
భారత్‌లోని ఐఫోన్‌ల్లో రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (ఆర్‌సీఎస్) మెసేజింగ్‌ను తీసుకురావడానికి యాపిల్ గూగుల్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ భాగస్వామ్యం మెసేజింగ్ సాంకేతికతలో మార్పును సూచిస్తుంది. ఈ చర్యలు ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో ఒకటైన ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారుల సంఖ్యను పెంచేలా వీలు కల్పిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత ఐఓఎస్ 18.2 వెర్షన్‌లో పీ2పీ (పర్సన్-టు-పర్సన్) ఆర్‌సీఎస్‌ను యూఎస్, కెనడా, జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, యుకె, బెల్జియం, చైనా వంటి ఎనిమిది దేశాల్లో ప్రారంభించారని గ్లోబల్ ఆర్‌సీఎస్ ప్లాట్‌ఫామ్ ప్రొవైడర్ డాట్గో సీఈఓ ఇందర్పాల్ ముమిక్ పేర్కొన్నారు. ఇందుకోసం యాపిల్ ‘ఐమెసేజ్’ క్లయింట్ గూగుల్ బ్యాక్ ఎండ్ సర్వర్లలో పనిచేయడానికి పరస్పరం ఇరు కంపెనీలు సహకరించుకున్నట్లు తెలిపారు. ఈ దేశాల్లో ఆర్‌సీఎస్ కోసం క్యారియర్ నెట్ వర్క్‌లను అనుసంధానించినట్లు చెప్పారు. అయితే గూగుల్‌కు అంతగా ఆదరణ లేని చైనాలో ప్రత్యామ్నాయ సర్వర్ వెండర్లను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు.
జీఎస్ఎం అసోసియేషన్ అభివృద్ధి చేసిన అధునాతన ప్రోటోకాల్ ఆర్‌సీఎస్ మెసేజింగ్ హై-రిజల్యూషన్ మీడియా షేరింగ్, రీడ్ రసీదులు, టైపింగ్ ఇండికేటర్స్, ఇంటర్నెట్ ఆధారిత సందేశాలు వంటి ఫీచర్లను అందిస్తుంది. సాంప్రదాయ ఎస్‌ఎంఎస్, ఎంఎంఎస్ మాదిరిగా కాకుండా ఆర్‌సీఎస్ మొబైల్ డేటా లేదా వై-ఫై ద్వారా పనిచేస్తుంది. ఇది అంతరాయంలేని మెరుగైన కమ్యూనికేషన్ అనుభవాన్ని అందిస్తుంది.
ఇదీ చదవండి: ‘ఆర్థికాభివృద్ధికి ఈ రెండే కీలకం’
రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్(ఆర్‌సీఎస్) మెసేజింగ్ సాంప్రదాయ ఎస్ఎంఎస్‌లతో పోలిస్తే వినియోగదారు అనుభవాన్ని పెంచే అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అధిక రిజల్యూషన్ చిత్రాలు, వీడియోలు, జిఫ్‌ల వంటి ఫైళ్లను ఆర్‌సీఎస్ మెసేజింగ్ అందిస్తుంది. వాట్సాప్, ఐమెసేజ్ వంటి చాట్ యాప్స్ మాదిరిగానే అవతలి వ్యక్తి టైప్ చేస్తున్నప్పుడు రియల్‌టైమ్‌లో చూడవచ్చు. ఎస్‌ఎంఎస్ మాదిరిగా కాకుండా ఆర్‌సీఎస్ సందేశాలను వై-ఫై లేదా మొబైల్ డేటా ద్వారా పంపవచ్చు. ఇది ఎస్‌ఎంఎస్ ఛార్జీలను ఆదా చేస్తుంది. సాధారణ సందేశాలను 160 అక్షరాలకు పరిమితం చేసే ఎస్‌ఎంఎస్ మాదిరిగా కాకుండా, ఆర్‌సీఎస్ మరింత వివరణాత్మక సందేశాలకు అనుమతిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment