ఏప్రిల్‌లో మంచు విష్ణు ‘ఓట‌ర్‌’  | Manchu Vishnu Voter Motion Poster Released | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌లో మంచు విష్ణు ‘ఓట‌ర్‌’ 

Published Mon, Mar 4 2019 8:55 PM | Last Updated on Mon, Mar 4 2019 8:55 PM

Manchu Vishnu Voter Motion Poster Released - Sakshi

‘ఢీ’, ‘దేనికైనా రెడీ’ లాంటి సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నారు హీరో మంచు విష్ణు. గత కొంతకాలంగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరోకు.. ‘ఓటర్‌’ రూపంలో ఓ సూపర్‌ హిట్‌ దక్కనున్నట్లు తెలుస్తోంది. అసలే ఎన్నికల వేడిలో తెలుగు రాష్ట్రాలు ఉండగా.. అసలైన టైమ్‌కు ఓటర్‌ సినిమా రిలీజ్‌ చేయనుంది చిత్రయూనిట్‌.

పొలిటిక‌ల్ డ్రామాగా తెరకెక్కిన ‘ఓట‌ర్‌’..  చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ర‌మా రీల్స్ బ్యాన‌ర్‌పై జి.ఎస్‌.కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని జాన్‌సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుద‌ల చేయాల‌నుకుంటున్న‌ట్లు నిర్మాత‌ జాన్ సుధీర్ పూదోట తెలిపారు. ఈ మూవీలో సుర‌భి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఎస్‌.ఎస్.త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండగా రాజేష్ యాద‌వ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. సంప‌త్‌రాజ్‌, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముళి, ప్ర‌గ‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement