ఫేస్బుక్లో లైక్ను ఇంకాస్త అందంగా.. | "Reactions", an extension of the "Like" button, was now available worldwide. | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్లో లైక్ను ఇంకాస్త అందంగా..

Published Wed, Feb 24 2016 7:38 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఫేస్బుక్లో లైక్ను ఇంకాస్త అందంగా.. - Sakshi

ఫేస్బుక్లో లైక్ను ఇంకాస్త అందంగా..

న్యూయార్క్: ఫేస్బుక్లో ఇక నచ్చిన వాటికి లైక్ కొట్టడమే కాదు దానిని ఇంకాస్త అందంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. లైక్ బటన్ను మరికాస్త ముందుకు తీసుకెళ్తూ రియాక్షన్స్ బటన్ను తీసుకొచ్చింది ఫేస్బుక్. ఈ రియాక్షన్ బటన్ సేవలు బుధవారం నుండి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్నట్లు ఫేస్బుక్ వెల్లడించింది.

రియాక్షన్ బటన్ ద్వారా లైక్, వావ్.. ఇలా 7 రకాల భావాలను వెల్లడించే వీలు కల్పించారు. దీనిని పైలట్ ప్రాజెక్టుగా గత అక్టోబర్లో ఐర్లాడ్, స్పెయిన్లో ప్రవేశపెట్టారు. దీనికి మంచి స్పందన వస్తుండటంతో ఈ సేవలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మొబైల్లో ఫేస్బుక్ వినియోగదారులు లైక్ బటన్ను నొక్కి పట్టుకోవటం ద్వారా రియాక్షన్స్ ఆప్షన్ను పొందొచ్చని సంస్థ ఓ బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement