ఆర్ ఆర్ పాటిల్ మృతి
ముంబై: సీనియర్ ఎన్సీపీ నాయకుడు, మహారాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి ఆర్ ఆర్ పాటిల్(57) సోమవారం మరణించారు. కొంత కాలంగా నోటి కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. సాంగ్లీ జిల్లాలోని తాస్‌గావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన పాటిల్ నవంబర్ 26 తీవ్రవాద దాడుల సమయంలో మహారాష్ట్ర హోం మంత్రిగా ఉన్నారు. స్వగ్రామం అంజనిలో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన అంత్యక్రియలు జరపనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. పాటిల్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు.