ordinance bills
-
ఢిల్లీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఐఏఎస్‌లు సహా ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాలపై కేంద్రానికి అధికారాలు కట్టబెట్టిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసు బిల్లు చట్టంగా మారింది. ఈసారి వర్షాకాలం సమావేశాల్లో వివాదాస్పద బిల్లులైన ఢిల్లీ సర్వీసు బిల్లు, డిజిటల్ డేటా బిల్లుల్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ఆమోదించారు. వీటితో పాటు జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు , జన విశ్వాస్ (సవరణ) బిల్లులపై రాష్ట్రపతి సంతకం చేశారు. వీటిలో ఢిల్లీ పాలనాధికారాల బిల్లు (జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లు), డిజిటల్ డేటా (డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు) బిల్లులపై పార్లమెంటులో విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుందని సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అధికారాలన్నీ కేంద్రానికే కట్టబెడుతూ ఆర్డినెన్స్ తెచ్చింది. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లుని మొదట లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభ ఆమోదించాయి. ఇప్పుడు రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారింది. అదే విధంగా డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును మణిపూర్ అంశంపై ప్రతిపక్షాల నినాదాల మధ్య మూజువాణి ఓటుతో ఉభయ సభలు ఆమోదించాయి. ఈ బిల్లులో విపక్ష పార్టీలు కొన్ని సవరణలు సూచించినా ప్రభుత్వం చేపట్టలేదు. బిల్లులో కేంద్ర ప్రభుత్వం సహా కొందరికి మినహాయింపులు ఇవ్వడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. -
రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు.. వైఎస్సార్సీపీ మద్దతు..!
-
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు సరైందే.. రాజ్యసభలో చర్చ
Delhi Ordinance Bill LIVE ► ఢిల్లీ ఆర్డినెన్స్‌బిల్లుకు రాజ్యసభ సభ్యులు, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ పూర్తి మద్దతు ప్రకటించారు. #WATCH | "...To me the bill is correct, right...," says Rajya Sabha MP and former CJI Ranjan Gogoi on The Government of National Capital Territory of Delhi (Amendment) Bill, 2023. pic.twitter.com/uDZYZMbLdM — ANI (@ANI) August 7, 2023 #WATCH | Rajya Sabha MP and former CJI Ranjan Gogoi on The Government of National Capital Territory of Delhi (Amendment) Bill, 2023 "What is pending before the Supreme Court is the validity of the ordinance, and the two questions referred to the Constitution bench, and that has… pic.twitter.com/EeTDZ8AfWE — ANI (@ANI) August 7, 2023 ► ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. ‘ఇండియా కూటమి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ తానా షాహీ పార్టీ. ఢిల్లీ ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీకి చెందింది కాదు.. దేశ ప్రజలకు చెందింది.ఈ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తోంది. రాజ్యాంగానికి లోబడే బిల్లు.. అందుకే మద్దతు తెలిపాం’ అని అన్నారు. ► రాష్ట్ర అధికారాలను లాక్కోవడమే ఈ బిల్లు ఉద్దేశం. వాజ్‌పేయి, అద్వానీ ఆశయాలకు వ్యతిరేకంగా ఉంది ఈ బిల్లు: ఆప్ ► బిల్లు రాజ్యాంగ విరుద్ధం.. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంది: కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ సాక్షి, ఢిల్లీ: వివాదాస్పదమైన ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఇవాళ(సోమవారం, ఆగష్టు7) పెద్దల సభకు చేరింది. రాజ్యసభలో ఈ బిల్లను ప్రవేశపెట్టారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. వెంటనే కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ బిల్లుపై చర్చను ప్రారంభించారు. ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర సర్కారు మే 19న తెచ్చిన ఈ ఆర్డినెన్స్ బిల్లు.. లోక్‌సభలో విపక్షాల నినాదాల నడుమ పాస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో రాజ్యసభలో కీలకం కానుంది. రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 110 మంది ఎంపీలే ఉన్నారు. కాంగ్రెస్‌సహా అన్ని విపక్ష పార్టీలు కలుపుకుని 128 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో.. పెద్దల సభలో బిల్లును ఎలాగైనా ఓడించాలనే ధీమాతో విపక్ష ఇండియా కూటమి ఉంది. Union Home Minister Amit Shah moves the Government of National Capital Territory of Delhi (Amendment) Bill, 2023, in Rajya Sabha pic.twitter.com/fQEnsf60fj — ANI (@ANI) August 7, 2023 -
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులకు విప్ జారీ
న్యూఢిల్లీ: తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. సోమవారం సభ్యులంతా తప్పనిసరిగా సభకు హాజరుకావాలని సూచించింది. వాయిదాపడేదాకా సభలోనే ఉండాలని పేర్కొంది. కీలకమైన ఢిల్లీ బిల్లుపై సోమవారం రాజ్యసభలో చర్చ, ఓటింగ్ జరిగే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ తన సభ్యులకు విప్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్మెంట్) బిల్లు–2023’ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. -
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై టీడీపీ డబుల్ గేమ్
ఢిల్లీ: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై టీడీపీ డబుల్ గేమ్ ఆడుతోంది. బయటకు ఒకలా.. లోపల మరోలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. లోక్‌సభలోనే ఉన్నా టీడీపీ ఎంపీలు నోరు మెదపడం లేదు. మూజు వాణి ఓటుతో టీడీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. వ్యూహాత్మకంగా వ్యవహరించారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. బీజేపీకి, విపక్షాలకు కోపం రాకుండా మౌన రాగం వినిపించింది. బిల్లును వ్యతిరేకించి విపక్షాలు వాకౌట్ చేయగా, మూజువాణి ఓటుతో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం పొందింది. మరో వైపు, ఏపీ ప్రభుత్వంపై ఏదో ఒక బురద జల్లి అప్రతిష్ఠపాలు చేయడానికి టీడీపీ ఎంపీలు విఫలయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఏపీ అప్పులపై పార్లమెంట్ వేదికగా ప్రశ్నించి భంగపడ్డ టీడీపీ.. మరోసారి ఏపీ విషయంలో ఏదో చేయబోయి అడ్డంగా బుక్కైన సంగతి తెలిసిందే. ఏపీలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కపిల్ మొరేశ్వర్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ ఎంపీలు.. . అయితే కేంద్ర మంత్రి ఉపాధి హామీ పథకంలో అవతవకలకు ఎటువంటి ఆస్కారం ఉండనే ఉండదంటూ కుండబద్ధలు కొట్టారు. అంతా ఆన్లైన్ వేదికగా చెల్లింపులు జరుగుతున్నప్పుడు అవతవకలకు ఆస్కారం ఎలా ఉంటుందని టీడీపీ ఎంపీలను నిలదీశారు కేంద్రమంత్రి. దీంతో టీడీపీ ఎంపీలు తిరిగి సమాధానం చెప్పలేక నోరెళ్ల బెట్టారు. చదవండి: ఇదే కదా చంద్రబాబు మార్క్ క్షుద్ర రాజకీయం అలాగే టీడీపీ ఎంపీలకు నిన్న(గురువారం)కూడా భంగపాటు ఎదురైంది. ఏపీలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పట్టించుకోలేదు. నిర్మల సీతారామన్.. తన ఆఫీసు బయటే నిలబెట్టి టీడీపీ ఎంపీలు, సర్పంచులతో మాట్లాడి పంపించివేశారు. "అలాగే చూద్దాం" అంటూ ఒక్క నిమిషంలోనే ఆర్థిక మంత్రి ముగించారు. -
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
సాక్షి, ఢిల్లీ: విపక్షాల ఆందోళనల నడుమే ఢిల్లీ ఆర్డినెన్స్(సవరణ) బిల్లు 2023కి లోక్‌సభ ఆమోదం తెలిపింది. గురువారం సాయంత్రం మూజువాణి(వాయిస్) ఓటుతో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. అంతకు ముందు విపక్షాలు సైతం బిల్లుపై చర్చల్లో పాల్గొన్నాయి. తమ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. బిల్లుపై అభ్యంతరాలకు సమాధానం ఇచ్చారు. ఈ తరుణంలో వాయిస్ ఓటు జరగ్గా.. విపక్షాల ఆందోళన నడుమే బిల్లుకు ఆమోదం లభించింది. ఆప్ ఎంపీ సుశీల్‌కుమార్ రింక్ బిల్ పేపర్లు చింపి వెల్‌లోకి విసిరేశారు. దీంతో లోక్‌సభ నుంచి సుశీల్‌కుమార్‌ను సస్పెండ్ చేశారు స్పీకర్. లోక్‌సభ క్లియరెన్స్‌తో రేపు రాజ్యసభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు చర్చకు రానుంది. అసలు సీన్ రాజ్యసభలోనే.. ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర సర్కారు మే 19న ఇచ్చిన ఆర్డినెన్స్‌పై దేశవ్యాప్తంగా వాడీవేడి చర్చ జరుగుతోంది. అది నిరంకుశ ఆర్డినెన్స్ అని బీజేపీ వ్యతిరేక కూటమిలోని పార్టీలు గొంతు చించుకుంటున్నాయి. రాజకీయ వైరుధ్యాలను పక్కకు పెట్టి ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్‌కు మద్దతును ప్రకటిస్తున్నాయి. ఆ ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లు.. లోక్ సభ , రాజ్యసభ రెండూ ఆమోదిస్తేనే చట్టంగా మారుతుంది. అయితే రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 110 మంది ఎంపీలే ఉన్నారు. కాంగ్రెస్‌సహా అన్ని విపక్ష పార్టీలు కలుపుకుని 128 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో.. పెద్దల సభలో బిల్లును ఓడించాలనే ధీమాతో విపక్ష ఇండియా కూటమి ఉంది. ఆర్డినెన్స్‌లో ఇలా.. ఢిల్లీలో పాలనాధికారం అసెంబ్లీకే ఉంటుందని.. అధికారుల బదిలీలు, నియామకాల్లోనూ అక్కడి ప్రభుత్వానిదే తుది నిర్ణయమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మే 11న తీర్పు ఇచ్చింది. అయితే తీర్పును పక్కన పెడుతూ మే 19న కేంద్రం కొత్త ఆర్డినెన్స్ తెచ్చింది. నగర పాలనపై అసాధారణ అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో పెడుతూ ఆర్డినెన్స్ జారీచేసింది. ఢిల్లీలో గ్రూప్–ఏ అధికారుల పోస్టింగ్, బదిలీలపై ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను తొలగిస్తూ.. దాని స్థానంలో కొత్తగా నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఫలితంగా ఢిల్లీలోని అధికారుల పోస్టింగ్, బదిలీలతోపాటు విజిలెన్స్ అధికారాలు ఎల్జీ చేతిలోకి వెళ్లాయి. నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీకి చైర్మన్‌గా ఢిల్లీ సీఎం ఉంటారు. మెంబర్లుగా సీఎస్, హోంశాఖ కార్యదర్శి ఉంటారు. ఢిల్లీలో ఏ అధికారిని బదిలీ చేయాలన్నా, పోస్టింగ్ ఇవ్వాలన్నా ఈ ముగ్గురు సమావేశమై, ఓటింగ్ నిర్వహించి ఎల్జీకి నివేదించాలి. మెజారిటీ ప్రతిపాదికన నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడైనా ఓటింగ్ లో ఫలితం తేలకుంటే.. లెఫ్టినెంట్ గవర్నర్దే తుది నిర్ణయంగా ఉంటుంది. నగరంలోని పోలీస్ వ్యవస్థ మొత్తం ఇప్పటికే ఎల్జీ చేతిలో ఉంది. దేశ రాజధానిలో శాంతిభద్రతల బాధ్యత మొత్తం ఎల్జీదే. సివిల్ అధికారులపై ఢిల్లీ ప్రభుత్వానికి అజమాయిషీ ఉండేది. తాజా ఆర్డినెన్స్‌తో ఆ అధికారాలు కూడా లేకుండా పోతాయి. ఇప్పటిది కాదు.. ఢిల్లీలో ఎవరి అధికారాలు ఏంటన్న దానిపై 2015 నుంచే వివాదం నడుస్తోంది. కేంద్రంలో మోదీ సర్కార్ రాగానే.. ఢిల్లీ పాలనాధికారాలను మొత్తం లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో పెట్టింది. అప్పుడే కొత్తగా ఏర్పడిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని డమ్మీని చేసేందుకే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు వినిపించాయి. కేంద్రం నిర్ణయంపై కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు వెళ్లటంతో.. కేంద్రం నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. దీంతో కేజ్రీ సర్కార్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈ వివాదాన్ని విచారించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. ఎల్జీ, ఎన్నికైన ప్రభుత్వం మధ్య స్పష్టమైన అధికారాల విభజనను సూచిస్తూ ఈ నెల 11న తీర్పు ఇచ్చింది. ఢిల్లీ నగరంలో శాంతిభద్రతల బాధ్యత మాత్రమే ఎల్జీదని, ఇతర శాసన, కార్యనిర్వాహక బాధ్యతలు అసెంబ్లీకే చెందుతాయని తీర్పు ఇచ్చింది. సుప్రీం తీర్పును కాదని.. అయితే సుప్రీం తీర్పు వచ్చి వారం గడవక ముందే ఆ తీర్పును కాదని కేంద్రం కొత్త ఆర్డినెన్స్ తెచ్చింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా నగరంలో అధికారాల సమతుల్యత కోసమే ఈ ఆర్డినెన్స్ తెచ్చామని కేంద్రం వాదిస్తోంది. కానీ ఆప్ ప్రభుత్వం మాత్రం ఇది రాజ్యాంగ విరుద్ధ నిర్ణయం అంటోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని పేర్కొంటోంది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో జోక్యమే ఇది.. రాజ్యాంగం ప్రకారం.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలే పాలన సాగించాలి. కానీ ఢిల్లీ విషయంలో మాత్రం కేంద్రం ఆ అవకాశం లేకుండా చేస్తోందని విపక్ష ఇండియా కూటమి నేతలు అంటున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల పాలనలో కేంద్రం జోక్యం చేసుకుంటోందని, అవసరమైతే కూలుస్తోందని ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు అధికారాలు కూడా కోత పెడితే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదని విపక్షాల వాదనం. ఈ నేపథ్యంలో బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలని పట్టుదలతో ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు కేంద్రం కూడా ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బిల్లు పెట్టిన అమిత్‌షా.. ఈ వివాదం కొనసాగుతుండగానే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆర్డినెన్స్ బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల వ్యతిరేక నినాదాల మధ్యనే బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం సభ వాయిదా పడింది. అయితే లోక్‌సభలో సంఖ్యాబలం ఉన్నందున బిల్లు సులువుగానే పాస్ అయయ్యింది. -
‘మంచి చేయడానికి పొత్తులు పెట్టుకోవాలి’
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇవాళ విపక్ష కూటమి ఇండియాపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. గురువారం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా.. బిల్లును వ్యతిరేకిస్తున్న విపక్షాల తీరును తప్పుబట్టారాయన. ఢిల్లీ ఆర్డినెన్స్(సవరణ) బిల్లు-2023 రాజ్యాంగ బద్ధమే. కేంద్రానికి ఆ హక్కు ఉంది. సుప్రీం కోర్టు ఆర్డినెన్స్ ప్రకారమే ఈ బిల్లు తీసుకొచ్చాం. కానీ, విపక్షాలు వీటిని వ్యతిరేకిస్తున్నాయి. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఆప్ దీనిని వ్యతిరేకిస్తోంది. దానికి కూటమి పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ప్రజలకు మంచి చేయడానికి పొత్తులు పెట్టుకోవాలి. ఓట్లు, అధికారం కోసం కాదు. కూటమి కోసం కాదు.. ఢిల్లీ కోసం ఆలోచించండి. దేశం మంచి కోసం చేస్తున్న చట్టాల్ని వ్యతిరేకించొద్దు అంటూ విపక్షాలకు చురకలటించారాయన. 2015లో సేవ చేయాలనే ధ్యాస లేని ఓ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ సమస్య ఏంటంటే.. విజిలెన్స్ డిపార్ట్మెంట్ నియంత్రణ కోసం వాళ్లు పడుతున్న పాట్లు ఇవి. ఎందుకంటే బంగ్లాల కట్టడం లాంటి అవినీతిని కప్పిపుచ్చుకోవాలి కాబట్టి.. అని ఆప్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారాయన. #WATCH | In the year 2015, a party came to power in Delhi whose only motive was to fight, not serve...The problem is not getting the right to do transfer postings, but getting control of the vigilance department to hide their corruption like building their bungalows: Union Home… pic.twitter.com/pelULwGMgH — ANI (@ANI) August 3, 2023 నెహ్రూను నేనేం పొగడలే! పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. గురువారం లోక్‌సభ సెషన్లో ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. భారత సమాజ వ్యవస్థాపకులైన జవహార్‌లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్, సీ రాజగోపాలచారి, రాజేంద్ర ప్రసాద్, బీఆర్ అంబేద్కర్లు.. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను వ్యతిరేకించినవాళ్లే అని అన్నారు. ఆ వెంటనే కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి స్పందిస్తూ.. ‘‘ఇవాళ చాలా సంతోషంగా ఉంది. నేను చూస్తోంది నిజమేనా?. ఇది పగలా లేక రాత్రా?.. పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన(అమిత్ షా) నోట్లో లడ్డూ పెట్టాలని ఉంది. ఎందుకంటే అమిత్ షా నెహ్రూను, కాంగ్రెస్‌ను పొగిడారు. ఇది నాకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చింది’’ అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే షా జోక్యం చేసుకని.. తానేం నెహ్రూని పొగడలేదని స్పష్టత ఇచ్చారు. ‘‘పండిట్ నెహ్రూను నేను పొగడలేదు. ఆయన ఏం చెప్పారో.. అదే ప్రస్తావించా. దానిని వాళ్లు పొగడ్తగా భావిస్తే.. నాకేం అభ్యంతరం లేదు’’ అని బదులు ఇచ్చారు. దీంతో రంజన్ మరోసారి జోక్యం చేసుకుని షా వ్యాఖ్యలకు కొనసాగింపుగా మాట్లాడారు. -
Manipur: ప్రధాని కాదు.. ఆయనే మాట్లాడతారట!
న్యూఢిల్లీ: మణిపూర్ అంశం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తోంది. చర్చకు సిద్ధమని ప్రకటించినా.. విపక్షాలు లేనిపోని రాద్ధాంతాలు చేస్తున్నాయని కేంద్రం అంటోంది. గురివింద గింజ సామెతలాగా.. తమ రాష్ట్రాల్లో నేరాలను ఆయా ప్రభుత్వాలు అదుపు చేయలేకపోతున్నాయని విపక్షాలపై మండిపడుతోంది. ఈ క్రమంలో మంగళవారం సమావేశాలైనా సజావుగా జరుగుతాయా? అనే సందిగ్ధం నెలకొనగా.. అనూహ్యంగా క్విడ్ ప్రోకో(రెండు వైపులా లాభం) తెర మీదకు వచ్చింది. ‘‘మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీనే పార్లమెంట్లో మాట్లాడాలి. ఇది తేలనిదే పార్లమెంట్ సమావేశాలను ముందుకు సాగనివ్వం’’ విపక్ష ఇండియా కూటమి చేస్తున్న ప్రధాన డిమాండ్ ఇది. ఈ డిమాండ్‌తోనే గత రాత్రి సైతం పార్లమెంట్ బయట తమ నిరసన గళం వినిపించాయవి. అయితే కేంద్రం మాత్రం అందుకు సన్నద్ధంగా లేదు. పైగా ఈ సమావేశాల్లో 31 బిల్లులకు ఈ సమావేశాల్లో ఆమోదం తెలపాల్సిన అవసరం ఉండగా.. అందునా వివాదాస్పదమైన ఢిల్లీ ప్రత్యేక ఆర్డినెన్స్ కూడా ఉంది. దీంతో మణిపూర్ గండం దాటుకోవడం ఎలాగ? అనే విషయంలో కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. శాంతి భద్రతల అంశం కాబట్టి కేంద్ర హోం మంత్రి అమిత్ షానే మణిపూర్ అల్లర్లు.. హింసపై ప్రసంగం చేస్తారని.. అనుమానాలను నివృత్తి చేస్తారని చెబుతోంది. ఈ క్రమంలోనే క్విడ్ ప్రోకో ఆలోచనతో ముందుకు వచ్చింది. మణిపూర్ అంశంపై స్వల్ప కాలిక చర్చతో సరిపెడతామని.. ప్రతివిమర్శలు చేయబోమని విపక్షాలకు కేంద్రం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర వర్గాల సమాచారం ప్రకారం.. సమావేశాలకు సజావుగా సాగనిచ్చేందుకు, సామరస్యంగా మణిపూర్ చర్చ అంశాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపక్ష నేతలతో ఫోన్లలో మాట్లాడారు. సభను సజావుగా సాగనిచ్చేందుకు సహకరించాలని కోరారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా సరే హోం మంత్రి నివృత్తి చేస్తారని.. చర్చించేందుకు అనుమతించాలని కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధాని మోదీతో కొందరు కేంద్ర మంత్రులు.. హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీలు జరిపారు. దేశంలో ఏ రాష్ట్రం ఇంతకు ముందెప్పుడూ ఇంత సుదీర్ఘకాలం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొలేదని మణిపూర్ సంక్షోభంపై ఇండియా కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం మరోలా ప్రకటన చేసింది. ‘‘1993-97 మధ్యకాలంలో మణిపూర్ ఇంతకన్నా భయంకరమైన పరిస్థితులను చవిచూసింది. ఆ సమయంలో ఏ ప్రధాని ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదు. అలాగే పార్లమెంట్లో ఒక్కసారిగా కూడా చర్చించలేదు’’ అని కేంద్ర హోం శాఖ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. మణిపూర్‌పై పరిమిత చర్చ మాత్రమే జరిపి.. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల నేరాలపై ఎలాంటి ప్రస్తావన చేయొద్దని కేంద్రం ఆలోచనగా కనిపిస్తోంది. తద్వారా బిల్లుల ఆమోద ప్రయత్నాలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ప్రతిపక్షాలు కేంద్రం ప్రతిపాదనకు ఎలా స్పందించాయనేది తెలియాల్సి ఉంది. ప్రత్యేకించి ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు విషయంలో సహకరిస్తాయా? అనేది అనుమానమే!. ఇదీ చదవండి: రూల్ నెంబర్ 267 వర్సెస్ 176 -
అరవింద్ కేజ్రీవాల్ తగ్గేదే లే.. పంతం నెగ్గించుకున్న ఢిల్లీ సీఎం
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలంటూ ఎప్పటినుంచో కోరుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. బీహార్ లో జరిగిన తొలి విడత విపక్షాల సమావేశానికి హాజరైన అరవింద్ కేజ్రివాల్ బెంగళూరులో జరగబోయే రెండో విడత విపక్షాల సమావేశానికి హాజరు కావడంలేదని ముందు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశంలో ఢిల్లీ కోరిన మద్దతు ఇవ్వడానికి తాము సుముఖంగా ఉన్నట్లు పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ కర్ణాటకలో జరగబోయే రెండో విడత విపక్షాల సమావేశానికి పాల్గొంటుందని తెలిపాయి పార్టీ వర్గాలు. కాంగ్రెస్ ససేమిరా.. ఢిల్లీ బ్యూరోక్రాసిపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా ఇప్పటికే మెజారిటీ పార్టీల మద్దతు కూడగట్టారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇంతకాలం మద్దతు ఇవ్వకుండా మంకుపట్టు పట్టింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా తమ పార్టీ ఎప్పుడూ వ్యవహరించదని తెలిపిన కాంగ్రెస్ గతంలో కేంద్రం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మద్దతు ఇచ్చేది లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. మీతో వచ్చేది లేదు.. దీంతో కాంగ్రెస్ పార్టీతో కలిసివచ్చేది లేదని ఇదివరకే ప్రకటించాయి ఆప్ వర్గాలు. ఢిల్లీ ముఖ్యమంత్రి కూడాకాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందులో భాగంగానే కర్ణాటకలో జరగనున్న రెండో విడత విపక్షాల సమావేశాలకు హాజరయ్యే విషయమై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు ఆప్ అధినేత. సరే కానివ్వండి.. కానీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిజెపి వ్యతిరేక పార్టీలన్నీ ఏకం కావలసిన అవసరం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఓ మెట్టు దిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ తమ పార్టీ ఎప్పుడూ ఆర్డినెన్సుకు వ్యతిరేకమేనని ప్రకటించారు. ఈ విషయాన్ని ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం వెలువడిన కొద్దీ గంటల్లోనే అరవింద్ కేజ్రీవాల్ కర్ణాటకలో జరగబోయే రెండో విడత విపక్షాల సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపారు. VIDEO | "I think they (AAP) are going to join the meeting tomorrow. As for the ordinance (on control of services in Delhi), our stand is very clear. We are not going to support it," says Congress general secretary KC Venugopal on the opposition meet, scheduled to be held in… pic.twitter.com/YdeUZYmPG5 — Press Trust of India (@PTI_News) July 16, 2023 ఎందుకీ తిప్పలు.. ఢిల్లీ పరిపాలన విధానాన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపధ్యంలో ప్రతిపక్షాల మద్దతు కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి విశ్వప్రయత్నాలు చేసున్నారు. అధికార పార్టీకి మద్దతు భారీగా ఉన్న నేపథ్యంలో లోక్ సభలో ఈ బిల్లు ఎలాగైనా ఆమోదం పొందుతుంది. ఎగువ సభ అయిన రాజ్యసభలో మాత్రం ఈ ఆర్డినెన్స్ ఆమోదం పొందకుండా అడ్డుకోవాలంటే ప్రతిపక్షాల మద్దతు తప్పనిసరి. అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విపక్షాల నాయకుల్ని ఒక్కొక్కరినీ కలిసి మద్దతు కూడగడుతూ వచ్చారు. తాజాగా ఆయన పట్టుదలకు కాంగ్రెస్ పార్టీ కూడా దిగివచ్చింది. Congress announces its unequivocal opposition to the Delhi Ordinance. This is a positive development. — Raghav Chadha (@raghav_chadha) July 16, 2023 ఇది కూడా చదవండి: ఇష్టమొచ్చినట్టు పోక్సో చట్టం.. స్కూలు మాష్టారుపై కేసు నమోదు.. -
‘ఆర్డినెన్సు’ బిల్లులను అడ్డుకుంటాం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఆర్డినెన్సుల స్థానంలో ప్రభుత్వం తేదలచిన బిల్లులను సభలో అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. సంబంధిత చట్టాల్లో మార్పులను అంగీకరించబోమంది. ‘ఆర్డినెన్సులతో చట్టాలను మార్చాలనుకుంటున్న ప్రభుత్వ వైఖరిని అడ్డుకుంటాం. ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న ఆ బిల్లులను అడ్డుకుంటాం’ అని పార్టీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ శుక్రవారం పేర్కొన్నారు. సభలో కాంగ్రెస్ అనుసరించబోయే వైఖరిని అహ్మద్ పటేల్ ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. ‘పేదల కోసం యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన పలు పథకాలు, విధానాలను నీరుగార్చి.. ఇప్పుడు సభలో కాంగ్రెస్ మద్ధతు కోరుకోవడం మోదీ ప్రభుత్వ వైపరీత్యానికి నిదర్శనం’ అంటూ పార్టీ చీఫ్ సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ట్వీట్ చేశారు.