ఉన్నవ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైలు పట్టాలు తప్పింది. ఉన్నవ్ రైల్వే స్టేషన్ సమీపంలో లోకమాన్య తిలక్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. పట్టాలు తప్పడానికి కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డు చైర్మన్‌ను రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆదేశించారు. దీనిపై దర్యాప్తునకు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంఘటనా స్థలానికి బయల్దేరి వెళ్లింది.