ఎన్నికల తరువాత రేప్ చేయాల్సింది!
ముంబై: లైంగిక అత్యాచారంపై మహారాష్ట్ర మాజీ హోం మంత్రి ఆర్‌ఆర్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) అభ్యర్థి అత్యాచార ఆరోపణలపై జైల్లో ఉన్న నేపథ్యంలో పాటిల్ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం చేలరేగింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న తనకు మద్దతు ఇవ్వడానికి ఎమ్మెన్నెస్ సిద్ధమైందని, అత్యాచారం కేసులో తమ అభ్యర్థి జైలులో ఉంటున్నందునే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఎమ్మెన్నెస్ నేతలు చెప్పారని పాటిల్ తెలిపారు. అయితే అతను ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యే కాదలుచుకున్నపుడు ఎన్నికల తర్వాతే అత్యాచారం చేసి ఉండవచ్చు కదా! అని తాను చెప్పానంటూ’ని పాటిల్ సెలవిచ్చారు.
శనివారం సంగ్లీలో పార్టీ మదతుదార్ల సమావేశంలో పాటిల్ బాహాటంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో మహిళా సంఘాలు మండిపడటంతో ఆయన కాస్త దిగివచ్చారు. ఆ వ్యాఖ్యలు వ్యక్తిని విమర్శిస్తూ చేసినవని, ఇందులో మహిళలు ఉద్దేశించి తానేమి చేయలేదన్నారు. ఒకవేళ మహిళల మనో్భావాలు కించపరిచేలా ఉంటే తాను క్షమాపణలు చెబుతానని పాటిల్ తెలిపారు. ఇదిలా ఉండగా ఆయనకు ప్రజాజీవితంలో ఉండే అర్హతేలేదని, ఎన్నికల్లో ఓడించాలని బీజేపీ నేత షైనా ఎన్సీ విమర్శించలు గుప్పించారు.