హిందూ రాష్ట్ర సేనను నిషేధించే యోచనలో సర్కార్: పాటిల్ | Hindu state sena in the list of banned organization | Sakshi
Sakshi News home page

హిందూ రాష్ట్ర సేనను నిషేధించే యోచనలో సర్కార్: పాటిల్

Published Sat, Jun 14 2014 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM

హిందూ రాష్ట్ర సేనను నిషేధించే  యోచనలో సర్కార్: పాటిల్

హిందూ రాష్ట్ర సేనను నిషేధించే యోచనలో సర్కార్: పాటిల్

ముంబై: నిషేధిత సంస్థల జాబితాలో హిందూ రాష్ట్ర సేనను కూడా చేర్చాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని హోంమంత్రి ఆర్‌ఆర్ పాటిల్ శనివారం అసెంబ్లీలో ప్రకటించారు. సావధాన తీర్మానం సందర్భంగా ఎమ్మెల్సీ కపిల్ పాటిల్ మాట్లాడుతూ... ‘ఛత్రపతి శివాజీ, బాల్‌ఠాక్రేలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేశాడన్న అనుమానంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పుణేలో కొట్టి చంపిన ఘటన వెనుక ఏవైనా సంఘవిద్రోహ శక్తులు దాగున్నాయా? పుణే పోలీసులు మాత్రం హిందూ రాష్ట్ర సేన, ఆ సంస్థ అధ్యక్షుడు ధనంజయ్ దేశాయ్ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏంటి?’ అని అడిగిన ప్రశ్నకు ఆర్‌ఆర్ పాటిల్ సమాధానమిస్తూ... హిందూ రాష్ట్ర సేనను నిషేధించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement