Congress General Secretary
-
Kc Venugopal: ప్రభుత్వం నా ఫోన్‌ను హ్యాక్ చేసింది
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధమైన, గోప్యతకు భంగకరమైన చర్యలను గట్టిగా వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు యాపిల్ సంస్థ నుంచి వచ్చిన హెచ్చరిక మెసేజ్‌ను శనివారం షేర్ చేశారు. ‘మీ యాపిల్ ఐడీతో ఉన్న ఐఫోన్‌ను రిమోట్‌గా హ్యాక్ చేసేందుకు కిరాయి స్పైవేర్‌తో ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరెవరు? ఏం చేస్తున్నారు? అనేవి తెలుసుకునే లక్ష్యంతోనే ఈ దాడి జరుగుతున్నట్లుగా భావిస్తున్నాం’అని అందులో ఉంది. ఈ హెచ్చరిక నేపథ్యంలో వేణుగోపాల్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘మీకెంతో ఇష్టమైన స్పైవేర్‌ను నా ఫోన్‌కు కూడా పంపించినందుకు మోదీ జీ మీకు కృతజ్ఞతలు. మీరు పంపించిన ప్రత్యేక బహుమతి గురించి యాపిల్ సంస్థ నాకు సమాచారమిచ్చింది. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడేందుకు, వారి గోప్యతకు భంగం కలిగించేందుకు మీరు నేరపూరితంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది’అని పేర్కొన్నారు. -
TS: స్పీకర్ ఎన్నిక 14న..ఆయనకే ఛాన్స్ !
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఈ నెల 14న జరగనుంది. స్పీకర్ ఎన్నిక తేదీని ఖరారు చేస్తూ అసెంబ్లీ సెక్రటేరియట్ సోమవారం(డిసెంబర్11)నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పీకర్ పదవికి పోటీపడే వారే నుంచి ఈ నెల 13న ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచే స్పీకర్ ఎన్నికవనున్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌కు స్పీకర్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే స్పీకర్ ఎన్నిక ఏకగగ్రీవం కావాలంటే కాంగ్రెస్ పార్టీ తరపున ఒక్క నామినేషన్ మాత్రమే రావాల్సి ఉంటుంది. ఎవరైనా ఇతర సభ్యులు పోటీలో ఉంటే బ్యాలెట్ ద్వారా స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇదీచదవండి..కిషన్.. పవన్.. ఓ ప్రచారం -
బీజేపీకి సీఎం అభ్యర్థే లేరు
జైపూర్: రాజస్తాన్‌లో బీజేపీ చెల్లాచెదురయిందని, అందుకే ఆ పార్టీకి సీఎం అభ్యర్థే లేకుండాపోయారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఎద్దేవా చేశారు. దుంగార్పూర్ జిల్లా సగ్వారాలో శుక్రవారం ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. బీజేపీకి సీఎం అభ్యర్థి దొరక్క ప్రధాని మోదీ చేసేది లేక తన పేరుతోనే ఓట్లభ్యర్థిస్తున్నారన్నారు. మతం, మనోభావాలను వాడుకుంటూ ఓట్లడిగే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీ పాలనలో ద్రవ్యోల్బణం కారణంగా రైతులతోపాటు ప్రజలు అవస్థలు పడుతున్నారని విమర్శించారు. ‘దేశంలో రైతుల సరాసరి ఆదాయం రోజుకు కేవలం రూ.27 మాత్రమే కాగా, ప్రధాని మోదీ ప్రత్యేక మిత్రుడు అదానీ మాత్రం రోజుకు రూ.16 వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం వద్ద రైతు రుణాలు రద్దు చేసేందుకు మాత్రం డబ్బుల్లేవు’అని ధ్వజమెత్తారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వెన్నుచూపుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజల కోసం ద్రవ్యోల్బణ సహాయక శిబిరాలను నిర్వహిస్తుందని ప్రకటించారు. బీజేపీ అధికారంలోకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ నిలిపివేస్తుందని ప్రియాంకా గాంధీ ప్రజలను హెచ్చరించారు. -
అరవింద్ కేజ్రీవాల్ తగ్గేదే లే.. పంతం నెగ్గించుకున్న ఢిల్లీ సీఎం
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలంటూ ఎప్పటినుంచో కోరుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. బీహార్ లో జరిగిన తొలి విడత విపక్షాల సమావేశానికి హాజరైన అరవింద్ కేజ్రివాల్ బెంగళూరులో జరగబోయే రెండో విడత విపక్షాల సమావేశానికి హాజరు కావడంలేదని ముందు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశంలో ఢిల్లీ కోరిన మద్దతు ఇవ్వడానికి తాము సుముఖంగా ఉన్నట్లు పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ కర్ణాటకలో జరగబోయే రెండో విడత విపక్షాల సమావేశానికి పాల్గొంటుందని తెలిపాయి పార్టీ వర్గాలు. కాంగ్రెస్ ససేమిరా.. ఢిల్లీ బ్యూరోక్రాసిపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా ఇప్పటికే మెజారిటీ పార్టీల మద్దతు కూడగట్టారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇంతకాలం మద్దతు ఇవ్వకుండా మంకుపట్టు పట్టింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా తమ పార్టీ ఎప్పుడూ వ్యవహరించదని తెలిపిన కాంగ్రెస్ గతంలో కేంద్రం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మద్దతు ఇచ్చేది లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. మీతో వచ్చేది లేదు.. దీంతో కాంగ్రెస్ పార్టీతో కలిసివచ్చేది లేదని ఇదివరకే ప్రకటించాయి ఆప్ వర్గాలు. ఢిల్లీ ముఖ్యమంత్రి కూడాకాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందులో భాగంగానే కర్ణాటకలో జరగనున్న రెండో విడత విపక్షాల సమావేశాలకు హాజరయ్యే విషయమై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు ఆప్ అధినేత. సరే కానివ్వండి.. కానీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిజెపి వ్యతిరేక పార్టీలన్నీ ఏకం కావలసిన అవసరం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఓ మెట్టు దిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ తమ పార్టీ ఎప్పుడూ ఆర్డినెన్సుకు వ్యతిరేకమేనని ప్రకటించారు. ఈ విషయాన్ని ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం వెలువడిన కొద్దీ గంటల్లోనే అరవింద్ కేజ్రీవాల్ కర్ణాటకలో జరగబోయే రెండో విడత విపక్షాల సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపారు. VIDEO | "I think they (AAP) are going to join the meeting tomorrow. As for the ordinance (on control of services in Delhi), our stand is very clear. We are not going to support it," says Congress general secretary KC Venugopal on the opposition meet, scheduled to be held in… pic.twitter.com/YdeUZYmPG5 — Press Trust of India (@PTI_News) July 16, 2023 ఎందుకీ తిప్పలు.. ఢిల్లీ పరిపాలన విధానాన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపధ్యంలో ప్రతిపక్షాల మద్దతు కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి విశ్వప్రయత్నాలు చేసున్నారు. అధికార పార్టీకి మద్దతు భారీగా ఉన్న నేపథ్యంలో లోక్ సభలో ఈ బిల్లు ఎలాగైనా ఆమోదం పొందుతుంది. ఎగువ సభ అయిన రాజ్యసభలో మాత్రం ఈ ఆర్డినెన్స్ ఆమోదం పొందకుండా అడ్డుకోవాలంటే ప్రతిపక్షాల మద్దతు తప్పనిసరి. అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విపక్షాల నాయకుల్ని ఒక్కొక్కరినీ కలిసి మద్దతు కూడగడుతూ వచ్చారు. తాజాగా ఆయన పట్టుదలకు కాంగ్రెస్ పార్టీ కూడా దిగివచ్చింది. Congress announces its unequivocal opposition to the Delhi Ordinance. This is a positive development. — Raghav Chadha (@raghav_chadha) July 16, 2023 ఇది కూడా చదవండి: ఇష్టమొచ్చినట్టు పోక్సో చట్టం.. స్కూలు మాష్టారుపై కేసు నమోదు.. -
అజారుద్దీన్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఫైర్
-
ఈటలతో కాంగ్రెస్ నేత భేటీ
మేడ్చల్ రూరల్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ శుక్రవారం భేటీ అయ్యారు. మేడ్చల్ మండలం పూడూర్ గ్రామ పరిధిలోని ఈటల నివాసానికి మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో వచ్చిన రాములు నాయక్ గంటన్నరకు పైగా ఆయనతో సమావేశం అయ్యారు. అనంతరం 3 గంటలకు ఈటల బయటకు వచ్చి కార్యకర్తల సమావేశంలో పాల్గొనగా.. రాములు నాయక్ సాయంత్రం 4 గంటలకు వెళ్లిపోయారు. -
విజయశాంతి ఎప్పుడైనా బీజేపీలోకి రావొచ్చు!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆ పార్టీ నాయకత్వం మీద కింది నేతలకు అసంతృప్తి ఉందని వ్యాఖ్యానించారు. విజయశాంతి మంచి నాయకురాలని, తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిందన్నారు. బీజేపీలో ఆమె ఎప్పుడు చేరేది తెలియదని, చేరాక విజయశాంతికి ప్రాధాన్యత ఏంటనేది అప్పడే చెబుతామని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన పలువురు నేతలు మంగళవారం బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత ఎంపీటీసీ, కాంగ్రెస్ నేత తోట సంధ్య బీజేపీలో చేరారు. ఎంపీటీసీతో పాటు వార్డు మెంబర్లు, టీఆర్ఎస్ నేతలకు బండి సంజయ్ పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. చదవండి: నిరూపిస్తే.. ఉరేసుకుంటా: బండి సంజయ్ ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని దొండపాడుకు చెందిన కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి పేదలకు న్యాయం చేద్దామన్నారు. రాష్ట్రంలో అవినీతి, నియంతృత్వ పాలన రాజ్యమేలుతోందని దుయ్యబట్టారు. టీఆర్ఎస్లో తుకుడే గ్యాంగ్ ఉందన్న సంజయ్.. దుబ్బాక ఎన్నికల సందర్భంగా బీజేపీపై తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. హుజూర్ నగర్ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గానికి రూ. 200 కోట్లు ఇస్తామన్నారు. ఏమైందని ప్రశ్నించారు. చదవండి: ఎమ్మెల్యే క్రాంతి, మాజీ ఎమ్మెల్యేపై బీజేపీ దాడి హుజూర్ నగర్ ప్రజలను మోసం చేసి విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుందని, అందుకే దుబ్బాక ప్రజలకు ముఖం చూపలేదని విమర్శించారు. అబద్ధం చెబితే మెడ మీద తలకాయ నరుక్కంటా అని చెప్పిన సీఎం కేసీఆర్ ఎన్ని అబద్ధాలు చెప్పారో లెక్కలేదని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులతో అగాధంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే. ఎందుకు నేరుగా వెళ్లి చూడటం లేదని ప్రశ్నించారు. బీజేపీ ప్రజాస్వామ్య పద్దతిలో సమస్యలపై ఆందోళనలు చేస్తుందని స్పష్టం చేశారు. చదవండి: శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం బాధాకరం -
'దమ్ముంటే నల్లకుబేరుల జాబితా వెల్లడించు'
న్యూఢిల్లీ : దమ్ముంటే నల్లకుబేరుల జాబితాలోని పేర్లు వెల్లడించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సవాల్ విసిరారు. నల్లధనం జాబితాలో పేర్లు ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీలోని కొందరి పేర్లు లీక్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కావాలనే కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహారిస్తుందని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. విదేశాల్లో నల్లధనం దాచిన వారి వివరాలు వెల్లడైతే కాంగ్రెస్ పార్టీ వారికి ఇబ్బందులు తప్పవంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. గత యూపీఏ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కేంద్ర మంత్రి పేరు ఆ జాబితాలో ఉందంటూ జైట్లీ ఈ సందర్భంగా సంకేతాలిచ్చి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై స్పందిస్తూ నల్లధనం జాబితాలో పేర్లు దమ్ముంటే బహిర్గతం చేయాలని జైట్లీకి సవాల్ విసిరారు. -
అత్యాచారాలపై మోడీని ప్రశ్నించరే
మీడియాపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. గతంలో నిర్భయ అత్యాచార ఘటన విషయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్నే లక్ష్యంగా చేసుకున్న మీడియా..... నేడు యూపీలో మహిళలపై వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలపై ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు లక్ష్యంగా చేయడంలేదంటూ దిగ్విజయ్ సింగ్ మీడియాను ప్రశ్నించారు. 2012 డిసెంబర్లో దేశ రాజధాని హస్తినలో నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై స్పందించాలని మీడియా ప్రధాని మన్మోమన్ సింగ్ వెంటపడిన తీరు దిగ్విజయ్ సింగ్ ఈ సందర్బంగా విశదీకరించారు. వరుస అత్యాచారాలతో ఉత్తరప్రదేశ్ అట్టుకుతున్న పాపం మీడియాకు మాత్రం నరేంద్ర మోడీని ప్రశ్నించలేకపోతుందంటూ ఆయన ఎద్దేవా చేశారు. మీడియా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు.మరి ముఖ్యంగా బుదాయూలో అక్కచెల్లిళ్లపై సామూహిక అత్యాచారం జరిపి ఆపై చెట్టుకు ఉరివేసిన సంఘటన దారణమని దిగ్విజయ్ సింగ్ గురువారం తన ట్విట్టర్లో వెల్లడించారు.