
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపణ
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధమైన, గోప్యతకు భంగకరమైన చర్యలను గట్టిగా వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు యాపిల్ సంస్థ నుంచి వచ్చిన హెచ్చరిక మెసేజ్‌ను శనివారం షేర్ చేశారు. ‘మీ యాపిల్ ఐడీతో ఉన్న ఐఫోన్‌ను రిమోట్‌గా హ్యాక్ చేసేందుకు కిరాయి స్పైవేర్‌తో ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మీరెవరు? ఏం చేస్తున్నారు? అనేవి తెలుసుకునే లక్ష్యంతోనే ఈ దాడి జరుగుతున్నట్లుగా భావిస్తున్నాం’అని అందులో ఉంది. ఈ హెచ్చరిక నేపథ్యంలో వేణుగోపాల్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘మీకెంతో ఇష్టమైన స్పైవేర్‌ను నా ఫోన్‌కు కూడా పంపించినందుకు మోదీ జీ మీకు కృతజ్ఞతలు. మీరు పంపించిన ప్రత్యేక బహుమతి గురించి యాపిల్ సంస్థ నాకు సమాచారమిచ్చింది. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడేందుకు, వారి గోప్యతకు భంగం కలిగించేందుకు మీరు నేరపూరితంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment