షంషేర్
మీరు ఫొటో హాలికా ! నిమిషానికో ఫొటో తీసి.. క్షణాల్లో అప్‌లోడ్ చేసి.. ఫ్రెండ్స్ లైక్స్, కామెంట్స్‌తో ఆనందిస్తుంటారా ? మూమెంట్ ఏదైనా లెన్స్‌తో కట్టేసి ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకునే అలవాటు మీదైతే.. ఈ సరికొత్త యాప్ మీకోసమే. ఇన్‌స్టాగ్రామ్. జీవితంలోని మధుర క్షణాలను క్లిక్ కొట్టి ప్రపంచానికి పంచుకోవడానికి వీలు కల్పించే ఫొటో వరల్డ్ ఇది. ఫేస్‌బుక్ కన్నా వేగంగా దూసుకుపోతున్న షేరింగ్ వరల్డ్. ఇప్పుడు యూత్ ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌నే ప్రిఫర్ చేస్తున్నారు.
ఫేస్‌బుక్‌లో ఫొటో పెట్టాలంటే ఫొటో అప్‌లోడ్ చేసి దానికి ప్లేస్ ట్యాగ్ చేసి, క్యాప్షన్ రాసి ఫ్రెండ్స్‌కు షేర్ చేస్తాం. కానీ ఇన్ స్టాకు అంత కష్టం అవసరం లేదు. జస్ట్ ఫొటో తీసి అప్‌లోడ్ చేస్తే సరి. అన్ని వివరాలు దానంతటవే యాడ్ అవుతాయి. అప్‌లోడింగ్‌కి ఎక్కువ సమయం కూడా తీసుకోదు. ఇతర సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్ల కన్నా వేగంగా పనిచేస్తుంది. మన ఫొటోలను ఇతరులు కాపీ చేయడానికి గానీ, డౌన్‌లోడ్ చేసుకోవడానికి గానీ అవకాశం లేని సురక్షితమైన యాప్ ఇది.
బెస్ట్ యాప్
ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ క్రియేట్ చేసే ఫ్యాషన్ డిజైనర్స్‌కు ఇది బెస్ట్ యాప్. తాను చేసిన డిజైన్స్ అప్‌లోడ్ చేయడమే కాదు.. ఇతర డిజైనర్స్ చేసినవి చూసి తనను తాను ఎప్పటికప్పడు అప్‌డేట్ చేసుకోవడానికి ఇది ఎంతో హెల్ప్ అవుతుందని అంటున్నారు డిజైనర్ శృతి కేడియా.
యూజర్ ఫ్రెండ్లీ
‘ఇన్‌స్టా గ్రామ్ కొత్తగా 100 హ్యాపిడేస్ చాలెంజ్ ఒకటి లాంచ్ చేసింది. తమను సంతోషంగా ఉంచిన క్షణాలను ఫ్రెండ్స్‌తో పంచుకునే అవకాశం కల్పిస్తోంది. ఇది మొబైల్ యాప్ కాదు.. యూజర్స్‌ను సంతోషంగా ఉంచే వాహకం’ అని అంటున్నారు హెల్పింగ్ హ్యాండ్ వ్యవస్థాపకురాలు ఆర్తి నాగ్‌పాల్.
- సిద్ధాంతి