
ఫేస్‌బుక్ అంత పని చేస్తోందా?!
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌ఫై కొత్త ఆరోపణ. వినియోగదారులంతా అవాక్కయ్యే ఆరోపణ ఇది. కోట్లాది మంది ఫేస్‌బుక్‌లో మునిగి తేలుతుండగా ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకొని ఫేస్‌బుక్ వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతోంది. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ చేసుకొనే పర్సనల్ చాట్స్‌ను మానిటర్‌చేస్తూ వాటిని అడ్వర్టైజర్స్‌కు అమ్ముకొంటోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీన్ని బట్టి ఇద్దరు వ్యక్తులు ఫేస్‌బుక్‌లో వ్యక్తిగతంగా మాట్లాడుకొనే విషయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమే కాదనుకోవాల్సి వస్తోంది. ఫేస్‌బుక్‌యూజర్లు దేని గురించి చర్చించుకొంటున్నారు? అనే విషయాలను మానిటర్ చేసి వాటిద్వారా సోషల్‌ట్రెండ్స్‌ను అంచనా వేస్తూ వాణిజ్యసంస్థలకు వాటిని అందించే వ్యాపారాన్ని చేస్తోందట ఫేస్‌బుక్ యాజమాన్యం. దీనిపై అమెరికాలో కేసు కూడా నమోదు అయ్యింది.
యూజర్ల పర్సనల్ చాట్స్‌ను ఫేస్‌బుక్ పరిశీలిస్తోందని, వాటిని బయటి వారికి అమ్ముకొని ప్రైవసీని దెబ్బతీస్తోందని యూఎస్ కోర్టులు వ్యాజ్యం దాఖలైంది. విశేషం ఏమిటంటే... ఫేస్‌బుక్ ఈ ఆరోపణను ఖండించడం లేదు! దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని ఎఫ్‌బి యాజమాన్యం ప్రకటించింది.