సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్.. ఈ ఏడాది ప్రథమార్థంలో భారత్ నుంచి 22,684 అభ్యర్థనలను అందుకుంది. యూజర్ అకౌంట్లకు సంబంధించిన సమాచారం కోరుతూ ఈ అభ్యర్థనలను పొందినట్లు కంపెనీ వెల్లడించింది. అమెరికా 50,714 అభ్యర్థనలను కోరగా.. ఆ తరువాత స్థానంలో అత్యధిక రిక్వెస్ట్‌లు భారత్ నుంచే వచ్చాయని పేర్కొంది. ఈ ఏడాది జనవరి–జూన్ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1.28 లక్షల అభ్యర్థనలను అందుకున్నట్లు తెలియజేసింది. గతేడాది జూలై–డిసెంబర్ కాలంలోని 1,10,634 రిక్వెస్ట్‌లతో పోల్చితే ఈ సారి 16 శాతం వృద్ధి ఉన్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment