సాక్షి, ఢిల్లీ: ఇటీవల ఏపీ అప్పులపై పార్లమెంట్ వేదికగా ప్రశ్నించి భంగపడ్డ టీడీపీ.. మరోసారి ఏపీ విషయంలో ఏదో చేయబోయి అడ్డంగా బుక్కైంది. ఏపీలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కపిల్ మొరేశ్వర్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ ఎంపీలు.. . అయితే కేంద్ర మంత్రి ఉపాధి హామీ పథకంలో అవతవకలకు ఎటువంటి ఆస్కారం ఉండనే ఉండదంటూ కుండబద్ధలు కొట్టారు. అంతా ఆన్‌లైన్ వేదికగా చెల్లింపులు జరుగుతున్నప్పుడు అవతవకలకు ఆస్కారం ఎలా ఉంటుందని టీడీపీ ఎంపీలను నిలదీశారు కేంద్రమంత్రి. దీంతో టీడీపీ ఎంపీలు తిరిగి సమాధానం చెప్పలేక నోరెళ్ల బెట్టారు.
అన్ని పనులకు జియో ట్యాగ్గింగ్, పనుల, కూలీల ఫోటోలు ఉంటాయని అధికారులు కూడా చెప్పడంతో టీడీపీ ఎంపీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఈ క్రమంలోనే ఒకపక్షం వాదనలు విని చర్యలు తీసుకోలేమని మంత్రి తేల్చిచెప్పేశారు. అన్ని అంశాలను అధ్యయనం చేసి తదుపరి చర్యలు మంత్రి స్పష్టం చేశారు. దాంతో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన టీడీపీ ఎంపీలు , ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు వైబి రాజేంద్రప్రసాద్‌లకు ఏమి చేయలో పాలుపోక అలానే తిరుగుముఖం పట్టారు.
చదవండి: ఏపీ అప్పులపై పార్లమెంట్ సాక్షిగా బయటికొచ్చిన వాస్తవాలు
Comments
Please login to add a commentAdd a comment