ఎమ్మెల్సీ ఎన్నికల్లో
ఇద్దరు అభ్యర్థుల నుంచి
సొమ్ములు నొక్కేసిన ప్రజాప్రతినిధి
బయటపడుతున్న లుకలుకలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరపరాభవం పాలైన విషయాన్ని పక్కన పెడితే.. ఆ ఎన్నికల పుణ్యమా అని జిల్లాలో టీడీపీ చెందిన ఓ ప్రజాప్రతినిధికి భారీగానే సొమ్ములు గిట్టుబాటు అయ్యాయని తెలుస్తోంది. ఉపాధ్యాయులతో ఎన్నో ఏళ్లుగా తనకున్న అనుబంధంతో జిల్లా అంతా చక్రం తిప్పుతానని నమ్మించిన సదరు నేత గట్టిగానే సొమ్ము చేసుకున్నారని అంటున్నారు. పార్టీ అభ్యర్థి చైతన్యరాజుకు మద్దతుగా ప్రచారంలో తిరుగుతూ తన అనుచరులను మాత్రం పరుచూరి కృష్ణారావుకు మద్దతుగా పురమాయించారట. ఇలా డబుల్ గేమ్‌తో ఎమ్మెల్సీ ఎన్నికలను తనకు అనుకూలంగా మలుచుకుని ఇద్దరి నుంచి భారీగానే వసూళ్లు చేశారని అంటున్నారు. ఈ ఎన్నికల పుణ్యమా అని మొత్తంగా అతనొక్కడే రూ.అర కోటి వెనకే సుకున్నారని టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
ఆ ప్రజాప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎన్నికల రోజున పోలింగ్ సరళిని చూస్తే తేడా జరిగినట్టు చైతన్యరాజు వర్గీయులకు స్పష్టమైందట. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మిన్నకుండిపోయారని అంటున్నారు. ఎన్నికల ముందు కూడా సదరు ప్రజాప్రతినిధి తన పుట్టిన రోజు వేడుకల పేరిట భారీగా ఖర్చు చేయించారని, అయినా సరే ఎన్నికల వేళ ప్రత్యర్థికి చీకట్లో స్నేహ హస్తం అందించి తమకు వెన్నుపోటు పొడిచారని చైతన్యరాజు వర్గీయులు ఇప్పుడు తీరిగ్గా బాధపడుతున్నారట. అయితే సదరు ప్రజాప్రతినిధి విషయం ఇంతటితో వదిలిపెట్టకూడదని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట పంచాయతీ పెట్టి తాము ఇచ్చిన దానికి రెండింతలు కక్కించాలని సీరియస్‌గా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
డబుల్ గేమ్
Published Sun, Mar 29 2015 3:12 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
Advertisement
Advertisement