social networking
-
ఫేస్‌బుక్‌కు పెరిగిన ప్రభుత్వ అభ్యర్థనలు
సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్.. ఈ ఏడాది ప్రథమార్థంలో భారత్ నుంచి 22,684 అభ్యర్థనలను అందుకుంది. యూజర్ అకౌంట్లకు సంబంధించిన సమాచారం కోరుతూ ఈ అభ్యర్థనలను పొందినట్లు కంపెనీ వెల్లడించింది. అమెరికా 50,714 అభ్యర్థనలను కోరగా.. ఆ తరువాత స్థానంలో అత్యధిక రిక్వెస్ట్‌లు భారత్ నుంచే వచ్చాయని పేర్కొంది. ఈ ఏడాది జనవరి–జూన్ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1.28 లక్షల అభ్యర్థనలను అందుకున్నట్లు తెలియజేసింది. గతేడాది జూలై–డిసెంబర్ కాలంలోని 1,10,634 రిక్వెస్ట్‌లతో పోల్చితే ఈ సారి 16 శాతం వృద్ధి ఉన్నట్లు తెలిపింది. -
‘గే’లి చేస్తే.. గల్లా పడతాం..
సాక్షి, సిటీబ్యూరో :‘గే’లి చేస్తే.. గల్లా పడతాం.. అంటోంది బ్లూడ్ అనే గే సోషల్ నెట్వర్కింగ్ యాప్. ఇంటా, బయటా, సోషల్ మీడియాలో స్వలింగ సంపర్కలను అవహేళన చేస్తూ, అసభ్యంగా, అశ్లీల కామెంట్లు చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరిస్తోంది. కొంతకాలంగా స్వలింగ సంపర్కులకు చెందిన ఎల్జిటిబిక్యు కమ్యూనిటీకి మద్దతుగా పనిచేస్తోంది. తాజాగా సిటీలోని సదరు కమ్యూనిటీ సభ్యులకు శుభవార్త చెప్పింది. స్వలింగ సంపర్కుల హక్కులపై అందరిలో అవగాహన కల్పించేందుకు యాంటి సైబర్ బుల్లీయింగ్ క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తున్నట్లు సంస్థ కంట్రీ మేనేజర్ యుజున్ తెలిపారు. దీని కోసం తమ సంస్థ క్వీరిథిమ్, యా డాట్ ఆల్ సంస్థలతో చేతులు కలిపిందని వివరించారు. దీనిలో భాగంగా పలు వీడియోల ఆధారంగా స్వలింగ సంపర్కులపై వేధింపులు, వారి వ్యథలు కూడా చూపించడం కూడా జరుగుతుందన్నారు. అంతేగాకుండా దీంతో పాటు ఇటీవలి కాలంలో బాగా పెరిగిన ఆన్లైన్ డేటింగ్ యాప్స్ వాటి కార్యకలాపాలపై కూడా అవగాహన పెంచుతామన్నారు. దీనిపై అదనపు సమాచారం కోసం తమ హెల్ప్‌లైన్ నంబర్లు 97.4554.5559, 60.0903.2883లో సంప్రదించాలన్నారు. -
‘షేర్’ చేసుకుంటున్నారు..
సాక్షి, హైదరాబాద్: ‘షేర్ చాట్’ఇది ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వాడే యువతకు పరిచయం అక్కర్లేని యాప్. యువతే కాదు.. విద్య, వ్యాపారం, ఉద్యోగం ఇలా ఏ రంగాల వారైనా సరే వారి మనోభావాలు, కళాత్మక నైపుణ్యం, మాటలు, వీడియోలు, సరదా సన్నివేశాలు ప్రపంచానికి పరిచయం చేసుకునేందుకు ఏర్పాటైన గొప్పవేదిక. ప్రస్తుతం ఆసియాలో అగ్రస్థానాన ఉన్న సామాజిక మాధ్యమాల్లో షేర్‌చాట్ ఒకటి. తెలంగాణ, ఏపీల్లో కూడా షేర్‌చాట్‌ను వినియోగించే వారి సంఖ్య భారీగానే ఉంది. 2018 వరకు ఈ యాప్‌లో 4 లక్షల మంది తెలుగు ప్రజలు ఖాతాలు తెరిచినట్లు గురువారం సంస్థ సీఈవో అంకుశ్ సచ్ఛ్‌దేవ తమ నివేదికలో తెలిపారు. తమ షేర్‌చాట్‌లో 2018 ఏడాదిలో జస్టిస్ ఫర్ ఆసిఫా, తిత్లీ తుఫాన్, ఏపీకి ప్రత్యేక హోదా, తెలంగాణ ఎన్నికల వంటి అంశాలపై షేర్ చాట్ వేదికగానే ఎక్కువగా వైరల్‌గా మారాయని చెప్పారు. షేర్‌చాట్ వచ్చిందిలా.. ప్రాంతీయ భాషల్లో సోషల్ నెట్వర్కింగ్ సేవలు అందిస్తున్న బెంగళూరు సంస్థ షేర్‌చాట్.. ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థుల సృష్టి. యాప్స్ ఇంగ్లిష్‌లో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి అర్థం కాకపోవడంతో వీటిపై పెద్దగా ఆసక్తి కనబర్చట్లేదు. ఈ లోటును గమనించిన ఐఐటీ కాన్పూర్‌కు చెందిన విద్యార్థులు ఫరీద్ హసన్, అంకుశ్ సచ్దేవ, భాను సింగ్‌లు బెంగళూర్ కేంద్రంగా 2015లో షేర్‌చాట్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14 ప్రాంతీయ భాషల్లో మొత్తం 3 కోట్ల మంది వినియోగదారులున్నారు. -
టాప్ డౌన్లోడింగ్ యాప్స్ ఇవే..
నేటి డిజిటల్ యుగంలో చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకుంటే నిమిషం కూడా గడవదు.. ఆత్మీయులతో మాట్లాడటానికి, క్యాబ్ బుకింగ్, ఆన్లైన్ షాపింగ్, బ్యాంకింగ్ ఇలా ఇంట్లో కూర్చునే పనులు పూర్తి చేయాలంటే అందుకు సంబంధించిన యాప్‌లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ‘యాప్ అన్నే’ నివేదిక-2018 ప్రకారం ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌ల వాడకంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న మార్కెట్లలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం భారత్‌లో అత్యధిక మంది డౌన్లోడ్ చేస్తున్న టాప్- 10 యాప్‌లపై ఓసారి లుక్కేద్దాం. 1. ఫేస్బుక్ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అత్యధిక మంది యూజర్లు డౌన్లోడ్ చేసిన యాప్‌గా సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ అగ్రస్థానంలో నిలిచింది. 2. యూసీ బ్రౌజర్ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను వెనక్కి నెట్టి యూసీ బ్రౌజర్ రెండో స్థానంలో నిలిచింది. ఫాస్ట్ బ్రౌజింగ్, డాటా సేవింగ్ వంటి ఫీచర్ల వల్ల గతేడాదితో పోలిస్తే ఈసారి యూజర్ల సంఖ్య పెంచుకోగలిగింది యూసీ బ్రౌజర్. 3. వాట్సాప్ ప్రస్తుతం ఉన్న మెసేజింగ్ యాప్‌లన్నింటిలో అగ్రస్థానంలో కొనసాగుతోంది వాట్సాప్. కానీ అత్యధిక మంది డౌన్లోడ్ చేస్తున్న యాప్‌లలో మూడో స్థానంలో నిలిచింది. 4. ఎఫ్బీ మెసెంజర్ గతేడాది నాల్గో స్థానంలో నిలిచిన ఎఫ్బీ మెసెంజర్ ఇప్పుడు కూడా అదే స్థానంలో కొనసాగుతోంది. 5. షేర్ ఇట్ వివిధ డివైస్ల మధ్య ఫైళ్లు, ఫొటోలు షేర్ చేసుకోవడాన్ని సులభతరంగా మార్చిన షేర్ ఇట్ యాప్ ఐదో స్థానం సంపాదించింది. 6. జియో టీవీ గతేడాది చివరి స్థానంలో నిలిచిన జియో టీవీ ఈసారి ఆరో స్థానానికి ఎగబాకింది. సీరియల్స్, క్రికెట్ మ్యాచులు చూసేందుకు వీలుగా రూపొందిచబడిన ఈ యాప్ తన యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. 7. ఎయిర్ టెయిల్ టీవీ తక్కువ ధరకే డేటాను అందించడం ద్వారా ఎయిర్టెల్ టీవీ యూజర్ల సంఖ్యను పెంచుకొని ఏడో స్థానంలో నిలిచింది. 8. హాట్ స్టార్ స్టార్ నెట్‌వర్కింగ్‌కు సంబంధించిన హాట్ స్టార్ మొదటి సారిగా మోస్ట్ డౌన్లోడెడ్ యాప్‌ల జాబితాలో చోటు సంపాదించుకుని ఎనిమిదో స్థానాన్ని ఆక్రమించుకుంది. 9. ట్రూకాలర్ రాంగ్ కాల్స్ నుంచి విముక్తి పొందడానికి రూపొందించిన ట్రూకాలర్ యాప్‌కు యూజర్లు ఎక్కువగానే ఉన్నారు. అయితే గతేడాది ఎనిమిదో స్థానంలో నిలిచిన ఈ యాప్ ప్రస్తుతం తొమ్మిదో స్థానానికి పడిపోయింది. 10. హైప్స్టార్ వీడియో కమ్యూనిటీ యాప్ హైప్స్టార్ డౌన్లోడ్ చేసుకుంటే ఒకే క్లిక్‌తో వైరల్ వీడియోలు చూసేయొచ్చు. గతేడాది టాప్ 10లో చోటు దక్కించుకోలేక పోయిన ఈ యప్ ఈసారి పదో స్థానంలో నిలిచింది.ఈ టాప్- 10 యాప్‌లు మీ మొబైల్లో కూడా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి మరి. -
విలువల పతనానికి ‘ఈ’ తోడైతే!
సమకాలీనం ఇలా జరిగే ఘోరాలు, నేర ఘటనల్ని దర్యాప్తు సంస్థలు కదిలించినపుడు ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాల లింకులు బయటపడుతున్నాయి. దారితప్పేలా చేసిన ప్రేరణ వెల్లడవుతోంది. వివాహేతర సంబంధాల వల్ల జరిగే హత్యలు, ఆత్మహత్యలు, నేరపూరిత దాడుల ఘటనల్లోనూ కొత్త పరిచయాల నుంచి అనుచిత, లైంగిక సంబంధాలు, వైషమ్యాల వరకు సెల్ఫోన్లు, సామాజిక మాధ్యమాలు పోషిస్తున్న పాత్ర విడదీసి చూడరానిదిగా ఉంటోంది. ఒక టెలివిజన్ జర్నలిస్టు నుంచి ఉదయం వాట్సాప్‌లో నాకో గుడ్‌మార్నింగ్ మెసేజ్ వచ్చింది. అందులో ‘ఈ ప్రపంచంలో ఏదీ ‘మంచి’ లేదా ‘చెడు’ అని నిర్దిష్టంగా ఉండదు. మన ఆలోచనల్ని బట్టే ఏదైనా! ప్రాణాల్ని కాపాడేందుకు ఓ వైద్యుడు శస్త్రచికిత్సకు వాడుతున్నపుడు కత్తి మంచిది. ప్రాణాల్ని తీసేందుకు ఓ ఉగ్రవాది వినియోగిస్తున్నపుడు కత్తి చెడ్డది’ ఇదీ సంక్షిప్త సందేశం. అంటే, కత్తి కాకుండా దాని వినియోగాన్ని బట్టే ఫలితం మంచైనా, చెడైనా! సామాజిక మాధ్యమాలపైన ఈ మధ్య తరచూ చర్చ జరుగుతోంది. అవి మంచా–చెడా? శాపమా–వరమా? నిజానికీ చర్చకు ముగింపు లేదు. ఎందుకంటే, చాలా విషయాల్లోలాగానే ఇందులోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి! మంచి–చెడు పాళ్లలో వ్యత్యాసం, హెచ్చు తగ్గులే ఈ చర్చను సజీ వంగా ఉంచుతాయి. చెడును పరిహరించి, మంచిని స్వీకరించడమే మనం చేయాల్సింది. శాస్త్ర–సాంకేతిక పరిజ్ఞానం ఫలాలను సమాజం గరిష్టంగా ఉపయోగించుకొని ప్రయోజనం పొందగలుగుతుంది. ఆ తెలివిడి మనకు, అంటే ప్రజా సమూహాలకు, పౌర సంఘాలకు, పాలకులకు ఉండాలి. చెడును తగ్గించి, మంచి నిష్పత్తిని పెంచినపుడు సామాజిక మాధ్యమాలైనా, అంత ర్జాల వ్యవస్థయినా సత్ఫలితాలిస్తుంది. భారతదేశానికి అపారంగా మానవవ నరులున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇదొక పెద్ద చేయూత. యువశక్తి వనరుల్ని భవిష్యత్ సంపదగా మలిచే క్రమంలో ఈ శాస్త్ర–సాంకేతికత సద్వినియోగం అవసరం. మార్కెట్ శక్తులు, సమాచారం శాసించే నేటి విశ్వసమాజంలో మనకు మనంగా స్థానాన్ని సుస్థిరపరచుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం. జ్ఞాన–సమాచార వ్యాప్తి, వ్యాపార–వాణిజ్య విస్తరణ, వ్యక్తులు–సంస్థల మధ్య పరస్పర భావ వినిమయం వంటి ఎన్నో ప్రయోజనాలు ఈ సామాజిక మాధ్యమాలు, సైబర్ సాంకేతికత వల్ల ప్రభావవంతంగా నెరవేరతాయి. అలా కాకుండా, దుర్వినియోగమైనపుడు సమాజ వికాసం కుంటుపడుతుంది. తిరోగమనంలో సాగుతాం, ఓ నిర్వీర్య–నిస్తేజపు తరం ఆవిర్భవిస్తుంది. అంతర్జాలం, ఆ సాంకేతికత ఆధారంగా పనిచేసే గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విటర్, లింక్డిన్... తదితర మాధ్యమ వేదికలు సమాచార వ్యవస్థలో ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తు న్నాయి. ఉపయోగాన్ని బట్టి మంచి ఉపకరణాలు కాగలిగిన బలం, నేపథ్యం వాటికుంది. కానీ, పట్టుతప్పి చెడు మార్గం పడితే, ఒడుపుగా కాక నిర్లక్ష్యంగా ఉపయోగంలో పెడితే... అందుకు తగ్గ సమాజ పతనాన్ని రచించే శక్తి కూడా ఈ ఉపకరణాలకు ఉంది. పెడపోకడలను పెరుగుతున్న సంకేతాలు కనిపి స్తూనే ఉన్నాయి. ఇరువైపులా పదునున్న కత్తినెలా వాడాలి? అదివరకటి వందేళ్ల ప్రపంచ ప్రగతిని మించిన అభివృద్ధి గత ఇరవయేళ్లలో లభించింది. మానవేతిహాసంలో నిప్పును గుర్తించి, వాడటం ఒక విప్లవాత్మక మార్పుగా చెబుతారు. తర్వాత.. ‘చక్రం’ కనుగొనడం ఓ మేలు మలుపై పారి శ్రామిక విప్లవానికి దారులు పరిచింది. ఆధునిక కాలంలో ‘అంతర్జాలం’ అనేక సంచలనాలకు మూలమైంది. సమాచార వ్యవస్థ వేగంగా వృద్ధి–విస్త రణ చెందింది. అది దన్నుగా నూతన ఆర్థిక, రాజకీయ విధానాల నీడలో ఎన్నెన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. మౌలిక సదుపాయాల స్వరూప స్వభవాలే మారిపోయాయి. సమాజ గతి పెను మార్పులకు లోనవుతోంది. ఖండాలకతీతంగా మనుషుల జీవన శైలిలో వేగంగా మార్పులొస్తున్నాయి. వ్యక్తిగత సౌఖ్యాలు, సదుపాయాలు, ఆస్తులు పెరుగుతున్న క్రమంలోనే విలు వలు నశిస్తున్నాయి. కట్టడిలేని కాలుష్యం! సహజవనరుల అసాధారణ విని యోగంతో భవిష్యత్తును భయానకం చేస్తున్నారు. శాస్త్ర–సాంకేతికత వృద్ధితో సమాచార, రవాణా సదుపాయాలు పెరిగాయి. ఫలితంగా భౌతిక దూరాభా రాలు తగ్గి ప్రపంచమే ఓ కుగ్రామమౌతున్న తరుణంలో మనుషుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. సాటి మనుషులపైన, జన సమూహాలపైన, వారి జీవన స్థితిగతులపైన అవగాహన లేమి కన్నా మనుషుల్లో ‘పట్టింపులేని తనం’ పెరిగిపోతోంది! ఆర్థిక అసమానతలు ప్రమాదకర స్థాయికి చేరాయి. 73 శాతం సంపద రెండు శాతం జనాభా వద్ద కేంద్రీకృతమైంది. ఎందుకిలా జరుగుతోంది? ఇది కోటి రూకల ప్రశ్న. మనిషి స్వార్థం హెచ్చడం, నిజా యితీ, విలువలు, సహజ జీవన పద్ధతులు నశించి కృత్రిమత్వం పెరగటం వల్లే ఇదంతా అనే వాదనా ఉంది. సంప్రదాయ ప్రసారమాధ్యమాలతో పాటు సామాజిక మాధ్యమాలు, అంతర్జాల వ్యవస్థ విస్తరించిన నేటి పరిస్థితుల్లో వనరుల హేతుబద్ధ వినియోగం, సంపద సృష్టి, సమగ్ర పంపిణీ, సమస మాజ స్థాపన, పర్యావరణ పరిరక్షణకు చక్కటి సావకాశమున్న సమయమిది. కృత్రిమ మేధ, రోబోటిక్స్ యుగంలోకి దూసుకువెళ్లినా మానవ విలువల పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. వినిమయవాద సంస్కృతి పెరిగి డబ్బు–సంపదకు ఇచ్చిన విలువ సాటి మనుషులకు ఇవ్వటం లేదు. మను షులతో సంబంధాలు, నెట్వర్క్, విద్యావ్యాప్తి, సహాయ–సహకారాలు, సమాచారం–ఆధునీకరణ, వాణిజ్యవృద్ధి, అవగాహన పెంచడం, నేరాల నియంత్రణ, విభిన్న సమాజాల నిర్మాణం.... ఇలా పలు విషయాల్లో ఈ– సైట్లు బాగా ఉపయోగపడుతాయి. కానీ, వాటిని మంచి కోసం ఎక్కువగా వాడుకోవడం లేదు. అమెరికా, రష్యా, యూరప్, జపాన్, చైనా వంటి అభి వృద్ధి చెందిన సమాజాలతో పోల్చినపుడు, వెనుకబడిన, ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న సమాజాల్లో ఇదింకా వేగం పుంజుకోవాల్సి ఉంది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగం తగ్గి సద్వినియోగం పెరగాలి. మానవ సంబంధాల విధ్వంసం సున్నితమైన, విలువల ఆధారితమైన మానవ సంబంధాలే సమాజాల స్థితి గతిని నిర్వచిస్తాయి. విలువలతో కూడిన జీవన విధానమే ప్రపంచానికి భారత్ ఇచ్చిన కానుక అని, అమెరికా అధ్యక్షుడి హోదాలో బారాక్ ఒబామా మన పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి మాట్లాడుతూ కీర్తించారు. ఆయన పొగిడింది చాన్నాళ్ల కిందటి మన గతం. ఇదివరకే క్షీణిస్తూ ఉన్న విలువలు నేడు మరింత సన్నగిల్లుతున్నాయి. సమిష్ఠి కుటుంబ వ్యవస్థ క్రమంగా కను మరుగవుతూ చిన్న కుటుంబాలు రావడం, సగటుమనిషి ఆలోచనలు డబ్బు మయమవడం, అన్ని రంగాల్లోనూ విలువలు–ప్రమాణాలు పడిపోవడం, అవసరాలకు–అవకాశాలకు మధ్య సంఘర్షణ వంటివి మనుషుల్లో నైతికతను తగ్గిస్తున్నాయి. మారిన విద్యా విధానంతో పాటు ఇందుకెన్నెన్నో కారణా లున్నా, అంతర్జాల వ్యవస్థ, సామాజిక మాధ్యమాల పాత్ర కూడా ఉంది. ముఖ్యంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ (ఎస్సెన్నెస్) యువతపై తీవ్ర ప్రతి కూల ప్రభావం చూపుతున్నాయి. మంచి కన్నా చెడు వైపు వేగంగా ఆకర్షితు లవుతున్నారు. ఫలితంగా వ్యక్తిగత సంబంధాలు, వ్యక్తుల సామాజిక అనుబం ధాలు బలహీనపడుతున్నాయి. పిల్లలు, యువతరం ఎదుగుదలలో బహు ముఖ వికాసం కనిపించడం లేదు. పనికిమాలిన సమయం వృధా వ్యవహా రాల్లో మునిగి తేలుతూ మేధోమరుగుజ్జులవుతున్నారు. సైట్ల ప్రభావం వారిపై అలా ఉంది. ‘మనం ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం అన్నదే ప్రధానంగా మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది’ అంటారు శంకరాచార్యుడు. దేశంలో 42 కోట్లమందకి పైగా అంత ర్జాలం వినియోగిస్తున్నారు. అందులో సగం మంది సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలంగా ఉన్నారు. 18–24 మధ్య వయస్కులే అత్యధికులు. దేశంలో నేడు సెల్‌ఫోన్ వాడని యువతీయువకులు లేరేమో? పొద్దస్తమానం అదే పనిగా సామాజిక మాధ్యమాలతో గడిపేవారే అత్యధికులు. వారికి లభించే సరుకు అలా ఉంది. ఎదిగే పిల్లల చదువులు, కౌమారంలోని వారి ఆలోచ నలు, యవ్వనంలోని యువతీయువకుల సంబంధాలు తీవ్రంగా ప్రభావిత మౌతున్నాయి. అశ్లీలసైట్ల విచ్చలవిడి తనానికి హద్దే లేదు. 16, 17 ఏళ్ల వయసులోనే ప్రేమలని, వైఫల్యాలని, మానసిక కుంగుబాట్లని, కక్ష్యలు– కార్పణ్యాలని, కడకు ఆత్మహత్యలు, హత్యల వైపు సాగుతున్న ఘటనలెన్నో! ఇలా జరిగే ఘోరాలు, నేర ఘటనల్ని దర్యాప్తు సంస్థలు కదిలించినపుడు ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాల లింకులు బయటపడుతున్నాయి. దారితప్పేలా చేసిన ప్రేరణ వెల్లడవుతోంది. వివాహేతర సంబంధాల వల్ల జరిగే హత్యలు, ఆత్మహత్యలు, నేరపూరిత దాడుల ఘటనల్లోనూ కొత్త పరిచయాల నుంచి అనుచిత, లైంగిక సంబం ధాలు, వైషమ్యాల వరకు సెల్ఫోన్లు, సామాజిక మాధ్యమాలు పోషిస్తున్న పాత్ర విడదీసి చూడరానిదిగా ఉంటోంది. ‘నిర్మిత ప్రపంచంలోని యాదృ చ్ఛిక సంబంధాలకు, వాస్తవిక ప్రపంచంలోని అర్థవంతమైన సంబంధాలకు మధ్య తేడాలు తెలుసుకునే విచక్షణా జ్ఞానాన్ని సామాజిక మాధ్యమాలు హరించివేస్తాయి’ అని కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ స్టీవెన్ స్ట్రాంగజ్ అంటారు. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్య మాల పట్ల అజాగ్రత్తగా ఉంటే జరిగే నష్టాలను ప్రపంచ మేధావులు ఏకరువు పెడుతున్నారు. జాగ్రత్త పడకుంటే, బనాయింపుల్తో .... బలహీన మనస్కుల్ని వేధించి, ఆత్మహత్యలకు పురికొల్పే సైబర్ రౌడీయిజం, డాటాను కొల్లగొట్టే హ్యాకింగ్స్, నిలువునా ముంచే నేరాలు–స్కామ్‌లు, వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించడాలు పెచ్చుమీరతాయి. వాడేవారికిదొక వ్యసనంగా మార డం, శారీరక–మానసిక రుగ్మతలకు దారితీయడం వంటి అరిష్టాలెన్నో! మూలాల్ని గుర్తించి మందేయాలి విలువల పరిస్థితి మెరుగు పరచకుండా, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ‘సరుకు’ ప్రమాణాల్ని నియంత్రించకుండా పైపై చర్యలు ఎన్ని చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదనే భావన వ్యక్తమౌతోంది. ‘షీ–టీమ్’లు, సీసీ కెమె రాలు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటివి తదనంతర నియంత్రణ చర్యలే తప్ప సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కార మార్గాలు వెతకటం కాదనే పెదవి విరుపు ఉంది. పట్టణాలు, మండల–గ్రామ స్థాయిల్లో ఇప్పటికే ఇదొక నియం త్రణ లేని వ్యవస్థగా, చేయి దాటిన వ్యసనంగా మారింది. కౌమారంలోని పిల్లలు చదువులు పక్కన పడేసో, చదువుతూనో, అదరాబాదరాగా చదువు ముగించో... పొద్దస్తమానం ఈ సైట్లతో గడిపేస్తున్నారు. వాటి ద్వారానే తప్ప, ప్రత్యక్ష సంభాషణలు, కలయికల్ని మానేస్తున్నారని ‘చైల్డ్ మైండ్ డాట్ ఆర్గ్’ వంటి సంస్థల అధ్యయనాలు తేల్చాయి. ఫలితంగా పిల్లలు–యువతలో సంయమనం, సమ్యక్దృష్టి, నిర్ణయసామర్థ్యం, విచక్షణ లోపిస్తున్నాయని తేలింది. సాధారణ స్థాయి బుద్ధి కుశలత, పనినైపుణ్యాల్ని కూడా చూపలేకపో తున్నారు. ఆదాయాలు, జీవన ప్రమాణాలకు ఆధునిక సెల్‌ఫోన్, ఈ–సైట్స్ వంటి సదుపాయాలకు మధ్య సమతూకం లేనపుడు కూడా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. నిరంతరం అవే చూస్తుండటం, తమ పరిస్థితిని ఇతరులతో పోల్చి చూసుకోవడం వల్ల కూడా అసంతృప్తి స్థాయి, ఆత్మన్యూనతా భావ నలు పెరిగి అనర్థాలకు దారి తీస్తోందని డాక్టర్ స్టీవెన్ అడెయిర్ విశ్లేషిస్తారు. ఈ–సైట్ల వ్యవసనపరుల్లో తెగించి అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా ఈర్ష్య, దుగ్ధ, కక్ష్య–కార్పణ్యం వంటివి పెరిగి హింసకు పురికొల్పుతున్న ఘట నలూ ఉన్నాయి. ‘నీ మిత్రులెవరో చెప్పు... నీవేంటో చెబుతా!’ అన్నాడట బెర్నార్డ్‌షా. ‘పదినిమిషాలు నీ సెల్‌ఫోన్ ఇవ్వు... నీవేంటో చెబుతా అంటోంది శాస్త్ర సాంకేతికత! తస్మాత్ జాగ్రత్త!! - దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
సైబర్ క్రిమినల్స్ కన్ను వారిపైనే..
► సోషల్ నెట్వర్కింగ్ సైట్లతో ప్రలోభాలు ►నగరంలో పెరిగిన కేసులు ►తల్లిదండ్రుల పర్యవేక్షణ అత్యవసరం బెంగళూరు: ఇంటర్నెట్, సోషల్ నెట్వర్క్ వల్ల కలిగే అనర్థాలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. బాలలకు సోషల్ నెట్వర్క్ వాడకంపై ఎన్నో ప్రశ్నలకు తెరతీస్తోంది. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చిన నేటిరోజుల్లో పీజీ నుంచి కేజీ వరకు విద్యార్థులు ఎక్కువసేపు వాటితోనే గడుపుతోంది. అనుక్షణం వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్, హైక్ వంటివాటిని మాత్రం కచ్చితంగా ఫాలో అవుతుంటారు. దీనివల్ల ఎన్నో ఉపయోగాలున్నాయన్నది కాదనలేని నిజం. అదే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అనేక మంది కోరి సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఏది తప్పో ఒప్పో తెలియని స్కూల్ పిల్లలు సులభంగా నెట్ నేరగాళ్లకు ఎరవుతున్నారు. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కరువవడం, పాఠశాలల్లో టెక్నాలజీ వాడకాన్ని గురించి తప్ప తద్వారా ఎదురయ్యే కష్ట నష్టాల గురించి పిల్లలకు చెప్పకపోవడమే దీనికంతటికీ కారణమని నిపుణులు చెబుతున్నారు. కన్నవారి పర్యవేక్షణ ఏదీ? ప్రస్తుతం నగరాల్లో చాలా మంది తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగులుగా ఉంటున్నారు. వారి పని ఒత్తిడి వల్ల పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయాలపై సరిగ్గా దృష్టి సారించలేకపోతున్నారని నగరానికి చెందిన మానసిక నిపుణురాలు నైనా అన్నారు. ఈ కారణంగానే పాఠశాలల్లో చదివే చిన్నారులు సైతం ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారని నైనా చెప్పారు. పిల్లల ప్రవర్తనలో కనుక మార్పు కనిపిస్తే అందుకు సంబంధించిన కారణాలేంటి అనే అంశాలపై తప్పక దృష్టి సారించాల్సి ఉంటుందని ఆమె సూచిస్తున్నారు. నెట్ వల్ల నష్టాలను వారికి వివరించడం ద్వారా వారిని సరైన దారిలో నడిపేందుకు వీలవుతుందని చెప్పారు. సైబర్ ఎడ్యుకేషన్ తప్పనిసరి కావాలి అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీ గురించి మాత్రమే కాక, దాని ప్రమాదాలను కూడా పిల్లలకు పాఠశాలల్లో నేర్పాలని సైబర్ వ్యవహారాల నిపుణులు షమీమ్ తాబీ చెబుతున్నారు. సైబర్ భద్రతపై పిల్లల్లో, విద్యార్థుల్లో అవగాహన పెంచాలన్నారు. ‘18 ఏళ్ల వరకు పిల్లలు చాలా సున్నితమైన మనసుతో ఉంటారు. ఆ వయసులో వాళ్లు సోషల్ నెట్‌వర్క్‌లను ఉపయోగించకపోవడమే ఎంతో మంచిది’ అన్నారు. -
ఫేస్బుక్, ట్వీటర్లో ఎస్బీఐ సేవలు
న్యూఢిల్లీ: వివిధ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ల ద్వారా బ్యాంక్ సేవలను పొందే అవకాశాన్ని ఎస్బీఐ అందిస్తోంది. ఫేస్బుక్, ట్వీటర్ అకౌంట్ల ద్వారా ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులు వివిధ బ్యాంక్ సేవలను పొందేలా ‘ఎస్బీఐ మింగిల్’ను ఎస్బీఐ అందుబాటులోకి తెచ్చింది. ఎస్బీఐ 61వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ ఎస్బీఐ మింగిల్ను ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య ప్రారంభించారు. చెక్‌బుక్ రిక్వెస్ట్, చెక్‌లకు చెల్లింపులు నిలిపేయడం, మొబైల్ బ్యాంకింగ్‌కు నమోదు చేసుకోవడం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ అలర్ట్‌లు, ఏటీఎం/డెబిట్ కార్డులను బ్లాక్ చేయడం.. తదితర సేవలను కూడా ఎస్బీఐ మింగిల్లో అందుబాటులోకి తెస్తామని ఆమె పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఎస్బీఐ ఈఎంఐలు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో ఒక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని అరుంధతి భట్టాచార్య చెప్పారు. ఈ ఒప్పందంలో భాగంగా ముందుగా అర్హత పొందిన వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువులను సమాన నెలవారీ వాయిదా(ఈఎంఐ)పద్ధతిలో కొనుగోలు చేయవచ్చు. కనీస కొనుగోలు రూ.5,000గా ఉండాలి 6/9/12 నెలల్లో ఈఎంఐ(సమాన నెలవారీ వాయిదా)ల్లో ఈ మొత్తాన్ని చెల్లించవచ్చు. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. 14 శాతం వడ్డీ వసూలు చేస్తారు. 61వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎస్బీఐ డిజిటల్ విలేజేస్, స్టేట్ బ్యాంక్ బడ్డీ తదితర ఫీచర్లను కూడా ఎస్బీఐ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది కీలకం... ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కీలక సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నట్లు బ్యాంక్ 61వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చైర్మన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఈ ఏడాది ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంక్ విలీనాన్ని ప్రస్తావించారు. ఇది ఎస్బీఐకి అంతర్జాతీయ బ్యాంకింగ్ స్థాయి తీసుకువస్తుందని, వరల్డ్ టాప్ 50 బ్యాంకుల్లో ఒకటిగా ఉంటుందని అన్నారు. కొంచెం అటుఇటుగా ఒకేసారి అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. ఎస్బీఐ, రిలయన్స్‌ల ఒప్పందం... చెల్లింపు బ్యాంక్(పేమెంట్స్ బ్యాంక్) ఏర్పాటు కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐలు సబ్స్క్రిప్షన్ అండ్ షేర్‌హోల్డర్స్ అగ్రిమెంట్‌ను కుదర్చుకున్నాయి. ఈ జాయింట్ వెంచర్ కోసం ఎస్బీఐతో ఒప్పందాన్ని గురువారం కుదుర్చుకున్నామని బీఎస్ఈకి ఆర్ఐఎల్ నివేదించింది. ఈ జేవీలో తమ వాటా 70 శాతమని, ఎస్బీఐ వాటా 30 శాతమని పేర్కొంది. -
సెల్ఫీలు పెట్టేది అహంకారులే!
సియోల్: అహంకార పూరిత వ్యక్తులే సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ అయిన ఫేస్బుక్, ట్విటర్లలో సెల్ఫీలు పెడతారని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధనను దక్షిణ కొరియాకు చెందిన కొరియా వర్సిటీ చేపట్టింది. అహంకారం వ్యక్తులకు, సెల్ఫీల పోస్టింగ్‌కు ఉన్న సంబంధాన్ని వీరు పరిశోధించారు. దీనిలో అహంకారం ఎక్కువగా ఉన్న వ్యక్తులే సెల్ఫీలు పోస్ట్ చేసే అవకాశాలు అధికమని తేలింది. వారి సెల్ఫీలకు ఇతరులు చేసే కామెంట్స్‌ను తెలుసుకునేందు కు ఇష్టపడతారు, కానీ ఇతర స్నేహితుల సెల్ఫీలను పట్టించుకోరని గుర్తించారు. -
ప్రభుత్వ కనుసన్నల్లో ట్విట్టర్ హ్యాకింగ్ !
ప్రభుత్వ ప్రాయోజిత శక్తులే హ్యాకింగ్‌కు పాల్పడే అవకాశముందని సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ట్విట్టర్ తన ఖాతాదారులను హెచ్చరించింది. హ్యాకింగ్ ముప్పు పొంచి ఉండటంతో సైట్ భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేసింది. ట్విట్టర్ ఈ తరహాలో భద్రతాపరమైన హెచ్చరిక జారీ చేయడం ఇదే మొట్టమొదటిసారి. అది కూడా కొద్దిమంది ఖాతాదారులకు మాత్రమే ఈ హెచ్చరికలు అందినట్టు తెలుస్తున్నది. కెనడాకు చెందిన స్వచ్ఛంద సంస్థ కోల్ఢాక్ తమకు ట్విట్టర్ నుంచి అందిన వార్నింగ్ కాపీని పోస్టు చేసింది. 'ప్రభుత్వ ప్రాయోజిత శక్తులే హ్యాకింగ్‌కు పాల్పడే అవకాశమున్న చిన్న గ్రూపుల్లో మీరు కూడా ఉన్నారు. అందుకే ముందుజాగ్రత్త చర్యగా ఈ హెచ్చరిక పంపుతున్నాం' అని అందులో ట్విట్టర్ స్పష్టంగా తెలియజేసింది. ప్రభుత్వ అనుబంధమున్న శక్తులు ఈమెయిల్ అడ్రస్, ఐపీ అడ్రస్, ఫోన్ నెంబర్లు వంటి సమాచారాన్ని చోరీ చేసే అవకాశముందని పేర్కొంది. మీ అకౌంట్‌ను సమాచారాన్ని ఎవరైనా దొంగలించారా? అన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదని, దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపింది. దేశ భద్రత కోసమంటూ అమెరికాకు చెందిన హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం 2.2 కోట్లమంది ప్రజల వ్యక్తిగత ఖాతాల్లోకి అక్రమంగా చొరబడిన ఘటన గత ఏడాది వెలుగుచూసిన సంగతి తెలిసిందే. భద్రత, ఇతరత్రా సాకులతో ప్రజల వ్యక్తిగత ఖాతాల్లోకి విదేశీ ప్రభుత్వాలు అక్రమంగా చొరబడుతూ హ్యాకింగ్‌కు పాల్పడుతున్న ఘటనలపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ట్విట్టర్ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఆ వెబ్సైట్లను నిషేధించలేం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లను నిషేధించాలంటూ దాఖలైన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే అభ్యంతరకర, అసభ్యకర సమాచారం వ్యాప్తి కాకుండా నిరోధించడంలో ఈ వెబ్సైట్లు విఫలమైతే.. వాటిపై విచారణ జరిపే అవకాశముందా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ విషయాన్ని పరిశీలించాలని జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ యూయూ లలిత్‌తో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ముంబైలో వాట్సాప్ ద్వారా అత్యాచార వీడియోల్ని వ్యాప్తి చేయడం, ఫేస్బుక్ అకౌంట్ ద్వారా సెక్స్ రాకెట్ ను నిర్వహిస్తూ.. చిన్నారులను ఆకర్షించడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చినా వాటిని తొలగించేందుకు ఆ వెబ్సైట్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రెండు కేసులు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చాయి. వాట్సాప్‌లో లైంగిక దృశ్యాల వీడియోలు అప్లోడ్ చేసి.. షేర్ చేసుకునే వ్యక్తులను గుర్తించడం చాలా కష్టమని గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. కంప్యూటర్ ద్వారా ఇలాంటి నేరానికి పాల్పడితే.. బాధ్యులను వెంటనే పట్టుకొని శిక్షించే అవకాశముందని, కానీ మొబైల్ ఫోన్ల ద్వారా ఇలా చేస్తే పట్టుకోవడం కష్టమని కేంద్రం వివరించింది. వాట్సాప్ ద్వారా ఆ సమాచారం వ్యాప్తిని అడ్డుకోవడం కష్టమంటూ కేంద్రం నిస్సహాయత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయా నెట్వర్కింగ్ వెబ్సైట్లపై నిషేధం విధించాలని హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రజ్వల సుప్రీంకోర్టును కోరింది. ఆయా వెబ్సైట్లను నియంత్రించడానికి యంత్రాంగాన్ని ఏర్పాటుచేసేలా, వాట్సాప్‌లో వ్యాప్తి చెందుతున్న సమాచారంపై నిఘా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలని ప్రజ్వల సంస్థ చీఫ్ సునితా కృష్ణన్ కోర్టును కోరారు. అయితే ఈ వెబ్సైట్లను నిషేధించడం ఆచరణసాధ్యమైన పరిష్కారం కాదంటూ సుప్రీంకోర్టు ఆమె అభ్యర్థనను తోసిపుచ్చింది. -
ఫేస్బుక్ ఫ్రీ బేసిక్స్ యాప్‌లో మరిన్ని వెబ్సైట్లు
న్యూఢిల్లీ: అందరికీ ప్రాథమిక ఇంటర్నెట్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ‘ఫ్రీ బేసిక్స్’ (గతంలో ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్) యాప్ పరిధిని భారత్‌లో మరింత విస్తరించింది సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్. ఫ్రీ బేసిక్స్‌లో ప్రస్తుతం 32 యాప్స్, వెబ్‌సైట్స్ అం దుబాటులో ఉండగా.. తాజాగా ఈ సంఖ్యను 80కి పెంచింది. వైద్యం, విద్య, ఉద్యోగావకాశాలు వంటి సమాచారం అందించే యాప్స్, వెబ్‌సైట్స్ వీటిలో ఉన్నాయి. ఆర్‌కామ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఫ్రీ బేసిక్స్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. -
'సోషల్ మీడియాతో ఆ పోలీసులకు తిప్పలు'
అబిడ్స్: నగరం నడిబొడ్డున ఉన్న అబిడ్స్‌లో ఓ ప్రేమజంటపై సినిమా థియేటర్ వద్ద కొంతమంది పోకిరీలు దాడిచేశారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. బుధవారం మధ్యాహ్నం నుంచే వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఈ వార్త సంచలనం రేపింది. కానీ ఏ థియేటర్ వద్ద జరిగిందో, ఎవరిపై జరిగిందో వివరాలు మాత్రం పూర్తిగా లేకపోవడంతో అబిడ్స్ పోలీసులు సైతం తలపట్టుకున్నారు. అబిడ్స్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాస్, అదనపు ఇన్స్పెక్టర్ పులి యాదగిరి ఈ సోషల్ మీడియా సంచలన వార్తతో పలు థియేటర్ల వద్ద కూడా విచారణ జరిపారు. ఏ థియేటర్ వద్ద ఈ సంఘటన జరగలేదని పలువురు థియేటర్ యాజమానులు పోలీసులకు వివరించడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. అంతేగాక కొన్ని నెలల క్రితం అబిడ్స్ సంతోష్-స్వప్న థియేటర్ వద్ద ఒక ప్రేమజంటపై గుర్తుతెలియని పోకిరీలు దాడిచేసినట్లు సమాచారం. కానీ ఆ సంఘటనపై కూడా నేటి వరకు పోలీసులకు లిఖితపూర్వకంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఇలా సోషల్ మీడియా హాట్ న్యూస్ పోలీసులకే తలనొప్పిగా మారింది. -
ఉత్తమ పదం
మొబైల్స్, సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో రోజుకు లక్షల మంది తమ ఆత్మీయులతో చాటింగ్ చేస్తుంటారు. అందులోనే తమ ఆనందాన్ని పంచుకుంటారు. బాధను చెప్పుకొని ఊరట పొందుతారు. అలా తమ చాటింగుల్లో కొన్నేళ్లు నుంచి పదాలతో పాటు ఈమోజీలనూ పంపుకుంటున్నారు. ఈమోజీ (జపానీ పదం) అంటే మనకు తెలియని కొత్త పదం అనుకోకండి. వాటిని మనం ముద్దుగా స్మైలీస్ అంటుంటాం. అసలు ఈ గొడవంతా ఏంటీ అంటే ఇటీవల ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్లు ఆనందబాష్పాలతో ఉండే స్మైలీకి 2015కు గాను ‘ది బెస్ట్ వర్డ్ ఆఫ్ ద ఇయర్’గా ప్రకటించారట. దానికి కారణం ఈ ఏడాది మొబైల్స్, ఆన్లైన్లో చాటింగ్ చేసేవాళ్లలో ఎక్కువమంది ఈ ఐకాన్‌ను ఉపయోగించారట. ఇది ‘పదం’ కాకపోయినా ఎమోషనల్ సమయాల్లో మంచి ఎక్స్‌ప్రెషన్‌గా మెసేజుల్లో ఉపయోగిస్తున్నారు కాబట్టి దీన్ని పదంగా భావించింది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ సంస్థ. -
'చుక్క' కోసం వచ్చి ఇరుక్కుపోయింది
చలికాలం కాస్త 'చుక్కేస్తే' వెచ్చగా ఉంటుందని భావించిందో ఏమో ఓ బుజ్జి ఎలుగుబంటి పిల్ల. ఏకంగా ఓ ఇంటి కిచెన్ నుంచి వైన్ దొంగతనం చేసేందుకు ప్రయత్నించింది. అయితే.. అక్కడ ఆ ఇంటి ఆసామి కనపడటంతో.. పక్కనే ఉన్న కిటికీలోంచి దూకి పారిపోదామని ప్రయత్నించింది. కానీ కిటికీలో ఇరుక్కుపోయింది. బయట పడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అయితే ఈ బుల్లి ఎలుగొడ్డును కిటికీలో నుంచి తప్పించేందుకు ఎవరూ సాహసించలేదు. చివరకు ఎలాగోలా తంటాలు పడి.. ఎలుగు కిటికీలోంచి దూకి అడవిలోకి పారిపోయింది. అచ్చం టెలివిజన్ షో 'విన్ని ది ఫూ' లో ఎలుగు పిల్ల ఎపిసోడ్‌లాగా సాగిన.. ఈ వీడియోని ఇంటి యజమాని తన సెల్ ఫోన్లో బంధించి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. తాజాగా ఈ వీడియో రష్యన్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్‌గా మారింది. అయితే.. ఎలుగు అవస్థ చూసి తాము సాయం చేద్దామనుకున్నామని.. కానీ.చిన్ని ఎలుగు పిల్ల కూడా చాలా ప్రమాదకరమని.. ఇంటి యజమాని ట్విట్టర్ లో కామెంట్ చేశాడు. తూర్పు రష్యా అటవీ అధికారులు కూడా 'ఇంటి యజమాని ఎలుగు దగ్గరికి పోకుండా మంచి పని చేశాడు. ఎలుగులు ఎప్పుడూ ప్రమాదకరమైనవే అంటూ' ట్విట్ చేశారు. -
జననేత దీక్షకు వెల్లువెత్తిన మద్దతు
సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేపట్టిన నిరవధిక దీక్షకు మద్దతు వెల్లువెత్తుతోంది. రాష్ర్టవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఊరూవాడా ఏకమై ఉద్యమబాట పట్టాయి. ‘ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు’ అంటూ దీక్షకు సంఘీభావంగా ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా దీక్షలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జగన్‌తోనే ప్రత్యేకహోదా సాధ్యమని ప్రజలు నినదిస్తున్నారు. హోదా సాధనకు కట్టుబడి రాష్ట్రాభివృద్ధికోసం ప్రాణాన్ని పణంగా పెట్టి దీక్ష చేస్తున్న జగన్‌కు మద్దతుగా అన్ని వర్గాల ప్రజలూ ఉద్యమిస్తున్నారు. జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు వివిధ ప్రాంతాల ప్రజలు నల్లపాడు బాట పట్టారు. రెండోరోజైన గురువారం ఉదయంనుంచే దీక్షా శిబిరంవద్ద జనం పోటెత్తారు. బుధవారం రాత్రి శిబిరంలోనే పడుకున్న జగన్ ఉదయాన్నే తన స్థానంలో యథావిధిగా కూర్చున్నారు. అప్పటినుంచి వచ్చిన వారందరితో చేయి కలుపుతూ, అభివాదం చేస్తూ, పలకరిస్తూ గడిపారు. తమకోసం, తమ భవిష్యత్తుకోసం ప్రత్యేకహోదా కావాలని కృషిచేస్తున్న జగన్‌కు పలు విద్యా సంస్థల నుంచి విద్యార్థినీ విద్యార్థులు వచ్చి సంఘీభావం తెలిపారు. తమ ఉద్యోగాలకోసం తపిస్తున్న జగన్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు యువతీయువకులు ఎగబడ్డారు. ఆ సెల్ఫీలను అక్కడికక్కడే సోషల్ నెట్వర్క్ సైట్లలో అప్లోడ్ చేశారు. ఇంటర్నెట్ మాధ్యమంగా ప్రవాసాంధ్రులు జగన్ దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. పలువురు ప్రముఖులు పార్టీలకు అతీతంగా సంఘీభావం ప్రకటించారు. మద్దతు తెలిపిన నేతలు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ భారీ మోటార్ సైకిళ్ల ర్యాలీతో దీక్షా ప్రాంగణానికి వచ్చి జగన్మోహన్రెడ్డికి మద్దతు ప్రకటించారు. ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షకోసం దీక్ష చేస్తున్న జగన్‌ను అభినందించారు. హోదాపై స్పష్టమైన ప్రకటన వచ్చేవరకూ ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. లోక్‌సత్తా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గద్దె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు పలికారు. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని స్వాతంత్య్ర ఉద్యమంలా ఉధృతం చేయాలని గద్దె పిలుపునిచ్చారు. ప్రత్యేకహోదా కోసం జగన్ చేస్తున్న దీక్ష సఫలం కావాలని లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ ఢిల్లీలో ఆశాభావం వ్యక్తంచేశారు. రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు కొందరు తాము పడుతున్న ఇబ్బందులను జగన్‌కు వివరించారు. రాజధాని గ్రామాల్లో ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాలు, ఉండవల్లిలో ముఖ్యమంత్రి నివాసం కోసం రైతులు, ఇతర వర్గాలను ఇబ్బంది పెడుతున్నట్లు వివరించారు. వాటన్నింటినీ విన్న జగన్ ధైర్యంగా ఉండాలని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రి పారిశుధ్య కార్మికులు తమ సమస్యలను వివరించి ఆయనకు వినతిపత్రం సమర్పించారు. గుంటూరు నగర పాలక సంస్థ ఉద్యోగులు కూడా తాము పడుతున్న ఇబ్బందులను జగన్ దృష్టికి తీసుకొచ్చారు. గుంటూరుకు చెందిన న్యాయవాదులు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. పారిశ్రామికవేత్తల సంఘీభావం ప్రత్యేక హోదాకోసం జగన్ నిరవధిక దీక్షపై పలువురు పారిశ్రామికవేత్తలు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేకహోదా అత్యంత ఆవశ్యకమని వారు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదావల్ల రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వస్తుందని ఫిక్కీ ఏపీ స్టేట్ కౌన్సిల్ కో-చైర్మన్ జేఏ చౌదరి చెప్పారు. గతంలో ఐటీ రంగానికి పదేళ్లపాటు పన్ను రాయితీలు కల్పించడంవల్లే ఆ రంగం వేగంగా విస్తరించిందని గుర్తుచేశారు. ప్రత్యేకహోదా వస్తే ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు ఉంటాయి కాబట్టి ప్రపంచంలోని పెద్ద పారిశ్రామికవేత్తలు రాష్ర్టంలో పెట్టుబడులు పెడతారని ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ చెప్పారు. హోదాపై స్పష్టత ఇవ్వకపోవడం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సీఐఐ ఏపీ చాప్టర్ చైర్మన్ సురేష్ చిట్టూరి ఆందోళన వ్యక్తంచేశారు. హోదాతోనే ఐటీ రంగంలో అభివృద్ధి సాధ్యమని విశాఖ ఐటీ పార్క్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఒ.నరేష్కుమార్ తెలిపారు. సహజవనరులు పుష్కలంగా ఉన్న రాయలసీమలో ఎక్కువ పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉందని ఫ్యాప్సియో రాష్ట్ర అధ్యక్షుడు జి.రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రత్యేకహోదా కోసం జగన్ చేస్తున్న దీక్ష సఫలం కావాలని రాయలసీమ గ్రానైట్ పరిశ్రమల సమాఖ్య ఉపాధ్యక్షుడు పి.సతీష్‌కుమార్ ఆకాంక్షించారు. వైఎస్సార్సీపీ నాయకులు పలువురు ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనాలు, దీనికోసం జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటం, ప్రభుత్వ వైఖరిపై గురించి చేసిన ఉపన్యాసాలతో ఉదయం నుంచి రాత్రి వరకూ దీక్ష జరుగుతున్న నల్లపాడు ప్రాంగణం హోరెత్తింది. దీక్షలో పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. సెల్ఫీలు దిగేందుకు యువత ఉత్సాహం అరండల్‌పేట (గుంటూరు): ప్రత్యేక హోదా సాధన కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డితో సెల్ఫీలు దిగేందుకు యువత, విద్యార్థులు, మహిళలు, ఉత్సాహం చూపుతున్నారు. గురువారం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, మహిళలు జగన్ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు తరలి వచ్చారు. వీరు జగన్‌కు సంఘీభావం తెలపడంతోపాటు, సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. వీరి ఉత్సాహాన్ని గమనించిన జగన్ సెల్ఫీలు దిగేందుకు వారికి అవకాశం కల్పించారు. చాలా మంది యువకులు వారు దిగిన సెల్ఫీలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడు చేశారు. దీంతో వారి స్నేహితులు, బంధువులు, లైక్‌లు కొట్టడంతోపాటు, జగన్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం నిరవధిక నిరాహార దీక్ష చేయడం అభినందనీయమని కామెంట్లు పెడుతున్నారు. ఈతరం నేతకు ఇంటర్నెట్లో నీరాజనం సాక్షి, హైదరాబాద్: ఈతరం విద్యార్థుల కోసం, ఈతరం యువత కోసం పోరాడుతున్న ఈతరం నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇంటర్నెట్లో యువతరం నీరాజనాలు పడుతోంది. ప్రత్యేకహోదా అంశంపై యువతీయువకులు జగన్ పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నారు. నిరవధిక నిరాహారదీక్షలో ఉన్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దీక్షా శిబిరంవద్ద కలసిన యువతీయువకులు తీసుకున్న సెల్ఫీలు, మరోవైపు జగన్‌కు మద్దతుగా ప్రపంచం నలువైపుల నుంచి తెలుగు వాళ్లు పంపుతున్న సెల్ఫీ వీడియోలతో తెలుగు వాళ్ల ఫేస్బుక్ పేజీలు నిండిపోయాయి. జగన్మోహన్రెడ్డి దీక్షకు మద్దతుగా రెండోరోజూ ఇంటర్నెట్లో పోస్టులు వెల్లువెత్తాయి. జగన్ దీక్షతో ఇంటర్నెట్లో ‘ప్రత్యేకహోదా’ అంశంపై కూడా విస్తృతమైన చర్చ జరుగుతోంది. ప్రత్యేకహోదా దక్కితే రాష్ట్రానికి కలిగే ప్రయోజనాల గురించి, అవకాశాలు విస్తృతమయ్యే విధానం గురించి నెటిజన్లు పోస్టుల ద్వారా వివరిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగావకాశాల కోసం వేచి ఉన్న యువత జగన్‌కు మద్దతు పలకడం తమ బాధ్యతగా తీసుకున్నారు. ఎన్ఆర్ఐల నుంచి వెల్లువెత్తిన మద్దతు ఇంటర్నెట్ మాధ్యమంగా ప్రవాసాంధ్రులు జగన్మోహన్ రెడ్డి దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. సెల్ఫీ వీడియోల ద్వారా జగన్‌కు మద్దతు ప్రకటిస్తున్న వారిలో ప్రవాసులే ఎక్కువమంది ఉన్నారు. తొలిరోజు మొదలైన ఈ ట్రెండ్ రెండో రోజుకు మరింత విస్తృతమైంది. ఒకవైపు జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో ఉద్యమిస్తుంటే.. ఆయనపై విమర్శలు చేస్తున్న అధికార పార్టీ నేతలు, మంత్రులపై నెటిజన్లు మండి పడుతున్నారు. వ్యంగ్యాస్త్రాలతో తెలుగుదేశం నేతలను ఎద్దేవా చేస్తున్నారు. ఆ చిన్నారి పేరు విజయమ్మ.. గుంటూరు రూరల్: ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారంనాడు ఊహించని అభిమానం ఉక్కిరిబిక్కిరి చేసింది. పొత్తిళ్లలో ఓ పసిబిడ్డను తీసుకువచ్చిన తల్లిదండ్రులు పేరుపెట్టాల్సిందిగా జగన్‌ను అభ్యర్థించారు. తమ బిడ్డను జగన్ చేతుల్లో ఉంచారు. గుండెల నిండా పెద్దాయన వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నారని, విజయమ్మగారన్నా మీరన్నా మాకు ఎంతో అభిమానమని వారు జగన్‌కు వివరించారు. తమ బిడ్డకు విజయమ్మ పేరు పెట్టాల్సిందిగా అభ్యర్థించారు. నెలరోజుల వయసు ఉన్న ఆ పాపకు విజయమ్మ అని జగన్ నామకరణం చేశారు. ఆ జంట గుంటూరు రూరల్ మండలంలోని స్వర్ణభారతి నగర్ కాలనీకి చెందిన షేక్ నాగుల్, మస్తాన్‌బీ. తమ కాలనీ వాసులతో కలసి జగన్ దీక్షకు సంఘీభావం ప్రకటించడానికి వచ్చిన సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. తమను అభిమానిస్తున్న, ఆరాధిస్తున్న ఆ జంటకు జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. వైఎస్ జగన్‌కు వైద్య పరీక్షలు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారానికి రెండో రోజుకు చేరుకుంది. 24 గంటలుగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుండటంతో రెండో రోజు గురువారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు జగన్‌కు వైద్య పరీక్షలు చేశారు. ఉదయం 10.30 గంటలకు జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ షేక్ షర్మిల పరీక్షలు చేయగా రాత్రి 8.30 గంటలకు మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మురళీకృష్ణ వైద్య పరీక్షలు చేశారు. ఉదయం బీపీ 120/80 ఉండగా రాత్రి 130/90 ఉంది. ఉదయం షుగర్ 91 ఉండగా రాత్రి 85 ఉంది. బీపీ, షుగర్లు సాధారణంగా ఉన్నట్లు పరీక్షలు చేసిన వైద్యులు తెలిపారు. -
ఫేస్బుక్, వాట్స్‌యాప్‌లే టాప్
న్యూఢిల్లీ: దేశంలో ప్రజలు ఎక్కువగా ఫేస్బుక్, వాట్స్‌యాప్ లను వినియోగిస్తున్నారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్‌లో ఫేస్బుక్, ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్స్‌లో వాట్స్‌యాప్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ విషయం గ్లోబల్ రీసెర్చ్ కన్సల్టెన్సీ సంస్థ టీఎన్ఎస్ నివేదికలో వెల్లడైంది. నివేదిక ప్రకారం.. భారత్‌లో సోషల్ నెట్వర్కింగ్ సైట్స్‌ను వినియోగిస్తున్న వారిలో 51 శాతం మంది ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్నారు. అలాగే ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్స్ వినియోగించే వారిలో 56 శాతం మంది వాట్స్‌యాప్‌ను వినియోగిస్తున్నారు. భారత్‌లో ఫేస్బుక్ వినియోగం 51 శాతంగా నమోదైంది. ఇది థాయ్‌లాండ్‌లో 78 శాతంగా, తైవాన్‌లో 75 శాతంగా, హాంగ్‌కాంగ్‌లో 72 శాతంగా ఉంది. కాగా ఫేస్బుక్ వినియోగదారులను కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో, భారత్ రెండో స్థానంలో (12.5 కోట్ల మంది) ఉన్నాయి. అంతర్జాతీయంగా ఫేస్బుక్ యూజర్లు 149 కోట్లుగా ఉన్నారు. -
ఆకలి లేదు.. ఏడుపు లేదు.. ప్రాణాలూ!
మూడంటే మూడే సంవత్సరాల వయసు. తల్లి ఒడిలోనో, తండ్రి భుజం పైనో హాయిగా సేద తీరే పసిప్రాయం. ఆకలేస్తే ఏడవడం, సంతోషమొస్తే ఎగిరి గంతేయడం మాత్రమే తెలిసిన వయస్సు. కానీ ఇప్పుడు ఆకలి లేదు, ఏడుపూ లేదు, ఎందుకంటే ప్రాణాలు కూడా లేవు. ఇప్పుడీ ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఘటన టర్కీలోనిది. చనిపోయింది సిరియా చిన్నారి. ఓ వైపు ఉగ్రదాడులు, మరో వైపు సైన్యం ప్రతిదాడులతో ప్రాణాలు చేతబట్టుకుని అనేక మంది టర్కీకి వలస వస్తున్నారు. సముద్ర మార్గంలో దొంగచాటుగా చేస్తున్న ఈ ప్రయాణం వారి ప్రాణాలకు ముప్పు తెస్తోంది. సిరియా నుంచి గ్రీస్‌కు వెళ్తున్న రెండు పడవలు మునిగిపోగా, 12 మంది చనిపోయారు. అందులోంచి కొట్టుకువచ్చిందే ఈ చిన్నారి మృతదేహం. సిరియన్ల దుస్థితికి అద్దం పట్టే ఈ దృశ్యంలో పిల్లాడి పేరు అయిలన్ కుర్దీ. - రంజన్, సాక్షి టీవీ -
సామాజిక వేడుక
సామాజిక మాధ్యమాలే వేదిక మువ్వన్నెలద్దుకున్న {పొఫైల్ పేజీలు ఏయూక్యాంపస్ : సమాచార విప్లవం నేడు మన ముందు దర్శనమిస్తోంది. స్వేచ్ఛ ప్రతి వ్యక్తికి చేరువయ్యింది. తమ ఆలోచనలు, భావాలను పంచుకునే అవకాశం చిక్కుతోంది. ప్రపంచం అవధులు చెరిపేసే విధంగా ఈ సామజిక మాధ్యమాలు నిలుస్తున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, మెసెంజర్ ఇలా నిత్యం సోషల్ నెట్వర్కింగ్ మాధ్యమాలు ప్రధానంగా యువత ఆలోచనలు పంచుకునే వేదికలుగా నిలుస్తున్నాయి. మనసులోని భావాలను నిర్భయంగా, ఇతరులతో పంచుకునే అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుంటోంది... రేపటి స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సామాజిక వేదిక’లపై పండగ చేసుకుంటోంది. అభిప్రాయాల వేదిక.... అభిప్రాయాలు పంచుకోవడానికి ఒక వేదిక కావాలి. భావాలను చేరవేసే వారధి అవసరం. వీటిని తీర్చే విధంగా సాగుతోంది సామాజిక మాధ్యమాల పయనం. స్వాతంత్య్ర దినోత్సవం, స్నేహితుల దినోత్సవం, మాతృదినోత్సవం ఇలా వేడుక ఏదయినా వేదిక మేమంటూ సాగుతున్నాయి. తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకుంటున్నాయి. ఒకరి అభిప్రాయంతో ఏకీభవించే వారు విబేధించే వారు సైతం మనకు దర్శనమిస్తుంటారు. ఏది ఏమయినా భావాల సంవాదం మాత్ర తధ్యమని తెలుస్తోంది. స్వాతంత్య్ర స్ఫూర్తి... దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు జరుపుకునే వేడుకలు స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం. వీటికి యువతరం ఎంతో ఆసక్తి చూపుతుంటారు. స్వాతంత్య్ర దినోత్సవం వస్తోందంటే సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ ప్రొఫైల్ పీజీలు రంగులను అద్దుకుంటున్నాయి. తమ భావాలకు అక్షర రూపం ఇవ్వడంతో పాటు, రంగులను అద్దుతుంటారు. వీటిని ఫేస్బుక్, వాట్సాప్‌ల్లో పోస్టింగ్ చేస్తారు. వేడుకకు వారం రోజుల ముందునుండే పోస్టింగ్‌లు వెల్లువెత్తుతుంటాయి. వీటిలో తమకు నచ్చినని, మనసుకు హత్తుకున్న వాటిని పదే పదే పంపడం సర్వసాధారణ విషయంగా మారుతోంది. వీటికి లైక్‌లు, షేరింగ్‌లకు లెక్కేలేదు. షేరింగ్ థాట్స్.... గతంలో వ్యక్తులు ఎంతో బిడియంతో వ్యవహరించేవారు. నేడు దీనికి భిన్నంగా ఎంతో స్వేచ్ఛగా భావాలు ప్రకటిస్తున్నారు. తమ ఆలోచనలు పంచుకునే వేదికగా సోషల్ నెట్వర్కింగ్ నిలుస్తోంది. మన ఆలోచనలను సులభంగా, తక్కువ సమయంలో ఇతరులతో పంచుకోవడానికి ఇవి వేదికగా నిలుస్తున్నాయి. - వి.మహేష్, సాఫ్ట్వేర్ నిపుణుడు పరిణతితో ప్రవర్తించాలి.... మన భావాలు ఇతరులను నొప్పించేవిగా ఉండకూడదు. వివాదాలు రేకెత్తించేవిగా, ఇతరుల మనసులను గాయపరిచేవిగా, వ్యక్తిగతమైనవిగా ఉండకుండా చూడాలి. సామాజిక మాధ్యమాలు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. వీటిని పరిధిని గుర్తించి, పరిణతితో కూడిన అభిప్రాయాలను మాత్రమే పంచుకోవడం శ్రేయస్కరం. - ఆర్.వి.ఆర్ శర్మ, పరిశోధక విద్యార్థి -
అపరిచితులా... డోన్ట్‌లైక్
సోషల్ నెట్‌వర్క్‌తో జాగ్రత్త ఉపయోగాలు ఎన్నో.. అనర్థాలూ అన్ని! తెలియనివారితో స్నేహం లేనిపోని కష్టాలకు మూలం సాగర్‌నగర్ ః ‘ఫేస్బుక్’ ః చేతిలో సెల్‌పోన్ ఉన్న ప్రతి ఒక్కరు ‘లైక్’చేస్తున్న సోషల్ నెట్‌వర్క్‌ఇది. రోజూ ఏదో ఒకటి పోస్ట్ చేయడం, మిత్రుల పోస్ట్‌లకు కామెంట్లు రాయడం, లైక్, షేర్ చేయడం దినచర్యలో భాగమైంది. దీనివల్ల మనుషుల మధ్యదూరం చెరిగిపోయింది. అదేక్రమంలో అపరిచితులను లైక్ చేస్తే కొన్ని అనర్థాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అందుకే అపరిచితులను డోన్ట్‌లైక్ అని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. నేటి యువతరానికి ఫేస్బుక్ చూడకుండా నిద్రకూడా పట్టడం లేదు. కాస్త సమయం దొరికితే చాలు ఫేస్బుక్లో మునిగితేలుతున్నారు. ఇది కొంత ఇబ్బందికరంగా కూడా మారుతోందని మానసిక వైద్యశాస్త్ర నిపుణలు చెబుతున్నారు. యువత మధ్య ఫేస్బుక్ ప్రేమలు పెరగడం, కొన్ని సందర్భాల్లో అవి వికటించి ప్రాణాలు కోల్పోవలసి రావటం గమనార్హం. ఎన్నో ప్రయోజనాలు: ఫేస్బుక్ వలన ప్రయోజనాలు ఉన్నాయి. బతుకు తెరువుకు ప్రపంచంలో తలో దిక్కు వెళ్లిన స్నేహితులను ఫేస్బుక్ కలుపుతుంది. బాల్య స్నేహితులు ఎవరి పనివారు చేసుకుంటూ వాటి సృ్మతుల్ని తలచుకుంటన్నారు. గుడ్‌మార్నింగ్ అంటూ పలకరించే పోస్టులు..మంచిగా బతకటానికి కావల్సిన సంందేశాలు..మహానీయుల సూక్తులు అంతా మంచి జరగాలని కోరుకొనే స్నేహితులు..అలా అదో పెద్ద ప్రపంచం. గత ఏడాదిలోజరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొదలు దేశ ప్రధాని అభ్యర్థుల వరకు ఫేస్బుక్లో తమ ప్రచారాన్ని కొనసాగించారు. మార్కెట్లో వచ్చే వివిధ బ్రాండ్ల అమ్మకాలకు సైతం నేడు ఫేస్బుక్ వేదికగా మారింది. దీని ప్రాముఖ్యత గుర్తించే అనేక ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఫేస్బుక్ ద్వారా సందేశాలను చేరవేస్తున్నాయి. నగరంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, కళాశాలలు, వివిధ రంగాలకు వారికి ఫేస్‌బుక అకౌంట్లు ఉన్నాయి. ముఖ్యంగా నగర పౌరుల జీవనవిధానాలను మెరుగుపరస్తూ సౌలభ్యమైన పరిపాలను అందించడాని కోసం జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ జీవీఎంసీఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా నగర మేధావులు, పౌరుల విన్నఫాలను సేకరించడం విశేషం. ప్రస్తుతం ప్రత్యేక హోదా కోసం ఫేస్‌బుక్‌ద్వారా సలహాలు, సూచనలు ఇవ్వాలని, పరోక్షంగానైనా సరై సోషల్ మీడియా ద్వారా ఉద్యమించాలని కోరుతూ చాలామంది నాయకులు, యువత, మేధావులు అందరికీ మేసేజ్‌లు అందుతున్నాయి. నాణానికి మరోవైపు... ప్రత్యేక హోదా...సమైక్యాంధ్ర ఉద్యమం, సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫేస్బుక్లో చెలరేగిన వివాదాలు అంతా ఇంతా కాదు. ప్రాంతాలవారీగా మారి ఫేస్బుక్లో తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఫేస్బుక్ లో అమ్మాయిలు, అబ్బాయిలు పరిచయాలు అవుతుంటాయి. యువతుల పేరుతో కొందరు ఫేస్బుక్ అకౌంట్లు తెరిచి మోసం చేసిన సంఘటనలు పలుచోట్ల చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి సందర్భాల్లో యువతలు కొందరు తమ పరువపోతుందని తేలుకుట్టిన దొంగల్లా పోలీసుల దృష్టికి తేలేదు. ఫేస్బుక్లో పెట్టిన కామెంట్లను నమ్మి మోసపోయిన వారు కూడా ఉన్నారు. అపరిచితులతో స్నేహం చేసేముందు జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు పాటించాలి అపరిచిత వ్యక్తల స్నేహ అభ్యర్థనలకు స్పందించకుండా ఉండటం ముఖ్యం. యువతుల పేరుతో చేసే చాటింగ్ దూరంగా ఉండాలిసాధ్యమైనంత వరకు పోన్ నంబర్‌ను ఇతరులకు ఇవ్వకపోవటం మంచిది. యువత వినియోగిస్తున్న సోషల్‌నెట్‌వర్క్‌పై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉండాలిఫేస్‌బుక్‌లో జరిగే చర్చల్లో నచ్చని అభిప్రాయాన్ని ఎవరైనా వ్యక్తంచేసినా సున్నితంగా వ్యవహరించటం మంచిది.వ్యవహారం శ్రుతిమించినట్లుయితే ఫ్రెండ్స్ లిస్ట్ నుంచి తొలగించటం మంచిది - ధనంజయ్‌నాయుడు, ఆరిలోవ సిఐ. -
ప్రజలకు మరింత చేరువలో YSRCP
-
సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ హల్చల్
ఆకట్టుకున్న డిజిటల్ మీడియా స్టాల్ సాక్షి, విజయవాడ బ్యూరో: సోషల్ నెట్వర్కింగ్లో కొత్త పుంతలు తొక్కుతున్న యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా వైఎస్సార్ డిజిటల్ మీడియా విభాగాన్ని ప్రారంభించింది. పార్టీ శ్రేణులకు, ప్రజలకు, యువతకు వైఎస్సార్ డిజిటల్ మీడియా గురించి తెలియజెప్పేలా సమరదీక్షా ప్రాంగణంలో స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఆ పార్టీ డిజిటల్ మీడియా విభాగంలో ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్, వెబ్ ఎడిషన్, వెబ్ టీవీ, ఈ పేపర్, మెయిల్ వంటి వాటి ద్వారా పార్టీ విద్యావంతులకు మరింత దగ్గరయ్యే కృషి జరుగుతోంది. ఈ వివరాలతో కార్డులు పంపిణీ చేశారు. యువత ఈ స్టాల్‌ను ఆసక్తిగా చూసి, కార్డులు తీసుకున్నారు. ♦ www.ysrcongress.com పేరుతో వెబ్ ఎడిషన్‌లో పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, ప్రకటనలు పెట్టి పార్టీ శ్రేణులకు మార్గ నిర్దేశం చేస్తారు. జగన్మోహన్రెడ్డి ప్రసంగాలు, పార్టీ నాయకత్వ మార్పులు, మీడియా ప్రకటనలు అందులో ఉంచుతారు. ♦ www.ysrcongress.com/epaperలో ప్రముఖుల వ్యాసాలు, పార్టీ సిద్ధాంతాలు, పార్టీ వైఖరి, కార్యక్రమాలు, జగన్మోహన్రెడ్డి, ముఖ్యనేతల పర్యటనలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తారు. ఈ పేపర్, వెబ్‌సైట్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు వీడియో, ఆడియో, రాతపూర్వక సమాచారం కూడా పంపే అవకాశం ఏర్పాటు చేశారు. ఇందుకోసం ysrcp.digitalmedia @gmail.com కు మెయిల్ చేయొచ్చు. 9010295617 నంబరుకు వాట్సాప్ మెస్సెజ్‌లు, వీడియో క్లిప్పింగ్‌లు పంపించవచ్చు. ♦ ఫేస్బుక్లో వైఎస్సార్‌కాంగ్రెస్ డిజిటల్ మీడియా డాట్‌కామ్‌కు ఇప్పడికే ఐదులక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి. ♦ ట్విట్టర్లో నేరుగా జగన్ ట్వీట్ చేస్తారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. ♦ వైఎస్సార్సీపీ ఆఫీషియల్ పేరుతో యూ ట్యూబ్ టీవీ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు. -
మరోసారి చూడాలి
మరోసారి చూడాలి, కౌగలించుకోవాలి, ముద్దాడాలి ఏమిటి రశికతతో కూడిన సినిమా డైలాగులు అంటారా? మీ కల అనిపించినా, ఇవి సినిమా డైలాగులు కాదు. ఓ ప్రముఖ నటి తన ప్రియుడికి పంపిన ప్రేమ సందేశం కాదు. ఇది ఓ సోషల్ నెట్వర్కు లవ్ మ్యాటర్. కొందరు హీరోయిన్లు ప్రేక్షకులను ఆకర్షించాలనో లేక ఇంకేదో ఆశించో కనీస సామాజిక బాధ్యతను మరచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారనడానికి ఇది నిదర్శనం. ఇటీవల నటి చార్మి పెళ్లికూతురు రూపంలో ఉన్న ఫొటోను ఇంటర్నెట్లో పోస్టు చేసి ఈ రోజు నాకు పెళ్లి అంటూ చాలామందిని అయోమయానికి గురి చేశారు. తాజాగా నటి ప్రియమణి తనకో లవర్ ఉన్నాడు, తను ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటూ నెట్లో పోస్టు చేసి సంచలనం సృష్టించారు. ఆమె అంతటితో ఆగలేదు. ప్రియుడికి తన కోరికలను తెలిపే విధంగా ఒక మెసేజ్‌ను కూడా పోస్టు చేశారు. అవేమిటో తెలుసుకోవాలనుందా? మీ నుంచి మూడు విషయాలు కావాలి. మిమ్మల్ని మళ్లీ చూడాలి, గట్టిగా కౌగలించుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి అంటూ తన రహస్య ప్రేమికుడికి సోషల్ నెట్వర్కు ప్రేమలేఖను రాసి కొందరి అసహ్యానికి గురయ్యారు. మరికొందరు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెసేజ్ పేరుతో ఎలాగైనా ప్రవర్తించవచ్చా అంటూ ప్రియమణి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రచారం కోసం ఇలాంటి చీప్ ట్రిక్కు పాల్పడడమా? అంటూ అసహ్యహించుకుంటున్నారు. సెలిబ్రెటీగా చలామణి అవుతున్న వారు సామాజిక బాధ్యతలు గుర్తెరగాలని హితవు పలుకుతున్నారు. వారికి ప్రియమణి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. -
వాట్సాప్ రచ్చ ఏడేళ్ల జైలు శిక్ష
సాక్షి, చెన్నై : వాట్సాప్‌లో ఇటీవల కాలంగా సంచలన సమాచారంతో పాటుగా, అసభ్యకరమైన వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై కొరడా ఝుళిపించేందుకు నగర పోలీసు యంత్రాంగం సిద్ధం అయింది. అసభ్యకర ఫొటోలు, వీడియోలు, ఎస్ఎంఎస్లు వాట్సాప్ ద్వారా పంపిన పక్షంలో ఏడేళ్లు జైలు శిక్ష తప్పదని చెన్నై పోలీసుల కమిషనరేట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఆధునిక యుగంలో టెక్నాలజీ విస్తరించే కొద్ది సరికొత్త సోషల్ నెట్ వర్క్‌లు పుట్టుకు వస్తున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ ప్రాచుర్యంలో ఉండగానే వాట్సాప్ రంగంలోకి దిగింది. ఆండ్రాయిడ్, తదితర మొబైల్స్‌లోని సదుపాయాల మేరకు కొత్త రకంగా సమాచారం, సోషల్ నెట్ వర్కింగ్ వ్యవహారాలు సాగుతున్నాయి. అయితే, వీటిని కొందరు అసభ్యకర సంకేతాలకు ఉపయోగించే పనిలో పడ్డారు. అయితే, ఇన్నాళ్లు వీటి మీద పెద్దగా దృష్టి పెట్టని నగర పోలీసు కమిషనరేట్ వర్గాలు, తాజాగా కొరడా ఝుళిపించేందుకు సిద్ధం అయ్యాయి. ఇందుకు కారణం, తమ పోలీసు అధికారి ఫోన్లో ప్రేమ లీల హల్చల్ చేసింది వాట్సాప్‌లో కాబట్టే. మరో మహిళా అధికారి బెదిరింపు వ్యవహారం వాట్సాప్‌లలో చక్కర్లు కొడుతోంది. ఎక్కడి నుంచి ఎవరు పంపిస్తున్నారో ఏమోగానీ, తమ మీద బురదజల్లే రీతిలో వాట్సాప్‌లో ప్రచారాలు సాగుతుండడంతో ఇక, అసభ్యకర సందేశాలు, ఫొటోలు, వీడియోలు వాట్సాప్‌లో ప్రత్యక్షమైనా, ఎవరైనా ఫిర్యాదు చేసినా కొరడా ఝుళిపించే విధంగా పోలీసు బాసులు నిర్ణయించారు. ఏడేళ్లు జైలు శిక్ష : వాట్సాప్‌లలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వారిపై కన్నెర్ర చేయడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. ఎవరి వాట్సాప్ నెంబర్లకైనా అసభ్యకర సందేశాలు, ఫొటోలు, వీడియోలు వచ్చినా తమకు ఫిర్యాదు చేయొచ్చని పోలీసులు పిలుపునిస్తున్నారు. ఒకరి వ్యక్తిగత విషయాలు, ఒకరి ఫొటోలను మరొకరు వాట్సాప్‌లలో పంపించడం, తదితర చర్యలకు పాల్పడ్డ పక్షంలో సైబర్ క్రైంను తక్షణం ఆశ్రయించాలని సూచిస్తున్నారు. తమకు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా తదుపరి చర్యల అనంతరం సంబంధిత వ్యక్తులపై ఏడేళ్ల జైలు శిక్ష విధించే రీతిలో కేసులు నమోదవుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంగా ఓ పోలీసు అధికారి పేర్కొంటూ, వాట్సాప్‌లలో వాయిస్ రికార్డులు, వీడియోలు, ఇలా తమ వాళ్లను టార్గెట్ చేసి ఇష్టా రాజ్యంగా ప్రచారాలు సాగుతుండడాన్ని తీవ్రంగా పరిగణించామని పేర్కొనడం గమనార్హం. ఏదేని అసభ్యకరంగా వ్యవహరించే సందేశాలు, ఫొటోలు, వీడియోలు ప్రత్యక్షమైతే చాలు చర్యలు తప్పదని హెచ్చరించారు. -
ట్విట్టర్లో ఖాతా
సినిమా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలాగైతే ఉపయోగించుకుంటూ అభివృద్ధి పథంలో సాగుతుందో అదే టెక్నాలజీతో తారలు తమ ప్రచారాన్ని పెంచుకోవడానికి సిద్ధమయ్యారు. ఫేస్బుక్, ట్విట్టర్‌లాంటి సాధనాలను ఇందుకు వాడుకుంటున్నారు. కోలీవుడ్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి పవర్‌స్టార్ శ్రీనివాసన్ వరకు ఈ సోషల్ నెట్ వర్క్‌ను వాడుకుంటున్నారు. అయితే నటుడు సూర్యలాంటి కొందరు ఇప్పటి వరకు ట్విట్టర్ల జోలికి పోలేదు. దీంతో వారి పేర్లతో కొన్ని నకిలీ ట్విట్టర్లు వెలసి అసత్య ప్రచారాలను సాగిస్తున్నాయి. ఈ విషయం వెలుగు చూడడంతో సూర్య ఆ మధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన కూడా స్వయంగా ట్విట్టర్‌ను ప్రారంభించడం విశేషం. శనివారం ఆయన సూర్యా ఆఫ్ సూర్య శివకుమార్ పేరుతో ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. కొన్ని నిమిషాల్లోనే 27 వేల మంది అభిమానులు సూర్య ట్విట్టర్‌కు స్వాగతం సూర్య అంటూ ఆహ్వాన వ్యాఖ్యలతో పలకరించడం విశేషం. ఇకపై ఈ ట్విట్టర్లో సూర్య తన చిత్రాలకు సంబంధించిన కొత్త విషయాలను, ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను సంతోష పరచనున్నట్టు తెలిపారు. -
వరుణ్ కారుణ్య
చాలా చిన్నపనే... అవతల వారిని ఆనందపెడుతుంది. మనల్ని వారి దృష్టిలో ఉన్నతులను చేస్తుంది. మనకు మనం సామాన్యులమే అయినా... అవతలి వారికి అసామాన్యులమనిపిస్తాం. ఆకాశమంత ఎత్తులో నిలుస్తాం! అందుకోసం ఏం చేయాలంటారా... కాసేపు వరుణ్పృథి ఫేస్బుక్ పోస్టులను గమనించి.. అవకాశం ఉన్నప్పుడు తనలాగే చేస్తే చాలు! కాలిఫోర్నియాలోని హాలీవుడ్లో నటన, డాన్సుల్లో శిక్షణ పొంది వచ్చిన ఈ ఢిల్లీ యువకుడు బాలీవుడ్ సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తూ.. వీడియో ఆల్బమ్స్‌లో నటిస్తూ ఉంటాడు. వరుణ్పృథి నేపథ్యం ఇదే అయినా... ఇతడిని ప్రస్తావించుకోవాల్సిన అంశం మాత్రం మరోటి ఉంది. అదే.. సోషల్ నెట్వర్కింగ్ సైట్లైన ఫేస్బుక్, యూట్యూబ్‌లను వేదికలుగా చేసుకొని అతడు చేస్తున్న విభిన్నమైన ప్రయత్నం. ఢిల్లీలోని కనాట్‌ప్లేస్ ‘బ్లాక్ ఏ’లో ఫుట్‌పాత్‌పై సాక్స్‌లను అమ్ముతుండే ఒక మధ్యవయసు మహిళను కొంతకాలం కిందట ప్రపంచానికి పరిచయం చేశాడు పృథి. తను అమ్మే సాక్సులు నాణ్యమైనవని.. ఒక పెయిర్ కొనాలని కోరిన ఆ మహిళ దగ్గర పృథి ఆగి.. ఆమె దగ్గర ఉన్న మొత్తం సాక్సులన్నీ కొనేశాడు! అంతే ఒక్కసారిగా ఆమె కళ్లలో తడి.. ఎన్నో రోజులు అమ్మితేగానీ అమ్ముడయిపోని ఆ సాక్సులన్నీ ఒకేసారి అమ్ముడయిపోతే ఆమెకు అంతకు మించిన ఆనందముంటుందా! పృథి ఎవరో ఆమెకు తెలీదు. కానీ అతడు ఆమెకు జీవితంలో మరిచిపోలేని వ్యక్తి అయ్యాడు. ఈ ప్రయత్నంలో అతడు చెల్లించింది మహా అంటే ఐదొందల రూపాయలు. ఆ డబ్బుకు ప్రతిగా అంత విలువైన సాక్సులు పొందాడు. కానీ అతడు ఆమెకి అందించిన సంతోషానికి మాత్రం ఎవ్వరూ విలువకట్టలేరు. ఆ విషయం పృథి అప్లోడ్ చేసిన వీడియోను చూస్తే అర్థం అవుతుంది. ఈ వీడియో చివర పృథి ఇచ్చే సందేశం ఏమిటంటే... ‘కనాట్ ప్లేస్ బ్లాక్ ఏ ప్రాంతంలో ఉంటుందామె.. మీరు అటువైపు వెళితే ఆమె దగ్గర సాక్సులు కొనండి’ అంటాడు. మరి అందుకోసం మనం ఢిల్లీ వరకూ వెళ్లాల్సిన అవసరం లేదు. మన వీధి చివర కూడా ఇలాంటి ఆనందం కోసం ఎదురుచూసే స్ట్రీట్వెండర్లు ఉండనే ఉంటారు. ఈసారి ఢిల్లీ వీధుల్లోనే.. పెన్నులమ్మే పిల్లాడు.. ఆరేడేళ్లుంటాయి. మెక్‌డొనాల్డ్స్ చికెన్ ఔట్లెట్ బయట నిలబడి లోపలికి చూస్తూ కనిపించడంతో వరుణ్ లోపలకు తీసుకెళ్లాడు. రెండు చికెన్ బర్గర్లు ఆర్డరిచ్చి టేబుల్ మీద కూర్చొబెట్టి అతడి కథేంటో తెలుసుకోవడం మొదలెట్టాడు. వరుణ్ ఆర్డరిచ్చిన చికెన్ బర్గర్లు రెండూ తనకే అని తెలిసి.. రెండోదాన్ని చెల్లి కోసం ఇంటికితీసుకెళతానన్న ఆ పిల్లాడి స్వరంలోని మార్ధవంలో అపురూపమైన ఆర్తి. ఆ పిల్లాడి దగ్గర ఉన్న పెన్నులన్నింటినీ కొనేసి పంపించాడు వరుణ్. వరుణ్ ఫేస్బుక్ పేజీకి ఐదులక్షల లైక్‌లున్నాయి! చాలా మంది స్టార్ హీరోల ఇమేజ్‌తో సమానం ఈ మొత్తం. వరుణ్ చెప్పే పద్ధతి బాగుంది. ప్రపంచాన్ని అలరించడానికి, ఆనందపెట్టడానికి నక్షత్రాలను కలిపేయనక్కర్లేదు.. మేఘాలను కరిగించనక్కర్లేదు.. మనకు చేతనయ్యే చిన్నచిన్నపనులతోనే కొందరిని ఆనందపెట్టగలం, వారి అనందాన్ని అనుభూతిగా మార్చుకోగలం... అని చెప్పకుండా చెబుతాడు వరుణ్. ఇది ఎవ్వరి హృదయాన్ని అయినా సున్నితంగా తాకుతుంది. మరి మనం చేయగలిగింది ఏమిటంటే.. వరుణ్ యూట్యూబ్ ఛానల్‌నో.. ఫేస్బుక్ పేజ్నో పూర్తిగా చూస్తే ఆ హ్యుమానిటీ హనీలో తడవొచ్చు! వరుణ్‌నే స్ఫూర్తిగా తీసుకుంటే.. మానవత్వాన్ని వర్షింపజేయవచ్చు. - జీవన్ రెడ్డి.బి -
చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ‘వాట్సప్’లో సమాచారమివ్వండి
సాంకేతిక విప్లవాన్ని సర్కారు విభాగాలు అందిపుచ్చుకుంటున్నాయి. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల హవా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ప్రభుత్వం యంత్రాంగం సైతం విధి నిర్వహణలో వాటి వినియోగానికి ప్రాధాన్యమిస్తోంది. సాధారణంగా ఒక విషయంపై ఫిర్యాదు చేయాలంటే సదరు బాధితులు కార్యాలయానికి వచ్చి.. లిఖితపూర్వకంగా ఇవ్వడానికి సమయం పడుతుంది. కానీ సామాజిక మాధ్యమాల వినియోగంతో తక్షణమే ఫిర్యాదును సంబంధిత ఆధారాలతో అందజేయవచ్చు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ప్రత్యేక ఖాతాలు తెరిచి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే వాటిని వినియోగంలోకి తెచ్చిన పలువురు అధికారులు.. సరైన ఆధారాలు సమర్పించి ప్రభుత్వానికి సహకరించే వారికి రివార్డులు సైతం ఇస్తున్నారు. పాలనకు సాంకేతిక పరిజ్ఞానం జోడించిన అధికారులు * అక్రమాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త వ్యూహం * వాట్సప్, మెయిల్స్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ * ఆధారాలు పంపినవారికి రివార్డులు సాక్షి, రంగారెడ్డిజిల్లా: శాంతిభద్రతల అంశంలో సత్వరం స్పందించేందుకు గ్రామీణ పోలీసు విభాగం సామాజిక మాద్యమబాట పట్టింది. ఏదైనా సంఘటనకు సంబంధించి బాధితులు, ప్రత్యక్ష సాక్షులు ఫొటోలు, వీడియోలు లేదా వాయిస్ మెసేజ్ చేసిన మరుక్షణమే రంగంలోకి దిగేందుకు ఉపక్రమించింది. మెసేజ్ వచ్చిన మరుక్షణమే బాధితులకు సాయం అందించడంతోపాటు కారకులపై చట్టపరమైన చర్యలకు దిగుతామని ఎస్పీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. వాట్సప్ నంబర్లు: 80083 84500, 80083 84600 రాజధానికి ఆనుకుని జిల్లా ఉండడంతో రెవెన్యూ పరమైన సమస్యలు సైతం అధికంగా ఉంటాయి. విలువైన ప్రభుత్వ భూములను కబ్జాదారులనుంచి కాపాడేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమార్కుల భరతం పట్టడానికి జాయింట్ కలెక్టర్-1 రజత్‌కుమార్ సైనీ సామాజిక మాద్యమాన్ని ఎంచున్నారు. వాట్సప్, ఈ- మెయిల్‌తో అక్రమాలకు ముకుతాడు వేయాలని నిర్ణయించి.. ప్రజలకు వాట్సాప్ నంబర్‌ను, మెయిల్ ఐడీని అందుబాటులోకి తెచ్చారు. వీటిద్వారా సమాచారమిచ్చిన వెంటనే యంత్రాంగం స్పందించి అక్రమార్కులపై ఉక్కుపాదం మొపనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో ఫేస్బుక్ ఖాతాను కూడా తెరువనున్నట్లు ఆయన వెల్లడించారు. వాట్సప్ నంబర్: 98499 04205 ప్రజా పంపిణీ వ్యవస్థ, వైద్య, ఆరోగ్యం, విద్య తదితర కీలక విభాగాల్లో అక్రమాలను అరికట్టేందుకు జాయింట్ కలెక్టర్ -2 కాట ఆమ్రపాలి వాట్సాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ విభాగాల్లో పారదర్శకతే లక్ష్యంగా సామాజిక మాద్యమాన్ని వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ఈమెయిల్ ఐడీకి సైతం సమాచారం ఇచ్చేలా ఏర్పాటు చేశారు. వాట్సప్ నంబర్ : 90005 44132 ఇసుక అక్రమ రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్న నేపథ్యంలో ఈ అక్రమాల్ని అరికట్టేందుకు వికారాబాద్ సబ్‌కలెక్టర్ అలగు వర్షిణి కూడా వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా అక్రమాలపై ఆధారాలను పోస్ట్ చేసే వారికి తగిన బహుమతులు సైతం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వాట్సప్ నంబర్ : 98499 04208 రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన తాండూరులో అక్కడి పోలీస్ విభాగం వాట్సప్, ఫేస్బుక్ ఖాతాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల తాండూరు ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చందనదీప్తి.. ఈవ్‌టీజింగ్, మట్కా, జూదం, ఇసుక అక్రమ రవాణా తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. వాట్సప్ నంబర్: 9440627353 -
అలక్ష్యం వద్దు
సోషల్ మీడియా పిల్లల మునివేళ్లతో ఆడుకుంటోంది. కొందరు ప్రయోజనానికి వాడుకుంటుంటే.. మరికొందరు బానిసలుగా మారి ‘నెట్’లో పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులు విద్యార్థుల్ని, యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. టెక్నాలజీ మన ముందు అద్భుతమైన అవకాశాలను ఉంచుతోంది. అదే సమయంలో మొబైల్, సోషల్ నెట్వర్క్ సైట్లు యువతని కొన్నింటికి దూరం చేస్తున్నాయి. అటువంటి చిన్నారులు, విద్యార్థులకు గెడైన్స్ చేసేందుకు నిర్వహించిన కార్యక్రమమే... ‘స్మాక్’ (ఎస్ఎంఏసీ- సోషల్ మీడియా, మొబైల్, అనలటిక్స్, క్లౌడ్). తొలిసంధ్య వెలుగు, ప్రకృతి ఆరాధన, భావ వ్యక్తీకరణ, ఒత్తిడిని తట్టుకునే శక్తి లాంటి సున్నితమైన అంశాల్లో నేటి యువత ఇంకా వెనుకబడే ఉంది. దీనికి కారణం మనదేశంలో పిల్లలు చిన్నతనంలో నుంచే తల్లిదండ్రులు, బంధువుల ఒత్తిడితో బలవంతంగా ఇష్టం లేని లక్ష్యాలవైపు నడవటమే. దీని వల్ల చిన్న పిల్లల్లో సహజంగా ఉండాల్సినంత ఆసక్తి, చురుకుదనం రానురాను కొరవడుతోంది. పైగా విపరీతమైన అసహనం, ఒత్తిడి వారిలో పెరిగిపోతోంది. ఈ విషయాన్నే ప్రధానాంశంగా తీసుకుని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ బుధవారం అంతర్జాతీయ ప్రముఖులతో బంజారాహిల్స్ పార్క్ హయత్‌లో ఓ చర్చా వేదిక ఏర్పాటు చేసింది. నాసా చీఫ్ నాలెడ్జ్ ఆఫీసర్ ఎడ్వర్డ్ రోజర్స్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, నర్తకి ఆనంద శంకర్ జయంత్, విద్యారంగంలో 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న గుత్సవ్ జే గ్రాప్, కెరీర్ మెంటార్ దీపక్ ఇందులో పాల్గొన్నారు. చెప్పే విధానం తెలియాలి సోషల్ మీడియా నుంచి పిల్లలను దూరంగా ఉంచడమంటే ఈ రోజుల్లో కష్టమే. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి ఖాతాలు ప్రతి విద్యార్థీ తెరుస్తున్నాడు. కొందరు వాటికి వ్యసనపరులుగా మారుతున్నారు కూడా. ‘పిల్లలకు ఏ విధంగా చెబితే మన దారికి వస్తారన్నది మొదట తల్లిదండ్రులు తెలుసుకోవాలి’ అంటారు ఈ ప్యానల్ డిస్కషన్‌కు హాజరైన విద్యావేత్త గుత్సవ్ జే గ్రాఫ్. టీవీ, గేమింగ్, సోషల్ మీడియాలు పిల్లల ఏకాగ్రతను దెబ్బతీస్తాయని చాలామంది పేరెంట్స్ కంప్లయింట్ చేస్తుంటారు. అయితే, పిల్లల్ని మార్చాలనుకునే ముందు పేరెంట్స్ మారాలనేది ఆయన అభిప్రాయం. పరిధి ఉండాలి ఈ రోజుల్లో టెక్నాలజీ వినియోగం తప్పనిసరే. అయితే, దాన్ని ఏ మేరకు, ఎంత వరకు వాడాలో ఎవరికి వారు స్వీయ నియంత్రణ విధించుకోవాలని నిపుణులు సూచించారు. ఇక పిల్లలపై పెద్దలు తమ అభిరుచులను, అభిప్రాయాలను రుద్దడంపై కూడా ప్రధానంగా చర్చించారు. ఆనందశంకర్ జయంత్... ‘పిల్లల్ని మొండిగా దారిలో పెట్టాలనుకోవడం పొరపాటు. ఎవరి ఆసక్తులు వారివి. అవి చెడ్డవైతే మంచిగా చెప్పి మాన్పించాలి. పోలిక అసలు పనికిరాదు’ అన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులతో పాటు గురువుల దృక్కోణమూ మారాలంటారు ఆమె. ఆసక్తి గమనించాలి: రోజర్స్ భారత్‌లో యువత సొంతంగా లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. నేటికీ ఎక్కువ శాతం మంది తల్లిదండ్రులు, బంధువుల ప్రభావం వల్ల సరైన లక్ష్యాలను ఎంచుకోలేక పోతున్నారు. పిల్లలు ఏ పనైతే ఎక్కువగా చేయాలని ఆసక్తి చూపుతారో ఆ రంగం వైపే వారి లక్ష్యాలను నిర్దేశించుకునేలా తల్లిదండ్రులు, గురువులు ప్రోత్సహించాలి. - శ్రావణ్‌జయ -
పిల్లలు మొబైల్ వాడకం మంచిదేనా?
-
ఫేస్బుక్ సర్వీసులకు అంతరాయం
సియోల్: ప్రపంచవ్యాప్తంగా సామాజిక నెట్వర్క్ వెబ్సైట్ ఫేస్బుక్ వినియోగదారులు మంగళవారం కొద్దిసేపు ఇబ్బందిపడ్డారు. అమెరికా, ఆసియా, బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో సుమారు 40 నిమిషాలపాటు ఫేస్బుక్ వెబ్సైట్ సరిగా పనిచేయలేదు. సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్ సర్వీసులకు కూడా కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కృషిచేస్తున్నామని తన ట్వీటర్ ఖాతాలో ఇన్స్టాగ్రామ్ వెల్లడించగా, ఫేస్బుక్ మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఫేస్బుక్ సరిగా పనిచేయలేదని ఆసియాలోని కొంతమంది వినియోగదారులు ఫిర్యాదు చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు 125 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌కు 3 కోట్ల మంది వినియోగదారులున్నారు. -
హల్చల్ చేస్తున్న వీడియో!
పాండిచ్చేరిలో బిజీ సెంటర్... అక్కడున్న ఓ మద్యం దుకాణంలోకి ఓ అందమైన అమ్మాయి ఎంటరైంది. ‘బీరు కావాలి?’ అనడిగేసరికి, అందరూ షాక్. డబ్బున్న అమ్మాయిలు కొంతమంది పబ్‌లకెళ్లి, బీరు తాగుతారని తెలుసు కానీ, మరీ ఇలా బహిరంగంగా షాపుకొచ్చి కొనడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకూ ఆ అందమైన అమ్మాయి ఎవరంటే నయనతార. ఇది మళ్లీ షాక్ కదూ. నయనతార ఓ మద్యం దుకాణంలో బీరు కొంటున్న వీడియో యూ ట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. కొంతమంది ఈ వీడియోను పదే పదే చూసి, ఎంజాయ్ చేస్తున్నారు. కొంచెం సంప్రదాయబద్ధంగా ఉండేవాళ్లు మాత్రం ‘హవ్వ. ఎంతకు తెగించింది. మరీ ఇంత విచ్చలవిడితనమా..’ అని నోటికొచ్చినట్లు మాట్లాడుకున్నారు. కానీ, నయనతార మాత్రం హాయిగా నవ్వుకున్నారు. ఎందుకంటే, అసలు విషయం ఏంటో ఆమెకే తెలుసు కనుక. ఇంతకీ ఏంటా విషయం అనుకుంటున్నారా? నయన్ బీరు బాటిల్ కొనడం ఒక నటన. ప్రస్తుతం ‘నానుమ్ రౌడీదాన్’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారామె. ఈ చిత్రంలో నయన్ బీరు సీసా కొనే సన్నివేశాలను ఇటీవల చిత్రీకరించారు. ఈ సన్నివేశాలను ఎవరో చిత్రీకరించి, ఆ వీడియోను బయటపెట్టారు. ఫలితంగా నలుగరి నోళ్లలోనూ నయన్ నానారు. ఈ నెగటివ్ పబ్లిసిటీ కారణంగా నయన్ అనవసరంగా నిందలకు గురయ్యారు కానీ, ఆ సినిమాకి మాత్రం బోల్డంత పబ్లిసిటీ వచ్చింది. -
భారత్‌లో ట్వీటర్ టేకోవర్ బోణీ
* బెంగళూరు స్టార్టప్ జిప్‌డయల్ కొనుగోలు * డీల్ విలువ రూ.247 కోట్లుగా అంచనా... * భారత్‌లో వ్యాపారాభివృద్ధిపై మరింత దృష్టి... న్యూఢిల్లీ: సోషల్ నెట్వర్క్ దిగ్గజం ట్వీటర్.. భారత్‌లో తొలిసారిగా కంపెనీల కొనుగోళ్లకు తెరతీసింది. బెంగళూరుకు చెందిన మొబైల్ మార్కెటింగ్ స్టార్టప్ జిప్డయల్ను చేజిక్కించుకుంది. తద్వారా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్లో వ్యాపారాన్ని, ఆదాయాలను పెంచుకోవడానికి బాటలు వేసుకుంటోంది. ఈ కొనుగోలు విలువ ఎంతనేది ఇరు కంపెనీలూ వెల్లడించనప్పటికీ.. 3-4 కోట్ల డాలర్ల(దాదాపు రూ.185-247 కోట్లు) మేరకు ఉంటుందనేది మార్కెట్ వర్గాల అంచనా. ఈ కొనుగోలు ద్వారా భారత్‌లో తమ వ్యాపారం జోరందుకోవడంతోపాటు, వ్యూహాల అమలును వేగవంతం చేసేందుకు దోహదం చేస్తుందని ట్వీటర్ ఎండీ(ఇండియా, ఆగ్నేయాసియా) రిషి జైట్లీ చెప్పారు. జిప్‌డయల్ సంగతిదీ... వెలెరీ వేగనర్, అమియా పాథక్, సంజయ్ స్వామి... ఈ ముగ్గురూ 2010లో బెంగళూరు కేంద్రంగా దీన్ని ప్రారంభించారు. మొబైల్స్ ద్వారా ఆఫ్‌లైన్, ఆన్లైన్ మధ్య యూజర్లకు వారధిగా పనిచేసేందుకు రూపొందించిన వినూత్న ప్లాట్‌ఫామ్ ఇది. ఎస్ఎంఎస్, వాయిస్, మొబైల్ వెబ్ వంటివాటినన్నింటినీ సమ్మిళితం చేస్తూ తగిన కంటెంట్‌ను మొబైల్ యూజర్లు దీనిద్వారా పొందొచ్చు. యూజర్లు ఏదైనా ఒక బ్రాండ్‌కు సంబంధించిన నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు కంటెంట్‌ను అందుకునే వీలుంటుంది. ఎస్ఎంఎస్, వాయిస్ కాల్ లేదా యాప్ నోటిఫికేషన్ రూపంలో రియల్‌టైమ్‌లో సమాచారం పొందొచ్చు. పీఅండ్‌జీ, క్యాడ్బరీ, యూనిలీవర్, కోల్గేట్, కేఎఫ్‌సీ, మేక్మైట్రిప్ ఇలా వందలాది బ్రాండ్లను క్లయింట్లుగా కొనసాగిస్తున్న జిప్‌డయల్... ప్రస్తుతం దాదాపు 6 కోట్ల మంది యూజర్లతో అనుసంధానమైంది. ఈ సంస్థ ఉద్యోగుల సంఖ్య 50 మంది మాత్రమే. మంచి లాభాలొచ్చాయి...: స్వామి ఈ డీల్ ద్వారా భారతీయ స్టార్టప్స్‌కు శాన్ఫ్రాన్సిస్కో, సిలికాన్ వ్యాలీల్లో ప్రత్యేక గుర్తింపు లభించినట్లయిందని జిప్‌డయల్ సహ వ్యవస్థాపకుడు సంజయ్ స్వామి పేర్కొన్నారు. రీసెర్చ్ సంస్థ ఈ-మార్కెటెర్ అంచనాల ప్రకారం గత ఏడాది చివరినాటికి భారత్‌లో ట్వీటర్కు 1.81 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ప్రపంచంలో ఈ సంస్థకు మూడో అతిపెద్ద మార్కెట్‌గా కూడా భారత్ నిలుస్తోంది. కాగా, యూఎస్‌కు చెందిన ఈ కంపెనీకి ఉన్న మొత్తం 28.4 కోట్ల మందికిపైగా యూజర్లలో 70 శాతం మంది అమెరికా వెలుపలే ఉండటం గమనార్హం. -
యువర్స్ ట్రూలీ...
సోషల్ నెట్వర్కింగ్ విస్తృతం అయ్యాక ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం వంటి ఎన్నో సైట్లు, యాప్స్ ద్వారా ప్రజలు సమాచారం తెలుసుకుంటున్నారు. మరి ఆ సమాచారం నిజమా కాదా అని ఎప్పుడైనా ఆలోచించారా? అలా ఆలోచించిన ఓ యంగ్ టీమ్ సామాన్య ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాలనుకుంటోంది. ఆధారాలతో సహా వాటిని మన ముందుంచేందుకు ‘ఫ్యాక్ట్లీ డాట్ ఇన్’ అనే వెబ్‌సైట్‌ను పారంభించబోతోంది. ఇప్పటికే ఫేస్బుక్లో పెట్టిన ఇన్ఫోగ్రాఫిక్స్‌తో తమ ప్రయత్నానికి విశేష స్పందన వస్తోందని టీమ్ సభ్యులు చెబుతున్నారు. అసత్య సమాచారం, మోసపూరిత ప్రచారాల వలలో సామాన్య ప్రజలు పడకుండా ఉండాలని కోరుకున్న ఓ నలుగురు మిత్రుల ఆలోచనే ఈ ఫ్యాక్ట్లీ డాట్ ఇన్. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కార్యకర్తగా పని చేస్తూ సమాజానికి నిజాలు తెలియజేయడమే తన ధ్యేయమంటున్న 31 ఏళ్ల రాకేశ్‌రెడ్డి దీని వెనుక ఉన్న ప్రధాన చోదక శక్తి. ‘‘సోషల్ నెట్‌వర్క్‌లలో ఏదైనా ఆసక్తికరంగా కనపడితే దానికి లైకులు, షేరింగులు చేయాలన్న తొందరలో అది నిజమా కాదా అని ప్రజలు ఆలోచించడం లేదు. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలోనూ ఈ అసత్య ప్రచారం ఎక్కువైంది. అప్పుడే నాకు ప్రజలకు నిజాలు తెలియజేయాలన్న ఆలోచన వచ్చింది. సమాచారాన్ని ప్రభుత్వ సైట్లు, ఆర్టీఐ ద్వారా మాత్రమే సేకరించి వాస్తవాలను చెప్పాలనుకున్నాం. నా చిన్ననాటి ఫ్రెండ్స్ మనోజ్, శశి, శ్రీనివాస్‌తో కలిసి ఈ ప్రాజెక్టు మొదలు పెట్టాను’’ అని రాకేశ్ చెప్పారు. అతడిది వరంగల్. అక్కడే ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే సమాచార హక్కు చట్టం కోసం పని చేశారు. పదేళ్ల నుంచి ఆర్టీఐ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. ‘‘ఇటీవల భూసేకరణ ఆర్డినెన్స్, ఐఆర్సీటీసీ, ఎయిర్‌పోర్టులు వంటి వాటిపై మేము పెట్టిన ఇన్ఫోగ్రాఫిక్స్కు మంచి స్పందన వచ్చింది. ప్రజలు వారు తెలుసుకున్న సమాచారం నిజమా కాదా అని ఒక్కసారి ఆలోచిస్తే మా ప్రయత్నం విజయం సాధించినట్టే. ఈ మధ్య ఒక జమ్మూ అబ్బాయి ‘దేశంలో రోజుకు ఎంతమంది ఆకలితో పస్తులుంటున్నారు?’ అని అడిగాడు. అలాంటి డేటా ప్రభుత్వం దగ్గర ఉండదు అని అతనికి చెప్పవలసివచ్చినందుకు బాధ కలిగింది కానీ, తనకు సమాచారం తెలుసుకోవాలన్న ఆసక్తి కలగడం ఎంతో సంతోషంగా అనిపించింది’’ అని ఫ్యాక్ట్లీ డాట్ ఇన్ టీమ్ తెలిపింది. ‘‘ప్రస్తుతం కేవలం ఆన్లైన్ ద్వారానే మా ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నాం. తర్వాత గ్రామాల్లోనూ ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని ఎన్జీఓలు, విద్యార్థి సంఘాల సాయంతో తెలియజేసే ఆలోచన ఉంది. నేను, మనోజ్ ఇక్కడ ఉండి పని చేస్తున్నాం. ఇంకో ఇద్దరు అమెరికా నుంచే వెబ్‌సైట్‌కు కష్టపడుతున్నారు. అక్కడి నుంచే ఇన్ఫోగ్రాఫిక్స్ తయారు చేసి పంపిస్తున్నారు. దేనినైనా అప్లోడ్ చేసే ముందు ఆధారాలన్నీ పరిశీలించాకే ఫేస్బుక్లో పెడుతున్నాం. ఎవరికి ఏ సమాచారం తెలిసినా దాన్ని ఆధారాలతో సహా మాకు తెలియజేయాలని ప్రజలను కోరుతున్నాం. ‘ఇది నిజం’ అని మాత్రమే మేము చెబుతున్నాం. అంతే కానీ తప్పొప్పుల గురించి మాట్లాడడం లేదు’’ అని రాకేశ్ వెల్లడించారు. ఫొటోలు: రాజేశ్ రెడ్డి రైతుల ఆత్మహత్యలపై ‘ఫ్యాక్ట్లీ డాట్ ఇన్’ రూపొందించిన ఇన్ఫోగ్రాఫిక్స్ -
సచిన్‌ను అధిగమించిన కోహ్లి
ట్విట్టర్లో అగ్రస్థానం ముంబై: భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి... బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు. అయితే ఇది ఏ పరుగుల విషయంలోనో అనుకుంటే పొరపాటే. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్లో అత్యధిక సంఖ్యలో అభిమానులు కలిగిన భారతీయ క్రీడాకారుడిగా కోహ్లి (@iamvkohli) తొలి స్థానంలో నిలిచాడు. ఈ విషయంలో సచిన్‌ను తోసిరాజని కోహ్లి 48 లక్షల 70 వేల 190 మంది ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. సచిన్‌ను 48,69,849 మంది అనుసరిస్తున్నారు. కెప్టెన్ ధోని (33,27,033), యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టాప్-10 క్రీడాకారుల్లో తొమ్మిది మంది క్రికెటర్లే ఉండగా... ఇతర క్రీడల నుంచి సానియా మీర్జాకు టాప్-10 జాబితాలో చోటు దక్కింది. -
వయసు 21.. ఏడాది వేతనం రూ. 2 కోట్లు
ఫేస్బుక్కులో ఉన్నత ఉద్యోగం మదనపల్లె కుర్రోడికి ఉన్నత ఉద్యోగం చిత్తూరు జిల్లా మదనపల్లె కుర్రోడికి బంపర్ ఆఫర్ వచ్చింది. 21 ఏళ్లకే సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్లో ఉద్యోగం కొట్టేశాడు మదనపల్లెకు చెందిన కే.వినిల్ ప్రతాప్. బోనస్ ఇతర అలవెన్సులతో కలిపి ఏడాదికి రూ.2 కోట్ల భారీ వేతనాన్ని కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు శనివారం నియామకపత్రం వచ్చింది. తొలి నుంచి ప్రతిభావంతుడే.. వినిల్ ప్రతాప్ వయస్సు 21. తొలి నుంచి చదువులో ప్రతిభావంతుడు. నెల్లూరు నారాయణ కళాశాలలో ఇంటర్, ముంబైలోని ఐఐటీలో బీటెక్ చదివాడు. ఆలిండియా స్థాయిలో ఐఐటీ ఎంట్రన్స్ టెస్టులో 67వ ర్యాంకు సాధించాడు. ఎంసెట్‌లో 82వ ర్యాంకు, జాతీయ స్థాయిలో ఏఐ ఈఈఈ ఎంట్రన్స్ టెస్టులో 87వ ర్యాంకు సాధించి ప్రతిభచాటాడు. ఫేస్‌బుక్కుకు ఎంపికైంది ఇలా.. ప్రస్తుతం అతను కాలిఫోర్నియాలో ఫైనల్ ఇయర్ ఎంఎస్ చేస్తున్నాడు. అక్కడ జరిగిన ఫెస్బుక్ క్యాంపస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇతని స్కిల్స్ నచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీరుగా ఎంపికయ్యాడు. బోనస్, ఇతర అలవెన్సులతో కలిపి ఏడాదికి రూ.2 కోట్ల (మూడు లక్షల 30 వేల డాలర్లు) వేతనంతో కూడిన ప్యాకేజీని ప్రకటించారు. ప్లానింగ్‌తో సాధ్యం.. ఉన్నత ఉద్యోగాలు ఒక్కసారిగా రావు. ముందు నుంచి ప్లాన్‌గా సిద్ధపడాలి. కంపెనీల అవసరాలు, ఆలోచనా విధానం గమనించాలి. ఆపై విషయంపై పట్టు ఉండాలి. అప్పుడే మంచి ప్యాకేజీ గల ఉద్యోగాలు సాధ్యం. తన తండ్రి కే.శ్రీనివాసరెడ్డి ప్రోత్సాహంతోనే తాను ఇంతటి స్థాయికి చేరుకున్నానని వినిల్ ప్రతాప్ తెలిపారు. ఎస్‌వీటీఎం, విశ్వంలో సంబరాలు మదనపల్లె సమీపంలోని అంగళ్లు మార్గంలో గల ఎస్‌వీటీఎం ఇంజనీరింగ్ కళాశాల, విశ్వం విద్యా సంస్థల్లో శనివారం సాయంత్రం కోలాహలం నెలకొంది. ఫేస్బుక్ కంపెనీలో భారీ వేతనంతో ఉద్యోగానికి ఎంపికైన వినిల్ ప్రతాప్ తండ్రి కె.శ్రీనివాసరెడ్డి ఈ విద్యా సంస్థలకు ైడె రెక్టరుగా ఉన్నారు. ఇక్కడ సహ అధ్యాపకులతో పాటు కరస్పాండెం ట్ విశ్వం ప్రభాకర్‌రెడ్డి, ఎం.అమరావతమ్మ, ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్, వైస్ ప్రిన్సిపాల్ వెంకట్రమణారెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రఘునాథరెడ్డి, ఏవో శ్రీనివాసులరెడ్డి, క్యాంపస్ మేనేజర్ ముట్ర దామోదర్‌రెడ్డి ఆయన్ను అభినందించారు. విద్యార్థులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. సంతోషంగా ఉంది ఫేస్బుక్లో మంచి వేతనంతో ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. మా స్వస్థలం నెల్లూరు. తండ్రి ఉద్యోగరీత్యా కొన్నేళ్లుగా మదనపల్లెలో స్థిరపడ్డాం. ఇంతకు ముందు కూడా ఇ-బే, గూగుల్‌లో కూడా ఉద్యోగాలకు ఎంపికయ్యా. అయితే ఫేస్బుక్ పనితనం నాకు నచ్చింది. వారికి నా పనితీరు నచ్చింది. అన్నీ కలిపి ఏడాదికి రూ.2 కోట్లు ప్యాకేజీ ఇస్తున్నామని జాయినింగ్ లెటర్ ఇచ్చారు. ఏప్రిల్‌లో యూఎస్‌లో డ్యూటీలో జాయిన్ అవుతా. -కే.వినిల్ ప్రతాప్, మదనపల్లె -
జీమెయిల్ ఇన్‌బాక్స్ ఫీచర్లు భలే!
ఈ కాలంలో ఈ మెయిల్ లేకుండా పని అస్సలు నడవదు. కానీ పని పెరిగిన కొద్దీ మెయిల్ ఇన్‌బాక్స్ కూడా గందరగోళమైపోతుంది. అవసరమైన మెయిల్ సమయానికి చిక్కదు. ఏది ఉంచుకోవాలో, ఏది తొలగించుకోవాలో తెలియని స్థితిలో అన్ని మెయిళ్లూ పేరుకుపోయి చికాకు పెడుతూంటాయి. ఈ ఇబ్బందుల నుంచి కొంతైనా ఉపశమనం పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే జీమెయిల్ ఇన్‌బాక్స్‌ను వాడటం మొదలుపెట్టండి. ఇటీవలే ప్రవేశపెట్టిన ఈ సరికొత్త మెయిల్లోని ఫీచర్లు భలేగా ఉన్నాయి. అవేమిటో మీరూ చూసేయండి మరి... ‘పిన్’లతో మతిమరుపునకు చెక్!: ముఖ్యమైన మెయిళ్లకు రిప్లై ఇవ్వడం మరచిపోతున్నారా? అయితే పిన్ ఫీచర్ గురించి మీకు తెలియదన్నమాట. ఇన్‌బాక్స్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను వాడుకుంటే మీ మతిమరుపునకు అది ఎప్పటికప్పుడు చెక్ పెడుతుంది. మీరు గుర్తుంచుకోవాలని అనుకుంటున్న మెయిల్‌పై కర్సర్‌ను కదిలిస్తే పిన్ కనిపిస్తుంది. దాన్ని ఒక్కసారి మెయిల్‌పై నొక్కితే చాలు.. అ తరువాత ఆ మెయిల్ ఇన్‌బాక్స్ మొదట్లో, మధ్యలో ప్రత్యేకంగా వేలాడుతూ కనిపిస్తుంటుంది. మీ దృష్టిని ఆకర్షిస్తుంది. పిన్ తొలగించేంతవరకూ అలాగే ఉంటుంది. దీంతో మీరు కచ్చితంగా ఈ మెయిల్‌కు స్పందించకమానరు. స్వీప్ చేసేస్తుంది మెయిళ్లన్నింటినీ ఒక్కసారిగా బండిల్ చేసి ఆర్కైవ్స్‌లో పడేసేందుకు పనికొచ్చే ఫీచర్ ఇది. సోషల్ నెట్వర్కింగ్ సైట్ల నుంచి వచ్చే ఇన్విటేషన్లుగానీ ఇతర సమాచారాన్ని గానీ గంపగుత్తగా ఇన్‌బాక్స్ నుంచి వేరు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఒక్కో మెయిల్‌ను చూసి భద్రపరచుకోవాలా? వద్దా? అన్నది నిర్ణయించుకునే అవసరం తప్పుతుందన్నమాట. ఒకవేళ మీరు పొరబాటున ముఖ్యమైన మెయిళ్లతో (పిన్ చేసినవి) కలిపి స్వీప్ చేసినా... ఆ మెయిళ్లు మినహా మిగిలినవి మాత్రమే బండిల్ అవడం విశేషం. కట్టకట్టేసి ఇన్‌బాక్స్‌లో ఉన్న మరో మంచి ఫీచర్ బండిల్! పేరులో ఉన్నట్లే ఈ ఫీచర్ మన మెయిళ్లన్నింటినీ ప్రైమరీ, సోషల్, ప్రమోషన్స్ అన్న మూడు వర్గాలుగా విభజించి చూపుతుంది. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల సమాచారం, పోస్ట్‌లు అన్నీ సోషల్ ట్యాబ్ కింద, కంపెనీలు పంపే వ్యాపార మెయిళ్లన్నీ ప్రమోషన్‌లోనూ పడిపోతాయి. ఇవేకాకుండా ట్రావెల్, ఫైనాన్స్, పర్చేజెస్, అప్డేట్స్ అన్న ఇతర కేటగిరీలుగానూ విభజించుకునే వెసులుబాటు ఉంది. జాబితాలోనే మెయిల్ లింక్‌లు అందిన ప్రతిమెయిల్ను తెరవడం.. అందులో ఇతర పేజీలకు లింక్లేవైనా ఉంటే వాటిని క్లిక్ చేసి చూడటం... ఇది మనం మామూలుగా చేసే పని. జీమెయిల్ ఇన్‌బాక్స్ వ్యవహారం కొంచెం వేరు. ఇందులోని ప్రీవ్యూ ఫీచర్ ద్వారా మెయిల్ జాబితాలోలోనే కొంచెం పక్కగా ఆ మెయిల్లో ఉండే లింక్‌లు కనిపిస్తూంటాయి. మెయిల్ సబ్జెక్ట్, లింక్ ఏమిటన్నది చూసుకుని అవసరమైతే నేరుగా లింక్‌నే ఓపెన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే అక్కడికక్కడే తొలగించుకోనూ వచ్చు. -
సామాజిక న్యాయానికి నిర్వచనం
ఇంతవరకూ న్యాయమూర్తులు తీర్పులు చెప్పడానికే పరిమితమైపోయారు. కాని న్యాయ మూర్తులుగా మన పని సామాజిక వ్యవస్థను సమూలంగా మార్చడంగా ఉండాలి’’ అని కృష్ణయ్యర్ దండోరా వేశాడు. సామాజిక సమస్యలకు, రాజ్యాంగ నిబంధనలకు ప్రజా ప్రయోజనాల భాష్యం చెప్పుకుంటూ పోయాడు. పాలక వర్గాలకు రుచించని అనేక తీర్పులను నిర్మొహమాటంగా చెప్పిపోయాడు. పాలక వర్గాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలను రాజ్యాంగ పరిమితులలో ఎదుర్కొంటూనే... న్యాయ సమానత్వం, వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కులకు సామాన్యుని ప్రయోజనం లక్ష్యంగా చైతన్యపూరితమైన అర్థాన్ని కల్పించాడు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానా న్ని 1973 జూలై 17న అధిష్టించి, తొలి ఏడేళ్ల లోపే ఆ స్థానం నుంచి అత్యంత విశిష్టమైన 724 తీర్పులు, విస్పష్టమైన ఆలోచనాత్మక భావప్రకటనలూ, వ్యాఖ్య లూ సకాలంలో వెలువరించి ప్రపంచ న్యాయకోవిదులచే ‘ఔరా’ అనిపించు కున్న సుప్రసిద్ధ న్యాయమూర్తి జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్. కేరళలో ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ ముఖ్యమంత్రిగా ఏర్పడ్డ దేశంలోని తొలి కమ్యూనిస్టు ప్రభు త్వంలో న్యాయశాఖ సహా, హోం, సాంఘిక సంక్షేమం, నీటిపారుదల శాఖలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించి ఖ్యాతిగన్న వాడాయన. శత వృద్ధుగా కొలది రోజుల నాడు పరమపదించారు. కృష్ణయ్యర్ ఒక సాధారణ వ్యక్తిగా మరణిస్తే మనం ఆ మేరకు నివాళులర్పిస్తాం. కాని కృష్ణయ్యర్ ప్రజాస్వామ్య ఉద్యమాలకు, న్యాయశాస్త్ర నియమ విలువల వ్యాప్తికి, అభ్యుదయకర శక్తులకు, వారి పోరాటాలకు, పౌర హక్కుల సంఘాలకు, మహిళా ఉద్యమాలకు అండగా నిలబడిన అరుదైన విశిష్ట వ్యక్తి. 99వ ఏట కూడా విద్యార్థి యువజన, పారి శ్రామిక, వ్యవసాయ కార్మిక ఉద్యమాల సామంజస్యాన్ని సమర్థించడమే తన వృత్తి ధర్మంగా శ్వాసించిన అఖండ మేధావి! వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రు లకు, దేశ ప్రధాన మంత్రులకు కృష్ణయ్యర్ ఒక దేశభక్తుడిగా, విశ్రాంత న్యాయ మూర్తిగా క్లిష్ట ఘట్టాలలో వివిధ ప్రజా సమస్యలపైన ప్రజాశ్రేయస్సునాశించి ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు. మేధావిగా, బాధ్యతగల పౌరునిగా కృష్ణయ్యర్ కార్యక్షేత్రం ఒకటి కాదు. న్యాయశాస్త్ర విషయాలతోనే సరిపెట్టుకోకుండా, వాటిని సామాజిక, ఆర్థిక, తాత్త్విక, సాహిత్యాదిరంగాలకు పరివ్యాప్తం చేసుకుని తన వృత్తి జీవితాన్ని పరి పుష్టం చేసుకున్నవాడాయన. మనో దిఙ్మండలాన్ని విస్తృతం చేసుకున్నవారా యన. మార్క్సిజం ఆయన దృక్కోణం. ‘‘ఇంత వరకు తత్వవేత్తలు ప్రపంచానికి భాష్యం చెప్పడానికే పరిమితమై పోయారు. ఇక నుంచి వారి పని - ప్రపంచాన్ని మార్చడం’’గా ఉండాలని కారల్ మార్క్స్ అంటే, దాన్ని న్యాయవ్యవస్థకు అనువర్తింపచేసి ‘‘ఇంతవరకూ న్యాయమూర్తులు తీర్పులు చెప్పడానికే పరిమి తమైపోయారు. కాని న్యాయమూర్తులుగా మన పని సామాజిక వ్యవస్థను సమూలంగా మార్చడంగా ఉండాలి’’ అని ఆయన దండోరా వేశాడు. ఈ లక్ష్యా నికి అనుగుణంగానే ఆయన సామాజిక సమస్యలను, భారత రాజ్యాంగ నిబం ధనలకు, రాజ్యాంగానికి ప్రజా ప్రయోజనాల భాష్యం చెప్పుకుంటూ పోయా డు. పాలక వర్గాలకు రుచించని అనేక తీర్పులను నిర్మొహమాటంగా చెప్పిపోయాడు. మానవతా న్యాయమూర్తి పాలక వర్గాల ప్రజావ్యతిరేక నిర్ణయాలను రాజ్యాంగ పరిమితులలోనే నిరంతరం ఎదుర్కొంటూ రాజ్యాంగ అధికరణలకు, ముఖ్యంగా ‘చట్టం ముందు అందరూ సమానులే’నని చాటే 14వ అధికరణకు, వ్యక్తి స్వేచ్ఛను, జీవించే హక్కునూ గ్యారంటీ చేస్తున్న 21వ అధికరణకు సామాన్యుని ప్రయోజనం లక్ష్యంగా చైతన్యపూరితమైన అర్థ గౌరవాన్ని కల్పించినవాడు కృష్ణయ్యర్. అందుకే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సహా, దేశంలోని పలు హైకోర్టు బార్ అసోసియేషన్లు ఆయనను ‘‘మానవతా న్యాయమూర్తి’’గా సంబోధించుకుంటూ వచ్చాయి. భావప్రకటనా స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా గుర్తించడమంటే, పౌరులకు స్వేచ్ఛగా న్యాయం పొందే అవకాశమని ఆయన భావించాడు. పౌరునికి ఉండవలసిన ఈ రెండు రకాల స్వేచ్ఛను కోర్టు ధిక్కార నేరంగా, న్యాయస్థానాలపై విమర్శగా భావించడాన్ని తూర్పారబట్టాడు. ఈ పరిధిలోనే పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు ఆయన ముందుకొచ్చాడు. అలా అని నిరాధార ఆరోపణలతో న్యాయస్థానాలపైన, న్యాయమూర్తుల తీర్పులపైన విరుచుకుపడే కొన్ని పత్రికలు, కొందరు పాలకుల ధోరణినీ సహించినవాడు కాడు. అయితే న్యాయస్థానాలపై సహేతుకమైన విమర్శను ఆయన ఎన్నడూ కాదనలేదు. న్యాయమూర్తులకు లేదా కోర్టు తీర్పులకు ‘మోటివ్స్’ అంటగట్ట కుండా ఎంతగానైనా విమర్శించే హక్కును ఆయన గౌరవించాడు! అందుకే సుప్రసిద్ధుడైన బ్రిటిష్ న్యాయమూర్తి లార్డ్ డెన్నింగ్ ఒక సందర్భంగా కృష్ణయ్యర్‌కు రాసిన లేఖలో, న్యాయమూర్తిగా ‘‘పూర్తి సమయాన్ని సద్వినియో గం చేస్తున్న వ్యక్తి మీరు. మానవ హక్కుల గురించి, న్యాయచట్టాలపైన మీరు రాసిన గ్రంథం అనేక దేశాల ప్రజలకు అత్యంత విలువైనదిగా భావిస్తున్నాను. న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో మీ భావధార, మీ తీర్పులూ ప్రశంసలు పొందాయి. మీ న్యాయశాస్త్ర పరిజ్ఞానం ఇతరులకు మార్గదర్శకం కావాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నాడు! న్యాయ నిఘంటువుకు నూతన పెన్నిధి ఈ సునిశితమైన మానవతా కోణం ఆయనకు అబ్బడానికి మరో కారణం- తొలి నుంచీ కృష్ణయ్యర్‌కు ఆది హైందవమైన బౌద్ధ ధర్మంపైన ప్రగాఢమైన విశ్వాసం కూడా. నిజానికి బౌద్ధం ప్రభావంలోనే ఆయనకు, చరిత్రాధ్యయనంలో మార్క్సిస్టు సులోచనాలు తోడు నీడయ్యాయని చెప్పాలి! కనుకనే రాజ్యాంగ పరిమితులలోనే ధర్మాసన చైతన్యాన్ని పెంచడానికి, ప్రజాప్రయోజన వ్యాజ్యాల (పిల్స్) ద్వారా నిస్తేజంగా పడివున్న చట్టాన్ని, న్యాయవ్యవస్థను చైతన్యంలోకి నెట్టడానికి కృషి సల్పారు. ఈ కర్తవ్యంలో ఆయనకు తోడుగా నిలిచిన వారు, ‘పిల్’ ప్రక్రియకు ఆద్యులూ జస్టిస్ భాగవతి, జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా. భావ వ్యక్తీకరణలోనే కాదు, అందుకు తోడు నీడైన భాషా మాధ్యమం వినియోగంలో కూడా కృష్ణయ్యర్ విలక్షణమైన పోకడలు పోయాడు. నూతన పదసృష్టికి, పదబంధాలకు దోహదం చేశాడు. న్యాయశాస్త్ర నిఘంటువుకు అనేక టెలిస్కోపిక్ పదాలను సృష్టించి, శ్రీశ్రీ మాదిరిగా భావప్రక్రియా సాధనాలుగా వదిలాడు. ఉదాహరణకు తీర్పులలో భాగంగానూ, అన్యధానూ ‘ఫార్మకోపిక్ ప్లూరలిజం’ అనీ, ‘ఫార్మలోపిక్ స్వరాజ్’ అనీ ప్రయోగించాడు. భోపాల్ గ్యాస్ వల్ల ప్రజలకు కలిగిన ఘోర విషాదాన్ని హిరోషిమాపై అమెరికా తొలి అణుబాంబు ప్రయోగం ద్వారా కలిగిన మానవతా మారణ హోమంతో పోల్చి ‘భోపోషియా’ అన్న పదాన్ని సృష్టించాడు. వెలుగులు చిమ్ముకుంటూ రాలిన ఉల్క ఇలా కృష్ణయ్యర్ తన పదజాల సృష్టితో జాతీయ రాజకీయ, ఆర్థిక సాంఘిక, సాంస్కృతిక పరిణామ క్రమంలో ఎదురైన ముఖ్య ఘటనలు, సన్నివేశాలపైన వ్యాఖ్యానించకుండా ఉన్న సందర్భాలు చాలా తక్కువ! అమెరికా, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పారిశ్రామిక యుగం ఫలితాలు బడుగు దేశాలకు అంద కుండా చేయడానికి ప్రవేశపెట్టిన సరికొత్త ఫార్ములా ‘మేధా సంపద!’ బడుగు వర్ధమాన దేశాల జీవవైవిధ్య సంపదను కాజేయాలంటే సృష్టికి దోహదం చేసే మౌలిక ప్రక్రియలపైనే తమకు ఆధిపత్యం కావాలని బహుళజాతి గుత్త కంపెనీలు కోరుకుంటున్నాయి. ఇందుకై వస్తూన్న విదేశీ ఒత్తిళ్లకు లొంగి స్థానిక జీవ వైవిధ్య సంపదను ధారాదత్తం చేయరాదని కృష్ణయ్యర్ చెప్పాడు. కృష్ణయ్యర్ మాదిరి ఇలా ఎన్నెన్ని కోణాల నుంచో న్యాయమూర్తి స్థానంలో నిలిచి సామాజిక, ఆర్థిక, రాజకీయ పునాదిపై అభిప్రాయాలను పెంచుకుని, క్రోడీకరించుకున్న వారు తక్కువ. సుప్రసిద్ధ ఆంగ్ల శ్రామికవర్గ నవలాకారుడు జాక్ లండన్ అన్నట్టు ‘‘మానవుడు మందకొడిగా ఒక శాశ్వత గ్రహంగా మిగిలిపోయేకంటే, జగజ్జేగీయమానంగా వెలుగులు చిమ్ముకుంటూ రాలిపోయే ఉల్కగా మారాలి. మనిషన్నవాడు జీవిస్తే చాలదు, చైతన్యం లేని బతుకీడ్చడం కాదు.’’ అలా చైతన్యంతో రాలిన మరో ఉల్కే.. కృష్ణయ్యర్. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
అంతరిక్షం నుంచి సెల్ఫీ తీసుకుంటారా...
సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, స్మార్ట్ఫోన్ల హవా కారణంగా సెల్ఫీల ట్రెండ్ ఊపందుకుంది. దీనిని ముందే అంచనా వేశారు కాబట్టే.. అక్కడా ఇక్కడా తీసుకుంటే ఏం మజా ఉంటుంది? ఏకంగా అంతరిక్షం నుంచే సెల్ఫీ(స్వీయ చిత్రం) తీసుకుంటే అదిరిపోదూ? అంటూ 2011లోనే రంగంలోకి దిగారు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ మాజీ విద్యార్థులు అలెక్స్ బేకర్, క్రిస్ రోస్‌లు. ఫొటోలు, వస్తువులను స్పేస్ బెలూన్‌కు కట్టి పైకి పంపడం, బెలూన్‌కు అమర్చిన కెమెరాలు, ఫోన్లతో అంతరిక్షంలో సెల్ఫీలు క్లిక్‌మనిపించడం, బెలూన్ నేలపై పడిన తర్వాత జీపీఎస్, గాలివాటం ఆధారంగా వస్తువులను వెతికి పట్టుకోవడం. రోజూ ఇదే పని వీరికి. ఇప్పుడిదే వీరికి వ్యాపారం అయింది. ఆసక్తి ఉన్నవారు సంప్రదిస్తే ఫొటోలు, వస్తువులను రోదసికి పంపించి అందమైన సెల్ఫీలను తీసిస్తారు. చనిపోయినవారి అస్థికలనూ పైకి పంపుతామని అంటున్నారు. ఒక్కసారి మన వస్తువులను పైకి పంపాలంటే రూ. 39 లక్షలు వసూలు చేస్తారు. మనమే పంపించుకుంటామంటే రూ. 48 వేలకే స్పేస్ బెలూన్లు ఇస్తారు. ఇంతవరకూ ఒకసారి తప్ప, అన్నిసార్లూ రోదసికి పంపించిన వస్తువులను వీరు తిరిగి పట్టుకోగలిగారట. -
హ్యాట్సాఫ్ వాట్సాప్..
ఉత్తరాలతో సమాచారం చేరవేత అంతంతే, టెలిగ్రామ్ వ్యవస్థే నిలిచిపోయె! మరి అత్యవసర వార్తలు చేరేదెలా? ఎస్టీడీ బూత్‌లు, కాయిన్ బాక్స్లకూ కాలం చెల్లింది.. ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ నెట్వర్కింగ్ సిస్టమే. అందరికీ అరచేత అందుబాటులోకి వచ్చింది. కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకునేందుకు యువత, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇంటర్నెట్ వర్కింగ్ సైట్లలో వాట్సాప్ నెట్వర్క్ అందుబాటులోకి రావడంతో సమాచారాన్ని చేరవేసేందుకు మార్గం మరింత సుగమం అయింది. - సిద్దిపేట రూరల్ సాధారణ పద్ధతిలో మొబైల్ నెట్‌వర్క్‌లో మెసేజ్‌లు పంపాలంటే దానికి నిర్దేశించిన ధర చెల్లించాల్సి వస్తుంది. అధికంగా ఎస్ఎంఎస్లు పంపాలంటే ఎస్ఎంఎస్ ఆఫర్ వేసుకోవాల్సి ఉంటుంది. అయితే, వాట్సాప్ రావడంతో అటు వంటి ఆఫర్ల అవసరం లేకుండా పోయింది. మొదట్లో నెలకు రూ.10 చొప్పున చెల్లించాల్సి వచ్చినప్పటికీ ఇప్పు డు అంతా ఉచితం అయిపోయింది. ఈ వాట్సాప్ ద్వారా టెక్ట్స్ మెసేజ్‌లే కాకుండా ఫొటోలు, చిన్నచిన్న వీడియో క్లిపింగ్‌లు క్షణాల్లో అవతలి వ్యక్తులకు చేరవేసే అవకాశం కలిగింది. ఈ సోషల్నెట్ వర్క్ వల్ల కొన్ని అనర్థాలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ఉపయోగమే ఉందనే భావన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. అందరికీ భలే యూజ్.. వాట్సాప్ నెట్‌వర్క్‌ను అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది ఒక గ్రూపుగా ఏర్పడి వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసుకుంటున్నారు. పనులను చక్కబెట్టుకుంటున్నారు. అలాగే విదేశాల్లో ఉన్నవారు రోజువారీ కార్యకలాపాలను ఫొటోలు, వీడియోల రూ పంలో వాట్సాప్‌లో పంపిస్తున్నారు. షాపింగ్‌లో ఏదైనా వస్తువులు, దుస్తులు కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడో ఉన్న తమ కుటుంబ సభ్యులకో, ఇష్టమైన స్నేహితులకో చూపించి వారి చాయిస్‌కు అనుగుణంగా వా ట్సాప్ ద్వారా అప్పటికప్పుడే ఫొటోలు తీసి పంపించి, వారి అ భిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. గ్రూపు చాట్స్, లొకేషన్ షేర్ చేసుకోవడం, ఫొటోలు, వీడియోలు పంపించుకోనే వీలుంటుంది. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సమాచారవ్యవస్థ అందుబాటులోకి రావడంతో వ్యక్తులు, వ్యవస్థల మధ్య దూరం తగ్గిపోయి సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఎంతో ఉపయోగం.. వాట్సాప్ నెట్వర్కింగ్ వ్యవస్థతో సమాచారం చేరవేయడం సులభతరమైంది. పైసా ఖర్చు లేకుండా నెట్లో సమాచారాన్ని పంపిస్తూ పనులు చక్కబెడుతున్నాం. సోషల్ నెట్వర్కింగ్ వ్యవస్థను సద్వినియోగపర్చుకుంటే సమాజంలో మంచి మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంది. - చంద్రోజు శ్రీనివాస్, టీచర్ క్షణాల్లో సమాచారం.. వాట్సాప్ సోషల్ నెట్‌వర్కింగ్‌ను ఉపయోగించుకోని ఫొటోలు, వీడియోలను క్షణాల్లో పంపించవచ్చు. ఈ సదుపాయాన్ని వివిధ ప్రభుత్వ శాఖల్లోను, మీడియా, ఇతర వర్గాలు చక్కగా సద్వినియోగపర్చుకుంటున్నాయి. పని సులభమైంది. డబ్బుల ఖర్చు తగ్గింది. - రాజేంద్రప్రసాద్, ఎస్ఐ సిద్దిపేట రూరల్ -
ఫేస్బుక్ హవా తగ్గుతోంది !
న్యూఢిల్లీ: సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ముఖ్యంగా ఫేస్బుక్ హవా తగ్గుతోంది. మిత్రులతో కమ్యూనికేషన్ల కోసం ఫేస్బుక్, గూగుల్ ప్లస్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల కంటే కూడా వుయ్ చాట్, వాట్సాప్‌లను వినియోగించుకునేవారి సంఖ్య పెరుగుతోంది. యువతలో ఈ పోకడ అధికంగా ఉందని గ్లోబల్వెబ్ ఇండెక్స్(జీడబ్ల్యూఐ) రీసెర్చ్ తెలిపింది. ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో 42 వేల మంది(5,000 మంది భారతీయులు)పై నిర్వహించిన సర్వే ముఖ్యాంశాలు..., సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ల యాక్సెస్ ప్రపంచవ్యాప్తంగా 187 శాతం పెరగ్గా, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 242 శాతం పెరిగింది. ఇంటర్నెట్ను ఉపయోగించే వాళ్లలో 83 శాతం మందికి ఫేస్బుక్ అకౌంట్లున్నాయి. వీరిలో 47 శాతం మంది మాత్రమే వీటిని చురుకుగా ఉపయోగిస్తున్నారు. ఇక భారత్ విషయానికొస్తే, ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్న వాళ్లలో 93 శాతానికి ఫేస్బుక్ ఖాతాలున్నాయి. వీటిని చురుకుగా ఉపయోగిస్తున్నవారు 48 శాతం మాత్రమే. ఫేస్బుక్ ద్వారా మిత్రులకు మెసేజ్‌లు పంపే వారి సంఖ్య తగ్గుతోంది. గత ఏడాది క్యూ1లో 51.2 కోట్లుగా ఉన్న వీరి సంఖ్య అదే ఏడాది క్యూ4లో 40 కోట్లకు, ఈ ఏడాది క్యూ3లో 31.3 కోట్లకు తగ్గింది. వుయ్‌చాట్, వాట్సాప్‌ల వంటి మొబైల్ మెసేజింగ్ సర్వీసులు ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది క్యూ1లో 44.6 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య అదే ఏడాది క్యూ4లో 53.8 కోట్లకు, ఈ ఏడాది క్యూ3లో 61.6 కోట్లకు పెరుగుతోంది. -
ఫేస్ బుక్ లో సరికొత్త వీడియో క్రియేషన్ ఆప్షన్!
న్యూయార్క్: జీవితంలోని మధుర అనుభూతుల్ని, సంఘటనల్ని వీడియోల ద్వారా పంచుకోవడానికి వినియోగదారులకు 'వీడియో క్రియేషన్' టూల్ ను ఫేస్ బుక్ అందుబాటులోకి తెచ్చింది. తాము పోస్ట్ చేసిన సందేశాల్ని, ఫోటోలను, కొత్త థీమ్స్ ను కలిపి వ్యక్తిగతంగా ఓ వీడియో రూపొందించుకోవడానికి 'సే థ్యాంక్స్' అనే కొత్త ఆప్షన్ ను ప్రారంభించింది. తమ వ్యక్తిగత, మిత్రుల టైమ్ లైన్స్ పై వీడియోలను షేర్ చేసుకోవడానికి వినియోగదారులకు ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. వీడియో క్రియేట్ చేసుకోవడానికి ఫేస్ బుక్ లో www. facebook.com/thanks పేజికి వెళ్లి వీడియోను రూపొందించుకోవచ్చు. వ్యక్తులతో ఉన్న బంధాలు, సంబంధాలకు అనుగుణంగా ఫోటోలను ఎడిట్ చేసుకోవడానికి, వివిధ థీమ్స్ లలో వీడియోను రూపొందించుకోవడానికి కూడా ఫేస్ బుక్ అవకాశం కల్పించింది. వీడియోను రూపొందించిన తర్వాత పర్సనల్ మెసేజ్ ను కూడా పంపించుకోవడానికి అవకాశం ఉంది. కొత్త ఆప్షన్ ఇంగ్లీష్, ఫ్రాన్స్, జర్మన్, ఇండోనేషియా, ఇటలీ, పోర్చుగీస్, స్పానిష్, టర్కీ దేశాల్లో డెస్క్ టాప్, మొబైల్ ద్వారా ఫేస్ బుక్ అందుబాటులోకి తెచ్చింది. -
వాట్సాప్.. అంతా ఉచితం
* సోషల్ నెట్‌వర్క్‌పై పెరుగుతున్న ఆసక్తి * అందుబాటులోకి సమాచార వ్యవస్థ *టెక్నాలజీని సద్వినియోగపర్చుకొంటున్న వైనం కంచిలి: పావురాలతో కబురుపంపడం, ఉత్తరాలతో సమాచారం చేరవేయడం, టెలిగ్రామ్‌తో అత్యవసర వార్తలు అందజేసే కాలం పోయింది... ఎస్టీడీ బూత్‌లు, కాయిన్ బాక్సులకు కాలం చెల్లింది... ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ నెట్వర్కింగ్ సిస్టం అందుబాటులోకి వచ్చింది. కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకునేందుకు యువత, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పోటీ పడుతన్నాయి. ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకుంటూ ఖర్చు, కాలాన్ని తగ్గించుకుంటున్నాయి. సోషల్నెట్వర్కింగ్ సైట్లలో వాట్సాప్ నెట్వర్క్ అందుబాటులోకి రావడంతో సమాచారాన్ని చేరవేసేందుకు మార్గం మరింత సుగుమం అయింది. సాధారణ పద్ధతిలో మొబైల్ నెట్‌వర్క్‌లో మెసేజ్‌లు పంపాలంటే నెలకు ఇన్ని మాత్రమే ఉచితం, ఇంకా కావాలంటే దానికి నిర్దేశించిన ధర చెల్లించాల్సి వస్తుంది. అధికంగా ఎస్ఎంఎస్లు పంపాలంటే ఎస్ఎంఎస్ ఆఫర్ వేసుకోవాల్సి ఉంది. అయితే, వాట్సాప్ రంగప్రవేశంతో అటువంటి నిబంధనలేవీ అవసరం లేదు. మొదట్లో నెలకు పది రూపాయలు చొప్పున చెల్లించాల్సి వచ్చినప్పటికీ, ఇప్పడు అంతా ఉచితం అయిపోయింది. ఈ వాట్సాప్ ద్వారా టెక్స్ట్ మెసేజ్‌లే కాకుండా ఫొటోలు, చిన్నచిన్న వీడియోలు క్షణాల్లో అవతలివారికి చేరవేసే అవకాశం కలిగింది. ఈ సోషల్నెట్ వర్క్ వల్ల కొన్ని అనర్థాలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ఉపయోగమే ఉందనే భావన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. అన్నివర్గాలకూ వినియోగమే... వాట్సాప్ నెట్‌వర్క్‌ను జిల్లాలో రెవెన్యూ శాఖ విరివిగా ఉపయోగిస్తోంది. కలెక్టర్, ఆర్డీవోలు, తహశీల్దార్, రెవెన్యూ సిబ్బంది అంతా ఒక గ్రూపుగా ఏర్పడి వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసుకుంటున్నారు. పనులను చక్కబెట్టుకుంటున్నారు. అలాగే, జిల్లాలోని జర్నలిస్టులంతా ఒక గ్రూప్‌గా ఏర్పడి ఈ నెట్వర్క్ ద్వారా వార్తాంశాలను, న్యూస్ఫొటోస్ను షేర్ చేసుకొంటున్నారు. విదేశాల్లో ఉన్నవారు రోజువారీ కార్యకలాపాలను ఫొటోలు, వీడియోల రూపంలో వాట్సాప్‌లో పంపించుకుంటున్నారు. షాపింగ్‌లో ఏదైనా వస్తువులు, దుస్తులు కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడో ఉన్న తమ కుటుంబ సభ్యులకో, ఇష్టమైన స్నేహితులకో చూపించుకొని వారి చాయిస్‌కు అనుగుణంగా వాట్సాప్ ద్వారా అప్పటికప్పుడే ఫోటోలు తీసి పంపించి, వారి అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. గ్రూప్ చాట్స్, లొకేషన్ షేర్ చేసుకోవడం, ఫొటోలు, వీడియోలు పంపించుకొనే వీలుంటుంది. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సమాచారవ్యవస్థ అందుబాటులోకి రావడంతో వ్యక్తులు, వ్యవస్థల మధ్య దూరం రోజురోజుకూ తగ్గిపోతోంది. సంబంధాలు మెరుగుపడుతున్నారుు. వాట్సాప్‌తో ఎంతో ఉపయోగం వాట్సాప్ నెట్వర్కింగ్ వ్యవస్థతో సమాచారం చేరవేయడం సులభతరమైంది. పైసా ఖర్చులేకుండా నెట్లో సమాచారాన్ని పంపిస్తూ పనులు చక్కబెడుతున్నాం. సోషల్ నెట్వర్కింగ్ వ్యవస్థను సద్వినియోగపర్చుకొంటే సమాజంలో మంచి మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంది. - కె. వెంకటసురేష్, ఎస్ఐ, కంచిలి క్షణాల్లో సమాచారం... వాట్సాప్ సోషల్ నెట్‌వర్కింగ్‌ను ఉపయోగించుకొని ఫొటోలు, వీడియోలను క్షణాల్లో పంపించవచ్చు. ఈ సదుపాయూన్ని వివిధ ప్రభుత్వ శాఖల్లోను, మీడియా, ఇతర వర్గాలు చక్కగా సద్వినియోగపర్చుకొంటున్నాయి.పని సులభమైంది. డబ్బుల ఖర్చు తగ్గింది. - రాంబాబు, పంచాయతీ కార్యదర్శి, మఖరాంపురం -
దెయ్యాల గోల..!
ఈ వారమంతా దెయ్యాల గోలతో బాలీవుడ్ షేకైపోయింది. ఏ పార్టీకెళ్లినా... ఎవర్ని చూసినా... భూతాలు, పిశాచాల్లా భయపెట్టేశారు. సమాధులు, బూజు పట్టిన బురుజుల సెట్టింగుల్లో చిందులేసి దుమ్ములేపారు. ప్రియాంకాచోప్రా, సన్నీ లియోన్, బిపాసాబసు... ఎవరూ మినహాయింపు లేదు. ఎవరి ఫ్రెండ్ సర్కిల్‌తో వారు మాస్క్‌లేసుకుని తెగ ఎంజాయ్ చేశారు. హాలోవీన్ ఫెస్టివల్లో భాగమిదంతా! ఆ ఉత్సాహం అంతటితో ఆగలేదు. ఆ ఫొటోలను ఇదిగో ఇలా సోషల్ నెట్‌వర్క్‌ల్లో పోస్ట్ చేసి ప్రపంచమంతా ఫియర్ ఫీవర్ పాస్ చేశారు. -
ఆన్లైన్ ప్రిడేటర్స్
అంతర్జాలానికి అతుక్కుపోతున్న టీనేజర్లు ఏ మాయలో పడతారోనని తల్లిదండ్రులు పడే దిగులు అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా, చాటింగ్‌ల ద్వారా వారు సెక్సువల్ విక్టిమ్స్‌గా మారుతున్నారన్నది అధ్యయనాలలో తేలిన విషయం. అలా సోషల్ నెట్‌వర్క్‌ల ద్వారా పిల్లలను ట్రాప్ చేసే ఆన్లైన్ సెక్సువల్ ప్రిడేటర్స్ గురించి అవగాహన కల్పించేందుకు రూపొందిన ‘ఆన్లైన్ ప్రిడేటర్స్’ షార్ట్ ఫిలిం నెటిజన్స్ నుంచి బెస్ట్ వీడియోగా అభినందనలు అందుకుంటోంది. మలయాళ ప్రసిద్ధ దర్శకులు శ్యాంప్రసాద్ డెరైక్ట్ చేసిన ఈ చిన్ని సినిమాను పృథ్వీ, పార్వతి లాంటి సినీ నటులు ప్రమోట్ చేస్తున్నారు. తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ నుంచి ప్రైవసీ కోరుకుంటూ, ఫోన్లో చాట్ చేస్తుంటుంది టీనేజ్ అమ్మాయి శిఖా. క్లాస్ రూమ్‌లో, ఇంట్లో, ఆట స్థలంలో... అన్ని చోట్లా ఆ అమ్మాయి ఆసక్తి చాటింగ్ పైనే. చుట్టూ ఉన్నవారంతా ఆమెలో వచ్చిన తేడాను స్పష్టంగా తెలుసుకుంటారు. హఠాత్తుగా సాఫీగా సాగుతున్న చాటింగ్ కాస్తా ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. మార్ఫ్ చేసిన చిత్రాలు ఆమె ఫోన్లో ప్రత్యక్షమవుతాయి. అతను కోరినట్లుగా కలవకపోతే, ఈ చిత్రాలతో ఏదైనా జరగవచ్చని సందేశం పరమార్థం. ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక శిఖ... అతను కోరి విధంగా కలవడానికి సిద్ధమవుతుంది. అదృష్టవశాత్తు ఆ అమ్మాయిని వెంబడిస్తూ వచ్చిన స్కూలు టీచరు ఆ ప్రమాదం నుంచి కాపాడుతుంది. అయితే అదృష్టం అన్ని వేళలా వరించదని, ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలనే సారాంశం. అలాగే అబ్బాయిలను టార్గెట్ చేసే సెక్సువల్ ప్రిడేటర్సూ ఉండవచ్చన్నది చక్కగా చూపారు ఇందులో. స్త్రీలు, పిల్లలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి రోటరీ క్లబ్ ఆఫ్ కొచ్చిన్ మెట్రోపోలిస్ చేపట్టిన ‘బోధిని’ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ షార్ట్ ఫిలింను రూపొందిచారు డెరైక్టర్ శ్యాంప్రసాద్. మలయాళం భాషలోని ఈ షార్ట్ ఫిలింకు ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ వస్తుంటాయి. - కళ -
వాట్స్‌యాప్ వ్యవస్థాపకులకు రూ. 55,000 కోట్లు
శాన్ ఫ్రాన్సిస్కో: సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ సంస్థకు తమ కంపెనీని విక్రయించిన వాట్స్‌యాప్ వ్యవస్థాపకులు జాన్ కౌమ్, బ్రియాన్ యాక్టన్ భారీ జాక్‌పాట్ దక్కించుకున్నారు. డీల్‌లో భాగంగా ఫేస్బుక్లో వారికి 116 మిలియన్ షేర్లు లభించాయి. వీటి విలువ దాదాపు 9 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 55,000 కోట్లు) ఉంటుంది. మెసేజింగ్ సర్వీసుల సంస్థ వాట్స్‌యాప్‌ను ఫేస్బుక్ 22 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం తెలిసిందే. అమెరికా మార్కెట్ నియంత్రణ సంస్థకు ఫేస్బుక్ తెలిపిన వివరాల ప్రకారం కౌమ్‌కు 5.8 బిలియన్ డాలర్ల విలువైన 76.4 మిలియన్ల షేర్లు లభించాయి. దీంతో ఫేస్బుక్లో ఆయన నాలుగో అతి పెద్ద వాటాదారుగా మారారు. యాక్టన్కు 3 బిలియన్ డాలర్లు విలువ చేసే 39.7 మిలియన్ల ఫేస్బుక్ షేర్లు లభించాయి. వాట్స్‌యాప్‌లో 45 మంది ప్రస్తుత, మాజీ ఉద్యోగులకు ఫేస్బుక్ షేర్లు లభించాయి. -
భవిష్యత్తుకు బాటలు పరిచే 3డీ బ్రాండ్ బయో
రెజ్యూమె.. అభ్యర్థుల విద్యార్హతలు, నైపుణ్యాలు, పని అనుభవాన్ని రిక్రూటర్‌కు తెలియజేసే ఒక సాధనం. నేటి టెక్నాలజీ యుగంలో ఈ సాధనం దాదాపు మృతప్రాయంగా మారిందని మీకు తెలుసా? మీ రెజ్యూమె కంపెనీకి చేరకముందే మీ గురించి రిక్రూటర్లు పూర్తిగా తెలుసుకుంటున్నారు. గూగుల్‌లో, లింక్డ్ఇన్లో అభ్యర్థుల పేర్లు టైప్ చేస్తే చాలు.. సమస్త సమాచారం కళ్లముందుంటోంది. హైరింగ్ మేనేజర్లు రెజ్యూమెలను పక్కనపెట్టి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో సెర్చ్ చేస్తున్నారు. కోరుకున్న అర్హతలున్న వారికోసం అంతర్జాలంలోనే గాలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పేపర్ రెజ్యూమెలకు కాలం చెల్లిందనే చెప్పొచ్చు. మార్కెట్లో ఒక వస్తువు కనుమరుగైంది అంటే దాన్ని మించిన ప్రత్యామ్నాయం ఏదో ఒకటి వచ్చినట్లే లెక్క. రెజ్యూమెను వెనక్కి నెట్టేస్తున్న ప్రత్యామ్నాయం.. 3డీ బ్రాండ్ బయో. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఊపేస్తున్న నయా సాంకేతిక పరిజ్ఞానం.. 3డీ టెక్నాలజీ. జాబ్ సెర్చ్‌తోపాటు రెజ్యూమె, బయోడేటా, కరిక్యులమ్ విటే(సీవీ)లలోనూ ఇది రంగ ప్రవేశం చేసింది. నేటి కెరీర్ మార్కెటింగ్ సాధనాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్.. 3డీ బ్రాండ్ బయో అని నిపుణులు చెబుతున్నారు. కంపెనీలు కూడా దీన్నే కోరుకుంటున్నాయి. రెజ్యూమెలో లేని ఎన్నో అంశాలు ఇందులో ఉంటాయి. ఇది రెజ్యూమె కంటే ఎక్కువ కనెక్టివ్, ఎఫెక్టివ్ అనేది నిపుణుల మాట. కొలువు సాధించడంతోపాటు కెరీర్లో ఎదగాలంటే ఈ బ్రాండ్‌ను సొంతం చేసుకోవాలి. సోషల్ మీడియా ఉద్యోగార్థులు జపించాల్సిన మంత్రం.. డిజిటల్ ఫస్ట్. ఇప్పుడు సర్వం ఆన్‌లైన్‌మయం. అంతర్జాలంలో కొలువుల గురించి తెలుసుకోవడంతోపాటు మీ గురించి కంపెనీలకు తెలియజేయాలంటే కంప్యూటర్ కీ బోర్డుపై వేళ్లు కదిలించాలి. కంట్రోల్, ఆల్ట్, డిలీట్.. ఇలాంటి వాటితో పరిచయం పెంచుకోవాలి. 3డీ బ్రాండ్ బయోతో మిమ్మల్ని ప్రపంచంలో ఎక్కడినుంచైనా చూడొచ్చు. 3డీ టెక్నాలజీ వల్ల ఇది మనిషి ఎదురుగా ఉన్నట్లు భ్రమింపజేస్తుంది. మీ ప్రొఫైల్‌తోపాటు ఆడియో, వీడియోలను సామాజిక అనుసంధాన వేదికల్లో చేర్చాలి. మీకు సంబంధించిన వివరాలన్నీ ఇందులో ఉండాలి. మీకు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శించండి. వాటిని సలక్షణంగా నెట్టింట్లో పెట్టేయండి. వీటిని స్నేహితులు, బంధువులు మాత్రమే కాదు.. రిక్రూటర్లు, హైరింగ్ మేనేజర్లు కూడా చూస్తారు. మీ నైపుణ్యాలు నచ్చితే ఆహ్వానం పంపుతారు. అడ్డు గోడను తొలగిస్తుంది రెజ్యూమె అనేది మీ అర్హతలు, స్కిల్స్, వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి మాత్రమే తెలియజేస్తుంది. అంతకుమించి మీ గురించి రిక్రూటర్‌కు తెలియదు. ఒకరకంగా ఇరువురి మధ్య ఇది ఒక అడ్డుగోడ లాంటిదే. 3డీ బ్రాండ్ బయో ఈ అడ్డుగోడను తొలగిస్తుంది. మీరేంటో ఉన్నది ఉన్నట్లుగా వివరిస్తుంది. మీ వ్యక్తిత్వం, ప్రవర్తన, అలవాట్లు, అభిరుచులను తెలుపుతుంది. మిమ్మల్ని పూర్తిగా స్కాన్ చేస్తుంది. అందుకే రిక్రూటర్ల దృష్టిలో దీనికంత విలువ. కెరీర్లో పైకి ఎదగడానికి 3డీ బ్రాండ్ బయో.. పర్సనల్ బ్రాండింగ్ టూల్‌గా జీవితకాలంపాటు ఉపయోగపడుతుంది. దీనిద్వారా ఇతరుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ నైపుణ్యాలను పెంచుకోవచ్చు. జాబ్ మార్కెట్ ట్రెండ్స్ తెలుసుకోవచ్చు. -
ఆన్లైన్ వ్యభిచారం.. 68 మంది అరెస్ట్
బీజింగ్: చైనాలో సోషల్ నెట్వర్కింగ్ సర్వీసుల ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న, అశ్లీల చిత్రాలను షేర్ చేసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా 62 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు అశ్లీల నిరోధక విభాగం అధికారులు చెప్పారు. మైక్రోబ్లాగ్లు, మెసేజ్ సర్వీసుల ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న 25 మందిని బీజింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ చైనా గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో ఇలాంటి కేసులోనే మరో 37 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు చెప్పేందుకు అధికారులు నిరాకరించారు. -
సామాజిక సైట్లతో కొలువు వేట ఫలించాలంటే!
సోషల్ నెట్వర్కింగ్ సైట్లు... ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న మాట. ఇలాంటి సైట్లతో ఉపయోగం ఎంత ఉందో, అపాయం కూడా అంతే ఉంది. వీటిపై ప్రస్తుతం విసృ్తతమైన చర్చ జరుగుతోంది. అందుకే దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం నేటి ఉద్యోగార్థులకు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. కొలువుల వేటలో సామాజిక అనుసంధాన సైట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉద్యోగ సమాచారం ఇవ్వడం దగ్గర నుంచి దరఖాస్తును తీసుకోవడం, ఇంటర్వ్యూను పూర్తిచేయడం వరకు ఈ సైట్ల ద్వారా జరుగుతున్నాయి. కంపెనీలు తమకు కావాల్సిన ఉద్యోగుల కోసం సామాజిక సైట్ల ద్వారానే గాలిస్తున్నాయి. అందుకే అభ్యర్థులు కొలువు కోసం సోషల్ మీడియాను ఉపయోగించుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏం చేయాలో, ఏం చేయకూడదో అభ్యర్థులు కచ్చితంగా తెలుసుకోవాలి. ఆన్లైన్లో క్రియాశీలకంగా: మీరు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఆన్లైన్లో క్రియాశీలకంగా వ్యవహరించాలి. మీ అర్హతలు, నైపుణ్యాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. కంపెనీలకు మీ గురించి తెలియడానికి ఆన్లైన్ ప్రొఫెల్ ఎంతగానో ఉపయోగపడుతుం ది. ఒకవేళ ఇప్పటికే ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ ప్రొఫైల్ కెరీర్లో మీ ఎదుగుదలకు సాయపడుతుంది. పోస్టుల్లో నిర్లక్ష్యం వద్దు : ఆన్లైన్లో మీరు ఏదైనా అంశాన్ని పోస్టు చేస్తే దాన్ని చాలా మంది చదువుతారు. మీపై ఒక అంచనాకు వస్తారు. కాబట్టి మీరు పోస్టు చేసే ప్రతిదీ తప్పుల్లేకుండా ఉండేలా జాగ్రత్తపడండి. పోస్టు చేసేముందు క్షుణ్నంగా చదువుకోండి. అక్షర, అన్వయ, వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకోండి. పోస్టుల్లో తప్పులుంటే.. మీరు నిర్లక్ష్యమైన మనిషి అని ఇతరులు తుది నిర్ణయానికొచ్చే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల మీకు అవకాశాలు సన్నగిల్లుతాయి. గూగుల్‌లో పేరు: అంతర్జాలంలో ఏదైనా సమాచారం కావాలంటే అందరూ వెంటనే చేసే పని.. గూగుల్ సెర్చ్‌లో వెతకడం. కంపెనీకి రెజ్యూమెను పంపడానికి ముందు గూగుల్‌లో మీ సమాచారాన్ని పొందుపర్చండి. మీ పేరు టైప్ చేయగానే మీకు సంబంధించిన వివరాలు ప్రత్యక్షం కావాలి. రిక్రూటర్లు కూడా గూగుల్‌లో మీ వివరాలను, ఫోటోలను పరిశీలిస్తారు. అభ్యంతరకరమైన సమాచారం, ఫోటోలు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించండి. కనెక్ట్.. అందరితో వద్దు: ఇతరులతో సంబంధాలను నెలకొల్పుకోవడానికి సోషల్ నెట్వర్కింగ్ సైట్లను ఉపయోగిస్తుంటాం. ఎక్కువ మందితో కనెక్ట్ అయితే నష్టమే తప్ప ఆశించిన ప్రయోజనం ఉండదు. కాబట్టి మీ అవసరాలకు సరిపోయే వారితోనే కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించండి. వారి అవసరం మీకు, మీ అవసరం వారికి ఉండాలి. అప్పుడే ఇద్దరికీ మేలు జరుగుతుంది. ట్విట్టర్‌తో జాగ్రత్త: ట్విట్టర్లో పోస్టు చేసే వ్యాఖ్యలు వివాదాలను సృష్టిస్తుండడం చూస్తూనే ఉన్నాం. రిక్రూటర్లు కొలువుల భర్తీకి ట్విట్టర్‌ను కూడా ఉపయోగించుకుంటున్నారు. కనుక మీరు ఏదైనా ట్వీట్ చేసేముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. సంస్థ గురించి, యాజమాన్యం గురించి ప్రతికూలమైన వ్యాఖ్యలు చేయకండి. అభ్యర్థులు వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండడం మంచిది. హాస్యం.. శ్రుతి మించొద్దు: అతి ఎప్పటికీ అనర్థమే. మీకు నవ్వు తెప్పించే విషయం మరొకరికి కోపం తెప్పించొచ్చు. రిక్రూటర్/ హైరింగ్ మేనేజర్ మహిళ అయితే.. అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసభ్యకరమైన జోక్స్‌ను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోస్టు చేయకండి. అలాగే కులం, మతం వంటివాటిపై కూడా జోక్స్ సృష్టించొద్దు. ఒకవేళ ఇలాంటివి మీకు ఇష్టమైతే వివాదాల్లో, కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఉద్యోగం సంగతి తర్వాత.. వాటి నుంచి బయటపడడమే చాలా కష్టం. సామాజిక సైట్లను సరిగ్గా వాడుకోగలిగితే ఇష్టమైన ఉద్యోగం సులువుగా సంపాదించుకోవచ్చు. -
పూనమ్‌పాండే ‘ఫేస్బుక్’ గల్లంతు
సోషల్ నెట్వర్క్ వెబ్సైట్లలో నిత్యం సందడి చేసే బాలీవుడ్ భామ పూనమ్ పాండే ‘ఫేస్బుక్’ ఖాతా గల్లంతైంది. డీయాక్టివేట్ అయిన ‘ఫేస్బుక్’ ఖాతాను తిరిగి ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలియక ఆమె తెగ బాధపడుతోంది. ‘నా ఫేస్బుక్ ఖాతాకు 21 లక్షలకు పైగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇది డీయాక్టివేట్ కావడం చాలా బాధగా ఉంది. తిరిగి ఎలా యాక్టివేట్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. దీనిని తిరిగి ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఎవరైనా చెప్పరూ..’ అంటూ ‘ట్విట్టర్’లో తన అభిమానులను అభ్యర్థిస్తోంది. ముగ్ధాగాడ్సే మేనేజ్మెంట్ పాఠాలు బాలీవుడ్ భామ ముగ్ధా గాడ్సే మేనేజ్మెంట్ పాఠాలు నేర్చుకుంటోంది. నరేశ్ మల్హోత్రా దర్శకత్వంలోని ‘ఇష్క్నే క్రేజీ కియా’ చిత్రంలోని కార్పొరేట్ మహిళ పాత్ర పోషించనున్న ముగ్ధా, కొద్ది రోజులుగా మేనేజ్మెంట్ పాఠాలతో కుస్తీలు పడుతోంది. తన పాత్ర మరింత సహజంగా ఉండాలనే తపనతో బడా బడా కార్పొరేట్ మహిళా అధికారుల వద్ద చిట్కాలు తెలుసుకుంటూ, వారిని దగ్గరగా పరిశీలిస్తోంది. -
ఫేస్బుక్ లో భత్కల్: పోలీసులు
న్యూఢిల్లీ: తీవ్రవాదులు పరస్పరం సందేశాలు పంపుకునేందుకు సామాజిక సంబంధాల వెబ్సైట్లు వినియోగిస్తున్నారా. అవుననే అంటున్నారు ఢిల్లీ పోలీసులు. ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) తీవ్రవాదులు - ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, ఇతర ఇ-మెయిల్ చాటింగ్ వెబ్సైట్ల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారని కోర్టుకు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ తాను అమలుచేయాలనున్న దాడులు గురించి ఇంటర్నెట్ ద్వారా సహచరులకు తెలిపేవాడని పోలీసులు పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు ఐఎం తీవ్రవాదులు నిమ్బజ్, యాహు, పాల్‌టాక్, జీమెయిల్, ఫేస్బుక్ ఐడీలు కలిగివున్నారని పోలీసులు గుర్తించారు. ఓ అక్రమ ఆయుధ కర్మాగారం ఏర్పాటు వెనుక కూడా వీరి ప్రమేయం ఉందని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. -
షంషేర్
మీరు ఫొటో హాలికా ! నిమిషానికో ఫొటో తీసి.. క్షణాల్లో అప్లోడ్ చేసి.. ఫ్రెండ్స్ లైక్స్, కామెంట్స్‌తో ఆనందిస్తుంటారా ? మూమెంట్ ఏదైనా లెన్స్‌తో కట్టేసి ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకునే అలవాటు మీదైతే.. ఈ సరికొత్త యాప్ మీకోసమే. ఇన్స్టాగ్రామ్. జీవితంలోని మధుర క్షణాలను క్లిక్ కొట్టి ప్రపంచానికి పంచుకోవడానికి వీలు కల్పించే ఫొటో వరల్డ్ ఇది. ఫేస్బుక్ కన్నా వేగంగా దూసుకుపోతున్న షేరింగ్ వరల్డ్. ఇప్పుడు యూత్ ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌నే ప్రిఫర్ చేస్తున్నారు. ఫేస్బుక్లో ఫొటో పెట్టాలంటే ఫొటో అప్లోడ్ చేసి దానికి ప్లేస్ ట్యాగ్ చేసి, క్యాప్షన్ రాసి ఫ్రెండ్స్‌కు షేర్ చేస్తాం. కానీ ఇన్ స్టాకు అంత కష్టం అవసరం లేదు. జస్ట్ ఫొటో తీసి అప్లోడ్ చేస్తే సరి. అన్ని వివరాలు దానంతటవే యాడ్ అవుతాయి. అప్‌లోడింగ్‌కి ఎక్కువ సమయం కూడా తీసుకోదు. ఇతర సోషల్నెట్వర్కింగ్ సైట్ల కన్నా వేగంగా పనిచేస్తుంది. మన ఫొటోలను ఇతరులు కాపీ చేయడానికి గానీ, డౌన్లోడ్ చేసుకోవడానికి గానీ అవకాశం లేని సురక్షితమైన యాప్ ఇది. బెస్ట్ యాప్ ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ క్రియేట్ చేసే ఫ్యాషన్ డిజైనర్స్‌కు ఇది బెస్ట్ యాప్. తాను చేసిన డిజైన్స్ అప్లోడ్ చేయడమే కాదు.. ఇతర డిజైనర్స్ చేసినవి చూసి తనను తాను ఎప్పటికప్పడు అప్డేట్ చేసుకోవడానికి ఇది ఎంతో హెల్ప్ అవుతుందని అంటున్నారు డిజైనర్ శృతి కేడియా. యూజర్ ఫ్రెండ్లీ ‘ఇన్‌స్టా గ్రామ్ కొత్తగా 100 హ్యాపిడేస్ చాలెంజ్ ఒకటి లాంచ్ చేసింది. తమను సంతోషంగా ఉంచిన క్షణాలను ఫ్రెండ్స్‌తో పంచుకునే అవకాశం కల్పిస్తోంది. ఇది మొబైల్ యాప్ కాదు.. యూజర్స్‌ను సంతోషంగా ఉంచే వాహకం’ అని అంటున్నారు హెల్పింగ్ హ్యాండ్ వ్యవస్థాపకురాలు ఆర్తి నాగ్‌పాల్. - సిద్ధాంతి -
వీటినీ వాడుతున్నారా..!
వాట్సప్‌ను ఫేస్బుక్ వాళ్లు టేకోవర్ చేసేంత వరకూ దాన్ని వాడిన వాళ్లెంతమంది?! అంతకన్నా ముందు ఆర్కుట్ మాయలో నుంచి బయటకొచ్చి ఫేస్బుక్ బాట పట్టిన తొలివాళ్లలో మీరున్నారా! ఇప్పుడు కూడా మీరు వాట్సప్‌ను వాడుకోవడానికి, ఫేస్బుక్ మెసెంజర్కే పరిమితం అవుతున్నారా? లేక ‘వాట్స్ న్యూ’అంటూ వెదుకుతున్నారా! వెదికేవాళ్లకే అయితే ఇవి పరిచయమే... వాడుకోవడానికి కొత్త సదుపాయాల కోసం వేచి చూస్తున్న వారి కోసం ఇప్పుడు వీటి పరిచయం ఒక అవసరం. టెక్నాలజీని వాడుకోవడంలో రెండు రకాలైన పద్ధతులున్నాయి. అవకాశం ఉంది కదా అని వాడుకోవడం, అందరూ వాడుతున్నారని అనుసరించడం. డబ్బు ఖర్చు పెట్టి వాడుకొనే సేవల విషయం ఎలా ఉన్నా... అందుబాటులో ఉన్న సేవలను అందిపుచ్చుకోవడం మంచి సదుపాయం. అలాంటి సదుపాయాలు కొన్ని... పాథ్టాక్.. వాట్సప్, ఫేస్బుక్ మెసెంజర్ల తీరున పాథ్టాక్లో కూడా మెసేజింగ్ ఉచితం. దీని ద్వారా వాయిస్ మెసేజ్‌లు పంపడానికి కూడా అవకాశం ఉంటుంది. మొదట సోషల్నెట్వర్కింగ్ సైట్ గా మొదలై తర్వాత మెసేజింగ్ అప్లికేషన్‌గా నిలిచింది. మరి టెక్ట్స్ మెసేజింగ్, ఆడియో చాటింగ్ కోసం అయితే ఉన్న అప్లికేషన్లు చాలు.. ఇందులో కొత్త ఏముంది? అంటే.. అది వాడుతుంటే కానీ అర్థం కాదు. కొత్తదారిలో నడిపిస్తూ భిన్నమైన అనుభవాన్ని ఇస్తుంది ఈ అప్లికేషన్. ప్రత్యేకత: పాథ్టాక్లో సర్వర్‌లో మీ చాటింగ్ కేవలం 24 గంటలు మాత్రమే సేవ్ అయ్యి ఉంటుంది. తర్వాత పాత ఊసుల ప్రస్తావన ఉండదు. చాటింగ్‌ను ఎప్పటికప్పుడు ఎరేజ్ చేయాలనుకొనే వారికి పాథ్టాక్ బెస్ట్‌ఫ్రెండ్! లైన్... ఇంకా ఇప్పుడిప్పుడే పుంజుకొంటున్న అప్లికేషన్ ఇది. 230 దేశాల్లో దీని వాడకందార్లు ఉన్నా.. ఆసియాదేశాల్లో కొంచెం ఎక్కువగా వాడుతున్నారు. మొత్తంగా ఐదు కోట్లమంది యూజర్లున్నారు. అయితే ఈ మెసెంజర్ అప్లికేషన్స్‌తో ఒక సమస్య ఉంటుంది. ఈ అప్లికేషన్‌ను మనం అనుసంధానం చేసుకోవడమే కాకుండా, స్నేహితులు కూడా ఇన్స్టాల్ చేసుకొంటేనే చాట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రకారం చూసుకొంటే లైన్ వినియోగం విస్తృతం కాలేదని చెప్పవచ్చు. ప్రత్యేకత: లైన్‌ను వాడటం ద్వారా ఎక్కడనుంచి ఎక్కడికైనా, ఎప్పుడైనా ఉచితంగా టెక్ట్స్ చాట్‌తోపాటు వీడియో చాట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేగాక లైన్ అప్లికేషన్లేని స్మార్ట్ఫోన్స్తో కూడా అనుసంధానం కావడానికి అవకాశం ఉంటుంది. అయితే అలా చేయాలంటే కొంత చార్జ్ అవుతుంది. వుయ్ చాట్.. ఇప్పుడిప్పుడే వాడకంలో ఉన్న చాటింగ్ అప్లికేషన్ ఇది. అయితే వాట్సప్ అంత విస్తృతం కాలేదు. గ్రూప్ చాటింగ్ విషయంలో వుయ్చాట్కు తిరుగులేదు. ఒకేసారి. వందమంది స్నేహితులు ఒకే చాట్‌రూమ్‌లో ఉంటూ మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాన్ఫరెన్స్‌లా మాట్లాడుకోవడానికి, సమూహంగా చాట్ చేసుకోవడానికి వుయ్చాట్ను మించిన అప్లికేషన్ ప్రస్తుతానికి అయితే లేదు. ప్రత్యేకత: కచ్చితంగా గ్రూప్ చాటింగ్. వైబర్.. వీడియో చాటింగ్ కోసం ఇప్పుడిప్పుడు విస్తృతం అవుతున్న అప్లికేషన్లలో వైబర్ ఒకటి. ప్రస్తుతానికి విశ్వవ్యాప్తంగా కలిపి దాదాపు 20 కోట్ల మంది యూజర్లున్నారు. మనదగ్గర మాత్రం వైబర్ వినియోగదారులు తక్కువమందే. ఇందులో కూడా గ్రూప్చాటింగ్స్కు అవకాశం ఉంటుంది. ఉత్తమ నాణ్యతతో వీడియో చాటింగ్ చేయడానికి వైబర్ మంచి అప్లికేషన్.. స్కైప్ ఫర్ స్మార్ట్‌ఫోన్.. వీడియో చాటింగ్ కోసం అందుబాటులో ఉన్న స్మార్ట్ అప్లికేషన్లు అన్నీ ఒక ఎత్తు అయితే స్మార్ట్‌ఫోన్‌లో స్కైప్ వాడటం మరో ఎత్తు. అన్ని అప్లికేషన్లూ మొబైల్ నంబర్ మీద రిజిస్టర్ అవుతాయి. దాని వల్ల కొన్ని ఇబ్బందులు ఉండనే ఉంటాయి. అదే స్కైప్ అయితే ఇ-మెయిల్ ఐడీ ద్వారా లాగిన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో స్కైప్ ఫ్రెండ్స్‌తో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. స్నాప్‌చాట్.. పేరుకు తగ్గట్టుగా ఈ అప్లికేషన్ చాలా రోజుల వరకూ ఫోటో షేరింగ్ కు మాత్రమే అవకాశం ఇచ్చేది. అయితే తాజాగా వీడియోకాలింగ్ అప్లికేషన్ గా మారింది. వాడాలి కానీ వీడియో చాటింగ్ విషయంలో స్నాప్‌చాట్ ప్రత్యేకత ఎంతో ఉంది! టచ్‌లో ఉండండి! కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు కాకుండా... మళ్లీ మళ్లీ అప్లికేషన్లు అందించే స్టోర్లలోకి ఎంటరయ్యేది తక్కువమందే! ఒకే క్లిక్‌తో ఐఫోన్ వినియోగదారులు ఐస్టోర్లోకి, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్‌లోకి ఎంటరయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి ఆ అప్లికేషన్ల వెల్లువలోకి ప్రవేశిస్తే.. లెక్కలేనన్ని నూతన అప్లికేషన్లు పలకరిస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వాటితో టచ్లోఉంటే ఇట్టే టెక్శావీలుగా మారిపోవచ్చు! అందుబాటులోకి వస్తున్న నూతన అప్లికేషన్లను ఆస్వాదించవచ్చు! -
ఫేస్బుక్ చాటింగ్ బానిసగా యువత
ఫేస్బుక్లో ఫొటో అప్డేట్ చేయకపోతే ఆ రోజు ఏదోలా ఉంటుంది. అప్డేట్ చేసిన ఫొటోకు లైక్‌లు రాకపోతే ఇంకా బాధగా ఉంటుంది. వాట్సప్‌లో అయితే రోజూ ఇరవై మెసేజ్‌లైనా పడాల్సిందే. ఎవరు ట్విట్టర్లో ఏం రాశారో తెలుసుకోకపోతే నిద్రే పట్టదు. నేటి తరం విద్యార్థుల కోరికలివి. ప్రపంచం కుగ్రామమై ఇంటర్నెట్ మనుషులను కలుపుతున్న ఈ రోజుల్లో యువత సోషల్ మాయలో పడుతోంది. తద్వారా ప్రమాదాలను కొని తెచ్చుకుంటోంది. అపరిచిత వ్యక్తులతో పరిచయాలు, తెలియని వారితో చాటింగ్‌లు యువతను పెడదోవ పట్టిస్తున్నాయి. దీనికి తోడు సమయమూ వృథా అవుతోంది. విజయనగరం టౌన్: మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరానికి అనుగుణంగా సద్వినియోగం చేసుకుంటూ ఉజ్వలమైన భవిష్యత్‌ను పొందేందుకు సోషల్ మీడియాను వినియోగించుకోవాలి. కానీ నేటి తరం మాత్రం సోషల్‌మీడియాలో ఉండడం స్టేటస్ సింబల్‌గా భావిస్తోంది. ఫేస్బుక్, వాట్స్ ఆఫ్, ట్విటర్ వంటి వాటి ద్వారా ప్రపంచాన్ని చూడాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ ఉత్సాహమే ప్రమాదాలకు కారణమవుతోంది. రాత్రి, పగలు సెల్‌ఫోన్ చేతిలో పెట్టుకుని చాటింగ్‌తో గడిపేసే విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారు. పోస్టులు, లైక్‌లు, కామెంట్లు, షేర్లతో కాలం గడిపేస్తున్నారు. ఇంటర్నెట్, ఫేస్బుక్ మాయలో పడిన వారికెవరికైనా ఆకలి దప్పికలు ఉండవు. యువతీ, యువకులు ఫేస్బుక్ మాయలో పడి బంగారు జీవితాన్ని బలి చేసుకుంటున్న ఘటనలూ ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ నెట్వర్క్ ఎంత ఫేమస్ అంటే చాలామంది మొబైల్ ఫోన్లలో ఫేస్‌బుక్‌లు అకౌంట్లు తప్పనిసరి అయిపోయాయి. జిల్లాలోనూ యువతి ఇదే ధోరణి. విద్యార్థుల ప్రవర్తనపై దృష్టి పెట్టాలి సమాచార సేకరణకు, విజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఫేస్బుక్ ఉపయోగిస్తే అదో విజ్ఞాన గని అవుతుంది. అలాకాకుండా టైమ్‌పాస్‌కు వాడుకుంటే అనర్థాలకు దారి తీస్తుందని విద్యా వేత్తలు అంటున్నారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు. పిల్లలు కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్ఫోన్లతో ఏం చేస్తున్నారు. వాటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నారనే అంశాలపై దృష్టి సారించాలని చెబుతున్నారు. స్మార్టఫోన్లు వాడుతున్న వారిపై ఇంకాస్త శ్రద్ధ పెట్టాలని అంటున్నారు. చాటింగ్ బానిసగా యువత ప్రస్తుతం హైస్కూల్ స్థాయి నుంచి విద్యార్థులు చాటింగ్ అనే వ్యసనానికి బానిసలుగా తయారయ్యారు. చదువు కంటే ముందు దీనికి బానిసగా మారుతూ ఫేస్బుక్ అకౌంట్ లేకుంటే చిన్నతనంగా భావిస్తున్నారు. తీరిక దొరికినప్పుడల్లా కంప్యూటర్, సెల్ఫోన్లలో ఫేస్బుక్ చాటింగ్‌లు చేస్తూ గంటల తరబడి వాటికే అతుక్కుపోతున్నారు. దీంతో వారి చదువు దెబ్బ తింటోంది. ఆలోచన ధోరణి కూడా మారుతోంది. ఇక కొత్త పరిచయాల చాలా సార్లు ప్రమాదానికి హేతువులవుతున్నాయి. దీనికి తోడూ బినామీ అకౌంట్లతో ఫేస్బుక్ క్రియేట్ చేసి అశ్లీల చిత్రాలు,సెలబ్రెటీలు, ప్రముఖుల ఫోటోలను మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేయడంతో కొందరికి తెలియని కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. అందుకే విద్యార్థులు ఈ వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని పలువురు విద్యా వేత్తలు సూచిస్తున్నారు. -
డ్యాబ్లర్ మీ చదువులు మీ చేతుల్లో!
‘‘మెకానికల్ తీస్కోరా! గౌతమ్ మీనన్, చేతన్ భగత్ రేంజ్‌కి వెళ్తావ్.’’ ‘‘సీఎస్సీ మే పొట్టి యా మస్త్ రెహతే మాలూం.’’ ‘‘ మీపెదనాన్న గారబ్బాయిని చూశావా? ఈసీఈ చేసి, ఇప్పుడు నెలకు ఆరంకెల జీతం సంపాదిస్తున్నాడు.’’ ఎమ్సెట్, జేఈఈ ర్యాంకుల వేడిలో ఇలాంటి డైలాగులు గంటకోచోట ఏదో ఓ మూల వినిపిస్తూనే ఉంటాయి. ఇంటర్ తరువాత ఎక్కువ మంది విద్యార్థుల ఫేవరెట్ ఛాయిస్ ఇంజనీరింగే. ఆసక్తి ఉన్నా ఆ కోర్సులపై అవగాహన ఉన్నది మాత్రం చాలా తక్కువ మందికే. మరి ఆ విషయంపై అవగాహన పెరిగేదెలా? పెంచేదెవరు? ఆ కొరతను తీరుస్తూ ఒక యాప్‌ను తయారు చేసిన యువకుల కథే ఇది. ‘‘ఏ మొబైల్ ఫోన్ చూసినా వాటిలో డిఫాల్ట్‌గా వచ్చే యాప్స్‌లో ఎక్కువ శాతం గేమ్స్, సోషల్ నెట్వర్కింగ్ తాలూకువే. అయితే మొబైల్ వాడే వారిలో ఎక్కువ శాతమైన విద్యార్థుల కోసం ఒక యాప్ కూడా లేదన్న ఆలోచన నుండి పుట్టిందే మా డ్యాబ్లర్’’ అంటారు డ్యాబ్లర్ యాప్ వ్యవస్థాపకులైన శ్రీకాంత్, శిరీష్. ‘‘మా ఇద్దరిదీ హైదరాబాదే. గ్రాడ్యుయేషన్ హైదరాబాద్‌లో చేసిన మేము ఎంబీఏ కోసం ఎమ్.ఐ.సి.ఎ. అహ్మదాబాద్ వెళ్లాం. అక్కడికి వెళ్లాక వారితో పోలిస్తే మన రాష్ట్రంలోని విద్యార్థులు ఎంతో తెలివైన వారే కానీ, క్రియేటివిటీ, ఇన్నోవేషన్, ఆపర్చ్యునిటీల గురించిన అవగాహన లోపం వల్ల వెనకబడి ఉన్నారని, వారికి మా వంతు సాయం చెయ్యాలనీ అనిపించింది. ఇంటర్నెట్లో వెతికితే ఇంజినీరింగ్‌కు సంబంధించి ఎన్నో వేల సలహాలు, ఆప్షన్లు ఉండడంతో ఏది ఎంచుకోవాలో తెలియక ఒకటే కన్ఫ్యూజన్. ఒక విద్యార్థికి ఈ నాలుగేళ్లలో ఏ బ్రాంచ్‌లో ఏమేమి సబ్జక్ట్స్ ఉంటాయి, ఏం నేర్చుకుంటాం, ఉద్యోగావకాశాలు ఏమిటి తదితర వివరాలు చూపించేలా ఒక యాప్‌ను రూపొందించాలనుకున్నాము’’ అని తమ డ్యాబ్లర్ యాప్ ఆవిర్భావం గురించి చెప్పారు 27 ఏళ్ల శ్రీకాంత్. ఇంజనీరింగ్ విద్యార్థికి అవసరమైన సమాచారం అంటే ఒకటి రెండు పేజీల వ్యవహారం కాదు. ఎన్నో గ్రూప్స్, సబ్ గ్రూప్స్, సబ్జెక్ట్స్, ఈవెంట్స్ సేకరించి, ఒక చోట పెట్టడం మామూలు విషయం కాదు. కష్టమైన పనిని సులభంగా చేయగలగడమే వారి మోటో. అందుకే ఆ అర్థాన్నిచ్చే ‘డ్యాబ్లర్’ అనే పదాన్ని యాప్ పేరుగా పెట్టి యాప్ పనులు మొదలు పెట్టారు. ఇది ఇద్దరివల్ల అయ్యేది కాదు అని అర్థం అయ్యింది వారికి. అందుకే తమ స్నేహితులైన రోహిత్, అవని, భగత్‌లను తమతో పని చేయడానికి ఆహ్వానించారు. ఫేస్బుక్, పర్పుల్ టాక్, వాటర్ హెల్త్‌లాంటి పెద్ద కంపెనీలలో ఉద్యోగాలను వదిలేసి వారు శ్రీకాంత్, శిరీష్‌లతో కలిసి ఈ యాప్ పనిమీద పడ్డారు. అందరూ సాంతం గానే డబ్బు పెట్టుబడి పెట్టి, ఆరు నెలలపాటు కష్టపడి ఎట్టకేలకు 2013, డిసెంబర్ 20న గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ని లాంచ్ చేశారు. ‘‘ఆరంభంలో ఫండింగ్ లేక ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. మాతో ఒప్పందం చేసుకోడానికి ఎవరూ ముందుకు రాలేదు. విద్యార్థులకు ఉపయోగపడుతుందని కొన్ని కాలేజీలు మాత్రం మాతో అనుసంధానం అయ్యాయి’’ అని తమ ఆర్థిక కష్టాల గురించి చెప్పారు 27 ఏళ్ల శిరీష్. ఇలా ఈ యాప్ ఆరు నెలల్లోనే 40,000 మంది విద్యార్థుల ఫోన్లో ఇన్స్టాల్ అయ్యింది. దాంతో దీన్ని విండోస్, ఐఓఎస్‌లలో కూడా విడుదల చేశారు. ఎమ్.ఐ.సి.ఎ.లో చదువుతున్నప్పుడు శ్రీకాంత్, శిరీష్‌ల ప్రొఫెసర్ అయిన శ్రీధర్ చారి ఇప్పుడు డ్యాబ్లర్ మెంటర్‌గా ఉండి వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు. హర్ష ఆలూరి అనే ఐ.ఐ.ఐ.టి. పూర్వ విద్యార్థి స్థాపించిన డెక్ట్సర్ ల్యాబ్స్ సంస్థ డ్యాబ్లర్కు విస్తృతమైన సేవలందించి దీన్ని మరింత ముందుకు తీసుకెళుతోంది. ఇక, ఇప్పుడు డ్యాబ్లర్ని కేవలం మన రాష్ట్రానికే కాక, తమిళనాడు, మహారాష్ట్రలకు కూడా వ్యాప్తి చేసే ఆలోచనలో ఉన్నారు డ్యాబ్లర్ వ్యవస్థాపకులు. ‘‘విద్యార్థులకు సరైన అవగాహన, ఆలోచన కలిగించే విషయాలని కాస్త వినోదంతో మేళవించి చెప్పడం అనే ఐడియా నాకెంతో నచ్చింది. పెద్ద పెద్ద కంపెనీల కన్నా సొంత స్టార్టప్స్లోనే నేర్చుకోడానికి చాలా ఉంటుంది. మా ఐడియా సక్సెస్ అవుతుందో లేదో అనే భయం ఉన్నా, మా కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుందన్న ధైర్యంతో ముందుకొచ్చాను. నాలాగా మరింతమంది ఎంటర్‌ప్రెన్యూవర్స్ ముందుకు రావాలి’’ - అవని, డ్యాబ్లర్ యాప్ డెవలపర్ ‘‘ఇ-యాప్స్ రంగం చూడటానికి సాధారణం గానే ఉన్నా, ఇందులో నిలబడాలంటే ఎంతో ధైర్యం కావాలి. పేషన్, కమిట్మెంట్తోబాటు ఒక యాప్ డెవలపర్ పూర్తిస్థాయిలో పని చేస్తేనే ఏ యాప్ అయినా మార్కెట్లో నిలబడగలిగేది. ఈ రంగానికి సృజనాత్మకత ఒక్కటే కొలమానం. సామర్థ్యం ఉండీ, తగిన అవకాశం దొరకని వారికి ఇది ఒక అద్భుతమైన వేదిక’’. - శ్రీధర్ చారి, డ్యాబ్లర్ మెంటర్ అసలేంటి ఈ ‘డ్యాబ్లర్?’ డ్యాబ్లర్ అనేది ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం డిజైన్ చేయబడిన యాప్. ఈ యాప్‌లో వివిధ రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒక దానిలో వివిధ బ్రాంచిలకు సంబంధించిన వివరాలు, ఆయా సబ్జెక్ట్‌ల వివరాలు ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా వచ్చే జర్నల్స్‌ని వడబోసి ఒక చోట చేర్చి విద్యార్థులకు ఉపయోగపడే న్యూస్‌ని అందిస్తుంది. దేశంలోని నలుమూలలలో జరిగే స్టూడెంట్ ఈవెంట్స్, ఫెస్ట్స్ వివరాలను అప్డేట్ చేస్తాయి. విద్యార్థులు రాసే ఆర్టికల్స్, పేపర్స్, జర్నల్స్‌ని అందరికీ అందుబాటులో ఉంచుతుంది. ఏ రోజు ఏ టైం టేబుల్ ఉందో వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఆ రోజు తాలూకు టైం టేబుల్ని ఆ రోజు ఆన్లైన్లో చూపిస్తుంది. దాన్ని ఎడిట్ చేసుకునే సదుపాయంతో పాటు రిమైండర్ సెట్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. ఇలా విద్యార్థులకు గైడ్లానే కాక, ఒక పి.ఎ.లా వ్యవహరిస్తున్న ఈ డ్యాబ్లర్కు అశేషమైన ఆదరణ లభించింది. -
జర జాగ్రత్త ఫేస్'బుక్' చేస్తుంది
► పెడదోవ పడుతున్న యువత ►చాటింగ్‌తో సమయం వృధా ►అపరిచిత వ్యక్తులతో ఫేస్బుక్ ►స్నేహం ప్రమాదకరం రాత్రి లేదు... పగలూ లేదు ఎప్పుడు చూసినా సెల్ఫోన్లు, కంప్యూటర్ల ముందు కూర్చుని ఏక చాటింగ్లే. పోస్టులు, లైక్‌లు, కామెంట్లు, షేర్లుతో కాలంగడిపేస్తున్నారు నేటి యువత. ఎనీటైం..ఎనీ ప్లేస్ చేతిలో సెల్‌తో చాటింగ్. ఇంటర్నెట్, ఫేస్బుక్ మాయలో పడ్డవారెవరైనా సరే వారికి ఆకలి దప్పికలుండవు. యువతీ, యువకులు ఫేస్బుక్ మాయలోపడి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో అడ్డంగా బుక్ అవుతూ ఊచలు లెక్కిస్తున్నారు. ఉప్పలగుప్తం : మారిన సాంకేతిక విప్లవంలో వింత ప్రపంచం లాంటి ఇంటర్నెట్, ఫేస్బుక్ అకౌంట్లతో మునిగి తేలుతున్న వారికి వయస్సుతో పనిలేదనిపిస్తుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఫేస్బుక్ అకౌంట్ కలిగి ఉండడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత పరిస్థితుల్లో విరివిగా విస్తరించిన సోషల్ నెట్‌వర్క్‌గా ఫేస్బుక్ ప్రాచుర్యం పొందింది. తమకు నచ్చిన అంశాన్ని స్నేహితులతో పంచుకోవడం, నచ్చిన చిత్రాలను, సందేశాలను పోస్ట్ చేయడం. ఆ తరువాత వాటికి ఎన్ని లైక్‌లు, షేర్లు, కామెంట్లు వచ్చాయో చూసుకోవడం పరిపాటయింది. కళాశాలల, పాఠశాలల విద్యార్థులే కాదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఫేస్‌బుక్‌తో నిత్యం బిజీ బిజీగా గడుపుతున్నారు. ఎక్కడ చూసినా, సందర్భమేదైనా ఫేస్బుక్ చర్చలే కనిపిస్తున్నాయి. సోషల్ నెట్వర్క్ ఎంత ఫేమస్ అంటే చాలామంది మొబైల్ఫోన్లనో ఫేస్బుక్ అకౌంట్లు ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటన క్షణాల్లో నేడు సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతోంది. ఏమూల ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న ఆత్రుత అందరినీ ఫేస్బుక్ వైపు మళ్ళిస్తోంది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో యువత ఫేస్బుక్ ద్వారా చేసుకున్న చాటింగ్‌లు ఘర్షణలకు దారితీయడం, ఒకరి పార్టీని ఒకరు విమర్శించుకుంటూ తగవులు పెట్టుకోవడం మనకు తెలిసిందే. ఇంటర్ విద్యార్థినితో ఓ ఆకతాయి చేసిన చాటింగ్ ఆ యువతి ఇల్లు విడిచి వచ్చేలా చేసింది. దీంతో కుటుంబ తగాదాలు చోటు చేసుకున్నాయి. తల్లిదండ్రులు దృష్టి సారించాలి సమాచార సేకరణకు, విజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఫేస్బుక్ ఉపయోగిస్తే ఆదో విజ్ఞాన గని అవుతుంది. అలాకాకుండా టైంపాస్‌కు వాడుకుంటే పలు అనర్థాలకు దారి తీస్తుందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలి. తమ పిల్లలు కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్ఫోన్లతో ఏంచేస్తున్నారు. వాటిని ఏవిధంగా వాడుతున్నారనే దానిపై దృష్టిసారించాలి. అడగ్గానే ఇంటర్ విద్యార్థికి కూడా తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొని చేతిలో పెడుతున్నారు. ఫోన్లలో గేమ్లాడుతున్నామని చెప్పి ఎక్కువ సమయం ఫేస్బుక్ చాటింగ్‌లు చేస్తుంటారు.. వాటిని గమనించాలి. పిల్లల స్నేహాలు, పరిచయాలు, ప్రవర్తనలపై ఎప్పటికప్పుడు గమనించాలి. లేదంటే చెడు వ్యసనాలకు బానిసలయ్యే ప్రమాదం ఉంది. ఆఫర్లతో హోరెత్తిస్తున్న ఆపరేటర్లు వినియోగదారుల వాడకాన్ని దృష్టిలో పెటుకుని వివిధ కంపెనీలకు చెందిన సెల్‌ఫోన్ ఆపరేటర్లు ఇంటర్నెట్, ఫేస్‌బుక్‌ల అకౌంట్ల కోసం ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. ఆఫర్లు కూడా ఎక్కువగా రాత్రి సమయంలో వినియోగించుకునే విధంగా ఉంటున్నాయి. కొన్ని నెట్వర్కలు ఒక్క రూపాయితో రాత్రి ఫేస్బుక్, రూ.12 లతో అర్ధరాత్రి దాటిన తరువాత అన్లిమిటెడ్ ఇంటర్నెట్ సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఇవన్నీ యువతకోసమేనంటూ ప్రచారం చేస్తున్నాయి. బినామీపేర్లతో అకౌంట్లు ఎన్నో... కొందరు బినామీ పేర్లతో అకౌంట్లు తెరుస్తున్నారు. వీటిలో అమ్మాయిల పేర్లు, ఫొటోలతో అకౌంట్లు ఎక్కువగా ఉంటున్నాయి. రిక్వెస్ట్‌లతో ఫ్రెండ్షిప్లు పెంచుకుని వారితో చాటింగ్ చేస్తారు. ఒకరికి ఒకరు తెలియక పోయినా రిక్వెస్ట్‌లతో వేలసంఖ్యలో ఫేస్బుక్ ఫ్రెండ్స్ పెరిగిపోతారు. ఈ క్రమంలోనే అశ్లీల చిత్రాలు అప్లోడ్ చెయ్యడం దగ్గర నుంచి వ్యక్తిగత కామెంట్లతో మెసేజ్‌లు పెడుతున్నారు. ముఖ్యంగా సెలబ్రేటీలు, ప్రజాప్రతినిధుల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్‌ను ఫార్వర్డ్ చేయడం వంటి చర్యలతో పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఒక ఫేస్బుక్ అకౌంట్‌కు ఫ్రెండ్స్‌గా ఉన్న వారందరికి ఈ మెసేజ్ లేదా చిత్రాలు అప్లోడ్ అవుతాయి. వీటన్నింటినీ బినామీ అకౌంట్ల నుంచి పంపుతున్నారు. వీటివల్ల వచ్చే సమస్యల్లో చిక్కుకుని అమాయకులు కేసుల్లో ఇరుక్కుని చట్టానికి చిక్కుతున్నారు. సైబర్ నేరాల గురించి తెలియని అమాయకులు ఫేస్బుక్లో ఫొటోలు పెట్టుకుంటే వాటిని డౌన్లోడ్ చేసి కామెంట్లతో అప్లోడ్ చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు నిత్యం ఏదో ఒకచోట చోటుచేసుకోవడం చూస్తున్నాం. ఈ సంఘటనలు వెలుగులోకి వచ్చి కేసుల వరకూ వెళితేగాని బినామీల సంగతి బయటకు రావడంలేదు. పోలీస్‌ల దర్యాప్తుల్లో నేరాలకు పాల్పడ్డవారిని గుర్తించి ఫేస్బుక్ అకౌంట్ గురించి ఆరాతీస్తే అసలు ఫేస్బుక్ అంటే తెలియని అమాయకుల వివరాలు బయటపడుతున్నాయి. ఎక్కువగా నెట్ సెంటర్‌కు వె ళ్లి చాటింగ్ చేసేవారు బినామీ అకౌంట్లు క్రియేట్ చేసి అమాయకులను ఇరికిస్తున్నారు. గంటల తరబడి చాటింగ్ హైస్కూల్ స్థాయి విద్యార్థి సైతం ఫేస్బుక్ వినియోగిస్తున్నాడంటే యూజర్లు ఏ సంఖ్యలో ఉన్నారో అర్థమవుతుంది. చదువుకంటే ముందు దీనికి బానిసగా మారుతూ ఫేస్బుక్ అకౌంట్ లేకుంటే చిన్నతనంగా భావించే వారున్నారంటే అతిశయోక్తి కాదు. తీరిక దొరికినప్పుడల్లా కంప్యూటర్, సెల్ఫోన్లలో ఫేస్బుక్ చాటింగ్‌లు చేస్తూ గంటల తరబడి వాటికే అతుక్కుపోతున్నారు యువతీ యువకులు. ఈ తరహ లోకంలో ఎందరో అపరిచిత వ్యక్తులు తారసపడుతున్నారు. వారితో చాటింగ్, పోస్టులు, లైకులు చేస్తూ స్నేహం పెంచుకుంటున్నారు. ఇలాంటి పరిచయాలు కొందరి జీవితాలను చీకట్లోకి నెట్టేస్తున్నాయి. తీయటి పలుకుతో వచ్చే సందేశాలకు యువతీ యువకులు వారి మాయలోపడి అనవసరంగా ఇబ్బందుల్లో పడుతున్నారు. దీనికితోడు బినామీ అకౌంట్లతో ఫేస్బుక్ క్రియేట్ చేసి అశ్లీల చిత్రాలు, సెలబ్రేటీలు, ప్రముఖల ఫొటోలను మార్ఫింగ్ చేసి అపలోడ్ చెయ్యడంతో కొందరికి తెలియని కష్టాలు వచ్చిపడుతున్నాయి. పైశాచిక ఆనందంతో అలా చేసేవారెవరో తెలియకపోగా అమాయకులు అడ్డంగా బుక్ అవుతున్నారు. -
పాత కారుపై లోను..
కొత్త, పాత కార్లను కొనుక్కోవడానికే కాదు.. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాల కోవలో పాత కార్లపై రుణాలు కూడా అందిస్తున్నాయి బ్యాంకులు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకు మొదలైనవి ఇలాంటి రుణాలు ఇస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇచ్చే రుణాల విషయానికొస్తే.. ప్రైవేట్‌గా వాడుకున్నదైతే వాహనం ఏడేళ్లకు మించి పాతబడకూడదు. అదే కమర్షియల్ వాడకంలో ఉన్నదైతే ఆరేళ్లకు మించి పాతబడకూడదు. వ్యక్తిగత రుణాలపై వసూలు చేస్తున్న వడ్డీ రేట్ల కన్నా దాదాపు 2 శాతం తక్కువ వడ్డీ రేటుకి ఈ లోన్స్ అందిస్తోంది హెచ్డీఎఫ్సీ బ్యాంకు. యాక్సిస్ బ్యాంకు కూడా ఈ తరహా లోన్స్‌ని ప్రవేశపెడుతోంది. బబ్ల్యూస్.. పోస్ట్ చేస్తే పైసా.. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు సాధారణంగా యూజర్ల సంఖ్యను చూపించి, అడ్వరై ్టజ్మెంట్ల ద్వారా ఆదాయం ఆర్జిస్తుంటాయి కానీ యూజర్లకు అందులో వాటాలేమీ ఇవ్వవు. ఇందుకు భిన్నంగా తాజాగా బబ్ల్యూస్ (www.bubblews.com)అనే సోషల్ నెట్వర్కింగ్ సైటు ఒకటి పుట్టుకొచ్చింది. యూజర్లు ఏదైనా పోస్ట్ చేసినా.. లేదా షేర్ చేసినా ప్రతిసారీ ఈ సంస్థ తమ ప్రకటనల ఆదాయంలో కొంత వాటాను వారికి కూడా ఇస్తామంటోంది. ఇలా ప్రతి పోస్ట్‌కి దాదాపు ఒక్క సెంటు (అమెరికన్ డాలర్లో వందో వంతు.. మన కరెన్సీలో సుమారు అరవై పైసలు) లభించవచ్చు. మన అకౌంట్లో మొత్తం 50 డాలర్లు జమయిన తర్వాత విత్‌డ్రా చేసుకోవచ్చు. అరవింద్ దీక్షిత్, జేసన్ జకారీ దీన్ని ఏర్పాటు చేశారు. బబుల్, న్యూస్ అనే రెండు పదాలను కలిపేసి బబ్ల్యూస్ అని పేరు పెట్టారు. ఇందులో కనీసం 400 క్యారెక్టర్స్‌తో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. వైద్యానికి ‘ఆరోగ్య ఫైనాన్స్’ రుణాలు వైద్యం ఖర్చులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో వీటికి తగ్గ ఆరోగ్య బీమా పాలసీలూ అందుబాటులోకి వస్తున్నాయి. చికిత్స ఖర్చులకు బ్యాంకులు రుణాలు కూడా ఇస్తున్నాయి. అయితే, బీమాను పక్కనపెడితే బ్యాంకు రుణాలు పొందాలంటే శాలరీ స్లిప్పులని మరొకటని.. బోలెడన్ని డాక్యుమెంట్లు అవసరమవుతుంటాయి. అంతంత మాత్రం జీతం అందుకునే వారి వద్ద ఇలాంటివి ఉండవు. మరి ఇలాంటి వారి పరిస్థితి ఏమిటి? ఫలితంగా బ్యాంకుల నుంచి లోన్లు పొందడం కష్టమవుతుంటుంది. ఇలాంటి వారి చికిత్స అవసరాలు తీర్చే దిశగా కొన్ని సంస్థలు తెరపైకి వస్తున్నాయి. ఆరోగ్య ఫైనాన్స్ అటువంటిదే. పరిస్థితిని బట్టి చికిత్స రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న 5- 24 గంటల్లోగా దరఖాస్తుదారును కంపెనీ సంప్రదిస్తుంది. ఫైనాన్స్ కౌన్సిలరు..ఆస్పత్రికి వస్తారు. దరఖాస్తుదారు కుటుంబంతో మాట్లాడి, రుణం తిరిగి చెల్లించడంలో వారి నిబద్ధత గురించి అంచనా వేస్తారు. ఆ తర్వాత అర్హులని భావించిన పక్షంలో కేసును బట్టి రూ.20,000 నుంచి రూ. 2,00,000 దాకా ఆరోగ్య ఫైనాన్స్.. రుణం మంజూరు చేస్తుంది. దీనిపై దాదాపు 12 శాతం వార్షిక వడ్డీ కట్టాల్సి ఉంటుంది. లోన్ మొత్తాన్ని బట్టి ఆరు నెలల నుంచి మూడేళ్లలోగా రుణాన్ని తిరిగి చెల్లించాలి. ప్రస్తుతం పన్నెండు రాష్ట్రాల్లోని 50 పైగా ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకుని ఈ రుణాలు అందిస్తోంది ఆరోగ్య ఫైనాన్స్. డీల్స్ అండ్ డిస్కౌంట్స్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైటు ఫ్లిప్కార్ట్డాట్కామ్.. బ్యాగులు, బెల్టులు, వాలెట్లపై 80 శాతం పైగా, చేతి పనిముట్లపై 20 శాతం మేర డిస్కౌంట్లు ఇస్తోంది. ఫ్యాషన్ సేల్ కింద మహిళల ఫుట్వేర్పైన.. పురుషుల దుస్తులపైన సుమారు 70 శాతం దాకా, పిల్లల దుస్తులపై 40 శాతం మేర, వాచీలపై కనిష్టంగా 40 శాతం, సన్గ్లాసెస్పై 80 శాతం దాకా డిస్కౌంట్లు ఇస్తోంది. ఆభరణాల మీద దాదాపు 60 శాతం మేర డిస్కౌంట్లు అందిస్తోంది. మీ ఆర్థిక లక్ష్యం సాధించారా? ఇల్లు, వాహనం, ఉన్నత విద్య మొదలైన లక్ష్యాల సాధన కోసం రూపొందించుకున్న ఆర్థిక ప్రణాళికలు (డౌన్పేమెంట్లు, మార్జిన్లు సమకూర్చుకోవడం, క్రమం తప్పకుండా ఈఎంఐలు కట్టేం దుకు ప్లానింగ్ చేసుకోవడం వంటివి) సాధిం చిన విజయాలను మాతో పంచుకోండి. అలాగే, పొదుపు, పెట్టుబడులు, మనీ మేనేజ్మెంటుకి సంబంధించి మీకు తెలిసిన, మీరు పాటించే వైవిధ్యమైన చిట్కాలు, విధానాలేమైనా ఉంటే మాకు రాయండి. మీ లేఖ పంపాల్సిన చిరునామా బిజినెస్ డెస్క్, సాక్షి తెలుగు దినపత్రిక, సాక్షి టవర్స్, రోడ్ నంబర్-1,బంజారాహిల్స్, హైదరాబాద్. పిన్-500034 email: business@sakshi.com -
‘ముంబై మోడల్’ కేసులో నిందితుడి అరెస్టు
సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని మోసం సికింద్రాబాద్: సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని ముంబై మోడల్‌ను నగరానికి రప్పించి మోసం చేసిన కేసులో నిందితుడిని ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సోషల్ నెట్వర్క్ ద్వారా యువతులను పరిచ యం చేసుకుని, సినిమా చాన్స్‌లు ఇప్పిస్తానని చెప్పి వ్యభిచార కూపంలోకి నెట్టేస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల కథనం ప్రకారం... ముంబైకి చెందిన మోడల్ శుభ్రతాదత్త సినిమాల్లో చాన్స్‌ల కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలోనే పుణెకు చెందిన జిత్తు అనే సినిమా బ్రోకర్ పరిచయమయ్యాడు. ఆమెను ఈనెల 4న హైదరాబాద్‌కు తీసుకువచ్చి సికింద్రాబాద్ కార్ఖానా ప్రాంతానికి చెందిన ప్రీత్‌సింగ్ ఎలియాస్ రాజువర్మకు(35)కు అప్పగించాడు. ఆ తరువాత జిత్తు తిరిగి పుణె వెళ్లిపోయాడు. మొదటిరోజు తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చి, మరుసటిరోజు ఆమెను సికింద్రాబాద్ ప్రాంతంలోని ఒక లాడ్జీకి తరలించాడు ప్రీత్‌సింగ్. కొద్దిరోజులు ఆమెను లాడ్జీలోనే ఉంచాక ప్రస్తుతం ఇక్కడ అవకాశాలు లేవని కొద్దిరోజుల తరువాత మళ్లీ సమాచారం అందిస్తామని, అప్పుడు రావాల్సిందిగా చెప్పి తిరిగి ముంబై పంపించేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు తీసుకువచ్చాడు. ఈ క్రమంలో ప్రీత్‌సింగ్ మత్తుమందు ఇచ్చాడని తాను అపస్మారక స్థితికి చేరుకోగానే తన వద్ద ఉన్న రూ.15 వేల నగదు, ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు తీసుకుని వెళ్లిపోయాడని దత్తా గోపాలపురం పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. గోపాలపురం పోలీసులు రైల్వేస్టేషన్ సమీపంలోని సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా నిందితుడి కోసం విచారణ ప్రారంభించి ప్రీత్‌సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో మారేడుపల్లికి చెందిన ఓ యువతికి సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికిన ప్రీత్‌సింగ్ ఆమెను కర్నూలు ప్రాంతానికి చెందిన కొందరు యువకులకు విక్రయించినట్టు తేలింది. -
గుడ్‌బై Google Orkut
ఆర్కుట్‌ను గూగుల్ త్వరలోనే శాశ్వతంగా మూసేయనుందట! అయినా ఆర్కుట్‌ను గూగుల్ మూసేయడం ఏమిటి? నెటిజన్లు ఏనాడో దాన్ని క్లోజ్ చేశారు కదా! లాగిన్ కావడం అత్యంత అరుదైపోయింది కదా! ఆర్కుట్ మొదలైన ఏడాదిలోనే ప్రారంభమైన ఫేస్బుక్ ప్రభావంతో ఆర్కుట్ అడ్రస్ గల్లంతయింది కదా! అయితే ఆర్కుట్‌ను మరీ అంతా చీప్‌గా తీసేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్కుట్ అపురూపమైనది. ప్రత్యేకించి భారతీయులకు సోషల్నెట్వర్కింగ్ మజాను పరిచయం చేసింది ఆ వెబ్‌సైటే. ఆర్కుట్ భారతీయ నెటిజన్లకు తొలి రచ్చబండ. ఫేస్‌బుక్‌కు ప్రాభవానికి ముందే ఒక వెలుగు వెలిగిన వెబ్సైట్! కాబట్టి అది కాలం కౌగిలిలో ఒదిగిపోతుండటం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అంశమే. టర్కీదేశానికి చెందిన ఆ యువకుడు చాలా కాలం కిందట దూరమైన తన స్నేహితురాలి ఆచూకీ తెలుసుకోవాలని అనుకొన్నాడు. అందుకు అనేక మార్గాల గురించి ఆలోచించగా అప్పుడప్పుడే విస్తృతం అవుతున్న ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ఆమెను కలుసుకొనే అవకాశం ఉందని గ్రహించాడు. అందుకోసం ఒక వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించాడు. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న తన స్నేహితులందరినీ అందులోకి చేరమని కోరాడు. వారి ద్వారా మరి కొందరిని అందులోకి చేర్చే ప్రయత్నం చేశాడు. ఆ విధంగా ఆ పోర్టల్ నెట్వర్క్ విస్తృతమైంది. మూడు సంవత్సరాలు గడిచే సరికల్లా ఆ పోర్టల్ టర్కీలో బాగా పాపులర్అయ్యింది. సోషల్ నెట్వర్కింగ్ అనేమాట పాపులర్ కావడానికి కారణమైంది. ఆ పాపులర్ నెట్‌వర్క్‌ను గూగుల్ కొనుగోలు చేయడంతోనే దాని పేరు మార్మోగింది. అప్పటికే పేరుపొందిన ఆ సెర్చ్ ఇంజన్ ఆ సైట్‌ను కొనుగోలు చేసి మరింత పాపులర్ చేసింది. సోషల్ నెట్వర్కింగ్ అనే మాటకు నిర్వచనంగా మార్చింది. ఆర్కుట్ బమొక్కొటెన్ అనే ఆ యువకుడు స్థాపించి, గూగుల్ చేత టేకోవర్ చేసిన ఆ వెబ్సైట్ ‘ఆర్కుట్ డాట్ కామ్’ భారత్, బ్రెజిల్‌లలో దుమ్మురేపింది! అదేం విచిత్రమో కానీ గూగుల్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఆర్కుట్‌ను పాపులర్ చేసినా అది బాగా నచ్చింది మాత్రం బ్రెజిల్, భారతదేశాలకు మాత్రమే. ఆర్కుట్ యూజర్లలో దాదాపు 50 శాతం మంది బ్రెజిల్‌కు చెందిన వాళ్లే. వారి తర్వాత 20 శాతం యూజర్లు మన దేశానికి చెందినవాళ్లు. మనదేశంలో కూడా కేరళలో ఆర్కుట్ వినియోగం ఎక్కువగా ఉండేది. ఆర్కుట్ సందడి అంతా ఇంతా కాదు! సినిమా హీరోల ఫ్యాన్ కమ్యూనిటీల దగ్గర, సినిమా పేర్ల మీద ఏర్పాటు చేసి ఆ సినిమా ఫ్యాన్స్‌ను ఒక వేదికపైకి తెచ్చే కమ్యూనిటీలతో మొదలు... కులాల పేర్లతో ఏర్పాటు అయిన కమ్యూనిటీల వరకూ అనేకం ఆర్కుట్లో సందడి చేశాయి. చాట్‌రూమ్ ఆప్షన్లుకూడా ఆకట్టుకొన్నాయి. ఫేస్బుక్ దెబ్బతో ఫేడవుటయ్యింది! ఎంత తొందరగా విస్తృతమైందో అంతే త్వరగా పతనావస్థకు చేరుకొంది ఆర్కుట్. అప్పటికే అమెరికా వంటి దేశాలను ఉర్రూతలెక్కించిన ఫేస్బుక్ మనదేశంలోనూ తన పంథాను కొనసాగించింది. దీంతో ఆర్కుట్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. విస్తృతం అయిన మూడు సంవత్సరాల్లోనే ఫేస్బుక్ జనాలను ఆర్కుట్‌కు దూరం చేసింది. దాదాపు రెండేళ్ల నుంచి ఆర్కుట్లో అకౌంట్ కలిగిన వారు కూడా దాంట్లోకి లాగిన్ కావడం పూర్తిగా మానేశారు. అంత వరకూ స్క్రాప్లతోనూ, చాట్రూమ్లతోనూ ఆర్కుట్లో యాక్టివ్‌గా ఉన్నవారు కూడా ఫేస్బుక్ మాయలో పడిపోయారు. గూగుల్ అప్పుడే గుర్తించింది! ‘గూగుల్ ప్లస్’ను ప్రారంభించి జనాలను ఫేస్బుక్ వైపు నుంచి తనవైపుకు తిప్పుకోవాలని ప్రయత్నించింది గూగుల్. ఆ కొత్త సైట్ ప్రారంభంతోనే ఆర్కుట్‌కు ప్రాధాన్యం తగ్గించేసింది. ఇప్పుడు కూడా తమ ఇతరసైట్లపై దృష్టిపెట్టడానికి గూగుల్ ప్లస్, యూట్యూబ్‌లను మరింత విస్తృతం చేసుకోవడానికి ఆర్కుట్‌ను మూసివేస్తున్నట్టుగా గూగుల్ ప్రకటించడం విశేషం! ఇప్పుడెలా?! ఆర్కుట్లో ప్రతి యూజరూ కొన్ని వందల కొద్దీ ఫోటోలను షేర్ చేసుకొని ఉంటాడు, లాగిన్కాకపోయినా ఆ ఫోటోలు, ఆ జ్ఞాపకాలు విలువైనవే, దాన్ని దృష్టిలో ఉంచుకొనే వాటన్నింటినీ బ్యాకప్‌లో ఉంచుతామని, ఆర్కీవ్స్‌లో అవి లభ్యమవుతాయని గూగుల్ వివరించింది. మరి ఆ ఆర్కీవ్స్ ఎలా తీసుకోవాలి? అనేదానిపై ఇంకా పూర్తి వివరణ లభ్యం కావడం లేదు. అప్పట్లోనే షేర్ చేసుకొమ్మంది! గూగుల్ ప్లస్‌ను ప్రారంభించిన కొత్తలో తన యూజర్ల చేత తప్పనిసరిగా ఆ సోషల్సైట్లో అకౌంట్ మొదలు పెట్టించింది. అలా ప్రారంభించిన అకౌంట్లోకి ఆర్కుట్‌లోని ఫోటోలను ఒకే క్లిక్‌తో షేర్ చేసుకొనే అవకాశాన్ని ఇచ్చింది. ఒకవేళ అప్పుడే అలా క్లిక్ చేసి ఉంటే.. బ్యాకప్ గురించి బెంగపెట్టుకోనక్కర్లేదు. మరి ఇప్పుడు కూడా గూగుల్ తన గూగుల్ప్లస్ను పాపులర్ చేసుకొనే ఉద్దేశంతో ఆర్కుట్బ్యాకప్ను అందులోకి షేర్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వొచ్చని అంచనా! పీఎస్: ఆర్కుట్ త్వరలో శాశ్వతంగా మూతబడుతోందనే విషయాన్ని నెటిజన్లు తమ ఫేస్బుక్ వాల్‌పై షేర్ చేస్తుండటం విశేషం! ఏదేమైనా టెక్నాలజీ విస్తృతం కావడంతో దూరమైన టేప్రికార్డర్లు, వీసీపీలు ఎంత అపురూపమైనవనిపిస్తాయో.. సోషల్నెట్వర్కింగ్ విషయంలో ఆర్కుట్కూడా వాటిస్థాయిలోనే అపురూపమైనదనడంలో అతిశయోక్తి లేదు! - జీవన్‌రెడ్డి. బి -
ఆర్కుట్కి వీడ్కోలు
-
సోషల్ మీడియాలోనూ 'బాస్'దే పైచేయి!
-
ఫేస్బుక్లో మనకూ ఓ పేజీ
‘ఫేస్బుక్’.. ఈ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ గురించి తెలియని వాళ్లు అరుదనే చెప్పాలి. టీనేజ్ కుర్రకారు నుంచి 60 ఏళ్ల వయస్సు వారికి ఇందులో అకౌంట్ ఉంది. ఫేస్బుక్ (ఎఫ్బీ) ద్వారా ప్రపంచంలో ఏమూలనున్నా టెక్ట్స్ ఛాటింగ్, వీడియో ఛాటింగ్ కనెక్ట్ అయి ఉంటారు. ఇందులో చెప్పుకోదగ్గ మరో అంశం ఫేస్బుక్ పేజీ. మనకు ఇష్టమైన అంశం గురించి, వ్యక్తి గురించి, ప్రాంతం గురించి ఇందులో పేజీ తయారు చేసుకొని అభిప్రాయాలు పంచుకోవచ్చు. ఎఫ్బీలో ప్రస్తుతం పేజీ సంస్కృతి బాగా పెరిగిపోయింది. దీనిని ఎఫ్బీ వినియోగదారులు బాగానే వినియోగించుకుంటున్నారు. కళాశాలలు, రాజకీయ నేతల పేర్లతో ఉన్న పేజీలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇవి చాలా స్పెషల్ ఇట్స్‌మై చిత్తూర్, తిరుపతి రిలీజియన్ ఆర్గనైజేషన్, తిరుపతి సిటీ లాంటి పేజీలు జిల్లాలో ఎఫ్బీ యూజర్స్‌కు సుపరిచితమే. కొందరు ఔత్సాహికులు వీటిని నిర్వహిస్తూ యూజర్స్‌కు వినోదంతో పాటు సమాచారాన్ని అందిస్తున్నారు. ఇట్స్ మై చిత్తూర్ పేజీలో చిత్తూరులో రోజూ జరిగే విశేషాలు, చూడదగ్గ ప్రదేశాలు లాంటివి పెడుతుంటారు. దీనికి 11వేల మంది అభిమానులున్నారు. తిరుపతి రిలీజియన్ ఆర్గనైజేషన్‌కు అత్యధికంగా 2 లక్షల 29 వేల మంది అభిమానులున్నారు. ఈపేజీలో తిరుమల, తిరుపతిలోని దేవాలయాల విశేషాలను పెడుతుంటారు. అలాగే అక్కడ దేవుళ్లకు జరిగే పూజల ఫొటోలను అభిమానులకు అందుబాటులో ఉంచుతుంటా రు. ఇంకా తిరుపతి సిటీ పేజీకి ఐదు వేలమంది పైనే అభిమానులు ఉన్నారు. ఇందులో తిరుపతికి సంబంధించిన విశేషాలు, ఫొటోలను అభిమానుల కోసం పెడుతుంటారు. అలాగే సిటీలో ఏఏ కార్యక్రమాలు జరుగుతాయనే వివరాలను పేజీలో అప్డేట్ చేస్తుంటారు. ఇంకా జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల పేర్లతోనూ ఔత్సాహికులు పేజీలు నిర్వహిస్తున్నారు. రాజకీయ నేతలకు కూడా.. జిల్లాలోని ప్రముఖ రాజకీయ నేతల పేర్లతో ఫేస్బుక్లో ప్రత్యేకంగా పేజీలు ఉన్నాయి. దీని ద్వారా వాళ్లు చేసే కార్యక్రమాల వివరాలు, ఫొటోలను అభిమానుల కోసం అప్డేట్ చేస్తుంటారు. వైఎస్సార్ సీపీ చిత్తూరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఆర్కే.రోజా, భూమన కరుణాకరరెడ్డి, టీడీపీ చిత్తూరు, కఠారి మోహన్ యూత్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, తలారి ఆదిత్య, సత్యప్రభ ఆదికేశవులు ఇలా తదితరుల పేర్లతో పేజీలు ఉన్నాయి. దినపత్రికల్లో వారిపై వచ్చే వార్తా విశేషాలను పేజీలో పెడుతూ అభిమానుల నుంచి లైక్స్ సంపాదిస్తుంటారు. ఎక్కువగా వాడుతోంది కళాశాలలే ఫేస్బుక్లో ఎక్కువగా పేజీలు ఓపెన్ చేసి వాడుతోంది జిల్లాలోని కళాశాలలే. దీని యూజర్స్‌గా ఉండే కళాశాల విద్యార్థులు అభిప్రాయాలు పంచుకోవడమే కాకుండా కళాశాల గురించి ప్రచారం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగించుకుంటున్నారు. శ్రీవెంకటేశ్వరా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఎస్వీసీఈ), శ్రీవెంకటేశ్వరా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎస్వీసెట్), యోగానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్, శ్రీశ్రీనివాసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సెన్సైస్ (సీతమ్స్) ఇలా ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలు, శ్రీ వెంకటేశ్వరా వేదిక్ యూనివర్సిటీల పేరుతో ఎఫ్బీలో పేజీలు ఉన్నాయి. వీటికి అభిమానులు బాగానే ఉన్నారు. కళాశాలలో జరిగే ఫ్రెషర్స్‌డే, వినూత్న కార్యక్రమాల వివరాలు, ఫొటోలు పేజీల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. పేజీలకు అభిమానులుగా ఉండే విద్యార్థులు వీటికి లైక్స్ కొడుతూ కామెం ట్స్ చేసుకుంటారు. ఇంకా కళాశాల అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎవర్ని సంప్రదించాలనే వాటిపై ప్రచారం కూడా చేసుకుంటున్నారు. జిల్లాలో పాఠశాలలు, కాలేజీల పేరుతో ఎఫ్బీలో చాలా పేజీలు ఉన్నాయి. విద్యాశాఖకు ఓ పేజీ జిల్లా విద్యాశాఖ ఎఫ్బీలో ఓ పేజీ తయారు చేసుకుంది. విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను నిర్వహించే ప్రేమ్‌కుమార్ అనే ఉపాధ్యాయుడు దీనిని నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ నుంచి వచ్చే ఉత్తర్వులను వెబ్‌సైట్‌తో పాటు పేజీలోనూ పెడుతుంటారు. ప్రస్తుతం టీచర్లలో చాలా మంది స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్నారు. వీరిలో ఎఫ్బీలో చాలా మందికి అకౌంట్ ఉంది. దీంతో విద్యాశాఖ పేజీ ద్వారా వివరాలు సులువుగానే తెలుసుకుంటున్నారు. -
ఫేస్‌బుక్‌తో కోటక్ జిఫీ అకౌంటు
జిఫీ అకౌంటు పేరిట ఫేస్బుక్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా కూడా బ్యాంకు అకౌంట్లను తెరిచే అవకాశం ఇస్తోంది కోటక్ మహీంద్రా బ్యాంక్. ఇందులో మినిమం బ్యాలెన్స్ బాదరబందీ ఉండదు. దీనికోసం కోటక్జిఫీడాట్కామ్లో మన ఫేస్బుక్ లేదా మెయిల్ అకౌంటును రిజిస్టర్ చేసుకుంటే బ్యాంకు ఇన్విటేషన్ పంపిస్తుంది. ప్రారంభంలో కనీసం రూ. 5,000తో అకౌంటు ప్రారంభించాలి. ఈ అమౌంటును కూడా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ బ్యాలె న్స్ రూ. 25,000కు మించి ఉంటే అదనపు మొత్తం ఆటోమేటిక్‌గా టర్మ్ డిపాజిట్ కింద మారి, అధిక వడ్డీ తెచ్చిపెడుతుంది. ట్విటర్ అకౌంటు ద్వారా కూడా జిఫి అకౌంటును ఆపరేట్ చేయొచ్చు. బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, చెక్ బుక్కుల కోసం దరఖాస్తులు చేసుకోవడం వంటివి చేయొచ్చు. -
సోషల్ నెట్వర్క్ అండి బాబూ..
-
నాపై దుష్ర్పచారం చేస్తున్న దుండగులను వదలొద్దు
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌కు షర్మిల ఫిర్యాదు వెబ్సైట్లు, సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ర్పచారం నన్ను గాయపర్చింది నేనెప్పుడూ కలవని, మాట్లాడని, కనీసం చూడని వ్యక్తితో ముడిపెడితూ వదంతులు సృష్టిస్తున్నారు ఒక్క ఆధారం కూడా లేకుండా పిరికిపందలు నాపై రాతలు రాస్తున్నారు నా సచ్ఛీలతకు భగవంతుడే సాక్షి గుండె లోతుల్లో గూడు కట్టుకున్న అంతులేని క్షోభతో, బాధాతప్తమైన హృదయంతో ఈ ఫిర్యాదు చేస్తున్నాను హైదరాబాద్: సోషల్ నెట్వర్క్ సైట్లలో, పలు వెబ్సైట్లలో తనపై హీనాతిహీనమైన రీతిలో సాగుతున్న దుష్ర్పచారాన్ని తక్షణం అరికట్టాలని, అలా చేస్తున్న పిరికిపందలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిలా రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పీఏసీ సభ్యుడు డీఏ సోమయాజులు శనివారం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డిని కలసి అందజేశారు. తాను చేస్తున్న ఈ ఫిర్యాదు కేవలం తన గౌరవ మర్యాదలు కాపాడుకోవడం కోసమే కాదని, తాను రాస్తున్నది.. సమాజంలోని ప్రతి తల్లి, ప్రతి భార్య, ప్రతి బిడ్డ గౌరవానికి సంబంధించిందని ఫిర్యాదులో షర్మిల పేర్కొన్నారు. ఎవరో అకారణంగా మోపుతున్న అభాండాలకు వివరణ ఇచ్చుకోవాల్సి రావడం అనేది ఏ మహిళకైనా దుర్భరమైన విషయమని, చాలా మందిలాగే తనను కూడా కొందరు లక్ష్యంగా(టార్గెట్) చేసుకుని దుష్ర్పచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మహిళల విషయంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే స్థాయికి నేటి రాజకీయాలు పడిపోయాయన్నారు. ‘సినీ నటుడు ప్రభాస్‌కు ముడిపెడుతూ ఇంటర్నెట్లో వదంతులు ప్రచారం అవుతున్నాయి. నేనింత వరకూ ప్రభాస్‌ను కలవలేదు, మాట్లాడలేదు, కనీసం చూడనైనా లేదు... నా గౌరవ మర్యాదలు దెబ్బతీసే దుర్మార్గమైన లక్ష్యంతో అత్యంత క్రూరమైన రీతిలో ఈ దుష్ర్పచారం చేస్తున్నారు. ఇక్కడ నేనొక వాస్తవాన్ని స్పష్టం చేయదల్చుకున్నాను. వందలాది వెబ్సైట్లలో కొనసాగుతున్న ఈ ప్రచారానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారంటే ఈ వదంతులు నిరాధారమైనవని వేరేగా చెప్పాల్సిన అవసరమే లేదు’ అని షర్మిల పేర్కొన్నారు. షర్మిల చేసిన ఫిర్యాదులో ముఖ్యాంశాలివీ.. ఈ ఫిర్యాదుతో మరింత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారని తెలుసు.. న్యాయం కోసం తానిపుడు చేసే పోరాటం ఒక పెద్ద అంశంగా మారుతుందని తెలుసుననీ, తనకు సరైన న్యాయం జరుగుతుందన్న నమ్మకం కూడా లేదని షర్మిల పేర్కొన్నారు. కుసంస్కారులు, నేలబారు వ్యక్తుల అనైతిక కుట్రకు తాను అనవసర ప్రాధాన్యతనిస్తున్నాననే విషయం కూడా తనకు తెలుసుననీ, ఈ విషయంలో తాను పోరాటానికి దిగిన వెంటనే దీని నుంచి కూడా వినోదం పొందాలనుకునే వారు తమపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారని కూడా తెలుసునని ఆమె అన్నారు. ‘అయినప్పటికీ ఇలాంటి అవరోధాలకు ఎదురొడ్డి నిలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీన్ని వైరల్ గ్రోత్తో మరింతగా వ్యాప్తి చేస్తారన్న భయంతో ఇలాంటి పిరికిపందలను వదిలేసి తలదించుకుని మౌనంగా ఉండిపోవడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఈ విష ప్రచారాన్ని ఖండించకుండా ఉంటే ఈ వదంతులే నిజమనుకునే ప్రమాదం ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ లక్ష్యాలు నెరవేరాలని నేను నిజాయితీగా మనస్ఫూర్తిగా కోరుకున్నా...అందుకే మా అన్న తరఫున పోరాడా. ఈ విషయంలో ఎవరైనా నాతో విభేదించాలనుకుంటే నా కళ్లలోకి చూస్తూ నా నమ్మకాలను సవాలు చేసి ఉంటే వారి ప్రయత్నాన్ని నేను గౌరవించే దాన్ని, కానీ ఇలా దొంగదెబ్బ తీసేందుకు చేసే కుట్రలను మాత్రం నేను క్షమించలేను’ అని షర్మిల ఘాటుగా స్పందించారు. నేను తప్పుచేయకపోయినా.. ‘‘ఒక భారతీయ మహిళగా నేను విలువలు కలిగిన భార్యను, గౌరవ మర్యాదలు కలిగిన తల్లిని, సంస్కారం నిండిన చెల్లిని, బిడ్డని, నా సచ్ఛీలతకు ఆ భగవంతుడే సాక్షి. నా గౌరవమర్యాదలను దెబ్బ తీసే ప్రయత్నాలను చూసి నేను బాగా క్షోభ చెందాను. నేనే తప్పు చేయకపోయినా నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు బోనెక్కాల్సి రావడం బాధిస్తోంది. మర్యాదగల ఇతర మహిళల మాదిరిగానే నేను గుండె లోతుల్లోంచి బాధతో కుమిలిపోతున్నాను. ఇది కేవలం నా ఒక్కదాని సమస్యే కాదు, ప్రతి మహిళ ప్రతిష్టకూ సంబంధించింది. అందుకే మౌన ప్రేక్షకుల్లా మిగిలిపోవద్దు’’ అని పోలీసులకు షర్మిల విజ్ఞప్తి చేశారు. నిజమా కాదా అని కనీసం ఆలోచించలేదు.. ఈ రోజు వరకూ నిరాధారమైన తప్పుడు కూతలను వివిధ పోర్టల్స్, వెబ్సైట్లు, డొమైన్లలో బాధ్యతా రాహిత్యంగా ప్రదర్శనకు పెట్టిన వారు, అసలు వీటిలో నిజం ఉందా అని ఆలోచించనే లేదని షర్మిల పేర్కొన్నారు. ఈ దుష్ర్పచారాన్ని వ్యాప్తి చేసిన దుర్మార్గులు వేర్వేరు పోర్టళ్లు, వెబ్సైట్లు, సోషన్ నెట్వర్కింగ్ మీడియాను ఈ తప్పుడు ఆరోపణల వ్యాప్తికి వినియోగిస్తున్నారన్నారు. ఈ విషప్రచారానికి సంబంధించి కొన్ని సైట్లు, లింకులపై వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున మే 1వ తేదీన పార్టీ ప్రధాన కార్యదర్శి ఫిర్యాదును సమర్పిస్తే కేసు దర్యాప్తును ప్రారంభించారని, ఓ పక్క దర్యాప్తు జరుగుతూ ఉండగానే తాజాగా మరికొందరు వ్యక్తులు నీతిబాహ్యమైన ఆరోపణలతో సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తూనే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఆయా వెబ్సైట్లు, డొమైన్ల ఇన్‌చార్జీలతో ఈ వ్యక్తులు కుమ్మక్కు కావడంతోనే ఆగుకుండా ఈ ప్రచారం సాగుతోందన్నారు. కఠినంగా శిక్షించండి..: ఈ నీతిబాహ్యమైన వ్యవహారం తనను తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేసిందని, ఇలాంటి దుష్ర్పచారంలో సూత్రధారులు, పాత్రధారులు అయిన ప్రతి ఒక్కరిపైనా ఐపీసీలోని 509, 499, 500, 501 సెక్షన్లతోపాటు ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని షర్మిల పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ దుష్ర్పచారాన్ని వ్యాప్తి చేస్తున్న సంస్థలను ప్రోత్సహిస్తూ వారికి వేదికగా నిలుస్తున్న సఫారీ, గూగుల్ సెర్చ్ ఇంజిన్లపై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని, తనపేరు టైప్ చేయగానే ఈ ఇంజిన్లు ఈ విషప్రచారాన్ని ప్రముఖంగా ప్రదర్శిస్తున్నాయన్నారు. తనపై నీతిబాహ్యమైన ప్రచారాన్ని ఆపాల్సిందిగా వివిధ సెర్చ్ ఇంజిన్లు, సోషల్ మీడియా పోర్టల్స్‌కు ఆదేశాలు జారీ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
‘ట్వీట్’లోనూ సూపర్ హిట్!
ముంబై: క్రికెట్ అభిమానులకు సంపూర్ణ టి20 వినోదాన్ని అందించిన ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కు సోషల్ నెట్వర్కింగ్ సైట్ ‘ట్విట్టర్’లోనూ అమిత ఆదరణ లభించింది. ఈ సీజన్లో ఎక్కువ మంది ట్వీట్ల ద్వారా చర్చించిన మ్యాచ్‌గా ఇది నిలిచింది. ఐపీఎల్ అధికారిక సమాచారం ప్రకారం ఓవరాల్‌గా లీగ్ దశ ముగిసే సరికి ముంబై జట్టు గురించి 3 లక్షల 60 వేల ట్వీట్స్ పోస్ట్ కాగా, చెన్నై 2 లక్షల 48 వేల ట్వీట్లతో రెండో స్థానంలో ఉంది. అయితే కొత్త ఫాలోవర్లను జత చేసుకోవడంలో మాత్రం 90 వేలతో చెన్నై అగ్రస్థానంలో ఉంది. ఆటగాళ్ల విషయానికి వస్తే... విరాట్ కోహ్లి గురించి ఒక లక్షా 61 వేల ట్వీట్స్ ప్రచురితం కావడం విశేషం! -
డేటింగ్‌కు రావడం లేదని..!
అమెరికాలో ఉన్మాది కాల్పులు వాహనంలో వెళ్తూ ఘాతుకం; ఆరుగురి మృతి అమ్మాయిలు ప్రేమించడం లేదన్న నిస్పృహతో దుశ్చర్య! లాస్ఏంజెలిస్: అమెరికాలో ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు. దక్షిణ కాలిఫోర్నియాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా క్యాంపస్ ఉన్న ఇస్లావిస్టా పట్టణంలో శుక్రవారం రాత్రి(స్థానిక కాలమానం ప్రకారం) నలుపు రంగు బీఎండబ్ల్యూ వాహనంలో ప్రయాణిస్తూ.. పాదచారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఆరుగురి నిండుప్రాణాలు తీశాడు. దాదాపు తొమ్మిది ప్రాంతాల్లో కాల్పులకు తెగబడ్డాడు. ఆ కాల్పుల్లో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ వాహనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో వారిపై కూడా కాల్పులు జరిపాడు. ప్రతిగా పోలీసులు కూడా కాల్పులు జరిపారు. అలా రెండు సార్లు పోలీసుల నుంచి తప్పించుకుని చివరగా ఒక ఆగి ఉన్న కారును ఢీ కొని ఆగిపోయాడు. వాహనం దగ్గరికి వెళ్లి పరిశీలించిన పోలీసులకు తలపై బులెట్ గాయంతో ఉన్న అతడి మృతదేహం కనిపించింది. వారికి ఆ వాహనంలో ఒక సెమీ ఆటోమేటిక్ హ్యాండ్‌గన్ లభించింది. కాల్పులకు కారణం ఇంకా తెలియరాలేదని, ఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరిస్తున్నామని స్థానిక సాంటా బార్బరా కౌంటీ పోలీస్ అధికారి బిల్ బ్రౌన్ వెల్లడించారు. స్థానికంగా పరిస్థితి సామూహిక హత్యాకాండ జరిగినట్లుగా ఉందన్నారు. ఇస్లావిస్టా పట్టణ వాసులను ఇళ్లల్లోంచి బయటకు రావద్దని సూచించారు. ఆ దుండగుడు ఒక బెదిరింపు వీడియోను కూడా యూట్యూబ్‌లో అప్లోడ్ చేసినట్లు అందిన సమాచారంపై కూడా దర్యాప్తు జరుపుతున్నామన్నారు. దుండగుడి పేరును మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఈ ఘాతుకానికి పాల్పడింది 22 ఏళ్ల ఇలియట్ రోడ్జర్ అని భావిస్తున్నారు. రోడ్జర్ అప్లోడ్ చేశాడంటున్న వీడియో దాన్ని ధ్రువీకరిస్తోంది. 22 ఏళ్లు వచ్చినా తనకు శృంగారానుభవం లేదని, ఏ అమ్మాయినీ ముద్దు కూడా పెట్టుకోలేదని, తనతో డేటింగ్‌కు ఒప్పుకోని అమ్మాయిలపై ప్రతీకారం తీర్చుకుంటానని ‘రోడ్జర్ ప్రతీకారం’ అనే పేరుతో ఉన్న ఆ వీడియోలో రోడ్జర్ హెచ్చరించాడు. ‘కాలేజ్ రోజుల్లోనే అంతా అద్భుతమైన శృంగార అనుభవాల్ని పొందుతారు. నాకు అవేమీ లభించలేదు. అమ్మాయిలు మంచివాడైన నన్ను కాదని దుర్మార్గులకు దగ్గరవుతున్నారు.. అందమైన అమ్మాయిలుండే ‘యూఎస్సీబీ’కి వెళ్లి కనిపించిన వారినందరినీ కాల్చి చంపేస్తాను.. అని ఆ వీడియోలో హెచ్చరించాడు. అతని ఇతర సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లలోనూ ఒంటరితనానికి, ప్రతీకారానికి సంబంధించిన వ్యాఖ్యలే ఉన్నాయి. రోడ్జర్ సాంటా బార్బరా సిటీ కాలేజ్ విద్యార్థి అని, హంగర్ గేమ్స్ అనే సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేసిన పీటర్ రోడ్జర్ కుమారుడని సమాచారం. -
కాజల్‌కే కిరీటం
అందానికి అందం కాజల్. అందరూ అభిమానించేది ఈ క్రేజీ భామనే. హీరోయిన్గా విజయకేతనం ఎగురవేస్తున్న కాజల్ అగర్వాల్‌ను తాజాగా అరుదైన రికార్డు వరించిం ది. ట్విట్టర్, ఫేస్బుక్ లాంటివి ప్రస్తుతం యువతను చాలా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సోషల్ నెట్వర్కులు హీరో హీరోయిన్లకు అపార క్రేజ్‌ను తెచ్చి పెడుతున్నాయి. ఆ విధంగా నటి కాజల్ అగర్వాల్ ఇప్పుడు వార్తల్లో కెక్కారు. ఫేస్బుక్లో అత్యధిక అభిమానులు గల దక్షిణాది నటిగా కాజల్ రికార్డుకెక్కారు. అలాగే మన దేశంలోనే అత్యధికంగా అభిమానులుండే హీరోయిన్లలో ఈమె నాలు గో స్థానంలో నిలిచారు. ఒకటి, రెండు, మూడు స్థానాల్లో దీపికా పదుకునే, ప్రియాంక చోప్రా, మాధురి దీక్షిత్‌లు అత్యం త అభిమానులు గల హీరోయిన్లుగా నమోదయ్యారని సోషల్ నెట్వర్కు ఇటీవల వెల్లడించింది. ఒకప్పుడు కోలీవుడ్‌లో ఐరన్‌లెగ్ ముద్ర వేయిం చుకున్న కాజల్ అగర్వాల్ భరత్ సరసన నటించిన పళని తరువాత కోలీవుడ్‌ను వదిలి టాలీవుడ్ రంగ ప్రవేశం చేశారు. అక్కడ చందమామ వంటి చిన్న చిత్రాలు విజయానందాన్ని కలిగించినా, కాజల్‌ను స్టార్ హీరోయిన్ చేసిన చిత్రం మాత్రం మగధీరనే. ఆ తరువాత మరికొన్ని విజయాలతో కాజల్ టాప్ హీరోయిన్ అయిపోయారు. దీంతో ఈ బ్యూటీపై కోలీవుడ్ కన్ను పడింది. విజయ్ సరసన నటించిన తుపాకీ ఈ ముద్దుగుమ్మకు కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అలాగే కార్తీతో నటించిన నాన్ మహన్ అల్ల, సూర్యకు జంటగా మాట్రాన్, ఇటీవల మరోసారి ఇళయదళపతితో రొమాన్స్ చేసిన జిల్లా, చిత్రాలు అభిమానుల ఆదరణకు గురి చేశాయి. దక్షిణాదిలో అత్యధిక అభిమానులు ఇష్టపడే హీరోయిన్ని రికార్డు కెక్కిన కాజల్ సంతోషంతో సంబరాలు జరుపుకుంటోందట. ఈ విషయాన్ని ఆమె ఫేస్బుక్లో పోస్టు చేస్తూ త్వరలోనే ఒక పెద్ద సర్ప్రైజ్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు పేర్కొన్నారు. -
మెట్రోలతో పోలిస్తే తీసికట్టు
ఆశాజనకంగా లేని ‘గ్రేటర్’ పోలింగ్ చర్చనీయాంశమైన సిటీజనుల తీరు సాక్షి, సిటీబ్యూరో : ‘ఓటుహక్కు వినియోగించుకోండి’ అంటూ ప్రజాసంఘాలు, సెలబ్రిటీలు, స్వచ్ఛంద సంస్థలు, సోషల్ నెట్వర్కింగ్ సైట్లు.. చివరికి ఎన్నికల సంఘం నెత్తీ నోరూ మొత్తుకున్నా గ్రేటర్లో ఓటింగ్ రవ్వంత కూడా పెరగలేదు. 2009 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం ఇంకా తగ్గింది. విస్తృత ప్రచారం జరిగినా ఓటేయడానికి కదలని సిటీజనుల తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు దేశంలోని ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై తదితర మెట్రో నగరాలతో పోల్చినా నగరంలోనే తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. మెట్రోల్లో మెరుగైన పోలింగ్ శాతం ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో అత్యధికంగా 64 శాతం పోలింగ్ నమోదవడంతో మెట్రో నగరాలకేఈ మహా నగరం ఆదర్శంగా నిలిచింది. ఆ తర్వాత ద్వితీయస్థానంలో నిలిచిన కోల్‌కతాలో 62.25 శాతం పోలింగ్ నమోదైంది. తృతీయస్థానంలో నిలిచిన చెన్నైలో 60.9 శాతం, నాలుగోస్థానంలో నిలిచిన బెంగళూరు, ముంబై నగరాల్లో 54 శాతం మేర పోలింగ్ నమోదయ్యింది. నగరం మాత్రం 53.38 శాతానికే పరిమితమైంది. 2009 ఎన్నికల్లో గ్రేటర్లో 54.31 శాతం మేర పోలింగ్ నమోదైంది. మెట్రోల్లో పోలింగ్ పెంచిన అంశాలివీ... ఓటరు చైతన్యం పెంచేందుకు ఆయా నగరాల్లో ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. బస్తీలకు సమీపంలో బూత్‌లను కేటాయించింది. ఓటరు స్లిప్పులను సకాలంలో పంపిణీ చేశాయి. ఓటరు స్లిప్పులు లేనివారు సైతం ఈసీ ధ్రువీకరించిన 11 ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి ఉంటే ఓటు వేయవచ్చన్న ప్రచారం విస్తృతంగా సాగింది. సోషల్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఓటు హక్కుపై విస్తృత ప్రచారం జరగడంతో ఓటర్లలో చైతన్యం పెరిగింది. ‘గ్రేటర్’ పోలింగ్ తగ్గడానికి కారణాలివీ... 18-35 ఏళ్ల వయస్కులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. సెలవు దినం కావడంతో ఇతర వ్యాపకాలలో పడ్డారు. ప్రచార హోరు పెరగడంతో ఏ పార్టీ అభ్యర్థికి ఓటేయాలో తేల్చుకోలేక అయోమయానికి గురయ్యారు. జీహెచ్ఎంసీ యంత్రాంగం పోలింగ్చీటీలు సరిగా పంపిణీ చేయలేకపోయింది. పోలింగ్ బూత్‌ల కేటాయింపు అస్తవ్యస్తంగా మారింది. చాలామంది బూత్ ఎక్కడో తెలుసుకోలేకపోయారు. కొందరు తమ నివాసానికి పోలింగ్ బూత్ దూరంగా ఉండటంతో నిర్లిప్తత వహించారు. అపార్ట్మెంట్ వాసులు తమ సమస్యల పరిష్కారానికి రాజకీయ నాయకులు ఉపయోగపడరన్న అభిప్రాయంతో ఉండడం గమనార్హం. తక్షణం తమ సమస్యల పరిష్కారానికి అధికారులను సంప్రదిస్తే చాలన్న ధోరణి పెరిగింది. పలు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థులు పలు కాలనీలు, బస్తీల్లో అసలు ప్రచారమే (పూర్ క్యాంపెయినింగ్) చేయలేదు. ప్రచార బాధ్యతలను ద్వితీయశ్రేణి నాయకగణం, కార్యకర్తలపైనే నెట్టివేశారు. దీంతో మొక్కుబడిగా ప్రచారం సాగింది. స్థానిక సమస్యల పరిష్కారానికి అభ్యర్థులు నిర్దిష్టమైన హామీలను మేనిఫెస్టోలో పేర్కొనలేదు జాబితాలో తమ పేరు లేదేమోనన్న ఆందోళనతో చాలామంది పోలింగ్ బూత్‌ల ముఖం చూడలేదు. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌లకు వెళ్లిన పలువురు జాబితాలో పేరు లేక తిరుగుముఖం పట్టారు. గంటల తరబడి పోలింగ్ స్టేషన్ల వద్ద పడిగాపులు పడితే వేసవి తాపానికి గురవుతామని పలువురు ఆందోళన చెందారు. -
ఎందుకిలా..?
పోటెత్తని ఓటింగ్ తలకిందులైన అధికారుల అంచనాలు 60 శాతం మందికి అందని ఓటరు చీటీలు గుర్తింపు కార్డులనూ పట్టించుకోని సిబ్బంది అధికార యంత్రాంగం వైఫల్యం సాక్షి, సిటీబ్యూరో: ‘ఓటేయండి.. జనం సత్తా చాటండి’ గత కొద్దిరోజులుగా నగరంలో ఎక్కడా చూసినా ఇదే ప్రచారం. ఎన్నికల యంత్రాంగం, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, మీడియా మూకుమ్మడిగా ఓటుహక్కుపై ప్రచారాన్ని హోరెత్తించాయి. ఇలా ‘గ్రేటర్’లో పోలింగ్ శాతం పెంచేం దుకు ఎవరెన్ని విధాలుగా ఎంత కసరత్తు చేసినా.. ఎన్ని చర్యలు తీసుకున్నా ఆశించిన స్థాయిలో కాదు కదా, కనీసం గతంలో కన్నా పోలింగ్ శాతం పెరగలేదు. కారణాలేంటి? ఎందుకిలా జరిగింది? ఇప్పుడు అధికారులను, అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది. ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవడంలో కనిపించిన ఉత్సాహం.. పోలింగ్ రూపంలో కానరాలేదు. మూడు మాసాల వ్యవధిలోనే దాదాపు 3 లక్షల మంది కొత్త ఓటర్లుగా పేర్లు నమోదు చేయించుకున్నారు. ఓటుహక్కుపై అవగాహన వల్లే అంతమంది ముందుకొచ్చి పేర్లు నమోదు చేయించుకున్నారని భావించిన అధికార యంత్రాంగం.. పోలింగ్‌లోనూ అది ప్రతిఫలిస్తుందనుకున్నారు. కానీ.. వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. గత ఎన్నికల కంటే ఒక్కశాతం పోలింగ్ కూడా పెరగకపోవడం వెనుక వివిధ కారణాలను ప్రస్తావిస్తున్నారు. అటు అధికారులు.. ఇటు రాజకీయ విశ్లేషకులు.. ఎన్జీవోలు.. తదితరుల అభిప్రాయాల మేరకు పోలింగ్ శాతం పెరగకపోవడానికి కారణాలివీ... గతంలో ఓటరు స్లిప్పుల్ని రాజకీయ పార్టీలూ పంచేవి. ఈసారి దాన్ని నివారించారు. ఎన్నికల ఉద్యోగులే ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పుల్ని పంచితే మంచి ఫలితముంటుందని అధికారులు అంచనా వేశారు. కానీ.. క్షేత్రస్థాయిలో దీన్ని అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. తగినంత వ్యవధి లేకపోవడం.. ఒక్కో బీఎల్ఓ రోజుకు 200 ఇళ్లు తిరగ్గలరని భావించినప్పటికీ అమలులో అది సాధ్యం కాకపోవడం వంటి కారణాలతో దాదాపు 60 శాతం ఓటర్లకు స్లిప్పులే అందలేదు. ఎస్ఎంఎస్ ద్వారా పోలింగ్ కేంద్రం తెలిసే ఏర్పాట్లు చేసినప్పటికీ.. ఈ సదుపాయాన్ని కొందరే వినియోగించుకున్నారు. ఓటరు స్లిప్పులు లేకపోయినా నిర్ణీత 11 డాక్యుమెంట్లలో ఏది చూపినా ఓటుకు అవకాశం కల్పిస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ, అమలులో ప్రజలకు ఇబ్బందులెదురయ్యాయి. గుర్తింపు కార్డుల్ని చూపినా ఓటరు స్లిప్ కావాల్సిందేనంటూ చాలా పోలింగ్ కేంద్రాల్లో అధికారులు వెనక్కు పంపారు. ఎపిక్ కార్డు నెంబరు తెలిపినప్పటికీ.. ఓటరు జాబితాలో సీరియల్ నెంబరు వంటివి బీఎల్ఓలు చెప్పలేకపోయారు. ఈ కారణం వల్ల కూడా చాలామంది ఓటు వేయలేదు. కొన్ని కుటుంబాల వారికి ఇంట్లో నలుగురు సభ్యులుంటే.. ముగ్గురికి ఒక పోలింగ్ కేంద్రంలో, మరొకరికి 4 కి.మీ.ల దూరంలోని మరో పోలింగ్ కేంద్రం కేటాయించారు. వీటి వల్ల కూడా పలువురు ఓటు హక్కుకు దూరమయ్యారు. ఆన్లైన్ ద్వారా ఓటరు నమోదుకు కల్పించిన సదుపాయాన్ని వినియోగించుకున్న చాలామంది.. రెండు మూడు పర్యాయాలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేశారు. ఎన్ని మార్లు దరఖాస్తులు చేస్తే అన్ని పర్యాయాలు ఓటరుగా నమోదు చేశారు. అలా ఒకే వ్యక్తి రెండు మూడు పర్యాయాలు ఓటరుగా నమోదు కావడంతో వాస్తవ ఓటర్ల కంటే ఎక్కువమంది ఓటర్లు లెక్కలో చేరారు. ఎక్కువ పర్యాయాలు ఉన్న పేర్లను తొలగించడంలో అధికారులు విఫలమయ్యారు. అది కూడా పోలింగ్ శాతంపై ప్రభావం చూపింది. ఓటర్లుగా పేరు నమోదు చేయించుకోవడంలో ఉత్సాహం చూపిన పలువురు.. పోలింగ్‌లో దాన్ని ప్రదర్శించలేదు. ముఖ్యంగా నవఓటర్లు.. యువత ఆశించిన స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనలేదు. యంత్రాంగం వైఫల్యం అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో పూర్తిగా విఫలమైంది. ఓటరు స్లిప్పుల పంపిణీ నుంచి ఈవీఎంలు స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరేంతదాకా ఎన్నికల విధుల్లోని పలు విభాగాల ఉద్యోగుల్లో సమన్వయం లోపించింది. ఉన్నతాధికారులు ఒక విభాగం వారు.. ఉద్యోగులు మరో విభాగం వారు ఉన్నందున విధుల నిర్వహణలో నిర్లక్ష్యం కనబరిచారు. నామినేషన్ల నాటి నుంచి ఈ లోపం కనిపించినా.. పకడ్బందీ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకే నామినేషన్ల గడువు ముగిసినా.. ఏరోజు ఎంతమంది నామినేషన్లు వేశారో చెప్పేందుకు అధికార యంత్రాంగానికి రాత్రి 9 గంటల వరకు సమయం పట్టిందంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. పోలింగ్ రోజు ఉదయం 6 గంటలకే మాక్‌పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. చాలా కేంద్రాల్లో అది జరగలేదు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కావాల్సిన పోలింగ్ పలు కేంద్రాల్లో ఆలస్యంగా ప్రారంభమైంది. ఓటరు జాబితాలో పేరున్నదీ లేనిదీ నిర్ణీత వ్యవధిలోగా చాలామంది ఓటర్లు చూసుకోలేకపోయారు. దానికి విస్తృతప్రచారం కల్పించలేకపోయారు. ఓటరుగా నమోదుకు పెంచిన గడువుపై జరిగిన ప్రచారం.. ఓటరు జాబితాలో పేరుందో లేదో చూసుకోవడంపై జరగలేదు. తమకు ఎపిక్ కార్డులున్నందున తమ పేర్లు జాబితాలో ఉన్నాయనే అందరూ భావించారు. కార్డున్నంత మాత్రాన సరిపోదని.. జాబితాలోనూ చూసుకోవాలనే సందేశం ప్రజలకు చేరాల్సిన స్థాయిలో చేరలేదు. అది కూడా పోలింగ్‌పై ప్రభావం చూపింది. అధికార యంత్రాంగం మధ్య సమన్వయ లోపానికి ఇదో మచ్చుతునక. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం కాగా.. గురువారం సాయంత్రం వరకు కూడా ఎంతమంది ఓటర్లు పోలింగ్‌ను వినియోగించుకున్నారో అధికార యంత్రాంగం స్పష్టం చేయలేకపోయింది. కొన్ని నియోజకవర్గాల్లో బుధవారం సాయంత్రం వరకు పేర్కొన్న పోలింగ్ శాతం కంటే.. అంతిమంగా గురువారం వెల్లడించిన పోలింగ్ శాతం తగ్గింది. ఆసక్తి చూపని సంపన్నులు ఖైరతాబాద్ నియోజకవర్గం పంజగుట్ట డివిజన్లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో 76 శాతం పోలింగ్ అయింది. అదే నియోజకవర్గం ఎర్రమంజిల్ కాలనీలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో కేవలం 33 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. విశ్వేశ్వరయ్య భవన్ కేంద్రంలోని అధిక శాతం ఓటర్లు బస్తీల్లో నివసించే పేదలు, నిరక్షరాస్యులు. ఎర్రమంజిల్ కాలనీ పోలింగ్ కేంద్రంలోని ఓటర్లు సంపన్నులు.. ఎగువ మధ్యతరగతి వర్గాల వారు, బాగా చదువుకున్న వారు కావడం గమనార్హం. -
పిల్లొ పిల్లొ పిల్లో...
నూతన దంపతులనో, చిన్నపిల్లల్నో సరదాగా పోట్లాడుకోనిచ్చే దిండ్లు, అంతకంటే పెద్ద వేడుకలో పాల్గొంటున్నాయి. వీధి పోరాటాలుగా ఈ పిల్లో ఫైట్స్ ఇప్పుడు ప్రపంచంలోని చాలా నగరాల్లో జరుగుతున్నాయి. ఇక్కడి దృశ్యం లండన్లోది. ప్రధానంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లల్లోని గ్రూపులు ఉన్నట్టుండి అనుకుని, దాదాపుగా ఉన్నపళంగా జరుపుకునే సంబరాలివి. మెత్తలతో మెత్తగా కొట్టుకోవడం కూడా ఒక రకమైన స్వేచ్ఛా వ్యక్తీకరణగానే ఇలాంటివాళ్లు భావిస్తున్నారు. పిల్లల్లారా రారండి... సక్రమంగా ఇవ్వని తాగునీటికోసం ఖాళీ బిందెలతో నిరసన తెలపడం మనకు తెలుసు. ఇది అలాంటిది కాకపోయినా, ప్రదన్శనగా సంబంధమున్నదే! విద్యార్థుల డ్రాపౌట్ రేటు పెరుగుతుండటానికి నిరసనగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ‘లాస్ ఏంజిల్స్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్’ ప్రధాన కార్యాలయం ముందు తల్లిదండ్రులు, పట్టభద్రులు, కార్యకర్తలు జరిపిన ప్రదర్శన ఇది. ఈ జిల్లా నుంచి విద్యా సంవత్సరంలో సగటున ప్రతివారానికీ తగ్గిపోతున్న 375 మంది విద్యార్థులను ప్రతిబింబిస్తూ 375 ఖాళీ డెస్కులతో ప్రదర్శకులు రోడ్డును దిగ్బంధించారు. అమెరికా మొత్తమ్మీద హైస్కూళ్లలో ప్రతి ఏటా 12 లక్షల మంది చదువు పూర్తికాకముందే బడి మానేస్తున్నారు. సనాతన గురువులు ఫొటోలోని మహిళ పేరు పెప్సిలే మసేకో. ఈమె ఒక ‘సంగోమా’. ఇలాంటివాళ్లు దక్షిణాఫ్రికాలో సుమారు రెండు లక్షల మంది ఉన్నారని అంచనా! భూతప్రేతాలను పారద్రోలుతారనీ, తప్పిపోయిన పశువుల జాడచెబుతారనీ, సంకేతాల ఆధారంగా భవిష్యత్‌ను అంచనావేస్తారనీ, జబ్బులకు మందులు ఇస్తారనీ వీరికి పేరు. జనన మరణ క్రతువుల్లోనూ వీళ్ల సూచనల్ని ప్రజలు శిరోధార్యంగా భావిస్తారు. అందుకే సంగోమాలకు అక్కడి సమాజంలో గౌరవనీయమైన స్థానం ఉంది. -
జాగ్రత్త! మీ పిల్లలు ఈ యాప్స్ వాడుతున్నారా?
మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ లేదా టాబ్ కొనిచ్చారా? వాళ్లు ఇరవై నాలుగు గంటలూ మొబైల్ లో చాట్ చేస్తూనే ఉన్నారా? మిమ్మల్ని చూడగానే చాటింగ్ హడావిడిగా వెళ్లిపోతున్నారా? కంగారు పడాల్సిందేమీ లేదు. ఈ తరం అంతే. అయితే వారు ఏ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో చాట్ చేస్తున్నారు? ఎవరితో చాట్ చేస్తున్నారు? ఆ చాటింగ్ సైట్లు ఎలాంటివి? అన్నది మాత్రం చూసుకొండి. అయితే కొన్ని సైట్లలో వారు చాట్ చేస్తుంటే మాత్రం మీరు జాగ్రత్త పడాల్సిందే. అమాయకంగా వారు ఉపయోగించే సైట్లకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉండొచ్చు. అలా ఉన్న యాప్స్ లో లైంగిక వికృతిగాళ్లు, పీడోఫైల్స్ వంటి వారు మీ పాప లేదా బాబును ట్రాక్ చేసి, కలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. పరిచయం పెంచుకుని, వారిని ఎక్స్ ప్లాయిట్ చేయవచ్చు. అలాంటి కొన్ని సైట్లు ఈ దిగువన ఇస్తున్నాం. యిక్ యాక్ - ఇది అత్యంత ప్రమాదకరమైన సైట్. ట్విట్టర్ లాగా ఇది కూడా ఒక మైక్రో సైట్. 200 అక్షరాల వరకూ టైప్ చేసి మెసేజ్ ను పంపొచ్చు. ఈ మెసేజ్ నను సమీపంలో ఉన్న అయిదువందల మంది యిక్ యాక్ మెంబర్లు చూడగలుగుతారు. అంటే వీరంతా ఒకరికొకరు దగ్గరగా ఉండటం వల్ల కలుసుకునే అవకాశం ఉంటుంది. లైంగికంగా ప్రమాదకరమైన సమాచారాన్ని పోస్ట్ చేవచ్చు. అమెరికా తదితర పాశ్చాత్య దేశాల్లో స్కూళ్లలో ఈ సైట్ ను బ్లాక్ చేశారు. స్నాప్ చాట్ - దీనంత ప్రమాదకమైన సైట్ ఇంకోటి లేదు. ఇందులో ఫోటో పంపితే, దాన్ని ఓపెన్ చేసిన పది సెకన్లలో డిలీట్ అయిపోతుంది. అటు పంపిన వారి ఫోన్ లో, ఇటు పొందిన వారి ఫోన్ లో దాని ఛాయలు కూడా ఉండకుండా డిలీట్ అయిపోతుంది. అయితే కావాలనుకుంటే పది సెకన్లలో స్క్రీన్ షాట్ తీసుకుని సేవ్ చేసుకుని, షేర్ చేసుకోవచ్చు. పిల్లలు సెక్స్టింగ్ చేసేందుకు ఈ సైట్ ను వాడుకుంటున్నారు. కిక్ మెసెంజర్ - ఇది ఒక ప్రైవేటు మెసింజర్ యాప్. మీరు పంపే మెసేజీని పొందాల్సిన వారు తప్ప ఇంకెవరకూ చూడలేదు. కాబట్టి మైనర్లకు గాలం వేసే సెక్స్ పిశాచులు ఈ సైట్ ను ప్రిఫర్ చేస్తున్నారు. పూఫ్ - ఈ యాప్ ప్రత్యేకతేమిటంటే స్క్నీన్ ను టచ్ చేస్తే చాలు మీరు కోరుకున్న యాప్ అదృశ్యం అయిపోతుంది. అంటే స్క్రీన్ మీద కనిపించదు. తల్లిదండ్రులు చూడాలనుకున్నా స్క్రీన్ మీద ఇది కనిపించదు. ఈ యాప్ ఇప్పుడు డిసేబుల్ అయింది. కానీ అంతకుముందే డౌన్ లోడ్ చేసుకున్న వారు దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఓమేగుల్ - ఈ సైట్ ప్రత్యేకత ఏమిటంటే మీరెవరో చెప్పనవసరం లేదు. ఎదుటివాడు ఎవరో తెలుసుకోనవసరం లేదు. మీరు 'యు' అన్న పేరుతో కనిపిస్తారు. ఎదుటివారు 'స్ట్రేంజర్' అన్న పేరుతో కనిపిస్తాడు. ఈ యాప్ ను ఫేస్ బుక్ లో లైక్ కొట్టడం ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. విస్పర్ - విస్పర్ అంటే గుసగుస. ఈ సైట్ లో మీకు మాత్రమే తెలిసిన మీ పరమ రహస్యాలను ముక్కూ మొహం తెలియనివారితో షేర్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఇలా రహస్యాలు చేసుకుంటే అది బ్లాక్ మెయిల్ కి దారి తీయొచ్చు కూడా. గతేడాది ఈ సైట్ ను వాడి ఒక 12 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసిన ఒక వాషింగ్టన్ నివాసి కి శిక్షకూడా పడింది. డౌన్ - ఈ సైట్ ను గతంలో బ్యాంగ్ విత్ ఫ్రెండ్స్ అనేవారు. దీని స్లోగన్ ఏమింటటే 'ఎవరికీ తెలియకుండా, రాత్రి వేళ మీ ఫ్రెండ్స్ లో ఫన్ పొందే చక్కని మార్గం'. ఇంకేమీ చెప్పనక్కర్లేదనుకుంటా! హాట్ ఆర్ నాట్, వైన్, ఫేక్ ఎ టెక్స్ట్, ఐ ఫన్నీ, పీఓ ఎఫ్ వంటి సైట్లు కూడా ప్రమాదకరమైనవేనని నిపుణులు చెబుతున్నారు. మీ బుజ్జి బంగారు బాబు, పాప ఏ సైట్లు చూస్తున్నారో, ఏ చాట్లు చేస్తున్నారో చూసుకొండి. జాగ్రత్త!! -
ఓటేస్తాం
నగర రాజకీయాలను ప్రక్షాళన చేస్తాం ఇదీ ‘గ్రేటర్’ యువత మనోగతం ‘సాక్షి’ సర్వేలో వెల్లడి సాక్షి, సిటీబ్యూరో : గజి‘బిజీ’ జీవితం.. ట్రాఫికర్.. బద్ధకం.. అలసత్వం.. కారణమేదైనా నగరజీవులు ఓటింగ్ ప్రక్రియకు కాస్త దూరమే!. అందుకే సిటీలో ఓట్లకు, పోలింగ్‌కు పొంతన ఉండదు. కానీ ప్రస్తుత సార్వత్రిక ఎన్నిక ల్లో ఈ సీన్ మారనుందనే అనిపిస్తోంది. సోషల్నెట్వర్క్ మీడియా పుణ్యమా అని యువతలో చైతన్యం రగిలింది. ఓటుపై అవగాహన కలి గింది. ఓట్ల శాతమూ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, అవినీతి రహిత సమాజాన్ని స్థాపించేందుకు ఈసారి ఓటుహక్కు ను విధిగా వినియోగించుకుంటామని, బిజీలైఫ్లోనూ ఓటు వేసేందు కు సమయం కేటాయిస్తామని యువత ఘంటాపథంగా చెబుతోంది. యువత ఆశయాలు, ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా పనిచేసే పార్టీలనే ఆదరిస్తామంటోంది. నగర రాజకీయాలను ప్రక్షాళన చేస్తామంటోంది. హోరాహోరీగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ‘సాక్షి ’ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. యువత నిర్మొహమాటంగా అభిప్రాయాలు వ్యక్తం చేసింది. నగరవ్యాప్తంగా 18-25 ఏళ్ల మధ్యనున్న వెయ్యిమంది యువతను వివిధ అంశాలపై ప్రశ్నించగా, వారి అభిప్రాయాలిలా ఉన్నాయి. -
ఫేస్బుక్లో ఇవీ ఉండాల్సింది..!
గూగుల్ వాళ్ల సోషల్నెట్వర్కింగ్ సైట్ ఆర్కుట్లో ఒక ఫీచర్ ఉండేది. మన ప్రొఫైల్‌ను చూసిన రీసెంట్ విజిటర్లు ఎవరో తెలుసుకోవచ్చు దాని ద్వారా. పేరు ద్వారా అకౌంట్‌ను సెర్చ్ చేసి, మన పేజ్‌లోకి వచ్చి, మన ఇష్టాల ఇష్టాలను పరిశీలించి వెళ్లిన వారెవరో చూడటానికి అవకాశం ఉండేది ఆర్కుట్లో. మనం లాగిన్ కాగానే ‘రీసెంట్ విజిటర్స్’ జాబితా ప్రత్యక్షం అయ్యేది. అయితే ఫేస్బుక్లో ఆ సదుపాయం లేదు. మన ప్రొఫైల్‌ను చూసి వెళుతున్నదెవరో మనకు తెలీదు! సోషల్స్నేహాల్లో మన పేజ్‌ను చూసి వెళుతున్నది ఎవరో తెలుసుకోవడం నిజంగా ఒక చక్కటి ఫీలింగ్. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా తమ పేజ్‌ను తరచూ ఎవరెవరు చూస్తున్నారో చూడటం నిజంగా హ్యాపీనే కదా! అలాంటి హ్యాపీనెస్ ప్రస్తుతానికి ఫేస్బుక్లో లేదు. నెటిజన్లకు పట్టకుండా పోయిన ఆర్కుట్లో ఉన్నా ఉపయోగం లేదు. ఆఫ్‌లైన్‌లో ఉండి ఆడుకోలేం... జీమెయిల్లో ఒక సదుపాయం ఉంది. మనం అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత ఆఫ్‌లైన్ మోడ్‌లోకి వెళ్లొచ్చు. అలా ఆఫ్‌లైన్ మోడ్‌లోనే ఉంటూ ఎవరెవరు ఆన్లైన్లో ఉన్నారో చూడవచ్చు. కానీ ఎఫ్బీలో మాత్రం మనం ఆఫ్‌లైన్ మోడ్‌లో ఉండి అందరితోనూ ఆడుకోవడానికి అవకాశం లేదు!ఒక్కసారి ఆఫ్‌లైన్‌లోకి వెళితే ఆన్లైన్లో ఉన్నదెవరో అర్థం చేసుకోవడం కుదరదు! ఇంకా జీమెయిల్లో బిజీ మోడ్‌లో ఉంచడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫేస్బుక్లో ఆ సదుపాయం లేదు. ఫేస్బుక్ సర్ఫింగ్‌లో మరింత మజా రావాలంటే ఇలాంటి ఫీచర్ల అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు నెటిజన్లు. ఈ విషయంలో ఎఫ్బీ గ్రేట్... ఫేస్బుక్లో ఎవరితోనైనా చాట్ చేస్తున్నప్పుడు అవతలి వారు మనం పంపిన మెసేజ్‌ను చూశారా లేదా అనే విషయం అర్థమైపోతోంది. అవతలి వారు చాట్‌బాక్స్‌లో క్లిక్ చేయగానే ‘సీన్’ అంటూ ఒక టిక్ మార్క్ డిస్ప్లే అవుతుంది. అలా చూసిన వ్యక్తి మెసేజ్‌కు స్పందిస్తూ టైప్ చేయడం మొదలుపెడితే ఆ విషయం కూడా ఇవతల వారికి సులభంగా అర్థమైపోతోంది. ఫేస్బుక్లో మాత్రమే ఉన్న సదుపాయం ఇది. అయితే జీమెయిల్లో చాట్ చేసేటప్పుడు ఈ అవకాశం లేదు. జీమెయిల్ లేదా అర్కుట్చాట్ బాక్స్‌లో అవతలి వారు స్పందిస్తే తప్ప మనం పంపిన మెసేజ్ వారు చూశారో లేదో తెలుసుకొనే అవకాశమే లేదు! ఇలాంటి సదుపాయాన్ని అందించడంతో ఫేస్‌బుక్‌కు మంచి మార్కులు పడతాయి. గూగుల్ ఇలాంటి సదుపాయాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. -
వయసులో చిన్న... సామాజిక సేవలో మిన్న!
సాధారణంగా టీనేజర్లకు ఫ్రెండ్స్‌తో గడపడం, వీడియో గేమ్స్ ఆడుకోవడమే వినోదం...ఇంటర్నెట్ సర్ఫ్ చేయడం, సోషల్నెట్వర్కింగ్ సైట్లలో ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేస్తూ గడిపేయడం సరదా... అలాంటి వినోదాలు, సరదాలకే ప్రాధాన్యం ఉండే టీనేజ్‌లో తన ప్రత్యేకమైన దృక్పథంతో గుర్తింపు తెచ్చుకొన్నాడు హర్మూర్ గిల్ (16). కెనడాలోని టొరంటోలో ఉండే ఈ ఎన్ఆర్ఐ కుర్రాడు ప్రపంచంలోనే ప్రముఖ సామాజిక సేవకుడిగా పేరు సంపాదించాడు. తన వయసుకు మించిన స్థాయిలో సామాజిక సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకొని ఔరా.. అనిపించుకొంటున్నాడు. గిల్ అందంగా రాయగలడు, తన మాటతో భావాన్ని బలంగా చెప్పగలడు... దీంతో అనేక పత్రికల్లో ఇతడి రచనలు అచ్చు అవుతున్నాయి. అనేక మందికి స్ఫూర్తిని పంచుతున్నాయి. హైస్కూల్లో చదువు పూర్తి చేసుకొన్న ప్రతి విద్యార్థీ కనీసం 40 గంటల పాటు సామాజిక సేవలో పాలుపంచుకొని ఉండాలనేది కెనడాలో ఉన్న నియమం. పాఠశాల సమయం అయిపోయాక విద్యార్థులు ఏదో విధమైన సేవాకార్యక్రమంలో పాల్గొనాలి. స్వచ్ఛంద సేవా సంస్థలతోనో, ప్రభుత్వ సేవా సంస్థలతోనో కలిసి పనిచేసిన అనుభవం సంపాదించి ఉండాలి. అక్కడ చాలా మంది విద్యార్థులు ఈ నియమం విషయంలో తెగ ఇబ్బందిపడుతూ ఉంటారు. ఏదో ‘మమ’ అనిపిస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో గిల్ మాత్రం చాలా ప్రత్యేకమైన విద్యార్థిగా నిలిచాడు. ఇతడు 13 యేళ్ల వయసుకే దాదాపు వెయ్యిగంటల పాటు సోషల్‌వర్క్ పూర్తి చేశాడు! అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశాడు. అనేక సామాజిక సమస్యలపై పోరాడాడు. లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించాడు. ఒకవైపు హైస్కూల్ చదువును పూర్తి చేస్తూ ఉత్తమ విద్యార్థిగా, మరోవైపు సోషల్‌వర్క్‌లో ఉత్తమ వలంటీర్‌గా గుర్తింపు తెచ్చుకొన్నాడు. పసిప్రాయంలోనే మొదలు... మూడవ ఏటే గిల్ దానధర్మాలు ప్రారంభించాడట. తల్లిదండ్రులు ఇతడి చేత చాక్లెట్లను అమ్మించి ఆ సొమ్మును చారిటీ కోసం వినియోగించారు. అలా గిల్ పసివాడిగా ఉన్నప్పుడే ప్రారంభమైన సేవా దృక్పథం అతడితో పాటు పెరిగి పెద్దది అయ్యింది. స్కూల్ నుంచి రాగానే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల వారిని కలవడం, వారితో వివిధ అంశాల గురించి చర్చించి బాధ్యతల్లో పాలుపంచుకోవడం.. ఇదే అతడి దినచర్యగా మారింది. ఏం చేస్తాడంటే... పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతున్న, అనాథల, అభాగ్యుల సంక్షేమం కోసం పాటుపడుతున్న వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి గిల్ పనిచేస్తున్నాడు. అవసరమైతే శారీరకంగా కష్టించి పనిచేయడం, ప్రజల్లో వివిధ అంశాల గురించి అవగాహన నింపడానికి ప్రయత్నించడం, డొనేషన్ల కోసం నిర్వహించే కార్యక్రమాల్లో విదూషకుడిగా మారి వినోదాన్ని అందించడం - ఇలా తనకు చేతనైన స్థాయిలో ఏదో ఒక రూపంలో శ్రమను ధారపోస్తాడు గిల్. అక్షరమే ఆయుధం గిల్ అందంగా రాయగలడు, తన మాటతో భావాన్ని బలంగా చెప్పగలడు... దీంతో అనేక పత్రికల్లో ఇతడి రచనలు అచ్చు అవుతున్నాయి. అనేక మందికి స్ఫూర్తిని పంచుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా ఎంపైర్ మ్యాగజైన్, ప్రవాసీ టుడే మ్యాగజైన్ తదిరత భారతీయ పత్రికలకు కూడా కాలమిస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. యువతకు ఆదర్శం గిల్‌ను యువతకు ఆదర్శ ప్రాయుడిగా అభివర్ణిస్తున్నాయి అక్కడి స్వచ్ఛంద సంస్థలు. అనేక అవార్డులతో అతడిని సత్కరిస్తున్నాయి. వలంటీర్ రికగ్నైజేషన్ అవార్డు, యూత్ రికగ్నైజేషన్ అవార్డు, హల్టన్ ఎన్విరాన్మెంటల్ అవార్డు అందులో ప్రముఖమైనవి. కెనడియన్ జాతీయ పత్రిక ఒకటి ఎంపిక చేసిన ‘15 అండర్ 15’ జాబితాలో కూడా స్థానం సంపాదించాడు గిల్. -
పదేళ్ల ‘ఫేస్బుక్’
సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ‘ఫేస్బుక్’కు ఈనెల 4వ తేదీతో పదేళ్లు పూర్తవుతున్నాయి. ఇంటర్నెట్ తెచ్చిన సమాచార విప్లవంలో సోషల్ మీడియా మరింత విప్లవాత్మక మార్పులు తెచ్చింది. గడచిన పదేళ్లలో అంచెలంచెలుగా విస్తరిస్తూ, ‘ఫేస్బుక్’ సోషల్ మీడియాలో అద్వితీయమైన స్థానాన్ని చేజిక్కించుకుంది. హార్వర్డ్ వర్సిటీ విద్యార్థిగా మార్క్ జూకర్బర్గ్ రూపొందించిన ప్రాజెక్టు ‘ఫేస్బుక్’గా రూపుదిద్దుకుని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా123 కోట్ల మందిని అనుసంధానిస్తోంది. అనతికాలంలోనే ప్రపంచమంతటా ‘ఫేస్బుక్’ విలువ 9 వేల కోట్లు (రూ.9,26,961 కోట్లు). సోషల్ మీడియాలో ఈ దశాబ్ది కచ్చితంగా ‘ఫేస్బుక్’దే. ఈజిప్టు వంటి దేశాల్లో ప్రజల తిరుగుబాట్లలో సైతం కీలక పాత్ర పోషించిన ఘనత దీనికే చెందుతుంది. -
ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్
రాష్ట్రంలోని 12 లోక్‌సభ స్థానాల నుంచి పోటీ సాక్షి, బెంగళూరు: జన సామాన్యుడి గొంతుక అనే నినాదంతో రాజకీయ తెరపైకి వచ్చి.. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఊడ్చిపారేసిన ‘ఆమ్ ఆద్మీ పార్టీ’(ఆప్) రాష్ట్రంలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 12 లోక్‌సభ స్థానాల నుంచి తమ అభ్యర్థులను బరిలోకి దించేందుకు సన్నద్ధమైనట్లు ఆప్ ప్రకటించింది. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆప్ ప్రతినిధి పృథ్వీరెడ్డి మాట్లాడారు. బెంగళూరులోని నాలుగు పార్లమెంటు స్థానాలతో పాటు దక్షిణ కన్నడ, గుల్బర్గా, బిజాపుర, హుబ్లీ-ధార్వాడ, తుమకూరు, బెళ్గాం, చిత్రదుర్గ పార్లమెంటు స్థానాల్లో తమ పార్టీ పటిష్టంగా ఉందని చెప్పారు. అందుకే ఈ 12 స్థానాల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలబెట్టనున్నట్లు తెలిపారు. ఇక ఎన్నికల సమయానికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 31లోపు ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుందని చెప్పారు. దరఖాస్తు దారులు తమ పూర్తి వివరాలతో పాటు తమ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజక వర్గం నుంచి 100 మంది ఓటర్లు తనకు మద్దతునిస్తున్నట్లుగా తెలియజెప్పే సంతకాల పత్రంతో పాటు ఆయా ఓటర్ల ఓటరు గుర్తింపు కార్డు, వారి ఫోన్ నంబర్లను జతచేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ విధంగా అందిన దరఖాస్తులను తమ అధికారిక వెబ్సైట్లో ఉంచి.. ప్రజాభిప్రాయాన్ని కోరతామని తెలిపారు. ఇక తమ పార్టీ పొలిటికల్ స్ట్రాటిజిక్ కమిటీ కూడా ఆయా అభ్యర్థులపై క్రిమినల్ కేసులేవైనా ఉన్నాయా అనే విషయాలను తెలసుకుంటుందని పేర్కొన్నారు. ఒకవేళ అభ్యర్థులెవరైనా క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నట్లైతే వారిని మొదటి దశలోనే తిరస్కరిస్తామని తెలిపారు. అనంతరం వారి ఆస్తుల వివరాలు కూడా తెలుసుకొని ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకపోవడంతో పాటు ప్రజలకు సేవ చేయాలనే బలమైన ఆకాంక్ష ఉన్న వారినే ఎంపిక చేస్తామని చెప్పారు. సోషల్ నెట్వర్కింగ్ ద్వారా సభ్యత్వ నమోదు... ‘నానూ జనసామాన్య’(మై భీ ఆమ్ ఆద్మీ) పేరిట ఆప్ ప్రారంభించిన సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆప్ రాష్ట్ర శనివారం నగరంలో ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్రంలో లక్ష మంది ప్రజలు ఆప్ సభ్యులుగా ఉన్నారని పృథ్వీరెడ్డి వెల్లడించారు. ఇక ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ ద్వారా బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను నియమించనున్నట్లు చెప్పారు. ఆప్‌లో సభ్యులుగా చేరేందుకు 07798220033 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపడం లేదా మిస్డ్‌కాల్ ఇవ్వవచ్చని తెలిపారు. అంతేకాక పార్టీ అధికారిక వెబ్సైట్లు www.aapkarnataka.org, aapkaragent@gma il.com ద్వారా సభ్యత్వాన్ని పొందడంతో పాటు పార్టీకి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. -
ఫేస్బుక్ అంత పని చేస్తోందా?!
సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ఫై కొత్త ఆరోపణ. వినియోగదారులంతా అవాక్కయ్యే ఆరోపణ ఇది. కోట్లాది మంది ఫేస్బుక్లో మునిగి తేలుతుండగా ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకొని ఫేస్బుక్ వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతోంది. ఫేస్బుక్లో ఫ్రెండ్స్ చేసుకొనే పర్సనల్ చాట్స్‌ను మానిటర్చేస్తూ వాటిని అడ్వర్టైజర్స్కు అమ్ముకొంటోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఇద్దరు వ్యక్తులు ఫేస్బుక్లో వ్యక్తిగతంగా మాట్లాడుకొనే విషయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమే కాదనుకోవాల్సి వస్తోంది. ఫేస్బుక్యూజర్లు దేని గురించి చర్చించుకొంటున్నారు? అనే విషయాలను మానిటర్ చేసి వాటిద్వారా సోషల్ట్రెండ్స్ను అంచనా వేస్తూ వాణిజ్యసంస్థలకు వాటిని అందించే వ్యాపారాన్ని చేస్తోందట ఫేస్బుక్ యాజమాన్యం. దీనిపై అమెరికాలో కేసు కూడా నమోదు అయ్యింది. యూజర్ల పర్సనల్ చాట్స్‌ను ఫేస్బుక్ పరిశీలిస్తోందని, వాటిని బయటి వారికి అమ్ముకొని ప్రైవసీని దెబ్బతీస్తోందని యూఎస్ కోర్టులు వ్యాజ్యం దాఖలైంది. విశేషం ఏమిటంటే... ఫేస్బుక్ ఈ ఆరోపణను ఖండించడం లేదు! దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని ఎఫ్బి యాజమాన్యం ప్రకటించింది. -
టెడ్డీబేర్లు ట్వీట్లు ఇస్తున్నాయ్!
టెడ్డీబేర్.. చిన్నారులకు అత్యంత ఇష్టమైన ఆటబొమ్మ. నిద్రలో కూడా టెడ్డీబేర్‌ను కౌగిలించుకొని పడుకోవడం చాలా మంది చిన్నారులు చేసే పని. అయితే వయసు పెరిగేకొద్దీ టెడ్డీబేర్ మీద ప్రేమాభిమానులు తగ్గిపోతాయి.. బేర్‌ను కేర్ చేయని రోజులు వచ్చేస్తాయి.. అనే భావనలున్నాయి. కానీ అది నిజం కాదు. ఆడుకొనే వయసు దాటిపోయినా.. టెడ్డీలపై ప్రేమాభిమానాలు ఏ మాత్రం తగ్గవు.. వాటి పేరుమీద సోషల్నెట్వర్కింగ్ సైట్లలో అకౌంట్ క్రియేట్ చేసేంత స్థాయికి చేరతాయి అని అంటున్నారు యూకేకు చెందిన పరిశీలకులు. ఒక పరిశీలన ప్రకారం యూకే పరిధిలో దాదాపు 25 లక్షల టెడ్డీబేర్‌లకు ఫేస్బుక్ అకౌంట్ ఉన్నట్టు తేలింది! టెడ్డీబేర్‌లకు ఫేస్బుక్ అకౌంట్ ఏంటి? అని ఆరాతీస్తే.. చాలామంది యువతీ యువకులు చిన్ననాటి నుంచి తమతో పాటు ఉన్న టెడ్డీల పేరిట ఫేస్బుక్ ఖాతాలు నడుపుతున్నారట! వాటిపై ఆ విధంగా తమ అభిమానాన్ని చాటుకొంటున్నారట. బ్రిటన్ జనాభా, అక్కడి ఫేస్బుక్ యూజర్లతో పోల్చినప్పుడు 25 లక్షల టెడ్డీలకు ఫేస్బుక్, ట్విటర్ అకౌంట్లు ఉండటం అంటే చాలా గొప్ప విషయం. ఆ బొమ్మలకు తాము ముద్దుగా పెట్టుకొన్న పేర్లతోనే సోషల్నెట్వర్కింగ్సైట్లలో అకౌంట్లు తెరిచి.. వాటి ఫోటోలను పెట్టి.. వాటిపై ప్రేమను ప్రకటించుకొంటూ తమ ముచ్చట తీర్చుకొంటున్నారట బ్రిటిషర్లు. ఇక టెడ్డీల అకౌంట్ల ఫ్రెండ్స్లిస్ట్కేమీ కొదవ లేదు. ఎలాగూ 25 లక్షల టెడ్డీలు సోషల్ నెట్వర్కింగ్ సామ్రాజ్యంలో స్థానం సంపాదించాయి కాబట్టి.. వాటి ఓనర్లు ఒకదానితో మరోదాన్ని జత చేస్తున్నారు. ఇలా టెడ్డీబేర్ల పేరిట ఫేస్బుక్ ఖాతాలు తెరిచే వారిలో అబ్బాయిలే ఎక్కువమంది ఉన్నారని ఈ పరిశీలనలో తేలింది. -
అంతరిక్షం గురించి అప్డేట్స్..!
అంతరిక్ష పరిశోధనల గురించి, ఇతర గ్రహాల గురించి పరిశోధనలు కొత్త ఆసక్తులను రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో... నట్టింట్లో అంతరిక్షాన్ని ఆవిష్కరించవచ్చు. చూపుడు వేలితో నక్షత్రాలను టచ్ చేయవచ్చు. ఖగోళాన్ని ఒళ్లోకి తీసుకోవచ్చు. అందుబాటులోకి వచ్చిన సరికొత్త అప్లికేషన్లతో అనుక్షణం అప్డేట్స్ను అందుకోవచ్చు. అంతరిక్ష పరిశోధన సంస్థల సహకారంతో ఇవి సాకారం అవుతాయి. ఒకవైపు సోషల్నెట్వర్కింగ్ గురించి... దీనివల్ల ఉపయోగాలేమిటి? అనార్థలేమిటి? అని చర్చలు కొనసాగుతుండగానే... సోషల్సైట్లు తమ ప్రాధాన్యతను మరింత పెంచుకొంటున్నాయి. విశ్వం గురించి వివరాలు అందిస్తూ దూసుకెళ్తున్నాయి. టెక్ స్టూడెంట్స్, అంతరిక్ష పరి శోధనల గురించి ఆసక్తి ఉన్న వ్యక్తుల కోసం కొన్ని సోషల్నెట్ వర్కింగ్ అకౌంట్లు అనుక్షణం నాలెడ్జ్‌ను అప్డేట్ చేస్తున్నాయి. వాటిలో కొన్ని... నాసా నుంచి... అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) విశ్వానికి సంబంధించిన అబ్బురాలను ఇన్స్టాగ్రామ్, ఫ్లికర్ల ద్వారా షేర్ చేస్తోంది. తమ టెలిస్కోప్‌లకు చిక్కిన అద్భుతమైన అంతరిక్ష ఛాయాచిత్రాలను, వీడియోలతో కూడిన విశ్లేషణలను వీడియోషేరింగ్, ఫోటో షేరింగ్‌లకు అవకాశమున్న ఈ సోషల్నెట్వర్కింగ్ సైట్ల ద్వారా షేర్ చేస్తోంది నాసా. విశ్వాంతరాలపై ఆసక్తి ఉన్నవారు నాసా సోషల్నెట్వర్కింగ్ అకౌంట్లకు సబ్‌స్క్రైబ్ అయితే, నిరంతరం అప్డేట్స్ వస్తుంటాయి. రోవర్ ను ఫాలో అవ్వండి... అరుణగ్రహంలో జీవి జాడ గురించి, నీటి వనరుల గురించి శోధిస్తున్న ‘క్యూరియాసిటీ’రోవర్‌కు సొంత ట్విటర్ అకౌంట్ ఉంది. రోవర్ పరిశోధనల గురించి అప్డేట్స్ ఇందులో ఉంటాయి. ఈ అకౌంట్‌ను ఫాలో కావడం ద్వారా అరుణగ్రహ పరిశోధన ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసే ఫొటోలు ఎంతో క్యూరియాసిటీని కలిగిస్తాయి. స్పేస్ ఎక్స్... అంతరిక్ష పరిశోధనలు సాగిస్తున్న ఒక ప్రైవేట్ సంస్థ ఇది. సిటిజన్స్‌ను ఇది స్పేస్టూర్లకు తీసుకెళ్తుంటుంది. అదంతా లక్షల డాలర్లతో ముడిపడిన వ్యవహారం. అందుకు బదులుగా వీడియోల రూపంలో అంతరిక్షం గురించి ఎన్నో అనుభవాలను అందిస్తోంది ఈ సంస్థ. ఫేస్‌బుక్‌లోనూ, యూట్యూబ్‌లోనూ స్పేస్ ఎక్స్ పేజ్‌లు, వీడియో చానళ్లు అందుబాటులో ఉన్నాయి. స్పేస్ క్రాఫ్ట్స్‌తో చేసిన విన్యాసాలు, అంతరిక్ష వివరాలు, ఆసక్తికరమైన ట్రివియా ఈ చానళ్లలో లభిస్తాయి. హబుల్ టెలీస్కోప్ అకౌంట్...అంతరిక్ష పరిశోధనల వివరాల పట్ల ఆసక్తి ఉన్న వారికి చిరపరిచితమైనది ‘హబుల్ టెలిస్కోప్’. విశ్వంలో ఈ టెలిస్కోప్ అన్వేషణలను ట్విటర్‌కు అనుసంధానించారు. హబుల్ టెలిస్కోప్ తీసే ఛాయాచిత్రాలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు ఒక ట్విటర్ అకౌంట్‌ను ఏర్పాటుచేశారు. ఆర్బిటల్ సెన్సైస్... ఇది కూడా ఒక ప్రైవేట్ ఖగోళ పరిశోధన సంస్థ. తన పరిశోధన వివరాలను ఫేస్బుక్, ట్విటర్ల ద్వారా అందుబాటులో ఉంచడం ద్వారా విజ్ఞాన వారధిగా ఉంటోంది. నాసా అప్లికేషన్లెన్నో... ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పై విశ్వవిజ్ఞానాన్ని పంచడానికి ఎన్నో అప్లికేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది నాసా. నాసా టెలివిజన్, ది నాసా ఆప్, త్రీడీ సన్, హబుల్ సైట్, నాసా స్పేస్ వెదర్ మీడియా వ్యూవర్, స్పేస్ షటిల్ క్రూ... వంటి అప్లికేషన్లను అందుబాటులో ఉంచింది. ఇవన్నీ ఐఫోన్, ఐప్యాడ్లపై పనిచేస్తాయి. -
ఉల్లి @ లోలి
‘కారు కొంటే.. కేజీ ఉల్లిపాయలు ఫ్రీ’ ‘ఉల్లిపాయలు కొనాలి లోన్ ఇస్తారా..’ ‘బ్రేకింగ్ న్యూస్... ఆనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘ఆనియన్ లోన్స్’పై వడ్డీ రేట్లు తగ్గించింది.’ .... ఇవన్నీ పెరుగుతున్న ఉల్లి ధరలపై సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్చల్ చేస్తున్న జోకులు. ఉల్లిధర రికార్డు స్ధాయిలో రూ.70కి చేరువ కావడంతో ‘ఆనియన్’ టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరి మధ్యా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా నడుస్తున్న ఉల్లి లొల్లి... ట్విట్టర్, ఫేస్‌బుక్‌లకూ విస్తరించింది. ఉల్లి ధరలపై కార్టూన్లు, కామెంట్స్, జోకుల రూపంలో నిరసన వ్యక్తమవుతోంది. సాక్షి, మచిలీపట్నం : ప్రజల ఆవేదనకు ప్రతిబింబాలుగా నిలుస్తున్న ‘నెట్’ కామెంట్లు ఇవీ... ‘నేను ఈ మధ్య ఓ జోక్ చూశా.. డాలర్ ఎస్కలేటర్ పైన.. రూపాయి వెంటిలేటర్ పైన... ఉల్లిపాయలు షోరూంలో.. మనం కోమాలో... ఈ దేశాన్ని దేవుడే కాపాడాలి..’ ఇది బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల, నటుడు కమల్ కామరాజ్ తదితర సెలబ్రిటీలు ట్విట్టర్లో షేర్ చేసిన జోక్. ‘ఉల్లిపాయలకు... ఎన్నికలకు ఏదో సంబంధం ఉన్నట్లుంది. ఎందుకంటే ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఉల్లిధరలు మండుతున్నాయి’ అంటూ కిరణ్‌బేడి ట్విట్టర్లో స్పందించారు. కార్టూన్లు.. ఫేస్బుక్లో పెద్ద సంఖ్యలో ఉల్లి ధరలపై కార్టూన్లూ షేర్ చేసుకుంటున్నారు. ‘ఉంగరంలో డైమండ్ బదులు ఉల్లిపాయని అమర్చిన ఫోటో’ ‘దేవుడు ప్రత్యక్షమై ఉల్లిధరలు తగ్గించమనీ.. రూపాయి విలువ పెంచటం లాంటి పిచ్చిపిచ్చి కోరికలు కాకుండా మంచివి కోరమంటూ భక్తుడి మీద చిరాకుపడతాడు’ ఈ రెండు ఫోటోలు ఫేస్బుక్లో బాగా పాపులర్. వీటితో పాటు బోలెడు ఉల్లిజోకులతో కూడిన కార్టూన్లు సోషల్ సైట్స్‌లో హల్చల్ చేస్తున్నాయి. ట్విట్టర్లో ఉల్లి కోసం ప్రత్యేకంగా అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. ‘ఉల్లి’జోకులు.. ‘ఈ మధ్య బప్పీలహరి ఉల్లి నగలతో కనిపిస్తున్నాడు’ ‘మరో సారి యూపీఏని గెలిపించండి..‘రైట్ టు ఆనియన్’ యాక్ట్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెడతారు.’ ‘ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే ఉల్లినారు తీసుకెళ్లి ఇవ్వు.. స్వంతంగా పెరట్లో ఉల్లిపాయల పెంపకం ఎలా పుస్తకం కూడా ఇవ్వచ్చు.’ ‘ఒకటి కంటే ఎక్కువ కిలోల ఉల్లిపాయలు కలిగి ఉండటం నేరం. త్వరలోనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.’ ‘రుచిని బట్టి ఉప్పు... జీతాన్ని బట్టి ఉల్లిపాయలు..’ ‘వంటకు ఉల్లిపాయలు వాడే వారు జాగ్రత్త.. సీబీఐ గానీ చూసిందంటే.. ఇంట్లో ఐటీ రైడ్లు చేసే అవకాశం ఉంది.’ -
ఉల్లి లొల్లి
‘రాఖీ కట్టిన చెల్లికి ఉల్లిపాయలు గిఫ్ట్‌గా ఇవ్వండి.. ఆమె కళ్లలో ఆనంద బాష్పాలు చూడండి..’ ‘బ్రేకింగ్ న్యూస్... ఆనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘ఆనియన్ లోన్స్’పై వడ్డీ రేట్లు తగ్గించింది.’ ‘కారు కొంటే.. కేజీ ఉల్లిపాయలు ఫ్రీ’ .... ఇవన్నీ పెరుగుతున్న ఉల్లి ధరలపై సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్చల్ చేస్తున్న జోకులు. ఉల్లిధర రికార్డు స్ధాయిలో రూ.70కి చేరువ కావడంతో ‘ఆనియన్’ టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరి మధ్యా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా నడుస్తున్న ఉల్లి లొల్లి... ట్విట్టర్, ఫేస్‌బుక్‌లకూ విస్తరించింది. ఉల్లి ధరలపై కార్టూన్లు, కామెంట్స్, జోకుల రూపంలో నిరసన వ్యక్తమవుతోంది. సాక్షి, సిటీబ్యూరో : ప్రజల ఆవేదనకు ప్రతిబింబాలుగా నిలుస్తున్న ‘నెట్’ కామెంట్లు ఇవీ... ‘నేను ఈ మధ్య ఓ జోక్ చూశా.. డాలర్ ఎస్కలేటర్ పైన.. రూపాయి వెంటిలేటర్ పైన... ఉల్లిపాయలు షోరూంలో.. మనం కోమాలో... ఈ దేశాన్ని దేవుడే కాపాడాలి..’ ఇది బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల, నటుడు కమల్ కామరాజ్ తదితర సెలబ్రిటీలు ట్విట్టర్లో షేర్ చేసిన జోక్. ‘ఉల్లిపాయలకు... ఎన్నికలకు ఏదో సంబంధం ఉన్నట్లుంది. ఎందుకంటే ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఉల్లిధరలు మండుతున్నాయి’ అంటూ కిరణ్‌బేడి ట్విట్టర్లో స్పందించారు. కార్టూన్లు.. ఫేస్బుక్లో పెద్ద సంఖ్యలో ఉల్లి ధరలపై కార్టూన్లూ షేర్ చేసుకుంటున్నారు. ‘ఉంగరంలో డైమండ్ బదులు ఉల్లిపాయని అమర్చిన ఫోటో’ ‘దేవుడు ప్రత్యక్షమై ఉల్లిధరలు తగ్గించమనీ.. రూపాయి విలువ పెంచటం లాంటి పిచ్చిపిచ్చి కోరికలు కాకుండా మంచివి కోరమంటూ భక్తుడి మీద చిరాకుపడతాడు’ ఈ రెండు ఫోటోలు ఫేస్బుక్లో బాగా పాపులర్. వీటితో పాటు బోలెడు ఉల్లిజోకులతో కూడిన కార్టూన్లు సోషల్ సైట్స్‌లో హల్చల్ చేస్తున్నాయి. ట్విట్టర్లో ఉల్లి కోసం ప్రత్యేకంగా అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. ‘ఉల్లి’జోకులు.. ‘ఈ మధ్య బప్పీలహరి ఉల్లి నగలతో కనిపిస్తున్నాడు’ ‘మరో సారి యూపీఏని గెలిపించండి..‘రైట్ టు ఆనియన్’ యాక్ట్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెడతారు.’ ‘ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే ఉల్లినారు తీసుకెళ్లి ఇవ్వు.. స్వంతంగా పెరట్లో ఉల్లిపాయల పెంపకం ఎలా పుస్తకం కూడా ఇవ్వచ్చు.’ ‘ఒకటి కంటే ఎక్కువ కిలోల ఉల్లిపాయలు కలిగి ఉండటం నేరం. త్వరలోనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.’ ‘రుచిని బట్టి ఉప్పు... జీతాన్ని బట్టి ఉల్లిపాయలు..’ ‘వంటకు ఉల్లిపాయలు వాడే వారు జాగ్రత్త.. సీబీఐ గానీ చూసిందంటే.. ఇంట్లో ఐటీ రైడ్లు చేసే అవకాశం ఉంది.’ ‘ఉల్లిపాయలు కొనాలి లోన్ ఇస్తారా..’