న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలంటూ ఎప్పటినుంచో కోరుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు.
బీహార్ లో జరిగిన తొలి విడత విపక్షాల సమావేశానికి హాజరైన అరవింద్ కేజ్రివాల్ బెంగళూరులో జరగబోయే రెండో విడత విపక్షాల సమావేశానికి హాజరు కావడంలేదని ముందు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశంలో ఢిల్లీ కోరిన మద్దతు ఇవ్వడానికి తాము సుముఖంగా ఉన్నట్లు పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ కర్ణాటకలో జరగబోయే రెండో విడత విపక్షాల సమావేశానికి పాల్గొంటుందని తెలిపాయి పార్టీ వర్గాలు.
కాంగ్రెస్ ససేమిరా..
ఢిల్లీ బ్యూరోక్రాసిపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా ఇప్పటికే మెజారిటీ పార్టీల మద్దతు కూడగట్టారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇంతకాలం మద్దతు ఇవ్వకుండా మంకుపట్టు పట్టింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా తమ పార్టీ ఎప్పుడూ వ్యవహరించదని తెలిపిన కాంగ్రెస్ గతంలో కేంద్రం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మద్దతు ఇచ్చేది లేదని ప్రకటించిన విషయం తెలిసిందే.
మీతో వచ్చేది లేదు..
దీంతో కాంగ్రెస్ పార్టీతో కలిసివచ్చేది లేదని ఇదివరకే ప్రకటించాయి ఆప్ వర్గాలు. ఢిల్లీ ముఖ్యమంత్రి కూడాకాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందులో భాగంగానే కర్ణాటకలో జరగనున్న రెండో విడత విపక్షాల సమావేశాలకు హాజరయ్యే విషయమై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు ఆప్ అధినేత.
సరే కానివ్వండి..
కానీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిజెపి వ్యతిరేక పార్టీలన్నీ ఏకం కావలసిన అవసరం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఓ మెట్టు దిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ తమ పార్టీ ఎప్పుడూ ఆర్డినెన్సుకు వ్యతిరేకమేనని ప్రకటించారు. ఈ విషయాన్ని ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం వెలువడిన కొద్దీ గంటల్లోనే అరవింద్ కేజ్రీవాల్ కర్ణాటకలో జరగబోయే రెండో విడత విపక్షాల సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపారు.
VIDEO | "I think they (AAP) are going to join the meeting tomorrow. As for the ordinance (on control of services in Delhi), our stand is very clear. We are not going to support it," says Congress general secretary KC Venugopal on the opposition meet, scheduled to be held in… pic.twitter.com/YdeUZYmPG5
— Press Trust of India (@PTI_News) July 16, 2023
ఎందుకీ తిప్పలు..
ఢిల్లీ పరిపాలన విధానాన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపధ్యంలో ప్రతిపక్షాల మద్దతు కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి విశ్వప్రయత్నాలు చేసున్నారు. అధికార పార్టీకి మద్దతు భారీగా ఉన్న నేపథ్యంలో లోక్ సభలో ఈ బిల్లు ఎలాగైనా ఆమోదం పొందుతుంది. ఎగువ సభ అయిన రాజ్యసభలో మాత్రం ఈ ఆర్డినెన్స్ ఆమోదం పొందకుండా అడ్డుకోవాలంటే ప్రతిపక్షాల మద్దతు తప్పనిసరి.
అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విపక్షాల నాయకుల్ని ఒక్కొక్కరినీ కలిసి మద్దతు కూడగడుతూ వచ్చారు. తాజాగా ఆయన పట్టుదలకు కాంగ్రెస్ పార్టీ కూడా దిగివచ్చింది.
Congress announces its unequivocal opposition to the Delhi Ordinance. This is a positive development.
— Raghav Chadha (@raghav_chadha) July 16, 2023
ఇది కూడా చదవండి: ఇష్టమొచ్చినట్టు పోక్సో చట్టం.. స్కూలు మాష్టారుపై కేసు నమోదు..
Comments
Please login to add a commentAdd a comment