derailed
-
పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్
-
పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్
కాన్పూర్/న్యూఢిల్లీ: వారణాసి– అహ్మదాబాద్ మధ్య నడిచే సబర్మతి ఎక్స్‌ప్రెస్ శనివారం యూపీలో పట్టాలు తప్పింది. పట్టాలపైనున్న ఒక వస్తువు రైలింజిన్‌ను బలంగా తాకడంతో 20 బోగీలు పట్టాలు తప్పాయి. కాన్పూర్–భీమ్సేన్ రైల్వే స్టేషన్ల మధ్య తెల్లవారు జామున 2.35 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్ద శబ్దంతో బోగీలు ఊగుతూ, రైలు నిలిచిపోవడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులంతా ఉలిక్కిపడి లేచారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి అపాయం వాటిల్లలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఘటన అనంతరం ప్రయాణికులందరినీ బస్సుల్లో కాన్పూర్ రైల్వే స్టేషన్‌కు, అక్కడికి నుంచి వేరే రైళ్లలో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు. కుట్ర కోణంలో దర్యాప్తు‘రైలు పట్టాలపైనున్న ఓ వస్తువు ఇంజిన్‌ను తాకినట్లు ఆనవాళ్లున్నాయి. అన్ని ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు. యూపీ పోలీసులతోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు’అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘బండరాయి వంటిదేదో గట్టిగా గుద్దుకోవడంతో ఇంజిన్ ముందు భాగం తీవ్రంగా దెబ్బతిని, వంగిపోయినట్లు లోకో పైలట్ చెబుతున్నారు. 16వ బోగీ సమీపంలో మాకు దొరికిన వస్తువే ఇంజిన్ దెబ్బతినేందుకు కారణమై ఉండొచ్చు. ఇది సంఘ వ్యతిరేక శక్తుల పని’గా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
Madhya Pradesh: పట్టాలు తప్పిన గూడ్సు రైలు
మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కత్నీ నుంచి సాగర్‌కు వెళుతున్న బొగ్గుతో కూడిన గూడ్సు రైలు దామోహ్ జిల్లాలోని పఠారియా సమీపంలో పట్టాలు తప్పింది. ఈ గూడ్సు రైలులోని ఏడు వ్యాగన్లు ట్రాక్‌పై బోల్తా పడ్డాయి.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాద ఘటనలో ట్రాక్‌లు, స్లీపర్లు, ఓహెచ్ఈ కేబుల్స్ దెబ్బతినడంతోపాటు సాగర్, దామోహ్, కట్ని మార్గాల్లో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గూడ్సు రైలు కోచ్‌ల చక్రాలు విడిపోయి, ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడిపోవడంతో వ్యాగన్లలోని బొగ్గంతా నేలపాలయ్యింది. అర కిలోమీటరు పొడవునా పదుల సంఖ్యలో రైలు స్తంభాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. Breaking News: Goods train loaded with coal derailed in Damoh, MP;- Darbhanga Express narrowly escapes accident. pic.twitter.com/TFP4DVPnBm— زماں (@Delhiite_) August 14, 2024 -
Gujarat: పట్టాలు తప్పిన గూడ్సు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
గుజరాత్‌లోని వల్సాద్‌లో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగపోయినా, ఈ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ప్రయాణికులు పలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.గూడ్స్ రైలు సూరత్ వైపు వెళుతుండగా ముంబై-అహ్మదాబాద్ ట్రంక్ మార్గంలో డుంగ్రీ స్టేషన్ సమీపంలో బోగీ ఒకటి అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. అయితే రైలు వేగం ఎక్కువగా లేకపోవడంతో బోగీ బోల్తా పడలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు పట్టాలు తప్పిన కోచ్‌ను ట్రాక్‌పై నుంచి తొలగించి, రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చూశారు. ఘటన ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.ఇటీవలికాలంలో రైలు బోగీలు పట్టాలు తప్పుతున్న కేసులు పెరుగుతుండడంతో రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈశాన్య రైల్వేలోని బారాబంకి-గోరఖ్‌పూర్ జోన్‌లోని మోతీగంజ్-జిలాహి స్టేషన్ల మధ్య చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఎనిమిది బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన పలువురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. BIG BREAKING 🚨⚡Another Day, Another Train Accident as one more goods train derailed in Valsad, Gujarat todayAnother PR opportunity for that shameless Reel Minister 👏 pic.twitter.com/Gyfde5JQvb— Ankit Mayank (@mr_mayank) July 19, 2024 -
Video: రైలు ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న ప్రయాణికుడు
ఉత్తరప్రదేశ్‌లో గురువారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గోండా జిల్లాలోని ఝిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్‌కి వెళ్తున్న చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. రైలు పట్టాలు తప్పడంతో.. నాలుగు ఏసీ బోగీలు బోల్తా కొట్టాయి.ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. అనేకమంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 40 మంది సభ్యుల వైద్య బృందం, 15 అంబులెన్స్‌లు సంఘటనా స్థలంలో ఉన్నాయి.కాగా రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఓ ప్రయాణికుడు తృటిలో ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ మేరకు సంఘటనా స్థలం నుంచే వీడియో రికార్డు చేసి సోషల్ మిడియాలో పోస్టు చేశాడు. ట్రాక్ నుంచి పక్కకు పడిన నాలుగు ఏసీ కోచ్‌ల పక్కన నిలబడి.. తాను తృటిలో ప్రమాదం నుంచి ప్రాణాలతో తప్పించుకున్నట్లు తెలిపాడు. "నేను జీవించి ఉండటం ఒక అద్భుతం. దయచేసి నా గురించి చింతించకండి. నేను సురక్షితంగా ఉన్నాను. అని పేర్కొన్నాడు. వీడియోలో అతని వెనుక ఇతర ప్రయాణికులు అరుస్తూ, ఏడుస్తూ ఉండటం కనిపిస్తుంది.Gonda Train Accident: At least 10 coaches of the #DibrugarhExpress derailed in #UttarPradesh's #Gonda. The train was going from #Chandigarh to #Assam's #Dibrugarh. There is no information on casualties as of now.#TrainAcciden #UPTrainAccident #ChandigarhDibrugarhExpress pic.twitter.com/PgBFhXvUMT— Hate Detector 🔍 (@HateDetectors) July 18, 2024 -
నల్గొండ జిల్లా: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల నిలిపివేత
సాక్షి, నల్గొండ జిల్లా: దామచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో వస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్ మిర్యాలగూడలో, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు పిడుగురాళ్లలో నిలిపివేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నారు. -
పట్టాలు తప్పిన సబర్మతి రైలు
జైపూర్: రాజస్థాన్‌లో సబర్మతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. గూడ్స్ రైలును ఢీకొట్టిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. అజ్మీర్‌లోని మడర్ రైల్వేస్టేషన్లో సోమవారం తెల్లవారుజామున ఒంటి గంటకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సబర్మతి రైలులోని పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. #WATCH | Rajasthan: Four coaches including the engine of a passenger train travelling from Sabarmati-Agra Cantt derailed near Ajmer. Further details awaited. pic.twitter.com/fX9VeLKw2e — ANI (@ANI) March 18, 2024 సబర్మతి సూపర్‌ఫాస్ట్ డ్రైవర్ అత్యవసర బ్రేకులు వేసి రైలును ఆపడానికి ప్రయత్నించినప్పటికీ అది గూడ్స్ రైలును ఢీ కొట్టింది. ఈ ఘటనపై నార్త్ వెస్టర్న్ రైల్వే ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేసింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. ప్రమాదానికి సంబంధించి వివరాల కోసం హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇదీ చదవండి.. కుప్పకూలిన ఐదంతస్తుల భవనం -
Odisha Train Accident: ప్రమాదానికి కారణం ఏంటో చెప్పిన రైల్వే శాఖ
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన భీకర రైళ్ల ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 280కు చేరింది. బెంగళూరు- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 900 మంది గాయపడ్డారు. అయితే ఈ దుర్ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటివరకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కానీ ప్రమాదానికి సిగ్నల్ ఫెయిల్యూరే కారణమని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఒడిశా రైలు ప్రమాదంపై ప్రాథమిక నివేదికను నిపుణుల బృందం రైల్వే శాఖకు అందించింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్లోకి తప్పుగా వెళ్లడమే ప్రమాదానికి కారణమని ఈ నివేదికలో వెల్లడైంది. సిగ్నల్ ఫెయిల్యూర్ కారణంగానే ప్రమాదం చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్ లభించకపోవడంతో ప్రమాదం జరిగిందని తేలింది. మొదట సిగ్నల్ ఇచ్చినా ఆ తరువాత దానిని ఆపేశారని, దీంతో కోరమండల్ రాంగ్ ట్రాక్‌పైకి వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది. మెయిన్‌లైన్ బదులు లూప్లైన్లోకి వెళ్లడంతో.. లూప్లైన్లో ఉన్న గూడ్స్‌ను రైలును కోరమాండల్ ఢీకొట్టి పట్టాలు తప్పిందని నిపుణుల బృందం తేల్చింది. దీని బోగీలు పక్క ట్రాక్‌పైన పడగా.. అదే సమయంలో ఆ ట్రాక్‌పైకి వచ్చిన బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ వీటిని ఢీకొట్టింది. దీంతో ఈ రైలు బోగీలు కూడా పట్టాలు తప్పాయని అని రైల్వే శాఖ తమ నివేదికలో వెల్లడించింది. కాగా శుక్రవారం ఒడిశా బాలాసోర్ వద్ద ప్రమాదానికి గురై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘటన పెను విషాదానికి కారణమైన విషయం తెలిసిందే. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ముగిసిన సహాయక చర్యలు : రైల్వే శాఖ ఒడిశా రైలు ప్రమాదంలో సహాయక చర్యలు పూర్తయినట్లు రైల్వే శాఖ ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు మొదలుపెట్టినట్లు పేర్కొన్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ప్రమాదం జరిగిన బాలాసోర్ మార్గంలో కవచ్ వ్యవస్థ లేదని ఆయన తెలిపారు. దాని వల్లే ప్రమాదం తీవ్రత అధికంగా మారిందని పేర్కొన్నారు. ఆ రూట్లో కవచ్ సిస్టమ్ లేదు ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని, ఇక రైల్వే లైన్ పునరుద్దరణ పనులు మొదలుపెడుతున్నామని, ప్రమాదం జరిగిన రూట్లో కవచ్ రక్షణ వ్యవస్థ లేదని తెలిపారు. కాగా రైలు ప్రమాదాలను నివారించేందుకు దేశవ్యాప్తంగా కవచ్ వ్యవస్థను భారత రైల్వేశాఖ డెవలప్ చేస్తోంది. కవచ్ అనేది ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. దీనిని మూడు భారతీయ సంస్థలతో కలిసి రిసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్స్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. సమయానికి బ్రేక్ వేయడంలో డ్రైవర్ ఫెయిల్ అయితే కవచ్ సిస్టమర్ రైలు వేగాన్ని ఆటోమెటిక్‌గా నియంత్రిస్తుంది. Drone footage of #TrainAccident #CoromandelExpress pic.twitter.com/XCSnJJ0Tcg — Rail Vandi (@rail_vandi) June 3, 2023 Scary Visuals of Balasore Train Accident.. ☺️☺️ . .#TrainAccident #CoromandelExpress #CoromandelExpressAccident #BalasoreTrainAccident #tupaki #Odisha @tupakinews_ pic.twitter.com/mnfCCTqdhA — Tupaki (@tupakinews_) June 3, 2023 -
తీవ్ర విషాదం.. పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
ఇటీవలే గ్రీస్ దేశంలో జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 50కిపైగా మందికి మృతిచెందిన ఘటన మరువక ముందే మరో విషాదం నెలకొంది. ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ప్రమాద ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో 16 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఈజిప్టు దేశంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఈజిప్టులోని కైరో నగరంలో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కాగా, నైలు డెల్టాలోని మెనోఫ్ నగరానికి వెళ్లే మార్గంలో కల్యుబ్ నగరంలోని స్టేషన్ మీదుగా ప్రయాణిస్తుండగా ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరకుని గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ రైలు ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించినట్టు వెల్లడించారు. AFP: Two people were killed and several others injured Tuesday in a #train_accident north of #Cairo, #Egypt's #health_ministry said. A ministry statement said there were "two dead in the train accident at #Qalyub, while the injured are in a stable condition." pic.twitter.com/ILBz8R0xs4 — Usama Farag (@VOAFarag) March 7, 2023 -
భద్రతకు భరోసా.. ఐసీఎఫ్, ఎల్‌హెచ్‌బీ రైలు బోగీల మధ్య ప్రధాన తేడాలివే...
2017 జనవరి: ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తున్న హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఏపీలోని విజయనగరం సమీపంలో పట్టాలు తప్పింది. కోచ్‌లు చెల్లాచెదురై ఒకదానిపైకి ఒకటి చొచ్చుకెళ్లాయి. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 2023 ఫిబ్రవరి 15: విశాఖపట్నం నుంచి వస్తున్న గోదావరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మరికాసేపట్లో సికింద్రాబాద్ చేరుకుంటుందనగా బీబీనగర్ సమీపంలోని అంకుషాపూర్ వద్ద పట్టాలు తప్పింది. ఆరు కోచ్‌లు పక్కకు ఒరిగినా ఒకదానిపైకి ఒకటి మాత్రం దూసుకెళ్లలేదు. ఫలితంగా ప్రాణనష్టం లేకుండానే ప్రయాణికులు బయటపడ్డారు. ఈ రెండు దుర్ఘటనల్లో ఉన్న తేడా.. తొలి ప్రమాదంలో సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌లు ఉన్నాయి, రెండో ప్రమాదానికి గురైన గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు జర్మనీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను వినియోగించారు. ఈ మార్పే ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. సాక్షి, హైదరాబాద్: బీబీ నగర్ సమీపంలో బుధవారం ఉదయం గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ప్రమాదంలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ప్రయాణికుల ప్రాణాలు కాపాడాయి. ప్రమాద సమయంలో రైలు దాదాపు 80 కి.మీ. వేగంతో వెళ్తున్నప్పటికీ ప్రయాణికులకు పెద్దగా గాయాలు కూడా కాకపోవడం విశేషం. దాదాపు నాలుగేళ్ల క్రితం ఈ రైలుకు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ మార్పే ప్రయాణికులకు వరంగా మారింది. జర్మనీ పరిజ్ఞానంతో... భారతీయ రైల్వే దశాబ్దాలుగా తమిళనాడులోని పెరంబూర్‌లో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో ఉత్పత్తి చేస్తున్న బోగీలను వినియోగిస్తూ వస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడు అవి ప్రయాణికులపాలిట మృత్యులోగిళ్లుగా మారుతున్నాయి. దీంతో వాటిని కాకుండా, జర్మనీ పరిజ్ఞానంతో రూపొందే లింక్ హాఫ్మాన్బుష్ (ఎల్‌హెచ్‌బీ) బోగీలను వినియోగించాలని నిర్ణయించి మారుస్తోంది. ఈ మార్పు జరిగిన రైళ్లు ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలుగుతున్నారు. దీంతో ఇవి సత్ఫలితాలనిస్తున్నట్టు గుర్తించిన రైల్వే, వీలైనంత వేగంగా అన్ని రైళ్లకు వాటినే వాడాలని నిర్ణయించింది. ఇప్పటికే ఐసీఎఫ్ కోచ్ తయారీని నిలిపేసింది. అన్ని కోచ్ ఫ్యాక్టరీలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను తయారు చేస్తోంది. ఐసీఎఫ్, ఎల్‌హెచ్‌బీ బోగీల మధ్య ప్రధాన తేడాలివే... ►ఈ బోగీలలో డ్యూయల్ బఫర్ హుక్ కప్లర్స్ ఉంటాయి. బోగీకి, బోగీకి మధ్య ఇవే అనుసంధానంగా ఉంటాయి. ►రైలు ప్రమాదాలు జరిగినప్పుడు బోగీలు పరస్పరం ఢీకొని ఒకదానిపైకి ఒకటి దూసుకుపోతున్నాయి. దీంతో భారీ ప్రాణనష్టం సంభవిస్తోంది. రైలు ప్రమాద మరణాల్లో 90 శాతం వీటి వల్లే జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ►ఈ బోగీల గరిష్ట వేగ పరిమితి గంటకు 120 కి.మీ. మాత్రమే. కానీ చాలా రైళ్లను గరిష్టంగా 110 కి.మీ. వేగంతోనే నడుపుతున్నారు. అంతకంటే ఎక్కువ వేగంతో వెళ్తే బోగీలు ఊగిపోతూ భారీ శబ్దం చేస్తాయి. ►వీటిలో స్ప్రింగ్ సస్పెన్షన్ విధానం ఉంటుంది. రైలు వేగంగా ప్రయాణించినప్పుడు బోగీలు ఊయల లాగా ఊగకుండా ఈ విధానం నిరోధించలేకపోతోంది. ►ఇందులో సాధారణ ఎయిర్ బ్రేక్ విధానం ఉంటుంది. బ్రేక్ వేశాక వెంటనే నిలిచిపోతే బోగీలు పట్టాలు తప్పే ప్రమాదముంది. దీంతో బ్రేక్ వేశాక రైలు చాలా దూరం ముందుకెళ్లి ఆగుతుంది. ►స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందే ఈ కోచ్‌లలో ఏసీ బోగీకి రూ. కోటిన్నర, స్లీపర్ బోగీకి రూ. 85 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ►ఒక్కో కోచ్‌లో 64 మంది ప్రయాణికులు వెళ్లేలా సీటింగ్ ఉంది. ►ఈ బోగీలకు సెంటర్ బఫర్ కప్లర్లుంటాయి. ►ప్రమాదాలు జరిగినప్పుడు బోగీలు పక్కకు పడిపోతాయి తప్ప ఒకదానిపై ఒకటి దూసుకుపోవు. ►బోగీలు 200 కి.మీ. వేగాన్ని సైతం తట్టుకొనేలా ఉంటాయి. కానీ వాటిని ప్రస్తుతం 160 కి.మీ. వేగానికి పరిమితం చేశారు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల బరువు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ వేగంతో పరుగుపెట్టేందుకు వీలుంటుంది. కుదుపులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ►వీటిల్లో ఎయిర్ కుషన్ సస్పెన్షన్వ్యవస్థ ఉంటుంది. రైలు వేగంగా వెళ్లినా పెద్దగా కుదుపులు ఉండవు. ►బోగీలకు డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. దీనివల్ల రైలు కాసేపటికే ఆగినా బోగీలు పట్టాలు తప్పే ప్రమాదముండదు. ►మైల్డ్ స్టీల్‌తో రూపొందే ఏసీ కోచ్‌లు రూ.2.5 కోట్లు, స్లీపర్ అయితే రూ. కోటిన్నర వరకు ఖర్చవుతోంది. ►ఐసీఎఫ్ కంటే 2 మీటర్ల ఎక్కువ పొడవు ఉండే ఎల్‌హెచ్‌బీ బోగీలో 72 మంది ప్రయాణించవచ్చు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో 1,428 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు దక్షిణమధ్య రైల్వే పరిధిలో ఇప్పటివరకు 43 ఎక్స్‌ప్రెస్‌లకు సంబంధించి 68 రేక్స్‌కు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఏర్పాటు చేశారు. గతేడాది మార్చి నాటికి ఈ సంఖ్య 53గా ఉండగా ఏడాది కాలంలో అదనంగా మరో 15 రేక్స్‌కు వాటి ఏర్పాటు పూర్తయింది. వెరసి ఇప్పటివరకు 1,428 కోచ్‌లను బదలాయించి సంప్రదాయ ఐసీఎఫ్ నుంచి ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఏర్పాటు చేయగలిగారు. అయితే ఇంకా 150 రైళ్లకు మార్చాల్సి ఉంది. ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల తయారీ మరింత ఊపందుకుంటే తప్ప వాటి బదలాయింపులో వేగం పుంజుకోదు. -
పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్.. ‘ఎల్‌హెచ్‌బీ టెక్నాలజీతో రైలు పల్టీ కొట్టే అవకాశం ఉండదు’
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలోని అంకుషాపూర్ సమీపంలో ఈ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైలులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదమేమీ లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. అంకుషాపూర్‌లోని రైలు ప్రమాద స్థలాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. బుధవారం ఉదయం 6.15 నిమిషాల సమయంలో రైలు పట్టాలు తప్పినట్టుగా తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. 16 పైగా బోగిలతో విశాఖ నుంచి హైదరాబాద్‌కు గోదావరి ఎక్స్‌ప్రెస్ బయల్దేరిందని, అందులోని ఆరో బోగీలు పట్టాలు తప్పినట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని అన్నారు. రైలులోని వారిని ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేర్చినట్లు వెల్లడించారు. హెల్ప్‌లైన్ నెంబర్ (040 27786666) ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని, రాత్రి వరకు ట్రాక్ పునరుద్దరణ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. దెబ్బ తిన్న పట్టాలు, సిమెంట్ దిమ్మెల తొలగింపు కొనసాగుతోందని.. సుమారు 400 మంది రైల్వే సిబ్బంది మరమత్తు చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. Train No.12727 (Visakhapatnam - Secunderabad) Godavari Express got derailed btw Bibinagar - Ghatkesar. *6 coaches derailed:* S1 to S4, GS, SLR *No casualties/Injuries* Passengers are being cleared by the same train by detaching the derailed coaches. Helpline No: 040 27786666 pic.twitter.com/YuBIln1BgK — South Central Railway (@SCRailwayIndia) February 15, 2023 ‘గోదావరి ఎక్స్‌ప్రెస్ భోగిలన్నీ జర్మనీకి చెందిన ఎల్‌హెచ్‌బీ(లింకే-హాఫ్మన్-బుష్) బోగిలే. ఒక ఎల్ఎహెచ్బీ కోచ్ కాలపరిమితి 35 ఏళ్లు. కరంబూర్ చెన్నై రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ఇవి ఉత్పత్తి అవుతాయి. ఎల్‌హెచ్‌బీ టెక్నాలజీతో రైలు పల్టీ కొట్టే అవకాశం ఉండదు. స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం స్టీల్‌తో కోచ్‌ల తయారీ అవుతాయి. 2020 నుంచి ఈ టెక్నాలజీ కోచ్‌లను తయారు చేయిస్తున్నాం. ఈ టెక్నాలజీనే అతిపెద్ద ప్రమాదం నుంచి కాపాడింది. ఎలాంటి ప్రమాదం జరిగినా.. ఏ కోచ్‌కు ఆ కోచ్ విడిపోతాయి. ఒక బోగీతో, మరో బోగీకి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల బోగీలు పక్కకు జరగవు. ఎల్‌హెచ్‌బీ కోచ్ వల్లే ప్రమాద తీవ్రత తగ్గింది. రైలు ఎంత స్పీడ్‌లో ఉన్నా.. ఆటోమేటిక్ బ్రేక్ సిస్టం ఆధునాతనంగా ఉంటుంది. ఎయిర్ డిస్క్ బ్రేక్ సిస్టమ్ ద్వారా బోగీలు ఢీ కొనడం లాంటివి, స్లయిడ్ అవ్వకుండా ఆపగలుగుతుంది.’ అని తెలిపారు. -
బీబీనగర్ వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్
-
పట్టాలు తప్పిన ముంబై-జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ రైలు 8 స్లీపర్ క్లాస్ బోగీలు పట్టాలు తప్పాయి. జోధ్‌పూర్ డివిజన్ రాజ్‌కియవాస్-బొమద్రా సెక్షన్ పరిధిలోని పాలీ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున 3.27 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. రైలు ముంబై నుంచి జోధ్‌పుర్‌కు వెళ్తున్న క్రమంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది వాయవ్య రైల్వే. యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు పేర్కొంది. ‘సంఘటనా స్థలానికి ఉన్నతాధికారులు వెళ్తున్నారు. వాయవ్య రైల్వే జనరల్ మేనేజర్, ఇతర ఉన్నతాధికారులు జైపూర్‌లోని కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.’అని తెలిపారు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వెల్లడించారు.సంఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. పలు రైళ్లను దారి మళ్లించారు. ఈ క్రమంలోనే హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది వాయవ్య రైల్వే. జోధ్‌పుర్ 0291- 2654979(1072) 0291- 2654993(1072) 0291- 2624125 0291- 2431646 పాలి మర్వార్ 0293- 2250324 138 1072 "Within 5 minutes of departing from Marwar junction, a vibration sound was heard inside the train & after 2-3 minutes, the train stopped. We got down & saw that at least 8 sleeper class coaches were off the tracks. Within 15-20 minutes, ambulances arrived," says a passenger pic.twitter.com/aCDjmZEFyq — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) January 2, 2023 ఇదీ చదవండి: కశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు పౌరులు మృతి -
గూడ్స్ ట్రైన్‌ను ఢీకొట్టి పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్..50 మందికి గాయాలు!
ముంబై: గూడ్స్ రైలును వెనకనుంచి ఢీకొట్టిన ఓ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 50మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. అయితే, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నుంచి రాజస్థాన్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మూడు బోగీలు పట్టాలు తప్పినట్లు చెప్పారు. గోండియా, గుధ్మా రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం రాత్రి 1.20 గంటల ప్రాంతంలో గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు సౌత్ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ‘ ప్రాథమిక ఆధారాల ప్రకారం భగత్ కి కోథి ఎస్ఎఫ్ ఎక్స్‌ప్రెస్(20843) లోకో పైలట్ రైలును నియంత్రించలేకపోయాడు. దాంతో ముందు నిలిపి ఉంచిన గూడ్స్ ట్రైన్‌ను ఢీకొట్టింది. దాంతో ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. కొందిరికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. ఓ ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించారు.’ అని తెలిపారు. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే మెడికల్ రిలీఫ్ ట్రైన్, రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే పునరుద్ధరణ పనులు పూర్తి చేసి రైలును అక్కడి నుంచి పంపించారు. ఇదీ చదవండి: రూ.500 కోసం హత్య.. తల నరికి చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు..! -
వరంగల్ జిల్లా: చెరువు కట్టపై నుంచి ట్రాక్టర్ బోల్తా
-
వరంగల్: చెరువు కట్ట నుంచి ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురి దుర్మరణం
సాక్షి, వరంగల్: జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఖానాపూర్ మండలం అశోక్ నగర్ దగ్గర చెరువు కట్టపై నుంచి కొంతమందితో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందడంతో మృతుల సంఖ్య ఐదుకి చేరింది. పెళ్లి సామాగ్రి కోసం వాళ్లంతా నర్సంపేట ట్రాక్టర్లో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రుల్ని నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులు గుగులోతు సీతమ్మ(32), జాట్టోతు బిచ్య(45), గుగులోత్ స్వామి(55),గోవింద్(35) గూగులోతు శాంతమ్మ(45)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు అదనపు సమాచారం అందించాల్సి ఉంది. -
బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఆరు బోగీలు
-
బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం
Bikaner Guwahati ExpressTrain Accident:పశ్చిమబెంగాల్లో బికనీర్–గువాహటి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 12 బోగీలు పట్టాలు తప్పడంతో ఐదుగురు మరణించారు. ఈ ప్రమాదంలో కొన్ని బోగీలు బోల్తాపడ్డాయి. ఈ దుర్ఘటనలో 45 మందికి పైగా గాయపడ్డారు. జల్పాయ్గురి జిల్లాలోని దోమోహని సమీపంలో గురువారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొందరు ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. భారీగా మంచు కురుస్తున్నా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెంగాల్లో రైలు దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తంచేశారు. చదవండి: యూపీలో బీజేపీకి భారీ షాక్.. పార్టీని వీడిన మూడో మంత్రి -
పట్టాలు తప్పిన గూడ్సు
భువనేశ్వర్: ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని అంగుల్–తాల్చేరు సెక్షన్‌లోని 167/1–2 కిలోమీటరు ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి 2.35 గంటలకు గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఫిరోజ్‌పూర్ నుంచి ఖుర్దారోడ్డుకు గోధుమలు రవాణా చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సరిగ్గా వంతెనపై జరిగిన ఈ దుర్ఘటనలో 9 వ్యాగన్లు పలీ్టకొట్టి ఒకదానిపై మరొకటి పేరుకుపోగా, ఇంజిన్ పట్టాలపైనే ఉండటంతో లోకో పైలట్, ఇతర సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో ఢెంకనాల్–సంబల్పూర్ సెక్షన్ మధ్య రైలు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 12 రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైల్వే సేవలను పాక్షికంగా రద్దు చేసి, దారి మళ్లించి, నడిపిస్తున్నారు. చురుగ్గా పునరుద్ధరణ పనులు.. ఖుర్దారోడ్డు డివిజన్ డీఆర్ఎమ్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల బృందం ఘటనా స్థలం సందర్శించింది. దుర్ఘటనకు సంబంధించిన పరిస్థితులు, కారణాలను బృందం పరిశీలిస్తోంది. కుండపోత వర్షాలతో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వరద నీరు ఉధృతికి వంతెన ఇరువైపుల భాగాలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం సంబల్పూర్ నుంచి క్రేన్‌ని తెప్పించి, వ్యాగన్ల పునరుద్ధరణ చేపడుతున్నారు. ప్రయాణికులకు ఆహారం సరఫరా.. ఈ ప్రమాదం దృష్ట్యా మధ్యలో నిలిచిపోయిన బికనీర్–పూరీ స్పెషల్ రైలు, దుర్గ్–పూరీ స్పెషల్ రైలులోని ప్రయాణికులకు సంబల్పూర్ రైల్వే డివిజన్ కేకులు, బిస్కెట్లు, టీ, తాగునీరు సరఫరా చేసింది. టిట్లాగడ్ రైల్వే స్టేషనులో దుర్గ్–పూరీ స్పెషల్, హతియా–పూరీ స్పెషల్, ఎల్టీటీ– పూరీ స్పెషల్ రైలు ప్రయాణికులకు మధ్యాహ్నం భోజనం ప్యాకెట్లను కూడా రైల్వే సరఫరా చేసింది. -
పట్టాలు తప్పిన కేరళ ఎక్స్‌ప్రెస్
సాక్షి, చిత్తూరు : ఢిల్లీ నుంచి త్రివేండ్రం వెళ్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం జిల్లాలోని ఏర్పేడు వద్ద పట్టాలు తప్పింది. ఎనిమిది బోగీలు పట్టాలు తప్పగా, ప్రయాణీకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రేణిగుంట రైల్వే అధికారులు ప్రమాదం గురించి తెలుసుకొని ఇతర అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సంఘటనతో ఆమార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు
సాక్షి, కర్నూలు : చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కర్నూలు రైల్వే స్టేషన్లో రైలింజన్ పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం తెల్లవారు జామున 2:30 గంటలకు ఈ ఘటన జరిగింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ఇటీవల అదే ప్రాంతంలో గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పడం గమనార్హం. -
డ్రైవర్ లేని రైలు.. చివరికేమైందో తెలుసా?
సిడ్నీ : ఇనుప ఖనిజాన్ని మోసుకెళ్తున్న ఓ భారీ గూడ్స్ రైలు బండి పట్టాలు తప్పింది. మైనింగ్ దిగ్గజం బీహెచ్పీ కంపెనీకి చెందిన గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండా దాదాపు గంటసేపు ప్రయాణించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. బీహెచ్పీకి చెందిన 268 - వాగన్ రైలు ఇనుప ఖనిజాన్ని మోసుకుని పశ్చిమ ఆస్ట్రేలియాలోని పోర్ట్ హెడ్‌ల్యాండ్‌కు ప్రయాణం ప్రారంభించింది. ప్రయాణం మధ్యలో తనిఖీ చేయడం కోసం డ్రైవర్ తన క్యాబిన్ నుంచి దిగాడు. ఈ సమయంలో రైలు ఆటోమెటిగ్గా పట్టాలు తప్పి.. గంట సేపు దాదాపు 110 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు కానీ కొన్ని రైళ్లు, 1,500 మీటర్ల పొడవైన రైల్వే ట్రాక్ దెబ్బతిన్నదని సమాచారం. ప్రస్తుతం బీహెచ్పీ సిబ్బంది ఈ ట్రాక్‌ను బాగు చేసే పనిలో ఉన్నారు. -
తైవాన్‌లో రైలు ప్రమాదం.. 22 మంది మృతి
ఇలాన్ (తైవాన్) : తైవాన్‌లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. తైతుంగ్ నగరానికి వెళ్తున్న పుయ్‌మా ఎక్స్‌ప్రెస్ ఇలాన్ కౌంటీలోని జిన్మా స్టేషన్ వద్దకు రాగానే పట్టాలు తప్పింది. దీంతో రైలులోని 8 బోగీలు పట్టాలు తప్పగా, ఐదు బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో 22 మంది మరణించగా, 132 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. -
పట్టాలు తప్పిన ఫరక్కా ఎక్స్‌ప్రెస్
-
పట్టాలు తప్పిన ఫరక్కా ఎక్స్‌ప్రెస్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఫరక్కా ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో 6 బోగీలు పట్టాలు తప్పాయి. ఆరుగురు ప్రయాణికులు చనిపోగా, దాదాపు 35 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఎక్స్‌ప్రెస్ అలహాబాద్‌కు వెడుతుండగా రాయబరేలి, హరచాంద్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఈ ప్రమాదంపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రైల్వేమంత్రి పియూష్ గోయల్ సహాయక చర్యలను చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. వారణాసి, లక్నో నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాదస్థలానికి తరలివెళ్లాయి. రైల్వే బోర్డు ఛైర్మన్ అశ్విన్ లోహానీ సహాయ, రక్షక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అత్యవసర సమాచారం నిమిత్తం హెల్ప్‌లైన్ నంబర్లు అధికారులు ప్రకటించారు. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్లు: దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్-బిఎస్ఎన్ఎల్-05412-254145, రైల్వే -027-73677 పాట్నా స్టేషన్ నం: బిఎస్ఎన్ఎల్-0612-2202290, 0612-2202291, 0612-220229, రైల్వే ఫోన్ నంబర్- 025-8328 ఎక్స్‌గ్రేషియా : ఈ ప్రమాదంలో చనిపోయినవారికి 2లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడినవారికి 50వేల రూపాయల ఎక్స్‌గ్రేషియాను సీఎం ప్రకటించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)