దళితులకు రక్షణ కల్పించండి: ఆర్‌పీఐ | RPI seeks take actions to RR patil Preventing attacks on Dalits | Sakshi
Sakshi News home page

దళితులకు రక్షణ కల్పించండి: ఆర్‌పీఐ

Published Sat, Nov 23 2013 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM

RPI seeks take actions to RR patil Preventing attacks on Dalits

ముంబై: దళితులపై దాడుల నిరోధానికి తగు చర్యలు తీసుకోవాలని రిపబిక్లన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్‌ను కోరింది. ఈ మేరకు శుక్రవారం ఓ వినతిపత్రం సమర్పించింది. ఇటీవలి కాలంలో దళితులపై దాడులు అధికమయ్యాయని ఈ సందర్భంగా ఆర్‌పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వేధింపుల నిరోధక చట్టాన్ని తక్షణమే అమలు చేయాలన్నారు. ఇటువంటి కేసుల్లో నిందితులకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా చూడాలన్నారు. దళితులు బాధితులుగా మారినపుడు ఈ చట్టాన్ని వినియోగించాలన్నారు. ఇందుకు హోం మంత్రి స్పందిస్తూ ఇటువంటి కేసుల సంఖ్య పెరుగుతున్న మాట నిజమేనన్నారు. ఈ ఏడాది అక్టోబర్ దాకా 1,365 కేసులు నమోదయ్యాయన్నారు. ఔరంగాబాద్, నాగపూర్‌లలో రెండు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఉన్నాయన్నారు. అయినప్పటికీ మరో నాలుగు ఉండాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement