
కవ్వింత: డైరెక్టరు బాధ
దర్శకుడు: ఏమ్మా పెళ్లి చేసుకున్నావట, కనీసం మాటవరుసకైనా పిలువలేదే
హీరోయిన్: అయ్యో సారీ, ఏదో అలా అయిపోయింది. మళ్లీ పెళ్లి చేసుకున్నపుడుడు తప్పకుండా పిలుస్తా!
ఓటరు
నాయకుడు: మొదటి సారి గెలిచినపుడు నియోజకవర్గానికి ఏం చేయలేకపోయాను. ఇపుడు ఏం చేయాలో చెప్పండి ఈసారి గెలిచాక కచ్చితంగా చేస్తా?
ఓటరు: మీరేం చేయక్కర్లేదు సార్, పోటీ చేయకుండా ఉంటే చాలు!
మార్పు
కనకరాజు: పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంది?
బంగార్రాజు: పెళ్లికి ముందు మా ఆవిడ ఒక్కతే అందంగా కనపడేది, ఇపుడు అందరూ ఆవిడ కంటే అందంగా కనపడుతున్నారు.
అపార్థం
భార్య: ఏమిటండీ ఆ దెబ్బలు!
భర్త: నువ్వు పక్కింటావిడ ఏం ముగ్గు వేస్తుందో చూసిరమ్మంటే అక్కడ నిలబడి చూశాను. వాళ్లావిడను చూస్తున్నాను అనుకుని...
పెళ్లయింది
కిషోర్: మూడేళ్లు నేను, సురేఖ హాయిగా జీవితం గడిపాం.
శ్రీను: మరి ఇప్పుడేమైంది?
కిషోర్: మొన్నే పెళ్లయ్యింది మా ఇద్దరికీ.
అంతొద్దు!
భార్య: ఇల్లు మారదామండీ.
భర్త: ఎందుకు?
భార్య: మనం ముగ్గురం కాబోతున్నాం, ఇది ఇరుగ్గా ఉందిగా.
భర్త: దొంగా, ఇంత లేటుగానా చెప్పేది.
భార్య: చాల్లే, మా అమ్మమ్మ వచ్చి మనతోనే ఉంటుందట ఓ ఏడాది.