క్రికెట్ అభిమానులకు సంపూర్ణ టి20 వినోదాన్ని అందించిన ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ‘ట్విట్టర్’లోనూ అమిత ఆదరణ లభించింది.
ముంబై: క్రికెట్ అభిమానులకు సంపూర్ణ టి20 వినోదాన్ని అందించిన ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ‘ట్విట్టర్’లోనూ అమిత ఆదరణ లభించింది. ఈ సీజన్‌లో ఎక్కువ మంది ట్వీట్‌ల ద్వారా చర్చించిన మ్యాచ్‌గా ఇది నిలిచింది.
ఐపీఎల్ అధికారిక సమాచారం ప్రకారం ఓవరాల్‌గా లీగ్ దశ ముగిసే సరికి ముంబై జట్టు గురించి 3 లక్షల 60 వేల ట్వీట్స్ పోస్ట్ కాగా, చెన్నై 2 లక్షల 48 వేల ట్వీట్లతో రెండో స్థానంలో ఉంది. అయితే కొత్త ఫాలోవర్లను జత చేసుకోవడంలో మాత్రం 90 వేలతో చెన్నై అగ్రస్థానంలో ఉంది. ఆటగాళ్ల విషయానికి వస్తే... విరాట్ కోహ్లి గురించి ఒక లక్షా 61 వేల ట్వీట్స్ ప్రచురితం కావడం విశేషం!