Button
-
యూట్యూబ్‌లో అదిరిపోయే మరో ఫీచర్
యూట్యూబ్.. ఈ యాప్ గురించి తెలియనివారెవరూ ఉండరు. వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన యూట్యూబ్.. వినియోగదారులకు కావలసిన అన్ని రకాల సమాచారాలకు సంబంధించిన వీడియోలను ముందుకు తీసుకువస్తుంది. తాజాగా యూట్యూబ్‌లో మరో ఫీచర్ దర్శనవివ్వనుంది. అది యూజర్స్‌కు సరికొత్త అనుభూతిని అందిస్తుందనడంలో సందేహం లేదు. గూగుల్‌కు చెందిన వీడియో షేరింగ్ ప్లాట్ఫారం యూట్యూబ్ ప్రతి స్మార్ట్‌ఫోన్‌లోనూ ఇన్స్టాల్ అయి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు రోజులో కొంతసేపైనా యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అత్యధిక వినియోగదారుల బేస్ కలిగిన యూట్యూబ్ మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు తరచూ నూతన ఫీచర్లను అందిస్తుంటుంది.త్వరలో యూట్యూబ్‌లో గూగుల్ లెన్స్ బటన్ యూజర్స్‌కు అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ ఫోను వినియోగదారులు గూగుల్ లెన్స్ బటన్ ఉపయోగించడం ద్వారా టైప్ చేయడానికి బదులు ఏదైనా ఫొటో సాయంతో వీడియోలను శోధించవచ్చు. యూట్యూబ్ యాప్ అప్డేట్లో గూగుల్ లెన్స్ బటన్ కనిపించనుంది. ఇదే విధంగా యూట్యూబ్ యూజర్స్ ఫోనులోని మైక్రోఫోన్ బటన్ సహాయంతో, మాట రూపంలో సూచించడం ద్వారా కూడా తమకు కావలసిన వీడియోలను చూసే అవకాశం ఉంది. -
Siraj collection and Vlogs: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు...
యూట్యూబ్ ‘సిల్వర్ ప్లే బటన్’ను సొంతం చేసుకోవడం అనేది అంత వీజీ కాదు. లక్ష మంది సబ్స్క్రైబర్లు ఉన్న కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ ప్రతిష్ఠాత్మకమైన సిల్వర్ ప్లే బటన్ సొంతం అవుతుంది. అయితే పాకిస్థాన్‌లోని గిల్గిత్–బల్టిస్థాన్ ప్రాంతంలోని ఖప్లూ నగరానికి చెందిన మహ్మద్ సిరాజ్ అనే పిల్లాడు మాత్రం తన యూట్యూబ్ చానల్ ‘సిరాజీ విలేజ్ వ్లోగ్స్’తో ‘సిల్వర్ ప్లే బటన్’ను అవలీలగా సాధించాడు. సిరాజ్ చానల్‌కు లక్షమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. చెల్లి ముస్కాన్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సిరాజ్ చేసిన వీడియోలు పాపులర్ అయ్యాయి. యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్‌ను సిరాజ్ అన్బాక్సింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయింది. -
ఈవీఎంలోని బటన్లను రెండుసార్లు నొక్కితే ఏమవుతుంది?
మనదేశంలో ప్రతి సంవత్సరం ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. వచ్చే ఏడాది అంటే 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఓటింగ్ కోసం ఈవీఎంలను కూడా సిద్ధం చేస్తున్నారు. వీటిని ఎన్నికల సమయంలో అన్ని పోలింగ్ బూత్‌లకు పంపిణీ చేస్తారు. అయితే ఓటింగ్ సమయంలో ఎవరైనా ఈవీఎం బటన్‌ను రెండుసార్లు నొక్కితే ఏమవుతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నవంబర్ నెలలో ఐదు రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో ఓటింగ్ నిర్వహించి, ఆ తర్వాత డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఎన్నికల్లో వేలాది ఈవీఎంలను వినియోగించనున్నారు. ఇవి ముందుగానే సిద్ధం చేయనున్నారు. ఎన్నికల తేదీకి ముందు ఈ ఓటింగ్ యంత్రాలను పోలింగ్ బూత్‌కు తీసుకువచ్చే బాధ్యతను ప్రిసైడింగ్ అధికారి పర్యవేక్షిస్తారు. ఒకవేళ ఓటరు ఎవరైనా ఈవీఎంలో ఓటు వేయడానికి వెళ్లినప్పుడు ఒకేసారి అనేక బటన్లను నొక్కితే ఏమవుతుందనే ప్రశ్న మన మదిలో మెదులుతుంటుంది. రెండు వేర్వేరు గుర్తులు ఉన్న బటన్లను నొక్కి. ఆ రెండు పార్టీలకు ఓటు వేయవచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది సాధ్యం కాదు. ఒక ఓటు వేసిన తర్వాత ఏ బటన్ నొక్కినా ఆ యంత్రంలో ఎటువంటి స్పందన చోటుచేసుకోదు. ఎన్నికల సంఘం తెలిపిన సమాచారం ప్రకారం అభ్యర్థికి ఓటు వేయడానికి సంబంధిత బటన్‌ను నొక్కిన వెంటనే, ఆ ఓటు నమోదువుతుంది. దీని తర్వాత ఈవీఎం లాక్ అవుతుంది. ఎవరైనా మళ్లీ ఆ బటన్ నొక్కినా ఏమీ జరగదు. ఎవరైనా మరో బటన్ నొక్కినా ఓటు నమోదు కాదు. ఒకరికి ఒక ఓటు అనే ప్రాతిపదికన ఈవీఎంలను తయారు చేశారు. ప్రిసైడింగ్ అధికారి తిరిగి బటన్ ప్రెస్ చేసిన తరువాతనే రెండవ ఓటుకు మార్గం ఏర్పడుతుంది. అంటే ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేసేందుకు అవకాశం ఉండదు. ఇది కూడా చదవండి: బంకర్లు అంటే ఏమిటి? యుద్ధ ప్రాంతాల్లో ఎందుకు అవసరం? -
ట్విటర్ ప్లాట్ఫామ్లో భారీ మార్పు! అతి త్వరలో..
మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విటర్.. అతిత్వరలో భారీ మార్పు తీసుకురానుంది. ఎడిట్ ట్వీట్ బటన్ వెసులుబాటును తేనుంది. అయితే.. దీనిని ట్విటర్ బ్లూ సబ్స్క్రయిబర్స్కు మాత్రమే రాబోయే రోజుల్లో అందించనున్నట్లు ట్విటర్ పేర్కొంది. ట్విటర్లో ఒకసారి గనుక ట్వీట్ చేస్తే.. దానిని ఎడిట్ చేసే అవకాశం లేదు ఇప్పటిదాకా. అయితే ఎడిట్ బటన్ వల్ల ట్వీట్ పబ్లిష్ అయిన 30 నిమిషాల్లోపు ట్వీట్‌ను ఎడిట్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. సెండ్ బటన్ నొక్కాక 30 సెకన్ల లోపు అన్డూ ద్వారా క్యాన్సిల్ కూడా చేయొచ్చు. ట్విటర్యూజర్లు.. దానిని క్లిక్ చేసి మార్పులు, ఒరిజినల్‌గా వాళ్లు చేసిన ట్వీట్‌ను సైతం చూసే వెసులుబాటు తేనుంది. well well well, look what we’ve been testing… pic.twitter.com/a8fND4xqMM — Twitter Blue (@TwitterBlue) September 1, 2022 ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా 320 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. చాలాకాలంగా ఎడిట్ ఆప్షన్‌ను తీసుకురావాలని యూజర్లు కోరుతున్నా.. ట్విటర్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో ఇప్పుడు తేనున్న ఈ ఆప్షన్ ముందుముందు యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. if you see an edited Tweet it's because we're testing the edit button this is happening and you'll be okay — Twitter (@Twitter) September 1, 2022 అయితే.. 2020లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అప్పటి ట్విటర్ సీఈవో జాక్ డోర్సే.. ట్విటర్ ఎప్పటికీ ఎడిట్ ట్వీట్ ఫీచర్ తేకపోవచ్చని కామెంట్ చేశాడు. ఈ ఫీచర్ వల్ల తప్పుడు సమాచారం వ్యాప్తి కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు. అంతేకాదు కొందరు టెక్ నిపుణులు సైతం ఎడిట్ ట్వీట్ బటన్ వల్ల స్టేట్మెంట్లను మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇదీ చదవండి: తల్లిదండ్రులు, భార్య గురించి రిషి సునాక్ ఏమన్నారంటే.. -
వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త
హైదరాబాద్: మెసేజింగ్, వాయిస్ ఓవర్ ఐపీ సర్వీస్ అందిస్తున్న వాట్సాప్ తాజాగా బిజినెస్ అకౌంట్లకు షాపింగ్ బటన్‌ను జోడించింది. దీని ద్వారా కంపెనీలు, విక్రేతలు అందించే వస్తు, సేవల జాబితాను ఒకే క్లిక్‌తో చూసేందుకు కస్టమర్లకు వీలవుతుంది. కొంత కాలంగా ప్రయోగాత్మకంగా వాట్సాప్ ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. మంగళవారం నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిందని ప్రకటించింది. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా 17.5 కోట్ల మంది యూజర్లు బిజినెస్ అకౌంట్లకు సందేశాలు పంపిస్తున్నారని వాట్సాప్ వెల్లడించింది. ఇందులో ప్రతి నెల 4 కోట్ల మంది బిజినెస్ క్యాటలాగ్‌ను వీక్షిస్తున్నారట. వీరిలో భారత్ నుంచి 30 లక్షల మంది ఉన్నారు. జాబితాను చూడగలిగితే వస్తువులను కొనుగోలు చేసేందుకు సిద్ధమని ఇటీవల భారత్‌లో నిర్వహించిన సర్వేలో 76 శాతం మంది వెల్లడించారని వాట్సాప్ తెలిపింది. ఇటువంటి కస్టమర్లు సులువుగా కొనుగోళ్లు జరిపేందుకు వీలుగా కొత్త షాపింగ్ బటన్‌ను జోడించినట్టు వివరించింది. అయితే కంపెనీలు, విక్రేతలు తమ వాట్సాప్ బిజినెస్ అకౌంట్లకు క్యాటలాగ్‌ను జోడిస్తేనే సాధారణ కస్టమర్లు ఈ బటన్‌ను వీక్షించే వీలుంటుంది. (వాట్సాప్ సందేశాలు వారంలో మాయం!) -
ప్రాణాంతకంగా ‘లిఫ్ట్ బటన్’
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అపార్ట్‌మెంట్‌వాసులకు ‘‘లిఫ్ట్ బటన్’’ కాటేస్తుంది. ఫ్లాట నుంచి గడపదాటకుండానే కరోనా బారిన పడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్లే కనిపిస్తున్నా... వైరస్ ఏ రూపంలో, ఏ మూల నుంచి దాడి చేస్తుందో ? తెలియని పరిస్థితి నెలకొంది. ఫ్లాట్ నుంచి బయటికి వెళ్లేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... అపార్ట్‌మెంట్‌కు వచ్చే వారికి కట్టడి లేకపోవడం ప్రమాదకరంగా తయారైంది. రోగనిరోధక శక్తిని బట్టి కొందరికి వైరస్ సోకినా కరోనా లక్షణాలు కనబడవు. పైకి మాత్రం ఆరోగ్యంగానే కనిపిస్తారు. ఆలాంటి వారు అపార్ట్‌మెంట్‌కు వచ్చి లిఫ్ట్ వినియోగించడం ఫ్లాట్‌వాసుల పట్ల ప్రాణాంతకరంగామారుతోంది. కరోనా వ్యాధిగ్రస్తుడు లిఫ్ట్ బటన్ నొక్కి వెళ్లి పోగా ఆ తర్వాత లిఫ్ట్ బటన్ నొక్కే వారందరికీ వైరస్ సోకుతుంది. ఈ తరువాత వారి ద్వారా కుటుంబ సభ్యులకు, అ తర్వాత మిగితా ఫ్లాట్స్ వారు క్రమనంగా కరోనాబారిన పడుతున్న సంఘటనలు అనేకం. లోహంపై ప్రభావం అపార్మెంట్స్లలో లిఫ్ట్ బటన్ ప్రాణాంతకరంగా మారుతోంది. కరోనా సోకిన వ్యక్తి దగ్గినపుడు అతడి ముక్కు, నోటి నుంచి వచ్చిన చిన్న తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తోంది. చిన్నగా దగ్గినా మూడు వేలకు పైగా తుంపర్లు బయటికి వస్తాయి. ఇవి మిగతావారిపై, చుట్టూ ఉన్న బట్టలు, వస్తువులు, ఇతర ఉపరితలాలపై పడతాయి కొన్ని చిన్న అణువులు ఇంకా గాల్లోనే ఉండిపోతాయి. కరోనా వైరస్‌లపై జరిగిన కొన్ని అధ్యయనాల్లో పూర్తిగా క్రిమిరహితం చేయనంతవరకూ అవి లోహం, గ్లాస్, ప్లాస్టిక్ మీద తొమ్మిది రోజుల వరకూ జీవించి ఉంటాయని, వాటిలో కొన్ని బయట కనిష్ట ఉష్ణోగ్రతల్లో 28 రోజుల వరకూ సజీవంగా ఉంటాయిని తెలుస్తోంది. దీంతో లిఫ్ట్ వినియోగం కూడా ప్రమాదకరంగా తయారైంది. 35 శాతం కుటుంబాలు హైదరాబాద్ మహా నగరంలోని సుమారు 35 శాతం పైగా కుటుంబాలు అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నట్లు అంచనా. నగరంలో ఇండిపెండెంట్ గృహం కొనడానికి కానీ, అద్దెకు ఉండటానికి గాని సామాన్యులు, మధ్య తరగతి వారికి అందుబాటులో లేని కారణంగా ఆపార్ట్మెంట్ ఫ్లాట్స్పైనే ఆసక్తి కనబర్చుతుంటారు. కరోనా విశ్వ రూపం ప్రదరిస్తుండటంతో ఆదిలో అపార్ట్మెంట్లో రాకపోకలకు కట్టడి చర్యలు చేపట్టినా.. ఆ తర్వాత గాలికి వదిలేశారు.లాక్డౌన్ సడలింపు కొన్ని రంగాలు అన్‌లాక్‌గా మారడంతో అపార్ట్‌మెంట్స్‌కు రాకపోకలు అధికమయ్యాయి.దీంతో పలు అపార్ట్‌మెంట్‌వాసులు కరోనా బారిన పడుతున్నారు. కరోనా మృతుల్లో అపార్ట్మెంట్లలో నివసిస్తున్నవారే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. బయటపడని వైనం అపార్ట్మెంట్స్లోని ఫ్లాట్స్‌లో నివాసం ఉండే వారిలో ఎవరి ప్రపంచం వారిది. ఇరుగు పోరుగు వారికి వరుసలు పెట్టి పిలువడం లాంటి పలకరింపులు దేవుడేరుగు కానీ, ఎదురు పడితే కనీస పలకరింపులు కూడా ఉండవు. ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు...ఎప్పుడు ఎవరూ ఎక్కడి వెళ్తున్నారు తెలియదు. ఎవరికైనా ఆరోగ్యంలో ఏమైనా మార్పు కనిపిస్తే..అనుమానం ఉంటే ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లి టెస్ట్‌లు చేయించుకోవడం.. పాజిటివ్ వస్తే గుట్టుచప్పుడు కాకుండా హోమ్ ఐసోలేషన్‌కు పరిమితం కావడం సర్వసాధరణమైంది. కనీసం పక్క ఫ్లాట్ వారికి కూడా తెలియకుండా జాగ్రత్త పడుతూ మేకపోతు గాంభీర్యం నటిస్తుంటారు. రోగనిరోధక శక్తితో కొందరు హోమ్ ఐసోలేషన్‌తోనే కోలుకుంటుండగా, మరికొందరు పరిస్ధితి విషమించి ఆసుపత్రికి వెళ్లడమో లేదా... ఫ్లాట్‌లోనే మృత్యువాత పడటం పరిపాటిగా తయారైంది. -
హంతకుడిని పట్టించిన గుండీ
ఔరంగాబాద్: చిన్న ఆధారమూ క్రిమినల్ కేసులో ఎంత కీలకంగా మారుతోందో చెప్పే ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఔరంగాబాద్‌లో బికన్ నిలోబ జాదవ్‌ను ఏడు నెలల క్రితం కొందరు హత్య చేశారు. ఘటనా స్థలంలో పోలీసులకు గుండీ మాత్రమే దొరికింది. గుండీ మీద రోప్లాస్ట్ స్టిచ్ అనే అక్షరాలు ఉండటంతో పోలీసులు ఆయా విక్రేతల నుంచి ఎవరెవరు చొక్కాలు కొనుగోలు చేశారో పరిశీలించారు. దాదాపు 10 వేల మంది వారి నుంచి చొక్కాలను కొనగా అందులో 246 మందికి నేరచరిత్ర ఉంది. అందులో హత్యకు నాలుగు రోజుల ముందు రగాడే అనే వ్యక్తి కత్తులను కొనుగోలు చేశాడు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో మిగిలిన వారి పేర్లు కూడా బయటకు వచ్చాయి. అజయ్ రగాడే, చేతన్ గైక్వాడ్, సందీప్ గైక్వాడ్‌లు ఈ హత్య చేసినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. -
సేఫ్టీ బటన్
ఓ విద్యార్థిని బస్టాపు వద్ద బస్ కోసం వేచి చూస్తోంది. ఇంతలో కొందరు పోకిరీలు ఆమెను వేధించసాగారు. బాధితురాలు సేఫ్టీ ఐల్యాండ్‌లోని బటన్ నొక్కగానే నిమిషాల్లోనే పోలీసులు వచ్చి ఆకతాయిలను పట్టుకున్నారు. త్వరలో ఇలాంటి వ్యవస్థ ఐటీ సిటీలో మహిళల భద్రతకు ఉపయోగపడనుంది. బనశంకరి: మహిళలకు ఆపద ఎదురైనప్పుడు తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వడానికి కొత్త వ్యవస్థ ఉద్యాననగరిలో రాబోతోంది. కేవలం ఒక టచ్ ద్వారా పోలీసులకు సమాచారం అందించే ‘సేఫ్టీ ఐల్యాండ్’లను నగరంలో అమర్చనున్నారు. దేశంలో మెట్రో నగరాల్లోనే మొదటిసారిగా బెంగళూరులో ఈ ఐల్యాండ్లను ఏర్పాటు చేయనున్నారు. మహిళలు, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ప్రాంతాల్లో ఐల్యాండ్‌ను అమరుస్తారు. కేంద్ర ప్రభుత్వ నిర్భయ నిధి కింద 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40 శాతం నిధులతో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తారు. ఎలా పనిచేస్తుందంటే ♦ ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో జీపీఎస్ ఆధారిత టచ్, ట్యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించే ఎలక్ట్రానిక్ పరికరాలను అమర్చుతారు. ♦ మహిళలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలు, అధికంగా ఉన్న కాలేజీలతో పాటు విద్యా సంస్థలు, గార్మెంట్స్, ఐటీ బీటీ కంపెనీలు, ప్రైవేటు కంపెనీల వద్ద ఐల్యాండ్‌ను ఏర్పాటు చేస్తారు. ♦ దీనిని పోలీస్ ప్రధాన కంట్రోల్ రూంతో అనుసంధానిస్తారు. మహిళలపై దాడులతో పాటు ఎలాంటి నేర కార్యకలాపాలు జరుగుతున్నా బాధితులు, ప్రజలు ఐల్యాండ్పై తడితే కంట్రోల్ రూంలో సిగ్నల్ మోగుతుంది. పోలీసులు 2 నుంచి 5 నిమిషాల్లోగా ఘటనాస్ధలానికి చేరుకుంటారు. ♦ పింక్, హోయ్సళతో పాటు గస్తీ వాహనాలను ఈ వ్యవస్థకు కేటాయిస్తారు. ♦ ఎలక్ట్రానిక్ పరికరాన్ని పోకిరీలు దుర్వినియోగం చేయకుండా అక్కడ నాణ్యమైన సీసీ కెమెరాలను బిగిస్తారు. నగర పోలీసుల పథకమే నగరంలో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన ప్రదేశాల్లో కూడా అధిక సంఖ్యలో సీసీ కెమెరాలను అమర్చి నేర కార్యకలాపాలపై ప్రత్యే నిఘా ఉంచనున్నట్లు అదనపు పోలీస్‌కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. ఎన్నోసార్లు ప్రజల వద్ద మొబైల్, ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు, అలాంటి వారికి ఐల్యాండ్ట్యాప్ పరికరం ఎంతో అనుకూలం కానుంది. ఐటీ సిటీలో మహిళల భద్రతకు కోసం ఐల్యాండ్ పథకాన్ని బెంగళూరు పోలీసులు రూపొందించగా, కేంద్రప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపిందని సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. బెంగళూరులో ఫలితాలను బట్టి ఇతర నగరాల్లోనూ అమలు చేసే అవకాశముంది. ఆ ఎమ్మెల్సీ జీతం పేదలకే బొమ్మనహళ్లి: ఎమ్మెల్సీలలో తాను అత్యంత శ్రీమంతుడిని అని, అందువల్ల తనకు వచ్చే నెలజీతంతో పాటు ఇతర భత్యాలను అనాథలకు, క్యాన్సర్ రోగులకు అందజేస్తామని జేడీఎస్ ఎమ్మెల్సీ బీఎం ఫారూక్ చెప్పారు. మంగళూరు ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త అయిన ఫారూక్ ఆస్తులు వందల కోట్లలో ఉన్నాయి. ఎమ్మెల్సీగా నెలకు రూ. 1 లక్ష వేతనం, ఇతర ఖర్చుల కింద మరో రూ.లక్ష వస్తుందని చెప్పారు. ఆ నగదును అనాథలకు, క్యాన్సర్ రోగులకు అందజేస్తానని చెప్పారు. -
గూగుల్‌లో ఈ మార్పును గమనించారా?
సాక్షి, టెక్నాలజీ : ఇంటర్నెట్ యూజర్లకు ప్రముఖ సెర్చింజన్ గూగుల్ షాక్ ఇచ్చింది. ఇకపై మీకు నచ్చిన ఫోటోలను ఇష్టమొచ్చినట్లు సేవ్ చేసుకోకుండా సెర్చింజన్లో మార్పులు చేసేసింది. ఫ్రీ ఫోటోలకు ఆస్కారం లేకుండా ‘వ్యూ ఇమేజ్’ బటన్‌ను తొలగించేసింది. ఇంతకు ముందు గూగుల్‌లో ఏదైనా ఫోటోలను ఓపెన్ చేసినప్పుడు పక్కన విజిట్, షేర్లతోపాటు వ్యూ ఇమేజ్ ఆప్షన్ కూడా కనిపించేది. దానిని క్లిక్ చేస్తే ఆ ఫోటో ఓపెన్ అయ్యి సేవ్ చేసుకునే సౌలభ్యం ఉండేది. అయితే కాపీ రైట్స్ కారణం చెబుతూ ఇప్పుడు ఆ ఆప్షన్‌ను గూగుల్ తొలగించేసింది. ఇప్పుడు గూగుల్ లో కేవలం విజిట్, షేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ‘గూగుల్‌లో నేటి నుంచే కొన్ని మార్పులు చేశాం. వ్యూ ఇమేజ్ బటన్‌ను తొలగించేశాం అని, యూజర్లకు, ఆధారిత వెబ్సైట్లకు ఉపయోగకరంగా ఉండాలనే ఈ పని చేశాం’ అని ఓ ప్రకటనలో గూగుల్ పేర్కొంది. దీని ద్వారా విజిట్ పేజ్ బటన్ ద్వారా ఆధారిత వెబ్ సైట్‌కు యూజర్ వెళ్తాడు. తద్వారా తమ ఆదాయం పెంచుకునేందుకే గూగుల్ ఈ పని చేసినట్లు స్పష్టమౌతోంది. హై డెఫినేషన్ ఫోటోలు కావాలనుకుంటే తప్పనిసరిగా ఆ వెబ్‌సైట్‌ను ఆశ్రయించాల్సిందేనని గూగుల్ చెబుతుండగా.. ప్రత్యామ్నయ మార్గాలను కూడా వెతుక్కునే పనిలో యూజర్లు పడ్డారు. Today we're launching some changes on Google Images to help connect users and useful websites. This will include removing the View Image button. The Visit button remains, so users can see images in the context of the webpages they're on. pic.twitter.com/n76KUj4ioD — Google SearchLiaison (@searchliaison) 15 February 2018 -
ఫేస్బుక్ పోస్ట్‌లపై చెత్త కామెంట్లకు చెక్
శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఫేస్బుక్లో అసంబద్ధ వ్యాఖ్యలు, అబ్యూసివ్ వ్యాఖ్యలతో ఇబ్బందులు పడే వినియోగదారుల సౌలభ్యం కోసం ‘డౌన్ వోట్ ’ అనే ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. ఫేస్బుక్ పోస్ట్‌లపై వినియోగదారులకు ప్రతికూల స్పందనను నమోదు చేసే ఒక లక్షణాన్ని పరీక్షిస్తోంది. అయితే చాలామంది ఫేస్బుక్ వినియోగదారులకు ఆశిస్తున్నట్టుగా డిజ్లైక్ బటన్‌లా కాకుండా సరికొత్తగా దీన్ని పరీక్షిస్తోంది. ఫేస్బుక్ యూజర్లను ఇబ్బంది పెట్టే కామెంట్‌పై సంబంధిత యూజర్లు డౌన్‌వోట్ బటన్ క్లిక్ చేసినపుడు ఆ వ్యాఖ్య ప్రమాదకరమైందా, తప్పుదోవ పట్టించేదా, లేదా టాపిక్‌తో సంబంధం లేనిదా చెప్పమని అడుగుతుంది. అనంతరం ఆ కామెంట్లు మిగతా యూజర్లకు కనిపించకుండా చేస్తుంది. యూజర్ల పోస్ట్‌లపై అవాంఛనీయమైన కామెంట్లకు మాత్రమే ఇది ఉద్దేశించిందని ఫేస్బుక్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ విషయాన్ని ధృవీకరించిన సంస్థ ప్రస్తుతం అమెరికాలో చాలా కొద్దిమందిపై ప్రయత్నిస్తున్నట్టు చెప్పింది. పబ్లిక్ పోస్టులపై వ్యాఖ్యలపై ఫీడ్ బ్యాక్ కోసం దీన్ని పరీక్షిస్తున్నట్టు చెప్పింది. కాగా 2009 లో లైక్ ఆప్షన్‌ను తీసుకొచ్చినపుడు డిజ్లైక్ బటన్ కూడా చేర్చాలని యూజర్లు కోరుకున్నారు. అయితే 2016లో రియాక్షన్ ఎమోజీలను (ప్రేమ, నవ్వు, ఆశ్చర్యం, విచారం లాంటి) జోడించిన సంగతి తెలిసిందే. -
ఫేస్బుక్లో లైక్‌ను ఇంకాస్త అందంగా..
న్యూయార్క్: ఫేస్బుక్లో ఇక నచ్చిన వాటికి లైక్ కొట్టడమే కాదు దానిని ఇంకాస్త అందంగా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. లైక్ బటన్‌ను మరికాస్త ముందుకు తీసుకెళ్తూ రియాక్షన్స్ బటన్‌ను తీసుకొచ్చింది ఫేస్బుక్. ఈ రియాక్షన్ బటన్ సేవలు బుధవారం నుండి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్నట్లు ఫేస్బుక్ వెల్లడించింది. రియాక్షన్ బటన్ ద్వారా లైక్, వావ్.. ఇలా 7 రకాల భావాలను వెల్లడించే వీలు కల్పించారు. దీనిని పైలట్ ప్రాజెక్టుగా గత అక్టోబర్‌లో ఐర్లాడ్, స్పెయిన్‌లో ప్రవేశపెట్టారు. దీనికి మంచి స్పందన వస్తుండటంతో ఈ సేవలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మొబైల్లో ఫేస్బుక్ వినియోగదారులు లైక్ బటన్‌ను నొక్కి పట్టుకోవటం ద్వారా రియాక్షన్స్ ఆప్షన్‌ను పొందొచ్చని సంస్థ ఓ బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. -
పసి వయసులోనే వృద్ధాప్యం!
చిన్న పిల్లలకు సోకే అత్యంత అరుదైన చర్మవ్యాధి బెంజమిన్ బటన్. పసివయసులోనే వృద్ధాప్యం వచ్చినట్లుగా మారిపోవడం ఈ వ్యాధి లక్షణం. ఈ చర్మవ్యాధి సోకిన చిన్నారులు వయసు పైబడినవారిలా కనిపిస్తారు. ఏడేళ్ల అంజలి కుమారి, 18 నెలల కేశవ్ కుమార్ లాంటి చాలా మంది ఇప్పుడు అదే సమస్యతో బాధపడుతున్నారు. అతి చిన్న వయసులోనే చర్మమంతా ముడతలు పడిపోయి, వయసు మీద పడినట్లు కనిపిస్తున్నారు. జన్యుపరంగా వచ్చే ఆ అరుదైన రుగ్మతతో అక్కాతమ్ముళ్లు బాధపడుతున్నారు. జార్ఖండ్ రాంచికి చెందిన అంజలి, కేశవ్‌లను క్యూటిస్ లాక్సాగా పిలిచే అత్యంత భయంకరమైన రోగం పట్టిపీడిస్తోంది. శత్రుఘ్న రాజక్, రింకీదేవి దంపతులకు అంజలి, కేశవ్ లతో పాటు... 11 ఏళ్ల మరో కుమార్తె శిల్పి కూడా ఉంది. ఆమెలో మాత్రం పుట్టినప్పటి నుంచి ఈ వ్యాధి లక్షణాలు ఎక్కడా కనిపించలేదట. ఇండియాలో డాక్టర్లు కూడా ఈ వ్యాధిని తగ్గించడం కష్టమని చెప్పేశారు. అయితే తమను వీధిలోని వారంతా వింతగా చూస్తున్నారని, చెత్త కామెంట్లు చేస్తున్నారని అంజలి వాపోతోంది. దాది అమ్మా (బామ్మ), బుడియా (ముసలి), బందరియా (కోతి) వంటి పదాలతో పిలుస్తూ స్కూల్లో అంతా గేలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ పిల్లలకు సోకిన ఈ వింతవ్యాధి ఎప్పటికైనా తగ్గుతుందేమోనన్న ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. వైద్యులు మాత్రం దీనికి ఇతర దేశాల్లో తప్ప.. భారత్‌లో మందు లేదని తేల్చిచెప్పేశారు. లాండ్రీ మ్యాన్‌గా పనిచేస్తూ నెలకు రూ. 4,500 మాత్రమే సంపాదించే శత్రుఘ్నకు విదేశాల్లో వైద్యం చేయించే తాహతు లేకపోవడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. ఎప్పటికైనా తమ పిల్లలు సాధారణ స్థితికి వస్తారని ఆ తల్లిదండ్రులు ఆశతో ఎదురు చూస్తున్నారు.