రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ డబుల్ గేమ్ ఆడుతూ వికృత క్రీడ చేస్తుందని భారతీయ జనతా పార్టీ సీమాంధ్ర ప్రాంత నేత కె.హరిబాబు ఆరోపించారు. బుధవారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ... తమ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అలాగే సీమాంధ్రకు న్యాయం జరగాలని కూడా కోరుకుంటోందన్నారు. అయితే రాష్ట్ర విభజన బిల్లులో కొన్ని సవరణలు కోరుతున్నామని తెలిపారు.
రాష్ట్ర విభజన కోసం రూపొందించిన బిల్లు లోపాల పుట్టా అని ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేత ఎల్ కె అద్వానీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో బిల్లుకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు. అద్వానీ వ్యాఖ్యాలపై అటు తెలంగాణ ప్రజలు, ఇటు ఆ ప్రాంత నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్ కె అద్వానీ వ్యాఖ్యలపై హరిబాబుపై విధంగా స్పందించారు.