మహారాష్ట్రలో రైలు ప్రమాదం, 18 మంది మృతి! | Maharashtra train derailment kills 18 | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో రైలు ప్రమాదం, 18 మంది మృతి!

Published Sun, May 4 2014 4:41 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

మహారాష్ట్రలో రైలు ప్రమాదం, 18 మంది మృతి! - Sakshi

మహారాష్ట్రలో రైలు ప్రమాదం, 18 మంది మృతి!

రాయగడ్: మహారాష్ట్ర లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 18 మంది ప్రయాణీకులు మరణించగా, మరో 60 మంది గాయపడినట్టు తెలుస్తోంది. ఇంజన్ తోపాటు, నాలుగు బోగిలు పట్టాలు ఆదివారం తప్పాయని, ఈ విషాద ఘటనలో 18 మంది చనిపోయారని కేంద్రమంత్రి ఆర్ఆర్ పాటిల్ మీడియాకు తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రమాదం సంభవించిందని పాటిల్ తెలిపారు.
 
మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి 50 వేలు, పాక్షికంగా గాయపడిన వారికి 10 వేల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ఇస్తుందన్నారు. దక్షిణ ముంబైకి 100 కిలో మీటర్ల రూరంలో నాగోథేన్ సమీపంలో ఆదివారం ఉదయం 9.40 గంటలకు దివ-సవంత్వాడి రైలు పట్టాలు తప్పింది. గాయపడిన వారిని నాగోథేన్, రాయ్ గడ్ జిల్లాలోని రోహా లకు తరలించి చికిత్సనందిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement