'డబుల్ గేమ్ ఆడుతున్న బీజేపీ, సంఘ్ పరివార్ ' | Joshi hits out at BJP, Sangh over 'love jihad' issue | Sakshi
Sakshi News home page

'డబుల్ గేమ్ ఆడుతున్న బీజేపీ, సంఘ్ పరివార్ '

Published Fri, Oct 17 2014 8:43 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

'డబుల్ గేమ్ ఆడుతున్న బీజేపీ, సంఘ్ పరివార్ ' - Sakshi

'డబుల్ గేమ్ ఆడుతున్న బీజేపీ, సంఘ్ పరివార్ '

లక్నో: బీజేపీ, సంఘ్ పరివార్ డబుల్ గేమ్ ఆడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రీటా బహుగుణ జోషి విమర్శించారు. హిందూ రాష్ట్ర, లవ్ జిహాద్ పేరుతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయని ధ్వజమెత్తాయి. లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు కమలనాథులు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.

ఒకపక్క హిందూ రాష్టం, మరోపక్క ప్రేమ జిహాద్ అంటూ బీజేపీ, సంఘ్ పరివార్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయని బహుగుణ అన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement