double game
-
పార్టీ ఫిరాయింపులపై టీడీపీ ద్వంద్వ వైఖరి
-
జనసేన నుంచి టీడీపీ అభ్యర్థులు
-
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై టీడీపీ డబుల్ గేమ్
ఢిల్లీ: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై టీడీపీ డబుల్ గేమ్ ఆడుతోంది. బయటకు ఒకలా.. లోపల మరోలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. లోక్‌సభలోనే ఉన్నా టీడీపీ ఎంపీలు నోరు మెదపడం లేదు. మూజు వాణి ఓటుతో టీడీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. వ్యూహాత్మకంగా వ్యవహరించారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. బీజేపీకి, విపక్షాలకు కోపం రాకుండా మౌన రాగం వినిపించింది. బిల్లును వ్యతిరేకించి విపక్షాలు వాకౌట్ చేయగా, మూజువాణి ఓటుతో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం పొందింది. మరో వైపు, ఏపీ ప్రభుత్వంపై ఏదో ఒక బురద జల్లి అప్రతిష్ఠపాలు చేయడానికి టీడీపీ ఎంపీలు విఫలయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఏపీ అప్పులపై పార్లమెంట్ వేదికగా ప్రశ్నించి భంగపడ్డ టీడీపీ.. మరోసారి ఏపీ విషయంలో ఏదో చేయబోయి అడ్డంగా బుక్కైన సంగతి తెలిసిందే. ఏపీలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కపిల్ మొరేశ్వర్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ ఎంపీలు.. . అయితే కేంద్ర మంత్రి ఉపాధి హామీ పథకంలో అవతవకలకు ఎటువంటి ఆస్కారం ఉండనే ఉండదంటూ కుండబద్ధలు కొట్టారు. అంతా ఆన్లైన్ వేదికగా చెల్లింపులు జరుగుతున్నప్పుడు అవతవకలకు ఆస్కారం ఎలా ఉంటుందని టీడీపీ ఎంపీలను నిలదీశారు కేంద్రమంత్రి. దీంతో టీడీపీ ఎంపీలు తిరిగి సమాధానం చెప్పలేక నోరెళ్ల బెట్టారు. చదవండి: ఇదే కదా చంద్రబాబు మార్క్ క్షుద్ర రాజకీయం అలాగే టీడీపీ ఎంపీలకు నిన్న(గురువారం)కూడా భంగపాటు ఎదురైంది. ఏపీలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పట్టించుకోలేదు. నిర్మల సీతారామన్.. తన ఆఫీసు బయటే నిలబెట్టి టీడీపీ ఎంపీలు, సర్పంచులతో మాట్లాడి పంపించివేశారు. "అలాగే చూద్దాం" అంటూ ఒక్క నిమిషంలోనే ఆర్థిక మంత్రి ముగించారు. -
రష్యా ఊగిసలాట.. పుతిన్ డబుల్ గేమ్‌లో భాగమేనా?
రష్యా మరోసారి తన ఊగిసలాటను ప్రపంచానికి ప్రదర్శిస్తోంది. యుద్ధంతో కాదు.. ఈసారి క్రిప్టోకరెన్సీ చట్టబద్ధత విషయంలో!. ముఖ్యంగా ఉక్రెయిన్ యద్ధం మొదలైనప్పటి నుంచి క్రిప్టోకరెన్సీ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ డబుల్ గేమ్ నడిపిస్తున్నారు. ఇదంతా పాశ్చాత్య దేశాల క్రిప్టో ఇన్వెస్టర్లను ముంచడానికే అనే వాదన బలంగా వినిపిస్తోంది ఇప్పుడు. అధ్యక్షుడు పుతిన్ జోక్యం చేసుకున్నా.. గత కొన్ని నెలలుగా బ్యాంకర్లు, రాజకీయ నాయకులు, అధికారులు అంతా కలిసి మల్లాగుల్లాలు పడుతున్నా క్రిప్టోకరెన్సీ విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. తాజాగా క్రిప్టో ఇన్వెస్టర్లకు పెద్ద షాక్ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. క్రిప్టోకరెన్సీలో చెల్లింపులు రష్యాలో చెల్లవంటూ కీలక నిర్ణయం తీసుకుంది రష్యా. ఈ మేరకు.. రష్యా పార్లమెంట్ దిగువ సభలో ఓ ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చింది. జూన్ 7వ తేదీన ఈ చట్టాన్ని ప్రతిపాదించగా.. డిజిటల్ చెల్లింపులు చెల్లవంటూ చేసిన తీర్మానానికి ఆమోద ముద్ర లభించడమే తర్వాయిగా మిగిలింది. రష్యాకు అధికారిక కరెన్సీ రూబుల్. ఇతర ఏ తరహా చెల్లింపులు కుదరవంటూ స్పష్టత ఇచ్చింది ఆ చట్టం. దేశీయ-విదేశీ చెల్లింపులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. తాజా ప్రకటనతో ఎక్కువగా నష్టపోయేది యూరప్, ఉత్తర అమెరికా ఇన్వెస్టర్లే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ ప్రతిపాదన కంటే ముందు రష్యాలో విరుద్ధమైన పరిస్థితులు కనిపించాయి. రష్యా సెంట్రల్ బ్యాంక్.. విదేశీ చెల్లింపుల కోసం క్రిప్టో తరహా పేమెంట్లకు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో వాణిజ్య శాఖ మంత్రి డెనిస్ మంట్రురోవ్ కూడా క్రిప్టో పేమెంట్స్‌కు అనుకూల వ్యాఖ్యలే చేశాడు. ఏ క్షణమైనా క్రిప్టోకరెన్సీలకు చట్టబద్ధత రష్యాలో లభించవచ్చని ఒక ప్రకటన చేశారు. ఆ ధైర్యంతో పాశ్చాత్య దేశాల నుంచి భారీగా క్రిప్టో ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు. తాజా నిషేధంతో వాళ్లంతా పూర్తిగా మునిగిపోయినట్లేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. క్రిప్టోకరెన్సీ విషయంలో రష్యా ఇలా డబుల్ గేమ్ ఆడడం కొత్త విషయమేమీ కాదు. ఇంతకు ముందు కూడా ఇలాగే చేసింది. సుమారు లక్షన్నర మంది ఇన్వెస్టర్లు నష్టపోగా.. అమెరికన్ ఇన్వెస్టర్లను భారీగా దెబ్బ కొట్టే స్కెచ్‌తోనే పుతిన్ అలాంటి ప్రకటనలు ఇప్పించి ఉంటారని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈసారి ఏకంగా మంత్రి వ్యాఖ్యలు, సెంట్రల్ బ్యాంక్ భరోసా నేపథ్యంలో భారీగానే పెట్టుబడులు పెట్టారు పాశ్చాత్య దేశాల ప్రముఖులు. ఈ ఏడాది మొదట్లో క్రిప్టో చెల్లింపులతో అక్రమ వ్యవహారాలకు తెర లేస్తుందంటూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది రష్యా సెంట్రల్ బ్యాంక్. మరోవైపు రష్యా ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్ ఇవాన్ చెబెస్కోవ్ మాత్రం సెంట్రల్ బ్యాంక్ వాదనను తప్పుబట్టి, నియంత్రిస్తే చాలని వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో.. రష్యా అధ్యక్షుడు పుతిన్ జోక్యం చేసుకుని.. ఇరు వర్గాలను ఒక ఒప్పందానికి రావాలంటూ సూచించారు. దీంతో తాత్కాలిక ఊరట కింద.. రష్యా సెంట్రల్ బ్యాంక్ విదేశీ చెల్లింపులకు అనుమతులు జారీ చేసింది.అప్పటి నుంచి బ్యాంకర్లు, రాజకీయ నాయకులు, అధికారులు ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చదవండి: క్రిప్టోలు ‘సముద్ర దొంగల ప్రపంచమే’! -
ప్రత్యేక హోదాపై చంద్రబాబు డబుల్ గేమ్
-
పార్లమెంట్ సాక్షిగా టీడీపీ డబుల్ గేమ్
-
పాక్ డబుల్ గేమ్‌పై యూఎస్ సీరియస్!
వాషింగ్టన్: ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న పాకిస్తాన్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అమెరికా భావిస్తోంది. ఈ మేరకు ఉగ్రవాదంపై పోరు విషయంలో.. పాకిస్తాన్ మిత్రువా లేక శత్రువా అనే విషయంపై చర్చ నిర్వహించాలని యూఎస్ చట్ట సభల ప్రతినిధులు నిర్ణయించారు. వచ్చేవారం ఈ సమావేశం నిర్వహించనున్నట్లు యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు, టెర్రరిజంపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ చైర్మన్ టెడ్ పోయ్ తెలిపారు. తీవ్రవాదానికి వ్యతిరేకం అంటూ చెబుతూనే అంతర్గతంగా టెర్రరిస్టు సంస్థలతో సంబంధాలు నడుపుతున్న ఆ దేశ వైఖరిపై చర్చించడం వల్ల.. చట్ట సభల సభ్యులకు పాకిస్తాన్ విషయంలో అవలంభించాల్సిన విదేశీ విధానంపై స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ మిలటరీ, ఇంటలిజెన్స్ విభాగాలు ఇప్పటికీ ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్నాయని మరో సభ్యుడు సల్మొన్ తెలిపారు. -
అగ్రరాజ్యంతో పాక్ డబుల్ గేమ్!
వాషింగ్టన్: అమెరికాతో పాకిస్థాన్ డబుల్ గేమ్ ఆడుతోందని, ఆ విషయాన్ని మీరు గమనిస్తున్నారా అని అమెరికాలో కొందరు చట్టసభల ప్రతినిధులు అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలకవర్గాన్ని ప్రశ్నించారు. ఈ విషయం తమకు చాలా ఆందోళనకరంగా ఉందని అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్‌కు అణ్వాయుధాలను విసరగల సామర్థ్యం ఉన్న ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఉన్నత శ్రేణి నాయకులంతా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జాన్ కెర్రీపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఓ పక్క తమ దేశంలో ఉగ్రవాద సమస్యను నిర్మూలించేందుకు ఆయుధ సామర్థ్యం అవసరం అని పాకిస్థాన్ చెబుతూనే వాటిని తమ దేశ సొంత ప్రజలపైనే ప్రయోగించడంతోపాటు భారత్, అఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లోని ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమిస్తూ డబుల్ గేమ్ అడుతోందని, ఇది అమెరికాతో డబుల్ గేమ్ ఆడినట్లే అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 'ఈ విషయంపై మనమేం చేస్తున్నాం? ఏ విధంగా పాకిస్థాన్ కు సహాయం చేయాలనుకుంటున్నాం? ఉగ్రవాదంపై పోరాటానికే ఆ ఆయుధాలను పాక్ ఉపయోగిస్తుందని ఏ విధంగా భావించాలి?' అంటూ తన శాఖకు కావాల్సిన నిధుల కోసం బడ్జెట్ ప్లాన్ సమర్పించే సమయంలో విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎలియట్ ఎంగెల్, ఇతరులు జాన్ కెర్రీని ప్రశ్నించారు. అయితే, దీనిపై సూటిగా సమాధానం చెప్పని కెర్రీ.. ఉగ్రవాద నిరోధం కోసం అప్ఘనిస్తాన్కు సహాయం చేస్తున్నట్లుగానే పాకిస్థాన్ కు చేస్తున్నట్లు చెప్పినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. -
డబుల్ గేమ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల నుంచి సొమ్ములు నొక్కేసిన ప్రజాప్రతినిధి బయటపడుతున్న లుకలుకలు సాక్షి ప్రతినిధి, ఏలూరు :ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరపరాభవం పాలైన విషయాన్ని పక్కన పెడితే.. ఆ ఎన్నికల పుణ్యమా అని జిల్లాలో టీడీపీ చెందిన ఓ ప్రజాప్రతినిధికి భారీగానే సొమ్ములు గిట్టుబాటు అయ్యాయని తెలుస్తోంది. ఉపాధ్యాయులతో ఎన్నో ఏళ్లుగా తనకున్న అనుబంధంతో జిల్లా అంతా చక్రం తిప్పుతానని నమ్మించిన సదరు నేత గట్టిగానే సొమ్ము చేసుకున్నారని అంటున్నారు. పార్టీ అభ్యర్థి చైతన్యరాజుకు మద్దతుగా ప్రచారంలో తిరుగుతూ తన అనుచరులను మాత్రం పరుచూరి కృష్ణారావుకు మద్దతుగా పురమాయించారట. ఇలా డబుల్ గేమ్‌తో ఎమ్మెల్సీ ఎన్నికలను తనకు అనుకూలంగా మలుచుకుని ఇద్దరి నుంచి భారీగానే వసూళ్లు చేశారని అంటున్నారు. ఈ ఎన్నికల పుణ్యమా అని మొత్తంగా అతనొక్కడే రూ.అర కోటి వెనకే సుకున్నారని టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఆ ప్రజాప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎన్నికల రోజున పోలింగ్ సరళిని చూస్తే తేడా జరిగినట్టు చైతన్యరాజు వర్గీయులకు స్పష్టమైందట. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మిన్నకుండిపోయారని అంటున్నారు. ఎన్నికల ముందు కూడా సదరు ప్రజాప్రతినిధి తన పుట్టిన రోజు వేడుకల పేరిట భారీగా ఖర్చు చేయించారని, అయినా సరే ఎన్నికల వేళ ప్రత్యర్థికి చీకట్లో స్నేహ హస్తం అందించి తమకు వెన్నుపోటు పొడిచారని చైతన్యరాజు వర్గీయులు ఇప్పుడు తీరిగ్గా బాధపడుతున్నారట. అయితే సదరు ప్రజాప్రతినిధి విషయం ఇంతటితో వదిలిపెట్టకూడదని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట పంచాయతీ పెట్టి తాము ఇచ్చిన దానికి రెండింతలు కక్కించాలని సీరియస్‌గా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. -
'డబుల్ గేమ్ ఆడుతున్న బీజేపీ, సంఘ్ పరివార్ '
లక్నో: బీజేపీ, సంఘ్ పరివార్ డబుల్ గేమ్ ఆడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రీటా బహుగుణ జోషి విమర్శించారు. హిందూ రాష్ట్ర, లవ్ జిహాద్ పేరుతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయని ధ్వజమెత్తాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు కమలనాథులు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఒకపక్క హిందూ రాష్టం, మరోపక్క ప్రేమ జిహాద్ అంటూ బీజేపీ, సంఘ్ పరివార్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయని బహుగుణ అన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. -
మంగళగిరి ‘దేశం’ డీలా!
సాక్షి, గుంటూరు,మంగళగిరి నియోజకవర్గంలోని మున్సిపల్ ఎన్నికలపై టీడీపీ ఆందోళన చెందుతోంది. ఇక్కడున్న రెండు మున్సిపాలిటీల్లో ‘దేశం’ ఎదురీతే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వార్డుల్లో డబ్బు వెదజల్లినా ఫలితంపై నమ్మకం లేక దేశం శ్రేణులన్నీ డీలా పడ్డాయి. మొదటి నుంచీ మంగళగిరి మున్సిపాలిటీలో టీడీపీకి పట్టుంది. అయితే రాను రాను టీడీపీ ప్రాభవం తగ్గిపోతుండటంతో శ్రేణులన్నీ నిర్వేదంలో ఉన్నాయి. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైనా మంగళగిరిలో మాత్రం ఎమ్మెల్యే కాండ్రు కమల తన పట్టు నిరూపించుకునేందుకు మొదట్లో కొద్దిగా హడావుడి చేశారు. అల్లుడు సత్యంను బరిలో దించాలని యోచించారు. అయితే ఆయన విముఖత చూపడంతో ఎమ్మెల్యే తన సొంత తమ్ముడు కొల్లి వాసును రంగంలోకి దించారు. ప్రజాగ్రహం కారణంగా క్రమంగా కాంగ్రెస్ పరిస్థితి రెండు మూడు వార్డులకు పరిమితమైంది. ఇటు టీడీపీ రెండు రోజుల నుంచి పంపకాల్లో బిజీ బిజీగా ఉంది. ఓటుకు గరిష్టంగా రూ.3 వేలు పంచినా గెలుపుపై నమ్మకం లేదని తెలుగు తమ్ముళ్లే వ్యాఖ్యానిస్తున్నారు. తాడేపల్లి మున్సిపాలిటీలోనూ ఉనికి కాపాడుకునేందుకు దేశం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపు సాధించలేకపోయినా ఫర్వాలేదు కానీ వైఎస్సార్ సీపీ హవా తగ్గించే యోచనలో ఉన్నారు. మద్యం ఏరులై పారించైనా ఓటర్లను పోలింగ్ బూత్‌లకు వెళ్లకుండా చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. చైర్మన్ అభ్యర్థుల ఎంపికలో డబుల్ గేమ్.. మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల్లో తమ పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థుల ఎంపికలో టీడీపీ అధిష్టానం డబుల్ గేమ్ ఆడుతోంది. ఇప్పటివరకు చైర్మన్ అభ్యర్థి ఫలానా అని చెప్పే సాహసం చేయలేక పోతోంది. మంగళగిరి మున్సిపాలిటీ ఓసీ జనరల్‌కు రిజర్వ్ అయింది. మొత్తం ఇక్కడ 32 వార్డులున్నాయి. మున్సిపాలిటీ ఓసీ జనరల్ అయినా వైఎస్సార్ సీపీ మొట్ట మొదటగా బీసీ అభ్యర్థిని ప్రకటించింది. చిల్లపల్లి మోహనరావును తమ పార్టీ అభ్యర్థిగా నియోజకవర్గ సమన్వయకర్త ఆర్కే ప్రకటించారు. టీడీపీ నేతలు మాత్రం పూటకో మాట మారుస్తూ చైర్మన్ అభ్యర్థిగా రోజుకో పేరు తెరపైకి తెస్తున్నారు. చైర్మన్ అభ్యర్థిగా గంజి చిరంజీవిని గతంలో గుంటూరు పార్లమెంటు టీడీపీ ఇన్చార్జి గల్లా జయదేవ్ ప్రకటించారు. కానీ చైర్మన్ అభ్యర్థి తామేనంటూ రోజుకొకరు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు సామాజిక వర్గం అభ్యర్థిగా పోటీలో ఉన్న ఓ వ్యాపారికి చైర్మన్ అభ్యర్థిత్వం ప్రకటిస్తే గంజి చిరంజీవితో ‘సర్దుబాట్లు’ చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు చైర్మన్ అభ్యర్థిత్వం కోసం మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌తో సిఫారసు చేయించి కొందరు నేతలు రాయ‘బేరాలు’ సాగిస్తున్నారు.ఈ విషయంలో స్పష్టత లేకపోవడం తమ పార్టీకి నష్టమేనని టీడీపీకి చెందిన ముఖ్య నేత ఒకరు పేర్కొన్నారు. మొట్ట మొదటిసారి మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన తాడేపల్లిలోనూ చైర్మన్ అభ్యర్థిత్వం విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. మొత్తం మీద మంగళగిరి నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి సానుకూల వాతావరణం లేదని రాజకీయ పరిశీలకులు పేర్కొనడం గమనార్హం. -
'కాంగ్రెస్ వికృత క్రీడ ఆడుతోంది'
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ డబుల్ గేమ్ ఆడుతూ వికృత క్రీడ చేస్తుందని భారతీయ జనతా పార్టీ సీమాంధ్ర ప్రాంత నేత కె.హరిబాబు ఆరోపించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ... తమ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అలాగే సీమాంధ్రకు న్యాయం జరగాలని కూడా కోరుకుంటోందన్నారు. అయితే రాష్ట్ర విభజన బిల్లులో కొన్ని సవరణలు కోరుతున్నామని తెలిపారు. రాష్ట్ర విభజన కోసం రూపొందించిన బిల్లు లోపాల పుట్టా అని ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేత ఎల్ కె అద్వానీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో బిల్లుకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు. అద్వానీ వ్యాఖ్యాలపై అటు తెలంగాణ ప్రజలు, ఇటు ఆ ప్రాంత నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్ కె అద్వానీ వ్యాఖ్యలపై హరిబాబుపై విధంగా స్పందించారు. -
దాగుడు మూతలు
-
చంద్రబాబుది రెండుకళ్ల సిద్ధాంతం
మేదరమెట్ల, న్యూస్‌లైన్ :టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుది రెండుకళ్ల సిద్ధాంతమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ విమర్శించారు. రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లోని ఆ పార్టీ నాయకులతో రెండు రకాలుగా ఆయన మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జైల్లో చేపట్టిన దీక్షకు మద్దతుగా మేదరమెట్ల సెంటర్లో ఆ పార్టీ నాయకులు నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇచ్చిందని, ఆ విషయంపై ఆ పార్టీ నాయకులు ఎవరైనా తమతో బహిరంగ చర్చకు రావచ్చని సవాల్ విసిరారు. యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే ముందుగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. అలాకాకుండా టీడీపీ వంటి రాజకీయ పార్టీల నాయకులతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. విభజన ప్రకటన చేసే సమయంలో శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని బాలాజీ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజిస్తే రెండు ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాలని, అలా చేయలేకుంటే సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్ష చేయడం గొప్ప విషయమన్నారు. జైల్లో ఉన్నప్పటికీ వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అదే ఉద్దేశంతో దీక్ష చేపట్టడాన్ని ఆయన కొనియాడారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అందరికంటే ముందుగానే రాజీనామాలు చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర విభజన ప్రకటనకు ముందే జలాలు, విద్యుత్ పంపిణీ, ఉద్యోగుల సమస్యలపై ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు రాష్ట్ర విభజన అంశంపై తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే సీమాంధ్ర ప్రజల ఆగ్రహానికి బలికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకుంటే సోనియాగాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులంతా తగినమూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. దీక్షలో వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ జజ్జర ఆనందరావు, మేదరమెట్ల సర్పంచ్ పేరం నాగలక్ష్మి, ఆరుమళ్ల సామ్యేలు, బొనిగల ఎలిసమ్మ, మస్తాన్, డేవిడ్సన్ కూర్చోగా, ఏఎంసీ వైస్ చైర్మన్ కోయి అంకారావు, శింగమనేని శ్రీనివాసరావు, అన్నెం అంజి రెడ్డి, రంపతోటి సాంబయ్య, కర్నాటి వెంకట్రావు పాల్గొని మద్దతు తెలిపారు. -
కాంగ్రెస్ అధిష్టానం కొత్త ఎత్తుగడలు