యూట్యూబ్.. ఈ యాప్ గురించి తెలియనివారెవరూ ఉండరు. వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన యూట్యూబ్.. వినియోగదారులకు కావలసిన అన్ని రకాల సమాచారాలకు సంబంధించిన వీడియోలను ముందుకు తీసుకువస్తుంది. తాజాగా యూట్యూబ్‌లో మరో ఫీచర్ దర్శనవివ్వనుంది. అది యూజర్స్‌కు సరికొత్త అనుభూతిని అందిస్తుందనడంలో సందేహం లేదు.
గూగుల్‌కు చెందిన వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారం యూట్యూబ్ ప్రతి స్మార్ట్‌ఫోన్‌లోనూ ఇన్‌స్టాల్ అయి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు రోజులో కొంతసేపైనా యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అత్యధిక వినియోగదారుల బేస్ కలిగిన యూట్యూబ్ మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు తరచూ నూతన ఫీచర్లను అందిస్తుంటుంది.
త్వరలో యూట్యూబ్‌లో గూగుల్ లెన్స్ బటన్ యూజర్స్‌కు అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ ఫోను వినియోగదారులు గూగుల్ లెన్స్ బటన్ ఉపయోగించడం ద్వారా టైప్ చేయడానికి బదులు ఏదైనా ఫొటో సాయంతో వీడియోలను శోధించవచ్చు. యూట్యూబ్ యాప్ అప్‌డేట్‌లో గూగుల్ లెన్స్ బటన్ కనిపించనుంది. ఇదే విధంగా యూట్యూబ్ యూజర్స్ ఫోనులోని మైక్రోఫోన్ బటన్ సహాయంతో, మాట రూపంలో సూచించడం ద్వారా కూడా తమకు కావలసిన వీడియోలను చూసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment