![What Will Happen if Someone Press evm Button - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/16/vote.jpg.webp?itok=CVFM_YTt)
మనదేశంలో ప్రతి సంవత్సరం ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. వచ్చే ఏడాది అంటే 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఓటింగ్ కోసం ఈవీఎంలను కూడా సిద్ధం చేస్తున్నారు. వీటిని ఎన్నికల సమయంలో అన్ని పోలింగ్ బూత్‌లకు పంపిణీ చేస్తారు. అయితే ఓటింగ్ సమయంలో ఎవరైనా ఈవీఎం బటన్‌ను రెండుసార్లు నొక్కితే ఏమవుతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
నవంబర్ నెలలో ఐదు రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో ఓటింగ్ నిర్వహించి, ఆ తర్వాత డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఎన్నికల్లో వేలాది ఈవీఎంలను వినియోగించనున్నారు. ఇవి ముందుగానే సిద్ధం చేయనున్నారు. ఎన్నికల తేదీకి ముందు ఈ ఓటింగ్ యంత్రాలను పోలింగ్ బూత్‌కు తీసుకువచ్చే బాధ్యతను ప్రిసైడింగ్ అధికారి పర్యవేక్షిస్తారు.
ఒకవేళ ఓటరు ఎవరైనా ఈవీఎంలో ఓటు వేయడానికి వెళ్లినప్పుడు ఒకేసారి అనేక బటన్లను నొక్కితే ఏమవుతుందనే ప్రశ్న మన మదిలో మెదులుతుంటుంది. రెండు వేర్వేరు గుర్తులు ఉన్న బటన్‌లను నొక్కి. ఆ రెండు పార్టీలకు ఓటు వేయవచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది సాధ్యం కాదు. ఒక ఓటు వేసిన తర్వాత ఏ బటన్ నొక్కినా ఆ యంత్రంలో ఎటువంటి స్పందన చోటుచేసుకోదు.
ఎన్నికల సంఘం తెలిపిన సమాచారం ప్రకారం అభ్యర్థికి ఓటు వేయడానికి సంబంధిత బటన్‌ను నొక్కిన వెంటనే, ఆ ఓటు నమోదువుతుంది. దీని తర్వాత ఈవీఎం లాక్ అవుతుంది. ఎవరైనా మళ్లీ ఆ బటన్ నొక్కినా ఏమీ జరగదు. ఎవరైనా మరో బటన్ నొక్కినా ఓటు నమోదు కాదు. ఒకరికి ఒక ఓటు అనే ప్రాతిపదికన ఈవీఎంలను తయారు చేశారు. ప్రిసైడింగ్ అధికారి తిరిగి బటన్ ప్రెస్ చేసిన తరువాతనే రెండవ ఓటుకు మార్గం ఏర్పడుతుంది. అంటే ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేసేందుకు అవకాశం ఉండదు.
ఇది కూడా చదవండి: బంకర్లు అంటే ఏమిటి? యుద్ధ ప్రాంతాల్లో ఎందుకు అవసరం?
Comments
Please login to add a commentAdd a comment