సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆరో విడతలో తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆరో విడతలో 57 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆరో షెడ్యూల్‌లో ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.
కాగా, సోమవారం ఉదయం ఆరో విడతలో లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఆరో విడతలో బీహార్, హర్యానా, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆరో విడతలో 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. కాగా, మే ఆరో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. మే 25వ తేదీన పోలింగ్ జరుగుతుంది. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
Election Commission issues notice for the Sixth phase of Lok Sabha elections.
Elections will be held in 57 Lok Sabha seats in 6 states and 1 Union Territory. pic.twitter.com/3ASMsonYUb— Sunny Raj ( Modi ka Parivar ) (@sunnyrajbjp) April 29, 2024
Comments
Please login to add a commentAdd a comment