‘తెలుగువారి విశ్వాసాన్ని చూరగొంటా’ | MNS fields ex-Uddhav man against Sena in Thane | Sakshi

‘తెలుగువారి విశ్వాసాన్ని చూరగొంటా’

Apr 19 2014 11:20 PM | Updated on Mar 29 2019 9:24 PM

భివండీలో శనివారం రాత్రి జరిగిన ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న ఎమ్మెన్నెస్ అభ్యర్థి సురేష్, హాజరైన ప్రజలు: మధుప్రియ గేయాలాపన - Sakshi

భివండీలో శనివారం రాత్రి జరిగిన ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న ఎమ్మెన్నెస్ అభ్యర్థి సురేష్, హాజరైన ప్రజలు: మధుప్రియ గేయాలాపన

ఎన్సీపీలో రాజకీయ జీవితం ప్రారంభించిన కపిల్ పాటిల్ బీజేపీ, శివసేనలను దెబ్బతీయడానికి యత్నించారని ఎమ్మెన్నెస్ అభ్యర్థి సురేష్ మాత్రే ఆరోపించారు.

 
 ఎమ్మెన్నెస్ అభ్యర్థి సురేష్ మాత్రే
 
 భివండీ, న్యూస్‌లైన్: ఎన్సీపీలో రాజకీయ జీవితం ప్రారంభించిన కపిల్ పాటిల్ బీజే పీ, శివసేనలను దెబ్బతీయడానికి యత్నించారని ఎమ్మెన్నెస్ అభ్యర్థి సురేష్ మాత్రే ఆరోపించారు. స్థానిక మార్కండేయనగర్ ప్రాంతంలో గల గణేశ్ టాకీస్ వద్ద భివండీ తెలుగు సమాజం (బీటీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అటువంటి వ్యక్తిని ప్రజలంతా నిలదీయాలన్నారు. పద్మనగర్‌లోని అత్యధికంగా స్థిరపడ్డ తెలుగు ప్రజల  విశ్వాసాన్ని చూరగొనేందుకు యత్నిస్తానన్నారు.

 తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఇంజన్ ఏ ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుందన్నారు. తాను మాటలు చెప్పే వ్యక్తిని కాదని, చేతల మనిషినని అన్నారు. భివండీని అభివృద్ధి చేయలేకపోతే మరోసారి ఓట్లు అడిగేందుకు రానన్నారు. ఈ సభలో బీటీఎస్ అధ్యక్షుడు తుమ్మ రమేశ్, డాక్టర్ శ్రీధర్ సుంక, ఎలిగేటి శ్రీనివాస్, వడ్లకొండ రాము, బొల్లి నవీన్, మామిడాల ధనవంత్రి, నందాల భాస్కర్‌తో పాటు స్థానికుఉల పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సభికులను మధుప్రియ తెలంగాణ పాటటతో ఆకట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement