Kapil Patil
-
అదీ బాబు గ్యాంగ్ అంటే.. ఆ విధంగా తుస్సుమన్నారు
సాక్షి, ఢిల్లీ: ఇటీవల ఏపీ అప్పులపై పార్లమెంట్ వేదికగా ప్రశ్నించి భంగపడ్డ టీడీపీ.. మరోసారి ఏపీ విషయంలో ఏదో చేయబోయి అడ్డంగా బుక్కైంది. ఏపీలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కపిల్ మొరేశ్వర్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ ఎంపీలు.. . అయితే కేంద్ర మంత్రి ఉపాధి హామీ పథకంలో అవతవకలకు ఎటువంటి ఆస్కారం ఉండనే ఉండదంటూ కుండబద్ధలు కొట్టారు. అంతా ఆన్లైన్ వేదికగా చెల్లింపులు జరుగుతున్నప్పుడు అవతవకలకు ఆస్కారం ఎలా ఉంటుందని టీడీపీ ఎంపీలను నిలదీశారు కేంద్రమంత్రి. దీంతో టీడీపీ ఎంపీలు తిరిగి సమాధానం చెప్పలేక నోరెళ్ల బెట్టారు. అన్ని పనులకు జియో ట్యాగ్గింగ్, పనుల, కూలీల ఫోటోలు ఉంటాయని అధికారులు కూడా చెప్పడంతో టీడీపీ ఎంపీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఈ క్రమంలోనే ఒకపక్షం వాదనలు విని చర్యలు తీసుకోలేమని మంత్రి తేల్చిచెప్పేశారు. అన్ని అంశాలను అధ్యయనం చేసి తదుపరి చర్యలు మంత్రి స్పష్టం చేశారు. దాంతో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన టీడీపీ ఎంపీలు , ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు వైబి రాజేంద్రప్రసాద్‌లకు ఏమి చేయలో పాలుపోక అలానే తిరుగుముఖం పట్టారు. చదవండి: ఏపీ అప్పులపై పార్లమెంట్ సాక్షిగా బయటికొచ్చిన వాస్తవాలు -
కొత్త ప్రయోగాలతోనే పురోగతి
విజ్ఞాన ప్రదర్శనలో ఎంపీ కపిల్ పాటిల్ భివండీ, న్యూస్‌లైన్: ప్రపంచానికి ఏదైన కొత్తదనాన్ని ఇవ్వాలనే దృఢ సంకల్పంతో విద్యార్థులు ప్రయోగాలు చేయాలని, అప్పుడే దేశం పురోగతి చెందుతుందని భివండీ ఎంపీ కపిల్ పాటిల్ అన్నారు. పంచాయితీ సమితి భివండీ శిక్షణ్ విభాగం ఆధ్వర్యంలో పద్మశాలి ఇంగ్లిష్ మీడియం స్కూల్, జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన విజ్ఞాన ప్రదర్శన 2014-15 ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ ప్రదర్శన మంగళవారం కూడా ఉంటుంది. ఇందులో భివండీ తాలూకా పరిధిలో ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులు పాల్గొని బయో గ్యాస్ ప్రాజెక్టు, సౌర విద్యుత్, పర్యావరణ పరిరక్షణ, మద్యపాన నిషేధం,వాననీటి సంరక్షణ తదితర అంశాలను ప్రదర్శించారు. ప్రదర్శనలను తిలకించిన ఎంపీ కపిల్ పాటిల్, ఎమ్మెల్యేలు రుపేష్ మాత్రే, మహేశ్ చౌగులే, రామనాథ్ మోరే, భివండీ మేయర్ తుషార్ చౌదరి తదితరులు విద్యార్థులను ప్రశంసించారు. ఉత్తమ విజ్ఞాన ప్రదర్శన చేపట్టిన విద్యార్థులకు మంగళవారం సాయంత్రం బహుమతులు అందజేయనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను తెలుగు శిక్షణ్ సంస్థ ట్రస్టీలు భైరి రామస్వామి, అధ్యక్షులు గుండ్ల శంకర్, చైర్మన్ డాక్టర్ పాము మనోహర్, కళ్యాణపు భూమేష్ తదితరులు పర్యవేక్షించారు. -
‘త్వరలో నూతన విద్యావిధానం’
నాగపూర్: రాష్ట్రంలోని రెండు కోట్ల మంది విద్యార్థుల భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నూతన విద్యా విధానాన్ని రూపొందిస్తామని ఉన్నత విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే పేర్కొన్నారు. విద్యావిధానంపై విధానమండలిలో చర్చ సందర్భంగా ఆయన పైవిధంగా స్పందించారు. విద్యావిధానంపై సభ్యులు కపిల్ పాటిల్ (కాంగ్రెస్), రామ్‌నాథ్ మోతే (బీజేపీ) తదితర సభ్యులు అంతకుముందు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ విద్యావిధానంలో పూర్తిస్థాయిలో పారదర్శకత ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు. తమ నియామకాలకు సంబంధించి కొందరు ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, అయితే ఏ ఒక్కరి ఉద్యోగానికీ ముప్పు ఉండబోద ని ఆయన హామీ ఇచ్చారు. -
హిందూ రాష్ట్ర సేనను నిషేధించే యోచనలో సర్కార్: పాటిల్
ముంబై: నిషేధిత సంస్థల జాబితాలో హిందూ రాష్ట్ర సేనను కూడా చేర్చాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ శనివారం అసెంబ్లీలో ప్రకటించారు. సావధాన తీర్మానం సందర్భంగా ఎమ్మెల్సీ కపిల్ పాటిల్ మాట్లాడుతూ... ‘ఛత్రపతి శివాజీ, బాల్ఠాక్రేలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేశాడన్న అనుమానంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పుణేలో కొట్టి చంపిన ఘటన వెనుక ఏవైనా సంఘవిద్రోహ శక్తులు దాగున్నాయా? పుణే పోలీసులు మాత్రం హిందూ రాష్ట్ర సేన, ఆ సంస్థ అధ్యక్షుడు ధనంజయ్ దేశాయ్ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏంటి?’ అని అడిగిన ప్రశ్నకు ఆర్ఆర్ పాటిల్ సమాధానమిస్తూ... హిందూ రాష్ట్ర సేనను నిషేధించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పారు. -
‘తెలుగువారి విశ్వాసాన్ని చూరగొంటా’
ఎమ్మెన్నెస్ అభ్యర్థి సురేష్ మాత్రే భివండీ, న్యూస్‌లైన్: ఎన్సీపీలో రాజకీయ జీవితం ప్రారంభించిన కపిల్ పాటిల్ బీజే పీ, శివసేనలను దెబ్బతీయడానికి యత్నించారని ఎమ్మెన్నెస్ అభ్యర్థి సురేష్ మాత్రే ఆరోపించారు. స్థానిక మార్కండేయనగర్ ప్రాంతంలో గల గణేశ్ టాకీస్ వద్ద భివండీ తెలుగు సమాజం (బీటీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అటువంటి వ్యక్తిని ప్రజలంతా నిలదీయాలన్నారు. పద్మనగర్‌లోని అత్యధికంగా స్థిరపడ్డ తెలుగు ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు యత్నిస్తానన్నారు. తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఇంజన్ ఏ ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుందన్నారు. తాను మాటలు చెప్పే వ్యక్తిని కాదని, చేతల మనిషినని అన్నారు. భివండీని అభివృద్ధి చేయలేకపోతే మరోసారి ఓట్లు అడిగేందుకు రానన్నారు. ఈ సభలో బీటీఎస్ అధ్యక్షుడు తుమ్మ రమేశ్, డాక్టర్ శ్రీధర్ సుంక, ఎలిగేటి శ్రీనివాస్, వడ్లకొండ రాము, బొల్లి నవీన్, మామిడాల ధనవంత్రి, నందాల భాస్కర్‌తో పాటు స్థానికుఉల పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సభికులను మధుప్రియ తెలంగాణ పాటటతో ఆకట్టుకుంది. -
పేక‘మేడ’లపై దృష్టి
సాక్షి, ముంబై: దేశంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా గుర్తింపు పొందిన ఠాణే జిల్లాలో మహిళలకు ప్రాధాన్యం కల్పించకపోవడం గమనార్హం. ఈ విషయంలో అన్ని పార్టీలూ ఒకే విధానాన్ని అవలంభిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని చట్టసభల్లో ఊదరగొడుతున్న రాజకీయపార్టీలు వాస్తవ పరిస్థితుల్లో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఠాణే జిల్లాలో నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలుండగా, 24 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో ఏ ఒక్క నియోజకవర్గంలోనూ మహిళా ఎమ్మెల్యే లేకపోవడం విశేషం. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో అన్ని పార్టీలు కనీసం ఒక్క మహిళకైనా టిక్కెట్ ఇస్తాయని అందరూ భావించారు. అయితే అన్ని రాజకీయ పార్టీలూ ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల్లో ఒక్క మహిళా అభ్యర్థి కూడా లేకపోవడం విశేషం. గత చరిత్రను పరిశీలిస్తే వసాయికి చెందిన తారాబాయి వర్తక్ జిల్లాకు నేతృత్వం వహించారు. ఆమె రాష్ట్ర మంత్రిమండలిలో మంత్రిగా కూడా విధులు నిర్వహించారు. అనంతరం చంద్రికా కెనియా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ పరాజయం పాలైంది. మరోవైపు గత ఎన్నికల్లో 2009లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) వైశాలి దరేకర్ను బరిలోకి దింపింది. అయితే ఆమె కూడా పరాజయం పాలైంది. కాని అనంతరం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించింది. అయితే ఈసారి మాత్రం మహిళలకు ఏ పార్టీ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆఖరికి బీజేపీ అయినా మహిళా అభ్యర్థికి ప్రాధాన్యం ఇస్తుందేమోనని అందరూ ఆతృతగా ఎదురుచూడగా, ఆ పార్టీ కూడాఎన్సీపీ నుంచి బీజేపీలో ప్రవేశించిన కపిల్ పాటిల్‌కు పార్టీ టిక్కెట్ ఇచ్చేందుకు అనుకూలంగా కన్పిస్తోంది.