నికలప్పుడు ఊర్లకు వచ్చి ఓట్లు వేసి వెళ్తారు. మొన్న జరిగిన శాసనసభ, పంచాయతీ ఎన్నికల్లో నేతలు వలస ఓటర్లను ఊర్లకు రప్పించి ఓట్లు వేయించుకున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం వలస ఓటర్లపై నేతలు పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో పోలింగ్‌పై ప్రభావం పడింది. ఎండల తీవ్రత మూలంగా ఇతర గ్రామాలకు వెళ్లి ఓట్లు వేయాల్సిన చోట ఊర్లలో ఉండి కూడా చాలా మంది ఓట్లు వేయడానికి వెళ్లలేదని తెలుస్తోంది. -
ఒక్కసారి ఆలోచించండి!
సాక్షి, గూడూరు: గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలుపొందిన పాశం సునీల్‌కుమార్ అభివృద్ధి పేరుతో టీడీపీలోకి ఫిరాయించాడు. ఆ తరువాత అభివృద్ధిని విస్మరించి భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాడు. సిలికా అక్రమ తరలింపు, భూఆక్రమణల ద్వారా కోట్లకు పడగలెత్తాడు. తనను గెలిపించిన వైఎస్సార్సీపీ శ్రేణులను తన స్వార్థం కోసం వంచించడం చర్చనీయాంశంగా మారింది. పాశం టీడీపీలో ఎన్నో ఏళ్లు పనిచేసినా గుర్తింపు లభించలేదు. దీంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర సమయంలో వైఎస్సార్సీపీలో చేరారు. విలువలు, విశ్వసనీయతకు కట్టుబడిన, మాట తప్పని, మడమ తిప్పని దివంగత సీఎం వైఎస్సార్ తనయుడు జగన్మోహన్రెడ్డి గూడూరు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయనకు టికెట్ ఇవ్వగా ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది. అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణులను మోసం చేస్తూ టీడీపీ తీర్థం పుచ్చుకుని వెన్నుపోటు పొడిచారు. అప్పట్లో గూడూరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయించినట్లు సమర్ధించుకున్నారు. ఆ తరువాత నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారు. తన అభివృద్ధే ధ్యేయంగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. సిలికా అక్రమ రవాణా, లిక్కర్ సిండికేట్, భూఆక్రమణల ద్వారా కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలు ఉన్నాయి. నీరు–చెట్టు పనుల్లోనూ భారీగా అవినీతికి పాల్పడినట్లు విమర్శలు వచ్చాయి. గూడూరులోని ప్రధాన సమస్యలైన తాగునీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారు. రెండు పట్టణాలను కలిపే ఫ్లయిఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేయించలేకపోయారు. రైతుల సంక్షేమాన్ని విస్మరించారు. తెలుగుగంగ కాలువల ద్వారా సాగునీటిని అందించలేకపోవడంతో రైతులు పొలాలను బీళ్లుగా వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది. దుగరాజపట్నం పోర్టు సాధన దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జన్మభూమి కమిటీలతో ఎమ్మెల్యే పాశం అరాచక పాలన సాగించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి జన్మభూమి కమిటీ సభ్యుల సిఫార్సుల మేరకే సంక్షేమ పథకాలు మంజూరు చేశారు. దీంతో అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందని ద్రాక్షగా మారాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని. హోదా వస్తే రాష్ట్రానికి రాయితీలు వస్తాయి. తద్వారా పరిశ్రమలు వచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. అలాంటి ప్రత్యేక హోదాను ప్యాకేజీయే మేలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తాకట్టు పెట్టింది. ఆ తరువాత హోదా కోసం యువత ఉద్యమించడంతో యూటర్న్ తీసుకుంది. వైఎస్సార్సీపీ భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక హోదా కోసం ఆది నుంచి పోరాటం సాగిస్తోంది. ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా ప్రస్తుత అసెంబ్లీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌రావు తన ఎంపీ పదవిని తృణప్రాయంగా త్యజించి రాజీనామా చేశారు. దుగ్గరాజపట్నం పోర్టుతో గూడూరు ప్రాంత అభివృద్ధి సాధ్యమని నమ్మి దీక్షలు సైతం చేపట్టారు. పోర్టు కోసం కేంద్రంలోని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ‘పోర్టుకు నిధులు కేటాయింపు విభజన చట్టంలో పొందుపరిచి ఉన్నారు. కృష్ణపట్నం పోర్టు కోసం దుగరాజపట్నం అభివృద్ధిని సీఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి స్వయంగా చెప్పారు. సీఎం ఒక్క సంతకం చేస్తే పోర్టు పనులు ప్రారంభమవుతాయని’ వాకాడులో పోర్టు కోసం చేపట్టిన దీక్షలోనూ, పలు పత్రికా సమావేశాల్లోనూ వరప్రసాద్‌రావు వెల్లడించారు. -
ఓటర్లు ఎవరిని కరుణిస్తారో..
సాక్షి, వికారాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇక ఓటర్లు తీర్పు చెప్పడమే మిగిలి ఉంది ఉంది. పదిహేను రోజులుగా ప్రచారం చేసిన ఎంపీ అభ్యర్థులు తమ రాజకీయ భవిష్యత్తును ప్రజల చేతిలోపెట్టి మైకులు బంద్ చేశారు. జిల్లాలో మంగళవారం సాయంత్రం 5గంటలకు ఎన్నికల ప్రచారం ముగించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమను గెలిపించాలంటూ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా సభలు, సమావేశాలు, రోడ్‌షోలు నిర్వహించాయి. ఆయా పార్టీల అగ్రనేతలు తరలివచ్చి రాజకీయాన్ని వేడెక్కించారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి జనార్దన్‌రెడ్డి జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం చేశారు. తమను గెలిపిస్తే చేసే పనులను ప్రజలకు వివరించారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న సమస్యలకు పరిష్కారం చూపిస్తామని, అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తామని హామీలు గుప్పించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గులాంనబీ ఆజాద్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తదిరతులు వచ్చి తమ పార్టీ అభ్యర్థులకు ఓటేయాలని కోరారు. 15 రోజులుగా మోతమోగిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. చివరిరోజున అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేశాయి. తాండూరులో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డిని గెలిపించాలంటూ కోరుతూ మహేందర్‌రెడ్డి పట్టణంలో ప్రచారం చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతుగా తాండూరులో ర్యాలీ, రోడ్‌షో నిర్వహించారు. వికారాబాద్ పట్టణంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రచారం చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బి.జనార్దన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. పరిగిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు చివరిరోజు గ్రామాల్లో ప్రచారం చేశారు. వ్యూహాలకు పదును... లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఎంపీ అభ్యర్థులు ఓటర్లపైనే భారం వేశారు. గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తారోననే ఉత్కంఠ ప్రధాన పార్టీల్లో నెలకొంది. పోలింగ్‌కు కొద్ది గంటల గడువు మాత్రమే మిగిలి ఉండటంతో ఎంపీ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలుపు వ్యూహాలకు మరింత పదునుపెడుతున్నారు. వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మద్దతు కూడగట్టేందుకు ఎంపీ అభ్యర్థులు రంజిత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బి.జనార్దన్‌రెడ్డి తెరవెనుక జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 6 లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజార్టీ ఓట్లు తమకు దక్కేలా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. ప్రలోభాలు షురూ.. ఎన్నికల సమయం ముంచుకొస్తుండటంతో ఆయా పార్టీలు ప్రలోభాలకు తెరలేపాయి. గెలుపు కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.వికారాబాద్‌లోని రాజీవ్‌నగర్‌లో నిర్వహించిన పోలీసుల తనిఖీల్లో రూ.కోటియాభై లక్షల నగదు పట్టుబడటం సంచలనం రేపింది. ఈ డబ్బు పోస్టల్‌శాఖకు చెందినగా తెలిసింది. వికారాబాద్ నుంచి తాండూరుకు తరలిస్తుండగా పోలీసులు తమ డబ్బును పట్టుకున్నట్లు ఆశాఖ అధికారులు తెలిపారు. -
వలస జీవుల తీర్పెటో..?
సాక్షి, మహబూబ్‌నగర్: పాలమూరు.. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చేది ఈ ప్రాంతంలో నెలకొన్న కరువే.వ్యవసాయ భూములున్నా సాగుకు నీరు లేక.. స్థానికంగా చేసేందుకు పని దొరక్క పొట్ట కూటి కోసం ముంబై.. పూణె.. కర్ణాటక.. హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన లక్షలాది కుటుంబాలు గుర్తొస్తాయి. దశాబ్దాల కాలంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎంత మంది పాలకులు మారినా.. వలసజీవుల తల రాతలు మారడం లేదు. పరాయి ప్రాంతాల్లో వారు పడుతోన్న కష్టాలు గుర్తుకొస్తాయి. ‘స్థానికంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి జిల్లాను సస్యశామలం చేస్తాం.. నిరుద్యోగ యువత ఇతర ప్రాంతాలకు తరలివెళ్లకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అంటూ ప్రతిసారీ ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చే హామీలు గుర్తొస్తాయి. ఇప్పుడు మళ్లీ వలస జీవులతో మన నాయకులకు పని పడింది. ఈ నెల 11 తేదీన జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డ ఎంపీ అభ్యర్థులు తాజాగా వలస జీవుల ఓట్లనూ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుత ఎన్నికలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే బహిరంగసభలు, ర్యాలీలు, రోడ్ షోలు, కార్యకర్తలు.. కుల.. మత పెద్దలతో సమావేశాలు నిర్వహిస్తున్న అభ్యర్థులు తాజాగా ఇతర ప్రాంతాల్లో నివసిస్తోన్న వలస కూలీలు, కార్మికుల ఓట్లపై దృష్టి సారించారు. మూడున్నర లక్షలకు పైనే.. ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాలున్నాయి. మహబూబ్‌నగర్ పరిధిలో 15,05,190మంది, నాగర్‌కర్నూల్ పరిధిలో 15,88,746మంది ఓటర్లున్నారు. రెండు సెగ్మెంట్ల నుంచి మూడున్నర లక్షలకు పైగా మంది ఓటర్లు ఇతర ప్రాంతాల్లో వలస కూలీలు, కార్మికులుగా పని చేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణపేట అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న కోయిలకొండ, దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట, కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాజ్‌పేట, మద్దూరు, కోస్గి మండలాల నుంచి పెద్ద మొత్తంలో ముంబయి, బెంగళూరు, పూణె నగరాల్లో ఉంటున్నారు. మక్తల్ మండలం కర్లి, గుడిగండ, మంతన్‌గోడ్, అనుగొండ, జక్లేర్ ప్రాంతాలకు చెందిన ప్రజలు ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో ఉంటున్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధి నుంచి నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఎక్కువ మంది ముంబైలో ఉంటున్నారు. ఇలా వలస వెళ్లిన వారిని గుర్తించిన ఎంపీ అభ్యర్థులు, అనుచరులు వారికి ఫోన్లు చేస్తున్నారు. ఉగాది పండుగకు రాకున్నా.. పోలింగ్ రోజు కచ్చితంగా రావాలని అభ్యర్థిస్తున్నారు. ఉగాదికి తమ సొంతూర్లకు విచ్చేసిన వారి వివరాలు తీసుకుని వారిని కలుస్తున్నారు. ఎన్నికల తర్వాతే వెళ్లాలని అప్పటి వరకు ఏవైనా ఖర్చులున్నా తామే చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు. అందరి నోటా అదే మాటా.. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ ప్రచారాన్ని వేగిరాన్ని పెంచిన ఎంపీ అభ్యర్థులందరూ ‘వలస’ ఓట్లు రాబట్టేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకున్న అభ్యర్థులు తాము గెలిస్తే వలసలకు అడ్డుకట్ట వేసేలా స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ హామీలు చేస్తున్నారు. అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నాయకులందరూ క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ ఇలాంటి హామీలే ఇస్తున్నారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలో వస్తుందని.. నరేంద్రమోదీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారని.. తమను ఎంపీగా గెలిపిస్తే కేంద్రంతో పోరాడైనా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు తీసుకొచ్చి పనులు పూర్తి చేస్తామని, వలసలను నివారించేందుకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామంటూ బీజేపీ అభ్యర్థులు డీకే అరుణ, బంగారు శ్రుతి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు మహబూబ్‌నగర్ ప్రజల సమస్యలు తెలుసని.. ఎంపీగా గెలిస్తే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎవరూ వలస వెళ్లకుండా, వలస వెళ్లిన వారిని రప్పించి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కాంగ్రెస్ అభ్యర్థులు చల్లా వంశీచందర్‌రెడ్డి, మల్లురవి హామీలు ఇస్తున్నారు. వలస వెళ్లిన వారందరూ తిరిగి వచ్చేలా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వలసలకు అడ్డుకట్ట వేస్తామంటూ టీఆర్ఎస్ అభ్యర్థులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పోతుగంటి రాములు ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా ఈ ఎన్నికల్లో వలస జీవులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అని అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, పొదలకూరు : ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని, హెలికాప్టర్ గుర్తుతో వృద్ధుల ఓట్లు వేయించుకుని వైఎస్సార్సీపీకి నష్టం కలిగించాలని చూస్తున్నట్టు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని బిరదవోలు, పార్లపల్లి, మర్రిపల్లి, ఇనుకుర్తి, డేగపూడి, దుగ్గుంట పంచాయతీ గ్రామాల్లో ఎమ్మెల్యే శనివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ సోమిరెడ్డి ప్రజాశాంతి పార్టీకి కేటాయించిన హెలికాఫ్టర్ గుర్తుపై ఓ యువకుడిని అభ్యర్థిగా నిలబెట్టి తన వద్ద ఉంచుకుని కొద్దొగొప్పొ వైఎస్సార్సీపీ ఓట్లను నష్టపరచాలని చూస్తున్నట్టు ఆరోపించారు. అయితే ఫ్యాను గుర్తుతో పాటు తన ఫొటో, ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌రావు ఫొటోలు ఉంటాయన్నారు. ఇందువల్ల తేలిగ్గా గుర్తించి ఓటు వేసే అవకాశం ఉందన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నైనా గెలివాలని చూస్తున్నట్టు తెలిపారు. అయితే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు సోమిరెడ్డిని నాలుగో సారి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నట్టు విమర్శించారు. జగన్ సీఎం కావడం ఖామని, ఐదేళ్లలో పదేళ్ల అభివద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మెట్టప్రాంతమైన బిరదవోలు, ఇనుకుర్తి, మర్రిపల్లి పంచాయతీ గ్రామాలకు సాగునీటిని అందించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో రావుల చినఅంకయ్య, ఇంద్రసేనగౌడ్, అమర్నాథ్గౌడ్, వెన్నపూస దయకర్‌రెడ్డి లక్ష్మణ్‌రెడ్డి, శ్రీరాములు, లక్ష్మయ్య, పోసిన చినఅబ్బయ్య, కాకు నర్సారెడ్డి, ఎన్.గోపాల్‌నాయుడు, నీలి పెంచలయ్య, కోసూరు సుబ్రహ్మణ్యం, గోగుల గోపాలయ్య, అక్కెం రాఘవరెడ్డి, కైతేపల్లి సుబ్బయ్య, ఎస్.సుబ్బయ్య, అక్కెం రామకోటారెడ్డి, గార్ల పెంచలయ్య, జి.ఈశ్వర్‌రెడ్డి, రామలింగారెడ్డి, కె.నారాయణరెడ్డి, కల్యాణ్‌రాజు, కేతు రామిరెడ్డి, సుందరామయ్య, మోహన్‌రాజు, బాలకోటి, జయరామయ్య తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరిక ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో పలుగ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. బిరదవోలులో మాజీ సర్పంచ్ భర్త రావుల వెంకటనారాయణ, కైతేపల్లి మస్తానయ్య, చిడదల మస్తానయ్యలు వేర్వేరుగా మొత్తం 30 కుటుంబాల వారు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. ప్రభగిరిపట్నం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గోగుల చిన్నయ్య ఆధ్వర్యంలో గోగుల మస్తానయ్య, కాకు గోపాల్, దేవరాల నాగరాజు, కాకు హనుమయ్య తదితరులు 20 కుటుంబాల వారు వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. -
ఒక ఓటరు.. పది మంది సిబ్బంది
అరుణాచల్‌ప్రదేశ్ మలోగామ్ పోలింగ్ కేంద్రంలో ఏప్రిల్ 11న జరిగే పోలింగుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు పది మంది ఎన్నికల సిబ్బందిని నియమిం చారు. అయితే, ఆ పోలింగు కేంద్రంలో ఉన్నది ఒక్క ఓటరే. హయులియాంగ్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని ఈ పోలింగ్ కేంద్రంలో సొకెలా తయాంగ్ (39) అనే మహిళ ఒక్కరే ఓటు వేయనున్నారు. గ్రామంలో ఇంకా చాలామంది ఉన్నా.. వారి ఓట్లన్నీ వేరే పోలింగు కేంద్రంలో ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఇక్కడ సొకెలా ఆమె భర్త జెనెలాం తయాంగ్ ఓట్లు మాత్రమే ఉండేవి. ఇటీవల జెనెలాం తన ఓటుకు మరో బూత్‌కి మార్చుకున్నాడు. మలోగామ్ పోలింగు కేంద్రానికి వెళ్లడానికి నడక తప్ప మరో దారి లేదని, హయులియాంగ్ నుంచి అక్కడికి వెళ్లడానికి ఒక రోజు పడుతుందని ఎన్నిక ల అధికారులు తెలిపారు.‘‘ఓటరు ఒక్కరే ఉన్నా ప్రిసైడింగ్ అధికారి, ఇతర అధికారు లు, భద్రతా సిబ్బంది తదితర పది మందికి పైగా అక్కడ ఉండాలి. సొకెలా ఎప్పుడొచ్చి ఓటు వేస్తుందో తెలియదు కాబట్టి పొద్దుట 7 నుంచి సాయంత్రం 5 వరకు ఆమె కోసం ఎదురు చూడాల్సిందే. ‘ఒక్కరే కదా అని ఫలానా టైముకి వచ్చి ఓటెయ్యమని చెప్పే అధికారం మాకు లేదు’ అని ఎన్నికల అధికారి లికెన్ కొయు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8.94 లక్షల ఓటర్ల కోసం 2,022 పోలింగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో ఏడింటిలో పది మంది కంటే తక్కువ ఓటర్లు ఉన్నారు. లంటా పోలింగు కేంద్రంలో ఆరుగురే ఓటర్లు ఉన్నారు. 281 కేంద్రాల్లో వందలోపు ఓటర్లు ఉన్నారు. శివారుల్లో ఉన్న 518 పోలింగ్ కేంద్రాలకు నడిచే వెళ్లాలని, మూడు రోజులు పడుతుందని అంటున్నారు. -
మారాలి.. మార్చాలి
‘ఓటర్’... ఈ టాపిక్‌తోనే ప్రస్తుతం దేశ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. అతి త్వరలో ఎన్నికలు రానున్న తరుణంలో ‘ఓటర్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మంచు విష్ణు. రమా రీల్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని జాన్ సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. జి.ఎస్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను గురువారం విడుదల చేసింది చిత్రబృందం. ‘అహింసా మార్గం ద్వారా ఒక్క బులెట్ కూడా కాల్చకుండా స్వాతంత్య్రం తెచ్చుకున్న దేశం మనది.. మనం పేదరికం పైన పోరాటం చేశాం కానీ పేదలపైన పోరాటం చేయలేదు... మార్పు మనలో రావాలి.. మారాలి.. మార్చాలి.. మొదటగా మనం మార్చాల్సింది దేశంలో ఉన్న రాజకీయాల నాయకులని..’ అంటూ ఆవేశంతో విష్ణు ఈ టీజర్లో డైలాగ్స్ చెప్పారు. టీజర్లో హీరోతో విలన్ ‘నన్ను ట్రాక్‌లో పెట్టటానికి ఎవడ్రా నువ్వు’ అంటే... ఓటు వేసిన వేలును చూపిస్తూ ‘చుక్క కనపడట్లేదా... ‘ఓటర్’ అంటాడు హీరో. విలన్ ‘ఆఫ్ట్రాల్ ఓటర్’ అంటే ‘ఆఫ్ట్రాల్ ఓటర్ కాదు, ఓనర్’ అంటుంది విష్ణు పాత్ర. మంచు విష్ణు సరసన సురభి జంటగా రూపొందుతున్న ఈ చిత్రానికి యస్.యస్. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ తనమల. -
ఓటర్ లిస్టులో పేరుందా? మీరూ చెక్ చెసుకోండి
-నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. -1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. - www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. -జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ 9491602905 -జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. -మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. -గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు Check Your Vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు. -సాధారణంగా ఎన్నికల నామినేషన్‌కు వారం ముందు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -
కర్నూల్ : మీ ఓటు ఉందా.. ఒకసారి సరి చూసుకోండి
సాక్షి, కర్నూల్ : నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. -1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. - www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. - జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ప్రత్యేక సెల్ ఇన్చార్జ్ లక్ష్మిరాజు : 9704738448 - మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. - ప్రతి శనివారం పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. అక్కడ ఓటర్ల జాబితా అందుబాటులో ఉంటుంది. పేరు ఉందో, లేదో చెక్ చేసుకోవచ్చు. లేకపోతే ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. - ఎన్నికల నామినేషన్ దాఖలుకు చివరిరోజు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. - నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఈఆర్ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి (ఏఆర్ఓ) ఉంటారు. వారిని సంప్రదించడం ద్వారా ఓటుందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. - తహసీల్దార్ ఆఫీసులో.. తహసీల్దార్ లేదా ఎన్నికల విధులు కేటాయించిన అధికారులను కలిసి ఓటుందో లేదో తెలుసుకోవచ్చు. - తహసీల్దార్ కార్యాలయంలో ఎలక్షన్ సెల్ ఫోన్ నంబర్లు. కోసిగి : 99592 47332 మంత్రాలయం : 83339 88993 కౌతాళం : 83339 88995 పెద్దకడబూరు : 76748 59432 - బూత్ లెవల్ ఆఫీసర్స్ (బీఎల్ఓ) వద్ద ఆ బూత్ పరిధిలోని ఓటరు జాబితా ఉంటుంది. ఈ జాబితాను ప్రతి పంచాయతీ ఆఫీసులో ప్రదర్శిస్తారు. దీన్ని పరిశీలించి ఓటుందో లేదో తెలుసుకోవచ్చు. - ఒకవేళ మీ ఓటు లేదని తెలిస్తే.. పై మూడు స్థాయిల్లోనూ అక్కడికక్కడే తగిన ఆధారాలు చూపి, ఫారం–6 నింపి ఓటు నమోదు చేసుకోవచ్చు. - మీ–సేవ కేంద్రాల్లోనూ నిర్ణీత రుసుము తీసుకుని ఓటు ఉందో లేదో తెలియజేస్తారు. అలాగే, అక్కడే ఓటు నమోదు చేస్తారు. - ఎన్నికల షెడ్యూల్/నోటిఫికేషన్ విడుదలతో పాటే తాజా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. ఇది కలెక్టర్ నుంచి బూత్ లెవల్ అధికారి వరకు అందరి వద్దా ఉంటుంది. దీనిని పరిశీలించడం ద్వారా కూడా ఓటు వివరాలు కనుక్కోవచ్చు. ఒకవేళ ఓటు లేకుంటే.. ఓటు నమోదుకు గల అవకాశాల గురించి ఈఆర్ఓ, తహసీల్దార్, బూత్ లెవల్ అధికారిని సంప్రదించాలి. -
మీ ఓటుతో ప్రేమను చూపండి
నాగర్‌కర్నూల్: పిల్లల భవిష్యత్‌కు సంకల్పంతో ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ ఈ.శ్రీధర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ‘మీ ఓటుతో మీ ప్రేమను చూపండి’ అనే సంకల్ప కరపత్రాన్ని కలెక్టర్ విడుదల చేసి మాట్లాడారు. సంకల్ప పత్రాలను జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందజేయాలని అన్నారు. కుటుంబ సభ్యులు ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ ఓటును ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకునేలా సంకల్ప పత్రాలను తల్లిదండ్రులకు అందించి కుటుంబ సభ్యులకు ఓటు విశిష్టత తెలియపర్చాలని అన్నారు. దీనికోసం సంకల్ప పత్రాలను అన్ని పాఠశాలలకు పంపిణీ చేసి ప్రతి విద్యార్థికి అందేలా చూడాలని డీఈఓ గోవిందరాజులును ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో మధుసూదన్‌నాయక్, డీఈఓ గోవిందరాజులు, ఐసీడీఎస్ పీడీ ప్రజ్వల, జిల్లా అధికారులు అనిల్‌ప్రకాష్, మోహన్‌రెడ్డి, సుధాకర్, సాయిసుమన్, జయంత్‌కుమార్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. బాలల వెట్టి చాకిరిని అరికట్టాలి జిల్లాలో బాలల వెట్టి చాకిరిని అరికట్టాలని కలెక్టర్ ఈ.శ్రీధర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో బాండెడ్ లేబర్ విజిలెన్స్, చైల్డ్ లేబర్ టాస్క్‌ఫోర్స్ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బడిఈడు పిల్లలను పనిలో చేర్చుకుని వెట్టి చాకిరి చేయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆరేళ్లలోపు పిల్లలను అంగన్వాడీలో, 18 ఏళ్లలోపు పిల్లలు బడిలో ఉండేవిధంగా చూడాలన్నారు. పిల్లలను ఎక్కడైనా పనిలో పెట్టుకున్నట్లు కనిపిస్తే 1098కు సమాచారం అందజేయాలని తెలిపారు. హోటళ్లు, కిరాణషాపులు, రాత్రిళ్లు ఇటుక బట్టీల వద్ద పిల్లలను పనిలో ఉంచుకుంటే యజమానికి జరిమానా విధించడమే కాక జైలుశిక్ష వేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాలకు లేబర్‌ను తరలించే దళారులు, గుంపు మేస్త్రీలకు భారీ జరిమానా విధించాలని అన్నారు. ఎన్జీఓలు, ఇతర సంఘాలు సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించాలని కోరారు. లేబర్‌ను ఇతర రాష్ట్రాలకు తరలించాలంటే సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో కార్మికుల వివరాలు తెలిపి సర్టిఫికేట్ పొందాలన్నారు. జిల్లాలో ఇంకా బాండెడ్ లేబర్ ఎక్కడైనా ఉంటే వారిని గుర్తించి తగిన ఆర్థిక, సామాజిక సహకారం అందించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో బాండెడ్ లేబర్, చైల్డ్ లేబర్ లేకుండా చేసేందుకు సంబంధిత శాఖలు కృషిచేయాలని తెలిపారు. సమావేశంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో మధుసూదన్‌నాయక్, జిల్లా అధికారులు సాయిసుమన్, రవీందర్‌రెడ్డి, ప్రజ్వల, గోవిందరాజులు, సుధాకర్, జయంత్‌కుమార్, అనిల్ ప్రకాశ్, మధు, పలు ఫౌండేషన్ల సభ్యులు పాల్గొన్నారు. -
ఏప్రిల్‌లో ఓటింగ్
రాజకీయ నాయకులు పదవిలోకి రావాలన్నా, పోవాలన్నా ఓటే ముఖ్యం. అది వేసే ఓటర్ మరింత ముఖ్యం. ప్రస్తుతం ఓటును, ఓటర్ బాధ్యతను గుర్తు చేస్తూ మంచు విష్ణు ఓ చిత్రంలో నటించారు. ‘ఓటర్’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ పొలిటికల్ డ్రామాకు జి.ఎస్.కార్తిక్ దర్శకత్వం వహించారు. సురభి కథానాయిక. జాన్‌సుధీర్ పూదోట నిర్మాత. ఈ సినిమా ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత జాన్ సుధీర్ మాట్లాడుతూ – ‘‘మంచు విష్ణు తొలిసారి నటించిన పొలిటికల్ డ్రామా ఇది. ఓటు విలువను తెలియజేసే చిత్రం. షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా: రాజేష్ యాదవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ తనమల. -
ఏప్రిల్‌లో మంచు విష్ణు ‘ఓటర్’
‘ఢీ’, ‘దేనికైనా రెడీ’ లాంటి సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నారు హీరో మంచు విష్ణు. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరోకు.. ‘ఓటర్’ రూపంలో ఓ సూపర్ హిట్ దక్కనున్నట్లు తెలుస్తోంది. అసలే ఎన్నికల వేడిలో తెలుగు రాష్ట్రాలు ఉండగా.. అసలైన టైమ్‌కు ఓటర్ సినిమా రిలీజ్ చేయనుంది చిత్రయూనిట్. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ‘ఓటర్’.. చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. రమా రీల్స్ బ్యానర్‌పై జి.ఎస్.కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాన్‌సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నట్లు నిర్మాత జాన్ సుధీర్ పూదోట తెలిపారు. ఈ మూవీలో సురభి హీరోయిన్గా నటిస్తుంది. ఎస్.ఎస్.తమన్ సంగీత సారథ్యం వహిస్తుండగా రాజేష్ యాదవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సంపత్‌రాజ్, నాజర్, పోసాని కృష్ణముళి, ప్రగతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు
పశ్చిమగోదావరి , నరసాపురం రూరల్: ఓటును నోటుకు అమ్మితే ఐదేళ్లు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ ప్రచారం చేస్తున్నాడో అభ్యదయ ఓటరు. నరసాపురం మండలం కొప్పర్రుకు చెందిన కుంకటి కాంతారావు అనే రాజకీయ ఓనమాలు తెలిసిన ఓటరు తన ఇంటి గోడపై ‘ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు’ అంటూ రాసిన రాతలు రాజకీయ నాయకులకు చెంపపెట్టులా ఉన్నాయి. ప్రజాసామ్య వ్యవస్థలో ఓటరు తన ఓటు పదును చూపిస్తున్నట్టుగా ఉన్న రాతలు రాజకీయ చైతన్యం తీసుకువస్తాయని పలువురు అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం అని చాటేలా ఉన్న ఈ మాటలు ఆలోచింపజేస్తున్నాయి. -
27 లక్షల ఓట్లు గల్లంతా?!
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి దాదాపు 27 లక్షల ఓటర్ల పేర్లు గల్లంతవడం లేదా తొలగించడం ఎంతో ఆందోళనకరమైన అంశం. ఇటు మీడియాతోపాటు అటు సోషల్ మీడియాలో విస్తృతంగా విమర్శలు వెల్లువెత్తడంతో శుక్రవారం నాడు పోలింగ్ ముగిశాక ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అందుకు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. 27 లక్షల ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయంటే ప్రతి పది మంది ఓటర్లలో ఒకరికి ఓటు హక్కు పోయినట్లే. వేలు ముద్రల గుర్తింపు కలిగిన ఆధార్ కార్డులతో ఓటరు గుర్తింపు కార్డులను అనుసంధాలించాలంటూ 2015లో భారత ప్రభుత్వం నిర్ణయించినప్పటి నుంచే రాష్ట్రంలో ఓటర్ల తొలగింపు కార్యక్రమం ప్రారంభమైందన్న విమర్శలు గతంలోనే వెల్లువెత్తాయి. ఓటర్ల గుర్తింపు కార్డులకు కూడా ఆధార్ కార్డు నెంబర్లను అనుసంధాలించాలంటూ కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ ఎలక్టోరల్ రోల్ ప్యూరిఫికేషన్ అండ్ అథెంటికేషన్ (ఎన్ఈఆర్పీఏపీ)’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఒకరికి రెండు, మూడు ఓటరు గుర్తింపు కార్డులు లేకుండా చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నాడు కేంద్రం ప్రకటించింది. అయితే ఆధార్ కార్డు లేని వారు ఓటు హక్కును కోల్పోవాల్సి వస్తుంది కనుక తక్షణమే ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆధార్ కార్డులేని ఓటరును గుర్తించేందుకు నాడు కేంద్ర ఎన్నికల సంఘం ఓ సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ సాఫ్ట్‌వేర్‌ను అమలు చేయడం వల్ల ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయా? లేదా ఉద్దేశపూర్వకంగానే ఓటర్ల పేర్లను తొలగించారా ? అన్నది ప్రధాన ప్రశ్న. కొన్ని వర్గాల ప్రజల ఓట్లే గల్లంతయ్యాయి కనుక, ఉద్దేశపూర్వకంగానే ఓటర్ల పేర్లను తొలగించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ కారణంతో ఓటర్ల పేర్లను తొలగించిన సదరు ఓటర్లకు సమాచారం తప్పనిసరిగా అందించడం ఎన్నికల సంఘం బాధ్యతని, ఏ కారణంతో తొలగించాల్సి వస్తుందో, మళ్లీ దరఖాస్తు ఎలా చేసుకోవాలో, అందుకు కావాల్సిన ధ్రువపత్రాలేవో కూడా స్పష్టంగా వివరించాలంటూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఆ మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్రంలో పాటించిన దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల సంఘం గల్లంతయిన ఓటర్ల జాబితాను విడుదల చేయాలి. ఆ జాబితాను పరిశీలిస్తే ఏయే అసెంబ్లీ నియోజక వర్గంలో ఎలాంటి ప్రభావం ఉండేదో రాజకీయ పరిశీలకుల అవగాహనకు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడమే కాదు, నిర్వహించినట్లు కనిపించడం కూడా ముఖ్యమేనని సుప్రీం కోర్టే అభిప్రాయపడింది కనుక వీలైనంత త్వరగా ఎన్నికల కమిషన్ ఈ జాబితాను విడుదల చేయడంతో 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాను సవరించాలి. -
హన్వాడ: పల్లెల్లో ఎన్నికల పండగ
సాక్షి, హన్వాడ: మండలంలో అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారం ముగిశాయి. ఆయా గ్రామాల్లో ఎన్నికల కో లాహలం కనిపించింది. ఏ పోలింగ్ కేంద్రానికి వెళ్లినా ఓటర్లు బారులు తీరారు. మండల కేం ద్రంతోపాటు గొండ్యాల్, వేపూర్, ఇబ్రహీంబాద్, టంకర, చిన్నదర్పల్లిలోని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6గంటలు దాటింది. ఇదిలా ఉండగా మున్సిపల్ వార్డు, 19 గ్రామ పంచాయతీల్లో కలిపి మొత్తం 43 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మాధారం, హన్వాడ, కొనగట్టుపల్లి, మునిమోక్షం పోలింగ్ కేంద్రాల్లో సల్ప ఆందోళనలు చోటుచేసుకున్నాయి. మాధారంలో 7గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా ఈవీఎం మొరాయించడంతో 8గంటలకు ప్రారంభమైంది. హన్వాడ 17, 18 పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయడానికి వచ్చే వృద్ధులతో నేరుగా ఓటు వేయించినట్లు తెలియడంతో టీఆర్ఎస్, ఎన్సీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోలింగ్ సరళిని అభ్యర్థులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రశేఖర్, సురేందర్‌రెడ్డి, పద్మజారెడ్డి పరిశీలించారు. గండేడ్‌లో 63.5శాతం పోలింగ్ .. గండేడ్: మండలంలో శుక్రవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మండల వ్యాప్తంగా 63.5శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు తెలిపారు. మండలంలో 69పోలింగ్ కేంద్రాల్లో అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు తప్ప అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి మహేష్‌రెడ్డి మండలంలోని ఆయా గ్రామాల్లో జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సందర్శిం చారు. మండలంలో అనేక మంది యువకులు మొదటిసారిగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పూణె, ముంబై, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లిన ప్రజలు, గిరిజనులు శుక్రవారం ఉదయమే తమతమ గ్రామాలకు చేరుకుని తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5గంటలకు పోలింగ్ ముగిసిన అనంతరం ఓటింగ్ పరికరాలను అ«ధికారులు ఆయా జిల్లా కేంద్రాలకు తరలించారు. -
ఓటరు మహాశయా.. ఎక్కడున్నావు ?
ఎమ్మెల్యే అభ్యర్థుల దృష్టి అంతా ఇప్పుడు ఓటర్లపైనే ఉంది. ఓటరు మహాశయా.. ఎక్కడున్నావు ? అంటూ గల్లీ గల్లీ తిరుగుతూ ప్రసన్నం చేసుకుంటున్నారు. నియోజకవర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల సమరానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ స్వల్ప కాలంలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తూ వారు గెలిస్తే ఏం చేస్తారో.., అలాగే మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. ముగ్గురు అభ్యర్థులు గెలుపు తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నర్సాపూర్‌లో నువ్వా..? నేనా..? అన్నట్లు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం సాగిస్తున్నారు. మరి ఓటర్లు ఎవరిని కనికరిస్తారో..? వేచి చూడాలి. సాక్షి, మెదక్: ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు విరామం లేకుండా ప్రచారం సాగిస్తున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలుపుకోసం ఇంటింటా జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. రోడ్‌షోలు, సభల్లో పాల్గొంటూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే మేనిఫెస్టోలోని అంశాలను ఓటర్లకు వివరిస్తున్నారు. గెలిపిస్తే నియోజకవర్గంలో చేపట్టబోయే పనులు, పరిష్కరించే సమస్యలను గురించి హామీలు గుప్పిస్తున్నారు. దీనికితోడు అభ్యర్థుల ప్రచార రథాలు ఊరురా తిప్పుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లు కళాకారులను రంగంలోకి దింపారు. కళాకారులు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ పట్టణాలు, గ్రామాల్లోని కూడలిల వద్ద పాటలు పాడుతూ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థులు హైటెక్ ప్రచారం చేస్తున్నారు. డిజిటల్ వీడియోల ద్వారా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. ఇంటింటి ప్రచారం... మెదక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రచారంలో ఒక అడుగు ముందంజలో ఉన్నారు. నియోజకవర్గంలో ఓ విడత ప్రచారం ముగించుకున్న ఆమె మలివిడతలోనూ ప్రతీరోజు రెండు మండలాల్లో ప్రచారం సాగిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా మహిళా ఓటర్లను ఎక్కువగా కలిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉపేందర్‌రెడ్డి తన సోదరుడు శశిధర్‌రెడ్డితో కలవడంతో కాంగ్రెస్ ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలందరినీ ఏకతాటి మీదికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూనే మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్‌ను గెలిపించాల్సిందిగా కోరుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల రాజయ్య కూడా నియోజకవర్గంలో ఇతర రాష్ట్రాల నాయకులు, విద్యార్థి నాయకులతో జోరుగా ప్రచారం చేయిస్తున్నారు. బీజేపీకి ఒక్కమారు అవకాశం ఇవ్వాలని, నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానంటూ ఆకుల రాజయ్య హామీలు ఇస్తున్నారు. బీఎల్ఎఫ్ అభ్యర్థి యాదేశ్వర్‌తోపాటు ఇతర అభ్యర్థులు కూడా వారి పరిధి మేరకు ప్రచారం చేస్తున్నారు. -
‘ఓటు’పై వినూత్న ప్రచారం
సాక్షి, నిజామాబాద్: ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకునేలా వారిని చైతన్యవంతం చేసేందుకు ఎన్నికల అధికారులు వినూత్న ప్రచారం చేపట్టారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్, పోలీసు కమిషనర్, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు ఎలా వేయాలనే అంశాలపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఈవీఎం, వీవీప్యాడ్ల ద్వారా ఓటు ఎలా ఉపయోగించుకోవాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అదే విధంగా పోలీసు కమిషరేట్ పరిధిలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి సంబంధిత ఏసీపీ, సీపీ, సీఐ, ఎస్సై, ఎస్బీ వాట్సాప్, డయల్ 100 నంబర్లతో ఫ్లెక్సీ ద్వారా ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఐ విల్ ఓటు బికాస్ ఐ లవ్ నిజామాబాద్ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇలా ఓటు హక్కును వినియోగంపై చేపట్టిన ప్రచార ఫ్లెక్సీలు ప్రజలను ఆకర్శిస్తున్నాయి. -
ఛత్తీస్‌గఢ్‌లో 71.93 శాతం పోలింగ్
రాయిపూర్ : ఛత్తీస్‌గఢ్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 19 జిల్లాల్లో విస్తరించిన మొత్తం 72 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల సమయానికి 71.93 శాతం పోలీంగ్ నమోదైంది. తొలి విడత పోలింగ్‌తో కలుపుకుంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల మొత్తం పోలింగ్ శాతం 74.17గా ఉందని డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సిన్హా తెలిపారు. పోలింగ్ సమయం ముగిసినప్పటికీ కొన్ని కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉండడంతో వారిని పోలింగ్‌కు అనుమతిచ్చారు. కొన్ని చోట్ల పోలింగ్ కొనసాగుతోంది. క్యూలో ఉన్న ఓటర్లు ఓటు హక్కు వినియోగించిన అనంతరమే పోలింగ్ కేంద్రాలను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ దృష్ట్యా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 90 సీట్లలో 18 స్థానాలకు తొలి దశ పోలింగ్‌లో ఈ నెల 12న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 8 నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో తొలి దశలోనే పోలింగ్ పూర్తయింది. మిగిలిన మావో ప్రభావిత జిల్లాలైన గరియాబంద్, ధంతరి, మహాసముంద్, కబీర్దమ్, జష్పూర్, బల్రామ్పూర్ జిల్లాల్లో మంగళవారం పోలింగ్ జరిగింది. -
మొత్తం 3583 నామినేషన్లు : రజత్ కుమార్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మొత్తం 2.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలకు తుది ఓటర్ల జాబితా అందజేస్తామన్నారు. 23 నుంచి 1 డిసెంబర్ వరకు ఓటర్ స్లిప్స్ పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఫోటో ఓటర్ స్లిప్పులు కూడా ఇస్తామన్నారు. మీడియా సమావేశంలో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై మాట్లాడారు. ఈ సందర్భంగా రజత్ కుమార్ మాట్లాడుతూ.. 'ఓటింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాము. 2014 ఎన్నికలకు 2018 ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల విషయంలో తేడా ఉంది. ఇంకా కొన్ని పోలింగ్ కేంద్రాలను మార్చే అవకాశం ఉంది. 9445 సర్వీస్ ఓటర్లు ఉన్నారు. ఓటర్ల నమోదు పెరిగింది. 1,60,509 మంది ఎన్నికల సిబ్బందిని వినియోగించుకుంటాం. రాష్ట్రంలో 35 వేల మంది పోలీసులు, 18 వేల మంది పోలీసులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. 279 సీఆర్పీఎఫ్ బలగాలు ఉంటాయి. వీరికి తోడు 20 శాతం సిబ్బంది అదనంగా ఉంటారు. మొత్తం 3583 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 3500 కేసులు సీవిజిల్ కు వచ్చాయి. ఎపిక్ కార్డులు పంపిణీ ప్రారంభం అయ్యింది. ఈసేవలో 5 లక్షల కార్డులు అందుబాటులో ఉన్నాయి. నెల చివరి వరకు ఓటర్ల అందరికి ఎపిక్ కార్డులు అందజేస్తాం. ఎపిక్ బ్రెయిలి కార్డులను కూడా అందుబాటులో ఉంచాము. పోలింగ్ కేంద్రాల్లో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్ల సేవలను ఉపయోగించుకుంటాం. కేసులు లేని అభ్యర్థులు పత్రికలలో, మీడియాలో ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు 90.72 కోట్లు సీజ్ చేశాం. 77.38 నగదు, 7కోట్లు 55 లక్షల విలువైన లిక్కర్ మిగతావి నగలు సీజ్ చేశాం. సంగారెడ్డి కలెక్టర్‌పై వచ్చిన ఆరోపణలు అవాస్తవం అని మా పరిశీలనలో తేలింది. ఈసీఐకి నివేదిక సమర్పించాము. 23న బ్యాలెట్ ప్రింటింగ్ చేపడతాం. నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియ నుంచే అభ్యర్థి ఖర్చు పరిగణనలోకి తీసుకుంటాం. హరీష్, రేవంత్, ఒంటేరు, రేవూరిలకు నోటీసులు ఇచ్చాము. వాళ్ళు వివరణ ఇచ్చారు. మా అభిప్రాయం ఈసీఐకి నివేదిక ఇచ్చాము. ఉత్తమ్ ఒక మత సమావేశంలో మాట్లాడారు దానిపై వివరణ ఇచ్చారు. గంగుల కమలాకర్ పై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. దీనిపై ఈసీఐకి నివేదిక ఇచ్చాము. ప్రగతి భవన్లో జరుగుతున్న రాజకీయ సమావేశాలపై పార్టీ ముఖ్యులకు నోటీసులు ఇచ్చాము. వాళ్ళు వివరణ ఇచ్చారు. దానిపై మా అభిప్రాయం ఈసీఐకి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం తెలంగాణలో ప్రకటనలు ఇవ్వొద్దు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. ఎన్నికల విధుల నుంచి ఆర్థిక శాఖ ఉద్యోగులకు మాత్రమే మినహాయింపు ఉంది. మరికొందరికి జిల్లా ఎన్నికల అధికారులు కూడా మినహాయింపు ఇచ్చే వెసులుబాటు ఉంది' అని రజత్ కుమార్ తెలిపారు. -
ఎన్నికల అధికారుల విధులు ఇలా..
సాక్షి,మిర్యాలగూడ రూరల్ : మనది ప్రజాస్వామ్య దేశం. ఓటరు తమ ఓటు ద్వారా మంచి వ్యక్తులను గద్దెనెక్కించే సత్తా ఉంది. ఈ అధికారాన్ని ఓటరుకు రాజ్యాంగం హక్కుగా కల్పించింది. అలాంటి విలువైన ఓటు వేయాలంటే దాని వెనుక ఎంతో మంది అధికారుల కృషి ఉంటుంది. గ్రామ స్థాయి బూతు లేవల్ అధికారి నుంచి జిల్లా ఎన్నికల అధికారి వరకు సమన్వయంతో విధులు నిర్వహిస్తేనే ఎన్నికలు ప్రశాతంగా పూర్తవుతాయి.అధికారుల్లో సమన్వయం లోపిస్తే గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు నుంచి పోలింగ్,ఎన్నికల నియమావళి,అమలు, ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువరించే వరకు అధికారులు బాధ్యతగా పనిచేయ వలసి ఉంటుంది. మరి ఏ అధికారికి ఏయే బాధ్యతలు..అధికారాలు ఉంటాయో తెలుసుకుందాం. ప్రధాన ఎన్నికల అధికారి బాధ్యతలు: శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకు కేంద్ర ఎన్నిక కమిషన్ ఈ అధికారిని నియమిస్తుంది. ఆయన సంబంధిత నియోజకవర్గ ఎన్నికలను పర్యవేక్షిస్తారు. నామినేషన్ పక్రియా, తుది జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించడానికి సిబ్బంది నియామకం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెళ్లడి వంటి అన్ని అంశాలు ఈ అధికారి పర్యవేక్షణలోనే నిర్వహిస్తారు. సెక్టోరల్ అధికారి : 8 నుంచి 10 పోలింగ్ కేంద్రాల పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా వీరు జాగ్రత్తలు తీసుకుంటారు. అవసరమైతే పరిస్థితులను బట్టి పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించే అధికారాలు వీరికి ఉంటాయి. ఓటు నమోదు అధికారి : ఓట్ల నమోదు జాబితాను తయారు చేయడం ఆయన ప్రధాన విధి. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు, జాబితాలో పేర్లు తప్పుగా ఉన్నవారు అధికారిని సంప్రదించ వలసి ఉంటుంది. ప్రిసైండింగ్ అధికారి : సంబంధిత పోలింగ్ కేంద్రానికి ప్రిసైండింగ్ అధికారిదే పూర్తి బాధ్యత. ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలను, వీవీపాట్లను పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి, ఎన్నికలను ప్రశాతంగా నిర్వహించి,మళ్లీ వాటిని స్ట్రాంగ్ రూమ్‌లో చేర్చే వరకు ఈ అధికారి బాధ్యత వహిస్తారు. వీరికి సహాయ ప్రిసైండింగ్ అధికారులు ఉంటారు.బాధ్యతలను అప్పగించిన పోలింగ్ స్టేషన్లో జరిగే కార్యకలాపాలు ఆయన పర్యవేక్షణలో జరుగుతాయి. సూక్ష్మ పరిశీలకులు : ఎన్నికల నిర్వహణ జరిగిన తీరు, సంబంధిత పర్యవేక్షణపై నివేదిక రూపొందించి కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి పంపిస్తారు. బూత్ లెవల్ అధికారి : కొత్తగా ఓటరు జాబితాలో చేరే వారికి ఫారం–6, తొలగింపునకు ఫారం–7, తప్పులు సవరణకు అవసరమైన ఫారాలు ఇవ్వడం, అర్హులు ఓటు నమోదు చేసుకునేలా చూడడం, ఓటరు జాబితాల ప్రదర్శన, పోలింగ్ కేంద్రాల మార్పునకు సహకరించడం వారి బాధ్యత. -
‘బెంగళూరు’ తీర్పే కీలకం!
బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కన్నడ అసెంబ్లీ ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. అధికారం కోసం నువ్వా–నేనా అనే రీతిలో అధికార విపక్షాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ అంశాలు, వివిధ వ్యూహాలతో ప్రచారం చేస్తున్న పార్టీలకు రాజధాని బెంగళూరుపై పట్టు చాలా కీలకం. అందుకే ఉద్యాన నగరిపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఐటీ హబ్, మెట్రోపాలిటన్ సిటీ కావడంతో ఇక్కడి ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఎన్నికల్లో నగర ఓటర్లు ఏ పార్టీకి అండగా నిలవబోతున్నారు? వీరి ఆకాంక్షలు, అవసరాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏ మేరకు తీర్చగలిగాయి? ప్రజల అభిప్రాయాల ఆధారంగా ‘సాక్షి’ అందిస్తున్న కథనం. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఒక్క బెంగళూరు సిటీలోనే 28 స్థానాలున్నాయి. వీటితోపాటు 4 బెంగళూరు రూరల్ నియోజకవర్గాలు కూడా సిటీ పరిధిలోకే వస్తాయి. దీంతో ఈ 32 స్థానాల్లో ఓటరు తీర్పుపై చర్చ జరుగుతోంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలో 13, రూరల్‌లో 2 సీట్లు కలిపి 15 స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా.. బీజేపీ సిటీలో 12 స్థానాలు కైవసం చేసుకుంది. జేడీఎస్ సిటీలో 3, రూరల్‌లో 2 స్థానాలు దక్కించుకుంది. అయితే తర్వాత జరిగిన బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో (198 వార్డుల్లో) బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. జేడీఎస్, స్వతంత్రుల సాయంతో కాంగ్రెస్ మేయర్ సీటు కైవసం చేసుకుంది. కార్పొరేషన్ ఎన్నికల తర్వాత బెంగళూరును న్యూయార్క్, లండన్ తరహాలో అభివృద్ధి చేసి ప్రపంచఖ్యాతి కల్పిస్తానని సిద్దరామయ్య ప్రకటించారు. కానీ ఈ దిశగా అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడుకూడా సిటీ పరిధిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. కనెక్టివిటీ లేని మెట్రో మెట్రోపాలిటన్ సిటీ అయిన బెంగళూరులో ఐటీ ఉద్యోగులు, ఇతర రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారుల సంఖ్య ఎక్కువ. వీరు మౌలిక వసతుల కల్పన, మహిళల భద్రత, శాంతిభద్రతలు, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, కాలుష్యం వంటి ప్రధానాంశాలపై ఆలోచిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య బెంగళూరును ఇప్పటికీ పట్టిపీడిస్తోంది. మెట్రోరైలు ఏర్పాటు చేసినప్పటికీ సిటీ మొత్తం కనెక్టివిటీ లేకపోవడంతో సిటీ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరలేదు. అలాగే ఐటీ ఉద్యోగులు అర్ధరాత్రి వరకూ విధుల్లో ఉండటంతో మహిళా భద్రత అంశాన్ని నగర ప్రజలు ప్రధానంగా భావిస్తున్నారు. బెంగళూరు సిటీ పరిధిలో 2013లో 70.4లక్షల ఓటర్లున్నారు. ఐదేళ్లలో 17.5 లక్షల మంది ఓటర్లు పెరిగి ప్రస్తుతం ఆ సంఖ్య 89.9 లక్షలకు చేరింది. పెరిగిన ఓటర్లలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి జీవనోపాధికోసం బెంగళూరుకు వచ్చి స్థిరపడినవారే. వీరిలో ఎక్కువ మంది మధ్యతరగతి వారే. సిద్దరామయ్య ఏర్పాటుచేసిన ఇందిరా క్యాంటీన్లపై వీరు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ.. మిగిలిన అంశాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆరెస్సెస్ ప్రచారం కలిసొచ్చేనా? 50వేల మంది ఆరెస్సెస్ కార్యకర్తలు బీజేపీ విజయం కోసం క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది సిటీ పరిధిలో ఉన్నారు. సిటీలో బీజేపీ బలంగా ఉండటంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ప్రచారం కచ్చితంగా ప్రభావం ఉంటుందని ఆపార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సిటీలో ముఖ్యమైన వర్గాలివే బెంగళూరు సిటీలో బ్రాహ్మణులు, లింగాయత్, మైనార్టీ, దళిత వర్గాలతో పాటు తెలుగు, తమిళ ఓటర్లు కూడా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. యడ్యూరప్ప లింగాయత్ కావడంతో బ్రాహ్మణులు, లింగాయత్ ఓటర్లు బీజేపీపై సానుకూలంగా ఉన్నారు. మైనార్టీ, దళిత వర్గాలు కాంగ్రెస్‌వైపు ఉన్నారు. 2008 ఎన్నికల్లో క్రిస్టియన్లు బీజేపీ వైపు నిలిచినప్పటికీ.. మంగళూరు చర్చిదాడి ఘటనతో పూర్తిగా దూరమయ్యారు. వీరంతా బృందాలుగా ఏర్పడి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 391 మందిపై క్రిమినల్ కేసులు కర్ణాటకలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న 2,560 మంది అభ్యర్థుల్లో 391 మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. హత్య, హత్యాయత్నం, మహిళలపై వేధింపులు, అపహరణ తదితర తీవ్ర అభియోగాలు ఉన్నాయి. కళంకితులను పోటీకి దింపడంలో బీజేపీ ముందువరుసలో ఉంది. ఆ పార్టీ అభ్యర్థుల్లో 83 మంది (37%)పై నేరారోపణలు ఉన్నాయి. అలాగే 93% మంది బీజేపీ అభ్యర్థులు కోటీశ్వరులే. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 27% మందిపై క్రిమినల్ కేసులుండగా 15% మంది కోటీశ్వరులు. జేడీఎస్‌లో 21% మందిపై కేసులున్నాయి. -
నోటీసు ఇవ్వకుండా ఓట్ల తొలగింపు నేరం
సత్తెనపల్లి: ఓటర్‌కు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఓటును తొలగించడం చట్టప్రకారం నేరమని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది కె.బాలహనుమంత్‌రెడ్డి చెప్పారు. చార్టర్ 13 ఎలక్షన్ మ్యాన్యువల్ ప్రకారం నోటీసు ఇచ్చి తీరాలన్నారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు పట్టణంలో 9,632 ఓట్లను తొలగించడంపై కమిషనర్ శ్రీనివాసరావును ప్రశ్నించారు. బీఎల్వోలకు ట్యాబ్‌ల వాడకంలో పరిజ్ఞానం లేకపోవడంతో పొరపాటు జరిగిందని కమిషనర్ వివరణ ఇవ్వగా.. 40 మంది బీఎల్ఓలు పది వేల ఓట్లను రీ సర్వే చేయడం ఎలా సాధ్యమన్నారు. ఇందుకు మరో 10 రోజులు గడువును పొడగించాలని కోరారు. తొలగించిన ఓటర్లకు నోటీసులు ఇవ్వలేదని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఓటరు నమోదుకు ఆధార్ డిమాండ్ చేయకూడదని గుర్తుచేశారు. రశీదు ఇవ్వాలి.. కొత్త ఓట్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించగానే రశీదు ఇవ్వాలన్నారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు చౌటా శ్రీనివాసరావు మాట్లాడుతూ అపోహలకు తావు లేకుండా ఓటర్ల సర్వే చేయాలన్నారు. నియోజకవర్గ ఎన్నికల అధికారి దేవసహాయం మాట్లాడుతూ ఉద్దేశ్యపూర్వకంగా ఓట్ల తొలగింపు జరిగితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో తహసీల్దార్లు పి.శంకర్‌బాబు, నగేష్, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్‌మీరాన్, టీడీపీ నేత రామచంద్రరావు, కాంగ్రెస్ నేత దాసరి జ్ఞాన్‌రాజ్‌పాల్, బీజేపీ నాయకుడు పగడాల సాంబశివరావు తదితరులున్నారు. -
ఆ ఇద్దరు మోసగాళ్లను ఒకేలా చూడాలి
జీవితం... కష్టసుఖాల మిశ్రమం. నటన... జయాపజయాల కలబోత. ఎంతో పరిణతి ఉన్నవాళ్లే ఈ రెంటినీ ఒకేలా చూడగలుగుతారు. మంచు విష్ణుకి ఆ పరిణతి ఉంది. ‘ఆనందం వచ్చిందా.. తీసుకుందాం.. బాధ వచ్చిందా.. తీసుకుందాం’ అనేంత పరిణతి. ‘సాక్షి’తో ఎక్స్‌క్లూజివ్‌లో విష్ణు పంచుకున్న విషయాలు. ► గాయత్రి, ఆచారి అమెరికా యాత్ర, ఓటర్.. మూడు సినిమాల గురించి? ‘గాయత్రి’ నాకో డిఫరెంట్ మూవీ. ‘ఆచారి అమెరికా యాత్ర’ ఫన్నీగా ఉంటుంది. కరెక్ట్ టైమ్‌లో రిలీజ్ అయితే మంచి సినిమా అవుతుంది. నన్ను ఓ సూపర్‌స్టార్ రేంజ్‌కి తీసుకెళ్లే మూవీ ‘ఓటర్’. తగిలిందంటే ఆ సినిమా నాకు ‘అసెంబ్లీ రౌడీ’ అవ్వొచ్చు. ► ‘గాయత్రి’లో మీకు, శ్రియకు మధ్య ఉన్న ‘ఒక నువ్వు.. ఒక నేను.. ఒక్కటయ్యాం మనం’ పాట చాలా బాగుంది.. ఈ ఏడాదిలో వన్నాఫ్ ది బెస్ట్ సాంగ్ ఇది. మా ఇద్దరి మధ్య బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ఉంది. ఒక నటుడిగా ‘గాయత్రి’ నాకు అగ్నిపరీక్ష. నా హిట్ సినిమాలన్నీ కామెడీ బేస్డ్. ‘గాయత్రి’లో శివాజీలాంటి క్యారెక్టర్ని నేనింతవరకూ చేయలేదు. కథ విన్న వెంటనే జస్ట్ పదిహేను ఇరవై నిమిషాలు వచ్చే నా క్యారెక్టర్‌తో ఆడియన్స్ లాక్ అయ్యారంటే ఫెంటాస్టిక్‌గా ఉంటుందనిపించి చేశా. ► పాటలో శ్రియకు జడ వేశారు. మీ భార్య విన్నీగారికి ఎప్పుడైనా జడలు వేశారా? లేదు. జడలు వేయడం తెలియదు. ఇప్పుడిప్పుడే అరీ, వివీకి వేస్తున్నా. అది కూడా కష్టపడి. జడలు విప్పడం వచ్చు. అరీ అడుగుతుంది ‘డాడీ.. నువ్వెందుకు చేయవు ఇవన్నీ. మమ్మీయే ఎందుకు జడ వేయాలి’ అని. నాన్నకి ప్రాక్టీస్ లేదు అంటే ‘ఎప్పుడు నేర్చుకుంటారు’ అని అడుగుతుంది. ► ఒకవైపు హీరోగా, నిర్మాతగా.. మరోవైపు స్కూల్స్ చేసుకోవడం.. మల్టీ టాస్కింగ్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా లైఫ్ అంతే కదా. నాన్నగారు చేసేది చూశాను. మెల్లగా అలవాటయ్యాను. అదీ చూసుకోవాలి ఇదీ చేయాలి అంతే. ఈ వాతావరణంలో పెరిగాను కాబట్టి నాకు సులభమైంది. వన్స్ షూటింగ్ లొకేషన్‌కి వెలితే అన్నీ స్విచాఫ్ చేసేస్తాను. ఎవరూ నన్ను కలవడానికి.. ఫోన్లో మాట్లాడ్డానికి వీల్లేదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ సెట్లో నా వద్ద ఫోన్ ఉండదు. స్కూల్స్ పనులు చూసుకునేటప్పుడు కూడా అంతే. వేరే విషయాల గురించి ఆలోచించను. ► మీరు తీయాలనుకున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’ గురించి ? ‘భక్తకన్నప్ప’ డ్రాఫ్ట్ స్క్రిప్ట్ రెడీ అయింది. తనికెళ్ల భరణిగారి వెర్షన్ తీసుకుని నేను, ఓ హాలీవుడ్ రైటర్ కూర్చుని ఓ వెర్షన్ తయారు చేశాం. బుర్రా సాయిమాధవ్‌గారు డైలాగులు రాస్తున్నారు. ఆయన వెర్షన్ అంతా ఓకే అయిన తర్వాత భరణిగారు దానికి ఓకే చెప్పాలి. ఎందుకంటే.. ఆయన కథని మేం తీసుకుని చేస్తున్నాం కాబట్టి. ఆ సినిమాకి 70 నుంచి 80కోట్లు ఖర్చవుతుంది. ఈ రోజు నా మార్కెట్ అంత లేదు. ఈ మూడు సినిమాల తర్వాత పెరుగుతుంది. జరిగేది జరుగుతుందిలే అని ఈశ్వరుడిపై భారం వేసి ముందుకెళుతున్నాం. ఈ ఏడాది ఎండింగ్‌కి ప్రొడక్షన్‌కి వెళ్లిపోతాం. ఈ మూవీని హాలీవుడ్ డైరెక్టర్ తీస్తారు. ► టూ క్యూట్ డాటర్స్, వన్ క్యూట్ సన్... ఎలా ఉంది లైఫ్? ఫాదర్‌హుడ్ ఈజ్ నాట్ ఈజీ జాబ్. కూతుళ్లు ఎంత అల్లరి చేసినా భరించాల్సిందే. అందుకే విన్నీతో అవ్రామ్ దగ్గర నో కాంప్రమైజ్. అల్లరి చేస్తే వీపు వాయించేస్తా అంటా. ► ఇద్దరు కూతుళ్లు పుట్టాక వారసుడు కావాలనే ఆలోచన ఉండేదా? నాకెవరైనా ఒకటే. ఒకవేళ మూడో సంతానం ఆడపిల్ల పుట్టినా సంతోషమే. జనరల్‌గా ఆడపిల్లల్ని వారసులుగా ప్రకటì ంచరేమో. కానీ నేనలా కాదు అవ్రామ్ కన్నా ఆరి, వివి (ఆరియానా, వివియానా) పెద్దవాళ్లు. పెద్దవాళ్లకు బాధ్యతలు అప్పగించాలన్నది నా ఒపీనియన్. మగాడికి ఎక్కువ బాధ్యతలు ఇచ్చి, ఆడవాళ్లకు తక్కువ బాధ్యతలు ఇవ్వడం అనేది బుల్షిట్ అండి. ఇంతకుముందు ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఇతర కారణాల వల్ల ఆడవాళ్లను బయటకు రానివ్వలేదు. ఒక్కసారి మన పురణాల్లోకి వెళ్లండి. చరిత్ర చూస్తే ఆడవాళ్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉండేవారు. శక్తి అని అంటాం. ఎక్కడా మగాడ్ని రిఫర్ చేయలేదు. శక్తి అంటే అది ఫీమేల్ పవర్. స్త్రీ లేకపోతే లైఫ్ లేదు. ► పుస్తకాలు బాగా చదువుతారా? బాగా. జర్నీస్ అప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో ఏదైనా నవల కొనుక్కుని, ఫ్లైట్ ఎక్కగానే చదవడం మొదలుపెడతా. ► జయాపజయాలకు అతీతంగా స్పందించే సహనం బుక్ రీడింగ్ ద్వారానూ వస్తుందా? అవును. యాక్చువల్లీ నా ప్రతి సినిమా రిలీజ్ ముందు రుడియార్డ్ కిప్లింగ్ రాసిన ‘ఇఫ్’ అనే పోఎమ్ చదువుతూ ఉంటాను. ఆ పోఎమ్ని నా 12 క్లాస్‌లో ఉన్నప్పుడు చదివాను. ఒక ఫాదర్ వాళ్ల కొడుక్కి రాసిన లెటర్ అది. అందులో ‘నువ్వు రాజుని, మామూలువాళ్లని ఒకేలా చూడగలిగితే, ఇలా ఇలా ఉండగలిగితే..’ అంటూ లాస్ట్‌లో ఓ మాట చెబుతాడు. అదేంటంటే.. ‘నువ్వు సక్సెస్, ఫెయిల్యూర్ అనే ఇద్దరు మోసగాళ్లను ఒకేలా చూడగలిగితే నువ్వు గెలిచినట్టు’ అని. చాలా బ్యూటిఫుల్ పోఎమ్. వెరీ ఇన్స్పిరేషనల్. ► ఈ మధ్య థియేటర్స్ కొరతతో సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఏమంటారు? ఇకనుంచి సోలో రిలీజ్లు ఉండవు. రెండు మూడు సినిమాలు మినిమమ్ ఉంటాయి. 2 సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒక సినిమాకు 60 శాతం ఇచ్చి ఇంకొకరికి 40 ఇస్తే ఓకే. అలా కాకుండా 85 శాతం ఒక సినిమాకి 25 ఇంకో సినిమాకి అంటే చాలా తప్పు. 25 శాతం మాత్రమే థియేటర్లు దక్కే నిర్మాతకు ఎంత నష్టం? ఇలా జరగకుండా ఉండాలంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ డిస్కస్ చేయాలి. ► హాలీవుడ్ మూవీస్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారని విన్నాం.. యస్. త్వరలో హాలీవుడ్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అమేజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఇవన్నీ సినిమా పరిస్థితిని మార్చేయబోతున్నాయి. యాపిల్ కూడా వస్తుంది. లాస్ ఏంజల్స్‌లో చదువుకొని వచ్చాక నేను నటించిన ‘విష్ణు’ సినిమాని అన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేసేయండి. 3 వీక్స్‌లో రిటర్న్స్ వచ్చేస్తాయి అంటే చాలా మంది నిర్మాతలు నవ్వారు. వీడేదో అమెరికా నుంచి దిగాడు అని కామెడీ చేశారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది అదే. ఎక్కువ థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. పదేళ్ల క్రితమే నేను ఈ మాట అన్నాను. – డి.జి. భవాని -
దేశ భవిష్యత్తు ఓటర్లపైనే
సాక్షి, హైదరాబాద్: దేశ భవిష్యత్తు ఓటర్లపైనే ఉంటుందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. ఓటర్లంతా బాధ్యతతో తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గురువారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నరసింహన్ మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడే ఓటు హక్కును పరిశీలించుకోవడం, కొత్తగా ఓటరు నమోదుకు శ్రీకారం చుట్టడం సరికాదన్నారు. అర్హులంతా ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ఉత్తమ ప్రభుత్వం తయారవుతుందని, ఫలితంగా ప్రపంచంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా మారుతుందన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న వారికే ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. ఎలక్షన్ రోజు సెలవు సందర్భంగా టీవీల ముందు కూర్చోకుండా ఓటు హక్కుపై మిగతావారికి అవగాహన కల్పించాలని, వారితో ఓటు వేయించాలని సూచించారు. దేశంలోని ఓటర్లలో 40 శాతానికిపైగా యువకులే ఉన్నార న్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి మాట్లాడుతూ నగరాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుందని దీనికి ప్రధాన కారణం నగర ఓటర్లలో నిర్లిప్తతే అన్నారు. ప్రతిఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ రాజసదారాం అన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ సంక్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణను సమర్థవంతంగా, ఎలాంటి వివాదాలు లేకుండా పూర్తి చేశామన్నారు. ఓటర్ల జాబితా సవరణలో మొదటిసారిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించామన్నారు. వివిధ సమస్యలు ఉన్నప్పటికీ ఓటర్ల జాబితా హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించారని ముఖ్య ఎన్నికల అధికారి అనూప్‌సింగ్ ప్రశంసించారు. పలువురికి ప్రత్యేక పురస్కారాలు.. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణ, నూతన ఓటర్ల నమోదు తదితర సేవలను సమర్థవంతంగా అందించినందుకుగాను ఉత్త మ జిల్లా ఎన్నికల అధికారులుగా జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఆసిఫాబాద్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి, వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి తదితరులకు గవర్నర్ ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. అదేవిధంగా ఉత్తమ రిజిస్ట్రేషన్ అధికారులుగా జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ డి.జయరాజ్ కెనడి, నల్లగొండ ఆర్డీవో వెంకటాచారి, ఖమ్మం ఆర్డీవో పూర్ణచందర్రావు, వరంగల్ రూరల్ ఆర్డీవో మహేందర్, కరీంనగర్ ఆర్డీవో రాజుగౌడ్‌లతో పాటు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సామ్రాట్ అశోక్, ఏఎంసీ జయంత్, జయప్రకాష్‌లకు కూడా ప్రత్యేక అవార్డులను అందజేశారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవార్డులు అందజేశారు. -
వెబ్సైట్ తెరుచుకోనంటోంది...!
‘ఓటు హక్కుకు అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి...అర్హత ఉంటే క్షణాల్లో ఓటు హక్కు కల్పిస్తాం..., ఇందుకు ఆన్లైన్లో, బూత్ స్థాయిలో కూడా నమోదుకు అధికారులు ఉంటారు...’ ఇవన్నీ ఎన్నికల అధికారులు కొద్ది నెలలుగా చెబుతున్న మాటలు. వారి మాటలు నమ్మి అర్హత కలిగిన వారంతా ముందుకొచ్చారు. ఓటరు నమోదుకు దరఖాస్తులు ఇచ్చారు. కాని ఆ దరఖాస్తులన్నీ ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయంలోనే మగ్గిపోతున్నాయి. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. చీపురుపల్లి: ఓటరు నమోదుకు అవసరమైన ఈఆర్ఎమ్ఎస్ అనే వెబ్సైట్ తెరుచుకోవడం లేదు. నిన్న కాదు మొన్న కాదు గత ఏడాది డిసెంబరు 1 నుంచి ఈ వెబ్సైట్ తెరుచుకోలేదు. దీంతో ఓటరు నమోదు లేదు, నమోదైన వారికి గుర్తింపు కార్డులు రావడం లేదు. మరో 24 గంటల్లో జాతీయ ఓటర్లు దినోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమవుతుంటే అదే సమయంలో ఓటరు నమోదుకు అవసరమైన వెబ్సైట్ తెరుచుకోకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎన్నికల కమిషన్ వెబ్సైట్ తెరుచుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ఓటరు నమోదుపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిన తరువాత ఇలా వెబ్సైట్లు పని చేయకుండా చేస్తుండడంతో క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారులు సైతం అవస్థలు పడాల్సి వస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేల ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులు ఆన్లైన్ కాకపోతే వారంతా తమను నిలదీస్తారనే ఆందోళనలో అధికారులు ఉన్నారు. అంతేకాకుండా 2017 జూన్ నెల తరువాత కొన్ని ఓటరు నమోదు దరఖాస్తులు ఆన్లైన్ చేశారు. అయితే జాబితాల్లోకి వారి ఓటు హక్కు వచ్చినప్పటికీ గుర్తింపు కార్డులు తీసుకోవాలన్నా వెబ్సైట్ పని చేయకపోవడంతో వారంతా గుర్తింపు కార్డులకు దూరమవుతున్నారు. డిసెంబరు 1 నుంచి వెబ్సైట్ తెరుచుకోకపోవడంతో ఒక్క చీపురుపల్లి మండలంలోనే 700 దరఖాస్తులు ఆన్లైన్ చేయకుండా ఉండిపోవాల్సి వచ్చింది. ఒక్క మండలంలోనే వందల సంఖ్యలో దరఖాస్తులు ఇలా ఉంటే జిల్లాలో ఇంకెన్ని దరఖాస్తులు ఉండిపోయి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. వెబ్సైట్ తెరుచుకోవడం లేదు... ఓటరు నమోదుకు సంబంధించిన ఈఆర్ఎమ్ఎస్ వెబ్సైట్ తెరుచుకోవడం లేదు. గత ఏడాది డిసెంబరు 1 నుంచి అదే పరిస్థితి నెలకొంది. చీపురుపల్లి మండలంలోనే 700 దరఖాస్తులు వరకు నమోదుకు సిద్ధంగా ఉన్నాయి. వెబ్సైట్ తెరుచుకుంటే తక్షణమే ఆన్లైన్ చేస్తాం. –రమణమ్మ, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్, చీపురుపల్లి -
విష్ణు సినిమా పోస్టర్లో ఆ ఫొటోలెందుకు?
సాక్షి, తమిళసినిమా: ‘కురల్ 388’ (తెలుగు ఓటర్) చిత్రం కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. అందుకు కారణం ఆ చిత్ర పోస్టరే. టాలీవుడ్ యువ నటుడు మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో సురభి నాయకిగా నటిస్తోంది. సతీష్‌కుమార్ పూతోట తమిళం, తెలుగు భాషలలో భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు జీఎస్ .కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేశ్ యాదవ్ ఛాయాగ్రహణం, ఎస్ఎస్.థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న విడుదల చేశారు. విష్ణుతోపాటు ఆ పోస్టర్లో ప్రధాని నరేంద్రమోదీ, ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, స్టాలిన్, విజయకాంత్.. (తెలుగు మూవీ పోస్టర్లో తెలుగు ప్రముఖ నేతల ఫొటోలను పొందుపరచ్చారు).. ఇలా జాతీయ, ప్రాంతీయ రాజకీయ నాయకుల ఫొటోలను పొందుపరచడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ పోస్టర్లో వారి ఫొటోలను పొందుపరచడంలో ఆంతర్యం ఏమిటన్న చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో గెలవడమే ప్రధానంగా ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేసి.. ఆ తరువాత వాటిని మరచిపోయే స్వార్థ రాజకీయనాయకుల ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కిందని చిత్ర వర్గాలు చెప్తున్నాయి. తిరువళ్లువర్ రాసిన ‘కురల్ -388’ రచన ఆధారంగా ఈ చిత్రంగా ఉంటుందని తెలిపాయి. చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందనీ, డిసెంబర్లో ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. -
ఓటర్ పవర్!
మంచు విష్ణు ప్రశ్నించడానికి రెడీ అయ్యారు. ఓటర్‌గా తనకు ఫైట్ చేసే హక్కు ఉందంటు న్నారు. విష్ణు హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘ఓటర్’. తమిళంలో ‘కురళ్ 388’ పేరుతో తెరకెక్కుతోంది. జీఎస్ కార్తీక్ దర్శకత్వంలో జాన్ సుధీర్‌కుమార్ పూదోట నిర్మిస్తున్నారు. నిన్న విష్ణు బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇటు తెలుగు అటు తమిళంలో ఫస్ట్ లుక్‌కి విశేష స్పందన లభిస్తోందని నిర్మాతలు తెలిపారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘తమిళ తెరకు విష్ణు పరిచయం కావడానికి ఇది సరైన సినిమా. ఎన్నికలప్పుడు రాజకీయ నాయకులకు ఎంతో ముఖ్యమైన ఓటర్ ఆ తర్వాత నిర్లక్ష్యానికి గురవుతున్నాడు. ఓటర్ పవర్ ఏంటో చూపించే సినిమా ఇది. యూనివర్శల్ పాయింట్ కావడంతో తమిళంలోనూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్లో సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. -
ఇక పక్కాగా ఓటరు లెక్క
►త్వరలో ఐఆర్‌ఈఆర్ కార్యక్రమం ►ఇప్పటికే బీఎల్ఓలకు ట్యాబ్‌ల అందజేత ►ఇంటి నంబర్‌తో ఓటర్లకు జియోట్యాగ్ ►అక్కడే తప్పుల సవరణ.. ►కొత్త ఓటర్ల నుంచి దరఖాస్తుల స్వీకరణ వరంగల్ రూరల్: ఓటరు లెక్క.. పక్కాగా తేలనుంది. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఓటర్లును గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. త్వరలో ఇంటెన్సీవ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోల్ రోల్స్ (ఐఆర్‌ఈఆర్) కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు బూత్ లెవల్ అధికారుల (బీఎల్ఓ)కు ట్యాబ్‌లను అందజేశారు. ఇటీవల వీరికి శిక్షణ సైతం ఇచ్చారు. దేశ వ్యాప్తంగా తొలుత అర్బన్ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఆ తర్వాత రూరల్ ప్రాంతాల్లో చేపట్టేలా కార్యచరణ రూపొందించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల, జనగాం జిల్లాలోని ఘన్పూర్(స్టేషన్) తొలి విడతలో ఐఆర్‌ఈఆర్ కార్యక్రమం ప్రారంభించనున్నారు. మొదట సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఇంటి నంబర్ అనుసంధానం చేసి జియో ట్యాగ్ చేయనున్నారు. ఓటరు జాబితలో తప్పులు ఉంటే సవరించనున్నారు. కొత్తగా 18 సంవత్సరాలు నిండిన యువతీయువకుల నుంచి ఓటరు దరఖాస్తులు స్వీకరించి.. ఓటు హక్కు కల్పించనున్నారు. ఇంటింటికీ తిరుగుతూ.. బీఎల్ఓలు ఓటరు ఇంటికి వెళ్లిన సమయం.. ఎవరి దగ్గర వివరాలు సేకరించారు.. వంటి అంశాలను ఆన్లైన్లో వెంట వెంటనే అప్డేట్ చేయనున్నారు. ఇది వరకు బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఓరల్‌గా సమాచారం సేకరించే వారు. ఇంట్లో లేరని తెలియడంతో వెంటనే ఆ ఓటును తొలగించేవారు. ఇలా ఓట్లు తొలగింపు జాతీయ ఎన్నికల కమిషన్‌కు తలనొప్పిగా మారింది. ఓట్లు ఎందుకు తొలగించారు అని కోర్టుకు వెళ్లిన సంఘటనలు సైతం ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వాటిని నిరోదించేందుకు.. పక్కాగా ఓటరు లెక్క ఉండేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని చేయనున్నారు. ఒకరికి రెండు ఓట్లు.. వివహామై ఆ ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతుల పేర్లను తొలగించనున్నారు. కొనసాగుతున్న ఓటరు నమోదు జిల్లాల పునర్విభజన తర్వాత ఓటు హక్కును కల్పించేందుకు చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. 18 ఏళ్లునిండిన యువతీయువకులను గుర్తించేందుకు గతంలో సర్వే నిర్వహించారు. బీఎల్ఓలుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్ వాడీ టీచర్లు, కారోబార్లు, వీఆర్ఓ, వీఆర్ఏలు బూత్ లెవల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు -
పరిహారం ‘పాపం’ నిజమే..
-బోగస్ ఐడీ కార్డుల బాగోతాన్ని నిర్ధారించిన అధికారులు -ముంపు మండలాల మీ సేవా కేంద్రాల్లో పీఓ, ఆర్డీఓ తనిఖీలు -కూనవరంలో ఒకటి, వీఆర్ పురంలో రెండు కేంద్రాల సీజ్ కూనవరం (రంపచోడవరం) : పరిహారం కోసం సాగిన మోసకారి వ్యవహారంలో అధికార యంత్రాంగం కదిలింది. ‘పోలవరం’ ముంపు మండలాల్లో బాధితులకు ఇచ్చే పరిహారాన్ని అర్హత లేకున్నా పొందే దురుద్దేశంతోత ఆగమేఘాలపై నకిలీ ఓటరు ఐడీ కార్డులు, ఆధార్ కార్డులు జారీ అవుతున్న బాగోతంపై ‘ఇదో ‘ఐడి’యా’ పేరుతో బుధవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంతో చర్యలకు ఉపక్రమించారు. అసలు క్షణాల్లో బోగస్ ఓటరు ఐడీ కార్డులు ఎలా లభ్యమవుతున్నాయనే దానిపై చింతూరు ఐటీడీఏ పీఓ గుగ్గిలి చినబాబు, ఎటపాక ఆర్డీఓ ఎల్లారమ్మ బుధవారం వీఆర్ పురం, కూనవరం మండలాల్లోని మీసేవా కేంద్రాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డుల నమోదులో ఆయా కేంద్రాలు పలు అవకతవకలకు పాల్పడుతున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో దర్యాప్తు నిర్వహించారు. మీ సేవా కేంద్రాల నిర్వాహకులు పేర్కొన్న అంశాలకు, దరఖాస్తుల పరిశీలనలో కనిపిస్తున్న వాస్తవాలకు పొంతన లేకపోవడంతో వీఆర్ పురంలో రెండు కేంద్రాన్ని, కూనవరంలో ఒక కేంద్రాన్ని సీజ్ చేశారు. ఆ కేంద్రాల నుంచి హోలోగ్రామ్, స్టాంప్‌లు, తదితర రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ గతంలో పనిచేసిన «అధికారుల పేర్లతో ఉన్న స్టాంపులు వినియోగిస్తున్నారని, భద్రాచలం ఆర్డీఓ పేరుతో పాత తేదీలతో ఉన్న ఓటరు ఐడీ కార్డులు జారీ చేస్తున్నట్లు వెల్లడైందన్నారు. ఆర్డీఓ ఎల్లారమ్మ మాట్లాడుతూ గొమ్ము పొట్లవాయిగూడెంలో వీఆర్ పురం మండలానికి చెందిన మీ సేవా కేంద్రం నిర్వాహకుడు అవకతవకలకు పాల్పడినట్లు తనిఖీల్లో తేలిందన్నారు. ఆధార్ కార్డులు తీసి వెంటనే ఇస్తున్నాడని, వాటితో ఎలాంటి దరఖాస్తు చేసుకున్నా చెల్లుబాటు కాకపోవడంతో నష్టపోయామంటూ కొందరు తనకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అలాగే పైదిగూడెంకు చెందిన కొందరు బాధితులు కూనవరం మీ సేవ నిర్వాహకునిపై కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామాల్లో విచారణ జరిపానని, నివేదికను జాయింట్ కలెక్టర్‌కు అందజేస్తానని తెలిపారు. కాగా పోలవరం ముంపు మండలాల్లో పరిహారం పొందేందుకు పదేళ్ల క్రితం ఊరు వదిలి వెళ్లిన వారు సైతం తిరిగివచ్చి నకిలీ ఆధార్‌కార్డులు, ఓటర్ ఐడీ, రేషన్‌కార్డులు పొందేందుకు మీ సేవా కేంద్రాలను ఆశ్రయించడంతో వాటి నిర్వాహకులు అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో తేలడంతోనే అధికారులు ఈ కేంద్రాలపై చర్యలు తీసుకున్నారు. తనిఖీల్లో విఆర్‌పురం, చింతూరు తహసీల్దార్లు జీవీఎస్ ప్రసాద్, తేజేశ్వరరావు, ఎస్సైలు బి.అజయ్‌కుమార్, రామకృష్ణ, ఆర్ఐ చలపతిరావు, వీఆర్ఓ వనపర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా మరింత లోతుగా విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశముందని, దీనివలన అసలైన అర్హులకు మేలు జరుగుతుందని నిర్వాసితులు కోరుతున్నారు. -
ఐర్లాండ్ టు ఇండియా
మంచు విష్ణు, సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓటర్’. సుధీర్ కుమార్ పూదోట (జాన్) నిర్మాత. ఇటీవలే ఐర్లాండ్‌లో రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేసుకొన్న యూనిట్ ఇండియా వచ్చింది. సుధీర్‌కుమార్ పూదోట మాట్లాడుతూ– ‘‘ఒక పాట మినహా సినిమా పూర్తయింది. ప్రత్యేకమైన సెట్లో ఈ పాట చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విష్ణు కెరీర్లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలవడంతో పాటు మా చిత్ర బృందానికి మంచి పేరు తీసుకొస్తుంది. త్వరలోనే టైటిల్ లోగో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, లైన్ ప్రొడ్యూసర్: ఎస్.కె.నయూమ్, సహ నిర్మాత: కిరణ్ తనమాల. -
'ఓటర్'గా మంచు విష్ణు
మంచు విష్ణు-సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు-తమిళ బైలింగువల్ 'ఓటర్'. 'హీరో ఆఫ్ ది నేషన్' అనేది ట్యాగ్ లైన్. రామా రీల్స్ పతాకంపై సుధీర్ కుమార్ పూదోట (జాన్) నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఐర్ ల్యాండ్ లో రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేసుకొని చిత్ర బృందం ఇండియా వచ్చింది. మిగిలిన ఒక పాటను ఓ ప్రత్యేకమైన సెట్ లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధీర్ కుమార్ పూదోట (జాన్) మాట్లాడుతూ.. 'తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న 'ఓటర్' చిత్రీకరణ చివరి దశకు చేరుకొంది. ఐర్ ల్యాండ్ లో రెండు రోమాంటిక్ సాంగ్స్ ను మంచు విష్ణు, సురభిల కాంబినేషన్ లో తెరకెక్కించాం. ఇంకా ఒక పాట మిగిలి ఉంది. టాకీ పార్ట్ పూర్తయ్యి.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. 'ఓటర్' చిత్రం మంచు విష్ణు కెరీర్ లో మైలురాయిగా నిలవడంతోపాటు మా చిత్ర బృందానికి మంచి పేరు తీసుకువస్తుంది. త్వరలోనే టైటిల్ లోగోను విడుదల చేసి.. ఆడియో విడుదల తేదీని ప్రకటిస్తాం' అన్నారు. -
బోగస్ పట్టభద్రులు
– ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా తయారీలో ‘పచ్చ’పాతం బేతంచెర్లకు చెందిన శ్రీలక్ష్మి పదో తరగతి సర్టిఫికెట్ ఆధారంగా పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటరుగా నమోదు అయ్యేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే రెవెన్యూ అధికారులు ఏ మాత్రం విచారణ చేయకుండానే ఆమె దరఖాస్తును ఆమోదించి ఓటు హక్కు కల్పించారు. ఇలాంటి బోగస్ పట్టభద్రులు జిల్లాలో కోకొల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి పట్టభద్రల నియోజకవర్గంలో బోగస్ ఓటర్లు కుప్పలు, తెప్పలుగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఓటర్లుగా నమోదు కావడానికి విధిగా డిగ్రీ, తత్సమాన పరీక్షలో 2013 అక్టోబర్‌లోపు ఉత్తీర్ణులయిన వారే అర్హులు. అయితే అధికారులు టీడీపీ నేతల మాయలో పడి పదవ తరగతి సర్టిఫికెట్లపైనే ఓటర్లుగా నమోదు చేశారంటే ఎంత గుడ్డిగా వ్యవహరించారో తెలుస్తోంది. బోగస్ ఓటర్లు తవ్వేకొద్ది వెలుగులోకి వస్తున్నారు. ఎలాంటి సర్టిíఫికెట్ లేకపోయినా కేవలం ఆధార్‌కార్డు ఆధారంగా కూడా ఓటర్లను నమోదు చేయడం గమనార్హం. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను రెవెన్యూ అధికారులు తుంగలో తొక్కి దేశం నేతల ఆధ్వర్యంలో బోగస్ ఓటర్లను అడ్డుగోలుగా నమోదు చేసి అభాసుపాలయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓటర్ల నమోదులో విధిగా డిగ్రీ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంది. వీటిపై గెజిటెడ్ అధికారి అటెస్టేషన్ కూడా చేయించాలి. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం ఎలాంటి పరిశీలన చేయకుండా ఇష్టానుసారంగా బోగస్ పట్టభద్రులను ఓటర్లుగా గుర్తించి నవ్వులపాలు అయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే రెవెన్యూ అధికారుల పచ్చపాతం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఓటర్ల జాబితాలో బోగస్ పట్టభద్రుల నమోదుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు సిద్ధమవుతోంది. -
పకడ్బందీగా శాసనమండలి ఓటర్ల జాబితా
కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి ఓటర్ల జాబితా పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఇది వరకు ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు ఈ 19వ తేదీ సాయంత్రంలోగా ఓటర్లుగా నమోదు అయ్యేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంఎల్సీ ఎన్నికలు, ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యేందుకు వచ్చిన ధరఖాస్తులను 100 శాతం క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఈ నెల 19 నాటికి వచ్చే దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించి వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఈ నెల 14 వరకు వచ్చిన పారం–6, 7, 8, 8ఎ దరఖాస్తులపై విచారణను పకడ్బందీగా చేపట్టాలన్నారు. కర్నూలు నుంచి జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ.. పట్టభద్రులు, ఉపాధ్యాయుల్లో అర్హులయిన వారంతా ఓటర్లుగా నమోదు అయ్యేందుకు ఈ నెల 19లోగా దరఖాస్తు చేసుకునేలా పెద్ద ఎత్తున ప్రచారం చేపడతామన్నారు. కొత్తగా వచ్చిన దరఖాస్తులతో పాటు అన్ని క్లెయిమ్‌లను పకడ్బందీగా పరిశీలిస్తామన్నారు. ప్రయివేటు డిగ్రీ కళాశాలల్లో చదివిన వారికి సంబంధించి రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ లేదా రిజిస్ట్రార్ కౌంటర్ సంతకం ఉన్న సర్టిఫికెట్లనే పరిగణనలోకి తీసుకుంటామని, ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి జేఎన్టీయూ సంతకం ఉంటేనే ఆమోదిస్తామన్నారు.ఎన్నికల కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్లను నమోదు చేస్తామని వివరించారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం పట్టభద్రులు 74,499 మంది, ఉపాధ్యాయులు 6189 మంది ఉన్నట్లు స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్ఓ గంగాధర్‌గౌడు, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, ఆర్డీఓలు రఘుబాబు, సుధాకర్‌రెడ్డి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు 19 వరకు అవకాశం
కర్నూలు(అగ్రికల్చర్) : శాసనమండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించిన ఓటరుగా నమోదు అయ్యేందుకు ఈనెల 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో మండలి ఎన్నిల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది. దీనిపై అభ్యంతరాలకు, ఓటరుజాబితాలో పేర్లు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 8వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉండేది. దీనిని ఎన్నికల కమిషన్ ఈ నెల 19వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
8వరకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు
కర్నూలు( అగ్రికల్చర్): కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లా పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజక వర్గ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 8వతేదీ వరకు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. ఇది వరకే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించామని, ఇందులో పేర్లు లేకపోయినా, అభ్యంతరాలున్నా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పట్టభద్రులు ఫాం-18, ఉపాధ్యాయులు ఫాం-19ని పూర్తి చేసి అందించాలన్నారు. -
ఓటు ఓ చోట..ఓటరు మరోచోట
– పోలింగ్ బూత్‌ల ఏర్పాటుపై విమర్శలు – రూరల్ ఓటర్లకు కర్నూలులో ఓటు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల ఏర్పాటుపై విమర్శలు వస్తున్నాయి. ఏడుగురు ఓటర్లకే ఓ పోలింగు బూత్‌ను ఏర్పాటు చేయడం.. గ్రామీణ ప్రాంత ఓటర్లకు కర్నూలులో ఓటే వేసే హక్కును కల్పించడాన్ని చూస్తుంటే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి/ఏప్రిల్ నెలల్లో జరగబోయే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నవంబర్ 5వ తేదీ వరకు ఓటరు నమోదు కోసం దరఖాస్తులను స్వీకరించారు. కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయుల నుంచి ఏడు వేలు, పట్టభద్రుల నుంచి 87 వేల దరఖాస్తులు వచ్చాయి. వీరందరికీ ఓటు వేసేందుకు జిల్లా వ్యాప్తంగా 112 పోలింగు బూత్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్క కర్నూలు మాత్రమే 30 కేంద్రాలు ఉన్నాయి. మిగతావన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. కర్నూలులో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో అధికారుల డొల్లతనం బయటపడింది. వచ్చిన దరఖాస్తులను కనీస పరిశీలన చేయకుండా, ఓటర్లతో మాట్లాడకుండా కార్యాలాయాల్లో కూర్చొని పోలింగు బూత్‌లను కేటాయించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. కర్నూలులోని 266 పోలింగు బూత్(పొట్టి శ్రీరాములు మునిసిపల్ హైస్కూల్)లో కేవలం ఏడుగురు ఓటర్లకు కేటాయించారు. వీరు కూడా నగరంలోని శ్రీరామ్‌నగర్, లక్ష్మీనగర్, స్టాంటన్‌పురం, కృష్ణానగర్, ప్రకాష్‌నగర్, చిత్తారివీధి తదితర ప్రాంతాలకు చెందిన వారు. వీరందరూ కూడా పోలింగు బూత్‌కు సమీపంలో ఎవరూ నివాసం ఉండరు. అలాగే 267, 268 పోలింగు బూత్‌లలో 15, 12 మంది ఓటర్లే ఉన్నారు. ఇక 273 బూత్‌లో 36 మంది, 277 బూత్‌లో 18 మంది, 280 వ బూత్‌లో 22 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామీణ ప్రాంత ఓటర్లకు కర్నూలులో ఓటుహక్కు వన్‌టౌన్ సమీపంలోని ఇస్లామియా డిగ్రీ కళాశాలలో 260వ పోలింగు బూత్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం 764 మంది ఓటర్లను కేటాయించారు. ఇందులో డోన్, ఆత్మకూరు ప్రాంతాలకు చెందిన వారికి ఓటు హక్కును కల్పించారు. అంతేకాక కర్నూలులోని 20 ప్రాంతాల వారికి ఇక్కడ ఓటు వేసే హక్కును కల్పించారు. టీడీపీకి అనుకూలంగా ఏర్పాటు: సీపీఎం పోలింగు బూతుల గుర్తింపులో అధికారులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యహరించారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.షడ్రక్ ఆరోపించారు. బుధవారం సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎమ్మెల్సీ స్థానాలను ఎలాగైనా గెలుచుకోవాలని టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఒక్క కేంద్రంలో కూడా సరైన పద్ధతిలో ఓటర్లను కేటాయించలేదని ధ్వజమెత్తారు. ఈ తతంగంపై జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీ అభ్యర్థుల వినతులను స్వీకరించి తప్పులను సరిచేయాలని, లేదంటే రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్, జిల్లా నాయకులు నారాయన పాల్గొన్నారు. -
కొత్త మార్పు... నేటి ఓటరు తీర్పు
జాతిహితం మతంలాగే జాతీయవాదం కూడా మానవుల అత్యంత పాత భావోద్వేగాలకు సంబంధించినది. దాన్ని గమనించిన నేతలకు తాజా ఉదాహరణ ట్రంప్. గొప్ప జనాకర్షణశక్తి ఉండి, సొంత పార్టీకి చెందిన నియమాలను సైతం కాదని, తన సొంత నియమాలతో ఆధిపత్య తత్వం గల వ్యక్తి అత్యున్నత స్థానంలో ఉంటే ఎదురే లేని శక్తి అవుతారు. పాత రాజకీయాలతో, నేతలతో విసుగెత్తి, తిరుగుబాటు చేస్తున్న ఓటరుకు కావాల్సిన మార్పు సరిగ్గా అలా తిరుగుబాటు చేసే, అధికార వ్యవస్థకు బయటి నేతమాత్రమే. డొనాల్డ్ ట్రంప్ విజయానికి సంబంధించి వ్యాఖ్యాతలంతా ఒక్క అంశంపై ఏకీభవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వామపక్షాలనూ, వాటితోపాటే అందరికీ ఆమోదనీయమైనవిగా విశ్వసించిన ఎన్నో ఉదారవాద భావాలనూ తుడి చిపెట్టేసి రాజకీయ మితవాదం తిరిగి అధికారంలోకి వస్తున్న ధోరణి కనిపిస్తోంది. దానికి అనుగుణమైన పరిణామమే ఇది కూడా అని అంతా అంగీకరిస్తున్నారు. అమెరికాలో అయితే స్వేచ్ఛాయుత మార్కెట్లు, వాణిజ్యం, విదేశీయుల వలసలను అనుమతించడమూ, యూరప్‌లోనైతే జాతీయవాద క్షీణత వంటివి అలాంటి ఉదారవాద భావాలుగా ఉండేవి. ఇక మన భారతదేశంలో నైతే మతం పూర్తిగా వ్యక్తిగత విషయమనీ, ఒకసారి అధికారంలోకి వచ్చాక ప్రతి నేతా ప్రతి మతాన్ని తనదిగా చేసుకునే మాట్లాడేవారు, బహిరంగ చర్చలో అదే రాజకీయంగా సరైనదిగా నిర్వచించేవారు. ప్రపంచవ్యాప్తంగా ఓటర్లంతా ఇప్పుడు కోరుకుంటున్నది సరిగ్గా వీటిలో మార్పునే. ఉదారవాదానికి ఎదురు గాలేనా? అయితే ఈ మార్పు సరళరేఖ మాదిరిగా సంభవిస్తున్నదేమీ కాదు. భారత్, బ్రిటన్, అమెరికా, అర్జెంటినా, బ్రెజిల్‌లలో వచ్చిన మార్పు ఈ మితవాద వెల్లువకు అనుగుణమైనదే. ఈ ధోరణి త్వరలోనే ఇటలీ, ఫ్రాన్స్లనూ మింగే యవచ్చు. చావెజ్ వారసుని పాలనలోని వెనిజులాలో ద్రవ్యోల్బణం త్వర లోనే నాలుగంకెల స్థాయికి చేరవచ్చు. దీనికి వ్యతిరేకంగా సాగుతున్న తిరుగు బాటుతో అక్కడా బహుశా ఇదే మార్పు జరగవచ్చు. దక్షిణ, లాటిన్ అమెరికా దేశాల్లో చాలా వరకు ఇప్పటికే వామపక్షం నుంచి మితవాదానికి మరలాయి. కొలంబియాలోని మితవాద ప్రభుత్వం తగినంత మితవాద వైఖరిని ప్రదర్శించడం లేదని భావించిన ఓటర్లు... అది ఎఫ్ఏఆర్సీ (వామ పక్ష) గెరిల్లాలతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని ప్రజాభిప్రాయ సేకరణలో తిరస్కరిం చారు. ఇక జపాన్‌లో ప్రధాని షింజో అబే, ఆసియా పశ్చిమ అంచునున్న టర్కీలో అధ్యక్షుడు ఎర్డోగాన్‌ల జనాదరణ పెరుగుతూనే ఉంది. మితవాద వెల్లువ పాత వామపక్షాలనే కాదు, నిజానికి మధ్యేవాద మితవాదులను సైతం తుడిచిపెట్టేస్తోంది. అయితే, అత్యంత వామపక్ష ఉదారవాద ప్రధాని జస్టిన్ ట్రూడో కెనడాలో, వామపక్షవాదిగా భావించే అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె ఫిలిప్పీన్స్‌లో బలపడుతుండటాన్ని ఎలా వివరించగలం? అలాగే దక్షిణ కొరియాలోని మితవాద పాలనకు వ్యతిరేకంగా అసంతృప్తి, ధిక్కా రమూ పెరుగుతుండటాన్నీ, ప్రశ్నింపరానిదిగా భావించే యూరప్ వ్యాప్తమైన ఈయూ ధోరణిని ధిక్కరిస్తున్న సోషలిస్టు ప్రధాని అలెక్సి సిప్రా స్కు గ్రీస్‌లో జనాదరణ పెరుగుతుండటాన్నీ ఎలా అర్థం చేసుకోగలం? ప్రపంచం తీరును పరిశీలించాక, ఇక ఇప్పుడు 2014 తర్వాత ఈ ధోరణి భారత్‌లో ఎలా పనిచేసిందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. 2014 సార్వ త్రిక ఎన్నికల తదుపరి వెంటనే జరిగిన ఎన్నికల్లో బీజేపీ మహారాష్ట్ర, హరి యాణ, జార్ఖండ్‌లలో గెలుపొందడం ఆ ధోరణిని రూఢి చేసింది. కానీ ఢిల్లీ, బిహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలలో ఏం జరిగింది? బీజేపీ (లేదా భారత మితవాదం) ఢిల్లీ, బిహార్లలో గెలవగలమని అనుకుంది కానీ తుడిచిపెట్టుకుపోయింది. ఇక మిగతా రెండు రాష్ట్రాల్లో అది ఎలాంటి ప్రభా వాన్ని చూపలేకపోయింది, కనీసం పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన ఓట్లను సైతం తిరిగి తెచ్చుకోలేకపోయింది. బెంగాల్లో చాలా సందర్భాల్లో సీపీఎం కంటే వామçపక్ష వైఖరిని తీసుకునే మమత నేతృత్వం లోని టీఎమ్సీ విజయం సాధించింది. ఇక కేరళలో బీజేపీ అసలు లెక్కలోకే రాలేదు. మధ్యేవాద వామ పక్షంగా భావించే కాంగ్రెస్ (యూడీఎఫ్) కూడా గెలవలేదు, నిజమైన కమ్యూ నిస్టులు గెలిచారు. ఇవన్నీ చూశాక మనం ఎక్కడ తేలుతాం? నిజం చెప్పాలంటే ఇవన్నీ చూడటం మనల్ని కలగా పులగం అయ్యేలా చేసేస్తుంది, గందరగోళపరుస్తుంది. ఇంతకూ ఓటరు తనకు ఏమి కావాలని చెబుతున్నట్టు? మార్పు. అయితే అది పాత కాలపు, పాత అర్థంలో అధి కారంలో ఉన్న వారిని గద్దె దించడమా? లేదా? అనే క్లిష్టమైన గుంజాటనగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం కాదు. అదే అయితే, ప్రత్యామ్నాయంగా వామపక్షం బలపడటం కనబడని బ్రిటన్, కొలంబియాలలో మితవాద ప్రభుత్వాలు ప్రజాభిప్రాయ సేకరణలలో ఎందుకు ఓడిపోయినట్టు? ఇది ఎదురేలేని మితవాద పురోగతే అయితే దీని ఒరవడిని అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఎలా అడ్డుకోగలుగుతుంది? పంజాబ్‌లో కూడా అదే పని చేస్తానని ఆ పార్టీ ఎలా భయపెట్టగలుగుతుంది? గోవా, గుజరాత్‌లకు సైతం ఆ భయం ఎందుకు వ్యాపిస్తుంది? ఇవన్నీ ఓటర్లు చీలిపోయి,విధేయమైన ఓటు బ్యాంకు లుగా గట్టిపడ్డ సువ్యవస్థాపితమైన పాత పార్టీల చరిత్ర ఉన్న రాష్ట్రాలే. అదే విధంగా ట్రంప్ రిపబ్లికన్ పార్టీని హైజాక్ చేయడంలో సఫలమై... తన పార్టీ యంత్రాంగమే గెలిచే ఆశేలేదనీ, డెమోక్రాట్లు అధికారంలోకి రావడం ఖాయ మనీ భావిస్తుండగా ఎలా గెలుపొందగలిగారు? ప్రభుత్వం మారితే చాలదు అందువలన సుపరిచితమైన భావజాల వ్యవస్థలను దాటి సమాధానాలను వెదకాలని మనం ఉబలాటపడవచ్చు. అన్నిట్లోకీ మొదటగా ఓటర్లు మార్పును కోరుకునేది కేవలం ప్రభుత్వం మారడం కోసం కాదు, సువ్యవ స్థాపితమైన భావాలలో, ఆదర్శాలలో, ఆలోచనా ప్రక్రియలలో మార్పును. అది మితవాదం వైపునకా, వామపక్షం వైపునకా? లేదా అది దిశగా మరిం తగా మొగ్గడమా? అనే దానితో వారికి నిమిత్తం లేదు. బహుశా మూడు కారణాల వల్ల ఓటర్లు మొత్తంగా ప్రణాళికలోనే మార్పును కోరుకుంటు న్నారు. ఒకటి, ఓటరు కొన్ని అపాయాలను ఎదుర్కునేటంత, ఏదైనా సాహ సోపేతమైనదాన్ని చేసేటంత ఆత్మవిశ్వాసం తనకు ఉన్నట్టు భావించడం. రెండు, పావు శతాబ్ద కాలపు వృద్ధి, గ్లోబలైజేషన్, హైపర్ కనెక్టివిటీ (అత్యు న్నత స్థాయి సమాచార సంబంధాలు) సర్వత్రా ఓటరు ఆకాంక్షల స్థాయిలను పెంచాయి. చిన్న పట్టణాలు లేదా గ్రామాల వారు తాము అసూయతో చూసే వేగంగా వృద్ధి చెందుతున్న నగరాలకు వలస పోవాలని మాత్రమే ఆకాంక్షిం చడం లేదు. తామున్న చోటికే ఆ వేగవంతమైన వృద్ధి రావాలని కోరుకుంటు న్నారు. చివరిగా, నా దృష్టిలో అత్యంత ముఖ్యమైనది...వారు పాత రాజకీ యాలతో విసుగెత్తి పోయారు. కొత్త దానికి, కొత్త భావాలకు, కొత్త నేతలకు అవకాశం ఇచ్చి చూద్దామని అనుకుంటున్నారు. అయినాగానీ కొన్ని పాత, సమసిపోతున్న భావోద్వేగాలను పునరుద్ధరించాలని కూడా భావిస్తున్నారు. వీటన్నిటిలోకీ అత్యంత ప్రబలమైనది జాతీయవాదం. పావు శతాబ్ద కాలపు గ్లోబలైజేషన్ ప్రభావానికి అత్యంత సుస్పష్టమైన ఉదాహరణను చూద్దాం. భావజాల విభజన రేఖకు రెండువైపులా ఉన్న ఉదార విభాగాలూ కీర్తించిన గ్లోబలైజేషన్ వల్ల జాతీయవాదం వెలవెల పోతుండటంతో యూరో పియన్ ఫుట్‌బాల్ క్రీడలో క్లబ్ జట్ల పట్ల విధేయత జాతీయ జట్ల పట్ల విధేయ తను అధిగమించిపోయింది. అయితే మతంలాగే జాతీయవాదం కూడా మాననజాతికి చెందిన అత్యంత పాత భావోద్వేగాలకు చెందినది. పాత జ్ఞాపకాల పట్ల మక్కువ దానికి తిరిగి సత్తువను సమకూరుస్తుంది. స్మార్ట్ (తెలివైన)lనేతలు దాన్ని గమనించారు. అలాంటి వారికి తాజా ఉదాహరణ ట్రంప్. అత్యంత జనాకర్షణ శక్తి గలిగి, సువ్యవస్థాపితమైన నియమాలను, అవి తన సొంత పార్టీకి చెందినవే అయినాగానీ వాటిని ధిక్కరించి, తన సొంత నియమాలను అనుసరించే, ఆధిపత్యతత్వాన్ని Sప్రదర్శించే తత్వంగల వ్యక్తి అత్యున్నత స్థానంలో ఉంటే ఎదురే లేని శక్తి అవుతారు. పాత రాజకీ యాలతో, నేతలతో విసుగెత్తిపోయి, తిరుగుబాటు చేస్తున్న ఓటరుకు కావా ల్సిన మార్పు సరిగ్గా అలా తిరుగుబాటు చేసే నేత, అధికార వ్యవస్థకు బయటి వ్యక్తిమాత్రమే. భారత్‌లోనూ ఇదే గాలి 2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా నేను ఇది, సరికొత్త, యవ్వనోత్సాహం నిండిన, మీకు నేను రుణపడి ఉన్నదేమీ లేదని భావించే భావజాలానంతర కాలపు ఓటరు తీర్పు అని రాశాను. దీనికి ప్రతి వాదనా ఉంది. మన ఓటర్లు మొట్టమొదటిసారిగా మితవాదపక్షం తనంతట తానుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా తీర్పునిచ్చాక కూడా ఇంకా మీరిలా ఎలా అనగలరు? అంటే దానికి చెప్పగల సమాధానం... బహుశా భారత్ ఓటు వేసినది భావజాలపరమైన మార్పునకు కాదు. కాంగ్రెస్ పార్టీ నిరాశా పూరి తంగా పెంచిపోషిస్తున్న పేదరికవాదానికి, పాలక కుటుంబం తాము ప్రత్య క్షంగా పాలన సాగించకుండా, తాము నియమించిన వ్యక్తిని పనిచేయ నీయ కుండా అధికారాన్ని నెరపుతూ ప్రదర్శిస్తున్న కపటత్వానికి వ్యతిరేకంగా ఓటరు చేసిన తిరుగుబాటు ఇది. గోసంరక్షకులకు, పాకిస్తాన్‌తో వ్యూహాత్మక సంయమనానికి స్వస్తి పలకడానికి లేదా మూడు తలాక్‌లకు వ్యతిరేకంగా ఆ సమయంలో ఎవరూ ఓటు చేయలేదు. ఇవేవీ ఆనాటి బీజేపీ అజెండాలో లేవు. నాటి తీర్పు ఓటరు తిరుగుబాటనే నా వాదనకు నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆధారాలు కనబడుతున్నాయి. భారత్ వంటి దేశాలలోని యువత గతం గురించిన ఫిర్యాదులలో వేళ్లూనుకున్న రాజకీయాలను చెత్తబుట్టలో పారేసి, ఆకాంక్షాభరితమైన భవిత దిశగా సాగిపోతున్నారు. ఇది, ప్రజలు పాత విధేయతలను బద్ధలుకొట్టి బయ పడుతున్న పరిణామాన్ని వివరిస్తుంది. వృద్ధాప్యంలో పడుతున్న జనాభాగల అభివృద్ధిచెందిన దేశాల సమస్య ఇందుకు విరుద్ధమైనది: గ్లోబలైజేషన్, వృద్ధి వల్ల కోల్పోయినదిగా కనిపిస్తున్న దానికి, తమకు దక్కాల్సిన ఫలాలలో అతి పెద్ద భాగం ‘‘అయోగ్యులు, తప్పుడు’’వారైన ప్రజలకు, ప్రత్యేకించి వలస వచ్చిన విదేశీయులకు పోతుండటానికి సంబంధించినది. రెండు సందర్భాలలోనూ ప్రతిస్పందన ఒకటే... విప్లవాత్మక మార్పు, పాత అధికార వ్యవస్థ నుంచి దుర్గం«ధాన్ని వెలువరించే ప్రతిదాని పట్లా ధిక్కారం. ఇందువల్లనే మోదీ ఇంతకు ముందెన్నడూ ఎరుగని రీతిలో బీజేపీని శాసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లను కేజ్రీవాల్ వాక్యూమ్ క్లీనర్‌తో తుడిచి పెట్టేస్తున్నారు. అయితే రిపబ్లికన్ పార్టీ పాలక వ్యవస్థను డెమోక్రటిక్ అభ్యర్థి కంటే కూడా ఎక్కువగా ట్రంప్ చిత్తు చేయడాన్ని చూసి బహుశా ఆయన ఓటర్లు మరింత ఎక్కువగా పులకరించిపోయి ఉంటారు. twitter@shekargupta శేఖర్ గుప్తా -
ముగిసిన శాసనమండలి ఓటర్ల నమోదు గడువు
– రాత్రి పొద్దు పోయే వరకు దరఖాస్తుల స్వీకరణ కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఓటర్లుగా నమోదు అయ్యేందుకు దరఖాస్తు గడువు శనివారం నాటితో ముగిసింది. చివరి రోజు కావడంతో అటు పట్టభద్రులు, ఇటు ఉపాధ్యాయుల దరఖాస్తులు వెల్లువెత్తాయి. అక్టోబర్ 5న మొదలైన ఓటర్ల నమోదు ప్రక్రియ నెలరోజులు కొనసాగింది. ఓటర్లుగా నమోదు అయ్యేందుకు దరఖాస్తు చేసుకునే గడువు పొడిగిస్తారనే ఉద్దేశంతో దరఖాస్తు చేయడంలో పట్టభధ్రులు, ఉపాధ్యాయులు కొంత అలసత్వం వహించారు. పొడిగింపు లేదని స్పష్టం కావడంతో మూడు, నాలుగు రోజుల నుంచి దరఖాస్తు ప్రక్రియ ఉపందుకుంది. శుక్రవారం నాటికి పట్టభద్రులు 43,058 మంది, ఉపాధ్యాయులు 4,337 మంది దరఖాస్తు చేసుకున్నారు. శనివారం చివరి రోజు కావడంతో ఆలస్యంగా కూడా ఓటరు నమోదుకు దరఖాస్తులు స్వీకరించేలా ఎన్నికల కమిషన్ సూచించింది. రాత్రి పొద్దుపోయో వరకు చివరి రోజు ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే వివరాలు రాలేదు. చివరి రోజు పట్టభద్రుల నుంచి దాదాపు 30వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఉపాధ్యాయుల నుంచి దాదాపు 1500 వరకు దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా పట్టభద్రులు దాదాపు 80వేల మంది, ఉపాధ్యాయులు 6వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపారు. 2011 నాటి ఓటర్లతో పోలిస్తే ఓటర్ల సంఖ్య భారీగా పెరగాల్సి ఉంది. అయితే పెరుగుదల నామమాత్రంగా ఉండటం గమనార్హం. ఓటర్లుగా నమోదు అయ్యేందుకు యువత అంతగా ఆసక్తి చూపలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల
15న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన డిసెంబర్ 14 వరకు కొత్తవి నమోదు కాకినాడ సిటీ : ఓటర్ల జాబితా 2017 సవరణ ప్రక్రియకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈమేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం జిల్లాలోని 19 నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను ఈనెల 15న జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం ప్రకటించనుంది. ఓటర్ల జాబితా ప్రకటన సమయం నుంచి డిసెంబర్ 14 వరకు జిల్లా వ్యాప్తంగా కొత్త ఓటర్ల నమోదు జరుగుతుంది. ఈ జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం ప్రస్తుతం జిల్లాలో 19 నియోజకవర్గాల్లోని 4,266 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 38,05,354 మంది ఓటర్లు ఉన్నారు. జాబితాలో డూప్లికేషన్లు, చనిపోయిన, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడంతో పాటు ఇప్పటి వరకు నమోదైన క్లెయిమ్‌లను పరిశీలించి మార్పులు, చేర్పులతో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. సవరణ ప్రక్రియలో 2017 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కు నమోదుతో పాటు ఓటు హక్కులేనివారు కూడా నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిష¯ŒS అవకాశం కల్పించింది. ఈనెల 15వ తేదీ నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు ఓటర్ల నమోదు ప్రక్రియను జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో చేపట్టనున్నారు. నవంబర్ 23, డిసెంబర్ 7వ తేదీల్లో ఓటర్ల జాబితా పరిశీలన నిమిత్తం గ్రామసభలు నిర్వహించి బూత్‌లెవెల్ అధికారులు ప్రదర్శిస్తారు. అదేవిధంగా నవంబర్ 20, డిసెంబర్ 11వ తేదీల్లో ప్రత్యేక క్యాంపుల ద్వారా బూత్‌లెవెల్ ఏజంట్స్, రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. డిసెంబర్ 28వ తేదీలోపు ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేస్తారు. అలాగే జనవరి 5వ తేదీలోపు పరిశీలించిన దరఖాస్తులను ఆ¯ŒSలై¯ŒSలో డేటా ఎంట్రీ పూర్తిచేసి సప్లమెంటరీ జాబితాలను సిద్ధం చేస్తారు. అనంతరం 2017 జనవరి 16వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. -
ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం వాయిదా
కర్నూలు(అగ్రికల్చర్): ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల కమిషన్ ముందుగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సోమవారం ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉంది. ఆదే రోజు నుంచి 18 ఏళ్లు నిండిన వారందరి నుంచి ఓటర్లుగా నమోదు అయ్యేందుకు ఫారం–6లు స్వీకరించాల్సి ఉంది. కాని ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించేందుకు ఇంతవరకు ఎన్నికల కమిషన్ నుంచి సాఫ్ట్‌కాపీ రాలేదు. ఇది వస్తేనే పోలింగ్ కేంద్రం వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. దీనిపై ఎలాంటి సమాచారం లేనందున ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడినట్టేనని అధికారులు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాను ఎప్పుడు ప్రకటించేది ఒకటి రెండు రోజుల్లో ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
31నుంచి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం
సాక్షి, తిరుమల: 2017 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల వయసు నిండిన వారు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియ అక్టోబరు 31వ తేదీ నుంచి ప్రారంభిస్తామని తిరుమలలో వెల్లడించారు. బుధవారం ఆయన తలనీలాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ అన్ని మండల కేంద్రాలు, ఆర్టీవో, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యంలో భాగస్వాములవుతారని, అందువల్ల ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు కావాలని భన్వర్‌లాల్ పిలుపునిచ్చారు. -
ఓటర్లుగా నమోదు కండి
–జిల్లా అధికారులకు, సిబ్బందికి జాయింట్‌కలెక్టర్ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): అన్ని శాఖల జిల్లా అధికారులు, వారి కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది శాసనమండలి అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లా పట్టభద్రుల నియోజక వర్గం ఓటర్లుగా నమోదు కావాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. సోమవారం ఉదయం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం తర్వాత ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... ప్రభుత్వ అధికారులు, సిబ్బందిలో ఎక్కువ మంది పట్టభద్రులు ఉన్నారన్నారు. 2011లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయని అప్పుడు పట్టభద్రుల ఓటర్ల జాబితా తయారు చేశామని అయితే ఆ జాబితా ఈ ఎన్నికలకు చెల్లుబాటు కాదని చెప్పారు. 2013 అక్టోబరు31 లోపు డిగ్రీ పూర్తి చేసిన వారందరూ ఓటర్లుగా నమోదు అయ్యేందుకు అర్హులేనన్నారు. ఫారం–18 దరఖాస్తులను పూర్తి చేసి ఆధార్ కార్డు జిరాక్స్‌కాపీ, రెండు కలర్ పాస్‌ఫొటోలు జత పరచి ఇవ్వాలని సూచించారు. ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా తయారీకి నోడల్ అధికారిగా జెడ్పీ సీఈఓ వ్యవహరిస్తున్నారని అయనకు పూరించిన దరఖాస్తులు ఇవ్వాలని తెలిపారు. అనంతరం ఒక్కో జిల్లా అధికారికి 20 ప్రకారం ఫారం–18 దరఖాస్తులను పంపిణీ చేశారు. ఓటరు నమోదుపై అనుమానాలు ఉంటే 08518–220125కు ఫోన్ చేయవచ్చని వివరించారు. కాగా ఈ– ఆఫీసుల నిర్వహణపై జిల్లా అధికారులు దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, సీపీఓ ఆనంద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటరుగా నమోదు చేసుకోండి
ఉపాధ్యాయులకు ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పిలుపు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : 2017లో జరిగే పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉపాధ్యాయులు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు తిమ్మన్న పిలుపునిచ్చారు. బుధవారం ఎస్టీయూ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు మేరకు ఫారమ్ 19, ఒక ఫొటో, ఓటరుకార్డును తీసుకుని సమీపంలోని ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓ , ఎంఈఓ కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా కూడా ను నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఠీఠీఠీ.ఛ్ఛి్చౌnఛీజిట్చ/nజీఛి.జీnను సందర్శించి ఆన్లైన్ ఓటరుగా నమోదు అవ్వవచ్చన్నారు. -
ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నోటీసులు జారీ
– నవంబర్ 5 వరకు దరఖాస్తులకు అవకాశం కర్నూలు(అగ్రికల్చర్): ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదుకు శనివారం శ్రీకారం చుట్టారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదయ్యేందుకు నోటీసు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లావ్యాప్తంగా తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాయాలు, గ్రామ పంచాయతీలు, పోలీసుస్టేషన్ నోటీసు బోర్డుల్లో పెట్టారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా నోడల్ అధికారి ఈశ్వర్ మాట్లాడుతూ.... పట్టభద్రులు, ఉపాధ్యాయుల్లో అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకు అనుగుణ ంగా ప్రచారం, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నవంబరు 5వరకు ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గత ఎన్నికల్లో పట్టభద్రుల ఓటర్లు జిల్లాలో 71,103 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 4,101 మంది ఉన్నారన్నారు. ప్రస్తుత ఎన్నికలకు ఆ జాబితా చెల్లదని, తాజాగా దరఖాస్తులు స్వీకరించి ఓటరు జాబితాను తయారు చేయాల్సి ఉందని వివరించారు. -
గులాబీకే పట్టం!
♦ హరీశ్ వెంటే సిద్దిపేట పట్టణ ఓటరు! ♦ ఇదివరకే ఆరింటిలో ఏకగ్రీవం ♦ మిగతా 28 వార్డుల్లోనూ గెలుపు ధీమా పురపోరులో సిద్దిపేట ఓటరు గులాబీ దళానికే జైకొట్టినట్టు తెలుస్తోంది. మంత్రి హరీశ్‌కు సలామ్ కొట్టారని.. అధికార పార్టీకే పట్టం కట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటింగ్ సరళి తరువాత వారు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలు, రెబల్స్ ఏకమై అరిచి గీపెట్టినా.. వార్ వన్ సైడే అయ్యిందని చెబుతున్నారు. ఇదివరకే ఆరు వార్డులు ఏకగ్రీవమై టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. కాగా బుధవారం 28వార్డులకు ఎన్నికలు జరగ్గా అన్ని చోట్ల కారు జోరు సాగిందన్న ప్రచారం జరుగుతోంది. మంత్రి హరీశ్‌రావు పిలుపు మేరకు పట్టణ ఓటర్లు క్లీన్ స్వీప్ దిశగా తీర్పు ఇవ్వబోతున్నారన్న సమాచారం. - సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి సిద్దిపేట అంటేనే టీఆర్ఎస్ అన్నట్టుగా ఆ పార్టీ ఈ ప్రాంతంలోని ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ఎన్నికలు ఏవైనా ఇక్కడ గెలిచేది గులాబీ పార్టీ అనే విషయం చాలా సందర్భాల్లో రుజువైంది. అసెంబ్లీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ, మున్సిపాలిటీ ఇలా ఎలాంటి ఎన్నికలైనా ఓటర్లు మాత్రం కేసీఆర్, హరీశ్‌రావు పక్షాన నిలుస్తారనడంలో సందేహం లేదు. బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇలాగే జరిగిందని పలువురు రాజకీయ విశ్లేషకులు ఓటింగ్ సరళిని పరిశీలించి చెబుతున్నారు. హరీశ్‌రావు కోరిక మేరకు ప్రజలు అన్ని స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలి పించబోతున్నారని అభిప్రాయపడుతున్నారు. గట్టిపోటీనిచ్చిన స్థానాలు... పలు స్థానాల్లో టీఆర్ఎస్ తిరుగుబాటు దారులే పైచేయి సాధిస్తున్నారని, వీరికి కాంగ్రెస్, టీడీపీ మద్దతు పలకడంతో కారు టైరు పంక్చర్ ఖాయమనే ప్రచారం జరిగింది. 10, 14, 17, 30, 33, 34వ వార్డుల్లోనైతే ప్రత్యర్థుల విజయం ఖరారైనట్టుగా ప్రచారం ఊపందుకుంది. పోలింగ్ పూర్తయిన తరువాత వారి అంచనాలు తప్పని తేలినట్టు సమాచారం. ♦ 10వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి మచ్చ వేణుగోపాల్‌రెడ్డి తిరుగుబాటు అభ్యర్థితో తీవ్రంగా పోటీ పడ్డారు. మాజీ కౌన్సిలర్ నవీన భర్త కరాటే కృష్ణ ఆయన మీద పోటీ చేయడంతో వేణుగోపాల్‌రెడ్డికి ఇబ్బందిగా మారింది. ♦ 14వ వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సంపత్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్‌రెడ్డిల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్టు ప్రచారం జరిగింది. ♦ 17వ వార్డులోనూ టీఆర్ఎస్ అభ్యర్థి నాయకం లక్ష్మణ్, బీజేపీ అభ్యర్థి వెంకట్ మధ్య హోరాహోరీగా సాగింది. ♦ 30వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి పూజల వెంకటేశ్వరరావుకు కాంగ్రెస్ అభ్యర్థి వజీర్‌ఖాన్ గట్టి పోటీ ఇచ్చినట్టు పుకార్లు వచ్చాయి. ♦ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నయ్యర్ సతీమణికి స్వతంత్ర అభ్యర్థి గట్టిపోటీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ప్రత్యర్థులకు ఓటరు చెక్..! పలు వార్డుల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు గెలుస్తున్నారని సోషల్ మీడియాలో హల్చల్ చేసినా... కొన్ని మీడియా సంస్థలు ఆ పుకార్లకే వంతపాడినా... ప్రజలు మాత్రం గులాబీ పార్టీకే మొగ్గుచూపినట్టు సమాచారం. టికెట్ రాలేదని మంత్రి హరీశ్‌రావు అనుచరులే తిరుగుబాటు చేసినా వారికి నిరాశే ఎదురైనట్టు తెలిసింది. ఒకటి, రెండు వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల మెజార్టీ తగ్గినా... గెలుపు మాత్రం ఖాయమని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి. పోలింగ్ ముగిసిన అనంతరం మంత్రి హరీశ్‌రావు ఓటింగ్ సరళిపై నిర్వహించిన సమీక్షలోనూ అన్ని వార్డుల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే గెలవబోతున్నారనే విషయం తేలినట్టు తెలిసింది. పోలీసుల ప్రతాపం.... ఎన్నికల్లో పోలీసులు సామాన్య జనంపై ప్రతాపం చూపించారు. ఓటు వేయడానికి వచ్చిన వారిపై లాఠీలతో విరుచుకుపడ్డారు. సాధారణంగా ఎక్కడైనా పోలీసులు అధికార పక్షం వైపు మొగ్గు చూపారని ఫిర్యాదులు రావటం సహజం. కానీ సిద్దిపేటలో మాత్రం పోలీసుల తీరు అందుకు భిన్నంగా ఉన్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. 23, 14, 28, 32, 33వ వార్డుల్లో పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసినట్టు ఆ పార్టీ నాయకులు మంత్రి హరీశ్‌రావుకు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా ఇద్దరు ఎస్ఐలు, ఒక సీఐ పనికట్టుకొని గులాబీ దళానికి వ్యతిరేకంగా పని చేసినట్టు, వారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని కార్యకర్తలు మంత్రిపై ఒత్తిడి తెచ్చారు. మరోవైపు మంత్రి హరీశ్‌రావుకు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఓ పోలీసు అధికారి 14వ వార్డులో టీఆర్ఎస్ మహిళా కార్యకర్తలను పరుష పదజాలంతో దూషించడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. కాగా కార్యకర్తలు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలుంటే... ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మంత్రి హరీశ్‌రావు చెప్పినట్టు తెలిసింది. -
ఖేడ్ మే మెగా ఫైట్...
♦ ఓటరు తీర్పు నేడే పోలింగ్‌కు సర్వం సిద్ధం ♦ పకడ్బందీగా ఏర్పాట్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు చర్యలు ♦ కలెక్టర్, ఇతర అధికారుల పర్యవేక్షణ ఖేడ్ ఓటరన్న వైపే అందరి చూపు.. తీర్పు ఎటువైపో తేలేది నేడే.. అభ్యర్థుల భవితవ్యంపై ఉత్కంఠ.. మరోవైపు పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు. ఉప ఎన్నికల్లో 1.88 లక్షల మంది ఓటుహక్కు వినియోగించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రోనాల్డ్‌రాస్ చెప్పారు. ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డు అందుబాటులో లేకపోతే 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏ ఒక్క గుర్తింపు కార్డు ఉన్నా ఓటు వేయవచ్చని అన్నారు. 16న ఎన్నికల ఫలితాల ప్రకటన ఉంటుందని తెలిపారు. - నారాయణఖేడ్ నారాయణఖేడ్ ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం శుక్రవారం ఖేడ్‌లో పోలింగ్ సిబ్బం దికి అవసరమైన ఈవీఎంలతోపాటు పోలింగ్ సామగ్రిని పంపిణీ చేసి ఆయా కేంద్రాలకు పంపించారు. రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సాగిన ఈవీఎంలు, సామగ్రి పంపిణీ ప్రక్రియను కలెక్టర్ రోనాల్డ్ రాస్, ఎన్నికల పరిశీలకులు పర్యవేక్షించారు. - నారాయణఖేడ్ ♦ వెబ్‌కాస్టింగ్ ద్వారా కేంద్రాల పర్యవేక్షణ ♦ వీడియో చిత్రీకరణ భారీగా బలగాలు ♦ రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు వెల్లడి నారాయణఖేడ్/రేగోడ్: నారాయణఖేడ్ నియోజకవర్గంలో శనివారం జరగనున్న ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఖేడ్‌లోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద శుక్రవారం పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ సామగ్రిని అంజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పోలింగ్ సిబ్బందికి గతంలోనే రెండుమార్లు శిక్షణ ఇచ్చామన్నారు. శనివారం ఉదయం 7గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌కు ముందు 6గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తామన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు బలగాలను మోహరించినట్టు తెలిపారు. 125 మంది మైక్రో అబ్జర్వర్లు, 200 మంది వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశామని.. ప్రతి విషయం రికార్డు అవుతుందన్నారు. కేంద్రం నుంచి ఎన్నికల వ్యయ పరిశీలకులు కూడా వచ్చారని తెలిపారు. ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే సత్వరం మరో ఈవీఎంను ఏర్పాటు చేస్తామన్నారు. అందుకుగాను పలు ఈవీఎంలను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఆర్టీసీ బాదుడు. నారాయణఖేడ్: ఖేడ్ ఉప ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ అ ధికారులు ప్రయాణికుల నుంచి అదనంగా వసూలు చే స్తున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్‌కు వచ్చేందుకు ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు చార్జీ రూ.73. కాగా శుక్రవారం స్పెషల్ బస్సు పేరిట సర్వీసులను నడిపిన అధికారులు రూ.110 వసూలు చేశారు. ఒక్కో టికెట్‌పై ఇలా రూ.37 అదనంగా వసూలు చేయడమేమిటని ప్రశ్నిస్తే అధికారులు చెప్పినట్టే వసూలు చేస్తున్నామని కండక్టర్లుసమాధానమిచ్చారని ప్రయాణికులు తెలిపారు. -
ఓటర్ కార్డు లేకున్నా ఓటు వేసేదెలా?
జీహెచ్ ఎంసీ పరిధిలో ఓటరు లిస్టులో పేరుండి, ఓటరు కార్డు లేని వాళ్లు తమ ఓటును వినియోగించుకోవడానికి ఎన్నికల కమీషన్ వెసులుబాటు కల్పించింది. ఈ క్రింద పేర్కొన్న ఏదేనీ ఒక గుర్తింపు కార్డు ఉంటే ఓటరు కార్డు లేకపోయినా ఓటు హక్కును వినియోగించుకోవొచ్చు. 1. ఆధార్ కార్డు 2. పాస్ పోర్టు 3. డ్రైవింగ్ లైసెన్స్ 4. పాన్ కార్డు 5. కేంద్ర, రాష్ట్ర స్థాయిలోని ఏదేనీ ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన ఫోటో గుర్తింపుకార్డు 6. ప్రభుత్వ బ్యాంకులు/ పోస్ట్ ఆఫీస్/ కిసాన్ బ్యాంకులు ఇచ్చిన ఫోటో ఉన్నపాస్ పుస్తకాలు 7. ఫోటో ఉన్న ఆస్తి పత్రాలు.. పట్టాలు, రిజిస్టర్డ్ డీడ్స్, మొదలగులనవి.(ఎన్నికల నోటిఫికేషన్ ముందు రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లు మాత్రమే) 8. ఫోటో ఉన్న రేషన్ కార్డు 9. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ సర్టిఫికెట్లు 10. పెన్షన్ డాక్యుమెంట్లు 11. ఫ్రీడం ఫైటర్ గుర్తింపుకార్డు 12. ఆర్మ్స్ లైసెన్స్ 13. ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ 14. ఫోటో ఉన్న ఏటీఎం కార్డులు 15. బార్ కౌన్సిల్ మెంబర్షిప్ కార్డు 16. సెక్రటేరియట్ ఆఫ్ లోక్ సభ/ రాజ్యసభ ఇచ్చిన గుర్తింపుకార్డులు(ఎంపీ) 17. ఎంఎల్ఏ/ ఎంఎల్సీ గుర్తింపుకార్డు 18. ఎన్ఆర్ఈజీఏ ఇచ్చిన గుర్తింపు కార్డులు 19. హెల్త్ ఇన్సూరెస్ స్కీం కార్డు 20. ఎన్ఆర్ఆర్(నేషనల్ పాపులేషన్ రిజిస్టర్) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు 21. ఫోటో ఉన్న పట్టాదార్ పాస్ బుక్స్ ఎన్నికల పరిశీలకులు సర్కిల్ జనరల్ అబ్జర్వర్ ఫోన్ నంబర్ ఎన్నికల వ్యయ పరిశీలకులు ఫోన్ నంబర్ 1) శ్రీ బెన్హర్ మహేష్ దత్ ఎక్కా, ఐఎఎస్ 9100024992 టీ వెంకటేశ్వర్ రావు, డీఏవో 9100024996 2) వీఎన్ విష్ణు, ఐఏఎస్ 9100024980 శ్రీ పి ప్రభాకర్, అసిస్టంట్ ఆడిట్ ఆఫీసర్ 9100024997 3 ఏ) ఏ దినకర్ బాబు, ఐఏఎస్ 9100024995 ఎస్ గోవర్ధన్, ఏవో (రిలీఫ్) 9100024998 3బీ) సయ్యద్ ఒమర్ జలీల్, ఐఎఎస్ 9100025186 ఎస్ఎల్ఎన్సీ శ్యామా సుందర్, అకౌంట్స్ ఆఫీసర్ 9100025102 4 ఏ) కే ఇలంబర్తి, ఐఏఎస్ 9100024993 శ్రీ పి పాండురంగారావు, డీఏవో, 9100025104 4 బీ) సంజయ్ కుమార్, ఐఏఎస్ 9100024979 ఎం పద్మజ, జాయింట్ డైరెక్టర్ 9100025104 5) శ్రీ ఎం జగదీశ్వర్, ఐఎఎస్ 9100024978 డీ ప్రవీణ ప్రభ, అకౌంట్స్ ఆఫీసర్ 9100025105 6) ఎంవీ రెడ్డి, ఐఎఎస్ 9100024977 శ్రీ పీ సుధాకర్, డీఏవో, 9100025106 7 బీ) గొర్రెల సువర్ణ పాండా దాస్, ఐఎఎస్ 9100024976 ఎం శ్రీనివాస్, అకౌంట్స్ ఆఫీసర్ 9100025107 7 ఏ) ఎం వీరబ్రహ్మయ్య , ఐఎఎస్ 9100024975 రేవతి దేడెప్య, ఏవో 9100025108 8) శైలజ రామయ్యార్, ఐఎఎస్ 9100024974 శ్రీ జే ప్రభాకర్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ 9100025110 9బీ) డాక్టర్ క్రిస్టినా జెడ్ చాంగ్తూ, ఐఎఎస్ 9100024973 బీ యాదగిరి, డైరెక్టర్ అసిస్టెంట్ -- 9 ఏ) బుసానీ వెంకటేశ్వరరావు, ఐఏఎస్ 9100024972 జీ దీప్తి, ఫైనాన్స్ ఆఫీసర్ 9100025113 10 బీ) కేవై నాయక్, ఐఎఎస్ 9100025147 జీ వాణి, ఆడిట్ ఆఫీసర్ 9100025114 10 ఏ) అహ్మద్ నదీమ్, ఐఎఎస్ 9100025148 కే జగన్ మోహన్ గౌడ్, జాయింట్ డైరెక్టర్ 9100025115 11) ఎం ప్రశాంతి, ఐఎఎస్ 9100025149 ఏ నాగరాజు, అసిస్టంట్ డైరెక్టర్ 9100025116 12) డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, ఐఏఎస్ 9100025145 కే పార్వతీదేవి, జాయింట్ డైరెక్టర్ 9100025117 13) డాక్టర్ ఏ శరత్ ఐఎఎస్ 9100025150 సీహెచ్ విజయ్ కుమార్, డీఏవో 9100025118 14 ఏ) ఎం చంపాలాల్, ఐఎఎస్ 9100025151 టీకే జయశ్రీ, జాయింట్ డైరెక్టర్ / ఫైనాన్స్ ఆఫీసర్ 9100025119 14 బీ) ఆర్వీ చంద్రవదన్, ఐఎఎస్ 9100025152 శ్రీ లాల్ సింగ్, డీఏవో 9100025120 15) ఏ మురళి, ఐఎఎస్ 9100025153 కేఏ ఝాన్సీ శోభన్, జాయింట్ డైరెక్టర్ 9100025121 16) బీ బాలామాయదేవి, ఐఎఎస్ 9100025154 బీ విజయలక్ష్మి, జాయింట్ డైరెక్టర్ / జీఎం(F & A) 9100025122 17) టీ విజయకుమార్, ఐఏఎస్ 9100025155 ఏ సుక్కయ్య, డీఏవో 9100025123 18) జీ వెంకట రామరెడ్డి, ఐఎఎస్ 9100025156 షాజహాన్ బేగం, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ 9100025124 -
కవ్వింత: డైరెక్టరు బాధ
దర్శకుడు: ఏమ్మా పెళ్లి చేసుకున్నావట, కనీసం మాటవరుసకైనా పిలువలేదే హీరోయిన్: అయ్యో సారీ, ఏదో అలా అయిపోయింది. మళ్లీ పెళ్లి చేసుకున్నపుడుడు తప్పకుండా పిలుస్తా! ఓటరు నాయకుడు: మొదటి సారి గెలిచినపుడు నియోజకవర్గానికి ఏం చేయలేకపోయాను. ఇపుడు ఏం చేయాలో చెప్పండి ఈసారి గెలిచాక కచ్చితంగా చేస్తా? ఓటరు: మీరేం చేయక్కర్లేదు సార్, పోటీ చేయకుండా ఉంటే చాలు! మార్పు కనకరాజు: పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంది? బంగార్రాజు: పెళ్లికి ముందు మా ఆవిడ ఒక్కతే అందంగా కనపడేది, ఇపుడు అందరూ ఆవిడ కంటే అందంగా కనపడుతున్నారు. అపార్థం భార్య: ఏమిటండీ ఆ దెబ్బలు! భర్త: నువ్వు పక్కింటావిడ ఏం ముగ్గు వేస్తుందో చూసిరమ్మంటే అక్కడ నిలబడి చూశాను. వాళ్లావిడను చూస్తున్నాను అనుకుని... పెళ్లయింది కిషోర్: మూడేళ్లు నేను, సురేఖ హాయిగా జీవితం గడిపాం. శ్రీను: మరి ఇప్పుడేమైంది? కిషోర్: మొన్నే పెళ్లయ్యింది మా ఇద్దరికీ. అంతొద్దు! భార్య: ఇల్లు మారదామండీ. భర్త: ఎందుకు? భార్య: మనం ముగ్గురం కాబోతున్నాం, ఇది ఇరుగ్గా ఉందిగా. భర్త: దొంగా, ఇంత లేటుగానా చెప్పేది. భార్య: చాల్లే, మా అమ్మమ్మ వచ్చి మనతోనే ఉంటుందట ఓ ఏడాది. -
ధనస్వామ్యంలో ఓడిన ఓటరు !
ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవలేదు. కుబేరుడు గెలిచాడు. ఓడింది.. పార్టీలు కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. అవినీతి గెలిచింది. ఓటరు మహాశయుడు తలవొంచాడు. ప్రజలు కురిపించిన ఓట్ల వాన మన్మోహన్ సింగ్-సోనియా దుష్టపాలనకు వ్యతిరేకంగా వేసిన ఓటు, అంతేగానీ మోడీపట్ల మోజుతో వేసిన ఓటు కాదు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచింది.. కాదు నరేంద్ర మోడీ గెలిచారు.... కాదు ఆర్ఎస్ఎస్ గెలిచింది. ఆ పార్టీ అగ్రనాయకులు మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేయడానికి ఇష్టపడలేదు. దీనితో ఆయన ఆర్ఎస్ఎస్ను ఆశ్రయించారు. అభ్యర్థిత్వాన్ని గెలుచుకున్నారు. అత్యధిక సీట్లు గెలుచుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒక పార్టీ సొంతంగా మెజారిటీ సీట్లు గెలవడం దేశ చరిత్రలో ఇది మొదటిసారి కాదు. రాజీవ్ గాంధీ 1984 ఎన్నికల్లోనే 400 సీట్లుపైనే గెలుచుకున్నారు. సామాన్య ప్రజలకు ముందుంది ముసళ్లపండుగ. ఎందుకంటే ఇప్పటికే కార్పొరేట్లూ, వాటికి చెందిన మీడియా సంస్థలూ మోడీకి పల్లకీ మోశాయి. మన దేశంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల జాబితాలో ఉన్నాయి. ‘ధనమూలమిదం జగత్’ అన్నట్టు దేశంలో వీరి హవా జోరుగా నడుస్తోంది. ఇప్పుడు మోడీ గెలుపు వీరికీ, అధికార పగ్గాలు చేపట్టబోతున్న మోడీకీ అండగా నిలుస్తుంది. కాదు, శాసిస్తుంది. సామాన్యులను కాటేస్తుంది. ప్రధాని గద్దెమీద కూర్చుంటేనే నాలుగు రొట్టె ముక్కలు విసురుతాడు. అంతే. కాబోయే ప్రధానికి ఒక హెచ్చరిక. ప్రజలు కురిపించిన ఓట్ల వాన మన్మోహన్ సింగ్-సోనియా దుష్టపాలనకు వ్యతిరేకంగా వేసిన ఓటు, అంతేగానీ మోడీపట్ల మోజుతో వేసిన ఓటు కాదు. కాంగ్రెస్ పీడ వదిలిందని మురిసిపోవద్దు. కార్పొరేట్-మోడీ ఉచ్చు బిగియబోతోంది. జాతీయస్థాయిలో ఇది ప్రధాన అంశమైతే, రాష్ట్రంలో టీడీపీతో నువ్వానేనా అన్న స్థాయిలో హోరాహోరీగా పోరాడి 67 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ సాధించిన విజయం ముఖ్యమైన పరిణామంగానే భావించాలి. గత రెండు మూడేళ్లలో ప్రజా సమూహాల్లో ఈదుకుంటూ వచ్చిన పార్టీకి ఈ సమూహాలను ఓటింగ్ కేంద్రాలకు తీసుకొని రాగలిగిన పార్టీ యంత్రాంగం లేదు. అంతేకాదు ఎన్నికల్లో విస్తృతంగా పాల్గొన్న అనుభవం వైఎస్ఆర్సీపీకి లేదు. నా దృష్టిలో చంద్రబాబు విజయం కన్నా జగన్మోహన్రెడ్డి గెలుపు గొప్పది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలతో పోల్చితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మెరుగైన ఫలితాలు సాధించడం బట్టి గ్రామాల్లో ఆ పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయని స్పష్టమవుతోంది. ఇక్కడ 1983 ఎన్నికల గురించి ప్రస్తావించాలి. తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీ రామారావు కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆయనకు పార్టీ యంత్రాంగం, కిందిస్థాయిలో పనిచే సే కార్యకర్తలు, పోటీకి అవసరమయ్యే నిధులు లేకుండానే సినిమా ఇమేజ్‌తో అఖండ విజయం సాధించారు. జగన్‌కు రాజశేఖరరెడ్డి ఇమేజ్ ఉండబట్టే తొలిరౌండ్ రాష్ట్ర పర్యటనలోనే జనం కుప్పతెప్పలుగా సభలకు హాజరయ్యారు. ఆ నేపథ్యమే ప్రస్తుత విజయాలకు పునాది. ఇక్కడ ఏ నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయో విశ్లేషించుకోవాలి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవలేదు. కుబేరుడు గెలిచాడు. ఓడింది.. పార్టీలు కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. అవినీతి గెలిచింది. ఓటరు మహాశయుడు తలవొంచాడు. 2013-14 కన్నా 2014-15లో దేశ పరిస్థితి మరింత క్లిష్టతరమవుతుంది. సామాన్యుడి ఆర్థిక పరిస్థితి ఇంకా దారుణమవుతుంది. కార్పొరేట్లు మరింతగా లాభాలు దండుకుంటారు. కాంగ్రెస్ మన రాష్ట్రంలో ఓడిపోయిందంటే అది స్వయంకృతాపరాధమే. దానికి కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ నేరుగా బాధ్యత వహించాలి. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటమికి ఆమే కారణం. మన్మోహన్ సింగ్ సౌమ్యతను అవకాశంగా తీసుకుని, ఆయన్ని కీలుబొమ్మ ప్రధానిగా మార్చి అధికారాలన్నీ చెలాయించి బొక్కబోర్లా పడ్డారు. రాష్ట్రాన్ని విభజించవొద్దని ప్రజానీకం తిరగబడినా కాదని విడదీసి, తన పార్టీని సీమాంధ్రలో తుడిచిపెట్టేశారు. ఇక తెలంగాణలో ఆ పార్టీ కుంటి గుర్రమే. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డారంటే విచారించేవారెవరూ లేరు. సోనియా దేశాన్నే ముంచేస్తే, మన్మోహన్ దేశాన్ని అమెరికాకు పాదాక్రాంతం చేశారు. ఇవి ఎన్నికలు కావు. ఇదో ఓట్ల మార్కెట్. డబ్బు పంచిపెట్టడంలో దేశంలోనే రాష్ట్రం ప్రథమశ్రేణిలో నిలిచింది. ఈ ఎన్నికల్లో పార్టీలు తెలుగు ప్రజలు తలవొంచుకునేటట్లు చేశాయంటే అందుకు విచ్చలవిడిగా డబ్బులు పంచిపెట్టిన పార్టీలే బాధ్యత వహించాలి. అసలీ ధోరణిని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీయే. మొట్టమొదట 1952లో ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రధాన ప్రత్యర్థులు. అప్పట్లో కొన్ని గ్రామాల్లో కమ్యూనిస్టులకు ఓట్లు వేస్తారని అనుమానించినవారిని పోలింగ్ రోజున బందెలదొడ్లో బంధించి ఓటింగ్ పూర్తయిన తర్వాత విడిచిపెట్టారు. భూస్వాములు కొంతమందిని భయపెట్టి ఓట్లు వేయకుండా నిరోధించారు. ఇంతచేసినా, కమ్యూనిస్టులే కాంగ్రెస్ కన్నా ఒక సీటు అధికంగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కాంగ్రెస్ అభ్యర్థి స్త్రీలకు వెండి కుంకుమ భరిణెలు, జాకెట్ గుడ్డలు పంచారు. ఆ తర్వాత జరుగుతూ వచ్చిన ఎన్నికల్లో గూండాలను గూడేలపై ప్రయోగించడం, అక్కడక్కడ సారా సరఫరా, గూడెం పెద్దను నయానోభయానో లొంగదీసుకొని మొత్తం గూడెంలో ఉండే ఓటర్లను ప్రభావితం చేయడం జరిగింది. ఈ చర్యల లక్ష్యం ఒక్కటే. వారి ఓట్లు కమ్యూనిస్టులకు పడకుండా చేయడమే. ఎన్నికల్లో డబ్బు వెదజల్లడం చిన్నగా ప్రారంభమై నేడు ఈ స్థాయికి చేరింది. డబ్బు ఖర్చుపెట్టి అధికారాన్ని కొనుక్కోవడం, లేదా అధికారంలో కొనసాగడం నేడు మనం చూస్తున్నామంటే దానికి కాంగ్రెస్ వేసిన పునాదే కారణం. జనం డబ్బు పుచ్చుకొన్న ఓటర్లు ఏ పార్టీ ఇచ్చిందో దానికే ఓటు వేశారంటే అది వారి నిజాయితీకి చిహ్నం. కాని నాయకులో? ప్రచారంలో ఎన్నో వాగ్దానాలు చేసి తీరా ఏరు దాటాక బోడిమల్లయ్య అన్న తరహాలో ప్రవర్తించే నేతలు సామాన్య ఓటర్ల కాలిగోటికి కూడా సరిరారు. ఇక జయాపజయాల విషయానికి వస్తే... కాంగ్రెస్‌ను ప్రజలు ఏడు నిలువుల లోతు పాతిపెడతారని అందరూ అనుకొన్న మాటే. కాంగ్రెస్ ఓటమిని ముందే పసిగట్టిన పాలకపార్టీ నేతలు కొంతమంది టీడీపీలోకి, మరికొంతమంది వైఎస్ఆర్సీపీలోకి వెళ్లారు. 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో గెలుస్తానని నమ్మకం లేదు. ఆ విశ్వాసమే కనక ఉంటే అంతకముందుదాకా ఆయన ఎడాపెడా విమర్శించిన బీజేపీతో ఎందుకు చేతులు కలిపారు? కార్పొరేట్ల చేతుల్లో ఉన్న మీడియా మోడీకి బ్రహ్మరథం పడుతుంటే ఇదే అదనుగా భావించి ఆయన కూడా గోడదూకి, మోడీ గెలిచి ప్రధాని అయితే తన రొట్టె కూడా నేతిలో పడుతుందని భావించారు. అంతేకాదు బీజేపీకి పడే ఓట్లు తమ పార్టీకీ పడతాయని ఆశించారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు పడ్డాయంటే అది ఆయనంటే, ఆయన తొమ్మిదేళ్ల పాలనంటే మోజుపడి కాదు. ఆ ఓటు, కాంగ్రెస్ వ్యతిరేక ఓటని గుర్తుంచుకోవాలి. చంద్రబాబు పరిపాలన చూసిన తర్వాత రెండు సాధారణ(2004,2009) ఎన్నికల్లో ప్రజలు ఆయన్ని తిరస్కరించి వైఎస్‌కే పట్టంగట్టారని గుర్తుంచుకోవాలి. ఈ ఎన్నికల్లోనే కాదు, మొదటి ఎన్నికల నాటి నుంచి ఏ పార్టీలో చూసినా ప్రచారం, పరిపాలన వ్యక్తుల చుట్టూనే పరిభ్రమిస్తోందిగానీ, పా ర్టీల చుట్టూ, విధానాల చుట్టూ కాదు. నెహ్రూ పాలించినంతకాలం మహాత్మాగాంధీ పేరుతో ప్రచారం జరిగింది. తర్వాత గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులే వంశపారంపర్యంగా, వ్యక్తుల ఆధ్వర్యంలోనే ప్రచారం, పాలన కొనసాగింది. ఈ జాడ్యం ఇతర పార్టీలకూ సోకింది. పార్టీ అధ్యక్షులు నిమిత్తమాత్రులుగా ఉండిపోయారు. ప్రధానులు, సీఎంలే సమస్తం అయ్యారు. ఇదెంత అనారోగ్యకర పరిణామమో మోడీని చూస్తే తెలుస్తుంది. - (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్) వి.హనుమంతరావు -
ఓటు వేసి నానో కారు గెల్చుకున్న లచ్చవ్వ
-
సీమాంధ్రలో పోలింగ్ ముగిసింది: భన్వర్‌లాల్
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. పోలింగ్ గడువు సాయంత్రం 6.00 గంటల్లోగా క్యూ లైన్లో ఉన్నవారందరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు.బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 71.09 శాతం పోలింగ్ నమోదు అయిందని తెలిపారు. కొద్దిపాటి చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగిందన్నారు. మే 16వ తేదీన ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. -
'స్వేఛ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి'