
హైదరాబాద్, సాక్షి : మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకుంది. సిరిసిల్లలో గత నెలలో జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ తమపై, తమ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం కేసీఆర్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఈరోజు(బుధవారం) రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది. నిషేధ సమయంలో ఎలాంటి రోడ్‌షోలు, ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని ఈసీ తన ఆదేశాల్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment