అపరిచితులా... డోన్ట్‌లైక్ | Be careful with social networks | Sakshi
Sakshi News home page

అపరిచితులా... డోన్ట్‌లైక్

Published Wed, Aug 12 2015 11:26 PM | Last Updated on Mon, Oct 22 2018 6:35 PM

అపరిచితులా... డోన్ట్‌లైక్ - Sakshi

అపరిచితులా... డోన్ట్‌లైక్

సోషల్ నెట్‌వర్క్‌తో జాగ్రత్త
ఉపయోగాలు ఎన్నో.. అనర్థాలూ అన్ని!
తెలియనివారితో స్నేహం  లేనిపోని కష్టాలకు మూలం

 
సాగర్‌నగర్ ః ‘ఫేస్‌బుక్’ ః చేతిలో సెల్‌పోన్ ఉన్న ప్రతి ఒక్కరు ‘లైక్’చేస్తున్న సోషల్ నెట్‌వర్క్‌ఇది. రోజూ ఏదో ఒకటి పోస్ట్ చేయడం, మిత్రుల పోస్ట్‌లకు కామెంట్లు రాయడం, లైక్, షేర్ చేయడం దినచర్యలో భాగమైంది. దీనివల్ల మనుషుల మధ్యదూరం చెరిగిపోయింది. అదేక్రమంలో అపరిచితులను లైక్ చేస్తే కొన్ని అనర్థాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అందుకే అపరిచితులను డోన్ట్‌లైక్ అని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. నేటి యువతరానికి ఫేస్‌బుక్ చూడకుండా నిద్రకూడా పట్టడం లేదు. కాస్త సమయం దొరికితే చాలు ఫేస్‌బుక్‌లో మునిగితేలుతున్నారు. ఇది కొంత ఇబ్బందికరంగా కూడా మారుతోందని మానసిక వైద్యశాస్త్ర నిపుణలు చెబుతున్నారు. యువత మధ్య ఫేస్‌బుక్ ప్రేమలు పెరగడం, కొన్ని సందర్భాల్లో అవి వికటించి ప్రాణాలు కోల్పోవలసి రావటం గమనార్హం.
 ఎన్నో ప్రయోజనాలు: ఫేస్‌బుక్ వలన ప్రయోజనాలు ఉన్నాయి. బతుకు తెరువుకు ప్రపంచంలో తలో దిక్కు వెళ్లిన స్నేహితులను ఫేస్‌బుక్ కలుపుతుంది. బాల్య స్నేహితులు ఎవరి పనివారు చేసుకుంటూ వాటి సృ్మతుల్ని తలచుకుంటన్నారు. గుడ్‌మార్నింగ్ అంటూ పలకరించే పోస్టులు..మంచిగా బతకటానికి కావల్సిన సంందేశాలు..మహానీయుల సూక్తులు అంతా మంచి జరగాలని కోరుకొనే స్నేహితులు..అలా అదో పెద్ద ప్రపంచం.

గత ఏడాదిలోజరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొదలు దేశ ప్రధాని అభ్యర్థుల వరకు ఫేస్‌బుక్‌లో తమ ప్రచారాన్ని కొనసాగించారు. మార్కెట్‌లో వచ్చే వివిధ బ్రాండ్ల అమ్మకాలకు సైతం నేడు ఫేస్‌బుక్ వేదికగా మారింది. దీని ప్రాముఖ్యత గుర్తించే అనేక ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఫేస్‌బుక్ ద్వారా సందేశాలను చేరవేస్తున్నాయి. నగరంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, కళాశాలలు, వివిధ రంగాలకు వారికి ఫేస్‌బుక అకౌంట్లు ఉన్నాయి. ముఖ్యంగా నగర పౌరుల జీవనవిధానాలను మెరుగుపరస్తూ సౌలభ్యమైన పరిపాలను అందించడాని కోసం జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ జీవీఎంసీఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా నగర మేధావులు, పౌరుల విన్నఫాలను సేకరించడం విశేషం. ప్రస్తుతం ప్రత్యేక హోదా కోసం ఫేస్‌బుక్‌ద్వారా సలహాలు, సూచనలు ఇవ్వాలని, పరోక్షంగానైనా సరై సోషల్ మీడియా ద్వారా ఉద్యమించాలని కోరుతూ చాలామంది నాయకులు, యువత, మేధావులు అందరికీ మేసేజ్‌లు అందుతున్నాయి.
 
 నాణానికి మరోవైపు...
ప్రత్యేక హోదా...సమైక్యాంధ్ర ఉద్యమం, సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫేస్‌బుక్‌లో చెలరేగిన వివాదాలు అంతా ఇంతా కాదు. ప్రాంతాలవారీగా మారి ఫేస్‌బుక్‌లో తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఫేస్‌బుక్ లో అమ్మాయిలు, అబ్బాయిలు పరిచయాలు అవుతుంటాయి. యువతుల పేరుతో కొందరు ఫేస్‌బుక్ అకౌంట్లు తెరిచి మోసం చేసిన సంఘటనలు పలుచోట్ల చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి సందర్భాల్లో యువతలు కొందరు తమ పరువపోతుందని తేలుకుట్టిన దొంగల్లా పోలీసుల దృష్టికి తేలేదు. ఫేస్‌బుక్‌లో పెట్టిన కామెంట్లను నమ్మి మోసపోయిన వారు కూడా ఉన్నారు. అపరిచితులతో స్నేహం చేసేముందు జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు.
 
జాగ్రత్తలు పాటించాలి

అపరిచిత వ్యక్తల స్నేహ అభ్యర్థనలకు స్పందించకుండా ఉండటం ముఖ్యం. యువతుల పేరుతో చేసే చాటింగ్ దూరంగా ఉండాలిసాధ్యమైనంత వరకు పోన్ నంబర్‌ను ఇతరులకు ఇవ్వకపోవటం మంచిది. యువత వినియోగిస్తున్న సోషల్‌నెట్‌వర్క్‌పై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉండాలిఫేస్‌బుక్‌లో జరిగే చర్చల్లో నచ్చని అభిప్రాయాన్ని ఎవరైనా వ్యక్తంచేసినా సున్నితంగా వ్యవహరించటం మంచిది.వ్యవహారం శ్రుతిమించినట్లుయితే ఫ్రెండ్స్ లిస్ట్ నుంచి తొలగించటం మంచిది
 - ధనంజయ్‌నాయుడు, ఆరిలోవ సిఐ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement