కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎట్టకేలకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఢిల్లీలో విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ 'రాజీవ్ కుమార్' ఎన్నికల షెడ్యూల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుందని సీఈసీ ప్రకటించారు.
ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్, ఏప్రిల్ 26న రెండో దశ, మే 7న మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20వ తేదీన ఐదో దశ పోలింగ్, మే 25న ఆరో దశ, జూన్1న ఏడో దశ పోలింగ్ ఉంటుందని సీఈసీ తెలిపారు. అయితే ఈ రోజు నుంచి జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండనుందని తెలిపారు.
పోలింగ్ సీజన్‌కు ముందు.. ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి, ఓటర్ల జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలి, పోలింగ్ బూత్ కనుక్కోవడం ఎలా? అనే మరిన్ని వివరాలు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఓటర్ల జాబితాలో పేరు ఉన్న వ్యక్తి ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. అయితే ఓటు వేయడానికి వెళ్లే ముందు ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలంటే..
- ఓటర్ ఐడీ
- డ్రైవింగ్ లైసెన్స్
- పాస్‌పోర్ట్
- ఆధార్ కార్డు
- పాన్ కార్డ్
- MNREGA జాబ్ కార్డ్
- NPR కింద RGI జారీ చేసిన స్మార్ట్ కార్డ్
- స్టేట్ బ్యాంక్ లేదా పోస్టాఫీసు జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్‌బుక్
- కేంద్ర/రాష్ట్రం ద్వారా ఉద్యోగులకు జారీ చేసిన ఐడీ కార్డు
ఎలక్టోరల్ రోల్‌లో మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలంటే..
- అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి
- స్టేట్ ఎంటర్ చేసి, భాషను ఎంచుకోవాలి
- పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు ఫిల్ చేయాలి
- జిల్లా & అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి
- క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, సర్చ్ మీద క్లిక్ చేయాలి
పోలింగ్ బూత్‌ను ఎలా కనుక్కోవాలంటే..
- అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తరువాత పోలింగ్ బూత్‌ని తెలుసుకోవడానికి రాష్ట్రం, భాషను ఎంచుకోవాలి.
- పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు ఫిల్ చేయాలి
- జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి
- క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, సెర్చ్ మీద క్లిక్ చేయాలి
EPIC/ఓటర్ ఐడీ కార్డ్ ద్వారా సెర్చ్ చేయడం
- భాషను ఎంచుకోవాలి
- EPIC నంబర్/ఓటర్ ID కార్డ్ వివరాలను ఫిల్ చేయాలి
- రాష్ట్రాన్ని ఎంచుకోవాలి
- క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి, సెర్చ్ మీద క్లిక్ చేయాలి
Comments
Please login to add a commentAdd a comment