ఓటరుగా నమోదు చేసుకోండి
Published Thu, Oct 13 2016 1:07 AM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM
ఉపాధ్యాయులకు ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పిలుపు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : 2017లో జరిగే పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉపాధ్యాయులు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు తిమ్మన్న పిలుపునిచ్చారు. బుధవారం ఎస్టీయూ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు మేరకు ఫారమ్ 19, ఒక ఫొటో, ఓటరుకార్డును తీసుకుని సమీపంలోని ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓ , ఎంఈఓ కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు. ఆన్‌లైన్ ద్వారా కూడా ను నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఠీఠీఠీ.ఛ్ఛి్చౌnఛీజిట్చ/nజీఛి.జీnను సందర్శించి ఆన్‌లైన్ ఓటరుగా నమోదు అవ్వవచ్చన్నారు.
Advertisement
Advertisement