RR Patil
-
ఆర్ ఆర్ పాటిల్ మృతి
ముంబై: సీనియర్ ఎన్సీపీ నాయకుడు, మహారాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి ఆర్ ఆర్ పాటిల్(57) సోమవారం మరణించారు. కొంత కాలంగా నోటి కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. సాంగ్లీ జిల్లాలోని తాస్గావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన పాటిల్ నవంబర్ 26 తీవ్రవాద దాడుల సమయంలో మహారాష్ట్ర హోం మంత్రిగా ఉన్నారు. స్వగ్రామం అంజనిలో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన అంత్యక్రియలు జరపనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. పాటిల్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. -
పొగాకు ప్రేమికులు మా ప్రియతమ నేతలు
* శరద్‌పవార్ నుంచి ఆర్ఆర్ పాటిల్ వరకు గుట్కా బాధితులే * పొగతాగే వారిలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు * డాక్టర్ పీసీ గుప్తా పరిశోధనలో బట్టబయలు సాక్షి, ముంబై: చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వేదికలనెక్కి ఉపన్యాసాలు దంచే అనేక మంది రాజకీయ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు దురలవాట్లకు బానిసలేనన్న ఆశ్చర్యకరమైన విషయం ఓ అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. చట్టాలను అమలు చేయాల్సిన నేతలే వాటిని తుంగలో తొక్కుతున్నారు. అనేక మంది ప్రస్తుత, మాజీ మంత్రులు, విధానసభ సభ్యులకు పాన్, గుట్కా, తంబాకు, సిగరెట్, బీడి వంటి వ్యసనాలున్నాయని ఆ అధ్యయన నివేదిక వెల్లడించింది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కోసం పనిచేసిన డాక్టర్ పి.సి.గుప్తా మహారాష్ట్రలో తంబాకు సేవనంపై పరిశోధన చేశారు. ప్రస్తుతం హెలీజ్ సిక్సారియా ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ రీసెర్చ్ కోసం పనిచేస్తున్న డాక్టర్ గుప్తా తన పరిశోధన వివరాలను వెల్లడించారు. ఇందులో పలువురు రాజకీయ నాయకుల విషయాలు కూడా బయటపడ్డాయి. ప్రస్తుతం బాంద్రాలోని లీలావతి ఆస్పత్రిలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతున్న మాజీ హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ కూడా తంబాకు సేవించేవారని తెలిసింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు, కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌కు కూడా క్యాన్సర్ ఉంది. గుట్కా అతిగా తినడంవల్ల నోటికి సోకిన క్యాన్సర్‌ను సర్జరీ ద్వారా తొలగించుకున్నారు. ఎన్సీపీకి చెందిన ప్రఫుల్ పటేల్‌కు సిగరెట్ తాగే అలవాటు చాలా ఉండేది. అయితే ప్రస్తుతం పొగ తాగడం మానుకున్నానని తెలిపారు. పొగాకు తయారిలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న సి.జె.గ్రూప్ ప్రఫుల్ పటేల్ కుటంబానికి చెందినదే. ఈ కంపెనీ ద్వారా యేటా నాలుగు వేల కోట్ల డాలర్ల లావాదేవీలు జరుగుతాయి. బీజేపీకి చెందిన గిరీష్ బాపట్, రెవెన్యూ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సేకు సిగరెట్ తాగే అలవాటుంది. కానీ ప్రస్తుతం ఆ అలవాటు మానుకున్నట్లు చెబుతున్నారు. గుట్కా, ఖైనీ, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులను ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్యులకు కూడా ఇవి అందుబాటులోనే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతీరోజు 2.50 కోట్ల మందికి పైగా ప్రజలు పొగాకును వివిధ రూపాల్లో సేవిస్తున్నారు. వీరిలో తంబాకు తినేవారు కోటిన్నర మంది ఉన్నారు. పొగాకును గుట్కా, ఖైనీ, పాన్ మసాల వంటి పదార్థాలుగా వీరు సేవిస్తున్నరు. ఇలా పొగాకుకు బానిసలైన ప్రతి 30 మందిలో ఒకరికి నోటి క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని ఈ అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ ప్రభాత్ ఝా తెలిపారు. 2010లో డాక్టర్ ప్రభాత్ ఝా వివిధ సేవా సంస్థల సాయంతో చేపట్టిన పరిశోధనలో భారత దేశంలో క్యాన్సర్ సోకిన వారిలో పురుషుల సంఖ్య 42 శాతం ఉండగా, మహిళల శాతం 18 ఉన్నట్లు పేర్కొన్నారు. -
ఆర్ ఆర్ పాటిల్ ఆరోగ్య పరిస్థితి విషమం
ముంబై : మహారాష్ట్ర మాజీ హోమంత్రి, ఎన్సీపీ నేత ఆర్ ఆర్ పాటిల్ (57) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్సలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉన్న పాటిల్ మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఆయన గత రెండు వారాలుగా ఆస్పత్రిలో వెంటిలేటర్ ద్వారా చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఐసీయూకు తరలించారు. కాగా పాటిల్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు వెల్లడించేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించాయి. -
పాటిల్ వ్యాఖ్యలతో దుమారం
దెబ్బకు క్షమాపణ చెప్పిన మాజీ మంత్రి ముంబై: ఎమ్మెన్నెస్ అభ్యర్థిపై అత్యాచారానికి సంబంధించి ఎన్సీపీ నాయకుడు, మాజీ హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. సాంగ్లిలో తన మద్దతుదారులతో పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఈ దుమారానికి కారణమయ్యాయి. కార్యకర్తలతో ఆయన సంభాషణ ఇలా సాగింది. ‘‘ఈరోజు ఎమ్మెన్నెస్ కార్యకర్తలు నా వద్దకు వచ్చి నాకు మద్దతునిస్తామని చెప్పారు. ఎందుకు మీరు నాకు మద్దతునిస్తున్నారు అని వారిని అడిగాను. మా అభ్యర్థి జైలుకెళ్లాడని వారు చెప్పారు. ఏం మంచి పని చేసి అతడు జైలుకెళ్లాడు అని నేను వారిని అడిగాను. అతనిపై ఓ రేప్ కేసు నమోదైంది అని వారు చెప్పారు. శాసనసభ్యునిగా ఎన్నిక కావాలనుకున్న వాడు ఎన్నికలైన తరువాత రేప్ చేయవచ్చు కదా అని నేను చెప్పాను’’ వివాదాలకు కొత్తకాని పాటిల్ చేసిన ఈ వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో 26/11 సంఘటన జరిగినప్పుడు ‘‘పెద్ద నగరాల్లో ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు సాధారణమే’’ అన్నారు. ఆ తరువాత శక్తీమిల్ కాంపౌండ్‌లో మహిళా పాత్రికేయురాలిపై అత్యాచారం జరిగినప్పుడు, ‘‘జర్నలిస్టులందరికీ నేను రక్షణనివ్వాలా?’’ అని ప్రశ్నించారు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆయన మరింత గడుసుగా వ్యవహరిస్తున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. పాటిల్ ఓ ‘జోక్’ అని బీజేపీ నాయకురాలు షైనా ఎన్సీ పేర్కొన్నారు. అతనికి మనస్సాక్షి లేదని, ప్రజా జీవితంలో ఉండే అర్హత కూడా లేదని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం నేర్పాలని షైనా కోరారు. పాటిల్‌పై సెక్షన్ 107 కింద కేసు నమోదు చేయాలని సామాజిక కార్యకర్త, న్యాయవాది అభా సింగ్ సూచించారు. అత్యాచారాలు చేసేలా పురికొల్పినందుకు అతనిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 26/11 సమయంలో చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన తన మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. క్షమించండి : పాటిల్ తన వ్యాఖ్యలపై పలు వర్గాల నుంచి ఆగ్రహం వెల్లువెత్తుతోందని తెలుసుకున్న పాటిల్ వెంటనే ప్రమాద నివారణచర్యలను చేపట్టారు. తన ప్రత్యర్థిపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశానని, దీని ద్వారా ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. ఎమ్మెన్నెస్ అభ్యర్థి సుధాకర్ ఖాడేపై 2007లో కూడా ఒక రేప్ కేసు నమోదైందని, ఇప్పుడు నామినేషన్ వేసిన వెంటనే అత్యాచారం కేసులో జైలుకెళ్లాడని అన్నారు. అంతకుముందు ఆయుధాల చట్టం, వేధింపులపై కూడా అభియోగాలు నమోదయ్యాయని చెప్పారు. తన వ్యాఖ్యలను వింటే అవి సందర్భోచితమేనని అంగీకరిస్తారని సమర్థించుకున్నారు. తాను మహిళలను కించపరిచే ప్రశ్నేలేదని అన్నారు. తాను హోం మంత్రిగా పని చేసిన కాలంలో మహిళల భద్రత కోసం ఎన్నో చర్యలు చేపట్టానని చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసేలా ఉంటే, వారికి క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. -
ఎన్నికల తరువాత రేప్ చేయాల్సింది!
ముంబై: లైంగిక అత్యాచారంపై మహారాష్ట్ర మాజీ హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) అభ్యర్థి అత్యాచార ఆరోపణలపై జైల్లో ఉన్న నేపథ్యంలో పాటిల్ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం చేలరేగింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న తనకు మద్దతు ఇవ్వడానికి ఎమ్మెన్నెస్ సిద్ధమైందని, అత్యాచారం కేసులో తమ అభ్యర్థి జైలులో ఉంటున్నందునే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఎమ్మెన్నెస్ నేతలు చెప్పారని పాటిల్ తెలిపారు. అయితే అతను ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యే కాదలుచుకున్నపుడు ఎన్నికల తర్వాతే అత్యాచారం చేసి ఉండవచ్చు కదా! అని తాను చెప్పానంటూ’ని పాటిల్ సెలవిచ్చారు. శనివారం సంగ్లీలో పార్టీ మదతుదార్ల సమావేశంలో పాటిల్ బాహాటంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో మహిళా సంఘాలు మండిపడటంతో ఆయన కాస్త దిగివచ్చారు. ఆ వ్యాఖ్యలు వ్యక్తిని విమర్శిస్తూ చేసినవని, ఇందులో మహిళలు ఉద్దేశించి తానేమి చేయలేదన్నారు. ఒకవేళ మహిళల మనో్భావాలు కించపరిచేలా ఉంటే తాను క్షమాపణలు చెబుతానని పాటిల్ తెలిపారు. ఇదిలా ఉండగా ఆయనకు ప్రజాజీవితంలో ఉండే అర్హతేలేదని, ఎన్నికల్లో ఓడించాలని బీజేపీ నేత షైనా ఎన్సీ విమర్శించలు గుప్పించారు. -
పాటిల్ నామినేషన్‌ను ఆమోదించిన ఈసీ
సాక్షి, ముంబై: ఎన్సీపీ అభ్యర్థిగా ఆర్ఆర్ పాటిల్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాన్ని ఈసీ ఎట్టకేలకు ఆమోదించింది. నామినేషన్ పత్రంలో లోపాలున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించిన ఎన్నికల సంఘం దానిని పక్కనబెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వమే ప్రశ్నార్థకంగా మారింది. నామినేషన్‌తోపాటు సమర్పించే ప్రతిజ్ఞాపత్రంలో అన్ని వివరాలను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. అయితే బేల్గావ్లో తనపై దాఖలైన కేసుల గురించి ఆర్ ఆర్ పాటిల్ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీనిపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో నామినేషన్ పత్రాలను పరిశీలిస్తున్న అధికారులు పాటిల్ పత్రాన్ని తొలుత పక్కనబెట్టారు. దీంతో నామినేషన్‌ను తిరస్కరించనున్నారా? లేక సదరు విషయాన్ని పత్రాల్లో పేర్కొనేందుకు మరో అవకాశం ఇస్తారా? అనే సందిగ్ధం ఏర్పడింది. అయితే ఎన్నికల సంఘం పాటిల్ నామినేషన్‌ను ఎట్టేకలకు ఆమోదిస్తున్నట్లు ప్రకటించింది. అంకుశ్ కాకడే నామినేషన్ తిరస్కరణ... పుణేలోని కస్బాపేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ తరఫున పోటీ చేసేందుకు అంకుశ్ కాకడే దాఖలు చేసిన నామినేషన్ ఫారాన్ని ఎన్నికల సంఘం తిరస్కరించింది. నామినేషన్‌తోపాటు ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయకపోవడమే ఇందుకు కారణ మని ఎన్నికల సంఘం తెలిపింది. నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు శనివారం నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయన ప్రమాణ పత్రాన్ని జోడించకుండానే నామినేషన్ దాఖలు చేశారు. ప్రమాణ పత్రం లేకపోవడాన్ని గమనించిన ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్ ఫారాన్ని తిరస్కరించారు. అయితే ముందు జాగ్రత్తగా దీపక్ మాన్కర్తో కూడా ఎన్సీపీ నామినేషన్ వేయించింది. దీంతో అంకుశ్ కాకడే నామినేషన్ తిరస్కరించినప్పటికీ దీపక్ మాన్కర్ నామినేషన్‌ను స్వీకరించడంతో కస్బా ఎన్సీపీ అభ్యర్థిగా దీపక్ మాన్కర్ బరిలో ఉన్నారని చెబుతున్నారు. -
మాలిన్ దుర్ఘటనకు ముందు పెద్ద శబ్దం
సాక్షి, ముంబై: వర్షానికి తడిసిన కొండచరియలు విరిగి పడే దుర్ఘటన జరిగిందా? మరి ఈ ప్రమాదం జరగడానికి ముందు వచ్చిన పెద్ద శబ్దం ఏంటి? పిడుగుపాటా? ఏదైనా విస్ఫోటనం జరిగిందా?... పుణేలోని మాలిన్ దుర్ఘటనపై స్థానికుల్లో వ్యక్తమవుతు న్న అనుమానాలివి. దుర్ఘటన జరగడానికి ముందు భారీ పేలుడువంటి శబ్దం వినిపించిందని స్థాని కులు చెబుతున్నారు. శబ్దం అనంతరం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి గ్రామం నామరూపాల్లేకుండా పోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటిదాకా బయటపడిన మృతదేహాల సంఖ్య 90కి చేరింది. ఇంకా చాలా మృతదేహాలు శిథిలాల కిందే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. కారణమేంటో తెలుసుకుంటాం: పాటిల్ మాలిన్ దుర్ఘటనకు ముందు వచ్చిన శబ్దం దేని కారణంగా వచ్చిఉంటుందనే విషయంపై నిపుణులతో చర్చించి దర్యాప్తు జరిపిస్తామని హోంశాఖ మంత్రి ఆర్ఆర్ పాటిల్ హామిఇచ్చా రు. మాలిన్ దుర్ఘటనతో క్షతగాత్రులుగా మారి చికిత్సపొందుతున్నవారిని పాటిల్ పరామర్శించారు. ఈ సందర్భంలో బాధితులు చెప్పిన వివరాలను సావధానంగా విన్న పాటిల్ అనంతరం ఆయన మీడియాతోమాట్లాడారు. మాలిన్ సంఘటన తీవ్ర వేదనకు గురిచేసిందన్నారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. కొండచరియలు విరిగి పడడానికి ముందు రాత్రంత ఉరుములు, మెరుపులతో వర్షం కురిసిందని, బుధవారం ఉదయం ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చిందని, అనంతరం కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయని బాధితులు తనతో చెప్పారన్నారు. అయితే భారీ శబ్దం పిడుగుపాటు కారణంగా వచ్చిందా..? మరేకారణమైనా ఉందా? అనే విషయంపై దర్యాప్తు జరిపిస్తామని పాటిల్ చెప్పారు. -
హోంమంత్రి ఫిట్నెస్ ఎంత?: ఉద్ధవ్‌ఠాక్రే
సాక్షి, ముంబై: పోలీసు ఉద్యోగాల భర్తీ పేరుతో నిరుద్యోగుల జీవితాలతో హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ చెలగాటమాడుతున్నారని శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో ఉద్యోగం సంపాధించుకోవాలని గంపెడాశతో వచ్చిన యువకులు ఇలా కోరిక నెరవేరకుండానే అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారని, దీంతో వారి కుటుంబాలకు శోకమే మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో నలుగురు అభ్యర్థులు చనిపోవడంతో నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా స్పందించి హోంశాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల భర్తీ పేరిట ఇంకా ఎంతమంది అభ్యర్థులను బలి తీసుకుంటారని హోంశాఖ మంత్రి ఆర్ఆర్ పాటిల్‌ను ప్రశ్నించారు. ‘ఫిట్నెస్ పేరుతో ఐదు కిలోమీటర్లు పరుగెత్తించడం అంత అవరసమా..? మరి పాటిల్ ఎంతమేర ఫిట్నెస్తో ఉన్నారు? ఆయన మంత్రివర్గంలో సగానికిపైగా మంత్రులకు పొట్ట ముందుకు వచ్చింది. కొవ్వు వేలాడుతోంద’ని ఎద్దేవా చేశారు. పోలీసు చరిత్రలో ఐదు కిలోమీటర్లు వెంబడించి నిందితులను పట్టుకున్న సందర్భాలున్నాయా...? అని ఆయన నిలదీశారు. ఇకనైనా ఫిట్నెస్ పేరుతో అమాయక నిరుద్యోగుల జీవితాలతో పరిహాసమాడడం మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. ‘పోలీసు ఉద్యోగానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది అభ్యర్థులు వచ్చారు. వారి కోసం ప్రభుత్వం కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు.. దీన్నిబట్టి ప్రభుత్వం నిరుద్యోగులపట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో తెలుస్తోందని ఉద్ధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా నియమావళిని మార్చాలని డిమాండ్ చేశారు. పాటిల్ కిలోమీటరైనా పరిగెడతారా: రాజ్‌ఠాక్రే పోలీసు కొలువు కోసం వచ్చిన అభ్యర్థులను హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ ఐదు కిలోమీటర్లు పరిగెతిస్తున్నారు. మరి ఆయన(హోంమంత్రి) కనీసం కిలోమీటరైన పరిగెడతారా? అని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే విమర్శించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయని, ఇప్పుడూ చోటుచేసుకుంటున్నాయని, నియమనిబంధనల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
హిందూ రాష్ట్ర సేనను నిషేధించే యోచనలో సర్కార్: పాటిల్
ముంబై: నిషేధిత సంస్థల జాబితాలో హిందూ రాష్ట్ర సేనను కూడా చేర్చాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ శనివారం అసెంబ్లీలో ప్రకటించారు. సావధాన తీర్మానం సందర్భంగా ఎమ్మెల్సీ కపిల్ పాటిల్ మాట్లాడుతూ... ‘ఛత్రపతి శివాజీ, బాల్ఠాక్రేలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేశాడన్న అనుమానంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పుణేలో కొట్టి చంపిన ఘటన వెనుక ఏవైనా సంఘవిద్రోహ శక్తులు దాగున్నాయా? పుణే పోలీసులు మాత్రం హిందూ రాష్ట్ర సేన, ఆ సంస్థ అధ్యక్షుడు ధనంజయ్ దేశాయ్ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏంటి?’ అని అడిగిన ప్రశ్నకు ఆర్ఆర్ పాటిల్ సమాధానమిస్తూ... హిందూ రాష్ట్ర సేనను నిషేధించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పారు. -
‘సోషల్ మీడియా దుర్వినియోగంపై చర్యలు’
ముంబై: సామాజిక వెబ్సైట్లలో అభ్యంతరకరమైన పోస్టింగ్‌లు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ హెచ్చరించారు. కేవలం అప్లోడ్ చేసినవారిపై మాత్రమే కాకుండా వాటిని లైక్ చేసినవారిపై, షేర్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పుణేలోని హడప్సర్లో సాఫ్ట్‌వర్ ఇంజనీర్ మొహసిన్ హత్యకేసు నేపథ్యంలో పాటిల్ ఈ హెచ్చరికలు చేశారు. సోషల్ మీడియాను ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఉపయోగిస్తున్నారని, మంచికి ఉపయోగపడాల్సిన దానిని ఇలా దుర్వినియోగం చేస్తే ఊరుకునేదిలేదన్నారు. మొబైల్ ఫోన్‌ను దుర్వినియోగం చేసినా కూడా సదరు ఫోన్ యజమానిపై చర్యలు తప్పవన్నారు. ఇందుకు ఏవైనా చట్టాలు అవసరమైతే వాటిని రూపొందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. -
మహారాష్ట్రలో రైలు ప్రమాదం, 18 మంది మృతి!
రాయగడ్: మహారాష్ట్ర లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 18 మంది ప్రయాణీకులు మరణించగా, మరో 60 మంది గాయపడినట్టు తెలుస్తోంది. ఇంజన్ తోపాటు, నాలుగు బోగిలు పట్టాలు ఆదివారం తప్పాయని, ఈ విషాద ఘటనలో 18 మంది చనిపోయారని కేంద్రమంత్రి ఆర్ఆర్ పాటిల్ మీడియాకు తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రమాదం సంభవించిందని పాటిల్ తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి 50 వేలు, పాక్షికంగా గాయపడిన వారికి 10 వేల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ఇస్తుందన్నారు. దక్షిణ ముంబైకి 100 కిలో మీటర్ల రూరంలో నాగోథేన్ సమీపంలో ఆదివారం ఉదయం 9.40 గంటలకు దివ-సవంత్వాడి రైలు పట్టాలు తప్పింది. గాయపడిన వారిని నాగోథేన్, రాయ్ గడ్ జిల్లాలోని రోహా లకు తరలించి చికిత్సనందిస్తున్నారు. -
వలసల వల్లే నేరాలు
సాక్షి, ముంబై: నగరానికి వలస వస్తున్నవారివల్లే నేరాల సంఖ్య పెరుగుతోందని హోంశాఖ మంత్రి ఆర్ఆర్ పాటిల్ పేర్కొన్నారు. బంగారం ధర విపరీతంగా పెరిగిపోవడంతో దొంగతనాలకు, దోపిడీలకు ముంబైని లక్ష్యంగా చేసుకుంటున్నారని అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నేరాలకు పాల్పడుతున్నవారిలో ఇతర ప్రాంతాలవారే ఎక్కువగా ఉంటున్నారని, దీంతో రోజురోజుకు పెరుగుతున్న కొత్త నేరాల కేసులు దర్యాప్తు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పాటిల్ ఆందోళన వ్యక్తం చేశారు. చెంబూర్‌లోని మాహుల్ ప్రాంతంలోగల కోళీ సమాజం మహిళల నుంచి బంగారు నగలు, నగదు తీసుకుని పారిపోయిన బెంగాలీ వడ్డి వ్యాపారిపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రతిపక్ష నాయకులు పాటిల్‌ను ప్రశ్నించారు. అందుకు ఆయన సమాధానమిస్తూ... ఈ ఘటనతో సంబంధమున్న ఉత్తమ్‌కుమార్ మల్లాను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుడు 5,382 గ్రాముల బంగారం, రూ.26 లక్షల నగదు.. ఇలా మొత్తం రూ.2 కోట్లు విలువచేసే సొత్తు దోచుకుపోయాడని, ఇప్పటిదాకా 943 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించామని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిని వెంటనే బదిలీ చేస్తామని కూడా హెచ్చరించామన్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు 693 మంది నేరస్తులు పోలీసుల కళ్లుగప్పి పారిపోయినట్లు వెలుగులోకి వచ్చిన విషయాన్ని పాటిల్ కూడా అంగీకరించారు. ఇందులో 136 మంది పట్టుబడ్డారన్నారు. పోలీసుల భద్రతపై మాట్లాడుతూ.. వారికి త్వరలోనే బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు అందజేస్తామన్నారు. అందుకు నాగపూర్‌కు చెందిన నేకో డిఫెన్స్ సిస్టం కంపెనీకి ఐదు వేల బుల్లెట్ ఫ్రూప్ జాకెట్లు సరఫరా చేయాలని ఆదేశించినట్లు పాటిల్ సభలో వెల్లడించారు. -
26/11 అమరులకు ముంబైకర్ల శాల్యూట్
సాక్షి, ముంబై: నగరంలో ముష్కరులు నరమేథం సృష్టించి మంగళవారానికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా అమరులను గుర్తుచేసుకుంటూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. వీరి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 166 మంది భారతీయులు, విదేశీయులను ముంబైకర్లు స్మరించుకున్నారు. వీరి స్మృత్యర్థం మెరైన్లైన్స్లోని పోలీసు జింఖానాలో నిర్మించిన అమరవీరుల స్మారకం వద్ద ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్, కేంద్ర మానవ వనరుల సహాయ శాఖ మంత్రి శశిథరూర్ పుష్పాగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రులు, నగర పోలీసు కమిషనర్ సత్యపాల్‌సింగ్, పోలీసులు కూడా అమరులను గుర్తు చేసుకున్నారు. ఉగ్రవాద దాడులను ఎదుర్కొనే క్రమంలో వీర మరణం పొందిన జవాన్లు, పోలీసు అధికారులను స్మరించుకున్నారు. మారణహోమం సృష్టించిన తొమ్మిది మంది ఉగ్రవాదులను హతమార్చిన పోలీసులు, జాతీయ భద్రతా దళం సేవలను ప్రశంసించారు. ఆ తర్వాత భారీ సంఖ్యలో హాజరైన బాధిత కుటుంబసభ్యులు తమవారిని తలచుకొని కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఇలాంటి సంస్మరణ కార్యక్రమాలను తాజ్ మహల్ ప్యాలెస్, టవర్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్లు, లియోపోల్డ్ కేఫ్, నారీమన్ హౌస్‌లోనూ నిర్వహించారు. 2008, నవంబర్ 26 నుంచి 29 వరకు ఉగ్రవాదులు వీటిని లక్ష్యంగా ఎంచుకొని అనేక మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఉగ్రవాదులు మొదటగా లక్ష్యంగా ఎంచుకున్న ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో అమరులకు నివాళులర్పించేందుకు రైల్వే అధికారులు ఎలాంటి కార్యక్రమం చేపట్టలేదు. ‘జీవితం ముందుకు సాగుతోంది. అప్పటి భయంకర రోజులను మళ్లీ ప్రజలకు గుర్తు చేయలేమ’ని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఆ రోజు రాత్రి జరిగిన భయంకర దృశ్యాలను మరిచిపోయానని లియోపొల్ట్ కేఫ్‌లో జరిగిన దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డ భరత్ గుజ్జర్ అన్నారు. ఆ విషాద ఘటన గురించి ఆలోచిస్తూ, ఆ జ్ఞాపకాలతో ఎన్ని రోజులు బతకాలన్నారు. ఉగ్రవాది కసబ్‌ను పట్టుకునేందుకు సహచరులకు సహకరించే సమయంలో చౌపాటి బీచ్ సమీపంలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారి బాలసాహెబ్ భోన్సలే కుమారుడు సచిన్ భోన్సలే మాట్లాడుతూ ఆ రోజు జ్ఞాపకాలు ఇప్పటికీ తమ కుటుంబసభ్యులు గుర్తు చేస్తుంటారని అన్నారు. ‘ప్రతి బుధవారం, గురువారం వచ్చిందంటే అమ్మ కలవరపడుతుంది. బుధవారం విధుల కోసం బయటకు వెళ్లిన నాన్న బాలసాహెబ్ లేరన్న విషయం మరుసటి రోజు తెలిసింద’ని విచారం వ్యక్తం చేశారు. సోదరుడు ముంబై పోలీసు శాఖలో, తాను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నానని వివరించాడు. శాంతి పరిఢవిల్లాలని కాంక్షిస్తూ సోమవారం వందలాది మంది అంతర్జాతీయ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. షోలాపూర్‌లో... షోలాపూర్, న్యూస్‌లైన్: 26/11 దాడుల్లో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో అమరులైన వీర జవాన్లకు షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో మంగళవారం నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ అల్కారాటోడ్, కార్పొరేషన్ కమిషనర్ చంద్రకాంత్ గూడెం వార్, పోలీసు కమిషనర్ ప్రదీప్ రాసుకర్ తదితరులు పాల్గొని కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. -
దళితులకు రక్షణ కల్పించండి: ఆర్పీఐ
ముంబై: దళితులపై దాడుల నిరోధానికి తగు చర్యలు తీసుకోవాలని రిపబిక్లన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్‌ను కోరింది. ఈ మేరకు శుక్రవారం ఓ వినతిపత్రం సమర్పించింది. ఇటీవలి కాలంలో దళితులపై దాడులు అధికమయ్యాయని ఈ సందర్భంగా ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వేధింపుల నిరోధక చట్టాన్ని తక్షణమే అమలు చేయాలన్నారు. ఇటువంటి కేసుల్లో నిందితులకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా చూడాలన్నారు. దళితులు బాధితులుగా మారినపుడు ఈ చట్టాన్ని వినియోగించాలన్నారు. ఇందుకు హోం మంత్రి స్పందిస్తూ ఇటువంటి కేసుల సంఖ్య పెరుగుతున్న మాట నిజమేనన్నారు. ఈ ఏడాది అక్టోబర్ దాకా 1,365 కేసులు నమోదయ్యాయన్నారు. ఔరంగాబాద్, నాగపూర్లలో రెండు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఉన్నాయన్నారు. అయినప్పటికీ మరో నాలుగు ఉండాలన్నారు. -
ఫిర్యాదు బాక్సులు ఎక్కడా?
సాక్షి, ముంబై: నగర పౌరులు తమ సమస్యలపై ఫిర్యాదుచేయడానికి ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్సులు అదృశ్యమౌతున్నాయి. నగర వాసులు తమ సమస్యలను సులభంగా ఫిర్యాదు చేయడానికి పోలీసులు ఏర్పాటు చేశారు. ఏర్పాటులో చూపిన శ్రద్ధ నిర్వహణలో చూపకపోవడంతో ఈ ప్రక్రియ ఆదిలోని విఫలమయింది. గత ఏడాది అక్టోబర్‌లో దాదాపు వెయ్యికి పైగా ఫిర్యాదు బాక్సులను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అయితే ఇవి ఇప్పుడు ఎక్కడోకాని కనిపించకపోవడంతో పోలీసులు ఈ బాక్సులను మందుబాబులు దొంగిలించి ఉంటారని ఆరోపిస్తున్నారు. హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్, ముంబై కమిషనరు డాక్టర్ సత్యపాల్సింగ్లు 2012 అక్టోబర్‌లో దాదర్‌లోని రవీంద్ర నాట్య మందిర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఫిర్యాదుల విధానాన్ని ప్రారంభించారు. పౌరులు ఎదుర్కొంటున్న శాంతిభద్రతల సమస్యలను పోలీసుల దృష్టికి తేవడానికి సమాచార వారధిగా ఫిర్యాదు బాక్స్‌ల విధానం ప్రవేశపెట్టరు. ఈ సందర్భంగా వెయ్యి ఫిర్యాదు పెట్టెలను 96 పోలీస్ స్టేషన్ల పరిధిలో అమరుస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమం జరిగిన కొద్ది రోజుల్లోనే వీటి జాడ కనిపించకుండా పోయింది. సాధారణ ఫిర్యాదులే కాకుండా పోలీసుల మీద కూడా ఫిర్యాదులు చేయవచ్చని అధికారులు ప్రకటించారు. ఈ ఫిర్యాదుల పెట్టెలను తెరిచే అధికారం స్థానిక అధికారులకు కాకుండా సీఐడీ విభాగానికి అప్పగించారు. ప్రారంభించిన రెండు నెలల తర్వాత సీఐడీ విభాగం అధికారులు ఈ బాక్సులు తెరచి ఫిర్యాదులు స్వీకరించడానికి సరియైన సిబ్బంది తమ వద్దలేరని చేతులెత్తాశారు. దీంతో ఆర్భాటంగా ప్రారంభించిన పథకం పూర్తిగా మూలపడింది. కొద్ది రోజుల్లోనే ఎక్కడా ఫిర్యాదుల పెట్టె కనిపించని పరిస్థితి వచ్చింది. హిందుజా కాలేజీ వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి నెల రోజులపాటు ఫిర్యాదుల పెట్టెను కాలేజీ ఆవరణలో చూశానన్నారు. కాలేజీ ఆవరణలో తరచూ వేధింపుల సంఘటనలు చోటుచేసుకుంటున్నాయనీ, ముఖ్యంగా యువతులకు ఈ బాక్సు చాలా ఉపయోగకరంగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. పేరు తెలియజేయకుండా ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉండడంతో ఫిర్యాదుదారుడిని నియంత్రించడానికి కూడా అవకాశంలేని ఈ విధానం పోలీసు వర్గాల అవినీతిని తూర్పార బట్టే సాధనమయ్యేది. అందుకే దీన్ని నిర్వహించాల్సిన సీఐడీ విభాగం శ్రద్ధ చూపకుండా వదలిపెట్టిందని ఓ సమాజిక కార్యకర్త ఒకరు విమర్శించారు. -
మీరూ నవ్వులపాలవుతారు!
ముంబై: గడ్జిరోలి జిల్లాలోని గిరిజనుల జీవితాల్లో చీకట్లు నింపొద్దంటూ రాష్ట్ర హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలను శివసేన కార్యాధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే సమర్థించారు. హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు గిరిజనుల మనోభావాలను ప్రతిబింబించేలా ఉన్నాయంటూ కొనియాడారు. డిప్యూటీ సీఎం అజిత్‌పవార్ కుతంత్రాలకు లొంగిపోకుండా ఆర్ఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఆయనలోని నిజాయతీని చాటాయని శుక్రవారం శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’లో ప్రచురితమైన సంపాదకీయంలో ఉద్ధవ్ పేర్కొన్నారు. అప్పుడప్పుడూ తప్పుడు వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో ఇరుక్కుంటాడనే పేరు పాటిల్‌కు ఉందని, అయితే గిరిజనులకు విద్యుత్ కనెక్షన్‌ను తొలగించే విషయంలో పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఆయనలోని సమస్య తీవ్రతను తెలియజెప్పాయన్నారు. గడ్చిరోలి జిల్లాలోని గిరిజన గ్రామాల్లో బిల్లు చెల్లించనివారి విద్యుత్ కనెక్షన్‌ను తొలగించాలంటూ విద్యుత్‌శాఖ మంత్రి అజిత్‌పవార్ చేసిన వ్యాఖ్యలను ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో పాటిల్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన గిరిజన గ్రామాల్లో విద్యుత్ కనెక్షన్లను తొలగించడంవల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని, విద్యుత్ కనెక్షన్ల తొలగించడం నుంచి గిరిజనులను మినహాయించాలని అజిత్‌ను కోరారు. దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు కేంద్రం ఓవైపు ఏర్పాట్లు చేస్తుంటే రాష్ట్రంలో ఇలా బిల్లుల పేరుతో కనెక ్షన్లను తొలగించడం సరికాదన్నారు. ఈ విషయంలో పాటిల్ వాదనతో ఉద్ధవ్ ఏకీభవించారు. అయితే కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారని, ప్రజల సమస్యలను అపహాస్యం చేశారని ఉద్ధవ్ విమర్శించారు. ప్రజలను అపహాస్యం చేస్తున్న ఎన్సీపీ నేతలు కూడా భవిష్యత్తులో నవ్వులపాలు కాక తప్పదని జోస్యం చెప్పారు. కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులను ఎగవేస్తున్న వారి ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. -
హంతకుల్ని త్వరలో పట్టుకుంటాం, నరేంద్ర హత్యకేసుపై హోం మంత్రి
నాసిక్: అంధశ్రద్ధ నిర్మూలన సమితి వ్యవస్థాపకుడు నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని రాష్ర్ట హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ పేర్కొన్నారు. స్థానిక మహారాష్ట్ర పోలీస్ అకాడమీ (ఎంపీఏ) కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నరేంద్ర హంతకులను వీలైనంత త్వరగా పోలీసులు పట్టుకుంటారనే నమ్మకం నాకుంది. ’ అని అన్నారు. సీబీఐతోగానీ లేదా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తోగానీ ఈ కేసు విచారణ జరిపించాలంటూ మృతుడి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారంటూ మీడియా ఆయన దృష్టికి తీసుకురాగా పై విధంగా స్పందించారు. ఇటీవల కోర్టుకు తరలిస్తున్న సమయంలో ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సంస్థ ఉగ్రవాది ఉస్మాని పరారైన ఘటనపై ప్రశ్నించగా ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశామన్నారు. కర్తవ్య నిర్వహణలో పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఉస్మాని పారిపోగలిగాడన్నారు. బేడీలు వేయరాదని, తాళ్లతో బంధించరాదనే నిబంధనలు పోలీసుల విధులకు ఆటంకంగా పరిణమించాయన్నారు. 12 మంది ఉగ్రవాదులు రాష్ర్టంలోకి ప్రవేశించినట్టు వార్తలొచ్చాయి కదా అని ప్రశ్నించగా అటువంటిదేమీ లేదన్నారు. గూఢచార విభాగం నుంచి ఇప్పటిదాకా 249 హెచ్చరికలొచ్చాయన్నారు. దీంతో దాడులను నిరోధించేందుకు మాల్స్, ఆలయాలు తదితర రద్దీ ప్రదేశాలను తమ శాఖ సిబ్బంది నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. గణేశ్ ఉత్సవాల సమయంలో లాల్బాగ్ చా రాజా మండపం వద్ద ఓ మహిళా కానిస్టేబుల్ తోపాటు మరో మహిళకు అవమానం జరగడంపై స్పందిస్తూ సీసీటీవీ కెమెరాలు నమోదుచేసిన దృశ్యాలను తమ శాఖ సిబ్బంది పరిశీలిస్తున్నారన్నారు. నిందితులపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక చట్టం కింద కేసులు ఇటీవలికాలంలో భవనాలు కూలిపోవడం, అనేకమంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలసిపోవడంపై మీడియా ప్రశ్నించగా సంబంధిత బిల్డర్లపై మహారాష్ర్ట వ్యవస్థీకృత నేరనిరోధక చట్టం (ఎంసీఏసీఏ) కింద కేసులు నమోదు చేస్తామన్నారు. వందన స్వీకారం మహారాష్ట్ర పోలీస్ అకాడమీ (ఎంపీఏ)కి చెందిన 108వ బ్యాచ్ శుక్రవారం ఇక్కడ నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్ పాల్గొన్న హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ పోలీసు క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ పరేడ్‌లో 75 మంది మహిళా సిబ్బందితోపాటు 1,544 పోలీసు క్యాడెట్లు పాల్గొన్నారు. -
‘రాజా’ మండలి సభ్యులపై కేసులు
సాక్షి, ముంబై: భక్తులతో అమర్యాదగా ప్రవర్తిస్తున్న లాల్బాగ్ చా రాజా గణేశ్ మండలి కార్యకర్తలపై కేసుల నమోదుకు హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ఆదేశించారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ మండలి సభ్యుల అనుచిత ప్రవర్తనతో మహిళా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భక్తుల కొంగుబంగారంగా నిలిచిన లాల్బాగ్ చా రాజా గణపతిని దర్శించుకునేందుకు రోజూ లక్షలాది మంది జనం వస్తున్నారు. ఇక్కడి కార్యక్రమాలు రోజంతా టీవీల్లో ప్రసారమవుతున్నాయి. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులతో ఆ మండలి కార్యకర్తలు దురుసుగా, అమర్యాదగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదే క్రమంలో ఒక మహిళపై మండలి సభ్యులు చేయిచేసుకుంటున్నట్లు ప్రసారమైన నేపథ్యంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి రాజా దర్శనానికి వెళ్లిన డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ అశోక్ సర్మలేతో సైతం మండలి సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. అతని చేయిపట్టుకుని పక్కకు నెట్టివేశారు. దీంతో ఆగ్రహించిన సర్మలే స్థానిక కాలా చౌకి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మనోజ్ మిశ్రా అనే కార్యకర్తను అరెస్టు చేశారు. కాగా అమర్యాదకర ప్రవర్తనకు నిరసనగా మహిళ భక్తులు లాల్బాగ్ చా రాజా ప్రధాన ప్రవేశ ద్వారంవద్ద మంగళవారం ఆందోళనకు దిగారు. దురుసుగా ప్రవర్తించిన కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. -
భత్కల్ కస్టడీ కోరతాం: పాటిల్
ముంబై: ఇండియన్ ముజాహిదీన్సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ అరెస్టు ఇంటెలిజెన్స్ సంస్థ భారీ విజయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ప్రశంసించారు. అయితే రాష్ట్రంలో ఉన్న ఎనిమిది వివిధ రకాల కేసుల్లో భత్కల్ను విచారించేందుకు ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) ఢిల్లీకి వెళుతుందన్నారు. అతడి కస్టడీని కోరతామని పాటిల్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీటిలో ముంబైలు ఉగ్రవాద దాడులతో పాటు పుణే జర్మనీ బేకరి పేలుళ్ల కేసులు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కేసుల్లో విచారించేందుకు కస్టడీని కోరే విధానాన్ని ఏటీఎస్ ఇప్పటికే ప్రారంభించిందన్నారు. గత ఐదేళ్ల నుంచి పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ టైస్ట్ల్లో ఒకడైన 30 ఏళ్ల భక్తల్‌ను ఉత్తర బీహార్‌లోని ఇండో-నేపాల్ సరిహద్దుల్లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 16న లష్కర్-ఏ-తోయిబా బాంబు నిపుణుడు అబ్దుల్ కమీర్ టుండాను అరెస్టు చేసిన తర్వాత ఇండియా ఇంటెలిజెన్స్ సంస్థలు సాధించిన రెండో భారీ విజయమని ఆయన ప్రశంసించారు. యాసిన్ భత్కల్‌తో పాటు అతని ముగ్గురు అనుచరుల వివరాలు తెలిపిన వారికి రూ.పది లక్షల రివార్డు ఇస్తామని ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.