
ఉత్తమ పదం
మొబైల్స్, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో రోజుకు లక్షల మంది తమ ఆత్మీయులతో చాటింగ్ చేస్తుంటారు. అందులోనే తమ ఆనందాన్ని పంచుకుంటారు. బాధను చెప్పుకొని ఊరట పొందుతారు. అలా తమ చాటింగుల్లో కొన్నేళ్లు నుంచి పదాలతో పాటు ఈమోజీలనూ పంపుకుంటున్నారు. ఈమోజీ (జపానీ పదం) అంటే మనకు తెలియని కొత్త పదం అనుకోకండి. వాటిని మనం ముద్దుగా స్మైలీస్ అంటుంటాం.
అసలు ఈ గొడవంతా ఏంటీ అంటే ఇటీవల ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ వాళ్లు ఆనందబాష్పాలతో ఉండే స్మైలీకి 2015కు గాను ‘ది బెస్ట్ వర్డ్ ఆఫ్ ద ఇయర్’గా ప్రకటించారట. దానికి కారణం ఈ ఏడాది మొబైల్స్, ఆన్‌లైన్‌లో చాటింగ్ చేసేవాళ్లలో ఎక్కువమంది ఈ ఐకాన్‌ను ఉపయోగించారట. ఇది ‘పదం’ కాకపోయినా ఎమోషనల్ సమయాల్లో మంచి ఎక్స్‌ప్రెషన్‌గా మెసేజుల్లో ఉపయోగిస్తున్నారు కాబట్టి దీన్ని పదంగా భావించింది ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ సంస్థ.