
పదేళ్ల ‘ఫేస్‌బుక్’
సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్’కు ఈనెల 4వ తేదీతో పదేళ్లు పూర్తవుతున్నాయి. ఇంటర్నెట్ తెచ్చిన సమాచార విప్లవంలో సోషల్ మీడియా మరింత విప్లవాత్మక మార్పులు తెచ్చింది. గడచిన పదేళ్లలో అంచెలంచెలుగా విస్తరిస్తూ, ‘ఫేస్‌బుక్’ సోషల్ మీడియాలో అద్వితీయమైన స్థానాన్ని చేజిక్కించుకుంది. హార్వర్డ్ వర్సిటీ విద్యార్థిగా మార్క్ జూకర్‌బర్గ్ రూపొందించిన ప్రాజెక్టు ‘ఫేస్‌బుక్’గా రూపుదిద్దుకుని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా123 కోట్ల మందిని అనుసంధానిస్తోంది. అనతికాలంలోనే ప్రపంచమంతటా ‘ఫేస్‌బుక్’ విలువ 9 వేల కోట్లు (రూ.9,26,961 కోట్లు). సోషల్ మీడియాలో ఈ దశాబ్ది కచ్చితంగా ‘ఫేస్‌బుక్’దే. ఈజిప్టు వంటి దేశాల్లో ప్రజల తిరుగుబాట్లలో సైతం కీలక పాత్ర పోషించిన ఘనత దీనికే చెందుతుంది.