
మరోసారి చూడాలి
మరోసారి చూడాలి, కౌగలించుకోవాలి, ముద్దాడాలి ఏమిటి రశికతతో కూడిన సినిమా డైలాగులు అంటారా? మీ కల అనిపించినా, ఇవి సినిమా డైలాగులు కాదు. ఓ ప్రముఖ నటి తన ప్రియుడికి పంపిన ప్రేమ సందేశం కాదు. ఇది ఓ సోషల్ నెట్‌వర్కు లవ్ మ్యాటర్. కొందరు హీరోయిన్లు ప్రేక్షకులను ఆకర్షించాలనో లేక ఇంకేదో ఆశించో కనీస సామాజిక బాధ్యతను మరచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారనడానికి ఇది నిదర్శనం. ఇటీవల నటి చార్మి పెళ్లికూతురు రూపంలో ఉన్న ఫొటోను ఇంటర్‌నెట్‌లో పోస్టు చేసి ఈ రోజు నాకు పెళ్లి అంటూ చాలామందిని అయోమయానికి గురి చేశారు. తాజాగా నటి ప్రియమణి తనకో లవర్ ఉన్నాడు, తను ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటూ నెట్‌లో పోస్టు చేసి సంచలనం సృష్టించారు.
ఆమె అంతటితో ఆగలేదు. ప్రియుడికి తన కోరికలను తెలిపే విధంగా ఒక మెసేజ్‌ను కూడా పోస్టు చేశారు. అవేమిటో తెలుసుకోవాలనుందా? మీ నుంచి మూడు విషయాలు కావాలి. మిమ్మల్ని మళ్లీ చూడాలి, గట్టిగా కౌగలించుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి అంటూ తన రహస్య ప్రేమికుడికి సోషల్ నెట్‌వర్కు ప్రేమలేఖను రాసి కొందరి అసహ్యానికి గురయ్యారు. మరికొందరు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెసేజ్ పేరుతో ఎలాగైనా ప్రవర్తించవచ్చా అంటూ ప్రియమణి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రచారం కోసం ఇలాంటి చీప్ ట్రిక్‌కు పాల్పడడమా? అంటూ అసహ్యహించుకుంటున్నారు. సెలిబ్రెటీగా చలామణి అవుతున్న వారు సామాజిక బాధ్యతలు గుర్తెరగాలని హితవు పలుకుతున్నారు. వారికి ప్రియమణి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.