TDP Double Game On Delhi Ordinance Bill - Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై టీడీపీ డబుల్ గేమ్

Published Fri, Aug 4 2023 11:14 AM | Last Updated on Fri, Aug 4 2023 2:51 PM

Tdp Double Game On Delhi Ordinance Bill - Sakshi

ఢిల్లీ: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై టీడీపీ డబుల్ గేమ్ ఆడుతోంది. బయటకు ఒకలా.. లోపల మరోలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. లోక్‌సభలోనే ఉన్నా టీడీపీ ఎంపీలు నోరు మెదపడం లేదు. మూజు వాణి ఓటుతో టీడీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. వ్యూహాత్మకంగా వ్యవహరించారని టీడీపీ వర్గాలు  అంటున్నాయి. బీజేపీకి, విపక్షాలకు కోపం రాకుండా మౌన రాగం వినిపించింది. బిల్లును వ్యతిరేకించి విపక్షాలు వాకౌట్ చేయగా, మూజువాణి ఓటుతో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం పొందింది.

మరో వైపు, ఏపీ ప్రభుత్వంపై ఏదో ఒక బురద జల్లి అప్రతిష్ఠపాలు చేయడానికి టీడీపీ ఎంపీలు విఫలయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఏపీ అప్పులపై పార్లమెంట్‌ వేదికగా ప్రశ్నించి భంగపడ్డ టీడీపీ.. మరోసారి ఏపీ విషయంలో ఏదో చేయబోయి అడ్డంగా బుక్కైన సంగతి తెలిసిందే. ఏపీలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి  కపిల్ మొరేశ్వర్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ ఎంపీలు.. . అయితే కేంద్ర మంత్రి ఉపాధి హామీ పథకంలో అవతవకలకు ఎటువంటి ఆస్కారం ఉండనే ఉండదంటూ కుండబద్ధలు కొట్టారు. అంతా ఆన్‌లైన్‌ వేదికగా చెల్లింపులు జరుగుతున్నప్పుడు అవతవకలకు ఆస్కారం​ ఎలా ఉంటుందని టీడీపీ ఎంపీలను నిలదీశారు కేంద్రమంత్రి.  దీంతో టీడీపీ ఎంపీలు తిరిగి సమాధానం చెప్పలేక నోరెళ్ల బెట్టారు.
చదవండి: ఇదే కదా చంద్రబాబు మార్క్ క్షుద్ర రాజకీయం

అలాగే టీడీపీ ఎంపీలకు నిన్న(గురువారం)కూడా భంగపాటు ఎదురైంది. ఏపీలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పట్టించుకోలేదు. నిర్మల సీతారామన్.. తన ఆఫీసు బయటే నిలబెట్టి టీడీపీ ఎంపీలు, సర్పంచులతో మాట్లాడి పంపించివేశారు. "అలాగే చూద్దాం" అంటూ ఒక్క నిమిషంలోనే ఆర్థిక మంత్రి  ముగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement