పూనమ్‌పాండే ‘ఫేస్‌బుక్’ గల్లంతు | Poonam Pandey’s Facebook account deactivated post ALS Ice Bucket Challenge | Sakshi
Sakshi News home page

పూనమ్‌పాండే ‘ఫేస్‌బుక్’ గల్లంతు

Published Sun, Aug 31 2014 2:30 AM | Last Updated on Mon, Oct 22 2018 6:35 PM

పూనమ్‌పాండే ‘ఫేస్‌బుక్’ గల్లంతు - Sakshi

పూనమ్‌పాండే ‘ఫేస్‌బుక్’ గల్లంతు

సోషల్ నెట్‌వర్క్ వెబ్‌సైట్లలో నిత్యం సందడి చేసే బాలీవుడ్ భామ పూనమ్ పాండే ‘ఫేస్‌బుక్’ ఖాతా గల్లంతైంది. డీయాక్టివేట్ అయిన ‘ఫేస్‌బుక్’ ఖాతాను తిరిగి ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలియక ఆమె తెగ బాధపడుతోంది. ‘నా ఫేస్‌బుక్ ఖాతాకు 21 లక్షలకు పైగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇది డీయాక్టివేట్ కావడం చాలా బాధగా ఉంది. తిరిగి ఎలా యాక్టివేట్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. దీనిని తిరిగి ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఎవరైనా చెప్పరూ..’ అంటూ ‘ట్విట్టర్’లో తన అభిమానులను అభ్యర్థిస్తోంది.
 
ముగ్ధాగాడ్సే మేనేజ్‌మెంట్ పాఠాలు
బాలీవుడ్ భామ ముగ్ధా గాడ్సే మేనేజ్‌మెంట్ పాఠాలు నేర్చుకుంటోంది. నరేశ్ మల్హోత్రా దర్శకత్వంలోని ‘ఇష్క్‌నే క్రేజీ కియా’ చిత్రంలోని కార్పొరేట్ మహిళ పాత్ర పోషించనున్న ముగ్ధా, కొద్ది రోజులుగా మేనేజ్‌మెంట్ పాఠాలతో కుస్తీలు పడుతోంది. తన పాత్ర మరింత సహజంగా ఉండాలనే తపనతో బడా బడా కార్పొరేట్ మహిళా అధికారుల వద్ద చిట్కాలు తెలుసుకుంటూ, వారిని దగ్గరగా పరిశీలిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement