టెక్ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరిట ఉద్యోగాల తొలగొంపునకు పూనుకుంటున్నాయి. అందులో చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అన్ని సంస్థలో భాగమవుతున్నాయి. తాజాగా ప్రపంచంలోనే టాప్ కంపెనీగా ఉన్న గూగుల్‌కు చెందిన యూట్యూబ్ మ్యూజిక్ విభాగం నుంచి 43 మందికి ఉద్యోగాల నుంచి ఉద్వాసన పలికారు.
యూట్యూబ్ మ్యూజిక్‌లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న 43 మంది ఉద్యోగులు మెరుగైన వేతనం, ఇతర ప్రయోజనాలు అడిగినందుకు వారిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు కొన్ని మీడియా కథనాల్లో ప్రచురితమైంది. ఆ ఉద్యోగులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన గూగుల్‌లో, సబ్‌కాంట్రాక్ట్‌గా కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్నారు. అయితే ఈ తొలగింపులకు గూగుల్ బాధ్యత వహించదని తెలిపింది. బాధితుల్లో ఒకరైన యూట్యూబ్ డేటా అనలిస్ట్ జాక్ బెనెడిక్ట్ గూగుల్‌తో లేఆఫ్స్‌కు సంబంధించి యూనియన్ చర్చలకు సిద్ధమైనట్లు తెలిసింది.
ఇదీ చదవండి: యూపీఐ సేవల్లోకి ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ
ఈ అంశంపై జాక్ బెనెడిక్ట్ మాట్లాడుతూ ఉద్యోగులకు తమ తొలగింపుల గురించి ఎలాంటి ముందస్తు నోటీసు రాలేదని చెప్పారు. గూగుల్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ కంపెనీ ముందుగా చేసుకున్న ఒప్పందాలు గడువులోపు ముగుశాయన్నారు. తొలగింపులు తమ వ్యాపార కార్యకలాపాల్లో ఒక భాగమని చెప్పారు. అయితే తొలగించిన ఉద్యోగులకు కంపెనీలో ఇతర స్థానాలను కల్పించేలా ఏడు వారాల గడువు ఉంటుందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment