రేణిగుంట (చిత్తూరు జిల్లా) : కృష్ణపట్నం నుంచి ముద్దనూరుకు బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్సు రైలు చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే బైపాస్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం 1.50 గంటలకు పట్టాలు తప్పింది. 59 బోగీలు కలిగిన గూడ్సు రైలుకు చివరన ఉన్న ఖాళీ బోగీ రేణిగుంట-కడప మెయిన్ లైన్ పట్టాల నుంచి పక్కకు దిగింది. చక్రాలు విడిపోయాయి. గార్డు పెట్టె విడిపోయింది.
సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు చివరి బోగీని విడదీసి మిగిలిన వాటిని మామండూరుకు పంపించారు. ఆ సమయంలో అటుగా వెళ్లాల్సిన పలు రైళ్లు 1.30 గంటలు ఆలస్యంగా నడిచాయి. రెండు ఇంజిన్లు, 58 బోగీలు వెళ్లిన తర్వాత ఖాళీ బోగీ పట్టాలు తప్పడం, అందులోనూ చక్రాలు పూర్తిగా పక్కకు రావడంపై రైల్వే అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పట్టాలు తప్పిన గూడ్సు రైలు
Published Mon, Jun 29 2015 8:14 PM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM
Advertisement