గూడ్స్‌ ట్రైన్‌ను ఢీకొట్టి పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌..50 మందికి గాయాలు! | Train Derails After Collision With Goods Train In Maharashtra | Sakshi
Sakshi News home page

గూడ్స్‌ ట్రైన్‌ను ఢీకొట్టి పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌ రైలు.. 50మందికి గాయాలు!

Published Wed, Aug 17 2022 10:49 AM | Last Updated on Wed, Aug 17 2022 10:49 AM

Train Derails After Collision With Goods Train In Maharashtra - Sakshi

ముంబై: గూడ్స్‌ రైలును వెనకనుంచి ఢీకొట్టిన ఓ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 50మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. అయితే, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి రాజస్థాన్‌ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ మూడు బోగీలు పట్టాలు తప్పినట్లు చెప్పారు. 

గోండియా, గుధ్మా రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం రాత్రి 1.20 గంటల ప్రాంతంలో గూడ్స్‌ రైలును ఢీకొట్టినట్లు సౌత్‌ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు తెలిపారు. ‘ ప్రాథమిక ఆధారాల ప్రకారం భగత్‌ కి కోథి ఎస్‌ఎఫ్‌ ఎక్స్‌ప్రెస్‌(20843) లోకో పైలట్‌ రైలును నియంత్రించలేకపోయాడు. దాంతో ముందు నిలిపి ఉంచిన గూడ్స్‌ ట్రైన్‌ను ఢీకొట్టింది. దాంతో ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. కొందిరికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. ఓ ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించారు.’ అని తెలిపారు. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే మెడికల్‌ రిలీఫ్‌ ట్రైన్‌, రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే పునరుద్ధరణ పనులు పూర్తి చేసి రైలును అక్కడి నుంచి పంపించారు.

ఇదీ చదవండి: రూ.500 కోసం హత్య.. తల నరికి చేతిలో పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement