like
-
వేరే అమ్మాయి ఫోటోకు ఎందుకు లైక్ కొట్టావ్..
బనశంకరి: సోషల్ మీడియా గొడవల వల్ల ప్రాణాలను తృణప్రాయంగా వదిలేస్తున్నారు. ఇన్‌స్టా గ్రామ్‌లో మరో యువతికి కాబోయే భర్త లైక్ కొట్టినందుకు యువతి అతన్ని మందలించింది. ఇది నచ్చని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లా బంటా్వళ తాలూకా పూంజాకట్టి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుక్కిప్పాడి నివాసి చేతన్ (25) కాంతార మాదిరి దేవుని పూజా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. కుందాపురలో చైతన్య అనే యువతి ఇన్‌స్టా లో పరిచయమైంది. స్నేహం ఏర్పడి ప్రేమకు దారితీసింది. 8 నెలల క్రితం ఇరువురికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ నెల 21వ తేదీన చేతన్ ఇన్‌స్టాలో మరో యువతి ఫోటోకు లైక్ కొట్టాడు. ఈ విషయమై ప్రశ్నించడానికి ప్రియురాలు చైతన్య, చేతన్ ఇంటికి వెళ్లింది. వేరే అమ్మాయి ఫోటోకు ఎందుకు లైక్ కొట్టావని గొడవకు దిగింది. క్రమంగా తీవ్ర వివాదంగా మారింది. మనస్థాపం చెందిన చేతన్ వెంటనే పై గదిలోకి వెళ్లి ఉరివేసుకున్నాడు. నీ కొడుకు నిద్రపోయాడని, పిలిచినా లేవలేదని చైతన్య కాబోయే అత్త పుష్పకు ఫోన్ చేసి చెప్పింది. ఇంటికి చేరుకున్న చేతన్ తల్లి ఇంటి పై గదిలోకి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. -
ఇంటర్ పిల్లలా అనసూయ.. ఇంత క్యూట్ ఉందేంటి? (ఫొటోలు)
-
తరం తల్లడిల్లుతోంది..!
చిల్లా వాసు, ఏపీ సెంట్రల్ డెస్క్ బాపట్లకు చెందిన చెన్నుపాటి యశ్వంత్ చాలా తెలివైన విద్యార్థి. గతేడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించాడు. ప్రతిష్టాత్మక ఐఐటీ గాంధీనగర్ (గుజరాత్)లో కంప్యూటర్ సైన్సులో సీటు వచ్చింది. అయితే చాలా దూరం కావడంతో జాతీయ స్థాయిలో మరో ప్రముఖ విద్యా సంస్థ ఎన్ఐటీ కాలికట్లో బీటెక్ కంప్యూటర్ సైన్సులో చేరాడు. తల్లిదండ్రులు, బంధువులు ఎంతో సంతోషించారు. యశ్వంత్‌కు ఉజ్వల భవిష్యత్ ఖాయమని, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మంచి ఉద్యోగం వచ్చేస్తుందని సంబరపడ్డారు. అయితే ఈ ఆనందం వారికి ఎంతో కాలం నిలవలేదు. ఆరు నెలలకే యశ్వంత్ క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎన్ఐటీ కాలికట్ లాంటి ప్రముఖ విద్యా సంస్థలో సీటు సాధించి ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటని అందరూ నివ్వెరపోయారు. ...ఒక్క యశ్వంత్ మాత్రమే కాదు.. ఇలా ఎంతో మంది విద్యార్థులు ప్రముఖ విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) వంటి వాటిలో సీట్లు సాధించి కూడా అర్ధంతరంగా ఆత్మహత్యలకు పాల్పడటం కలవరపరుస్తోంది. కేంద్ర విద్యా శాఖ లెక్కల ప్రకారం.. 2018 నుంచి ఈ ఏడాది వరకు 33 మంది విద్యార్థులు ఐఐటీల్లో ఆత్మహత్య చేసుకున్నారు. జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో 2018 నుంచి ఇప్పటివరకు 98 మంది విద్యార్థులు చనిపోతే వీరిలో 33 మంది ఐఐటీల విద్యార్థులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక 2014–21లో ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర కేంద్ర విద్యా సంస్థల్లో 122 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం.. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. భారతదేశంలో 2017 నుంచి విద్యార్థుల ఆత్మహత్యల మరణాలు 32.15% పెరిగాయి. మరోవైపు కోచింగ్ ఇన్స్టిట్యూట్ల కర్మాగారంగా, కోచింగ్ హబ్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రాజస్థాన్‌లోని కోటాలో ఈ ఏడాది ఇప్పటివరకు 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. సీటు ఎంత కష్టమంటే.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఐఐటీలు. వీటి తర్వాత స్థానం ఎన్ఐటీలది. ఇంజనీరింగ్ విద్యకు పేరుగాంచిన ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం ఏటా నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్‌ని ఈ ఏడాది దేశవ్యాప్తంగా 11 లక్షలకుపైగా రాశారు. వీరిలో దాదాపు 2.5 లక్షల మందిని తదుపరి పరీక్ష అయిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేశారు. దేశంలో ఉన్న 23 ఐఐటీల్లో ఈ ఏడాదికి 17,385 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే.. 11 లక్షల మంది పరీక్ష రాస్తే చివరకు ఐఐటీల్లో ప్రవేశించేది 17,385 మంది మాత్రమే. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయినా సీట్లు రానివారు, జేఈఈ మెయిన్‌లో ర్యాంకులు వచ్చినవారు ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఇతర జాతీయ విద్యా సంస్థల్లో చేరుతున్నారు. జేఈఈ కోసం ఆరో తరగతి నుంచే ఐఐటీ ఒలింపియాడ్, కాన్సెప్ట్ స్కూళ్లలో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఇందుకు లక్షల రూపాయలు ధారపోస్తున్నారు. ఇలా ఆరో తరగతి నుంచి ఇంటర్మిడియెట్ వరకు ఏడేళ్లపాటు కృషి చేస్తుంటే చివరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి ఐఐటీల్లో చేరుతున్నారు. ఎందుకిలా.. ఓవైపు అకడమిక్ ఎగ్జామ్స్, మరోవైపు కాంపిటీటివ్ ఎగ్జామ్స్.. ప్రాజెక్టు వర్క్, థీసిస్,ప్రాక్టికల్స్ కోసం సొంతంగా సిద్ధం కావాల్సి రావడం. సొంత రాష్ట్రానికి చాలా దూరంగా వేరే రాష్ట్రాల్లో సీటు రావడం.. భాషలు, ఆహారం, వాతావరణం అలవాటుపడలేకపోవడం గతంలో ఎంత సాధించినా.. ఐఐటీలు, ఎన్ఐటీలలో అసలు సిసలు పోటీ ప్రారంభమవడం. గతంలో బట్టీ పట్టేస్తే సరిపోయేది.. ఇపుడు సృజనాత్మకత అవసరం.. ఇక్కడ మేథస్సుకే పని. విద్యార్థులకు ఇష్టంలేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద కోర్సును ఎంపిక చేసుకోవడం. ఏం చేయాలి? విద్యాసంస్థలలో మానసిక ఆరోగ్య సేవలను మెరుగుపరచాలి. చాలా ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఐఐఎంల్లో కౌన్సెలింగ్ సెంటర్లు ఉన్నాయి. వాటిని విద్యార్థులు ఉపయోగించుకోవాలి. ఒత్తిడిని నివారించడానికి బిజినెస్ క్లబ్బులు, ఫొటోగ్రఫీ క్లబ్బు, కల్చరల్ క్లబ్బు, యోగా క్లబ్బు, మ్యూజిక్ క్లబ్బులు ఉన్నాయి. తమ ఆసక్తికి అనుగుణంగా విద్యార్థులు వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. తల్లిదండ్రుల ధోరణి కూడా మారాలి. పిల్లల చదువులకు బాగా డబ్బు ఖర్చు పెట్టామనే ఉద్దేశంతో ఒత్తిడి పెంచడం, ఇతరులతో పోల్చి తిట్టడం వంటివి చేయకూడదు. స్కూల్, కళాశాల స్థాయిల్లోనే బట్టీ పట్టే చదువులకు స్వస్తి పలకాలి. పిల్లలు సృజనాత్మకంగా ఆలోచించుకుని నేర్చుకునేలా చేయాలి. నిత్యం యోగా, ధ్యానం చేయించడంతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు చురుగ్గా పాల్గొనేలా చేయాలి. విద్యార్థులు సోషల్ మీడియా సైట్లు, సైబర్ బెదిరింపుల బారిన పడకుండా చూడాలి. కొద్ది రోజులే ఇబ్బంది.. మాది బాపట్ల జిల్లా. నేను ఎన్ఐటీ జంషెడ్పూర్ లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫస్టియర్ చదువుతున్నాను. మొదట్లో నాకు భాషా పరంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాగే ఇంటికి చాలా దూరంలో పరాయి రాష్ట్రంలో ఉండాల్సి రావడం కూడా కొంచెం సమస్యగా మారింది. అయితే ఆ బెరుకును ఇన్స్టిట్యూట్లో ఉన్న కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది పోగొట్టారు. బోధన పరంగా సంప్రదాయ విధానానికి, ఎన్ఐటీల్లో విద్యకు తేడా ఉంది. ఇక్కడ బోధన చర్చ, విశ్లేషణ.. సంపూర్ణ అవగాహన అనే రీతిలో సాగుతోంది. కొంత అదనపు సమాచారాన్ని మా అంతట మేమే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. – ఎం. సుశ్వాంత్, బీటెక్ కంప్యూటర్ సైన్స్,థర్డ్ ఇయర్, ఎన్ఐటీ, జంషెడ్పూర్ కొంత సమయం పడుతోంది.. ఇప్పుడు 8వ తరగతి నుంచే జేఈఈకి సిద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచే విద్యార్థులపై ఒత్తిడి మొదలవుతోంది. ఇంటర్మిడియెట్ వరకు టీచర్ పాఠం చెప్పడం.. బోర్డుపైన రాయడం.. నోట్సు చెప్పడం.. తర్వాత దాన్ని బట్టీ పట్టడం వంటి సంప్రదాయ విధానాలకు అలవాటు పడిన విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీల్లో కొత్త విధానాలను అలవాటు పడటానికి సమయం పడుతోంది. ఒక్కసారిగా ఇంటికి దూరం కావడం, వేరే ఎక్కడో ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు రావడం వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో అంతగా స్కిల్స్ లేనివారే ఒత్తిడి బారిన పడుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, యోగా వంటివాటి వైపు విద్యార్థులను ప్రోత్సహిస్తే ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. ఆ దిశగా చర్యలు చేపట్టాలి. – ఎంఎన్ రావు, ఐఐటీ కోచింగ్ నిపుణులు, హైదరాబాద్ ప్రాథమిక దశలోనే నైపుణ్యాలు పెంపొందించాలి.. కేంద్ర విద్యా శాఖ ప్రాథమిక దశలోనే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించుకునేలా చర్యలు చేపట్టాలి. అన్ని రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించి విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. జేఈఈ రాసేవారిలో ఎక్కువ మంది సౌత్ ఇండియా వారే. వీరిలో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటున్నారు. ఇంటర్‌లోగంటల తరబడి చదివి జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ల్లో ర్యాంకులు తెచ్చుకుంటున్న విద్యార్థులకు ఐఐటీల్లో అసలు పరీక్ష మొదలవుతోంది. అక్కడ ప్రొఫెసర్లు చెప్పిన కాన్సెప్‌్టతో విద్యార్థులే సొంతంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ నైపుణ్యాలు లేనివారే ఒత్తిడికి గురవుతున్నారు. కొత్త విధానానికి అలవాటుపడలేనివారు మొదటి సెమిస్టర్ పరీక్షల్లో విఫలమవుతున్నారు. ఈ క్రమంలో కొన్ని సబ్జెక్టుల్లో బ్యాక్‌లాగ్స్ ఉంటున్నాయి. దీంతో ఒత్తిడికి గురవుతున్నారు. – కె.లలిత్ కుమార్, డైరెక్టర్, అభీష్ట ఎడ్యుగ్రామ్ లిమిటెడ్ -
విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్‌లా ఆడగలను: సింథియా
ఢిల్లీ: ప్రతీకార రాజకీయాలు చేయడం తనకు ఇష్టం ఉండదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్‌లపై తనకు ఎలాంటి పగ లేదని చెప్పారు. తాను ఎప్పుడూ ముఖ్యమంత్రి పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ అభివృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించే వ్యక్తినని ఆయన అన్నారు. 2018లో కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కమల్‌నాథ్‌ను సీఎంగా ప్రకటించడం పట్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సింథియా చెప్పారు. సీఎం రేసులో తాను ఎప్పుడూ లేనని స్పష్టం చేశారు. పైగా కమల్‌నాథ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై తాను కూడా మద్ధతు తెలిపినట్లు గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దోపిడీ పాలన జరిగిందని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అన్ని వాగ్దానాలను మరిచిపోయారని కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు. 2018లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. కమల్‌నాథ్‌ను అధిష్ఠానం సీఎంగా నిర్ణయించింది. 2020లో జ్యోతిరాదిత్య సింథియా 20 మంది ఎమ్మెల్యేలతో పార్టీని ఫిరాయించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. విరాట్ కోహ్లీ, సెహ్వాగ్‌లా ఆడగలను.. భవిష్యత్పైనే తనకు దృష్టి ఉంటుందని సింథియా అన్నారు. విరాట్ కోహ్లీ, సెహ్వాగ్‌లాగా తాను ఆడగలనని అన్నారు. ఒకవేళ తాను అలా ఆడకపోయి ఉంటే.. 2020లో మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం కూలిపోయేది కాదని అన్నారు. కాంగ్రెస్‌లో సీట్ల కేటాయింపులో ఉండే అర్హత సంస్కృతిపై సింథియా మండిపడ్డారు. బీజేపీలో కష్టపడ్డవారికే ఫలితం ఉంటుందని, కాంగ్రెస్‌లో అలా కాదని అన్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Nuh Violence: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. ఇంటర్నెట్ బంద్.. -
ట్వీట్లతో రెచ్చిపోండి.. యూజర్లకు మస్క్ బంపరాఫర్
‘ట్వీట్లతో రెచ్చిపోండి.. దీని వల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురై లీగల్‌గా అయ్యే ఖర్చులు నేను చూసుకుంటా’ అంటున్నారు ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రతిఒక్కరూ ట్విటర్, ఇతర సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఇలా తమ సోషల్ మీడియా ఖాతాల్లో పలు అంశాలపై వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు స్పందిస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఆయా కంపెనీల యాజమాన్యాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కొన్నిసార్లు ఆయా కంపెనీలు లీగల్‌గానూ ఉద్యోగులను ఇబ్బందులు పెడుతుంటాయి. అలాంటి వారికి అండగా నిలుస్తామని మస్క్ ప్రకటించారు. ఎక్స్ ప్లాట్ఫామ్లో ట్వీట్లు చేసే, లైక్ కొట్టే, కామెంట్లు చేసే ఉద్యోగులను వారి యాజమాన్యాలు, కంపెనీలు లీగల్‌గా వేధిస్తే దానికి ఎదుర్కొనేందుకు యూజర్లకు అండగా నిలుస్తామని, అందుకయ్యే మొత్తాన్ని భరిస్తామని మస్క్ తాజాగా ట్వీట్ చేశారు. ఇందుకు ఎటువంటి పరిమితి లేదని, అటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. దీనిపై అధిక సంఖ్యలో యూజర్లు ప్రతిస్పందించారు. మస్క్‌ను పొడగ్తలతో ముంచేస్తూ కామెంట్లు పెట్టారు. ట్విటర్ ఇటీవల దాని ఐకానిక్ బ్లూ బర్డ్ లోగోను తొలగించి దాని స్థానంలో ‘ఎక్స్’ను తీసుకొచ్చింది. ట్విటర్‌ను పూర్తిగా రీబ్రాండ్ చేసే ప్రయత్నంలో భాగంగా దాని అధినేత మస్క్ ఈ మార్పు చేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్న మంత్లీ యూజర్లు 540 మిలియన్లకు పైగా పెరిగారంటూ చూపించే గ్రాఫ్ షేర్ చేస్తూ "కొత్త గరిష్టానికి" చేరుకున్నట్లు ప్రకటించారు. Zuck × Musk fight: ‘జుక్ × మస్క్’ కుబేరుల కోట్లాట లైవ్.. ఆ ఆదాయంతో.. ఇలా మస్క్ ఓ వైపు కంపెనీలో సంస్థాగత మార్పులు చేసుకుంటూ పోతుంటే మరోవైపు దీనికి పోటీగా మెటా థ్రెడ్స్ యాప్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాని నుంచి పోటీని ఎదుర్కొనేందుకు తమ యూజర్లకు మస్క్ ఈ ప్రకటించినట్లు తెలుస్తోంది. యాక్టివ్ యూజర్లు పెరిగినప్పటికీ ప్రకటనల ఆదాయంలో తగ్గుదల కారణంగా ప్రతికూల నగదు ప్రవాహం ఎదుర్కొంటున్నట్లు మస్క్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. If you were unfairly treated by your employer due to posting or liking something on this platform, we will fund your legal bill. No limit. Please let us know. — Elon Musk (@elonmusk) August 6, 2023 -
" లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్ " మూవీ టీంతో చిట్ చాట్
-
ఉద్యోగులు మెచ్చే సంస్థ ‘మైక్రోసాఫ్ట్’
న్యూఢిల్లీ: భారత్‌లో ఉద్యోగులు మెచ్చే అత్యంత ఆకర్షణీయ సంస్థగా (అట్రాక్టివ్ ఎంప్లాయర్ బ్రాండ్) మైక్రోసాఫ్ట్ ఇండియా నిలిచింది. రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2022 ర్యాంకుల జాబితా విడుదలైంది. ఆర్థిక ఆరోగ్యం విషయంలో మైక్రోసాఫ్ట్ ఇండియా చాలా ఎక్కువ స్కోరు సాధించింది. బలమైన పేరు, గుర్తింపు, ఉద్యోగులకు ఆకర్షణీయమైన వేతనాలు, ఇతర ప్రయోజనాలు.. ఈ మూడు అంశాలు మైక్రోసాఫ్ట్‌ను నంబర్ 1 స్థానంలో నిలిపాయి. ఈ జాబితా లోని టాప్–10లో హ్యూలెట్ ప్యాకార్డ్ నాలుగో స్థానంలో, ఇన్ఫోసిస్ ఐదో స్థానంలో ఉన్నాయి. విప్రో, టీసీఎస్, టాటా స్టీల్, టాటా పవర్ కంపెనీ, శామ్సంగ్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రాండ్‌స్టాడ్ రీసెర్చ్ సర్వే కోసం 5,944 కంపెనీలకు చెందిన 1,63,000 మంది నుంచి (31 దేశాల వారు) అభిప్రాయాలు తెలుసుకున్నారు. కెరీర్లో పురోగతి కీలకం.. భారత్‌లో ప్రతి 10 మంది ఉద్యోగుల్లో 9 మంది (88%) శిక్షణ, వ్యక్తిగత కెరీర్ పురోగతి తమకు చాలా ముఖ్యమైనవిగా చెప్పారు. అదే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇలా చెప్పిన ఉద్యోగులు 76%. 2021 చివరి ఆరు నెలల్లో భారత్‌లో 24% ఉద్యోగులు తమ కంపెనీని మార్చుకున్నారని రాండ్‌స్టాడ్ తెలిపింది. సంస్థను ఎంపిక చేసుకునే విషయంలో పని–వ్యక్తిగత జీవితం మధ్య బ్యాలన్స్ తమకు ముఖ్యమని 63% మంది తెలిపారు. -
వారిపై ఎలాంటి జరిమానాలుండవు
న్యూఢిల్లీ: గత కొద్దీ నెలల క్రితం టిక్ టాక్, పబ్జి వంటి మరెన్నో పేరొందిన చైనీస్ యాప్ లను ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి మనకు తెలిసిందే. కానీ, ఆ యాప్ అభిమానులు వాటిని యాక్సెస్ చేయడం కోసం ఇతర ఏపీకే లింకుల ద్వారా వాటిని మొబైల్ ఫోన్లలో ఇంస్టాల్ చేసుకొని వాడుతున్నారు. చట్టవిరుద్ధంగా ప్రభుత్వం నిషేదించిన యాప్ లను వినియోగిస్తున్న వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటారంటూ సమాచార హక్కు చట్టం కింద కొందరు ఆర్టీఐ ద్వారా కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా నిషేధిత యాప్‌ల వినియోగానికి సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వం నిషేదించిన యాప్ లను వినియోగిస్తున్న వ్యక్తులపై ఎటువంటి జరిమానా, శిక్షలు విధించడం లేదని ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఐటి చట్టం యొక్క సెక్షన్ 69ఎ కింద గుర్తించబడిన మధ్యవర్తులు(సంస్థల)పై మాత్రమే ప్రభుత్వ ఆదేశాలను పాటించనందుకు గాను జరిమానా విధించనున్నట్లు కేంద్రం పేర్కొంది.(చదవండి: మరోసారి తన సత్తా చాటిన షియోమీ) -
ట్విటర్ లో మరో కొత్త ఫీచర్
సోషల్ మీడియా ద్వారా మనకు ఎంతో ముఖ్యమైన సమాచారం కూడా క్షణాలలో తెలిసిపోతుంది. సోషల్ మీడియాలో వచ్చే ఈ సమాచారం ద్వారా మనకు జరిగే మేలు ఎంతో, అంతే మొత్తంలో నష్టం కూడా జరుగుతుది. అందుకోసమే, సోషల్ మీడియాలో వచ్చే అసత్య వార్తల ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు ఆయా కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దీని కోసం ఫేస్బుక్ వార్నింగ్ లేబుల్ తీసుకొస్తుంటే.. ట్విటర్ కూడా ఇదే తరహాలో డిస్ప్యూటెడ్ ట్వీట్(వివాదాస్పదమైన ట్వీట్) పేరుతో ఒక హెచ్చరికను జారీ చేస్తుంది. దీని ద్వారా మనం ఎక్కువ శాతం అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. కానీ వీటి గురుంచి చాలా మందికి తెలియక పోవడం వల్ల వాటిని తిరిగి పోస్ట్ చేయడం లేదా రీట్వీట్ చేస్తుంటారు. ఇది సోషల్ మీడియా కంపెనీలకు తల నొప్పిగా మారింది. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా ట్విటర్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. (చదవండి: 43 యాప్స్ బ్యాన్ పై చైనా అభ్యంతరం) Giving context on why a labeled Tweet is misleading under our election, COVID-19, and synthetic and manipulated media rules is vital. These prompts helped decrease Quote Tweets of misleading information by 29% so we're expanding them to show when you tap to like a labeled Tweet. pic.twitter.com/WTK164nMfZ — Twitter Support (@TwitterSupport) November 23, 2020 ఇక నుండి ట్విట్టర్ వినియోగదారుడు డిస్ప్యూటెడ్ ట్వీట్ లేదా హెచ్చరికలు జారీ చేసిన ట్వీట్‌ను లైక్, షేర్ లేదా కామెంట్ చేయడానికి ట్విట్టర్ ఒక పాప్-అప్ విండోతో హెచ్చరిస్తోంది. అందులో ‘‘ఇది డిస్ప్యూటెడ్ ట్వీట్. నమ్మకమైన సమాచారం అందించే వేదికగా ట్విటర్‌ని ఉంచేందుకు సహాయపడండి. రీట్వీట్ చేసేముందు దాని గురించి మరింత సమాచారం తెలుసుకోండి’’ అని సందేశం కనిపిస్తుంది. ఈ ఫీచర్ పరీక్షల్లో భాగంగా ఇది సత్ఫలితాలనిచ్చిందని, దీని వల్ల 29 శాతం మేర అసత్య వార్తల ప్రచారం తగ్గిందని ట్విటర్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 మహమ్మారిపై జరిగే తప్పుడు సమాచార వ్యాప్తికి ఇది కొంత వరకు అడ్డుకట్ట వేస్తుందని ట్విటర్ అభిప్రాయపడింది. -
బికినీ మోడల్ ఫోటోకి ‘లైక్’.. చిక్కుల్లో పోప్
వాటికన్ సిటి: మతాధికారులు, గురువులు, ప్రీస్ట్‌లకు కొన్ని పరిమితులు ఉంటాయి. సామాన్యుల మాదిరిగా ప్రవర్తించకూడదు. బంధాలు, బాహ్య సుఖాలకు దూరంగా ఉండాలి. వాంఛలు లేకుండా బతకాలి. అలా కాదని హద్దు దాటితే ఇదిగో ఇలానే విమర్శలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. తాజాగా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు పోప్ ఫ్రాన్సిస్. ‘మీకిది తగునా.. దీనికి మీ సమాధానం ఏంటి’ అని ప్రశ్నిస్తున్నారు నెటిజనులు. ఇంత ఆగ్రహం దేనికి అంటే పోప్ ఇన్స్టాగ్రామ్ అధికారక అకౌంట్ నుంచి.. బికినీ ధరించిన ఓ బ్రేజిలియన్ మోడల్ ఫోటోని లైక్ చేశారు. దాంతో ఈ విమర్శలు. వివరాలు.. మోడల్ నటాలియో గారిబోట్టో గత నెల ఐదో తారీఖున బికినీ ధరించి ఓ స్కూల్ లాకర్ వద్ద నిలబడి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘నేను మీకు ఒకటి, రెండు విషయాలు నేర్పించగలను’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫోటోకి 1.5 మిలియన్లకి పైగా లైక్స్ వచ్చాయి. ఈ ఫోటోని పోప్ ఫ్రాన్సిన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఈ నెల 13న ‘లైక్’ చేసినట్లు ఉంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. అనుహ్యంగా మరుసటి రోజే ‘డిస్లైక్’ అని కనిపించింది. దాంతో కాస్త గందరగోళం తలెత్తింది. ఈ లోపు నటాలియా మానేజ్మెంట్ కంపెనీ సీఓవై.కో ఈ విషయాన్ని తన పబ్లిసిటీకి వాడుకోవాలని భావించింది. పోప్ ఫ్రాన్సిస్ లైక్ చేసిన స్క్రీన్ షాట్‌ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ‘సీఓవై.కోకి పోప్ నుంచి ఆశీర్వాదాలు లభించాయి. మా ఐకానికిక్ క్వీన్ నటాలియాకు ధన్యవాదాలు’ అంటూ స్క్రీన్ షాట్‌ని షేర్ చేసింది. దాంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. అది కాస్తా ముదరడంతో హోలీ సీ ఈ వార్తల్ని ఖండించింది. సిబ్బంది ఎవరో మోడల్ ఫోటోని లైక్ చేసి ఉండవచ్చు. దీని గురించి విచారణ చేస్తున్నాం అని తెలిపారు. వాటికన్ ప్రతినిధి గార్డియన్‌తో మాట్లాడుతూ, "హోలీ సీ నుంచి" లైక్ "వచ్చిందని భావిస్తున్నాం. వివరణ ఇవ్వాల్సిందిగా ఇన్‌స్టాగ్రామ్‌ని కోరాం" అని తెలిపారు. (నన్ను కొరకనంటేనే ముద్దిస్తాను: పోప్) పోప్ ఫ్రాన్సిస్ సోషల్ మీడియాలో అధిక ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. అతని ఇన్స్టాగ్రామ్ ఖాతా ఫ్రాన్సిస్కస్కు 7.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీనిలో 971 పోస్టులు ఉన్నాయి. వేరే అకౌంట్లని ఫాలో అవ్వరు. -
భారత్ అంటే నాకెంతో ఇష్టం: ట్రంప్
ఐరాస: భారత్ అంటే నాకెంతో ఇష్టం అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న మాదక ద్రవ్యాల సమస్యకు పరిష్కారాల కోసం సోమవారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఓ సదస్సు నిర్వహించారు. ట్రంప్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులు, భారత్ తరఫున విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరయ్యారు. సదస్సు తర్వాత ఐరాసలో అమెరికా రాయబారి అయిన నిక్కీ హేలీ సుష్మాను ఆలింగనం చేసుకుని అక్కడే ఉన్న ట్రంప్‌కు పరిచయంచేశారు. వెంటనే సుష్మాతో ట్రంప్ ‘భారత్ అంటే నాకెంతో ఇష్టం. మా అభిమానాన్ని నా ప్రియమిత్రుడు నరేంద్ర మోదీకి తెలియజేయండి’ అంటూ కాసేపు ముచ్చటించారు. -
నాభార్య పోస్టుకే లైక్ కొడతావా ?: టీడీపీ నేత
సాక్షి, విజయవాడ : భార్యను మానసికంగా వేధిస్తూ వార్తల్లో నిలిచిన కృష్ణాజిల్లాకు చెందిన టీడీపీ యువనేత భీమవరపు యతేంద్ర రామకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవలే ఆయన పెట్టే శారీరక, మానసిక వేధింపులు భరించలేకపోతున్నానని ఆయన భార్య, తెలప్రోలు గ్రామ సర్పంచ్ హరిణికుమారి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. పైగా రోజురోజుకు వేధింపులు హెచ్చుమీరడంతో సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తెలుగింటి ఆడపడుచుకు న్యాయం చేయాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. ఆ వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరిణికుమారి పెట్టిన పోస్టుకు తెలప్రోలుకు చెందిన భీమవరపు నాగిరెడ్డి లైక్ కొట్టాడు. దీంతో కోపం పెంచుకున్న యతేంద్ర రామకృష్ణ, నా భార్య పోస్టుకే లైక్ కొడతావా అంటూ తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం వీరవల్లి పోలీస్ స్టేషన్లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. -
ఒక లైక్ ఖరీదు.. రూ. 2.58 లక్షలు!
మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా? అందులో వచ్చే అప్డేట్లకు లైకులు కొడుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. కాస్తంత జాగ్రత్తగా చూసి అందులో కంటెంట్ ఏముందో చూసుకుని మరీ లైక్ కొట్టండి. లేకపోతే మీరు కూడా భారీ మొత్తంలో జరిమానా కట్టుకోవాల్సి ఉంటుంది. వేలు ఉంది కదా, దాంతో టచ్ చేస్తే చాలు లైక్, లవ్ లాంటి బటన్లు యాక్టివేట్ అవుతాయని అనుకోకండి. స్విట్జర్లాండ్‌లో ఇలాగే లైక్ కొట్టినందుకు ఓ వ్యక్తి ఏకంగా రెండున్నర లక్షల రూపాయల జరిమానా కట్టుకోవాల్సి వచ్చింది. పరువు నష్టం కలిగించేవిగా ఉన్న వ్యాఖ్యలకు లైక్ కొట్టినందుకు జడ్జి అంత మొత్తంలో జరిమానా విధించారు. ఎర్విన్ కెస్లర్ అనే వ్యక్తి జంతువుల హక్కుల గ్రూపు నడిపిస్తుంటారు. ఆయన చేసిన పోస్టుల మీద కొంతమంది వివక్షాపూరితమైన కామెంట్లు చేస్తారు. అలాంటి వ్యాఖ్యల మీద ఓ వ్యక్తి లైక్ కొట్టినందుకు జడ్జికి అతడి మీద కోపం వచ్చింది. లైక్ చేయడం ద్వారా ఆ వివక్షాపూరిత వ్యాఖ్యలను సమర్థించినట్లు అయిందని జడ్జి తన తీర్పులో వెల్లడించారు. ఆ చర్చల్లో పాల్గొన్న చాలామంది మీద కెస్లర్ దావాలు వేశారు. కెస్లర్ గురించి వ్యాఖ్యలు చేసిన కొంతమందికి కోరు ్టకూడా దోషులుగా నిర్ణయించింది. -
ప్రేమ పెళ్లి చేసుకుని ఇష్టం లేదంటున్నాడు
- యువకుడిపై యువతి ఫిర్యాదు - ఐదుగురిపై కేసు నమోదు పాములపాడు: ప్రేమించి పెళ్లి చేసుకుని ఆతర్వాత ఇష్టం లేదని చెప్పిన యువకుడిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు యువకుడితో పాటు అతని కుటుంబీకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వేంపెంట గ్రామానికి చెందిన అజయ్‌నాయక్, అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించరని మార్చి 27న ఇద్దరు ఇంట్లోంచి వెళ్లిపోయారు. నంద్యాలలో అదే గ్రామానికి చెందిన వారికి వీరిరువురు తారస పడటంతో ఇరు కుటుంబాలు ఘర్షణ పడుతున్నాయని, ఇంటికి వెళ్లండని సర్దిచెప్పటంతో సొంత ఊరుకు చేరుకున్నారు. యువతి ఇంటికి వెళ్లగా మొదట తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వలేదు. తన ప్రియుడు అజయ్ ఇంటికి వెళ్లగా ‘నువ్వంటే నాకు ఇష్టంలేదు. ఇంట్లోకి రావద్దంటూ’ తేల్చి చెప్పాడు. కొన్ని రోజులకు మారి తనను పెళ్లి చేసుకుంటాడులే అని భావించిన యువతి మళ్లీ తల్లిదండ్రులను ఆశ్రయించింది. రోజులు గడుస్తున్నా అజయ్ నాయక్‌లో మార్పు రాకపోవడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అజయ్‌నాయక్ తండ్రి లక్ష్మన్‌నాయక్, తల్లి సుభద్రాబాయి, అక్క శైలజాబాయి, చిన్నాన్న స్వామన్ననాయక్ల బెదిరించడంతోనే ఇష్టం లేదని చెబుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకరరెడ్డి శుక్రవారం తెలిపారు. -
ఫేస్బుక్ పోస్టింగ్‌లపై 30 వేల కోట్ల ప్రతిస్పందనలు
శాన్ ఫ్రాన్సిస్కో: ఫేస్బుక్ పోస్టింగ్‌లపై రికార్డు స్థాయిలో ప్రతిస్పందనలు వచ్చినట్లు ఆ కంపెనీ తెలిపింది. ఒక సంవత్సర కాలంలో సుమారు 30 వేల కోట్ల ప్రతిస్పందనలు వచ్చాయని, వీటిల్లో సగానికిపైగా ‘ప్రేమ’ అనే అంశానికి సంబంధించి నమోదైనట్లు పేర్కొంది. ఫేస్బుక్లో మొత్తం 179 కోట్ల మంది వినియోగదారులకు ఖాతాలు ఉన్నాయి. ఫేస్బుక్ కంపెనీ ‘ప్రేమ’, ‘ఆహా’, ‘వావ్’, ‘విచారం’, ‘కోపం’ వంటి భావోద్వేగ పదాలను ‘లైక్’ బటన్ ఆధారంగా ఫిబ్రవరి 24వ తేదీన విశ్లేషించి ఈ వివరాలను వెల్లడించింది. గత ఏడాది క్రిస్మస్ రోజున ప్రేమ అనే పదానికి సంబంధించిన ప్రతిస్పందనలు అత్యధికంగా నమోదయ్యాయి. ఈ ప్రతిస్పందనలను వ్యక్తం చేసినవారిలో మెక్సికో దేశస్తులు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో చిలీ, సురినామే, గ్రీస్‌లు ఉన్నాయి. అమెరికా 8వ స్థానంలో ఉంది. -
ఇష్టంతో చదవాలి
• వేలిముద్రగాళ్లం అయినందునే ఎంతో నష్టపోయాం • 150 సినిమాల్లో పని చేశాం • ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్ తాడిపత్రి టౌన్ : "మా జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాం. మరెన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాం. ఎన్నో అనుభూతులు, అనుభవాలు చవి చూశాం. అయితే చదువులేక వేలిముద్రగాళ్లుగా ఎంతో నష్టపోయాం. మా మాదిరి ఎవరూ కాకూడదు. కష్టమైనా ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచే ఇష్టంతో చదవాలి’ అని సినిమా ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్ అన్నారు. తాడిపత్రి కాల్వగడ్డ వీధిలోని సాయి సిద్దార్ధ కళాశాలలో ఉద్యోగ, ఉపాధ్యాయ సామాజిక సేవా సంఘం, సాయి సిద్దార్ధ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ‘బాలికలు–బంగారు భవిష్యత్’ అనే అంశంపై బుధవారం ఏర్పాటు చేసిన సదస్సులో వారు మాట్లాడారు. సేవా సంస్థ అధ్యక్షుడు శంకర్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగిన కార్యక్రమంలో వారు తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ... దేవుని దయ, మా కష్టంతో సినీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరామన్నారు. ఐదు సినిమాల్లో హీరోగా, 150 సినిమాల్లో ఫైట్ మాస్టర్లుగా పని చేసినట్లు పేర్కొన్నారు. ఐదు నంది అవార్డులు సొంతం చేసుకున్నట్లు తెలిపారు. నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి సహా ఇతర హీరోల సినిమాల్లో ఫైట్మాస్టర్లుగా పని చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం చిరంజీవి 150 చిత్రానికి, బాలకృష్ట 100 చిత్రానికి ఫైట్ మాస్టర్లుగా పని చేస్తున్నామన్నారు. ఫైట్ మాస్టర్లుగా ఎన్నో దేశ విదేశాలు చుట్టొచ్చామని, చదువు రాకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డామని బాధపడ్డారు. సెల్, కంప్యూటర్ మోజులో జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. తల్లిదండ్రులు, గురువులను పూజించాలని పేర్కొన్నారు. -
పత్రికలకు ఆదరణ భేష్!
ఏయూ జర్నలిజం బీవోఎస్ చైర్మన్ ఆచార్య మూర్తి ఏఎన్‌యూ: ప్రపంచ వ్యాప్తంగా పత్రికలకు ఆదరణ తగ్గుతున్నా భారతదేశంలో పత్రికలకు ఆదరణ నానాటికీ పెరుగుతోందని ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం బీవోఎస్ (బోర్డ్ ఆఫ్ స్టడీస్) చైర్మన్ ఆచార్య డి.వి.ఆర్.మూర్తి చెప్పారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగంలో గురువారం ‘ప్రస్తుత సమాజంలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ పాత్ర’ అంశంపై డాక్టర్ మూర్తి ప్రసంగించారు. సమాజంలోని సామాన్యుల అవసరాలు, సమస్యలను అధ్యయనం చేసి వాటిని పరిష్కరించే విధంగా పాత్రికేయులు కృషిచేయాలన్నారు. విలువలు, నిబద్ధతతో వృత్తిలో ముందుకు సాగితేనే పాత్రికేయ రంగం దీర్ఘకాలం మనగలుగుతుందని చెప్పారు. రోజురోజుకూ సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందడంతో మీడియా రంగంలో డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. దానికి అనుగుణంగా పాత్రికేయులు పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎన్‌యూ జర్నలిజం విభాగాధిపతి« డాక్టర్ జి.అనిత, అధ్యాపకుడు డాక్టర్ జె.మధుబాబు పాల్గొన్నారు. -
లైక్ కొట్టు గురూ..
► కమలంకు జై ► సోషల్ మీడియాల్లో ముందంజ ► వ్యక్తుల్లో స్టాలిన్ హవా సాక్షి, చెన్నై: సోషల్ మీడియాల్లో కమలం హల్ చల్ చేస్తున్నది. ఆ పార్టీ వెబ్ పేజీలకు లైక్‌లు కొట్టే వారి సంఖ్య పెరిగి ంది. డీఎంకే, అన్నాడీఎంకేల కన్నా, కమలానికి పెద్ద ఎత్తున ఫేస్బుక్లో ఖాతాలు కల్గిన వాళ్లు జై కొట్టి ఉన్నారు. ఇదే లైక్‌లు ట్విట్టర్లోను సాగింది. ఇక, వ్యక్తుల పరంగా డీఎంకే దళపతి స్టాలిన్ హవా సాగుతున్నది. టెక్నాలజీ విస్తరించే కొద్ది సరికొత్త సమాచార వ్యవస్థలు పుట్టుకొస్తున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి వాటిని ఉపయోగించే వాళ్లు అధికం అయ్యారు. అదే సమయంలో రాజకీయ పక్షాలు ఈ సోషల్ మీడియాల్ని తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడ్డారు. ఓట్లను రాబట్టేందుకు ఈ సోషల్ మీడియా ప్రచారాలు సైతం వేగవంతం చేసి ఉన్నారు. ఆ దిశగా ఆయా పార్టీలు వెబ్సైట్లను, బ్లాగ్, ఫేస్బుక్, ట్విటర్లలో ఖాతాల్ని కల్గి ఉన్నాయి. ఇందులో డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకే, తదితర పార్టీలు ఉన్నాయి. ఇక, జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఆయా రాష్ట్ర పార్టీలు సైతం ప్రత్యేకంగా సోషల్ మీడియాల్లో ఖాతాల్ని కల్గి ఉన్నాయి. ఇందులో ఆయా రాష్ట్ర పార్టీలకు చెందిన కార్యక్రమాలు, ఫొటోలు, నేతల సందేశాలు తదితర వివరాల్ని పొందు పరిచి ఉన్నారు. ఆ దిశగా రాష్ట్ర బీజేపీకి, కాంగ్రెస్‌లకు కూడా ఫేస్బుక్లో పేజీలు ఉన్నాయి. ఇక, డీఎంకే, అన్నాడీఎంకే, డీఎంకేలు అయితే, రోజు వారి పార్టీల కార్యక్రమాల వివరాలు, నేతల ప్రచారాలు , ప్రకటనలు, రేపటి కార్యక్రమాల వివరాలు తదితర అంశాల్ని తమ తమ సోషల్ మీడియాల్లో పొందు పరుస్తూ వస్తున్నాయి. ఎన్నికల వేళ వీటి ద్వారా ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ఆదిశగా లైక్‌లు కొట్టే వాళ్లు పెరిగి ఉన్నారు. ఈ సోషల్ మీడియాల్లో యువతరం అత్యధికమే. అందుకే కాబోలు యువత ప్రధాని మోదీ వైపుగా చూస్తున్నట్టు లైక్‌లు కొట్టిన సంఖ్యలో వారే అధికం. రాష్ట్రంలో కొత్తగా చేరిన యువత ఓటర్ల సంఖ్య కోటిన్నర వరకు ఉండడం గమనించాల్సిన విషయమే. లైక్ కొట్టు గురూ : రాష్ట్ర బిజేపీ ఫేస్‌బుక్‌కు తొమ్మిది లక్షల 17 వేల 23 మంది లైక్‌లు కొట్టి ఉన్నారు. ఇక, ఆ పార్టీ ట్విటర్ పేజీని ఫాలో అవుతున్న వాళ్లు 34 వేల మంది ఉండడం గమనార్హం. ఇక, రాష్ట్ర పార్టీలు డీఎంకే ఫేస్‌బుక్‌కు లైక్‌లు 32 వేలు మాత్రమే, అన్నాడీఎంకేకు రెండు లక్షల పది వేల 858 మంది. డీఎండీకేకు 16 వేల మంది వరకు, రాష్ర్ట కాంగ్రెస్ ఫేస్‌బుక్‌కు 37 వేల మంది లైక్‌లు కొట్టి ఉన్నారు. ఇక, డీఎంకే ట్విట్టర్ పేజీని 13 వేల మంది, అన్నాడీఎంకే ట్విట్టర్‌ను 19 వేలు, బీజేపీ ట్విట్టర్‌ను 34 వేల మంది ఫాలో అవుతుండడం విశేషం. ఇక, వ్యక్తుల పరంగా తీసుకుంటే, డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ ముందంజలో ఉన్నారు. ఆయన హవా సాగుతూనే ఉన్నది. ఆయన వ్యక్తిగత ఫేస్‌బుక్‌కు కోటి 75 లక్షల 5 వేల 461 మంది లైక్ కొట్టడం విశేషం. తదుపరి స్థానంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఉన్నారు. ఆయన ఫేస్‌బుక్‌కు ఐదు లక్షల 68 వేల 588 మంది, అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ఫెస్‌బుక్‌కు 74 లక్షల 787, డీఎండీకే అధినేత విజయకాంత్ ఫేస్‌బుక్‌కు ఏడు వేల మంది వరకు లైక్‌లు కొట్టి ఉన్నారు. -
క్రిమినల్స్ ఇష్టపడేది 'ఆ' ఫోన్‌నే
న్యూయార్క్: నేరస్థులకు యాపిల్ ఐఫోన్ అంటే ఇష్టం పెరిగిపోతోందట. తమ దగ్గర ఉన్న వేరే మొబైళ్లను పడేసి మరీ వాళ్లు యాపిల్ ఐఫోన్లను వాడుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కోర్టుకు సమర్పించిన నివేదికలో తెలిపారు. యాపిల్ ఐఫోన్‌ను డీకోడ్ చేయడంలో విచారణ అధికారులు ఎదుర్కొటున్న ఇబ్బందులను గ్రహించిన నేరగాళ్లు వాటినే ఇష్టపడుతున్నారని నివేదికలో స్పష్టం చేశారు. న్యూయార్క్ అధికారులు నేరస్థుడి ఫోన్‌కాల్‌ను ట్యాప్ చేసిన సందర్భంగా యాపిల్ ఐఫోన్లో ఉన్నటువంటి డీకోడ్ చేయరాని సాంకేతిక పరిఙ్ఞానాన్ని దేవుడిచ్చిన వరంగా అభివర్ణిస్తూ ఓ నేరగాడు మరొకరితో జరిపిన ఆసక్తికరమైన సంభాషణను సైతం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కోర్టుకు వెల్లడించారు. ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టంను డీ కోడ్ చేయడంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) అధికారులకు సహకరించడానికి యాపిల్ సంస్థ నిరాకరిస్తుండటంతో నేరగాళ్లు ఐఫోన్‌నే వాడుతున్నారని అధికారులు తెలిపారు. శాన్‌బెర్నార్డినో ఉగ్రవాది ఐఫోన్‌ను డీకోడ్ చేసి ఎఫ్‌బీఐకి సహకరించాలన్న కోర్టు ఆదేశాలపై వినియోగదారుల భద్రతకే ప్రాధాన్యతనిస్తామంటూ యాపిల్ పోరాడుతున్న విషయం తెలిసిందే. యాపిల్‌కు గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్‌తో పాటు మరికొన్ని సంస్థలు మద్దతిస్తున్నాయి. అయితే యాపిల్ చర్య ఉగ్రవాదులకు, నేరగాళ్లకు సహకరించేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఫేస్బుక్లో లైక్‌ను ఇంకాస్త అందంగా..
న్యూయార్క్: ఫేస్బుక్లో ఇక నచ్చిన వాటికి లైక్ కొట్టడమే కాదు దానిని ఇంకాస్త అందంగా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. లైక్ బటన్‌ను మరికాస్త ముందుకు తీసుకెళ్తూ రియాక్షన్స్ బటన్‌ను తీసుకొచ్చింది ఫేస్బుక్. ఈ రియాక్షన్ బటన్ సేవలు బుధవారం నుండి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్నట్లు ఫేస్బుక్ వెల్లడించింది. రియాక్షన్ బటన్ ద్వారా లైక్, వావ్.. ఇలా 7 రకాల భావాలను వెల్లడించే వీలు కల్పించారు. దీనిని పైలట్ ప్రాజెక్టుగా గత అక్టోబర్‌లో ఐర్లాడ్, స్పెయిన్‌లో ప్రవేశపెట్టారు. దీనికి మంచి స్పందన వస్తుండటంతో ఈ సేవలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మొబైల్లో ఫేస్బుక్ వినియోగదారులు లైక్ బటన్‌ను నొక్కి పట్టుకోవటం ద్వారా రియాక్షన్స్ ఆప్షన్‌ను పొందొచ్చని సంస్థ ఓ బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. -
ట్విట్టర్ లో ఇక 'లవ్'
కొత్త యూజర్స్‌ను ఆకర్షించే పనిలో భాగంగా ట్విట్టర్ తన అఫ్లికేషన్‌లో కొత్త మార్పులు చేపట్టింది. దీనిలో భాగంగానే ఫేవరెట్ ఆప్షన్ బదులుగా లైక్‌ను తీసుకొచ్చింది. ఇంతకు ముందున్న స్టార్ సింబల్ స్థానంలో హార్ట్(లవ్) సింబల్‌ను ప్రవేశ పెట్టారు. ఇంతకు ముందు ఫేవరేట్ ఆప్షన్ స్టార్ సింబల్‌తో ఉండేది. ప్రస్తుతం ప్రవేశపెట్టిన లైక్ ఆప్షన్..హార్ట్ సింబల్‌తో ఉంది. ఎదైనా ట్విట్ నచ్చితే లైక్ కొట్టగానే ఎరుపు రంగుతో దీపావళి టపాసుల్లా పేలినట్టుగా వచ్చి చాలా ఆకర్షనీయంగా ఉంది. ఫేవరేట్ ఆఫ్షన్ తొలుత 2006లో ఉపయోగంలోకి వచ్చింది. అందరికి సుపరిచితమైన ఫేస్ బుక్ లైక్ ఆప్షన్ 2009లో ప్రారంభంలోకి వచ్చింది. మరోవైపు ట్విట్టర్ అనుబంధంగా ఉన్న లైవ్ వీడియో స్ట్రీమింగ్ ఆప్ పెరిస్కోప్‌లో ఇప్పటికే హార్ట్ సింబల్‌ను యూజర్స్ విరివిగా ఉపయోగిస్తున్నారు. దీంతో యూజర్స్‌కు సులువుగా ఉపయోగపడేలా, ట్విట్ లని లైక్ చేయడానికి హార్ట్ సింబల్ అనువుగా ఉంటుందని ట్విట్టర్ ఎంచుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. 'చాలా వాటిని ఇష్టపడోచ్చు కానీ అన్ని ఫేవరేట్ అయ్యే అవకాశం లేదు కదా' అని ఫేవరేట్ స్థానంలో లైక్ ఆప్షన్ ప్రవేశపెట్టడానికి కారణాన్ని ట్విట్టర్ ప్రోడక్ట్ మేనేజర్ ఆకర్షణ్ కుమార్ తన బ్లాగ్ లో పేర్కొన్నారు. హార్ట్ సింబల్ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందినది కావడంతో స్టార్ స్థానంలో దాన్ని ఉంచామన్నారు. అయితే దాన్ని తప్పనిసరిగా వాడాల్సిన అవసరం లేదని, కావాలంటే క్రోమ్ బ్రౌజర్ నుంచి వెబ్ స్టోర్ లోకి వెళ్లి స్టార్ ఆకారాన్ని తిరిగి ఇన్స్టాల్ చేసుకోవచ్చని ట్విట్టర్ తెలిపింది. -
స్మార్ట్‌గా తగ్గించుకోండి...
ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్కి ఎన్ని లైక్‌లు వచ్చాయో.? ట్విట్టర్లో ట్వీట్‌కి రెస్పాన్స్ ఏంటి.? వాట్సప్ గ్రూప్‌లో మెసేజ్‌లు మిస్ అవుతున్నానా? ఏదో ఆత్రుత.. ఇంకేదో ఆరాటం.. దానివల్ల వచ్చేది, పోయేది పెద్దగా ఉన్నా లేకపోయినా అలవాటైపోతున్న దినచర్య. సిటీలో స్మార్ట్ ఫోన్ యూజర్లలో పెరుగుతున్న యాంగ్జయిటీని తక్కువగా అంచనా వేయలేం.. వేయకూడదు కూడా. ఇది మన ఏకాగ్రతను తీవ్రంగా దెబ్బతీస్తోందని తెలియజేస్తోంది ఓ పరిశోధన. అంతేకాదు ఆ ఒత్తిడి తప్పులు చేసేందుకు కూడా కారణమవుతోందని హెచ్చరిస్తోంది. -ఓ మధు ఆఫీస్ మీటింగ్‌లో.. ఫ్యామిలీతో ఉన్నా.. ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్ చేస్తున్నా.. డైనింగ్ టేబుల్ నుంచి టాయిలెట్ కమోడ్ దాకా... దేని మీద కూర్చున్నా ధ్యాస మాత్రం మొబైల్ మోత మీదే. స్మార్ట్ ఫోన్స్, యాప్స్ లైఫ్‌ని ఎంత ఈజీ చేస్తున్నాయో.. అంతే బిజీగా మార్చేస్తున్నాయి. యాప్ వేసుకోవడమే ఆలస్యం నోటిఫికేషన్స్ షురూ. ఏ పనిలో ఉన్నా నోటిఫికేషన్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారట స్మార్ట్ ఫోన్ యూజర్లు. దీనిని ‘పింగ్’ అని అభివర్ణిస్తున్నారు పరిశోధకులు. నోటిఫికేషన్ అటెండ్ చేసినా చేయకపోయినా ఈ పింగ్‌తోనే కాన్సన్ట్రేషన్ దెబ్బతింటోందని ఫ్లోరిడాలో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు నోటిఫికేషన్ రింగ్ వస్తేనే 3 రెట్లు ఎక్కువ తప్పులు చేసేస్తున్నారని ఈ పరిశోధనతో తేలింది. ఈ నేపథ్యంలో ఫోన్‌పై పెరుగుతున్న ఆత్రుత తగ్గించుకోవడానికి పరిశోధకుల సూచనలు మీకోసం... * ప్రాధాన్యతల మేరకు నోటిఫికేషన్ అలర్ట్ పెట్టుకోవాలి. * వెంటనే సమాధానం తెలియజేయాల్సిన అవసరం లేని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫుడ్, ట్రావెల్ లాంటి యాప్స్‌ని మ్యూట్ చేసుకోవాలి. * నోటిఫికేషన్ చెక్ చేసుకోవడానికి టైం ఫిక్స్ చేసుకోవాలి. ఆ సమయాన్ని విధిగా పాటించడం అలవాటు చేసుకోవాలి. * మీరేంటో ప్రతీ నిమిషం ప్రపంచానికి తెలియజేయాల్సిన పని లేదు. విందూ, విహారాలకు వెళ్లినప్పుడు చక్కగా ఎంజాయ్ చేయండి. వచ్చిన తర్వాత మాత్రమే ఫ్రెండ్స్‌తో ఆ విశేషాలు పంచుకోండి. * మన నీడకంటే ఎక్కువగా మనతో ఉండే ఫోన్‌కి అప్పుడప్పుడు బ్రేక్ ఇవ్వండి. ఈ బ్రేక్ ఫోన్ కన్నా మీకే ఎక్కువ అవసరం అని గుర్తించండి. వాకింగ్, గార్డెనింగ్ లాంటి పనుల్ని ఫోన్ లేకుండా చేసుకోండి. * ఫ్యామిలీతో గడిపే సమయంలో కూడా ఫోన్‌ని సెలైంట్‌లో పెట్టండి. వీలైతే ఆ కాసేపు దాని జోలికి వెళ్లకపోతే మీ కుటుంబానికి మీరు ఎంతో క్వాలిటీ టైం స్పెండ్ చేసిన వారవుతారు. ప్రాథామ్యాలు తెలుసుకోవాలి... స్మార్ట్ఫోన్లు వచ్చాక ఫేస్బుక్, వాట్సప్‌కు చాలామంది అడిక్ట్ అవుతున్నారు. దీని వల్ల దీర్ఘకాలంలో అనర్థాలుంటాయి. లైక్స్ రాకపోతే ఫీలవడం, ఫ్రెండ్ గ్రూప్‌లో యాక్సెప్ట్ చేయకపోతే డిప్రెషన్లోకి వెళ్లిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. వీటి విషయంలో రియలైజ్ కావాలి. మనకు ఏది ముఖ్యమో.. ఏది అప్రధానమో అర్థం చేసుకోవాలి. టీనేజర్లలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనపడుతోంది. వాళ్ల చదువు, ఇతరత్రా లక్ష్యాల మీద ఫోకస్ పెంచి ఈ తరహా కమ్యూనికేషన్‌ని తగ్గించుకోవాలి. లేదంటే కెరీర్ పాడవుతుందని గుర్తించాలి. -డా.శేఖర్‌రెడ్డి, సైకియాట్రిస్ట్ -
అపరిచితులా... డోన్ట్‌లైక్
సోషల్ నెట్‌వర్క్‌తో జాగ్రత్త ఉపయోగాలు ఎన్నో.. అనర్థాలూ అన్ని! తెలియనివారితో స్నేహం లేనిపోని కష్టాలకు మూలం సాగర్‌నగర్ ః ‘ఫేస్బుక్’ ః చేతిలో సెల్‌పోన్ ఉన్న ప్రతి ఒక్కరు ‘లైక్’చేస్తున్న సోషల్ నెట్‌వర్క్‌ఇది. రోజూ ఏదో ఒకటి పోస్ట్ చేయడం, మిత్రుల పోస్ట్‌లకు కామెంట్లు రాయడం, లైక్, షేర్ చేయడం దినచర్యలో భాగమైంది. దీనివల్ల మనుషుల మధ్యదూరం చెరిగిపోయింది. అదేక్రమంలో అపరిచితులను లైక్ చేస్తే కొన్ని అనర్థాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అందుకే అపరిచితులను డోన్ట్‌లైక్ అని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. నేటి యువతరానికి ఫేస్బుక్ చూడకుండా నిద్రకూడా పట్టడం లేదు. కాస్త సమయం దొరికితే చాలు ఫేస్బుక్లో మునిగితేలుతున్నారు. ఇది కొంత ఇబ్బందికరంగా కూడా మారుతోందని మానసిక వైద్యశాస్త్ర నిపుణలు చెబుతున్నారు. యువత మధ్య ఫేస్బుక్ ప్రేమలు పెరగడం, కొన్ని సందర్భాల్లో అవి వికటించి ప్రాణాలు కోల్పోవలసి రావటం గమనార్హం. ఎన్నో ప్రయోజనాలు: ఫేస్బుక్ వలన ప్రయోజనాలు ఉన్నాయి. బతుకు తెరువుకు ప్రపంచంలో తలో దిక్కు వెళ్లిన స్నేహితులను ఫేస్బుక్ కలుపుతుంది. బాల్య స్నేహితులు ఎవరి పనివారు చేసుకుంటూ వాటి సృ్మతుల్ని తలచుకుంటన్నారు. గుడ్‌మార్నింగ్ అంటూ పలకరించే పోస్టులు..మంచిగా బతకటానికి కావల్సిన సంందేశాలు..మహానీయుల సూక్తులు అంతా మంచి జరగాలని కోరుకొనే స్నేహితులు..అలా అదో పెద్ద ప్రపంచం. గత ఏడాదిలోజరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొదలు దేశ ప్రధాని అభ్యర్థుల వరకు ఫేస్బుక్లో తమ ప్రచారాన్ని కొనసాగించారు. మార్కెట్లో వచ్చే వివిధ బ్రాండ్ల అమ్మకాలకు సైతం నేడు ఫేస్బుక్ వేదికగా మారింది. దీని ప్రాముఖ్యత గుర్తించే అనేక ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఫేస్బుక్ ద్వారా సందేశాలను చేరవేస్తున్నాయి. నగరంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, కళాశాలలు, వివిధ రంగాలకు వారికి ఫేస్‌బుక అకౌంట్లు ఉన్నాయి. ముఖ్యంగా నగర పౌరుల జీవనవిధానాలను మెరుగుపరస్తూ సౌలభ్యమైన పరిపాలను అందించడాని కోసం జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ జీవీఎంసీఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా నగర మేధావులు, పౌరుల విన్నఫాలను సేకరించడం విశేషం. ప్రస్తుతం ప్రత్యేక హోదా కోసం ఫేస్‌బుక్‌ద్వారా సలహాలు, సూచనలు ఇవ్వాలని, పరోక్షంగానైనా సరై సోషల్ మీడియా ద్వారా ఉద్యమించాలని కోరుతూ చాలామంది నాయకులు, యువత, మేధావులు అందరికీ మేసేజ్‌లు అందుతున్నాయి. నాణానికి మరోవైపు... ప్రత్యేక హోదా...సమైక్యాంధ్ర ఉద్యమం, సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫేస్బుక్లో చెలరేగిన వివాదాలు అంతా ఇంతా కాదు. ప్రాంతాలవారీగా మారి ఫేస్బుక్లో తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఫేస్బుక్ లో అమ్మాయిలు, అబ్బాయిలు పరిచయాలు అవుతుంటాయి. యువతుల పేరుతో కొందరు ఫేస్బుక్ అకౌంట్లు తెరిచి మోసం చేసిన సంఘటనలు పలుచోట్ల చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి సందర్భాల్లో యువతలు కొందరు తమ పరువపోతుందని తేలుకుట్టిన దొంగల్లా పోలీసుల దృష్టికి తేలేదు. ఫేస్బుక్లో పెట్టిన కామెంట్లను నమ్మి మోసపోయిన వారు కూడా ఉన్నారు. అపరిచితులతో స్నేహం చేసేముందు జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు పాటించాలి అపరిచిత వ్యక్తల స్నేహ అభ్యర్థనలకు స్పందించకుండా ఉండటం ముఖ్యం. యువతుల పేరుతో చేసే చాటింగ్ దూరంగా ఉండాలిసాధ్యమైనంత వరకు పోన్ నంబర్‌ను ఇతరులకు ఇవ్వకపోవటం మంచిది. యువత వినియోగిస్తున్న సోషల్‌నెట్‌వర్క్‌పై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉండాలిఫేస్‌బుక్‌లో జరిగే చర్చల్లో నచ్చని అభిప్రాయాన్ని ఎవరైనా వ్యక్తంచేసినా సున్నితంగా వ్యవహరించటం మంచిది.వ్యవహారం శ్రుతిమించినట్లుయితే ఫ్రెండ్స్ లిస్ట్ నుంచి తొలగించటం మంచిది - ధనంజయ్‌నాయుడు, ఆరిలోవ సిఐ. -
ఇంటర్నెట్ కోసం ఫేస్బుక్ గిఫ్ట్..!
గూగుల్ ప్రతి సెకనుకూ 40 వేల సెర్చ్ క్వెరీలను హ్యాండిల్‌చేస్తోంది. ఇదే సెకనులో ఫేస్బుక్లో 40 వేల లైక్‌లు, కామెంట్లు నమోదవుతున్నాయి. ఇంతే సమయంలో యూట్యూబ్‌లోకి రెండు గంటల నిడివితో ఉండే వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. ప్రపంచంలోని దాదాపు 293 కోట్ల మంది ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంది... ఈ గణాంకాలు ఆశ్చర్యపరుస్తాయి. అయితే ఇవన్నీ కాయిన్‌కు ఒకవైపు మాత్రమే. ఈ రోజుకీ ప్రపంచంలో ఎంతో మందికి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేదు. వారి సంఖ్యవందల కోట్లలో ఉంది! ఒకవైపు 4జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చేస్తున్నా... కొన్ని ప్రాంతాల్లో మాత్రం తొలితరం ఇంటర్నెట్ సేవలు కూడా లేవు. ఈ పరిస్థితిని చూసి చలించిపోతున్నాడు ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్. ఫేస్బుక్ వ్యవస్థాపకుడిగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్న ఆయన ఇప్పుడు విశ్వవ్యాప్తంగా అందరికీ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. సామాజిక, సాంకేతిక ప్రయోజనాలతో కూడిన ఈ వ్యవహారం జుకర్‌బర్గ్ ఇమేజ్ను రెట్టింపు చేస్తోంది. టెక్నాలజీ రంగంలో ఆసక్తిని రేపుతోంది. ఆప్టికల్ ఫైబర్... ప్రపంచ గతిని మార్చింది. ఇంటర్నెట్ ఇంత విస్తృతం అయ్యిందంటే అది ఆప్టికల్ ఫైబర్ అందించిన సౌకర్యం. సుదూర ప్రాంతాలకు ఉత్తమ బ్యాండ్ విడ్త్‌తో ఇంటర్నెట్ సిగ్నల్స్ పాస్ చేయగల ఆప్టికల్ ఫైబర్ ప్రపంచ గతిని మారుస్తోంది, మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తోంది. మరి ఈ విషయంలో మానవాళి ఆప్టికల్‌ఫైబర్‌కు కృతజ్ఞతతో ఉండాలి. అయితే... ఎంతసేపూ ఆప్టికల్ పైబర్ మీదే ఆధారపడితే... విస్తరణ వేగం తగ్గుతుంది.. ఇంటర్నెట్ను విస్తృతం చేయాలి.. ఆ సౌకర్యాన్ని ఎక్కువమందికి అందించాలి... ఈ ప్రపంచంలో బతుకుతున్నవారందరికీ ఇంటర్నెట్ ఒక ప్రాథమిక హక్కు కావాలి. మరి అలా చేయాలంటే ఆఫ్లికల్ ఫైబర్, వెబ్ కేబుల్స్, లైన్ల మీద ఆధారపడితే అంత సులభంగా సాధ్యం కాదు. అందుకే ఈ వ్యవహారాన్ని కొత్తరకంగా ముందుకు తీసుకెళ్లాలని ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ భావిస్తున్నాడు. అందుకు వారు డ్రోన్స్ మీద ఆధారపడాలని భావిస్తున్నారు. గాల్లో విహరిస్తూ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించే డ్రోన్స్‌ను రూపొందించే ప్రయత్నంలో ఉంది ఫేస్బుక్ యాజమాన్యం. ఎలా పనిచేస్తాయి?! ఒక్క మాటలో చెప్పాలంటే వైఫై హాట్స్పాట్స్లాగా పనిచేస్తాయి. కొన్ని వేల అడుగుల పైన విహరిస్తూ శాటిలైట్నుంచిసిగ్నల్స్ తీసుకొని కొన్ని కిలోమీటర్లపరిధిలోని కంప్యూటర్ సర్వర్లకు ఇవి ఇంటర్నెట్ను వడ్డిస్తాయి. వీటి వల్ల తొలి ఉపయోగం ఏమిటంటే... కేబుళ్ల అవసరం తీరిపోతుంది! వీధి వీధిలోనూ కేబుల్ పూడ్చడం, లేక స్తంభాలకు తగిలించడం, ఇంటింటికీ నెట్ కేబుల్ కనెక్షన్ ఇవ్వడం... ఈ అవసరాలన్నింటికీ ప్రత్యామ్నాయం ఈ డ్రోన్స్! ఉపయోగం ఎంత?! ఒక్కో డ్రోన్ ద్వారా దాదాపు 21,562 మీటర్ల పరిధిలోని ప్రాంతానికి ఇంటర్నెట్ సిగ్నల్స్ అందించవచ్చునని అంచనా. అంటే దాదాపు 21 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రాంతానికి వైఫై ద్వారా సిగ్నల్స్ అందించవచ్చు. జనావాసాల పరిధిని ఎంచుకొని డ్రోన్స్‌ను లాంచ్‌చేస్తే అక్కడ నాలుగో తరం ఇంటర్నెట్ సేవలను అందించినట్టే కదా! కేబుల్స్, ఫోల్స్, వాటి ఏర్పాటుకు పట్టే సమయం.. అంతా ఆదానే కదా! ల్యాండ్‌ఫోన్ల స్థానంలో సెల్పోన్లు వచ్చి టెలికమ్యూనికేషన్ వ్యవస్థను ఏ విధంగా మార్చేశాయో డ్రోన్స్ కూడా ఇంటర్నెట్ కమ్యూనికేషన్‌ను అదే విధంగా మార్చేయగలవు. డ్రోన్సే ఎందుకు... టవర్లు చాలు కదా! టెలికమ్యూనికేషన్ వ్యవస్థతో పోల్చినప్పుడు సెల్ టవర్లలాగా ఇంటర్నెట్ కోసం కూడా టవర్లను కూడా ఏర్పాటు చేసేస్తే చాలు కదా... దాని ద్వారా ఇంటర్నెట్ను ప్రొవైడ్చేయవచ్చు కదా... అనే ఐడియా సులభంగానే వస్తుంది. అయితే డ్రోన్స్ చాలా సౌకర్యాలు ఉంటాయి. టవర్స్ కన్నా చాలా ఎత్తులో విహరిస్తాయి. శాటిలైట్ నుంచి సిగ్నల్స్‌ను సులువుగా అందుకొంటాయి. అలాగే టవర్‌ను ఏర్పాటు చేయడం చాలా ప్రయాస. డ్రోన్ ను లాంచ్ చేయడం సులభం! కొసరుమెరుపులూ ఉన్నాయి! ఈ ఏడాది మార్చ్‌లో యూకేకు చెందిన ‘అసెంటా ఏరోస్పేస్’ వారు వైఫైహాట్ స్పాట్‌గా పనిచేయగల ఒక డ్రోన్‌ను డిజైన్ చేశారు. వారి ప్రయోగంపై ఫేస్బుక్ దృష్టిసారించింది. ఊరికే కాదు 20 మిలియన్ డాలర్ల సొమ్మును చెల్లించి ఆ ఐడియాపై హక్కులు సంపాదించింది. అభివృద్ధి విషయంలో భాగస్వామిగా మారింది. ఆ ప్రయోగం దాదాపుగా విజయవంతం అయ్యింది. ఫేస్బుక్ కొన్ని మార్పులు కూడా సూచించింది. డ్రోన్స్‌కు ప్రత్యేకంగా ఇంధనం అవసరం లేకుండా సౌరశక్తితోనే అవి పనిచే సేలా చూడాలనేది ఫేస్బుక్ చేసిన ఒక విలువైన ప్రతిపాదన. అలాగే ఈ ప్రాజెక్ట్ విషయంలో నాసా, అమెస్ రీసెర్చ్ సెంటర్ల సహయం తీసుకొంటున్నారు. ఇంటర్నెట్ విస్తృతం అయితే లాభం ఫేస్‌బుక్‌కు మాత్రమే కాదు. అది అనేక రకాలుగా సాయంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడానికే అయితే ఫేస్బుక్ ఇంతలా కష్టపడనక్కర్లేదు. కాబట్టి దీంట్లో స్వార్థం పాలు తక్కువగా, సౌకర్యాన్ని అందించాలనే తపన ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అందుకే ఈ డ్రోన్స్‌ను ప్రపంచానికి ఫేస్బుక్ అందించే గిఫ్ట్ అనవచ్చు. - జీవన్ రెడ్డి.బి మొదట అందుబాటులోకి వచ్చేది మనకే! 2015లో తొలి డ్రోన్ గాల్లోకి లేవాలి అనేది ఫేస్బుక్ లక్ష్యం. అదెక్కడో కాదు భారత్‌లోనే. ఇప్పటికే భారత ప్రభుత్వానికి, ఫేస్బుక్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. మొత్తం 21 వేల కోట్ల రూపాయలప్రాజెక్ట్పై ఇటీవల భారత్‌లో పర్యటించిన జుకర్‌బర్గ్ సైన్ చేసి వెళ్లారు. మొత్తం రెండున్నర లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించాలనేది లక్ష్యాన్ని కలిగిన ఈ ప్రాజెక్ట్‌కు గానూ డబ్బు, సాంకేతిక సహాయం విషయంలో ఫేస్బుక్ ఒక చెయ్యివేస్తోంది. -
నయనతార బెడ్రూంలో దొరాకలని..
-
ఫేస్బుక్ వాడుతున్నారా.. జాగ్రత్త!